Lupin
-
‘లుపిన్’ రెండు మధుమేహ ఔషధాల కొనుగోలు
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్ ఇంగల్‌హామ్ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్), ‘ఆండెరో మెట్’(లినాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్)ను ట్రేడ్‌మార్క్ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్ ఇంగెల్హామ్తో కోమార్కెటింగ్ ఒప్పందం కలిగి ఉంది. ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు. -
విజయవాడలో లుపిన్ ల్యాబొరేటరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్స్ సేవల్లో ఉన్న లుపిన్ తాజాగా విజయవాడలో కేంద్రాన్ని నెలకొల్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ఏర్పాటైందని, నిపుణులైన సిబ్బంది ఇక్కడ కొలువుదీరారని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్‌కు 27 ల్యాబొరేటరీలు, 410 కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే! -
హార్ట్ పేషంట్ల కోసం ప్రత్యేక యాప్.. ఆవిష్కరించిన ఫార్మా దిగ్గజం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం లుపిన్‌లో భాగమైన లుపిన్ డిజిటల్ హెల్త్ (ఎల్డీహెచ్) తాజాగా హృద్రోగ చికిత్స పొందిన పేషంట్ల కోసం లైఫ్ పేరిట మొబైల్ యాప్ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. చికిత్స పొందిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, డాక్టర్లను మళ్లీ సంప్రదించాల్సిన సందర్భాలు మొదలైన వాటిని పర్యవేక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి, అవసరాన్ని బట్టి ఆరు పరికరాల నుంచి సేకరించే డేటా అంతా .. వాటికి అనుసంధానమైన లైఫ్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తమవుతుంది. కంపెనీ తరఫు నుంచి నియమితులైన హెల్త్ కోచ్‌లు తదితర సిబ్బంది పేషంటుకు కావల్సిన తోడ్పాటు అందిస్తారని బుధవారమిక్కడ విలేకరులకు ఎల్డీహెచ్ సీఈవో సిద్ధార్థ్ శ్రీనివాసన్ తెలిపారు. డాక్టరే స్వయంగా సిఫార్సు చేయాల్సిన ఈ ప్రోగ్రాం సబ్స్క్రిప్షన్ నెలకు రూ. 500 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా ఇది అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం 400 మంది వరకు డాక్టర్లు తమ ప్లాట్‌ఫాంలో చేరారని, వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 75 మంది వరకు ఉన్నారని ఎల్డీహెచ్ బిజినెస్ హెడ్ రాజేష్ ఖన్నా తెలిపారు. ఆగస్టు నాటికి 5,000 మందిని డాక్టర్లకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థలో 350 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని, మరిన్ని కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం -
దక్షిణాదికి లుపిన్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్స్ సేవల్లో ఉన్న లుపిన్ డయాగ్నోస్టిక్స్ దక్షిణాదిలో అడుగుపెట్టింది. రీజినల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీంతో సంస్థ ఖాతాలో దేశవ్యాప్తంగా ల్యాబ్స్ సంఖ్య 24కు చేరిందని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సీఈవో రవీంద్ర కుమార్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నవీ ముంబైలో నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ ఉంది. 380కిపైగా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ సెంటర్లు (లుపిమిత్ర) ఉన్నాయి. 400 మందికి పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. లుపిమిత్ర కేంద్రాల ఏర్పాటుకు ఫ్రాంచైజీలను ఆహ్వానిస్తున్నాం. ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 ల్యాబ్స్ నెలకొల్పుతాం. ప్రతి ల్యాబ్ ఏర్పాటైన 18 నెలల్లోనే ఎన్ఏబీహెచ్ ధ్రువీకరణ పొందాలన్నదే మా లక్ష్యం’ అని ఆయన వివరించారు. -
లుపిన్- దీపక్ నైట్రైట్- క్యూ1 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం లుపిన్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశ పరచడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ దీపక్ నైట్రైట్ కౌంటర్ సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం.. లుపిన్ లిమిటెడ్ ఫార్మా రంగ దిగ్గజం లుపిన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 107 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 60 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 9 శాతం తక్కువగా రూ. 3878 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో లుపిన్ షేరు 6 శాతం కుప్పకూలి రూ. 882 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 874 వరకూ జారింది. దీపక్ నైట్రైట్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో కెమికల్స్ రంగ కంపెనీ దీపక్ నైట్రైట్ రూ. 64 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం క్షీణతకాగా.. నిర్వహణ లాభం సైతం 45 శాతం తక్కువగా రూ. 102 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దీపక్ నైట్రైట్ షేరు 5 శాతం పతనమై రూ. 612 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 581 వరకూ తిరోగమించింది. -
కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్
సాక్షి, ముంబై : ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ కరోనా వైరస్ నివారణకు ప్రయోగాత్మక ఔషధంగా భావిస్తున్నఫావిపిరవిర్ డ్రగ్ లాంచ్ చేసింది. కోవిహాల్ట్ పేరుతో ఈ ఔషదాన్ని బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుధవారం ప్రకటించింది. 200 మి.గ్రా టాబ్లెట్ ధరను 49 రూపాయలుగా నిర్ణయించింది. (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త ) తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగుల్లో చికిత్స కోసం కోవిహాల్ట్ బ్రాండ్ పేరుతో భారతదేశంలో తన ఫావిపిరవిర్‌ను ప్రారంభించినట్లు లుపిన్ వెల్లడించింది. ఇది 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో లభిస్తుందని లుపిన్ ఇండియా రీజియన్ ఫార్ములేషన్స్ (ఐఆర్ఎఫ్) ప్రెసిడెంట్ రాజీవ్ సిబల్ తెలిపారు. తమ బలమైన నెట్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్నిఅందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.(కరోనాకు అతిచవక మందు వచ్చేసింది) అత్యవసర వినియోగానికి ఫావిపిరవిర్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతి పొందింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా దీని తయారీ, విక్రయానికి గ్లెన్ మార్క్, హెటెరో, సిప్లా, సన్ ఫార్మ లాంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకుంది. -
ఫార్మా స్టాక్స్‌లో మరింత అప్‌సైడ్
ఎన్ఎస్ఈ నిఫ్టీకి శుక్రవారం(17)తో ముగిసిన వారంలో 10,800-10,900 స్థాయిలో పలుమార్లు అవరోధాలు ఎదురయ్యాయని శామ్కో గ్రూప్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో వచ్చే వారం 10,950 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. 10,550 స్థాయిలో సపోర్ట్ లభించే వీలున్నదని చెప్పారు. ఈ స్థాయికంటే దిగువకు చేరితే 9,900 పాయింట్లను నిఫ్టీ తిరిగి పరీక్షించవచ్చని అంచనా వేశారు. ఫార్మా రంగంలో రెండు కౌంటర్లకు బయ్ రేటింగ్‌ను ఇవ్వగా.. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌ను విక్రయించవచ్చునంటూ సూచించారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు చూద్దాం.. అటూఇటుగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్లపై ఆశలు, ఆర్ఐఎల్ ఏజీఎం, ఇన్ఫోసిస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాల ఫలితాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. కోవిడ్ సవాళ్లలోనూ ఐటీ దిగ్గజాలు ఉత్తమ పనితీరు ప్రదర్శించాయి. ట్రావెల్, ఎస్జీఏ వ్యయాలు తగ్గడం, ఫారెక్స్ లాభాలు వంటి అంశాలు మార్జిన్లకు బలమిచ్చాయి. అయితే ఇటీవల ఐటీ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా ఈ రంగంలో పెట్టుబడులకు 10-12 శాతం కరెక్షన్ కోసం వేచిచూడటం మేలు. ఇక ఫార్మా స్టాక్స్‌లో స్వల్పకాలిక చలన సగటు ప్రాతిపదికన పుల్‌బ్యాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ రంగంలో సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. ఫార్మా రంగంలో కొన్ని కౌంటర్లు తదుపరి దశ ర్యాలీకి సిద్ధంగా ఉన్న సంకేతాలు లభిస్తున్నాయి. లుపిన్ లిమిటెడ్ ఫార్మా దిగ్గజం లుపిన్ షేరుకి రూ. 850 స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. దీంతో రూ. 980 టార్గెట్ ధరతో రూ. 890 స్థాయిలో కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నాం. అయితే రూ. 850 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో లుపిన్ రూ. 897 వద్ద ముగిసింది. అజంతా ఫార్మా వారపు చార్టుల ప్రకారం హెల్త్‌కేర్ కంపెనీ అజంతా ఫార్మాకు రూ. 1330 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. ఇటీవల ఈ కౌంటర్ జోరందుకుంది. ఇది మరింత బలపడే వీలుంది. రూ. 1600 టార్గెట్ ధరతో రూ. 1440 స్థాయిలో అజంతా ఫార్మా షేరుని కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1370 వద్ద స్టాప్‌లాస్ తప్పనిసరి. వారాంతాన ఎన్ఎస్ఈలో అజంతా ఫార్మా రూ. 1459 వద్ద ముగిసింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ డౌన్‌ట్రెండ్‌లో ఉన్న పిరమల్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ తాజాగా ర్యాలీ బాట పట్టింది. తద్వారా ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరింది. దీంతో రూ. 1420-1460 స్థాయిలవద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. వెరసి రూ. 1050 టార్గెట్ ధరతో రూ. 1360-1368 స్థాయిలలో ఈ షేరుని విక్రయించవచ్చని భావిస్తున్నాం. రూ. 1485 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 1381 వద్ద ముగిసింది. -
ఔషధ దిగ్గజానికి కరోనా సెగ: ప్లాంట్ మూత
సాక్షి, గాంధీనగర్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లుపిన్కు కరోనా మహమ్మారి సెగ తాకింది. గుజరాత్, అంకలేశ్వర్‌లోని సంస్థకు చెందిన తయారీ ప్లాంట్‌లో సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. (కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత) దేశీయ టాప్ అయిదు సంస్థల్లో ఒకటైన లుపిన్ మందుల తయారీ కర్మాగారంలో 18మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో తన ప్లాంట్‌ను మూసివేయాల్సి వచ్చింది. అయితే మిగిలిన ప్లాంట్లలోని ఉద్యోగులు కరోనాకు ప్రభావితం కాలేదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఎండీ మోడియా వెల్లడించారు. ఉద్యోగులకు కరోనా పాజిటివ్ ధృవీకరించిన తరువాత జూలై 12న ప్లాంట్ మూసివేసామని చెప్పారు. శానిటైజేషన్, ఐసోలేషన్ తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం పాటిస్తున్నామని మోడియా తెలిపారు. బాధితులు వైద్య సంరక్షణలో ఉన్నారనీ, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోటోకాల్ పాటిస్తున్నామని లుపిన్ ప్రతినిధి తెలిపారు. అంకలేశ్వర్‌లో 40 ఎకరాలలో 11 తయారీ కర్మాగారాలను లుపిన్ కలిగి ఉంది. కాగా దేశంలో మంగళవారం నాటికి 906,752 కేసులు నమోదయ్యాయి. మరణించినవారి సంఖ్య 23,727కు చేరింది. -
ఫార్మా జోరు, లుపిన్, సిప్లా లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజాలు గురువారం నాటి నష్టాల మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. ఫార్మా రంగ కంపెనీలకు అవకాశాలు పెరగనున్న అంచనాల దీంతో దేశీ ఫార్మా రంగ దిగ్గజాలు లుపిన్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్ కౌంటర్లు తాజాగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోగల ప్లాంటుకి యూఎస్ఎఫ్డీఏ నుంచి లోపాలులేని గుర్తింపు ఈఐఆర్ లభించినట్లు తాజాగా వెల్లడించింది. ఈ యూనిట్లో ఫిబ్రవరి 10-14 మధ్య యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. తద్వారా ఎలాంటి లోపాలూ బయటపడకపోవడంతో ఈఐఆర్ అందుకున్నట్లు లుపిన్ ఎండీ నీలేష్ గుప్తా తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాల ప్రయాణంలో తమకు మరో ముందడుగు అని గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో లుపిన్ షేరు 10.3 శాతం దూసుకెళ్లి రూ. 639 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 666 వరకూ ఎగసింది. ఆస్త్మా, తదితర ఊపిరి తిత్తుల వ్యాధుల చికిత్సలో వినియోగించగల ఔషధం మూడో దశ క్లినికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసినట్లు హెల్త్‌కేర్ దిగ్గజం సిప్లా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఫ్లుటికసోన్ ప్రపోర్షనేట్ జనరిక్‌తోపాటు.. సాల్మెటరోల్ ఇన్హేలేషన్ పౌడర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధం అడవిర్ డిస్కస్ 110/50 ఎంసీజీకు సరిసమానంగా పనిచేస్తుందని కంపెనీ వివరించింది. ఈ ఔషధానికి అమెరికాలో వార్షికంగా దాదాపు 3 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సిప్లా షేరు దాదాపు 8 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 448 వరకూ ఎగసింది. కాగా ఆరంభం నుంచి నష్టాల మధ్య కొనసాగుతున్న కీలక సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.సెన్సెక్స్ ప్రస్తుతం 609 పాయింట్లు క్షీణించి 27663 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 8100 వద్ద కొనసాగుతోంది. -
ఫార్మాలో 1,000 మందికి లుపిన్ శిక్షణ
పనాజీ: ‘లెర్న్ అండ్ ఎర్న్’ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో 1,000 మంది సైన్స్ విద్యార్ధులకు ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు లుపిన్ ప్రకటించింది. ప్లెస్ 12 (ఇంటర్)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు మూడేళ్ల ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ‘2011 నుంచి ఇప్పటివరకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 560 మంది విద్యార్ధులకు శిక్షణనిచ్చాం. 2020 నాటికి మరో 1,000 మంది ప్లెస్ 12 పూర్తిచేసిన వారికి మూడేళ్ల ఫార్మా డిగ్రీ కోర్సును అందించనున్నాం. గోవా, ఇండోర్, సిక్కింలతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్, ఔరంగాబాద్‌లోని ఫెసిలిటీలలో శిక్షణ ఉంటుంది.’ అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) సీ శ్రీనివాసలు అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం కోసం రూ.20 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేసినట్లు ప్రెసిడెంట్ (హెచ్ఆర్) యశ్వంత్ మహాదిక్ వెల్లడించారు. కోర్సు తరువాత రెండేళ్లు లుపిన్‌లో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు. -
లుపిన్ నష్టాలు రూ.783 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం లుపిన్కు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.784 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గావిస్ కంపెనీ కొనుగోలు విషయంలో రూ.1,464 కోట్ల వన్‌టైమ్ ఇంపెయిర్మెంట్ చార్జీ కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని లుపిన్ ఎండీ నీలేశ్ గుప్తా తెలిపారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.381 కోట్ల నికర లాభం వచ్చినట్టు తెలిపారు. మొత్తం ఆదాయం రూ.4,253 కోట్ల నుంచి రూ.4,034 కోట్లకు తగ్గిందని చెప్పారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,557 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 90 శాతం క్షీణించి రూ.251 కోట్లకు తగ్గిందని నీలేశ్ తెలిపారు. మొత్తం ఆదాయం కూడా రూ.17,494 కోట్ల నుంచి రూ.16,804 కోట్లకు చేరిందని వివరించారు. ఇండోర్, గోవా యూనిట్లపై అమెరికా ఎఫ్‌డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలను పరిష్కరించడం... తమ సమీప కాలపు ప్రాధాన్యతలని పేర్కొన్నారు. అమెరికాలో సొలోసెక్ను విజయవంతంగా వాణిజ్యీకరించడం, సరైన ఔషధాలను మార్కెట్లోకి తేవడం కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఇంట్రాడేలో ఏడాది కనిష్టానికి: బీఎస్ఈ ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.724ను తాకింది. చివరకు 0.4 శాతం నష్టంతో రూ.751 వద్ద ముగిసింది. -
లుపిన్ లాభం 65 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం లుపిన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 65 శాతం తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత క్యూ3లో రూ.633 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.222 కోట్లకు తగ్గినట్లు లుపిన్ తెలిపింది. ఆదాయం రూ.4,405 కోట్ల నుంచి 11 శాతం క్షీణించి రూ.3,900 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బీఎస్ఈ ఇంట్రాడేలో లుపిన్ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.790కి పడిపోయింది. చివరకు 6 శాతం నష్టంతో రూ.802 వద్ద ముగిసింది. కెల్టన్ టెక్ లాభంలో 23 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎంటర్ప్రైజ్ సొల్యుషన్స్ కంపెనీ కెల్టన్ టెక్ డిసెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే 23.6 శాతం పెరిగి రూ.17 కోట్లుగా నమోదయింది. టర్నోవరు 33 శాతం అధికమై రూ.210 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో షేరు ధర 5 శాతం వరకూ పెరిగి రూ.114 వద్ద క్లోజయింది. 27 శాతం తగ్గిన హెరిటేజ్ లాభం.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే 27.4 శాతం తగ్గి రూ.16.7 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.466 కోట్ల నుంచి రూ.583 కోట్లకు ఎగసింది. ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.2,162 కోట్ల టర్నోవరుపై రూ.43 కోట్ల నికరలాభం నమోదైంది. సోమవారం నాటి ధరతో పోలిస్తే ఇంట్రాడేలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర మంగళవారం ఏకంగా 8 శాతం వరకూ క్షీణించి రూ.670కి పడిపోయింది. చివరకు 3.8 శాతం నష్టంతో 698 దగ్గర క్లోజయింది. కాకపోతే ఈ ఫలితాలు మంగళవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. గల్ఫ్ ఆయిల్ రూ.4 మధ్యంతర డివిడెండ్.. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 59 శాతం అధికమై రూ.42.5 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.312 కోట్ల నుంచి రూ.363 కోట్లను తాకింది. ఈ షేరు ఇంట్రా డేలో 5 శాతం వరకూ నష్టపోయినా... ఫలితాలు బాగుండటంతో రికవరీ అయింది. చివరకు రూపాయి నష్టంతో రూ.895 వద్ద క్లోజయింది. -
లుపిన్కు ఎఫ్‌డీఏ హెచ్చరికలు
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్కు చెందిన గోవా, మధ్యప్రదేశ్‌లోని పితంపూర్ ప్లాంట్లకు అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న గోవా తయారీ కేంద్రం విషయమై అమెరికా మూడు ‘ఫామ్ 483’ అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అలాగే, పితంపూర్ ప్లాంట్‌కు సంబంధించి మే 19న ఆరు అభ్యంతరాలు వ్యక్తం చేయగా వాటికి బదులు ఇచ్చామని లుపిన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గోవా, పితంపూర్ యూనిట్–2లపై ఈ నెల 6న యూఎస్ఎఫ్డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసిందని లుపిన్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారమిచ్చింది. ఎఫ్‌డీఏ లేఖలతో తాము తీవ్రంగా నిరాశ చెందామని పేర్కొంది. అయితే, ఈ యూనిట్ల నుంచి ఉత్పత్తుల సరఫరాకు ఎటువంటి అవాంతరాలు ఉండవని, కాకపోతే కొత్త ఉత్పత్తులకు అనుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉంద ని వివరించింది. ఈ ప్లాంట్లకు సంబం ధించి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ వ్యక్తం చేసిన అభ్యంతరాలను లుపిన్ బయటకు వెల్లడించలేదు. యూఎస్ఎఫ్డీఏ ఆందోళనలకు వేగంగా బదులిస్తామని, సత్వర పరిష్కారానికి వీలుగా సహకారం అందిస్తామని పేర్కొంది. నాణ్యత, నిబంధనల అమలులో కచ్చితంగా వ్యవహరిస్తామని, అన్ని కేంద్రాల్లో ఉత్తమ తయారీ, నాణ్యత ప్రమాణాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని లుపిన్ తన ప్రకటనలో తెలిపింది. పితంపూర్ యూనిట్ ఇండోర్‌కు సమీపంలో ఉంది. 17 శాతం డౌన్: అమెరికా హెచ్చరికలు లుపిన్ షేరును కుదేలు చేశాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత షేరు ఒక్కసారిగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడికి రూ.846.20 వరకు పడిపోయింది. ఆ స్థాయి నుంచి కాస్త కోలుకుని చివరికి 17 శాతం నష్టంతో బీఎస్ఈలో రూ.860.50 వద్ద క్లోజయింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. -
లుపిన్కు మరోసారి యూఎస్ఎఫ్డీఏ షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం లుపిన్ లిమిటెడ్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) జారీ చేసిన హెచ్చరికలో మంగళవారం నాటి మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. లుపిన్ 17 శాతం పైగా క్షీణించి 52 వారాల కనిష్టాన్ని తాకింది. గోవా, పితంపూర్‌లలో గల రెండు ప్లాంట్లకూ సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఈ హెచ్చరికలు జారీ చేయడంతో హెల్త్‌కేర్ దిగ్గజం లుపిన్కు బారీ షాక్ గిలింది. ఇక్కడి ఉత్పాదక సదుపాయాలకు సంబంధించి ప్లాంట్లలో తయారీ లోపాలపై యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మూడు ఫామ్ 483లను జారీ చేసింది. అయితే తాజాగా దిగుమతుల హెచ్చరికలను సైతం జారీ చేసింది. దీంతో అమ్మకాలు క్షీణించే అవకాశముందన్న అంచనాలతో భారీగా అమ్మకాలకు తెర లేచింది. అయితే ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని లుపిన్ ప్రకటించింది. ఉత్పాదక నాణ్యతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని,యూఎస్ఎఫ్డీఏ ఆందోళనలను పరిష్కరించడానికి చర్చలు జరుపుతామని హామీఇచ్చింది. -
స్టాక్స్ వ్యూ
లుపిన్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,061 టార్గెట్ ధర: రూ.1,251 ఎందుకంటే: లుపిన్ కంపెనీ ఇటీవలే సిమిబియోమిక్స్ కంపెనీని కొనుగోలు చేసింది. మహిళలకు సంబంధించి బ్రాండెడ్ హెల్త్ డివిడిజన్ను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే బ్యాక్టీరియల్ వెజినోసిస్ చికిత్సలో ఉపయోగించే సొలోసెక్ (సెనిడాజోల్) ఓరల్ గ్యాన్సూల్స్కు ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం పొందింది. బ్యాక్టీరియల్ వెజినోసిస్(బీవీ)కు సింగిల్ డోస్ ఓరల్ ట్రీట్మెంట్నిచ్చే సొలోసెక్ ఔషధాన్ని వచ్చే ఏడాది జూన్ నుంచి మార్కెట్లోకి తేవాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. కనీసం పదేళ్లపాటు ఈ ఔషధంపై మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. బీవీకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెట్రోనిడాజోల్ క్రీమ్, టినిడాజోల్ల కంటే ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా సొలోసెక్ నిలవనున్నది. సొలోసెక్ మార్కెట్లోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే కనీసం 15–20 శాతం మార్కెట్ వాటా ్జకైవసం చేసుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది. అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, కెనడాల్లో కూడా ఈ ఔషధాన్ని అందించాలని లుపిన్ యోచిస్తోంది. ఇక ఇప్పటికే వివిధ కారణాల వల్ల షేర్ ధర బాగా తగ్గింది. కంపెనీ అమెరికా మార్కెట్‌కు చెందిన ప్రధాన వ్యాపారానికి సంబంధించి ధరల ఒత్తిడి, పోటీ తీవ్రత మరికొంత కాలం కొనసాగవచ్చు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) రెండో అర్థభాగం నుంచి కంపెనీ ఆదాయం మెరుగుపడే అవకాశాలున్నాయి. కీలకమైన కొన్ని ఔషధాలను మార్కెట్లోకి విడుదలచేయనుండడం, స్పెషాల్టీ బిజినెస్ పోర్ట్‌ఫోలియో పునర్వ్యవస్థీకరణ దీనికి ప్రధాన కారణాలు. కొచ్చిన్ షిప్‌యార్డ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.572 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: షిప్ బిల్డింగ్, రిపేర్ల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ ఇది. ఈ రెండు రంగాల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. జాతీయ భద్రత అంశం కావడంతో మన నావికాదళ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్లు దీనికే లభిస్తాయి. నామినేషన్ ప్రాతిపదికన అధికంగా ఆర్డర్లు కూడా ఈ కంపెనీకే లభిస్తాయి. మంచి పనితీరు కొనసాగిస్తున్న అతి కొన్ని పీఎస్‌యూల్లో ఇదొకటి. గత పదేళ్లలో కంపెనీ ఆదాయం 11%, నికర లాభం 19% చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. 2012–17 కాలంలో ఏడాదికి సగటున 16 శాతం రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ని ఈ కంపెనీ సాధించింది. అంతర్జాతీయంగా షిప్ బిల్డింగ్ పరిశ్రమ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనా, భారత రక్షణ రంగంలో నిర్ణయాధికారం మందగమనంగా ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఈ స్థాయి వృద్ధి సాధించడం విశేషం. కంపెనీ చేతిలో రూ.2,856 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. రూ.5,400 కోట్ల ఆర్డర్లకు సంబంధించి ప్రాజెక్టుల్లో ఈ కంపెనీకి ఎల్ 1 స్టేటస్ ఉంంది. మరోవైపు రూ.11,900 కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షిప్ బిల్డింగ్ బిజినెస్ కంటే రెండు రెట్లు లాభాలు వచ్చే షిప్ రిపేర్ విభాగంలో ఆర్డర్లు పెరుగుతున్నాయి. రూ.2,768 కోట్ల పెట్టుబడులతో కొత్తగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో కంపెనీ ఆదాయం 18 శాతం, ఇబిటా 14 శాతం, నికర లాభం 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. పటిష్టమైన బిజినెస్ మోడల్, అర్డర్లు బాగా ఉండడం, భారీ స్థాయిలో మరిన్ని ఆర్డర్లు రానుండడం, నిర్వహణ సామర్థ్యం బాగా ఉండడం, డివిడెండ్ల చెల్లింపు ఆరోగ్యకరంగా ఉండడం....ఇవన్నీ సానుకూలాంశాలు. -
లుపిన్ క్యూ 1 నికర లాభాల్లో క్షీణత
ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం ఫలితాల్లో నిరాశపర్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. రూ. 358 కోట్లు నికరలాభాన్ని సాధించింది. ఆదాయం13.4శాతం క్షీణించి రూ. 3869 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్టు 19.8శాతంగా నిలిచాయి. మరోవైపు లుపిన్ తయారీ లైడెక్స్ ఆయింట్మెంట్ జనరిక్ వెర్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించడంతో ఈ కౌంటర్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్లలో ఫ్లోసినోనైడ్ టాపికల్ ఆయింట్మెంట్ విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించినట్లు లుపిన్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కౌంటీలైన్ ఫార్మా విక్రయించే లైడెక్స్ ఆయింట్మెంట్కు ఇది జనరిక్ వెర్షన్కాగా.. ఈ ఔషధం మార్కెట్ విలువ 4 కోట్ల డాలర్లకుపైగా(రూ.250 కోట్లు) ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
సెన్సెక్స్ డౌన్.. నిఫ్టీ అప్
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ రెండో రోజూ నష్టంలోనే ముగిసింది. 19.33 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 31,056.40 వద్ద క్లోజైంది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 10 పాయింట్లు పైన 9588.05 వద్ద నమోదైంది. గ్లోబల్ గా వస్తున్న సంకేతాలు బలహీనంగా ఉండటంతో నేటి(శుక్రవారం) ట్రేడింగంతా మార్కెట్లు అస్థిరంగానే నడిచాయి. ఫార్మాస్యూటికల్ షేర్లు, టెక్నాలజీకి సంబంధించిన షేర్లు ఎక్కువ ఒత్తిడిలో కొనసాగాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ అనంతరం లుపిన్ 4 శాతం, సన్ ఫార్మా 3 శాతం పడిపోయాయి. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున లాభాల్లో నమోదయ్యాయి. ఐటీ, ఫార్మా రంగాలు మినహా సాధారణంగా మార్కెట్ సెంటిమెంట్ అంతా పాజిటివ్ గానే ఉందని రిలయన్స్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ రాకేష్ థార్వే చెప్పారు. గత కొన్నిసెషన్ల కన్సాలిడేటింగ్ అనంతరం బ్యాంకింగ్ స్టాక్స్ పునరుద్ధరించుకున్నాయి. దీంతో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ 0.38 శాతం పైన ముగిసింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి 64.40గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 27 రూపాయలు పడిపోయి 28,741 వద్ద ఉన్నాయి. -
ఒక్క రోజులోనే లుపిన్ కు రూ.5500 కోట్ల లాస్
దేశంలో మూడో అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్ మార్కెట్ విలువ భారీగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కరోజులోనే దీని మార్కెట్ విలువ సుమారు రూ.5500 కోట్ల మేర తగ్గిపోయింది. ధరల ఒత్తిడి పెరగడంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ మార్కెట్ అయిన అమెరికాలో పోటీవాతావరణం తీవ్రంగా పెరుగడంతో కంపెనీ రెవెన్యూ వృద్ధి స్తబ్దుగా నమోదైంది. దీంతో లుపిన్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఫలితాలను కూడా చాలా బలహీనంగా కంపెనీ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 49 శాతం క్షీణించి రూ.380 కోట్లకు పరిమితమయ్యాయి. దీంతో గురువారం ట్రేడింగ్ లో ఈ కంపెనీ షేర్లు 10 శాతం మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ విలువ కూడా భారీగా క్షీణించింది. ఉత్తర అమెరికా అమ్మకాలు లుపిన్ కు నాలుగో క్వార్టర్ లో 13 శాతం పడిపోయాయి. దీంతో గతేడాది రూ.780 కోట్లగా ఉన్న లాభాలు ఈ ఏడాది రూ.380 కోట్లగా నమోదయ్యాయి. అమెరికా వ్యాపారాలు అంచనావేసిన దానికంటే తక్కువగా ఉండటంతో, ఒక్కోషేరుపై ఆర్జించే ఆదాయాలపై కూడా బ్రోకరేజ్ సంస్థలు కోత పెడుతున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి లుపిన్ షేర్లు 7.18 శాతం దిగువకు 1,140.20గా ఉన్నాయి. -
లుపిన్కు యూఎస్ఎఫ్డీఏ క్లియరెన్స్
ముంబై: దేశీయ ఫార్మా దిగ్గంజ లుపిన్ లిమిటెడ్ సోమవారం నాటి మార్కెట్లో భారీగా లాభపడుతోంది. గోవా ప్లాంటు తనిఖీల్లో సంస్థకు అమెరికా యూఎస్ఎఫ్డీఏ నుంచి క్లీన్ చిట్ లభించడంతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. గతజులై 7 తరువాత భారీగా లాభపడి గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది ఫార్మా కౌంటర్ 6 శాతం బలహీనపడగా లుపిన్ మాత్రం 23 శాతం ఎగిసింది. మరోవైపు ఈఐఆర్ నుంచి తమకు ఆమోదం లభించిందన్న సంస్థ ప్రకనటతో గత శుక్రవారం11 శాతం క్షీణించిన లుపిన్ కు నేడు సెంటిమెంట్ బలంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో గోవా యూనిట్ కు (ఈఐఆర్) యూఎస్ఎఫ్డీఏ క్లియరెన్స్ ల భించడంతో కౌంటర్‌కు భారీ డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా లాభాలతో మార్కెట్లో టాప్ విన్నర్ గా ట్రేడవుతోంది. కాగా లుపిన్.. గుండెజబ్బులు, డయాబెటిస్, ఆస్త్మా వంటి పలువ్యాధుల చికిత్సలో జనరిక్ ఫార్ములేషన్లు, బయోటెక్నాలజీ ఔషధాలను తయారీలో పేరుగడించిన సంగతి తెలిసిందే. -
హిల్లరీకి క్లీన్చిట్: భారీలాభాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు క్రిమినల్ నేరారోపణల నుంచి భారీ ఊరట కల్పిస్తూ.. ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇన్నిరోజులు నష్టాల్లో నడిచిన దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక్కసారిగా భారీ లాభాల్లో ఎగిశాయి. 280 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 239 పాయింట్ల లాభంతో 27,513వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 77 పాయింట్ల లాభంతో 8510గా ట్రేడ్ అవుతోంది. హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్ వాడకంపై పునఃవిచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ, అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి దశలో ఆమెకు భారీ ఊరటనిచ్చింది. నేరారోపణల నుంచి హిల్లరీని బయటపడేసింది. దీంతో ట్రంప్ గెలుస్తాడనే ఊహాగానాలకు చెక్ పడింది. ట్రంప్ గెలుపు అవకాశాలతో ఆటుపోట్లకు గురైన స్టాక్ మార్కెట్లు ఎఫ్‌బీఐ ప్రకటనతో మళ్లీ హిల్లరీ గెలిచే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి. దీంతో అటు అమెరికన్ స్టాక్ మార్కెట్లు, ఇటు ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ ప్రకటనతో మెక్సికన్ పెసో భారీగా లాభపడింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత విధానాలు ఆ దేశానికి ప్రతికూలంగా మారాయి. ఎఫ్‌బీఐ క్లీన్ చీట్‌తో హిల్లరీ గెలుపుకు మళ్లీ అంచనాలు బలపడి, మెక్సికన్ పెసో 1-1/2 వారాల గరిష్టానికి జంప్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లో లుపిన్ 7 శాతం పెరిగింది, అదేవిధంగా సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ లాభాల్లో నడుస్తున్నాయి. బలమైన క్యూ2 ఫలితాలతో పీఎన్బీ షేర్ 5 శాతం ఎగిసింది. అయితే దేశీయ కరెన్సీ రూపాయి, డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే 4 పైసలు బలహీనపడింది. శుక్రవారం 66.70గా ముగిసిన రూపాయి, నేటి ట్రేడింగ్‌లో 66.74గా ప్రారంభమైంది. అమెరికా ఎకనామిక్ డేటా, డాలర్ ఇండెక్స్ రూపాయి బలపడటానికి సహకరించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
లుపిన్ మరో ముందడుగు
న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ లూపిన్ మరో ముందడుగు వేసింది. జనరిక్ వెర్షన్ కు చెందిన యాంటి డి ప్రెసెంట్ డ్రగ్ పారోక్సిటైన్ అదనపు విడుదలకు అమెరికాలో తాత్కాలిక అనుమతి లభించిందని తెలిపింది. ఈ మేరకు అమెరికా హెల్త్ రెగ్యులేటరీనుంచి తమకు అనుమతి లభించిందని శుక్రవారం తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం వివిధ పరిమాణాల్లో ఈ మందు అమ్మకాలకు అనుమతి పొందినట్టు వెల్లడించింది. 12.5ఎంజీ, 25 ఎంజీ, 37.5 ఎంజీల అపోటెక్స్ టెక్నాలజీస్ కి చెందిన పాక్సిల్ సీఆర్ మాత్రల జెనెరిక్ వెర్షన్ కు తాత్కాలిక అనుమతి లభించిందనీ లూపిన్ బీఎస్ఇ పైలింగ్ లో తెలిపింది. డిప్రెసివ్ డిజార్డర్, తీవ్ర భయాందోళన రుగ్మత ,సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, ప్రీ మెనస్ట్రుయల్ తదితర సమస్యల్లో చికిత్సకు ఈ మందు ఉపయోగపడుతుందని పేర్కొంది. దీంతో మార్కెట్లో లుపిన్ కౌంటర్ లాభాల్లో నడుస్తోంది. -
బ్యాంకుల దెబ్బ.. నష్టాల్లో మార్కెట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఫార్మా రంగం నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండవ సెషన్ లో నష్టాలను చవి జూసిన సెన్సెక్స్ 91 పాయింట్ల నష్టంతో 27,985 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 8,629 వద్ద ముగిసాయి. ఆర్బీఐ కు కాబోయే గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ నియామకం ప్రకటనతో జోష్ మీద ఉంటాయని అంచనాలు జోరుగా సాగాయి. కానీ ప్రారంభంలో ఫ్లాట్ గా ట్రేడ్ అయిన దేశీ సూచీలు క్రమేపీ నష్టాల బాట పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనతలు, ఆగస్ట్ డెరివేటివ్స్ ముగింపు లాంటి కీలక అంశాల కారణంగా సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కొద్దిగా కోలుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగాయి. అలాగే ఐటీ, ఫార్మాసెక్టార్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్ ను ప్రభావితం చేపింది. టీసీఎస్, లుపిన్ సన్ ఫర్మా, యాక్సిక్ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. ఐటీసీ, హెచ్ యూఎల్, బీహెచ్ఈఎల్ లాభపడ్డాయి. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనత కొనసాగుతోంది.ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో డాలర్ తోపోలిస్తే రూపాయి 14 పైసల నష్టంతో 67.19 వద్ద ఉంది. బులియన్ మార్కెట్లో వెండి మెరుపులు మెరిపిస్తుండగా, బంగారం నష్టాల్లో ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10గ్రా. పుత్తడి 124రూ నష్టంతో 31, 128 దగ్గర ఉంది. -
లుపిన్ లాభం రూ.882 కోట్లు..
♦ అమ్మకాల జోరుతో 55 శాతం పెరిగిన నికర లాభం ♦ ఇవి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలంటున్న కంపెనీ న్యూఢిల్లీ : ఫార్మా దిగ్గజం లుపిన్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 55 శాతం వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.569 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.882 కోట్లకు పెరిగిందని లుపిన్ తెలిపింది. భారత్, జపాన్ అమెరికా మార్కెట్లలో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని లుపిన్ ఎండీ నీలేశ్ గుప్తా చెప్పారు. తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యుత్తమ త్రైమాసిక పనితీరు అని పేర్కొన్నారు. నికర అమ్మకాలు రూ.3,081 కోట్ల నుంచి 40 శాతం వృద్ధితో రూ.4,314 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. వ్యయాలు రూ.2,433 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.3,334 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఇతర నిర్వహణ ఆదాయం 67 శాతం పెరిగి రూ.126 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. వృద్ధి జోరును కొనసాగించడానికి తగిన కృషి చేశామన్నారు. నాట్కో ఫార్మా లాభం 70% అప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్ సి, క్యాన్సర్ చికిత్సలో వాడే ఔషధాల అమ్మకాలు పెరగటంతో నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సుమారు రూ.48 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 28 కోట్లతో పోలిస్తే దాదాపు 70 శాతం అధికం. ఆదాయం 45 శాతం వృద్ధితో రూ. 224 కోట్ల నుంచి రూ. 325 కోట్లకు పెరిగింది. 2016-17లో రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 0.75 మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు 1.65 శాతం క్షీణతతో రూ. 625.80 వద్ద ముగిసింది. -
లుపిన్ లాభాలు జంప్
ముంబై: ముంబైకి చెందిన ఫార్మా దిగ్గజం లుపిన్ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ1 ఫలితాల్లో నికర లాభాల్లో దూసుకుపోయి విశ్లేషకుల అంచనాలను ఓడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేసింది. లుపిన్ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 882 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 41 శాతం పెరిగి రూ. 4,439 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 57 శాతం దూసుకెళ్లి రూ. 1308 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 26.13 శాతం నుంచి 29.46 శాతానికి ఎగశాయి. ఇతర నిర్వహణ లాభం సైతం 67 శాతం పెరిగి రూ. 126 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నప్పటికీ, మార్కెట్ లో లుపిన్ షేరు దాదాపు 2 శాతం క్షీణించింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం లుపిన్ నష్టాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
లుపిన్ చేతికి బ్రాండెడ్ డ్రగ్స్
ముంబై : దేశీయ అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్, 21 బ్రాండెడ్ డ్రగ్స్ పోర్ట్ ఫోలియోను జపాన్స్ షియోనోగి అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్‌గా ఉన్న జపాన్‌లో తన ఉనికిని విస్తరించడానికి 150మిలియన్ డాలర్లకు(రూ.10,010కోట్లకు) ఈ డ్రగ్స్‌ను లుపిన్ కొనుగోలు చేయనుంది. నియంత్రణ ఆమోదాలు, ముగింపు షరతులకు లోబడి డిసెంబర్ 3న ఈ డ్రగ్స్ పోర్ట్ ఫోలియో లుపిన్కు ట్రాన్స్ ఫర్ కానుందని కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ కొనుగోలు ప్రక్రియను జపనీస్ లుపిన్ డ్రగ్ యూనిట్ క్యోవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రి కంపెనీ లిమిటెడ్ పూర్తిచేయనుంది. లుపిన్ కొనుగోలు చేసిన ఈ 21 ప్రొడక్ట్‌లు, షియోనోగికి మార్చితో ముగిసేనాటికి 90 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. కేంద్ర నాడీ వ్యవస్థ, ఆంకాలజీ, హృదయ, యాంటీ ఇన్ఫెక్టివ్స్ చికిత్సలకు ఈ ఔషధాలు ఉపయోగపడుతున్నాయి.