హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్స్ సేవల్లో ఉన్న లుపిన్ డయాగ్నోస్టిక్స్ దక్షిణాదిలో అడుగుపెట్టింది. రీజినల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీంతో సంస్థ ఖాతాలో దేశవ్యాప్తంగా ల్యాబ్స్ సంఖ్య 24కు చేరిందని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సీఈవో రవీంద్ర కుమార్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘నవీ ముంబైలో నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ ఉంది. 380కిపైగా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ సెంటర్లు (లుపిమిత్ర) ఉన్నాయి. 400 మందికి పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. లుపిమిత్ర కేంద్రాల ఏర్పాటుకు ఫ్రాంచైజీలను ఆహ్వానిస్తున్నాం. ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 ల్యాబ్స్ నెలకొల్పుతాం. ప్రతి ల్యాబ్ ఏర్పాటైన 18 నెలల్లోనే ఎన్‌ఏబీహెచ్ ధ్రువీకరణ పొందాలన్నదే మా లక్ష్యం’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment