Social justice
-
World Day of Social Justice సామాజిక న్యాయం కావాలి!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపు మేరకు 2009 నుంచి ఫిబ్రవరి 20వ తేదీన ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవా’న్ని జరుపుతున్నారు. సమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహించడానికీ; పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించడం దీని వెనుక ఉన్న లక్ష్యం. ఈ ఏడాది ఉత్సవం సందర్భంగా... విద్యార్థులకు పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి వంటి సామాజిక న్యాయ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జాతి, లింగ, వయస్సు, లైంగిక ధోరణి, మతం, జాతీయత, విద్య, మానసిక లేదా శారీరక సామర్థ్యం వంటివాటిలో పక్షపాతం వల్ల ఈ అసమానతలు ఉత్పన్నమవుతాయి. సామాజిక న్యాయం లేక పోవ డానికి గల కారణాలలో వలసవాదం, బానిసత్వం, లేదా అణచివేత ప్రభుత్వాలకు మద్దతు, ఆర్థిక అధికార దుర్వినియోగం, జాత్యహంకారం, ఆర్థిక అసమానత, వర్గ వివక్ష ముఖ్యమైనవి. 2024 నాటికి, సామాజిక న్యాయం అందించడంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు: స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఐర్లాండ్. మానవ హక్కులు లేకపోవడం, న్యాయం పొందడం కష్టమవ్వడం, అవినీతి రాజ్యమేలడం వంటి అంశాల్లో ముందున్న దేశాలు వెనిజులా, కంబోడియా, అఫ్గానిస్తాన్, హైతీ, మయన్మార్లు.భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి అపారమైనది. అందుకే ‘భారత సామాజిక న్యాయ పితామహుని’గా అంబేడ్కర్‌ను గౌరవించుకుంటున్నాం. భారతదేశంలో రాజ్యాంగం పీఠిక సామాజిక న్యాయాన్ని సూచిస్తోంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో మూడు అంశా లను పేర్కొనాలి: ఒకటి – ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల రూపంలో రాజకీయ సామాజిక–ఆర్థిక హక్కులను కల్పించడం. ఇది సమాన స్వేచ్ఛా సూత్రాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది,రెండవది–సామాజిక–ఆర్థిక అభివృద్ధి మధ్య, విరుద్ధమైన సామాజిక– ఆర్థిక లక్ష్యాల మధ్య సమాన సంతులనాన్ని సాధించే నమూనాను అవలంబించడం. మూడవది – భారతీయ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు నిశ్చయాత్మక చర్యలను అందించడం.ఇందుకోసం దేశంలో ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు, పథకాలు, చట్టాలు రూపొందించి అమలు చేయడం. – డా. పి.ఎస్. చారి ‘ 83090 82823(ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం) -
#HBDYSJAGAN అక్కాచెల్లెమ్మలకు అండగా, జగన్ మామగా..!
వైఎస్ జ‘గన్’.. ఆ పేరులోనే ఉంది డైనమిజం. జగన్ అంటే జన ప్రభంజనం. జగనన్నగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి రాజకీయ చతురతతో, పాలనా దక్షతతో అనతి కాలంలోనే డైనమిక్ లీడర్‌గా ఎదిగి, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరిగా గుర్తింపు పొందిన తీరు ఆదర్శప్రాయం.మహిళల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ది ముడి పడి ఉందని నమ్మి అక్క చెల్లెమ్మల సంక్షేమమే ఊపిరిగా, మున్నపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఆడబిడ్డకు ప్రయోజనం చేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు జగనన్న. ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో విద్యార్థినులు విజయపతాకను ఎగురేసేలా విప్లవాత్మక అడుగు వేశారు ‘జగన్ మామ’. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన చరిత్ర ఆయనది. అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నావడ్డీదాకా, జగనన్న పెళ్లి కానుక, ఇంకా పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చారు. అంతేకాదు రాజకీయంగా అన్ని స్థాయిల్లోనూ మహిళా నేతలకు పదవులు కట్టబెట్టడమే కాకుండా తన కేబినెట్లో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. మహిళా భద్రతకు భరోసా ఇచ్చిన ‘దిశ యాప్’ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.అంతేనా.. 2019 ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ 'నవరత్నాలు' అమలుతో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చిన జననేత. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం చేత జన నీరాజనాలు అందుకొని, సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొంది, రాజకీయ జీవితంలో శిఖరాలను అధిరోహించినా... ఆయన చూపు జనం మీదనే. ఏ కష్టం కాలం వచ్చినా, తక్షణమే బాధితులకు అండగా నిలబడ్డారు. అకాల వర్షాల్లో రైతులకు భరోసా ఇచ్చినా, వరదల్లో బాధితులకు నేనున్నాంటూ అండగా నిలబడినా, విద్యార్థులకు, మహిళలకు, ఒకరనేమిటి, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు నభూతో నభవిష్యతి. రాజకీయ జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఒదిగి ఉండే నైజం ఆయనది. అంతేకాదు తాజా ఎన్నికల్లో ఊహించని పరాజయం ఆయన ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఈ పరిణామానికి సాకులు వెదకలేదు. ఎవర్నీ నిందించలేదు. అత్యంత నిబ్బరంతో ప్రజల ముందుకొచ్చిన వైనమే ఇందుకు నిదర్శనం.పదవి, అధికారంతో సంబంధం లేకుండా, తానెప్పుడూ బాధితుల పక్షమేననీ, జనంతోనే పయనం, జనం కోసమే పోరాటం అంటూ ప్రకటించిన పోరు పతాక వైఎస్ జగన్. అన్నమాట ప్రకారమే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటూ, ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న జననేత జగన్. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై గళం విప్పడంలో మహిళలకు అండగా నిలబడటంలో అప్పుడూ, ఇప్పుడూ అదే తెగువ.. అదే నిబద్ధత!అప్పుడైనా,ఇప్పుడైనా, ఎప్పుడైనా... జగన్ అంటే జనప్రభంజనం అంటోంది బడుగు బలహీన లోకం.ఆనాటి పాదయాత్ర నుంచి నిన్నామొన్నటి కర్నూలు పర్యటన దాకా జగన్ వెంటే జనం, జనంతోనే జగన్ అంటోంది మహిళాలోకం.జగన్ మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటోంది చిన్నారి లోకం. -
Lok sabha elections 2024: ‘ఎక్స్–రే’పై మాట మార్చిన రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిర చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే(ఎక్స్–రే) నిర్వహిస్తామంటూ ఈ నెల 7న తాను చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతోపాటు తీవ్ర విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు. బుధవారం ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ మాట మార్చేశారు. ఈ సర్వే ప్రజల ఆస్తులను గుర్తించడానికి కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఏ మేరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడమే సర్వే ఉద్దేశమని స్పష్టం చేశారు.సర్వే విషయంలో తన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక, సంస్థాగత సర్వే చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాను ఏనాడూ చెప్పలేదని పేర్కొన్నారు. సర్వేపై తాను మాట్లాడగానే ప్రధాని మోదీ తీవ్రంగా స్పందిస్తున్నారంటే సంపద పంపిణీలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అన్యాయానికి గురైన వర్గాలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.ఆర్థిక, సంస్థాగత సర్వే చేపట్టడం దేశాన్ని కూల్చేసే కుట్ర ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. సర్వే జరిగితేనే అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశభక్తులం అని చెప్పుకుంటున్న కొందరు ప్రబుద్ధులు సర్వే అనగానే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 90 శాతం మందికి అన్యాయం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం జరగాల్సిందేనని తేలి్చచెప్పారు. దేశంలో ప్రజల మధ్య సంపద పంపిణీ ఏ రీతిలో జరిగిందో నిర్ధారించడానికి తమ ప్రభుత్వ హయాంలో ఎక్స్–రే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
Rahul Gandhi: కులగణనను ఏ శక్తీ ఆపలేదు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనను ఏ శక్తీ ఆపలేదని ప్రకటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ‘‘ నాకు కులం పట్టింపు లేదు. కానీ న్యాయం విషయానికొచ్చేసరికి దేశంలో అన్యాయమైపోయిన 90 శాతం జనాభాకు న్యాయం దక్కేలా చూడటమే నా జీవిత లక్ష్యం. మా ప్రభుత్వం ఏర్పడగానే మేం చేసే మొట్టమొదటి పని కులగణన జరిపించడమే.మోదీ అస్తవ్యస్తపాలనలో దాపురించిన ఆదాయ అసమానతల గురించే కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. మోదీ అత్యంత మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు బదిలీచేసిన రూ.16 లక్షల కోట్ల మొత్తంలో కాంగ్రెస్ కొంతైనా ఈ 90 శాతం పేదలకు అందేలా చేస్తుంది. లెక్కలు కట్టాం. ఇదే న్యాయం అని భావించాం. అందుకే ఈ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాం’’ అని రాహుల్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాన్‌సీరియస్ నేతనా?‘‘పూర్తిగా రాజకీయాలకు అంకితంకాని నేత అని రాహుల్‌పై బీజేపీ చేసిన విమర్శలకు రాహుల్ ధీటుగా బదులిచ్చారు. ‘‘ గ్రామీణఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, ఉత్తరప్రదేశ్‌లో భట్టా, పార్సౌల్ గ్రామాల వద్ద భూసేకరణ ఉద్యమం, నియాంగిరీ హిల్స్ వివాదం ఇలా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషిచేశా. ఉద్యమాలను ముందుండి నడిపించా. ఇవన్నీ మీడియాకు నాన్‌సీరియస్ అంశాలేకదా. సీరియస్ అంశాలుగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విరాట్ కోహ్లీల గురించి మీడియా చూపిస్తుంది. 90 శాతం జనాభా గురించి పట్టించుకునే వ్యక్తిని నాన్‌సీరియస్ నేత అని అంటారా?’’ఓబీసీ, దళితులు, గిరిజనుల ప్రాతినిధ్యమెక్కడ?‘‘ మీడియారంగంలో ఓబీసీ, దళితులు, గిరిజనుల చేతుల్లో ఉన్న ఒక్క మీడియా సంస్థనైనా చూపించండి. ఒక్కరు కూడా లేరు. మీ ప్రాతినిధ్యం మీడియాలో లేదు. న్యాయవ్యవస్థలోనూ దాదాపు అంతే. 650 మంది హైకోర్టు జడ్జీల్లో 90 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించేది కేవలం 100 మందే. దేశంలోని 200 అగ్రశ్రేణి సంస్థల్లోనూ దళితులు, గిరిజనులు, ఓబీసీలు లేరు’’ దేశాన్ని విడగొడుతున్నానట!‘‘అన్యాయం జరిగితే ఏ మేరకు అన్యాయం జరిగిందో తెల్సుకుంటాం. ఒక వ్యక్తికి అంతర్గత గాయమైతే ఎక్స్–రే తీయడంలో తప్పులేదుగా. అలాగే కులగణన ఎక్స్–రే అవసరమని నేను అనగానే జాతీయ మీడియా, నరేంద్ర మోదీ ఏకమైపోయి నేనేదో దేశప్రజలను విభజిస్తున్నట్లు విష ప్రచారం మొదలెట్టారు. అన్ని కులాల ప్రాతినిధ్యం ఎలా ఉందో తెలియాలంటే ఎక్స్–రే అవసరమని దేశభక్తులంతా భావిస్తారు. దేశాన్ని సూపర్‌పవర్‌గా మార్చాలనే ఈ దేశభక్తుడు(మోదీ) మాత్రం ఈ ఎక్స్–రే పేరు వింటేనే భయపడుతున్నారు’’ కులాలే లేనప్పుడే మీరెలా ఓబీసీ అయ్యారు?‘‘ గత పదేళ్లు తాను ఓబీసీ వ్యక్తినని మోదీ ఘంటాపథంగా చెప్పారు. తీరా నేను కులగణన ప్రస్తావన తీసుకురాగానే దేశంలో కులాలే లేవని మాట మార్చారు. మరి అలాంటపుడు మీరు ఓబీసీ ఎలా అయ్యారు? మళ్లీ ఆయనే దేశంలో రెండే కులాలున్నాయని సెలవిచ్చారు. పేద, ధనిక కులాలు అని. పేదల జాబితాను పరికిస్తే దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలే కనిపిస్తాయి. ఈ 90 శాతం జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం’’రామమందిరం, పార్లమెంట్లో మా వ్యక్తులెక్కడ? ‘‘ సమస్య నుంచి కొంతకాలమే దృష్టి మరల్చగలరు. ఓబీసీలు మిమ్మల్ని నిలదీసే సమయం వచి్చంది. రామమందిరం పూర్తయింది అక్కడ మా(దళితులు, గిరిజనులు) వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించారు. మా వాళ్లు ఒక్కరైనా ఉన్నారా?. ఒక్కరినైనా ఆహా్వనించారా? గిరిజన మహిళా రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్‌లను ఎందుకు రానివ్వలేదు?’’ఆర్థిక, వ్యవస్థాగత సర్వేలూ కలిపే..‘‘ మేం అధికారంలోకి వస్తే కులగణనతోపాటే ఆర్థిక సర్వే చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్రంగాలుసహా అన్ని రంగాల్లో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఎంత ఉందనేది తెలిపే ఇన్స్టిట్యూషనల్ సర్వేనూ చేస్తాం. కులగణనను ఏ శక్తీ ఆపలేదు. ఎంత గట్టిగా నిలువరిస్తే అంతే బలంగా ప్రతిఘటిస్తాం’’ -
బీసీలకు కూటమి వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బీసీలు మా పార్టీకి బ్యాక్ బోన్’ అంటూ వెనుకబడిన తరగతుల వారికి దశాబ్దాలుగా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇందుకు విజయనగరం లోక్‌సభ నియోజకవర్గమే ప్రత్యక్ష నిదర్శనం. తమకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కొప్పుల వెలమలు కూటమిపై కత్తులు నూరుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రెస్మీట్లు పెట్టిమరీ హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బీసీ సామాజిక వర్గాలదే అగ్రభాగం. వాటిలో తూర్పుకాపు, కొప్పుల వెలమ సామాజికవర్గాలు అత్యంత ప్రధానమైనవి. కానీ చంద్రబాబు అత్యంత స్పల్ప సంఖ్యలో ఉన్న పెత్తందారులకే పెత్తనం ఇస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగూ రిజర్వ్డ్ నియోజకవర్గాలే అయినప్పటికీ అక్కడ బీసీ సామాజిక వర్గాలు నిర్ణాయక శక్తిగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ రాజాం అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరు ఎచ్చెర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలే అధిక శాతం ఉన్నారు. తూర్పుకాపులు రాజాం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, నెల్లిమర్లలో, కొప్పుల వెలమలు బొబ్బిలి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారు. తమ పార్టీకి బీసీలే వెన్నెముక అంటూ వారిని అవసరానికి ఉపయోగించుకోవడం.. ఎన్నికలు వచ్చేసరికి పెత్తందారులకే పెద్దపీట వేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ‘కాపు’లకు ‘కమ్మ’ని దెబ్బ... టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు ఈ సారి కూడా ఎచ్చెర్ల నుంచే సీటు ఆశించారు. స్థానిక టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. వారిద్దరూ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారే. కానీ చాపకింద నీరులా కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదుటి ఈశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చలువతో ఎచ్చెర్ల సీటు ఎగురేసుకుపోయారు. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం వారు పట్టుమని వెయ్యి మంది లేకపోవడం విశేషం. కిమిడి కళావెంకటరావును చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించారు. అక్కడ పదేళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్న ఆయన సొంత సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున రాజకీయ భవిష్యత్తును నాశనం చేయించారు. సామాజిక న్యాయం హుష్‌కాకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్న విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కనిపించలేదు. కొప్పుల వెలమ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ను పట్టుమని వెయ్యి మంది జనాభా కూడా లేని వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందిన బేబీనాయనకు చంద్రబాబు ఇచ్చారు. గజపతినగరం టికెట్ కొప్పుల వెలమకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడుకి ఇస్తామని అక్కడా మొండిచేయిచూపారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పుకాపు నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను అక్కడి నుంచి తప్పించేందుకు చీపురుపల్లి టికెట్ ఇస్తామని ఒకసారి, గజపతినగరం సీటు కేటాయిస్తామని మరోసారి చెబుతూ ఆశలపల్లకిలో ఊరేగించారు. తీరా టికెట్ల కేటాయింపు వచ్చేసరికి ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీచేయబోనని అశోక్ గజపతిరాజు చేతులెత్తేసిన నేపథ్యంతో తనకు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని మీసాల గీత ఆశించారు. అయితే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన అశోక్ కుమార్తె ఆదితికే చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. నెల్లిమర్లలో జనసేనతో పొత్తు ధర్మం పేరుతో బ్రాహ్మణ (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి టికెట్ ఇచ్చి అక్కడ తూర్పుకాపులను దెబ్బకొట్టారు. -
సాటి లేని సామాజిక న్యాయం
తాజాగా వైఎస్సార్సీపీ ప్రకటించిన లోక్‌సభ స్థానాల్లో 11 బీసీలకు కేటాయించారు; అలాగే 59 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 100 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంతటి ప్రాతినిధ్యం వారికి లభించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారంలో, బడ్జెటులో, సంపదలో, గౌరవంలో, విద్యా, ఉద్యోగాలలో జనాభా కంటే ఎక్కువ వాటా యిచ్చి సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర పురుషుడు జగన్. అంతేగాకుండా, వివిధ విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. ఇది జగన్‌కు జనం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 71 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోలేదు. ఆ కులాల అభివృద్ధిలో జగన్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైసీపీ రెండేళ్ల క్రితమే రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వే షన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టి, దీనికి 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడింది. విశేషం ఏమిటంటే, గత 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణి అవుతున్న డీఎంకే, అన్నా డీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, అప్నా దళ్, జనతాదళ్ కూడా ఈ బిల్లు పెట్ట లేదు. చారిత్రక ఘట్టం ఇటీవల 18 ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, అందులో 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం)... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మెనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యుటీ సీఎం పద వులు ఇస్తే... నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం ఇదే ప్రథమం. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పను లలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో మొత్తం 100 శాతం పోస్టులు బీసీలకు కేటాయించారు. 193 కార్పొరేషన్లలో బీసీలకు 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. నామినే టెడ్ పదవులలో 50 శాతానికి చట్టం చేయడమే కాదు; అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. దీని మూలంగా ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగాయి. తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం పోయి, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. వేష భాషలు, నడవడి, సంస్కృతి మూలంగా సమగ్రంగా మారి ఆధునీకరణ చెందుతారు. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులుంటే... అందులో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకూ, మండలి డిప్యుటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి సుప్రీంకోర్టు తగ్గిస్తే, పార్టీ పరంగా అదనంగా 20 శాతం కలిపి, మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా, అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో, వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే, అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు కేటాయించారు(67 శాతం). 13 మున్సిపల్ కార్పొరేషన్లలో, 92 శాతం మేయర్ పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 60 శాతం వీరికే కేటాయించారు. గ్రామ – వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఈ వర్గాలవారే. ఈ 57 నెలల్లోనే మరో 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకొని 6.03 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ 75 శాతం వాటా ఈ వర్గాలదే. దీర్ఘ దృష్టి విద్య ద్వారానే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయనీ, వారికి గౌరవం పెరుగుతుందనీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నారు జగన్. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మఒడి పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి వరకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీని వలన ప్రతి ఒక్కరు చదువుకుంటు న్నారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర ఉన్నత చదువులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ఇచ్చేటట్లు జీవోలు జారీ చేశారు. పాలకులు ఓట్లు వస్తాయనే ఆశతో జనాకర్షక పథకాలు పెడతారు. దీర్ఘకాలంలో సమాజ శ్రేయస్సు ఎలా సాధ్యమవుతుందని ఆలోచించరు. కానీ జగన్ వివిద విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందు చూపుతో, విజన్‌తో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. ఇది జగన్‌కు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఉన్నత విద్య వలన జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. సమాజంలో ప్రతి పౌరుడు సభ్యతతో, సంస్కారంతో, ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తాడు. దీని మూలంగా వైద్యం, ఆరోగ్యంపై పెట్టే బడ్జెట్ తగ్గుతుంది. శాంతిభద్రతలు కూడా చక్కగా ఉండటంతో పోలీసు శాఖపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఒక తరపు పెట్టుబడి ఇంజినీరింగ్, ఇతర పీజీ కోర్సులు, మెడిసిన్ చదివేవారు విదేశా లకు వెళ్లి, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఆఫ్రికా, యూరోపియన్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్నారు. దీని మూలంగా దేశానికి, రాష్ట్రానికి విదేశ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తుంది. చదువు ద్వారా పొందిన జ్ఞానంతో ఆధునిక వ్యవసాయం చేస్తే అధిక ఉత్పత్తి సాధించడానికి వీలు కలుగుతుంది. దీనిమూలంగా ఆ యా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సమాజ కోణంలో చూస్తే, ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఆ కుటుంబం ప్రభుత్వ రాయి తీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. పదేళ్లలో 40 శాతం, మరో పదేళ్లలో మరో 50 శాతం, మొత్తంగా 20 ఏళ్లలో 90 శాతం మంది సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి చేరిపోతారు. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 90 శాతం తగ్గిపోతుంది. ఒక తరంపై ఖర్చుపెడితే రెండవ తరానికి ఈ విద్యా పథకం స్కీముల అవసరం ఉండదు. పేదరికం ఉండదు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ); జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ‘ 90000 09164 -
జగన్‌ను చూసి నేర్చుకోండి
ముషీరాబాద్ (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సామాజిక న్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం విషయంలో అక్కడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు కేటాయించి ఔరా అనిపించుకున్నారని ప్రశంసించారు. 2019తో పోలిస్తే అత్యధికంగా బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, మహిళలకు 19 టికెట్లు కేటాయించారని కొనియాడారు. రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి 37 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటిస్తే 17 అగ్రకులాలకు ఇచ్చారని, 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 13, 12 శాతం ఉన్న ఎస్టీలకు మూడు, 20 శాతం ఉన్న ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క చైర్మన్ పదవిని ఇచ్చారని తెలిపారు. దీన్ని బట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని అర్ధమవుతోందన్నారు. ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి, 37 చైర్మన్ పోస్టులలో ఒక్కటి కూడా ఓయూ ఉద్యమకారులకు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. -
సామాజిక న్యాయమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ
-
అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్‌కే ఉంది!
సాక్షి, అమరావతి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంతో రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు సింహభాగం అవకాశాలతో దూసుకెళుతుండటం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని జగన్ స్పష్టం చేశారు. తొలి మంత్రివర్గం ఏర్పాటులోనే దీన్ని రుజువు చేశారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రతి అడుగులో ఆచరిస్తూ సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాజ్యాధికారంలో వాటా.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురికి (80 శాతం) ఆయా వర్గాల నుంచే అవకాశం కల్పించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించగా శాసన మండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకు అవకాశమిచ్చారు. మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ కాగా అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే చంద్రబాబు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించేలా సీఎం జగన్ బాటలు వేశారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ(డీబీటీ) రూపంలో రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. ఇక ఇతర పథకాల ద్వారా (నాన్ డీబీటీ) రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదలకు రూ.4.13 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించాయి. పేద బిడ్డలకు పెద్ద చదువులు.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విప్లవాత్మక సంస్కరణలతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించేందుకు మార్గం సుగమం చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో గత 56 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షల ఉద్యోగాలున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే 80 శాతం ఉద్యోగాలు దక్కాయి. దీన్ని పరిశీలిస్తే ఆయా వర్గాలు విద్యా సాధికారత సా«ధించినట్లు స్పష్టమవుతోంది. మహిళా సాధికారతలో అగ్రగామి.. వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా సీఎం జగన్ మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670 కోట్ల విలువైన ఇంటి స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేశారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. హోంమంత్రిగా ఎస్సీ మహిళకు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవులు, పనులు 50% మహిళలకే ఇవ్వాలని దేశ చరిత్రలో తొలిసారిగా చట్టం చేసి మరీ మహిళలకు న్యాయం చేశారు. మహిళా సాధికారతలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్థానిక సంస్థల్లో సంచలనం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే దీనిపై చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ పార్టీ పరంగా తాము 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులిచ్చారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరగ్గా 637 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఏకంగా 9 పదవులు (69 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 14 మేయర్ పదవుల్లో 12 పదవులను (86 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరగ్గా 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. చారిత్రక చట్టం.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే 280 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. -
సామాజిక న్యాయంతో కొత్త సమన్వయకర్తలు
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయం అనేది నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటిచెప్పారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పిన సీఎం జగన్ తాజాగా 11 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తల నియామకంలోనూ అదే విధానాన్ని పాటించారు. ప్రస్తుతం అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. మంత్రులు విడదల రజని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్పు చేశారు. మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యంగా.. ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సీఎం వైఎస్ జగన్ సమాయత్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను శాస్త్రీయంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మార్పుచేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 నియజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కుమారుడు, నియోజకవర్గ సమన్వయర్త దేవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినిని నియమించారు. ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్‌నాయుడిని నియమించారు. -
సామాజిక న్యాయానికి ప్రభుత్వం పెద్దపీట
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల పక్షపాతి అని వారికి చేసిన మేలుతో రుజువైందని తెలిపారు. విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాలులో బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ఐక్యత–సమగ్రాభివృద్ధి అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేలు జరిగితేనే ఓటువేయండని అడిగే దమ్ము కేవలం ఒక్క జగన్‌కే ఉందన్నారు. సంక్షేమ పథకాల్లో అవినీతి కనుమరుగైందని, దాదాపు రూ. 2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు చేరిందని చెప్పారు. సామాజిక సాధికార యాత్రకు విశేష ఆదరణ వస్తోందని సజ్జల తెలిపారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేశామన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని అన్నారు. మహిళలకు 50 శాతంపైగా రిజర్వేషన్లను అమలు చేస్తూ రాజకీయ పదవుల్లో కూర్చోబెట్టామన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి అన్నారు. జనాభా ఆధారంగా చట్టసభల్లో రిజర్వేషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నా కూడా బీసీలకు ఇప్పుడు జరుగుతున్నంత మేలు చేయరేమోనని జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీసీలకు పటిష్టంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర రాజధానిలో బీసీ భవన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 2 వేల గజాలు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సదస్సుకు ముందు మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్రావు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు, డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వరి, బీసీ నేతలు ధనలక్ష్మి, బొడ్డు కృష్ణ భగవాన్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం
సాక్షి, చిత్తూరు: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అన్నింటిలోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. సామాజిక సాధికారత సాధించిన తరువాతే ప్రజల వద్దకు బస్సు యాత్ర ద్వారా వస్తు న్నామన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరంలో అశేష జనం మధ్య జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు మేలు చేశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. 1931 తర్వాత బీసీ కులగణన జరగలేదని, మళ్లీ ఇప్పుడే సీఎం జగన్ దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీసీ కులగణనకు పచ్చ జెండా ఊపారని కొనియాడారు. టీడీపీ పాలనలో సామాజిక న్యాయం ఎండమావిగా ఉండేదన్నారు. పైగా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను చంద్రబాబు సహా టీడీపీ నేతలు చులకన చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలనూ వైఎస్సార్సీపీ గెలవడం తథ్యమని చెప్పారు. మైనారిటీలను మోసం చేసిన టీడీపీ: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మైనారిటీలకు తీరని మోసం చేశారని విమర్శించారు. సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని బాధ్యతగా భావించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని, ఇందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎంను చేశారని, ఇది చరిత్రలో నిలిచిపోయే విషయమన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకొచ్చి, మొక్కుబడిగా ఓ మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. అందుకు భిన్నంగా సీఎం జగన్ మొదటి కేబినెట్లోనే మైనారిటీ సామాజికవర్గానికి అవకాశం కల్పించారని తెలిపారు. మైనారిటీ మహిళను శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేశారన్నారు. టీడీపీ పాలనలో మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ.2,665 కోట్లే ఖర్చు చేశారని, సీఎం జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.23,176 కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. బీసీ పార్టీగా డప్పు వాయించుకునే టీడీపీ బీసీలను దగా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీసీలను వాడుకొని, తరువాత తీసి పడేసేదని అన్నారు. వైఎస్ జగన్ రాకతో బీసీలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితోపాటు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికే ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల అభివృద్ధికి సీఎం జగన్ నిరంతర కృషి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగనన్న నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాజకీయ సమానత్వం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులను రెచ్చిగొట్టి చంద్రబాబు విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వారిని కనీసం పరామర్శించలేదని చెప్పారు. పైగా, చిత్తూరు జిల్లా ఎస్పీ, పోలీసుల అంతు చూస్తామని నారా లోకేశ్ అనడం దుర్మార్గమన్నారు. -
