Gutta Sukendar Reddy
-
తెలంగాణలో ఉత్తమ శాసనసభ వక్త అవార్డు: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు. -
నేను బీఆర్ఎస్ చైర్మన్‌ను కాదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్పై గుత్తా ఫైర్..ఉద్యోగ నియామకాల మీద బీఆర్ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారుఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదిమూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలిఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలిఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దుమూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంహైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే.. ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్ -
రైతు భరోసా, రుణమాఫిపై సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్.. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. -
ప్రతీ అంశంపై సమగ్ర చర్చ జరగాలి: స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సభ హుందాతనం, ఔన్నత్యం కాపాడుకుంటూ ప్రతీఅంశంపై సమగ్రంగా చర్చ జరగాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్‌విప్ భానుప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పోచారం అన్నారు. సమావేశాలు జరిగే రోజుల్లో అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు ప్రతీశాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు : మండలి చైర్మన్ గుత్తా జిల్లాల్లో ప్రొటోకాల్ అంశంలో ఇబ్బందులు వస్తున్నాయని, వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఉభయసభలు సజావుగా నడిచేందుకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గతంలో అసెంబ్లీ సగటున రోజుకు రెండుగంటల చొప్పున జరగ్గా, ప్రస్తుతం ఎనిమిదిగంటలపాటు జరుగుతోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నోడల్అధికారి శాఖల వారీగా సమాచారం కోసం సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్పీకర్, మండలి చైర్మన్ సూచనలు పాటిస్తూ కొత్త ప్రొటోకాల్ బుక్ డ్రాఫ్ట్ తయారు చేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. శాసనసభ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్‌లను పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరి్వంద్‌కుమార్, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అక్బరుద్దీన్‌తో మంత్రి వేముల భేటీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇద్దరి మధ్య సమావేశం కొనసాగింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
రాజగోపాల్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
-
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
-
మండలి చైర్మన్‌గా మళ్లీ గుత్తా?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో వివిధ కోటాల్లో ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సభలో సంఖ్యాపరంగా టీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 40 మంది సభ్యులున్న మండలిలో పార్టీ మద్దతుదారులైన ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలుపుకొని టీఆర్ఎస్ బలం 36కు చేరింది. గవర్నర్ కోటాలో ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, స్థానిక సంస్థల కోటాలో 12 మంది కలుపుకొని మొత్తం 19 మంది టీఆర్ఎస్ సభ్యులు ఇటీవలి కాలంలో మండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మండలిలో ఖాళీగా ఉన్న పదవులను పలువురు సభ్యులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు చీఫ్ విప్, మరో మూడు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సభ్యులూ ఉన్నారు. గత జూన్ మొదటి వారంలో మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఏకకాలంలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. విప్‌లుగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఏడాది మార్చిలో రిటైర్ కాగా, మరో ఇద్దరు విప్‌లు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు తాజాగా జరిగిన స్థానిక కోటా ఎన్నికల్లో మరోమారు ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం జనవరి 4న ముగియనుండగా, ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే విప్ హోదాలో కొనసాగుతారు. చైర్మన్ స్థానంలో ఉన్న వెన్నవరం భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వత్రా ఉత్కంఠ: మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు మండలికి ఎన్నిక కాగా, గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి కూడా గవర్నర్ కోటాలో మండలిలో అడుగు పెడుతున్నారు. ఏడాదిన్నర కాలం చైర్మన్‌గా పనిచేసిన గుత్తా మరోమారు చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవమున్న మధుసూదనాచారి మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మధుసూదనాచారికి చైర్మన్ పదవి దక్కితే గుత్తాకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత ఉన్న పదవి దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో మండలిలో అడుగుపెడుతున్న బండా ప్రకాశ్ ముదిరాజ్‌కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణాల లెక్కల్లో కేబినెట్లో బెర్త్ దక్కకపోతే మండలి వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. ఈ పదవుల పంపకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలి కోటాలో కేబినెట్ బెర్త్? ప్రస్తుతం మండలి నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ మంత్రిమండలికి ప్రాతినిథ్యం వహిస్తుండగా, మరికొందరు సీనియర్ నేతలు కూడా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ స్థానంలో బండా ప్రకాశ్‌కు చోటు దక్కుతుందని భావిస్తుండగా, ఆయనతోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న మూడు విప్ పదవులను ఆశిస్తున్న వారిలో ఇప్పటికే విప్‌లుగా ఉన్న భానుప్రసాద్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితోపాటు తక్కల్లపల్లి రవీందర్రావు, సురభి వాణీదేవి, ఫారూఖ్ హుస్సేన్, గంగాధర్‌గౌడ్ ఉన్నారు. ఇదిలాఉంటే మండలి ప్రొటెమ్ ఛైర్మన్ పదవీకాలం జనవరి 4న ముగుస్తుండటంతో కొత్త చైర్మన్ ఎన్నిక కోసం రెండు రోజులు మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు
-
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్.. మండలికి రాజ్యసభ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనదైన శైలిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆశావహుల జాబితాలో లేని వారిని తెరపైకి తెచ్చి అందరినీ విస్మయానికి గురిచేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వరుసగా రెండో పర్యాయం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటా కింద మంత్రివర్గం సిఫారసు చేసిన పాడి కౌశిక్‌రెడ్డి.. అభ్యర్థిత్వం ఆమోదం పొందక పోవడంతో ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను అనూహ్యంగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సుమారు దశాబ్దంన్నర క్రితం పార్టీలో చేరిన ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావును ఎంపిక చేయడం ద్వారా గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. అలాగే సోమవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్యే కోటాలో అవకాశం చేజిక్కించుకుని నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషం వరకు గోప్యత మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందనగా.. ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల జాబితాపై గోప్యత పాటించారు. చివరకు ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎలాంటి జాబితా విడుదల చేయకుండా నేరుగా అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్ల్లపల్లి రవీందర్రావు అభ్యర్థిత్వం సోమవారమే ఖరారు కాగా, మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి సోమవారం అర్ధరాత్రి వరకు పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులందరూ మంగళవారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకోగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం అభ్యర్థులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయకపోవడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురి కానున్నాయి. ఇతర పార్టీలేవీ బరిలో నిలవలేదు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉండటంతో, బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి, మరొకరు వెలమ (తక్కల్లపల్లి) సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం కాగా, బండా ప్రకాశ్ ముదిరాజ్ బీసీ, కడియం శ్రీహరి ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారు. ఆరు స్థానాలకు గాను రెడ్లు, బీసీలకు రెండు చొప్పున, వెలమ, ఎస్సీ కేటగిరీలో ఒకటి చొప్పున అవకాశం దక్కుతుందని తొలుత అంచనా వేశారు. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆశావహులపై ప్రభావం చూపింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి అవకాశం దక్కుతుందని భావించారు. బీసీ కేటగిరీలో మున్నూరు కాపు కులానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్ కూడా సీటు ఆశించారు. కానీ వీరికి అవకాశం లభించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నా ఎంపిక కాలేదు. అయితే మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను స్థానిక సంస్థల (మెదక్) కోటాలో ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కాంగ్రెస్ నిర్ణయం చివరి వరకు ఎదురుచూపులే! -
సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవి పూర్తిగా అవాస్తవమని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవ్వరు నమ్మవద్దని, కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. బండి సంజయ్, రేవంత్ చడ్డీ గ్యాంగ్‌లా తయారయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే దారి దోపిడీలు జరుగుతాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్ని దోచుకు తింటాయని, చమురు ధరల్ని పెంచుతూ బీజేపీ ప్రజల జేబులను కొడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అధికారం రావడం కలగానే మిగిలిపోతుందని అన్నారు. రైతు ఉద్యమాన్ని అణిచివేయడం దారుణమని, ఆదివారం యూపీలో నలుగురు రైతుల మరణం కలచివేసిందని అన్నారు. -
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది
-
రోడ్డు ప్రమాద మృతులకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: బీజేపీ
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నేడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత ఇక ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రి బయట ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్‌రోడ్ సమీపంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది. -
కేటీఆర్ సమర్థుడైతే.. కేసీఆర్ అసమర్థుడా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి మంత్రి కె.తారకరామారావు సమర్థుడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తప్పుబట్టారు. కేటీఆర్ సమర్థుడని అంటే సీఎం కేసీఆర్ అసమర్థుడా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్లో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పదవితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యుడిగా తన పదవీకాలం ముగుస్తుందని, ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు. సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని, నాయకులందరూ హైదరాబాద్‌లో మకాం వేసి రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా.. ‘ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మంత్రి కేటీ రామారావుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పాలనా సామర్థ్యం ఉంది’ అని గుత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (చదవండి: ఎన్నికల కోసమే ప్రమోషన్లు, పీఆర్సీ) Certifying #KTR as an able candidate for CM by MLC Sukender Reddy is like saying #KCR as incapable CM. What’s happening in TRS Government?#WakeUpTelangana @INCIndia @INCTelangana @AICCMedia — Dr. Mallu Ravi (@DrMalluRavi1) January 3, 2021 -
కేసీఆర్‌ను బలహీనపరచాలని చూస్తున్నారు
సాక్షి, నల్గొండ: రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వనికి ,అధికారులుకు సహకరించాలని కోరారు. రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాదని తెలిపారు. ఈ మధ్య కొంతమంది కేసీఆర్‌ను ఇబ్బందులు గురి చేయాలని బలహీనపరచాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ని బలహీనపరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణలో ఎక్కడి గొంగిడి అక్కడే అన్న చందంగా మారిపోతుందని అన్నారు. కొన్ని పార్టీలు విద్వేష పూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని చెడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, అంతిమంగా ప్రజల సంక్షేమం కోసమే అందరూ పాటుపడాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని, ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉండాలని హితవు పలికారు. -
‘కల్నల్ సంతోష్ జీవితం యువతకు ఆదర్శం’
సాక్షి, నల్గొండ: భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారతీయుల రక్షణ కోసం కుమారుడిని సైన్యంలోకి పంపిన సంతోష్ తల్లిదండ్రులకు యావత్ దేశం రుణపడి ఉంటుందన్నారు. కాగా సంతోష్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.(చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి) ఈ క్రమంలో తమ కుమారుడి భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని వారు ఆయనను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సుఖేందర్‌రెడ్డి ఈ విషయం గురించి సంబంధిత అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. భారత భూభాగంలోకి అడుగుపెట్టాలనే దురాలోచనను చైనా విరమించుకోవాలని లేదంటే.. డ్రాగన్ దుర్మార్గానికి భారత సైన్యం తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మంగళవారం భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత ఆర్మీలో సేవలు అందిస్తున్న, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుతో పాటు మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. జవాన్ల సేవలు వృథా కావు: ఏపీ గవర్నర్ సాక్షి, అమరావతి: భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు వీర మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమరులైన తెలంగాణలోని.. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. సంతోష్ మరణవార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృథా కావని నివాళులు అర్పించారు. -
ప్రజాధనం దుర్వినియోగం కావొద్దు: గుత్తా
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత శాసనసభ అం చనాల కమిటీపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ కమిటీ హాల్లో జరిగిన అంచనాల కమిటీ తొలి భేటీకి కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షత వహించారు. మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, వరుసగా రెండోసారి శాసనసభ అంచనా ల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోలిపేటను గుత్తా, హరీశ్, ప్రశాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు అభినందించారు. తర్వాత జరిగిన సమావేశంలో అ సెంబ్లీ వ్యవహారాల్లో ‘పేపర్స్ లెయిడ్ అన్ టేబుల్’ కమిటీ (సభకు సమర్పించే పత్రాల పరిశీలన కమిటీ) పాత్రకు ప్రాధాన్యత ఉందని సుఖేందర్‌రెడ్డి అన్నా రు. మండలి పేపర్స్ లెయిడ్ అన్ టేబుల్ కమిటీ తొలి సమావేశంలో కమిటీ చైర్మన్ సయ్యద్ జాఫ్రీ అధ్యక్షతన జరిగింది. -
గవర్నర్‌కు ఉత్తమ్ కుమార్‌రెడ్డి లేఖ!
సాక్షి, సూర్యాపేట : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని నల్గొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. సూర్యాపేటలోని హుజుర్నగర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. మండలి చైర్మన్‌గా ఉన్న సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాలకీడు నియోజకవర్గం జడ్పీటీసీ మోతిలాల్‌తో పాటు సర్పంచ్ జితేందర్‌రెడ్డిలకు లక్షల రూపాయలు ఆశ చూపి గుత్తా వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్పించారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్న వారిని.. టీఆర్ఎస్ మంత్రులైన మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డిల ఇళ్లలో ఉంచారని, కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన గుత్తా 2015లో టీఆర్ఎస్లో చేరినందుకు భారీ ఎత్తున ప్యాకేజీ తీసుకున్నారని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న గుత్తా, ఆయన కుమారుడు అమిత్‌రెడ్డి కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులలో వేల కోట్ల కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని అన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ఈ విషయంపై కేంద్ర ఇంటెలిజెన్స్ బృందంతో విచారణ చేపట్టాలని గవర్నర్‌ను ఉత్తమ్ కోరారు. -
మండలి చైర్మన్‌గా గుత్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం శాసన మండలి సమావేశం సందర్భంగా నూతన చైర్మన్ గా ఎన్నికైన గుత్తాను శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తల సాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి తదితరులు.. చైర్మన్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. గుత్తాకు మంత్రులతో పాటు అన్ని పారీ్టల శాసన మండలి సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం మండలి సమావేశం ప్రారంభమయ్యాక చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. నూతన చైర్మన్‌గా గుత్తా ఎన్నికైనట్లు ప్రకటించారు. హుందాగా ప్రవర్తిద్దాం: గుత్తా శాసన మండలిలో జరిగే చర్చల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభ్యులు పనిచేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. సంకుచిత విమర్శలు, పరస్పర ఆరోపణల జోలికి పోకుండా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి మీద కీలక చర్చలు జరగాలని.. వర్తమాన పరిస్థితుల్లో్ల ఇది ఎంతో కీలకమన్నారు. తనను అత్యున్నత పదవికి ఎంపిక చేసిన సీఎం కేసీఆర్, మంత్రి వర్గ సభ్యులు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. అభినందనల వెల్లువ.. మండలి చైర్మన్‌గా ఎన్నికైన సుఖేందర్‌రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి మండలి చైర్మన్ దాకా నాలుగు దశాబ్దాల గుత్తా రాజకీయ ప్రస్తానాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రస్తావించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు గుత్తాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, విప్‌లు కర్నె ప్రభాకర్, భానుప్రకాశ్‌రావు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, ఉపాధ్యా య ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, నర్సింరెడ్డి, రఘోత్తంరెడ్డి చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. 14కు మండలి వాయిదా... మండలి చైర్మన్ ఎన్నికపై ప్రకటన, సభ్యుల అభినందన ప్రసంగాలు పూర్తయిన తర్వాత.. సభను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని, ప్రభుత్వ సమాధానం కూడా ఉంటుందన్నారు. 16 నుంచి 21 వరకు మండలి సమావేశాలను వాయిదా వేసి, తిరిగి 22న నిర్వహిస్తామని బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం తరఫున సభ ముందుంచారు. మండలి సైడ్‌లైట్స్... ►గుత్తాను ఉద్దేశిస్తూ.. మీరు ఆజానుబాహులు, మీరు కూర్చోవడం ద్వారా మండలి చైర్మన్ కురీ్చకి హుందాతనం వచి్చందని హరీశ్‌రావు వ్యాఖ్యానించగా.. అవును మీరిద్దరు ఆజానుబాహులు.. పొగుడుకోవాల్సిందే అని కడియం అన్నారు. ►తాను చిట్యాలలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసిన కాలంలో గుత్తాను తొలిసారి చూశానని కర్నె ప్రభాకర్ పేర్కొనగా.. ఏం ఉద్యోగం చేశావో చెప్పు అని ఎమ్మెల్సీ నారదాసు రెట్టించడంతో.. ప్రైవేటు డెయిరీలో ఉద్యోగం చేశానని కర్నె అన్నారు. వార్డు సభ్యుడిగా.. జననం: 1954, ఫిబ్రవరి 02 జన్మస్థలం: నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం ఉరుమడ్ల విద్యార్హత: బీఎస్సీ పొలిటికల్ కెరీర్: ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు (1981). ఠి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (1984). ఠి చిట్యాల సింగిల్ విండో చైర్మన్ (1991). ఠి నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ చైర్మన్ (1992–99). ఠి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఆఫ్ ఇండియా డైరెక్టర్ (1998). ఠి నల్లగొండ లోక్‌సభ సభ్యులు (13, 15, 16 లోక్‌సభలో). ఠి తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్ (2018–19). -
జీవితమంటే ఆట కాదు
రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్‌కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖేల్’. ‘లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్ కుమార్. ఆర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకంపై గొట్టిముక్కల పాండురంగారావు, పులి అమృత్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో హైదరాబాద్ సినిమా హబ్‌గా మారనుంది. షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ‘ఖేల్’ సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు యు. సత్యనారాయణ, కూకట్పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ సాధనాల, సంగీతం: ఆనంద్ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్‌గౌడ్. ∙పి. మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బి. వినోద్ కుమార్, పులి అమృత్ గౌడ్, జి. పాండురంగా రావు -
‘నల్లగొండ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తా’
సాక్షి, నల్లొండ : ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా సోమవారం ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవలో సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు, గొంగిడి సునీత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
‘వైఎస్ రాజశేఖరరెడ్డితో మాట్లాడి ఎంపీగా గెలిపిస్తే..’
సాక్షి, నల్గొండ : నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మతి భ్రమించింది తమకు కాదని కేసీఆర్ ఇచ్చిన షాక్‌కి గుత్తాకే మతిభ్రమించి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని ధ్వజమెత్తారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామని నిప్పులు చెరిగారు. పార్టీని బ్రతికించడానికే పోటీచేస్తున్నామన్నారు. తానే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో మాట్లాడి ఎంపీగా గెలిపిస్తే పార్టీలు మారింది గుత్తా సుఖేందర్ రెడ్డి అని తూర్పారబట్టారు. మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే అని, ఆయనంత అవినీతిపరుడు దేశంలోనే లేడని ఆరోపించారు. -
నల్లగొండలో.. ముగ్గురంటే ... ముగ్గురే !
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే మూడేసి సార్లు ఎంపీలుగా విజయాలు సాధించారు. వర్తమాన రాజకీయాల్లో జిల్లాలో ఆ ఘనత సాధించింది గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. నల్లగొండ నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు జరుగుతుండగా, 1962 నుంచి 2004 వరకు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మిర్యాలగూడ రద్దయ్యింది. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు నల్లగొండ పరిధిలోకి, నల్లగొండ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, పూర్వపు వరంగల్ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లతో కలిసి 2009లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మూడు సార్ల ఘనత .. ముగ్గురిదే నల్లగొండ నియోజకవర్గం నుంచి మొత్తంగా మూడుసార్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన టీడీపీ తరఫున 1999 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కనుకుల జనార్దన్‌రెడ్డిపై 79,735ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచే రెండోసారి (మొత్తంగా మూడో సారి) 2014 ఎన్నికల్లో పోటీ చేసిన గుత్తా టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి పై 1,93,156 ఓట్ల భారీ మెజారిటీతో గెలు పొందారు. ఈ నియోజకవర్గం నుంచి కేవలం సుఖేందర్‌రెడ్డి మాత్రమే మూడు పర్యాయాలు గెలవగా.. రావి నారాయణరె డ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, సురవరం సుధాకర్ రెడ్డి రెండేసి సా ర్లు గెలిచారు. ఈ ముగ్గరూ సీపీఐ నేతల కావడం గమనార్హం. రద్దయిన మిర్యాలగూడనుంచి ... ఇద్దరు మిర్యాలగూడెం పార్లమెంటు నియోజకవర్గం 1962లో ఏర్పడగా, ఆ ఏడాది జరిగిన ఎన్నికల నుంచి మొదలు 2004 ఎన్నికల వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ పన్నెండు ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నడుమనే సాగింది. ఇక్కడి నుంచి ఇద్దరు నాయకులు మూడేసి సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జి.ఎస్.రెడ్డి 1967 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.వి.రావుపై తొలి విజయం నమోదు చేసుకున్నారు. తిరిగి ఆయన 1977, 1980 ఎన్నికల్లో రెండు సార్లూ .. సీపీఎం అభ్యర్థి భీమిరెడ్డి నర్సింహారెడ్డిపైనే గెలిచి మూడు పర్యాయాలు గెలిచిన రికార్డు నెలకొల్పారు. మరోవైపు 1971 ఎన్నికల్లో సీపీఎం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై ఎంపీగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాస రావుపై, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి బద్దం నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. దీంతో భీమిరెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన ఎంపీగా రికార్డు సమం చేశారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బద్దం నర్సింహారెడ్డి, ఎస్.జైపాల్‌రెడ్డి రెండేసి పర్యాయాలు గెలిచారు. -
సీఎం కేసీఆర్ దూరదృష్టి అమోఘం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతానికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం, భారతీయ కిసాన్ సంఘ్, రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి, సేంద్రియ ఉత్పత్తుల మేళా–2019ను గుత్తా ప్రారంభించారు. మూడ్రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనలో 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి ప్రకృతి, సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన సాగనుంది. పంట కాలనీలకు చర్యలు సేంద్రియ వ్యవసాయానికి సర్కారు పెద్దపీట వేసిందని, ఆ దిశగా రైతాంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని గుత్తా చెప్పారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా వరి, ఇతర ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధనకు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇందుకు పంట కాలనీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఏటా బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన సంచాలకుడు ఎల్.వెంకటరామిరెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు, ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధం జరగకూడదనే ఆశిద్దాం
నల్గొండ: దేశంలో చిచ్చుపెట్టే పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ విలేకరులతో మాట్లాడుతూ.. సైన్యానికి మద్ధతుగా యావత్ దేశం నిలవడం అభినందనీయమన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయాలని కోరారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరగకూడదనే ఆశిద్ధామని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్రతకు మారుపేరు భారతదేశమని అన్నారు. ఈర్ష్యాద్వేషాలతో దేశంలో నరమేధాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. -
‘పంట కాలనీ’లో రైతు సమితులు కీలకం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్రంలో పంటకాలనీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న ఈ పంట కాలనీల ఏర్పాటులో ‘రైతు సమన్వయ సమితులను క్రియాశీలకం చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వం అమలు చేసిన ‘రైతుబంధు, ‘రైతుబీమా’పథకాలు విజయవంతం కావడంలో క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులతోపాటు సమన్వయ సమితులు నిర్వహించిన పాత్రను ప్రభు త్వం గుర్తించింది. దీంతో పంటకాలనీల ఏర్పాటులోనూ ‘సమితుల సేవలను విని యోగించుకోవడంతోపాటు వారిని క్రియాశీలకంగా వ్యవ హరించేలా చూడాలని సీఎం భావిస్తున్నారు. సమితుల్లోని సభ్యులకు గౌరవవేతనం ఇవ్వడంతోపాటు విధులకు సంబంధించి నిర్ధిష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు మార్గదర్శకాలకు సంబంధించి కసరత్తు చేయాలని అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను కోరగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి అందజేశారు. దీనిపై త్వరలోనే సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ సర్వే పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించి పంటల వివరాలతోపాటు రైతుల వివరాలను సేకరించడానికి వ్యవసాయశాఖ సర్వే చేపట్టనుంది. గ్రామాలు, మండలాలవారీగా వ్యవసాయ, ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని రైతులవారీగా, సర్వే నంబర్లు, పంటలవారీగా సేకరించి జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి అందించనున్నారు. ఈ వానాకాలం నుంచే పైలట్ ప్రాజెక్టు కింద పంట కాలనీలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించే సమాచారంతో పట్టాదారు నంబర్, రైతు పేరు, తండ్రిపేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, సోషల్ స్టేటస్, మొత్తం ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది.. అనే వివరాలను సర్వే నంబర్‌వారీగా నమోదు చేసుకుంటారు. ఎంత విస్తీర్ణం సాగుకు పనికొస్తుందనే వివరాలు తీసుకోనున్నారు. నీటి సదుపాయం బోర్ ద్వారా ఉందా? కాలువల ద్వారా ఉందో కూడా వివరాలు నమోదు చేస్తారు. వర్షాధార సాగు విస్తీర్ణం, భూసార పరీక్షకార్డులు అందాయా? లేదా? అనే అంశాలు కూడా సేకరించనున్నారు. సాగయ్యే పంటలు, ఏ సర్వే నంబర్లో ఏ పంటలు సాగవుతున్నాయనే వివరాలు నమోదు చేస్తారు.. ఇలా వానాకాలం, యాసంగి పంటలకు వేర్వేరుగా వివ రాలు నమోదు చేయనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మనీటి సేద్యం ఎంత మేరకు ఉన్నదో కూడా సేకరించనున్నారు. ఎంత విస్తీర్ణానికి పంటలబీమా చేయించారనే సమగ్ర సమాచారాన్ని నమోదు చేస్తారు. పంటరుణాలు ఎంత తీసుకున్నారు? పండించిన పంటలో మార్కెట్లో ఎంత అమ్మారు.. వివరాలు నమోదు చేయించడం లో సమితుల సభ్యులు సహాయం చేయనున్నారు. పకడ్బందీగా రైతు సమన్వయ సమితుల నియామకం రైతు సమన్వయ సమితుల్లో సభ్యుల నియామకం మరింత పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో సమన్వయ సమితులను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది వివిధ కారణాలతో తప్పుకోవడం, మరికొందరు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డుసభ్యులుగా ఎన్నికయ్యారు. అందువల్ల రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా రాజకీయాలకు అతీతంగా, రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేసేవారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
బెర్త్‌లు ఎవరికి?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో పదవుల ముచ్చట్లు మొదలయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతలను శాసన మండలిలో ఏర్పడనున్న ఖాళీలు ఊరిస్తున్నాయి. ఎన్నికల ముందు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఆశలు కల్పించారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం చెప్పినట్టే వినడానికి పలువురు నాయకులు రాజీపడ్డారు. ఇప్పుడు శాసన సభ ఎన్నికలు ముగియడం, అనూహ్యమైన ఫలితాలు టీఆర్ఎస్కు రావడం, తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపులో తమవంతు కృషి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి నల్లగొండనుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత కర్నె ప్రభాకర్, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ స్వతంత్ర ఎమ్మెల్సీ అయినా, ఆయన టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నారు. ఇక, స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేసినా, ఇటీవల ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు జిల్లానుంచే రెండు ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన స్థానాలు మరికొన్ని ఉన్నాయి. ఆశగా ఎదురుచూపులు వివిధ సందర్భాల్లో పార్టీ నాయకత్వం పలువురు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఆ సమయం ఇప్పుడు రావడంతో హామీలు పొందిన నేతలంతా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నిక కావాల్సిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటర్లుగా మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, కేవలం ఆరు నెలల గడువే మిగిలి ఉండడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతుందా..? లేక, స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు వచ్చాక జరుగుతుందా..? అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చితో ముగియనుండగా, మరోమారు పూల రవీందర్ టికెట్ ఆశిస్తున్నా రు. ప్రస్తుతానికి ఆ పార్టీకి చెందిన ఉపాధ్యాయ నేతలెవరి పేర్లూ టీచర్ ఎమ్మెల్సీ పదవి కోసం తెరపైకి రాలేదు. ఇక, గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో తమకు అవకాశం దక్కుతుందా, లేదా అన్న చర్చ కొందరు నేతల్లో మొదలైంది. రేసులో వేనేపల్లి ... వేముల ! కోదాడ నియోజకవర్గం నుంచి చివరి నిమిషం దాకా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక పోతున్నామని, మరో విధంగా ఆయన సేవలను వినియోగించుకుంటామని టికెట్ల ఖరారు సమయంలో పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిత్వం ఖరారైన బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపులో వేనేపల్లి కృషి ఉందని, ఆయన ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే మాదిరిగా, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి గెలిపిస్తే.. వేముల వీరేశాన్ని ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిలో చూస్తారని ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో వేముల ఓటమి పాలయ్యారు. పార్టీలో సంస్థాగతంగా వివిధ సమీకరణలు, అవసరాల రీత్యా వేముల పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ నెరవేరలేదు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన నల్లగొండ లోక్‌సభస్థానం నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును పరిశీలిస్తారా..? లేదా అన్న చర్చ జరుగుతోంది. సాగర్ నుంచి టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ నియోజకవర్గం నాయకుడు చాడా కిషన్ రెడ్డి తదితరులు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందికి చోటు కల్పించే అవకాశాల్లేవని, ఈ లెక్కన మరికొందరిని స్థానిక సంస్థల కోటా జరిగే ఎన్నిక వరకు వెయిటింగ్లో పెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గుత్తా’కు చోటు దక్కేనా ? నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ కేబినెట్లో బెర్తును ఆశిస్తున్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని మంత్రి పదవి కట్టబెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన పార్టీలో చేరే ముందు ఇదే హామీ ఇచ్చారని, గత ప్రభుత్వంలో అవకాశం కల్పించలేక పోయినందున, ఈసారి ఎమ్మెల్సీగా తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గుత్తా ఎన్నికల బాధ్యతలు చూసిన దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దేవరకొండలో టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించింది. ఈ రెండు స్థానాలతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ ఆయన కొంత బాధ్యత మోశారు. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని మండలిలో గుత్తాకు చోట దక్కుతుందా..? లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్ వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ..
నల్గొండ: కాంగ్రెస్ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల వద్దకు వెళుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. నల్గొండలో జరిగే సభ చారిత్రాత్మక సభ అవుతుందని అన్నారు. 9 నెలల పాలనను కేసీఆర్ త్యాగం చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ సాధించడం కోసం పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికూటములు జతకట్టినా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా అని సూటిగా అడిగారు. నల్గొండ జిల్లాలోనే నలుగురు నాయకులు తాము సీఎం అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
కౌలు రైతులకు రైతు బీమా వరం
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు రైతు బీమా వరమని రైతు కార్పొరేషన్ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కౌలు రైతులకు రైతుబంధు చెక్కులు ఇవ్వడం సాధ్యం కాదని, అయితే వారిలో 90 శాతం మందికి రైతు బీమాతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో కలసి మాట్లాడారు. కౌలు రైతుల్లో చాలామందికి కొద్దోగొప్పో వ్యవసాయ భూమి ఉందని, వారే ఇంకొంత భూమి కౌలుకు తీసుకొని పనిచేస్తారని చెప్పారు. ఎంత వ్యవసాయ భూమి ఉన్నా అలాంటి వారందరికీ రైతు జీవిత బీమా వర్తిస్తుందన్నారు. సంతోషంగా రాష్ట్ర రైతులు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయని, కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, రైతుబంధు వంటి పథకాలు రూపొందించారని, ఉచిత కరెంటు ఇస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతులకు సాయం చేసేందుకు 1.61 లక్షల మందితో రైతు సమన్వయ సమితుల సైన్యం ఏర్పాటైందన్నారు. ఇప్పటివరకు రైతుబంధు చెక్కులను 48.54 లక్షల మందికి ఇచ్చామని, అందులో 47.20 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రూ.4,913 కోట్లు తీసుకున్నారని తెలిపారు. రైతు బీమా కింద ఇప్పటికే అధికారులు 27 లక్షల మంది రైతులను కలిశారని, వారిలో 22.08 లక్షల మంది రైతుల నుంచి నామినీ పత్రాలు స్వీకరించారన్నారు. వయసు, ఒకే రైతుకు రెండు మూడు ఖాతాలుండటం వంటి కారణాల వల్ల 20 శాతం మందిని రైతు బీమాకు అనర్హులుగా తేలారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం? ప్రతిపక్షాలు రైతు బంధు పథకంపై గోల చేస్తున్నాయని, వారు శవాలపై పేలాలు ఏరుకునేలా ప్రవర్తిస్తున్నారని గుత్తా మండిపడ్డారు. కాగా, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించడంపై మండిపడ్డారు. అదే నిజమైతే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఈ మేరకు ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రాష్ట్రంలో రెండేళ్లు అందరి జీతభత్యాలు మానుకొని ఇచ్చినా సరిపోవన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వాతావరణ యాప్‌ను ఆవిష్కరించారు. -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
సాక్షి, తలమడుగు(బోథ్) : అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అవతరించిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన రైతులకు పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 40 శాతం భూరికార్డులు వివాదాలతో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో 96శాతం వరకు ఎలాంటి వివాదాలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇతర శాఖల అధికారులను అభినందించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలను 17 రకాల సైక్యూరిటీతో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ పాస్‌బుక్‌లకు కాలం చెల్లినట్లే అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. దేశంలో రైతు సంక్షేమానికి సుమారు రూ.50 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తాం: మంత్రి పోచారం వ్యవసాయం అంటే పండుగలా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు సమన్వయ సంఘాలు రైతులకు సాగులో అండగా ఉంటూ వారికి సంబంధిత అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపా రు. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర అందని పక్షంలో రైతు సమన్వయ సంఘాల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేస్తామన్నారు. దేశంలో రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. వచ్చే జూన్ 2నుంచి రైతులకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకు గాను ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతుబంధు చెక్కులను పెట్టుబడి ఖర్చులకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతుకు అండగా సీఎం : మంత్రి రామన్న పెట్టుబడి కోసం రైతుల పడే ఇక్కట్లను గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించి రైతులకు తొలివిడత చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం : ‘గుత్తా’ రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దని రైతు సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతు సమితీలు గ్రామాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం గ్రామంలోని రైతు లకు పట్టా పాస్ పుస్తకాలు, చెక్కలు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ గోడాం నగేశ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జిల్లా రైతు సమన్వయకర్త అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసీల్దార్ రాంరెడ్డి, ఎం పీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ లక్ష్మీరమణ, ఏడీఏ రమేశ్, వైద్యాధికారి రాజీవ్‌రాజు,మండల రైతు సమన్వయకర్తలు గోవ ర్ధన్‌రెడ్డి, కేదారేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
గుత్తా నియామకంపై హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకంపై హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే గుత్తా సుఖేందర్‌రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని, అందువల్ల ఆయన నియామక జీవోను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ రద్దు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వ్యక్తి లాభదాయక పోస్టులో కొనసాగరాదన్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి లాభదాయక పోస్టు కిందకు వస్తుందని, అందువల్ల ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా గౌరవ వేతనం పొందుతున్నారని, ఎంపీగా ఉన్న వ్యక్తి ఇలా గౌరవవేతనం తీసుకోవడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లాభదాయక పోస్టు కిందకు వస్తుందని ఆమె వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
సుఖేందర్‌రెడ్డి ఫిరాయింపుదారుడు....
సాక్షి, హైదరాబాద్: ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని, నియామక జీవోను రద్దు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, రైతు సమన్వయ సమితి ఎండీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు సుఖేందర్‌రెడ్డిని వ్యక్తిగతహోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ‘సుఖేందర్‌రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేయలేదు. లోక్‌సభలో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతూ టీఆర్ఎస్లోకి ఫిరాయించడం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాక, సమితి అధ్యక్ష పదవి లాభదాయక పోస్టు కిందకే వస్తుంది. కాబట్టి పార్లమెంట్ సభ్యుడిగా గుత్తాకు అనర్హత వర్తిస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సుఖేందర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయండి.’అని మధుసూదన్‌రెడ్డి తన పిటిషన్లో కోర్టును కోరారు. -
లాభదాయకమా కాదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం చెల్లుతుందా అనే విషయం చర్చనీయాంశమైంది. నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తాకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఈ బాధ్యతలను అప్పగించింది. ఎంపీ పదవిలో ఉన్న గుత్తా లాభదాయకమైన మరో పదవిలో ఎలా కొనసాగుతారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఇటీవలే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వివరాలు పంపాలని లోక్‌సభ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు సమాచారం. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. దీనిపై లోక్‌సభకు సమాధానం పంపించేందుకు అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబం ధించి లోక్‌సభకు ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యతలను సీనియర్ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి శాలిని మిశ్రాకు సీఎస్ ఎస్కే జోషి అప్పగించినట్లు తెలిసింది. -
పంట కొనుగోలు సక్రమంగా జరగాలి: గుత్తా
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తుల కొనుగోలును సక్రమంగా సకాలంలో జరిగేలా చూడాలని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. జిల్లా రైతు సమితి సమన్వయకర్తలతో గురు వారం ఆయన తొలిసారిగా సమావేశ మ య్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లా డుతూ.. త్వరలో జిల్లా, మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఏడు విడతలలో రెండ్రోజుల చొప్పున శిక్షణ కార్య క్రమం ఉంటుందన్నారు. రైతు వేదికల నిర్మాణానికి భూములను గుర్తించాలన్నారు. మరోవైపు కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. -
‘గుత్తా’కు సహాయనిరాకరణ!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి వారం కూడా కాలేదు. అప్పుడే, తన కార్యాలయం కేటాయింపుపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. వ్యవసాయ కమిషనరేట్‌లోని మీటింగ్ హాలును గుత్తా చాంబర్‌గా కేటాయించారు. అయితే కమిషనరేట్ ప్రాంగణంలో గుత్తాకు చాంబర్ కేటాయించవద్దంటూ కొందరు ఉద్యోగులు విన్నవించగా అది తాత్కాలికమేనంటూ ఉన్నతాధికారులు సర్దిచెప్పినట్లు తెలిసింది. ఆ శాఖ మంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే ఉద్యోగులే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నెల క్రితమే అధికారులు గుత్తా కోసం వ్యవసాయ కమిషనరేట్‌లో ఒక చాంబర్ సిద్ధం చేశారు. అందుకోసం రూ.40 లక్షలు ఖర్చు చేశారు. అంతా సిద్ధం చేశాక గుత్తా సోదరుడు, కుమారుడు వచ్చి ఆ కార్యాలయాన్ని పరిశీలించి వాస్తు ప్రకారం లేదంటూ విముఖత చూపారు. కమిషనర్ జగన్మోహన్ విధులు నిర్వహిస్తున్న చాంబర్‌ను కేటాయించాలని గుత్తా అనుచరులు ఒత్తిడి తెచ్చారు. దీనిపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో గుత్తా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు మీటింగ్ హాలునే చాంబర్‌గా సిద్ధం చేశారు. ఆధిపత్యంపై పరస్పర వ్యాఖ్యలు వ్యవసాయాధికారులపై గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితి సభ్యులు ఆధిపత్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఆదిలోనే గుత్తా చాంబర్ విషయమూ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో గుత్తా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి పోచారం పలు వ్యాఖ్యలు చేశారు. ‘వ్యవసాయాధికారుల మనసు నొప్పించకుండా సమితి సభ్యులు సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరిపైనా పెత్తనం చేయడానికి మనం ఇక్కడకు రాలేదు. అధికారులపై ఆధిపత్యం వద్దు. ఇప్పటివరకు తామంతా కలసిమెలసి కుటుంబసభ్యుల్లా పనిచేస్తున్నాం’అంటూ పోచారం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అదే సందర్భంలో గుత్తా మాట్లాడుతూ ‘వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో సమితి సభ్యులు సమన్వయంతో పనిచేయాలి. ఎవరిపైనా ఆధిపత్యం చేయకూడదు’అని పేర్కొనడం గమనార్హం.‘కమిషనరేట్‌లో గుత్తా కార్యాలయం ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందని, ప్రొటోకాల్తోనే సరిపోతుంది’అని కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అన్నదాతలకు అండగా రైతు సమితులు
సాక్షి, హైదరాబాద్: విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర సాధించే వరకు రైతులకు అండగా ఉండటమే లక్ష్యంగా ఏర్పాటైన రైతు సమన్వయ సమితులు పూర్తిస్థాయిలో కొలువుదీరనున్నాయి. సోమవారం రాష్ట్ర రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవ సాయ కమిషనరేట్‌లో కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడే గుత్తాతోపాటు డైరెక్టర్లు బాధ్యతలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశముందని చెబుతున్నా ఆయన రాకపై స్పష్టమైన ప్రకటన జారీ కాలేదు. పలువురు మంత్రులు రానున్నారు. కార్యక్రమానికి హాజరుకావాలని జిల్లా, మండల రైతు సమన్వయకర్తలను వ్యవసాయ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ ఆహ్వానించారు. రాష్ట్ర రైతు సమితుల్లో మొత్తం 1.61 లక్షల మంది సభ్యులున్నారు. గ్రామస్థాయిలో 15, మండల, జిల్లాస్థాయిల్లో 24 మంది సభ్యుల చొప్పున సమితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయిలో 42 మందితో సమితి ఏర్పాటు కానుంది. కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల మూలనిధిని కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ మేరకు ముందుగా రూ.200 కోట్లు అందజేశారు. -
రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సమన్వయ సమితిని లాభాపేక్షలేని సంస్థ(కార్పొరేషన్)గా నమోదు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొంది. రైతు సమన్వయ సమితిలో ఐదుగురిని డైరెక్టర్లుగా నియమించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి డైరెక్టర్, చైర్మన్ హోదాలో ఉంటారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ను రైతు సమన్వయ సమితి ఎండీగా, ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సి.హెచ్.వి.సాయిప్రసాద్‌ను రైతు సమన్వయ సమితి డైరెక్టర్లుగా నియమించారు. నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. కాగా, రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమితులైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మార్చి 12న బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిసింది. -
పని చేయని ‘గుత్తా’ధిపత్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి పరాభవం కలిగింది. ఆయన రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు అవుతారని నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతోంది. అంతర్గతంగా సీఎం కేసీఆర్ కూడా హామీయిచ్చారు. ఇటీవల జిల్లా రైతు సమితి సమన్వయకర్తల జాబితాను సీఎం ఖరారు చేశారు. వాటి ఖరారుకు ముందే నల్లగొండ జిల్లా సమితి సమన్వయకర్తలుగా తన అనుచరులైన ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, పాశం రామిరెడ్డిలలో ఎవరో ఒకరికి ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. అయితే వ్యవసాయ శాఖ వర్గాలు ఇప్పటివరకు ముఖ్యమంత్రికి లేఖను పంపలేదని సమాచారం. మంత్రి ద్వారా ఆ లేఖ సీఎంకు పంపారా, లేదా, అనే దానిపై స్పష్టత లేదు. జిల్లా స్థాయిలో మంత్రి జగదీశ్‌రెడ్డి విన్నపానికి మంత్రి పోచారం సంసిద్ధత వ్యక్తంచేసి ఆయన అనుచరుడికి అవకాశం కల్పించారని అంటున్నారు. విచిత్రమేంటంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించిన ఇద్దరిలో ఎవరికీ కనీసం జిల్లా సమన్వయ సమితిలో సభ్యుడిగా కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కువ మంది సమన్వయకర్తలు తన సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని చెబుతూ వీరిని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతున్నా, జిల్లా సమితిలోనూ సభ్యులుగా తీసుకోకపోవడంపై గుత్తా మనస్తాపం చెందినట్లు సమాచారం. దీనిపై గుత్తా ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో ఎక్కువ మంది మా సామాజిక వర్గానికి చెందినవారే జిల్లా సమన్వయకర్తలుగా ఉన్నారని, దీంతో నల్లగొండ జిల్లాలో మరో సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చామని నాతో చెప్పారు’అని వివరించారు. -
రైతు కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా!
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఏర్పాటు కానున్న రాష్ట్ర రైతు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన నియామకానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నల్లగొండ ఎంపీగా ఎన్నికైన గుత్తా 2016లో టీఆర్ఎస్లో చేర డంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో రైతు కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ఆయన పేరు కొన్ని నెలలుగా ప్రచారంలోనే ఉన్నా సర్కారు సందిగ్ధంలో పడింది. చివరకు దీనిపై ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం కోరగా ఆయన రెండు పదవులు నిర్వహించడానికి ఇబ్బందులు లేవనీ, రెండూ లాభదాయకమైనవైతేనే సమస్య తలెత్తుతుందని వివరించారు. ఎంపీగా గుత్తా వేతనం తీసుకుంటున్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వేతనం తీసుకుంటేనే సమస్య ఎదురవుతుందని, లేకుంటే జోడు పదవులు నిర్వహించడానికి న్యాయపరమైన చిక్కులేవీ ఉండవని అడ్వకేట్ జనరల్ చెప్పినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. దీంతో గుత్తా ఎంపీ పదవికి రాజీ నామా చేయకుండానే రైతు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి మార్గం సుగమమైనట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే కార్పొరేషన్ ఏర్పాటు... రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇప్పించడం, అవసరమైతే కొనుగోలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సమితులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు గ్రామ, మండల రైతు çసమితుల ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. జిల్లా సమితులనూ ఏర్పాటు చేశాక సీఎం రాష్ట్ర రైతు సమితిని నియమిస్తారు. దాన్ని కార్పొరేషన్‌గా ప్రకటిస్తారు. దీనికి రైతు అభివృద్ధి సంస్థ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆ సంస్థను రిజిస్టర్ చేసి చైర్మన్‌ను నియమిస్తారు. ఈ నెలాఖరులోగా రైతు కార్పొరేషన్ ఏర్పాటవుతుందని చెబుతున్నారు. -
కాంగ్రెస్‌వైపు చూస్తున్నాననడం అబద్ధం
‘‘గ్రామ వార్డు సభ్యుని స్థాయినుంచి ఈ స్థాయికి ఎదిగా. తాబేలులా చిన్నగా లక్ష్యం వైపు వెళుతున్నా. రాజకీయాల్లో మనం చేసిన పనులే శాశ్వతం. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌లను జనం మరిచిపోలేదా? చేసిన పనులే గుర్తుంటాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కావడంతో ప్రతీ ఎమ్మెల్యే సీఎం కావడం తేలిక అనుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి వంటి కొందరు లీడర్లను మీడియా హైప్ చేస్తోంది. దీంతో వాళ్ల స్థాయి ఏమిటో తెలియక ఎగిరెగిరి పడుతున్నారు. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన లేదు. టీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి లేదు. కాంగ్రెస్ వైపు చూస్తున్నాననడం తప్పు. రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి గురించి నాకేం తెలియదు. నేను అడిగిన పనులన్నీ సీఎం చేస్తున్నారు. నల్లగొండకు మెడికల్ కాలేజీ, డిండి ప్రాజెక్ట్ వంటి ఇతర పనులన్నీ చేస్తున్నారు’’. -
గుత్తా.. ఇక రైతుపాత్ర?
♦ రైతు సమన్వయ సమితిలో సభ్యుడిగా ఎంపీ సుఖేందర్‌రెడ్డి ♦ చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ కమిటీలో సభ్యుడిగా చేరిక ♦ మండల సమితిలో కూడా ఎంపీ సుఖేందర్‌రెడ్డి పేరు ప్రతిపాదన ♦ కమిటీలకు కార్పొరేషన్ హోదా కల్పిస్తే రాష్ట్ర చైర్మన్‌గా అవకాశం? ♦ సభ్యులుగా చేరేందుకు పోటీపడుతున్న ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ♦ వివరాలను గోప్యంగా ఉంచుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాక్షి, ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి రైతుపాత్ర పోషించపోతున్నారా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సమన్వయ సమితిల్లో ఈయన కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఎంపీ స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల రెవెన్యూ పంచాయతీలో ఖరారు చేసిన కమిటీలో సభ్యుడిగా ఎంపీ పేరును చేర్చినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి సమన్వయ సమితి చైర్మన్‌గా – మిగతా 2లో మొదటి పేజీ తరువాయి ఉండాలంటే గ్రామ స్థాయిలో సభ్యుడై ఉండాల్సిందే. దీంతో గుత్తా రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే మండల కమిటీలో కూడా సుఖేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. మొత్తానికి గుత్తాకు రాష్ట్ర సమన్వయ సమితి చైర్మన్‌గా జరుగుతున్న ప్రచారానికి ఆయా విషయాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరే స మయంలో తాను అధికారికంగా గులాబి తీర్థం పుచ్చుకోపోయినప్పటికీ అనధికారికంగా కేసీఆర్ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని గుత్తా అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఒక వేళ అధికారికంగా పార్టీ మారాల్సి వస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా స్పష్టం చేశారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ కమిటీల్లో గుత్తా సభ్యుడిగా చేరడం పట్ల ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. రైతు ఎవరైనా కానీ పార్టీలో చేరొచ్చన్న ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు గుత్తా కమిటీలో చేరినప్పటికీ రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా వెళ్లాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేయడం అనివార్యం కాకతప్పదని తెలుస్తోంది. ప్రాదేశిక సభ్యుల పోటీ... రైతు సమన్వయ కమిటీల్లో సభ్యులుగా ఉండేందుకు ఉమ్మడి జిల్లాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా ఉత్సాహపడుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసొచ్చిన నాయకుల్లో ప్రముఖులైన వాని పేర్లు సమన్వయ కమిటీల్లో చేర్చుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గ్రామ, మండల సమన్వయకర్తలుగా కాకపోయిన సభ్యులుగా ఉండేందుకు పోటీపడుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు కమిటీల్లో సభ్యులుగా కాకపోయినా గ్రామ, మండల స్థాయి కమిటీలు నిర్వహించే సమావేశాలకు వారు గౌరవ సభ్యులుగా హాజరయ్యేలా ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామ, మండల స్థాయి కమిటీల జాబితాలు ఖరారైనప్పటికీ చివరి నిమిషయంలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నందున వాటి వివరాలను బయటికి పొక్కనీయ కుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు చివరికి రైతు సమన్వయ కమిటీలు అధికార పార్టీ కమిటీలు మారుతాయోమన్న ఆరోపణలకు బలం చేకూర్చేనట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.