మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజగొపాల్‌రెడ్డి సవాల్‌ | MLA Rajagopal Reddy Challenges To Jagadish Reddy Over Suryapet Winning | Sakshi
Sakshi News home page

మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజగొపాల్‌రెడ్డి సవాల్‌

Published Sun, Oct 3 2021 6:55 PM | Last Updated on Sun, Oct 3 2021 7:11 PM

MLA Rajagopal Reddy Challenges To Jagadish Reddy Over Suryapet Winning - Sakshi

నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజ్‌పాల్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీష్‌రెడ్డికి దమ్ముంటే మళ్లీ సూర్యాపేటలో గెలిచి చూపించమని అన్నారు. గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని, గత ఎన్నికల్లో నకిరేకల్‌లో ఛాలెంజ్ చేసి చూపించానని ధైర్యముంటే మళ్లీ తన ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. జగదీష్‌రెడ్డికి ఇదే చివరి ఎన్నికని మునుగోడులో పిచ్చి పిచ్చి వేశాలు మానుకోవాలని మండిపడ్డారు.

ఇప్పటికైనా జగదీష్‌రెడ్డి వైఖరి మార్చుకోవాలని, టీఆర్ఎస్ నేతలు రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారని, అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. హుజురాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా దళిత బంధు పథకం అమలు చేయలని డిమాండ్‌ చేశారు. అమలైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించానని గుర్తుచేశారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement