purchase
-
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్‌కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
బ్లాక్‌స్టోన్ చేతికి హల్దీరామ్స్!
న్యూఢిల్లీ: స్నాక్స్ తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్‌స్టోన్ కొద్ది నెలలుగా హల్దీరామ్స్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ విలువ విషయంలో అంగీకారం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కాగా.. స్నాక్స్ విభాగంలో దేశీయంగా ప్రధాన కంపెనీగా నిలుస్తున్న హల్దీరామ్స్‌లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునేందుకు బ్లాక్‌స్టోన్ ఇంక్ ప్రస్తుతం చర్చల్లో ఇటీవల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం రూ. 70,000 కోట్ల విలువలో హల్దీరామ్స్ కొనుగోలుకి డీల్ కుదిరే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 76%పై కన్ను హల్దీరామ్స్‌లో 76 శాతం వాటా కొనుగోలుపై బ్లాక్‌స్టోన్ కన్సార్షియం కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం భారీ వాటా విక్రయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ విలువ నిర్ధారణలోనూ అంగీకారం కుదరనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లలో కొంతమంది 51 శాతం వాటా విక్రయానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఒప్పందం కుదిరితే దేశీయంగా అతిపెద్ద పీఈ డీల్‌గా చరిత్ర సృష్టించే వీలున్నట్లు పేర్కొన్నాయి. చర్చలు ఏక్షణమైనా విఫలమైతే ఇతర ప్రత్యామ్నాయాలను సైతం అగర్వాల్ కుటుంబం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇష్యూకి సైతం తెరతీసే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. అగర్వాల్ కుటుంబం ఢిల్లీ, నాగ్‌పూర్ బ్రాంచీల ఎఫ్ఎంసీజీ బిజినెస్‌ను విలీనం చేసే ప్రణాళికల్లో ఉంది. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ విలీనం ద్వారా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్‌గా ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్‌పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి. -
‘విద్యుత్’ విచారణలో దాపరికం లేదు: తెలంగాణ సర్కార్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం సైతం ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. ప్రభాకర్‌రావును సైతం విచారించింది. కేసీఆర్‌కు కమిషన్ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్ 30 వరకు కమిషన్ గడువు ముగుస్తున్నందున జూన్ 15న రావాలని కోరాం.వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్ఎస్ కూడా సభలో పలు విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి.. కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. -
ఐటీసీ ఇన్ఫోటెక్ చేతికి బ్లేజ్‌క్లాన్
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా క్లౌడ్ సేవల్లో ఉన్న బ్లేజ్‌క్లాన్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.485 కోట్లు. గురువారం ఈ మేరకు ఇరు సంస్థలు వాటా కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయి. 6–8 వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని ఐటీసీ లిమిటెడ్ వెల్లడించింది. మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ విభాగాల్లో తమ క్లయింట్లకు సేవలకై సంస్థ సామర్థ్యం పెంపొందించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని తెలిపింది. -
వికాస్ లైఫ్‌కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్‌జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్‌తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్‌లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
పోటెత్తిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్‌తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. -
త్వరలోనే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం
న్యూఢిల్లీ: ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా రక్షణ శాఖ ఆమోదించిన నేపథ్యంలో త్వరలోనే అమెరికా, భారత ఉన్నతాధికారులు తుది దశ చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో గగనతలంలో నిరంతర నిఘా, మెరుపు దాడుల కోసం ఈ డ్రోన్లను భారత్ వినియోగించనుంది. ఈ భారీ డ్రోన్ సరిహద్దులతోపాటు శత్రు దేశాల సైనిక వాహనాలపై నిఘాతోపాటు వాటిని వెంటాడి క్షిపణులతో దాడిచేయగలదు. ఏకబిగిన 35 గంటలపాటు గాల్లోనే ఉండగలదు. 450 కేజీల బరువైన బాంబులు అమర్చిన క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇంతటి అత్యాధునికమైన డ్రోన్లను త్రివిధ దళాల్లో దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత్ తలపోస్తోంది. అందులోభాగంగానే ఈ డీల్ కుదుర్చుకుంటోంది. అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థ జనరల్ ఆటమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేస్తోంది. 31 డ్రోన్లకు మొత్తంగా రూ.25,000 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో డ్రోన్‌ను ఎంతకు కొనాలనే ధర, ఇతరత్రా విషయాలు ఇంకా ఖరారుకాలేదు. తుది చర్చల్లో వీటిపై నిర్ణయాలు తీసుకునే వీలుంది. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన తొలి అనుమతిని లోని రక్షణరంగ కొనుగోళ్ల మండలి ఆమోదించిన విషయం విదితమే. -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్‌ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్‌లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్‌లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్‌లోనే విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్‌ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్‌స్టార్‌కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
‘లుపిన్’ రెండు మధుమేహ ఔషధాల కొనుగోలు
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్ ఇంగల్‌హామ్ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్), ‘ఆండెరో మెట్’(లినాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్)ను ట్రేడ్‌మార్క్ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్ ఇంగెల్హామ్తో కోమార్కెటింగ్ ఒప్పందం కలిగి ఉంది. ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు. -
రూ.కోటి పోర్షే లగ్జరీ కారు కొన్నాడు.. చిల్లర చూసి సిబ్బందికి ఫీజులు ఎగిరిపోయాయ్
Porsche 718 Boxster : ఇది సోషల్ మీడియా యుగం. ఏది చేసినా వినూత్నంగా చేయాలి. ఆ పని నలుగురిని ఆకట్టుకునేలా ఉండాలి. అలా అని అందరూ చేసే పని చేయకూడదు. ఇదిగో ఇలా ఆలోచించే వారి ధోరణి ఎక్కువైపోయింది. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్‌ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం కోటి రూపాయి కాయినట్లను చెల్లించడం ఆసక్తికరంగా మారింది. క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే యూట్యూబర్ రూ.1 నాణేలను చెల్లించి రూ.1 కోటి విలువైన పోర్షే 718 బాక్స్స్టర్ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆయూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? తన ఇంటి వద్దే కాయిన్స్‌ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్తాడు. అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను. ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం షోరూం బయట ఉన్న తన కార్లో ఉన్న కాయిన్స్ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందిస్తాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్‌ను రాశులుగా పోసి లెక్కిస్తారు. కొన్ని గంటల పాటు లెక్కించిన అంనతరం.. పోర్షే కారును ఆ యూట్యూబర్‌కు అందిస్తారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యూట్యూబర్ కొనుగోలు చేసిన పోర్షే 718 బాక్స్‌స్టర్ కూపే జర్మన్ ఆటోమేకర్. మనదేశంలో విక్రయించే లగ్జరీ కార్లలో ఇదొకటి. బాక్స్స్టర్తో పాటు, 718 బ్యాడ్జ్ 718 కేమాన్, 718 కేమాన్ ఎడిషన్, 718 బాక్స్‌స్టర్ స్టైల్ ఎడిషన్, 718 కేమాన్ ఎస్, 718 బాక్స్‌స్టర్ ఎస్, 718 కేమాన్ జీటీఎస్ 4.0,718 బాక్స్‌స్టర్ జీటీఎస్ 4.0 వంటి వేరియంట్లలో లభిస్తుంది. పోర్షే 718 బాక్స్‌స్టర్ కన్వర్టిబుల్ రూఫ్‌టాప్‌తో వస్తుంది. 4-సిలిండర్ 2.0-లీటర్ ఇంజన్‌ను డిజైన్ చేయబడింది. పూర్తి సామర్థ్యంతో, ఇంజిన్ 220 కేడబ్ల్యూ శక్తిని 380 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు వేగం 5.1 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ నుండి వేగంగా వెళ్లగలదు. -
వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!
ఇంగ్లండ్‌కు చెందిన క్రిష్, మిషెల్ అనే దంపతులు పాతబడిన అంబులెన్స్‌ను కొనుక్కుని, దాన్ని చక్కని ఇల్లులా మార్చేశారు. ఇప్పుడు వారు ఈ అంబులెన్స్ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి, ఈ దంపతులు అంబులెన్స్‌ను ఇల్లులా తీర్చిదిద్దుకున్నారు. సామాన్యమైన ఇంటికి కావలసిన వసతులన్నింటినీ ఇందులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంబులెన్స్ 2003 నాటి ‘తాన్యా’ ఈ–450 వాహనం. ఇందులో మంచం, స్టవ్, కిచెన్ కేబినెట్ సహా అవసరమైన సామగ్రిని పొందికగా అమర్చుకున్నారు. స్నానానికి వీలుగా ఫోల్డబుల్ వాటర్ టబ్‌ను కూడా తయారు చేసుకున్నారు. పని పూర్తయ్యాక ఈ టబ్‌ను మడతపెట్టి, దాచేసుకోవచ్చు. వీరు ఈ అంబులెన్స్‌ను అగ్నిమాపక శాఖ నుంచి 4500 పౌండ్లకు (రూ.4.72 లక్షలు) కొనుగోలు చేశారు. కోరుకున్న వసతులతో దీనిని ఇల్లులా మార్చుకోవడానికి మరో 8000 పౌండ్లు (రూ.8.40 లక్షలు) ఖర్చు చేశారు. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురుకి లండన్‌లో ఉద్యోగం) -
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్‌ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్‌కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్‌ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్‌ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్‌ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్‌ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్‌కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్‌ల్యాండ్‌ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్‌లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్‌ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్‌సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
APSRTC: కొత్తగా 1500 బస్సులు కొనుగోలుకు ప్లాన్!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసమరైన అన్ని చర్య లు తీసుకోవాలని ఆ సంస్థ పాలకమండలి నిర్ణయించింది. క్యాడర్ స్ట్రెంత్ సర్దుబాటుతో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన విధానాన్ని రూపొందించాలని తీర్మానించింది. కాగా, విజయవాడ ఆర్టీసీ భవన్లో గురువారం పాలకమండలి సమావేశం జరిగింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు 100 ఈ–బస్సు లను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆమో దించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ మల్లి కార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరు మలరావు, డైరెక్టర్ రాజ్‌రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బలహీనపడిన అల్పపీడనం.. ఇక గట్టి వానలు తగ్గినట్టే! -
స్విగ్గీ చేతికి లింక్స్ లాజిస్టిక్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రిటైల్ పంపిణీ సంస్థ లింక్స్ లాజిస్టిక్స్ లిమిటెడ్(లింక్)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది. షేర్ల మారి్పడి ద్వారా రామ్‌కో సిమెంట్స్, రామ్‌కో ఇండస్ట్రీస్ నుంచి లింక్‌ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి టెక్నాలజీ ఆధారిత పంపిణీ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీ ఫుడ్, గ్రోసరీ రిటైల్ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు వివరించింది. మరోవైపు లింక్స్ లాజిస్టిక్స్‌లో తమకున్న 49.95 శాతం వాటాను బండెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్(స్విగ్గీ మాతృ సంస్థ)కు విక్రయించనున్నట్లు రామ్‌కో సిమెంట్స్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా బండెల్ టెక్కు చెందిన కచ్చితంగా మారి్పడి చేసుకోవలసిన 24,18,915 ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను పొందనున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా రామ్‌కో ఇండస్ట్రీస్ సైతం లింక్స్లోగల 46.15 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసేందుకు బండెల్ టెక్‌తో షేర్ల సబ్‌్రస్కిప్షన్, కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనికి బదులుగా బండెల్కు చెందిన 22,35,223 సీసీపీఎస్‌లను పొందనున్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా కొనుగోలు తదుపరి లింక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో శేఖర్ భెండే అధ్యక్షతన స్వతంత్ర బిజినెస్ యూనిట్‌గానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్.. ఎక్కడో తెలుసా!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్ డోంగువాన్ నగరంలో ఉన్న ఈ మాల్ పేరు ‘న్యూ సౌత్ చైనా మాల్’. దీనిని 2005లో ప్రారంభించారు. మొత్తం 96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీనిలోని దుకాణాల విస్తీర్ణమే 71 లక్షల చదరపు అడుగులు. తొలి పదేళ్లు ఈ మాల్ దాదాపు 99 శాతం ఖాళీగానే ఉండేది. నిర్మాణంలో మార్పులు చేపట్టాక 2018 నుంచి దీని పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇందులో ఐమాక్స్ థియేటర్లు, విశాలమైన పిల్లల ఆటస్థలం చూడటానికే ఎక్కువమంది వస్తుంటారు. ఈ మాల్లోని ఏడు జోన్లను ప్రపంచంలోని ఏడు అంతర్జాతీయ ప్రాంతాల శైలిలో నిర్మించడం విశేషం. చదవండి: ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే! -
మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు
ఇంఫాల్/న్యూఢిల్లీ: గిరిజన, గిరిజనేతరుల నడుమ భీకర ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. మణిపూర్‌లో పరిణామాలపై దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. íగిరిజనేతరులైన మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ మణిపూర్ హైకోర్టుజారీ చేసిన ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ సమర్పించారు. హింసాకాండపై సమగ్ర దర్యాప్తును కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. -
విప్రో కన్జూమర్ చేతికి బ్రాహ్మిన్స్
న్యూఢిల్లీ: రెడీ టు కుక్ బ్రాండ్, కేరళ సంస్థ బ్రాహ్మిన్స్ను కొనుగోలు చేసినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ తాజాగా పేర్కొంది. సంప్రదాయ వెజిటేరియన్, స్పైస్ మిక్స్ సంస్థ బ్రాహ్మిన్స్ కొనుగోలు విలువను వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం రెడీ టు కుక్ ఫుడ్ తయారీ బ్రాండు నిరపరను సొంతం చేసుకోవడం ద్వారా అజీం ప్రేమ్‌జీ కంపెనీ విప్రో ఎంటర్ప్రైజెస్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజా కొనుగోలుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో మరింత విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు విప్రో కన్జూమర్ పేర్కొంది. వెరసి దక్షిణాది మార్కెట్ లక్ష్యంగా సొంత స్నాక్స్ బ్రాండును ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. వేగవంత వృద్ధిలో ఉన్న రెడీ టు ఈట్ విభాగంలో సొంత బ్రాండును విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. -
మొండి రుణాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్‌గా పిలిచే ఎన్ఏఆర్సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు ఎన్ఏఆర్సీఎల్కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. జాబితా పెద్దదే.. ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్ఏఆర్సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇలా.. 2022–23లో జేపీ ఇన్ఫ్రాటెక్, ఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్ఏఆర్సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్ఏఆర్సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి. జీటీఎల్‌కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్‌నకు ఎన్ఏఆర్సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్‌తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది.