komati reddy rajgopal reddy
-
ఓటు హక్కు వినియోగించుకున్న రాజగోపాల్ రెడ్డి
-
టీఆర్ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవం : రాజగోపాల్ రెడ్డి
-
షబ్బీర్ అలీని సస్పెండ్ చేయండి : కోమటిరెడ్డి
-
తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయం
చౌటుప్పల్: కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ నాయకులు బానిసలుగా మారా రని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం కొందరు నాయ కులు బీజేపీలో చేరారు. మోదీ, అమిత్‌షా నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్! -
‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’
సాక్షి,సంస్థాన్ నారాయణపురం: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నెలరోజుల్లో పడిపోతుంది.. సీఎం కేసీఆర్ కుటుంబం దాచుకున్న డబ్బులు బయటకు వస్తాయి’.. అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూసుకుంట్ల, గీసుకుంట్ల కాకుండా దమ్ముంటే సీఎం కేసీఆర్ మునుగోడులో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నిక తనది కాదని, మునుగోడు ప్రజల ఎన్నిక.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటికి తులం బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ గెలవదని ఆయన స్పష్టం చేశారు. -
కేసీఆర్ పోటీ చేసినా గెలుస్తా: కోమటిరెడ్డి
సాక్షి ,మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ పోటీచేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు -
34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘34 ఏళ్లుగా పనిచేసినా హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్ కూడా కాలేడు. సివిల్స్ రాసి జిల్లా ఎస్పీ అయినవాళ్లను పట్టుకుని.. 34 ఏళ్లుగా నేను ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవు తావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తా యి’ అని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పరిస్థితులు సందర్భాన్ని బట్టి మారుతుంటాయన్నారు. 2018లో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడేమయ్యా రని ప్రస్తావించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. కేంద్రం నుంచి పనులు వచ్చాయా లేదా? ‘నా ప్రశ్నలకు రాజగోపాల్‌రెడ్డి సమాధానా లు చెప్పాలి. జార్ఖండ్‌లో రూ.21 వేల కోట్ల టెండర్ పనులు కోల్ ఇండియా ద్వారా మీ సంస్థకు వచ్చాయా, లేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మీకు పనులు రాలేదా? రాష్ట్రంలోని పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టులో మీకు పనులు వస్తే కొంత పనులు చేశాక ఎక్కువ కమీషన్లు తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బదిలీ చేశారా లేదా? పార్టీ కార్యక్రమా ల్లో పాల్గొనకుండా.. 2009లో నేరుగా వచ్చి ఎంపీగా నామినేషన్ వేశావ్. మరి నేరుగా ఓ వ్యాపారస్తుడికి 2009లో బీఫారం ఇచ్చి ఎంపీగా నిలబెట్టినప్పుడు.. 40 ఏళ్లుగా నల్లగొండ జిల్లాలో ఉన్న పార్టీ వారికి అన్యాయం జరగలేదా? బీజేపీలో చేరుతున్న నువ్వు.. మునుగోడులో గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నేత మనోహర్‌రెడ్డిని ఇప్పుడూ నిలబెడతావా? లేక నువ్వే పోటీ చేస్తావా? ప్రజలకు మీ అసలు రంగు తెలిసిపోయింది. కష్టకాలంలో పార్టీని వదిలేసి.. కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి కొట్లాడుతున్నది ఎవరో, వ్యాపార లావాదేవీల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఎలా వ్యవహరిస్తు న్నారో మునుగోడు ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు మీరు చేరబోయే పార్టీలో కండువా కప్పుకున్న ఒక్కరోజు మాత్రమే పండుగ. రాజగోపాల్‌రెడ్డిని ఢిల్లీ తీసుకొచ్చిన మాజీ ఎంపీ వివేక్ మొహం 3 నెలల తర్వాత అలానే సంతోషంగా ఉంటుందా లేదా చూద్దాం’ అని రేవంత్ పేర్కొన్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, దీనిపై పార్టీ తగిన చర్య తీసుకుంటుందని చెప్పారు. చదవండి: తెలంగాణలో ఉన్నది.. ‘పసుపు కాంగ్రెస్’! -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం మోసం చేయడమా?: రాజగోపాల్‌రెడ్డి
-
మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజగొపాల్‌రెడ్డి సవాల్
నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజ్‌పాల్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీష్‌రెడ్డికి దమ్ముంటే మళ్లీ సూర్యాపేటలో గెలిచి చూపించమని అన్నారు. గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని, గత ఎన్నికల్లో నకిరేకల్‌లో ఛాలెంజ్ చేసి చూపించానని ధైర్యముంటే మళ్లీ తన ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. జగదీష్‌రెడ్డికి ఇదే చివరి ఎన్నికని మునుగోడులో పిచ్చి పిచ్చి వేశాలు మానుకోవాలని మండిపడ్డారు. ఇప్పటికైనా జగదీష్‌రెడ్డి వైఖరి మార్చుకోవాలని, టీఆర్ఎస్ నేతలు రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారని, అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. హుజురాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా దళిత బంధు పథకం అమలు చేయలని డిమాండ్ చేశారు. అమలైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించానని గుర్తుచేశారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. -
నిధులివ్వనప్పుడు సమావేశాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్లో పెట్టిన నిధులు ఇవ్వరు, బడ్జెట్‌తో సంబంధం లేని పనులను హడావుడిగా చేపడుతూ నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ సభ ఎందుకు, సమావేశాలు ఎందుకు?’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గురువారం అసెంబ్లీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి పేర్కొనగా, పవిత్ర సభను అవమానించేలా ఎలా మాట్లాడతారని, అలా చేస్తే మాట్లాడేందుకే అనుమతి ఇవ్వనని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మీద గౌరవం లేనప్పుడు సభలో మాట్లాడటమెందుకని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభలో ఆవేశంగా మాట్లాడారు. తొలుత ఆయన పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా స్పీకర్ పిలవగా, తన పేరు రాజగోపాలరెడ్డి అంటూ ఆయన పేర్కొనటంతో స్పీకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత రాజగోపాల్‌రెడ్డి మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట ఎక్కువగా నడిచింది నిరుద్యోగులేనని, రాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, ఉపాధికి ఢోకా లేదని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పుడు అది అమలు కాకపోయేసరికి నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకొన్నాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు.. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు రావటం లేదని, ప్రైవేటులో 50 శాతం ఉద్యోగాలు స్థానికు లకే ఇచ్చేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లో 100 ఫార్మా కంపెనీలుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగ మేంటని ప్రశ్నించారు. పథకాలు రూపొందించినా అమలుకు నిధులు ఇవ్వక పనుల కోసం సర్పంచులపై ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలకు వేల కోట్ల నిధులు పోతు న్నాయని, మరి తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని, ప్రతిపక్ష సభ్యులను గెలిపించుకోవటం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమా అంటూ ప్రశ్నించారు. శివన్నగూడెం ప్రజలు ప్రాజెక్టుకు భూములిచ్చి త్యాగం చేస్తే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. -
రాజ్‌గోపాల్ రెడ్డి యూటర్న్.. బీజేపీకి నో!
సాక్షి, నల్గొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ రాజ్‌గోపాల్.. బీజేపీ చేరుతున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. ఫిరాయింపునకు సిద్ధమయ్యారని తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీపై ఆయనపై చర్యలు కూడా తీసుకుంది. అయితే గడిచిన నెల రోజులు మౌనంగా ఉన్న రాజ్‌గోపాల్ రెడ్డి.. హఠాత్తుగా మాటమార్చారు. శనివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే తనకు ఎంతో అభిమానమని, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ అని వ్యాఖ్యానించారు. పార్టీ బాగుకోసమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, అధిష్టానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలంటే కుంతియా, ఉత్తమ్ కుమార్‌లు సరిపోరని మాత్రమే తాను అన్నట్లు చెప్పారు. దానిని తప్పుగా అర్థం చేసుకున్న పార్టీ నేతలు.. షోకాజు నోటీసులు ఇచ్చారని వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎంను అంటూ.. చెప్పుకున్నారు కూడా. అంతేకాదు టీకాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని దాదాపు అందరూ భావించారు. కాగా కోమటిరెడ్డి తాజా యూటర్న్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ మారడంపై ఇప్పటి వరకూ స్పష్టతన్విలేదు. -
రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ఎందుకు పోత్తు పెట్టుకున్నారని, ఎవరిని సంప్రదించి పొత్తు కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు కారణంగానే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అన్నారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు టీఆర్ఎస్లోకి వెళ్తే రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం బలహీనపడిందని నాయకులు భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారని రాజ్‌గోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపినట్టుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీని వీడుతారనే వార్తలు వ్యక్తమతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో పాటు మాజీ ఎంపీ వివేక్, కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ.. నేతలు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. -
‘ఆయన పార్టీ మారడం బాధకు గురిచేసింది’
సాక్షి, భునవనగిరి: కేంద్రంలోని బీజేపీకి అండగా నిలుస్తోన్న టీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కోట్ల రుపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.700 కోట్లు విలువ చేసే బ్రాహ్మణ వెళ్లాంల ప్రాజెక్టుని తెచ్చినట్లు గుర్తుచేశారు. కానీ ఐదేళ్లు గడిచిన కేసీఆర్ మాత్రం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. నల్గొండను దత్తత తీసుకుంటా అని గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించారని, నాలుగు నెలలు గడిచినా దాని ఊసే లేదని విమర్శించారు. చదవండి: నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎవరి బలమెంత..? గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌లో తాము పోరాడి గెలచామని, అనంతరం చిరమర్తి లింగయ్య పార్టీ మారడం తనను ఎంతో బాధకు గురిచేసిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తున్నారని, 15 రోజుల్లోనే ఆరుకోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. నకిరేకల్ కోసం అన్నదమ్ములిద్దరం ప్రాణాలైన ఇస్తాం కానీ.. ఇక్కడి ప్రజలను మాత్రం వదిలివెళ్లమని స్పష్టం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 22న భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా తమను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎమెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. తమ సొంతమనిషి అయిన చిరుమర్తి లింగయ్యను తీసుకెళ్లి.. తమ కుటుంబంలో చిచ్చులు పెట్టిన కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పదవులకు ఆశపడ్డి కొంతమంది నాయకులు పార్టీని విడిచి పోవచ్చని, కేసీఆర్‌ను ఓడించడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
లింగయ్యది నమ్మకద్రోహమే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరడం ఖాయమైంది. కేసీఆర్ సమక్షంలో అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. లింగయ్య ఇప్పటికీ బహిరంగంగా తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించలేదు. తాజా పరిణామాలతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులతోపాటు కోమటిరెడ్డి సోదరులు షాక్‌కు గురయ్యారు. ‘లింగయ్య పార్టీ మారే విషయం నాకు తెలి యదు. ఆయన నన్ను సంప్రదించి పార్టీ మారడం లేదు. రెండుసార్లు టికెట్ ఇప్పించాం. ఇంత నమ్మకద్రోహం చేస్తాడనుకోలేదు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో వ్యాఖ్యానించారు. లింగయ్య పార్టీ మారే విషయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏం జరిగింది? కోమటిరెడ్డి సోదరులను పార్టీలోకి తీసుకోవద్దని, లింగయ్యను తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. లింగయ్యను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ అప్పజెప్పారని తెలుస్తోంది. లింగయ్య టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సమయంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో ఉన్న సంబంధాలను, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో ఉన్న పరిచయాలను ముందుపెట్టి జగదీశ్‌రెడ్డి పావులు కదిపారని అంటున్నారు. -
సీఎల్పీ రేసులో ఉన్నా..!
మునుగోడు: తాను సీఎల్పీ రేసులో ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎల్పీ పదవి అప్పగిస్తే ప్రభుత్వంపై గట్టిగా పోరాడతానని పేర్కొన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు కేటాయించి 100 సీట్లలో గెలిపించేవాడినని వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంత వైఖరి వల్ల తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు నెలరోజులైనా కనీసం ప్రమాణ స్వీకారం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత ఎంపికకు సన్నద్ధమైందని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం వల్లే రాష్ట్రంలో ప్రజా కూటమి ఓటమిపాలైందని ఆయన అభిప్రాయపడ్డారు. సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో పొత్తు కుదరక మూడు నెలల పాటు చర్చలు జరపడంతో అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. అదే టీఆర్ఎస్ రెండు నెలల ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి గ్రామాల్లో ఓటర్లని ప్రసన్నం చేసుకొని అధికస్థానాలు గెలవగలిగిందని వెల్లడించారు. అన్ని రోజులు కొట్లాడి అనుకున్న స్థానాలు తీసుకున్న సీపీఐ, జన సమితి పార్టీలు కనీసం ఒక సీటు కూడా గెలవకపోవడం విచారకరమన్నారు. -
రేవంత్, కోమటి రెడ్డి వెనుకంజ..!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల లెక్కింపు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు మొదటి రౌండ్ ముగిసేలోపు పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. వీరిలో నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, మధిరలో మల్లుభట్టి విక్రమార్క, ఆందోల్‌లో దామోదర రాజనరసింహ, కోదాడలో ఉత్తమ్ పద్మావతి, జహీరాబాద్‌లో గీతారెడ్డిలు వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొసాగుతోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మూడో రౌండ్లోనూ జానారెడ్డి, రేవంత్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నాయి. -
ఒక్క కొబ్బరికాయతోనే అభివృద్ధి
సాక్షి, చండూరు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాదిరిగా ఊర్లో జరిగే ప్రతి పనికి ఓ కొబ్బరి కాయకొట్టడం మా నైజం కానే కాదని ఏ ఊరిలోనైనా ఒక్క కొబ్బరికాయతో ఆ ఊరి అభివృద్ధి జరిగిపోవాల్సిందేనని మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బోడంగిపర్తి, తాస్కానిగూడెం, ఇడికూడ, బంగారిగడ్డ, తుమ్మపల్లి, అంగడిపేట, తిమ్మారెడ్డిగూడెం, కొండాపురం, కమ్మగూడెం, శేరిగూడెం, శిర్ధేపల్లి తదితర గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాజా, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలలో అనేక కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేసేవారని, ఇక అలాంటి పనులు నేను చేయనన్నారు. మునుగోడు ప్రజలు తమ నియోజకవర్గానికి మీ సేవలు అవసరమని కోరడంతోనే తాను ఇక్కడి నుంచి పోటీలో ఉన్నానన్నారు. తనపై కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసినా గెలిచే సత్తాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మాట్లాడే దమ్ము తేదని దీంతో అభివృద్ధి ఏం చేయగలరని, అదే నేను అధిష్టానంతో ధైర్యంగా మాట్లాడి పల్లెను అభివృద్ధి చేయగలనని ఆయన భరోసా కల్పించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను సామాన్యులకు అందుబాటులో ఉంటానన్నారు, శేశిలేటి వాగు పనులు, వెల్మకన్నె ఫీడర్ చానల్ పనులు, బెండలమ్మ చెర్వు పనులను వెంటనే పూర్తి చేయించగలనన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, కార్యదర్శి కర్నాటి వెంకటేశం, ఎంపీపీ తోకల వెంకన్న, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోషశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు బొబ్బలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాదగాని విజయలక్ష్మి, భీమనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్, కోడి గిరి బాబు, దోటి వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన కురుమ సంఘం నాయకులు మునుగోడు : మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంఘంలోని దాదాపు 40 మంది సభ్యులు చేరారు. చేరిన వారిలో గుర్జ నర్సింహ, గుత్తి పెద్దగాలయ్య, చెరుపల్లి గోపాల్, గుత్తి శ్రీశైలం, నర్సింహ,, రమేష్, చెరుపల్లి అంజయ్య, లింగస్వామిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు గోసుకొండ శంకర్, మాజీ సర్పంచ్ చెర్కు జనార్దన్, చెరుపల్లి వెం కన్న, గోసుకొండ చంద్రయ్య, భాస్కర్, మత్స్యగిరి, మా ర్త నర్సిరెడ్డి, కూన్‌రెడ్డి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 14 గ్రామాల్లో కోమటిరెడ్డి ప్రచారం చండూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మండలంలోని 14 గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలో పలువురు కార్యకర్తలకు టీని అందించారు. అదే విధంగా కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోడి శ్రీనివాసులు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయడం ఖాయం
సాక్షి, చండూరు (మునుగోడు) : కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. దీంతో ప్రగతిభవన్ ఖాళీ చేసి ఫాంహౌస్‌కు వెళ్లడం ఖాయమని మహాకూటమి బలపర్చిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చండూరులోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ 60ఏళ్ల నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేస్తుంటే ప్రజల ఆకాంక్ష గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. తనను అధిక మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తిచేయించి లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, వేనేపల్లి వెంకటేశ్వరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మునగాల వెంకటేశ్వరావు, టీపీసీసీ కార్యదర్శి లు కర్నాటి వెంకటేషం, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధులు పున్న కైలాస్ నేత, నారబోయిన రవి, సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీలు తోలక వెంకన్న, అనంత రాజుగౌడ్, చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వాకుడోతు బుజ్జి, జెడ్పీటీసీలు అన్నెపర్తి సంతోష, శేఖ ర్, జాజుల అంజయ్యగౌడ్, మేతరి యాదయ్య, నాయకులు సుజాహుద్దిన్, కలిమికొండ జనార్ధన్, కొడి గిరిబాబు, భీమనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్, దొటి వెంకటేష్, ఇరిగి రాజు, మొగుదాల దశరథ, లింగయ్య, రాంమూర్తి పాల్గొన్నారు. -
రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
చౌటుప్పల్: రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికి టికెట్లు ఇప్పించానని ఎమ్మెల్సీ, మునుగోడు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లక్కారంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని, ఆయా స్థానాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీలోని పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నానని తెలిపారు. గతానికి భిన్నంగా.. తొలిసారిగా గెలిచే అభ్యర్థులకే అధిష్టానం టికెట్లు కేటా యించిందని పేర్కొన్నారు. మునుగోడులో గతంలో రికార్డుగా ఉన్న రావి నారాయణరెడ్డి మెజార్టీని అధిగమించాలని కార్యకర్తలకు సూచించారు. మెజార్టీ చూసి రాహుల్ స్వయంగా మాట్లాడాలని, ఆయనతో కలసి చౌటుప్పల్‌లో రోడ్‌షో నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ 12 సీట్లను గెలుచుకుంటుందన్నారు. -
సోనియా, రాహుల్‌లను తప్పుదోవ పట్టించకండి
చండూరు(మునుగోడు): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర నాయకులు కొందరు.. సోనియా, రాహుల్ గాంధీలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అలాంటివి మానివేయండి’అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా చండూరులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. చిన్న తప్పులతో కాంగ్రెస్‌కు దెబ్బ తగిలే అవకాశాలున్నాయన్నారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసుకుని టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడే నాయకులను గుర్తించి పదవులు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి అలాంటి వారిని పక్కన పెడుతున్నారన్న ఆవేదనతో మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. తనకు షోకాజ్ ఎందుకు ఇచ్చారని, సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోతే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని మాట్లాడినందుకు.. తిరిగి మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి మాత్రం వివరణ ఇవ్వలేకపోయానన్నారు. తమ బావ మృతిచెందడంతో అంత్యక్రియల్లో బిజీగా గడపడమే కారణమన్నారు. -
రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. షోకాజ్ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వాలంటూ 24 గంటల గడువుతో క్రమశిక్షణ కమిటీ ఆయనకు మరో నోటీసు ఇవ్వడం, గడువు కూడా ముగియడంతో ఏం నిర్ణయం తీసుకుంటారోననే చర్చ పార్టీ నేతల్లో కొనసాగుతోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం సుఖాంతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ గట్టిగానే ఉన్నా... ఎన్నికల ముందు కఠిన నిర్ణయాలు తీసుకోవడం పార్టీకి నష్టం చేస్తుందనే సీనియర్ల అభిప్రాయం మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప రాజగోపాల్‌రెడ్డిని హెచ్చరికలతో సరిపెడతారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. నోటీసు కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియడంతో బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మీరేమంటారు..? రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరినప్పటి నుంచీ పార్టీలో పెద్ద ఎత్తున తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఒకవేళ రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? సీనియర్లు ఏమంటారు? ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్రవ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పేరుతో సుపరిచితమైన నాయకుడిపై చర్యలు తీసుకుంటే కేడర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పాక కూడా రాజగోపాల్‌రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పార్టీ ఎన్నికల కమిటీలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ కమిటీ కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానమిచ్చేందుకు 48 గంటల గడువిచ్చింది. రాజగోపాల్ 3 పేజీల వివరణ పంపగా ఆయన సమాధానంపై సంతృప్తి చెందని కమిటీ... మళ్లీ 24 గంటల గడువిస్తూ మరో నోటీసు ఇవ్వడంతో వాతావరణం వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడిపై చర్యలు తీసుకునే ముందు పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అభిప్రాయాన్ని కమిటీ కోరినట్లు తెలుస్తోంది. దీనికితోడు పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఎందుకు? రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం వెళ్లాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ అంటుంటే సీనియర్లు మాత్రం రాజగోపాల్‌ను దూరం చేసుకోవడం సరికాదని, ఎన్నికల వేళ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. దీనికితోడు అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కుంతియా కూడా ఈ విషయంలో మెత్తబడ్డట్టు తెలుస్తోంది. జానా, షబ్బీర్, జైపాల్, వెంకట్‌రెడ్డి జోక్యం కూడా సమస్యను పరిష్కరించే విధంగానే ఉందని, జానా, షబ్బీర్ క్రమశిక్షణ కమిటీకి తెలిపిన అభిప్రాయం ప్రకారం ఎలాంటి చర్యలూ ఉండబోవని తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు, ఘటనలు పునరావృతం కావొద్దని రాజగోపాల్‌ను హెచ్చరిస్తూ సరిపెడతారని సమాచారం. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాతోపాటు ఏఐసీసీ ప్రకటించిన పార్టీ కమిటీలపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నేతలపై చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీలపై రాజగోపాల్‌రెడ్డి గురువారం బహిరంగ విమర్శలు చేయడం తెలిసిందే. పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోతోందని, కమిటీల్లో తమకు ప్రాధాన్యమివ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బ్రోకర్లందరికీ కమిటీలో స్థానం కల్పించారని ధ్వజమెత్తారు. కుంతియా రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ మీడియాలో ప్రచారం కావడం, పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడంతో పీసీసీ సత్వరమే నష్ట నివారణ చర్యలకు దిగింది. హైకమాండ్ ఆదేశాలతో పీసీసీ క్రమశిక్షణా కమిటీ శుక్రవారం గాంధీ భవన్లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కో చైర్మన్ శ్యామ్ మోహన్, సభ్యులు కమలాకర్‌రావు, బలరాం నాయక్, శ్రీనివాసరావు, సంబాని చంద్రశేఖర్ తదితరులు హాజరవగా మరో సభ్యుడు, ఎంపీ నంది ఎల్లయ్య గైర్హాజరయ్యారు. ఈ భేటీలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోలను మరోసారి పరిశీలించారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని నిర్ధారించి షోకాజ్ నోటీసు జారీ చేశారు. రెండు రోజుల గడువు: పీసీసీ నాయకత్వంపై రాజగోపాల్‌రెడ్డి గతంలోనే పత్రికా ప్రకటనలు ఇచ్చినట్లు తమకు అనేక ఫిర్యాదులు అందాయని షోకాజ్ నోటీసులో కమిటీ పేర్కొంది. ‘మరోమారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ మీరు అవమానకర రీతిలో మాట్లాడినట్లు మా దృష్టికి వచ్చింది. రాహుల్ గాంధీ నియమించిన పీసీసీ కమిటీలపైనా అసంబద్ధమైన, పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేసినట్లు నోటీసుకొచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఇటీవలే పార్టీకి వ్యతిరేకమైన ప్రకటనలను మీడియా ముఖంగా ఎవరూ చేయరాదని ఆదేశించారు. ఒకవేళ చేస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా మీరు బహిరంగంగా విమర్శలు చేసినందున ఆ వ్యాఖ్యలపై రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వండి. ఒకవేళ వివరణ ఇవ్వకుంటే పార్టీ నియమావళిని అనుసరించి మీపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద చర్యలు తీసుకుంటాం’అని క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్‌రెడ్డికి స్పష్టం చేసింది. ఘాటుగానే స్పందించిన ఉత్తమ్.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పార్టీలో చేరిన సందర్భంగా ఉత్తమ్ పరోక్షంగా రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమశిక్షణ, సమష్టి కృషితో ముందుకు పోవాలని రాహుల్ గాంధీ ఇటీవలే సూచించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ కార్యకర్తల చెమట, రక్తంతోనే పార్టీ నిలబడిందని, అందరి కృషితో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఆదర్శప్రాయుడు ..చామల
శాలిగౌరారం (నకిరేకల్) : ఆదర్శప్రాయుడు.. స్వాతంత్య్ర సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మూడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధి రామగిరిలో గల ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మృతదేహాన్ని గురువారం వారు వేర్వేరుగా సందర్శించి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొని యాడారు. తన మరణాంతరం మృతదేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోగార్థం కామినేని వైద్య కళాశాలకు అప్పగించేందుకు ముందస్తుగానే వీలునామా సిద్ధం చేసుకొన్న గొప్ప మానవతావాది అన్నారు. యాదగిరిరెడ్డి మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, రాష్ట్ర గిడ్డం గుల సంస్థ చైర్మన్ మందుల సామేల్, రాష్ట అటవీ అభివృద్ధిశాఖ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ అధి కార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర నాయకులు వేమవరపు మనోహరపంతులు, ఉమ్మడి రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ సీవీఎన్రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బోళ్ల నర్సింహారెడ్డి, మామిడి సర్వయ్య, జర్నలిస్టుల సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. -
సామాజిక న్యాయం జరుగుతుంది: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ ప్రకటించే శాసనసభ అభ్యర్థుల జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధ్యాన్యం లభిస్తుందన్న నమ్మకం ఉందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లోనూ రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పార్టీని గెలిపించి, సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతారన్నారు. -
భువనగిరిలో కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ
ఎంపీ కోమటిరెడ్డి, వ్యతిరేక వర్గీయుల పరస్పరం రాళ్లదాడి కానిస్టేబుల్ సహా ఏడుగురికి గాయాలు, లాఠీచార్జి పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు పోలీసుల రక్షణలో దూతను హైదరాబాద్‌కు తరలింపు భువనగిరి, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ వ ర్గాలు బాహాబాహీకి దిగాయి. ఏఐసీసీ దూత సమక్షంలోనే పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ సహా ఏడుగురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాలు.. వచ్చే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను ఎంపిక నిమిత్తం సోమవారం ఏఐసీసీ దూత సేవక్వాఘేను భువనగిరికి వచ్చారు. స్థానిక రహదారి బంగ్లాలో ఆయన నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న నేతలు తమ అనుచరులతో భారీగా తరలివచ్చారు. ఈ దశలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులతో బయటకు వెళ్తూ గెస్ట్‌హౌస్ ముందు కార్యకర్తలకు అభివాదం చేసి మాట్లాడుతుండగా, ఆయన వ్యతిరేక వర్గీయులు చెప్పులు విసిరారు. ఎంపీ వర్గీయులు ప్రతిగా అదేతరహాలో స్పందించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాటర్‌బాటిళ్లు, రాళ్ల వర్షం కురిసింది. భువనగిరి ఎంపీ కోమటిరెడి ్డకారు అద్దం పగిలింది. ఈ దాడిలో యాదగిరిగుట్ట కానిస్టేబుల్ కల్యాణ్‌తో సహా ఏడుగురు గాయపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు నారాయణరెడ్డి తదితరులు ఇరువర్గాల వారిని సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా, ఏఐసీసీ దూత వాఘేను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు పంపించారు. దాడిని నిరసిస్తూ ఇరువర్గాల ర్యాలీ పరస్పరం జరిగిన దాడులను నిరసిస్తూ ఇరువర్గాలు గాయపడిన కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీలు చేపట్టారు. ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వర్గీయులు రహదారి బంగ్లా నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దామోదర్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలపై దాడికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్యర్యంలో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అలాగే, దీనికి ప్రతిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.