కాంగ్రెస్‌పార్టీ ప్రకటించే శాసనసభ అభ్యర్థుల జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధ్యాన్యం లభిస్తుందన్న నమ్మకం ఉందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ ప్రకటించే శాసనసభ అభ్యర్థుల జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధ్యాన్యం లభిస్తుందన్న నమ్మకం ఉందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లోనూ రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పార్టీని గెలిపించి, సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతారన్నారు.