న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్ ఇంగల్‌హామ్ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్), ‘ఆండెరో మెట్’(లినాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్)ను ట్రేడ్‌మార్క్ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్ ఇంగెల్‌హామ్‌తో కోమార్కెటింగ్ ఒప్పందం కలిగి ఉంది.
ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment