రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి అందుకేనా? | Jagadish Reddy Fires On Congress Party Over Rythu Bandhu And Current | Sakshi
Sakshi News home page

రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి అందుకేనా?

Published Sat, Jan 27 2024 6:39 PM | Last Updated on Sat, Jan 27 2024 7:30 PM

Jagadish Reddy Fires On Congress Party Over Rythu Bandhu And Current - Sakshi

(ఫైల్‌ ఫొటో)

సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, మహాలక్ష్మి అమలు చేసి మహిళమధ్యే పంచాయతీ పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని వాళ్లంతా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి ఇచ్చింది అందుకేనా? అని సూటిగా ప్రశ్నించారు. నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతులకు డబ్బులు ఇవ్వలేనపుడు కాళ్లు పట్టుకుని చెప్పుకోవాలన్నారు. రైతుబంధు పడట్లేదు.. కరెంట్ పోతుందని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తా అన్నారు ఏమైంది? అని నిలదీశారు. వారం పది రోజుల్లోనే కేసీఆర్ బయటకు వస్తారని చెప్పారు. తొందరలోనే నల్లగొండ వస్తానని చెప్పారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని అన్నారు. 

చదవండి: Amit Shah's Telangana Tour: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement