
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తుల కొనుగోలును సక్రమంగా సకాలంలో జరిగేలా చూడాలని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. జిల్లా రైతు సమితి సమన్వయకర్తలతో గురు వారం ఆయన తొలిసారిగా సమావేశ మ య్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లా డుతూ.. త్వరలో జిల్లా, మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఏడు విడతలలో రెండ్రోజుల చొప్పున శిక్షణ కార్య క్రమం ఉంటుందన్నారు. రైతు వేదికల నిర్మాణానికి భూములను గుర్తించాలన్నారు. మరోవైపు కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది.