
సాక్షి, నల్లొండ : ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా సోమవారం ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవలో సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు, గొంగిడి సునీత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment