సెన్సెక్స్ డౌన్.. నిఫ్టీ అప్
Published Fri, Jun 16 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ రెండో రోజూ నష్టంలోనే ముగిసింది. 19.33 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 31,056.40 వద్ద క్లోజైంది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 10 పాయింట్లు పైన 9588.05 వద్ద నమోదైంది. గ్లోబల్ గా వస్తున్న సంకేతాలు బలహీనంగా ఉండటంతో నేటి(శుక్రవారం) ట్రేడింగంతా మార్కెట్లు అస్థిరంగానే నడిచాయి. ఫార్మాస్యూటికల్ షేర్లు, టెక్నాలజీకి సంబంధించిన షేర్లు ఎక్కువ ఒత్తిడిలో కొనసాగాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ అనంతరం లుపిన్ 4 శాతం, సన్ ఫార్మా 3 శాతం పడిపోయాయి.
అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున లాభాల్లో నమోదయ్యాయి. ఐటీ, ఫార్మా రంగాలు మినహా సాధారణంగా మార్కెట్ సెంటిమెంట్ అంతా పాజిటివ్ గానే ఉందని రిలయన్స్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ రాకేష్ థార్వే చెప్పారు. గత కొన్నిసెషన్ల కన్సాలిడేటింగ్ అనంతరం బ్యాంకింగ్ స్టాక్స్ పునరుద్ధరించుకున్నాయి. దీంతో నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ 0.38 శాతం పైన ముగిసింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి 64.40గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 27 రూపాయలు పడిపోయి 28,741 వద్ద ఉన్నాయి.
Advertisement
Advertisement