ప్రజల్లోకి మరింత ఉధృతంగా..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత 52 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక మార్పులతో సు పరిపాలన ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చాటిచెప్పడానికి పార్టీ శ్రేణులు మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రాంతీయ సమ న్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ ప్రతినిధుల సదస్సులో నిర్దేశించిన అంశాలపై నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే. దసరా తర్వాత ఈనెల 26 నుంచి సామాజిక న్యాయ యాత్ర పేరుతో 3 ప్రాంతాల్లో చేపట్టే బస్సుయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రతినిధుల సద స్సులో నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై వారితో చర్చించి.. వాటిని ప్రజల్లోకి ప్రభావవంతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఇది నా పార్టీ అని పేదలు భావించాలి.. దసరా ముగిశాక.. అక్టోబర్ 26 నుంచి సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సుయాత్ర మొదలు పెట్టాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ సూచించారు. ఈ యాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమిస్తామన్నారు. ఈ యాత్ర సందర్భంగా మూడు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగసభల ఏర్పాట్లను సమన్వయపరచడానికి కూడా ముగ్గురు బాధ్యులను నియమిస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఒక్కోటి చొప్పున ప్రతిరోజూ 3 సమావేశాలు నిర్వహించాలని స్పష్టంచేశారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమావేశాలు విజయవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడతారని చెప్పారు. 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ సమావేశాల ద్వారా వివరించి.. ఆ వర్గాలకు పార్టీని మరింత చేరువ కావాలన్నారు. పేదవాడు మన పార్టీని తన పార్టీగా ఓన్ చేసుకునేలా బస్సుయాత్రలు ప్రభావంతంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలన్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారుచేసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్ సూచించారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలన్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ అవగాహన కల్పించాలి.. విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయిలో కూడా అవగాహన కల్పించాలని ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశాలకు గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు హాజరయ్యేలా చూడాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి.. ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
అలవోకగా అబద్ధాలు రామోజీకే చెల్లు
ఏది నిజమో.. ఏది అబద్ధమో కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ ఈనాడు రామోజీ మాత్రం వాస్తవాలకు గంతలు కడుతున్నారు. తన ఆత్మీయుడు చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టాలనే ఆత్రంతో అన్నీ విప్పేయడానికి ఏమాత్రం సందేహించడం లేదు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో విజనరీ అయిన చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తప్పుడు రాతలు రాయడంలో రామోజీ ఆరితేరిపోయారు. ప్రజలేమనుకుంటారనే విషయాన్ని ఎప్పుడో గాలికొదిలేశారు. ప్రతి కథనంలో సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై అసూయ, కడుపు మంట స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతగా బురద చల్లినా ఇవి ‘వైస్రాయ్’ నాటి రోజులు కావని తెలుసుకోండి రామోజీ! సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంపై అలవోకగా అబద్ధాలంటూ ఈనాడు రామోజీ దుష్ప్రచారం ఆయన దిగజారుడు తనానికి పరాకాష్ట. ఒక పత్రికగా ఈనాడు ఎంతగా దిగజారిపోయిందో చెప్పేందుకు ఇదే కొలమానం. కనీస విలువలకు పాతర వేసి మరీ అనైతిక కథనంతో అక్కసు వెళ్లగక్కారు. నాలుగేళ్లలో వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని, అందుకున్న లక్ష్యాలను వివరణాత్మకంగా, నిర్ధారిత గణాంకాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. ఈ అంశాలను నిర్మాణాత్మకంగా ఎత్తిచూపే అవకాశం లేక గాలిని పోగుచేసి, చిల్లర మాటలతో, అసూయ, కడుపు మంటలను కలబోసి.. చంద్రబాబు కోసం తప్పదన్నట్లు కథనాన్ని ప్రచురించారని ఇట్టే అర్థం అవుతోంది. రామోజీ.. సూటిగా సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి ప్రసంగంలో చెప్పిన అంశాల్లో ఒక్కటైనా తప్పని, అవాస్తవమని చర్చకు రాగలరా? రాష్ట్ర మంత్రివర్గంలో 68 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారేనని.. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఆయా వర్గాలకు చెందినవారేనన్న దాంట్లో ఒక్క అక్షరమైనా అవాస్తవం ఉందా? ఈ వర్గాలకు ఇలా రాజకీయ అధికారం దక్కడమే మీ ద్వేషానికి కారణమా? వీరంతా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ప్రభుత్వ పాలనా యంత్రాంగంతో మమేకం అవుతుంటే, మునుపెన్నడూ లేని రీతిలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మీకు వచ్చేది కడుపుమంటకాక మరేమిటి రామోజీ? అసూయ, ద్వేషం.. మేనిఫెస్టోలో ఈ హామీలు ఇచ్చాం. వీటిని నెరవేర్చాం.. అని ఈ మంత్రులే కాదు, ఈ వర్గాలకు చెందిన వారు గడప గడపకూ భరోసాగా వెళ్తుంటే, వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అక్కడికక్కడే సరిదిద్దుతుంటే మీకు నచ్చడం లేదు. ఇది వాస్తవం. అందుకే సీఎం జగన్ పట్ల మీకు అసూయ, ద్వేషం. మైనారిటీ, ఎస్టీలకు చివరి నెల వరకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా నాటి బాబు పాలనలో మీకెందుకు కనిపించలేదు రామోజీ? నాడు సీఎం కుర్చీ మీద మీ బాబు ఉన్నాడనే కదా! బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ద్రోహి అయిన చంద్రబాబును భుజానికెత్తుకుని ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? 14 ఏళ్ల బాబు పాలనలో ఈ వర్గాలకు చేసిందేమిటి? వీరందరూ కనిపించడం లేదా? వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ కులానికి చెందిన మోషేన్‌రాజు, మండలి డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీకి చెందిన మహిళ జకియా ఖానమ్ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలు మేకతోటి సుచరిత, తానేటి వనితలు హోంమంత్రులయ్యారు. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ లాంటి ఉన్నత శాఖలు ఎస్సీ అయిన ఆదిమూలపు సురేష్‌కు ఇచ్చారు. ఎస్టీ అయిన రాజన్నదొరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. బీసీ కులానికి చెందిన బూడి ముత్యాలనాయుడుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. బీసీ అయిన విడదల రజనికి కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పగలదు. రైతుల్లో భరోసాతో బాబు, రామోజీల బెరుకు మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇచ్చిన హామీకంటే మిన్నగా అమలు చేస్తోంది. విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు తోడుగా నిలుస్తుంటే, ఈ విధానాలతో రైతుల్లో భరోసా నింపితే సహజంగానే చంద్రబాబు, రామోజీరావుకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో పంట నష్టపరిహారం, ఆక్వా జోన్లలో రూ.1.5కే కరెంటు, పాడి రైతుకు పాల వెల్లువ ఇలా ప్రతి కార్యక్రమంలో ప్రగతి వీరికి కంటగింపే. అందుకే రైతు భరోసా విషయంలో పసలేని, పనికిమాలిన వాదనను లేవనెత్తారు. మేనిఫెస్టోలో సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏడాదికి రూ.12,500, నాలుగేళ్లపాటు ఇస్తామని. కానీ ఇస్తున్నది రూ.13,500, నాలుగేళ్లు స్థానంలో ఐదేళ్లుపాటు ఇస్తున్నారు. ఇచ్చిన హామీ కన్నా మిన్నగా ఇస్తే తప్పని రామోజీరావు సొంత భాష్యం చెబుతుండటం దుర్మార్గం. కేంద్ర నిధులు కలుపుకుని ఎలా చెబుతారని రామోజీ వింత ప్రశ్న వేశారు. బాబు సొంత జేబు నుంచి ఖర్చు చేశాడా? అసలు బడ్జెట్ అంటే ఏంటి రామోజీ? నిధులు ఎలా వస్తాయో.. ఎలా ఖర్చు చేస్తారో తెలియదా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు, ఆర్థిక సహాయం, అలాగే రాష్ట్రానికి సొంతంగా వచ్చే ఆదాయాలు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలు.. ఇవన్నీ కలిపి బడ్జెట్ అంటారు. ఏ స్కీమైనా అమలు చేసేది ఈ వనరులతోనే. అలాంటప్పుడు వేర్వేరుగా చూడ్డం అన్నది మీ సంకుచిత బుద్ధి కాదా? చంద్రబాబు హయాంలో ఇలా కాకుండా బడ్జెట్లు వేరేలా ఉండేవా? బాబు సొంత జేబు నుంచి ఖర్చు చేశాడా? శాశ్వత ఉద్యోగులు కనిపించడం లేదా? గ్రామాల్లో పరిపాలన నిర్వీర్యమైనట్టుగా మరో విచిత్ర వాదనను రామోజీ లేవనెత్తారు. గ్రామాలను పునరుజ్జీవింపచేసేలా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గతంలో ఎప్పుడైనా, దేశంలో ఎక్కడైనా జరిగాయా? మన గ్రామంలోనే 10 నుంచి 11 మంది శాశ్వత ఉద్యోగులు సేవలందించడం ఎక్కడైనా జరిగిందా? ప్రతి 50 ఇళ్లకు ఇక వలంటీర్ చొప్పున వారి గడప వద్దకే సేవలు అందించడం ఎప్పుడైనా చూశారా? ఇంతగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతుంటే పల్లెలు వెలిగినట్టా? నిర్వీర్యమైనట్టా? ఒక గ్రామ, వార్డు సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్, నాడు– నేడు ద్వారా రూపు దిద్దుకున్న పాఠశాల, మెరుగులు దిద్దుకున్న అంగన్ వాడీ, రైతు భరోసా కేంద్రం.. ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గ్రామాలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తుంటే.. వాటిని నిర్వీర్యంగా చూడ్డం మీ సంకుచిత బుద్ధికి నిదర్శనం. బీసీలు క్రియాశీలకం కావడంతో కంటగింపు కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాయని రామోజీ అక్కసు వెళ్ల్లగక్కారు. నిజానికి సామాజిక చైతన్యంలో భాగంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లను వైఎస్ జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా కులాలకు చెందిన 56 మంది ఛైర్మన్లుగా నియమింపబడ్డారు. మరో 672 మంది డైరెక్టర్లు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత మంది బీసీలకు పదవులు దక్కడం, వారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో మమేకమై ప్రజా ప్రయోజనాలకు కృషి చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? వివిధ ప్రభుత్వ పథకాలకు నిధులు ఈ కార్పొరేషన్ల ద్వారా వెళ్లి, ఆయా కులాలకు న్యాయం జరిగితే మీకు బాధ ఏమిటి రామోజీ? ఇంత ప్రక్రియ కనిపిస్తుంటే క్రియాశీలకంగా లేనట్టా? రూ.2.33 లక్షల కోట్ల డీబీటీలో ఈ కులాల పాత్ర లేదా? పరిశ్రమలపైనా ఏడుపే.. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు ఏంటో రామోజీరావు చెప్పాలి. చంద్రబాబు ఊహాజనిత పరిశ్రమలు వెళ్లిపోయాయా? ఆయన పేపర్ల మీద కలలుగన్న పరిశ్రమలు వెళ్లిపోయాయా? 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 127 భారీ పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 67,196 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 84,607 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. మరి ఈ గణాంకాలతో విభేదించే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా రామోజీ? ఈ పరిశ్రమలు రాలేదని ఆధారాలు చూపించగలరా? రూ.18 లక్షల కోట్లు విలువైన పరిశ్రమలు వచ్చేశాయని కాగితాలపై కల్లబొల్లి ఒప్పందాలు చూపించి, పరిశ్రమలు వచ్చేసినట్టుగా చంద్రబాబు చెప్తే అవి నిజాలని మీరు ప్రజలను నమ్మించడానికి విఫలయత్నం చేయడం నిజం కాదా? పోలవరం పాపం బాబుది కాదా? పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి పాపం ఎవరిది? ఎప్పుడైనా దాని గురించి రాశావా? పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన తొమ్మిదేళ్లలో పోలవరం కోసం నువ్వు ఉద్యమాన్ని నడిపావా? ఒక్క వార్త అయినా ఈ ప్రాజెక్టు కోసం రాశావా? ఈ ప్రాజెక్టు పనులను నామినేషన్ పద్దతిలో మీ వియ్యంకుడికి దోచిపెట్టిన చరిత్ర మీది కాదా? మీ బాబు కమీషన్ల కక్కుర్తి వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, క్లిష్టమైన స్పిల్ వే, రేడియల్ గేట్లు, ఎగువ కాఫర్‌డ్యామ్ మిగిలిపోయిన పనులు, దిగువ కాఫర్‌డ్యామ్ పనులు, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్.. ఈ పనులన్నీ పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం కాదా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీరా! ప్రజాస్వామ్యం, హక్కులను అణిచి వేసింది ఎవరు రామోజీ? అసలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడకు పోయింది? ఒక మహిళా శాసనసభ్యురాలిని నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు శాసనసభకు దూరంచేస్తే ప్రజాస్వామ్యం ఏమైపోయింది? అప్పుడు ఈ ఘోరాలు కనిపించలేదా? పత్రికా స్వేచ్ఛ నీడలో మీరు ఎన్ని దారుణాలకు పాల్పడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. మొన్నటికి మొన్న పట్టాభిని కొట్టారంటూ తప్పుడు ఫొటో వేసి ప్రజలను తప్పుదోవపట్టించారు. ఎల్లో మీడియా మనుషులు ప్రతిరోజూ రాష్ట్రంలో ఉద్రిక్తతలను, హింసను ప్రేరేపించడానికి చేయని ప్రయత్నం లేదు. ఇలాంటి వాటిపై ప్రజా ప్రభుత్వం చట్టప్రకారం నడుచుకుంటుంది. నిజాయితీగా విలువలు పాటించే కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉంటున్నారన్నది నూటికి నూరు శాతం నిజం. -
అట్టడుగు వర్గాల ముందడుగు
సాక్షి, అమరావతి: ఏపీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత నిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకు సింహ భాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రు లు నాటి మాయావతి నుంచి నేటి సిద్ధరామయ్య వరకు ఎవరూ చేయని రీతిలో ఆ వర్గాలకు సీఎం జగన్ సమున్నత గౌరవం ఇచ్చి సామాజిక సాధికారత సాధన దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయ సాధనలో దేశానికే టార్చ్బే రర్ (మార్గ దర్శకుడు)గా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. దేశానికే ఆదర్శం నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ రూ.2.11 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖా తాల్లో (డీబీటీ) జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లోకే రూ. 1,56,987.64 కోట్లు వేశారు. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ బాటలు వేశారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦ నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్ పదవులిచ్చారు. ఇలా చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ♦ 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ ప దవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇ చ్చా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వ ర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి.. 484 నామినేటెడ్ డైరెక్టర్ పద వులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ♦ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే చైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులుంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ చైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో సగభాగం 3,503 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు. చేతల్లో సామాజిక న్యాయం ♦ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ♦ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురి(80 శాతం)ని ఆ వర్గాల నుంచే నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70%) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థల్లో.. ♦ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే.. వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు. ♦ 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగాను 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. -
ఉమ్మడి గళం వినిపిద్దాం
చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా హైబ్రిడ్మోడ్లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్ఎస్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఎల్ఎస్పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు. దేశవ్యాప్త కులగణన: తేజస్వి వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు. విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్ ‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు -
బడుగు బలహీనవర్గాల నేతలకు సముచిత పదవులు
-
చేతల నేత సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదు? సీఎం జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు. మూడున్నరేళ్లలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. గతంలో ఈ వర్గాలకు మేలు చేయాలన్న కనీస ఆలోచన కూడా చేయని చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా 18 స్థానాల్లో 11 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలను ఎంపిక చేసి, ఆయా వర్గాల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు’ అని కొనియాడారు. వివరాలు వారి మాటల్లోనే.. సొంత సామాజికవర్గం బాగు కోసమే బాబు కృషి చంద్రబాబు నమ్మక ద్రోహి. కుల అహంకారి. 1999 నుంచి రాజకీయాల్లో ఉన్న నేను ఆయన నైజాన్ని చూశా. నా దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. నాతోనే మిగిలిన నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టించారు. 2014లో నేను గెలిచే సీటు అని తెలిసినా, నన్ను పోటీ చేయకుండా ఆపేశాడు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు.. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. డబ్బు వున్న వారికే టీడీపీ టికెట్లు ఇస్తుంది. సొంత సామాజిక వర్గం బాగు కోసమే చంద్రబాబు పని చేశారు. బెంజ్ కారులో తిరిగిన నన్ను డొక్కు కారులో తిరిగేలా చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ అనే దేవుడి రూపంలో నాకు న్యాయం జరిగింది. – జయమంగళ వెంకటరమణ (బీసీ, ఏలూరు జిల్లా) నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం రాజకీయ సాధికారత అంటే పదవుల్లో మాత్రమే కాదు.. అధికారంలో కూడా పాలు పంచుకునేలా భాగస్వాములను చేయడమే అని సీఎం జగన్ నిరూపించారు. బలహీన వర్గాలకు మేలు చేయలన్నా బలమైన ఆలోచన ఉంటేనే ఇది సాధ్యం. సీఎం జగన్ ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టారు. – పెన్మత్స వీవీ సూర్యనారాయణ రాజు (ఓసీ, విజయనగరం జిల్లా) చంద్రబాబు కుల అహంకారి 2014–19 మధ్య టీడీపీ శాసనమండలికి 48 మందిని పంపగలిగితే, అందులో ఓసీలు 30 మంది కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే. టీడీపీ వంచనకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 68.18 శాతం కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. చంద్రబాబు పెద్ద కుల అహంకారి. సీఎం జగన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య.– పోతుల సునీత (బీసీ, చీరాల, బాపట్ల జిల్లా) బీసీ అంటే బ్యాక్ బోన్.. బీసీలంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్‌బోన్ క్లాస్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ గుర్తించి ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్‌గా బీసీ, మండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం ఇచ్చారు. పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రా«ధాన్యమిచ్చారు. సీఎం జగన్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. – కోలా గురువులు (బీసీ, విశాఖ సౌత్) సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం చెప్పారు సీఎం జగన్. గతంలో టీడీపీ అన్ని విధాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను వంచించింది. చెప్పిందొకటి. చేసింది మరొకటి. ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తో ఉంటాను. – బొమ్మి ఇజ్రాయేల్ (ఎస్సీ, (మాదిగ), అంబేడ్కర్ కోనసీమ జిల్లా) ఎందుకు మోసం చేశావని బాబును నిలదీయాలి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నందున బాబు, ఎల్లో మీడియా.. రోజు వారీ తోలు బొమ్మలను తెచ్చి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చూస్తున్నారు. వారి మొహం మీద చరిచినట్లుగా అన్ని పదవుల్లోనూ, అధికారంలోనూ ఇంతగా అట్టడుగు వర్గాలకు వైఎస్సార్సీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని బీసీలను కోరుతున్నాం. ఎందుకు మోసం చేశావని చంద్రబాబును నిలదీయాలని కోరుతున్నాం. – చంద్రగిరి ఏసురత్నం (బీసీ. వెస్ట్ గుంటూరు) గొప్ప మానవతా మూర్తి నమ్మకానికి, ఇచ్చినమాట నిలబెట్టుకునేదానికి సీఎం జగన్ ప్రతిరూపం. ఒకసారి మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెరవేర్చే తత్వం. ఇచ్చిన మాట మేరకు నాకు మేలు చేశారు. సీఎం జగన్ ఏమి చెబితే అది చేయటమే నా కర్తవ్యం. రాజకీయాల్లో గొప్ప మానవతా విలువలు వంట పట్టించుకున్న మానవతా మూర్తి సీఎం జగన్. రాజకీయాల్లో సోషల్ ఇంజినీరింగ్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. – మర్రి రాజశేఖర్ (ఓసీ, చిలకలూరిపేట) -
సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘సీఎం జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు.. మూడున్నరేళ్లలో సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకొచ్చారు’’ అని సజ్జల అన్నారు. ‘‘18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాం. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మకం. రాజకీయ సాధికారత దిశగా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు -
బీసీలకు గౌరవం పెంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్: మంత్రి ఉష శ్రీ చరణ్
-
అంబెడ్కర్ కలను నిజం చేసిన నాయకుడు సీఎం జగన్: మంత్రి కారుమూరి
-
సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్ తోనే సాధ్యం: మంత్రి జోగి రమేష్
-
సామాజిక విప్లవం..
-
గొప్పగా.. గర్వంగా!
సాక్షి, అమరావతి: మునుపెన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నామని, ఇంత గొప్పగా ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మనం చేసిన సామాజిక న్యాయాన్ని ప్రతి నియోజకవర్గంలో వినిపించాలని, ప్రతి గడపకూ చేరవేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థులకు సూచించారు. వైఎస్సార్సీపీ తరపున స్థానిక సంస్ధల కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. సుదీర్ఘ కసరత్తు అనంతరం.. గతంలో ఎప్పుడూ చూడనంత, జరగనంత సామాజిక న్యాయాన్ని దేవుడి దయతో మన పార్టీలో చేయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే గొప్ప పరిస్థితుల్లోకి వచ్చాం. ఇవాళ చాలా సుదీర్ఘ కసరత్తు అనంతరం 18 మందిని ఖరారు చేస్తే వారిలో 14 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇంత గొప్పగా సామాజిక న్యాయం ఎప్పుడూ జరగలేదు. మిగిలిన సామాజిక వర్గాలకు నాలుగు సీట్లిస్తే అందులో కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒకటి చొప్పున కేటాయించాం. మనం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలి, ప్రతి నియోజకవర్గంలోనూ చెప్పాలి. రాజకీయాల్లో గొప్ప మార్పు రాజకీయాల్లో ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదు. పారదర్శకంగా బటన్ నొక్కి లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నాం. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మనం చేసిన సామాజిక న్యాయం మరో ఎత్తు. దీటుగా, మరింత దూకుడుగా.. పదవులు పొందిన వారు పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటివి ఒక్కటై లేనిపోని విషప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా అంతే ధీటుగా, యాక్టివ్‌గా, మరింత దూకుడుగా పనిచేయడం ద్వారా మన వాణిని సమర్థంగా వినిపించాలి. మీ నుంచి కోరుకునేది అదే.. మరో 13 – 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించనున్నవారు పార్టీ కోసం ఏం చేయగలుగుతాం? అన్న ఆలోచనతో అడుగులు వేయాలి. నేను చేయాల్సింది చేశాను... మీకు ఇవ్వాల్సిన పదవులు ఇచ్చా. ఇక పార్టీకి ఏ రకంగా మంచి చేయాలనే కీలక బాధ్యతలు మీపై ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మీ తరపు నుంచి నేను అదే కోరుకుంటున్నా. మరింత ఉత్సాహంగా ఉండాలని అందరినీ కోరుతున్నా. పదవులు పొందుతున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారిని కన్విన్స్ చేసుకుంటూ వెళ్లాలి ఈ పదవులను ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్న పదవులు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అందర్నీ సంతృప్తి పరచలేం. కొద్దో గొప్పో కొరత ఉంటుంది. వీరందరికీ కూడా చెప్పే రీతిలో నచ్చచెబుతూ, కన్విన్స్ చేసుకుంటూ వెళ్లాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించి ప్రజల పక్షాన నిలబడి రాజకీయాలు చేశాం. అధికారంలోకి వచ్చాం. దేవుడి దయతో మంచి పరిపాలన కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వై నాట్? అనే రీతిలో అడుగులు ముందుకు వేస్తూ పాలన కొనసాగుతోంది. మిగతా వారికి ఈసారి దేవుడు ఆశీర్వదిస్తే గత ఎన్నికల కంటే ఈసారి అత్యధిక స్థానాలు సాధిస్తాం. ఇంకా చాలా మందికి రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశాలు వస్తాయి. చంద్రబాబు అరకొర పదవులిచ్చి బీసీలకు అన్నీ చేసినట్లు ప్రచారం చేసుకోవటాన్ని మనం చూశాం. ఈసారి మనం వడ్డీలు, వడ్డెర కులాల వారికి అవకాశం ఇచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఇంకా మిగిలిన కులాలకు తదుపరి దఫాలో తప్పకుండా అవకాశం ఇస్తామని భరోసా ఇస్తున్నాం. -
సామాజిక న్యాయానికి బీసీ జనగణన
భారత సమాజం కులాల దొంతర అన్న సంగతి తెలిసిందే. ఈ దొంతరలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదిమ తెగలవారూ, అసలు మనుషులుగా గౌరవం పొందని హిందూ సామాజిక బహిష్కృత ఎస్సీలూ అట్టడుగున ఉంటే... అటు ఓసీలలా గౌరవానికి నోచుకోనివారూ, ఇటు ఎస్సీల్లా మరీ తక్కువ చూపుకు గురికాని బీసీలు మధ్యస్తరంలో ఉన్నారు. దేశ జనాభాలో వీళ్లశాతం సగం కన్నా ఎక్కువే. వీరంతా సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ దేశ సంపద సృష్టిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అణగారిన, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించినా... జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అందడం లేదనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈ అభిప్రాయం ఉంది. తాము దేశ జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే... ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే బీసీ జన గణన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినా అది పట్టించుకోవడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాను లెక్కించాలనీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఉద్యమాలు రగులుకుంటున్నాయి. బీసీ జనగణన చేయమని అడిగితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఉద్యమం చేయక తప్పని స్థితి వచ్చింది. ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే మరో శాంతియుత బీసీల హక్కుల సాధన జాతీయ ఉద్యమంగా కొనసాగాలి. అది ఏ విధంగా అంటే 14 ఏళ్లు శాంతియుతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నమూనాలో కొనసాగాలి. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి ఇటీ వల జరిగిన శాంతియుత రైతాంగ ఉద్యమ రూపం ధరించాలి. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భావించి ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం పంపి ఇప్పటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. కేంద్రం ఇప్పటికీ పెదవి విప్పటం లేదు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుని కేంద్రానికి పంపింది. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 శాతం నుంచి 77 శాతానికి రిజర్వేషన్లు పెంచాలనే చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగా ణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇలా రిజర్వేషన్ల శాతం పెరిగినప్పుడే జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుంది. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ను అనుసరించి భారత దేశంలో ప్రప్రథమంగా 1953 జనవరిలో కాకా కాలేల్కర్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియ మించడం జరిగింది. ఇది 1955లో తన నివేదికను సమ ర్పిస్తూ దేశంలో 2399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ చేసిన సిఫార్సులను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం 1979లో బి.పి. మండల్ నేతృత్వంలో రెండవ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిషన్ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కకట్టి వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో నివేదిక సమర్పించింది. అయితే, ఈ సిఫారసులు 1992 నుండి మాత్రమే అమలులోకి వచ్చాయి. 2017 అక్టోబర్‌లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ ముఖ్య విధి. ఇప్పటికి ఈ కమిషన్ గడువును 13 సార్లు పొడిగించడం జరిగింది. ఇంతవరకు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బి.ఎస్. రాములు నేతృత్వంలో నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఏప్రిల్ 2017లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ, బీసీ–ఇ గ్రూప్‌లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వే షన్లను 4 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీక రిస్తూనే, సుధీర్ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మరో నివేదిక సమర్పిస్తూ... సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను కేసీఆర్ క్యాబినెట్ యధాతథంగా ఆమోదించి అమలుచేయడం జరిగింది. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బైట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? వీరింకా దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం. జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!
డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణం దళిత, బహుజన ఉత్పత్తి వర్గాలను ప్రధాన స్రవంతి లోని ఉత్పాదక శక్తులుగా మార్చకపోవడమే. అంటే ఒక 500 ఏళ్ల నుంచి నాటు వేసే కుటుంబాలు భూమి కలిగి లేకపోవడం; ఏ రంగంలో అయితే వారు తమ శ్రమను ధారబోస్తున్నారో ఆ రంగం భూస్వామ్య పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం ప్రధాన కారణం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో శిశు ఆరోగ్య సంరక్షణ మరింతగా క్షీణించడం వలన పుట్టే పిల్లలు శక్తిమంతంగా పుట్టడం లేదు. మాతా శిశు పోషక ఆరోగ్య బాధ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. అవినీతి అన్ని వైపులా అల్లుకుంటూ ఇచ్చే చేతికీ, తీసుకునే చేతికీ మధ్య వంద చేతులు ఏర్పడుతున్నాయి. భరత భూమిలో ప్రధాన వనరు భూమి. భూమి అందరి సొత్తు. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు అది ఐదు కులాల చేతుల్లోనే ఉంది. మొత్తం భారత దేశంలో సుమారు 6,000 కులాలున్నాయి. అయితే దాదాపు భూమి అంతా 100 కులాల చేతుల్లోనే ఉంది. ఇంతకంటే పెద్ద అసమానత మనకి ఏ దేశంలోనూ కనిపించదు. మన జాతీయాదాయం మొత్తంలో 22 శాతం... ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. భారతదేశ సంపదాభివృద్ధి ప్రక్రియలోకి దళితులను ఎందుకు రానివ్వడం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. సంపదను సృష్టిస్తున్న ఐటీ పరిశ్రమ భారతదేశంలో 1990 నుండి ప్రారంభమైంది. అతికొద్ది కాలంలోనే 16 లక్షల కోట్లు వ్యాపారం చేసింది. ఈ రంగంలో దేశంలోని పది, పది హేను కులాలే జొరబడ్డాయి. ఈ రంగంలోకి దళితులు ప్రవేశించకుండా పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది పెద్ద సామాజిక ద్రోహం. ఇక జీడీపీ సంగతికొస్తే... ప్రపం చంలో రెండు దేశాలు ముందున్నాయి. ఒకటి చైనా. రెండోది దక్షిణ కొరియా. దీనికి కారణం అక్కడ కుల, మత భేదాలు లేకుండా అందరినీ, అన్ని రంగాలలో ప్రోత్సహించడమే. భారతదేశంలో అటువంటి ప్రోత్సాహమే లేదు. దానికి కారణం కులవ్యవస్థ, అస్పృశ్యతా భావన. చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనాతో మనం పోటీపడలేక పోవ డానికి కారణం మనదేశం లోని 60 కోట్ల మందినీ మనం ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకపోవడం. సామాజిక న్యాయానికి విఘాతం ముఖ్యంగా 1970 తర్వాత ఏ కులం వారు ఆ కుల వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. పారిశ్రామిక వ్యవస్థలు, విద్యా సంస్థలు అన్నింటిలోనూ స్వకులం వారినే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది సామాజిక న్యాయ దూరం. మరోపక్క దేశంలో అవినీతి పెరిగిపోతోంది. అవినీతి మీద మాట్లాడే గళాలను అణచి వేయాలని చూస్తున్నారు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, హీరేన్ ముఖర్జీ, డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ మీనన్, మాలవ్యా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, సుశీలా నాయర్, మొరార్జీ దేశాయ్, నంబూద్రి పాద్ వంటి వారు ప్రజాస్వామ్యంలోని లొసుగులను గురించి తమ గళాలు వినిపించగలిగే వారు. ఇప్పుడా పరిస్థితి భారత దేశంలో లేదు. స్వాతంత్య్ర భారతంలో ప్రజల వాక్కుకు స్వాతంత్య్రం లేదు. ఈ దశాబ్దంలో ఎంతో మంది తమ వాక్కు వినిపించి హతులయ్యారు. సంపన్న వర్గాలు, అగ్రకులాలు ఎన్నికలను పెట్టుబడి, రాబడిగా చూస్తున్నాయి. రాజకీయ రంగంలో ఓటు కొనడం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలడం ప్రారంభమయ్యింది. ధనికుల రక్షణ, పేదల భక్షణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పాలక వ్యవస్థ ధనవంతులకు ఊడిగం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి కారణం రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ 75 ఏళ్లలో శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానం అంతరిస్తూ వస్తోంది. భారతదేశంలో ప్రధాన మతమైన బౌద్ధం పునరుజ్జీవం మీద దెబ్బ కొట్టారు. హిందూ మతో ద్ధరణకు పూనుకుని బడులు తగ్గించి గుడులు పెంచారు. హిందూ మతేతరమైన జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ వంటి మత ధర్మాలను ఎదగకుండా చేశారు. మానవ, సామాజిక, వ్యక్తి ధర్మాలను ధ్వంసం చేసి అరాచకత్వాన్ని పెంచారు. భారతీయ తాత్వికులైన చార్వాకులు, సాంఖ్యాయనులు వంటి భౌతిక తాత్వికుల ధర్మాలను కాలరాశారు. వీటన్నిటి ఫలితంగా భారతదేశం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలో మగ్గుతోంది. స్వాతంత్య్రం అగ్రకులాల, అగ్ర వర్గాల అనుభవైకవేద్యమయ్యింది. (క్లిక్: ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?) అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దళితుడూ, బహుజనుడూ, మైనారిటీలు చేతబూనాల్సిన చారిత్రక సందర్భం ఇది. రాజ్యాంగం ఇచ్చిన ఉద్యమ హక్కుని, పోరాట హక్కుని పునరుజ్జీవింపజేసి మనుషులు చైతన్యవంతులై, నీతిమంతులై, వ్యక్తిత్వ నిర్మాణదక్షులై తమను తాము అమ్ముకోకుండా; తమను తాము రక్షించుకుని, జీవింపజేసుకుని, నూతన భావాలను పునరుజ్జీవింప జేసుకుని రాజ్యాధికార దిశగా కొనసాగ వలసిన రోజులివి. పోరాటం మానవుని హక్కు. జీవించడం మానవుని హక్కు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యే వరకూ పిడికిళ్లు బిగుసుకునే ఉంటాయి. ఐక్యతా పోరాటమే స్వాతంత్య్రానికి పునాది. - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు -
సామాజిక న్యాయానికి పెద్దపీట
దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలతో కొట్టు మిట్టాడుతోంది. అంబేడ్కర్ చెప్పినట్టు ఈ అంతరాలను తొలగించకపోతే ప్రజ లలో అసంతృప్తి రగిలి ఉద్య మాలు వస్తాయి. ప్రస్తుతం నడుస్తున్నది సంధికాలంగా భావించవచ్చు. అన్ని కులాలకు... ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను, అభివృద్ధి ఫలాలను అందించాలన్న ఆలోచన గల దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతి, కుల, మత భేదాలతో మనుగడ కోల్పోతున్న విలువల భవితను గుర్తించి, సమానత్వానికి దారులు వేసిన ధైర్యశాలి. సమాజంలో ఉన్నత వర్గాలు పొందుతున్న హక్కులన్నింటినీ... అలాగే అభివృద్ధి పథకాలను పేద ప్రజలందరికీ అందేలా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి. సాహు మహరాజ్ వలె ఏపీ సీఎం జగన్ బలహీన వర్గాల ప్రజలకు సంపద, అధికారం, బడ్జెట్ కేటాయిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి 8 మంది మంత్రులకు మించలేదు. ఇప్పుడు అంతకు రెట్టింపుకు పైగా మంత్రులు, ఉప ముఖ్య మంత్రులూ బహుజనులే జగన్ మంత్రి వర్గంలో ఉండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. మన కాలపు సాహు మహరాజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎందుకంటే గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే డా. అంబేడ్కర్ చదువుకొని భారత దేశానికి రాజ్యాంగ రూప కర్తగా మారారని గతం గుర్తు చేస్తున్నది. అలాగే ఒక బీసీ ఉద్యమకారుడు నిస్వార్థంగా 47 ఏళ్లుగా పేద కులాల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికై పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి జగన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వైసీపీ మూడు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజ కీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. అయితే తన పరిధి మేరకు జగన్ బహుజనులకు అధి కారంలో వాటా కల్పించడానికి నిజాయితీగా చర్యలు తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలనూ, కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటానూ బీసీలకు ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్ బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రా లకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. 30 వేల కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటు చేయ డాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దళిత, బహుజనులు రాజ్యాధికారంవైపు అడు గులు వేయాలనీ, అందుకోసం వారంతా సమైక్యంగా ఉండాలని అంబేడ్కర్ అన్నారు. కానీ, ఇక్కడ సీఎం జగన్, దళిత... బీసీ వర్గాలు ఎలాంటి పోరాటాలు చేయకుండానే అధికారంలో వాటా కల్పించారు. వారి సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఇంతకంటే అంబేడ్కర్‌కు అర్పించే ఘన నివాళి ఏముంటుంది? - మన్నారం నాగరాజు తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు -
కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే కేంద్రం తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీని కలిసి విన్నవిస్తామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణారావు, మార్గాని భరత్, బీశెట్టి సత్యవతి, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ మాట్లాడారు. ఎవరికీ అభ్యంతరంలేని విషయంపై అలక్ష్యం వద్దు ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సులు, సంక్షేమ పథకాల అమలుకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరమని చెప్పారు. పలు రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ కేంద్రస్థాయిలో లేకపోవడం శోచనీయమన్నారు. ‘1992లోనే సుప్రీంకోర్టు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఇలాంటప్పుడు శాఖ ఏర్పాటుపై ఆలస్యం తగదు. దీనిపై పార్టీ తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. కేంద్రస్థాయి ఉద్యోగాల్లో, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరతాం..’ అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు, సామాజిక న్యాయం చేసేలా బీసీలకు రాజకీయ పదవుల్లో 50 శాతానికిపైగా కట్టబెట్టి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఆమోదం పొందేవరకు ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో 50 శాతం పదవులు బీసీలకు ఇచ్చేలా చట్టం తెచ్చారన్నారు. మాటల్లో కాకుండా ఆచరణలో బీసీల సంక్షేమం కోసం ఏపీ సీఎం జగన్ కృషిచేస్తున్నారని, ఆయన కృషిని చూసి పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. జగన్ నిర్ణయాలు ఓటుబ్యాంకు రాజకీయాల్లా కాకుండా ఒక తత్వవేత్త, సిద్ధాంతవేత్త తీసుకున్నట్లు ఉంటున్నాయన్నారు. బీసీలకు కేంద్ర బడ్జెట్లో కనీసంగా రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కులగణన కోసం పోరాడతాం ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ బీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం కృషిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంటు ద్వారా భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీసీల కులగణన కోసం ప్రధానిని కోరతామని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరారు. బీసీలకు అవరోధంగా ఉన్న క్రీమిలేయర్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బీసీ నినాదాన్ని బలంగా మోస్తున్న ఎనిమిది ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కృషిచేస్తామని చెప్పారు. -
సామాజిక న్యాయమే పాలన అజెండా
అభివృద్ధి, రాజ్యాధికారం అట్టడుగు వర్గాలకు బదిలీ కావడం రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ 75 ఏళ్ల స్వతంత్ర భారత్ కనీ వినీ ఎరుగని ఘట్టాలకు నాంది పలికింది. విప్లవాత్మకమైన విధానాల ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడమే అజెండాగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారతే లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తోంది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం వెనుకా ఉద్దేశం ఇదే. వైసీపీ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో, ఈ దిశగా వైసీపీ ప్రభుత్వ కృషిని తలుచుకోవడం ఎంతైనా సముచితం. బలహీన వర్గాలు పాలితులుగా కాదు, పాల కులుగా ఉండాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంతి వైఎస్ జగన్ లక్ష్యం. ఆ దిశలోనే ఈ మూడేళ్లలో ప్రభుత్వ పాలన కొనసాగింది. సీఎం విశాల దృక్పథం వల్ల రాష్ట్రంలో వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగింది. సంక్షేమ రంగంతో పాటు, సామాజిక న్యాయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాలూ, చేసిన పనులూ ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం జగన్ వల్ల, జగన్ చేత పేద వర్గాలకు జరిగింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలలో కుడా పేద కులాలకు ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరగలేదు. అధికారంలో, సంపదలో, సామాజిక గౌరవంలో, విద్యలో... జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి ఇచ్చిన దేశంలోనే మొదటి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్యా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్‌రాం, మౌలానా ఆజాద్, కొమురం భీమ్ కోరు కున్న సమాజం దిశగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. కేబినెట్ కూర్పు నుంచి కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ సభ్యత్వాల వరకూ... పదవులు ఏవైనా అన్నింటా ఒకటే సూత్రం: అదే సోషల్ జస్టిస్. తన కేబినెట్లో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. శాసన సభ స్పీకర్ పదవిని బీసీ వర్గానికీ, శాసన మండలి ఛైర్మన్ ఎస్సీ వర్గానికీ ఇచ్చిన నాయకుడు కూడా ఆయనే. పార్లమెంటులో రెండేళ్ల క్రితం బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాసింది వైసీపీ. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ పార్టీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్ల మెంటులో బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, అప్నా దళ్, జనతాదళ్ లాంటి పార్టీలు కూడా బీసీ బిల్లు పెట్ట లేదు. జగన్‌కు బీసీల చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుంది. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలు వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్య మంత్రులకు వైసీపీ ప్రభుత్వం సవాల్ విసిరింది. ఏపీలో ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులలో, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అందులోని చైర్మన్, డైరెక్టర్ పదవులన్నింటినీ (684) ఆయా కులాల వారితోనే భర్తీ చేశారు. 193 కార్పొరేషన్లలో 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీసీలకే దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. మొత్తం 58 శాతం చైర్మన్ పదవులు బీసీలకే దక్కాయన్నమాట. దీని మూలంగా ఆయా కులాల నాయకత్వం పెరిగింది. ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతోంది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావ దాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నామినేటెడ్ పదవులలో 50 శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టం చేయడమే కాదు, అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. శాశ్వత ప్రాతి పదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మరో చరిత్రాత్మకమైంది. 25 మంది సభ్యుల మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇవ్వడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్క రించారు. అందులో బీసీ, మైనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే... నాలుగింటిని (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోం మంత్రిగా ఎస్సీ మహిళను రెండోసారీ నియమించడం ఇదే ప్రథమం. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులు ఉంటే... అందులో మెజారిటీ సభ్యులు(ఐదుగురు) బీసీలే. ఇటీవల నాలుగు ఖాళీలు ఏర్పడితే... అందులో రెండు బీసీలకే! శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానమ్‌కు అవకాశం కల్పించారు. మండ లిలో వైసీపీకి 32 మంది సభ్యులు ఉంటే, 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే... దానిని పార్టీ పరంగా అదనంగా 20 శాతం పెంచి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇది జగన్‌కు బీసీల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో... 648 మండలా లకుగానూ వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిచింది. అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తం మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సి పాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైసీïపీ రికార్డు స్థాయిలో గెలవగా... చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 196 వ్యవ సాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే. ఈ 29 నెలల్లోనే ఇచ్చిన 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యో గాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ‘జగనన్న అమ్మ ఒడి’, ‘వైఎస్సార్ రైతు భరోసా’, ‘వైఎస్సార్ చేయూత’, ‘వైఎస్సార్ ఆసరా’, ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’, ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ వంటి పథకాల ద్వారా చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల జరిగిన మొత్తం లబ్ధి రూ. 1,87,916.46 కోట్లు. ఇందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ. 90,415.92 కోట్లు అందింది. అంటే దాదాపుగా సగం లబ్ధి బీసీలకే చేకూరింది. ఇలా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయపరంగా వైసీపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు ‘ మొబైల్: 90000 09164 -
కళ్లెదుటే సామాజిక మార్పు
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల నుంచి మంత్రివర్గం వరకు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చి.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ద్వారా సామాజిక సాధికారత సాధనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్చ్ బేరర్‌గా నిలిచారని సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఆ వర్గాలకు ఇచ్చింది ఒక్క సీఎం వైఎస్ జగనేనని నొక్కి చెబుతున్నారు. సామాజిక న్యాయం నినాదంతో 2007లో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మాయావతి సైతం మంత్రివర్గంలో ఆ వర్గాలకు 40 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సామాజిక న్యాయ సాధనకు నడుం బిగించారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని, ఆ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలని ప్రణాళిక రచించి, వాటిని ఆచరణలోకి తెచ్చారు. 2019 జూన్ 8న తొలిసారి 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో (14 మందితో 56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చి, సామాజిక విప్లవానికి తెరతీసి.. నవశకానికి నాంది పలికారు. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు (80 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ మహిళను హోం శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. పరిపాలనలో సింహభాగం వాటా ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే.. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల పంపకం ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేసేలా సీఎం వైఎస్ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201.. బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. సామాజిక మహా విప్లవానికి నాంది ► తొలిసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్.. ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 70 శాతం పదవులు (17) ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవానికి నాంది పలికారు. ► రాష్ట్ర శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును చైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ► గత మూడేళ్లలో ఎన్నికలు జరిగిన ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలను బీసీలకే ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటి చెప్పారు. ► శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. ► మొత్తంగా వైఎస్ జగన్ సంస్కరణల వల్ల ఎన్నిక ఎన్నికకూ వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల (పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల్లో 80 శాతానికిపైగా స్థానాల్లో విజయభేరి మోగించింది. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదివరకటి కంటే అధికంగా మెజార్టీ రావడం గమనార్హం. పేదరిక నిర్మూలన.. విద్యకు బాసట ► పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1,58,375.03 కోట్లలో 80 శాతానికి పైగా నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. నగదు బదిలీయేతర పథకాల ద్వారా మరో రూ.38,836.57 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ► అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దే యత్నాలను చిత్తశుద్ధితో చేస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి.. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తూ.. బైజూస్‌తో ఉచితంగా కంటెంట్‌ను అందించేందుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రపంచంలో మిగతా దేశాల విద్యార్థులతో పోటీ పడేలా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న అంకితభావంతో సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు. -
శతమానం భారతి సామాజిక న్యాయం
కులాల గణన చేయాలని దేశంలో ఇటీవల మళ్లీ గళాలు వినిపిస్తున్నాయి. కుల గణన వల్ల సంక్షేమ ఫలాలు సమాజంలో సక్రమంగా పంపిణీ అవుతాయని, సామాజిక న్యాయం చేకురుతుందనీ ఒక వాదన ఉంది. ఆ వాదనలో వాస్తవం ఉండొచ్చు. కానీ బ్రిటిష్ వాళ్లు చేసిన ఈ తరహా గణన వల్ల ప్రయోజనం లేకపోగా ప్రజల్లో విభేదాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చాక ఈ భేద భావనలు, అసమానతలు తగ్గుతాయని అనుకున్నా అవి మరింతగా ఎక్కువయ్యాయి. ఒక సామాజిక సమతుల్యతను తెచ్చేందుకు 1974లో జయప్రకాశ్ నారాయణ్ నవ నిర్మాణ్ ఉద్యమాన్ని లేవనెత్తారు. తర్వాత 1977లో దేశంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనకు 1979తో మండల్ కమిషన్‌ను నియమించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలో 27 శాతం ఉద్యోగాలను ‘ఇతర వెనుకబడిన కులాలలకు’ కేటాయించాలని ఆ కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది. ఆ తర్వాత పదేళ్లకు గానీ నివేదిక అమలుకు నోచుకోలేదు. 1990లో ప్రధానిగా ఉన్న వీపీ సింగ్.. కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నట్లు ప్రకటించగానే దేశం భగ్గుమంది. తర్వాతి పరిణామాలన్నీ తెలిసినవే. సామాజిక న్యాయం ఎప్పటికైనా సాధ్యపడుతుందా అనే సందేహాలే మిగిలాయి. సామాజిక న్యాయం అన్నది ప్రజాస్వామ్య చట్రంలోనే సాధ్యం అవుతుంది. ఆ విశ్వాసంతో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ప్రణాళికలను రూపొందించి, చట్ట రూపంలోకి తెస్తే తప్పక అసమానతలను నివారించవచ్చని సామాజిక ధోరణుల అధ్యయనవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్) -
ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం
జైపూర్: దేశంలో తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం కడుతోందని.. సుపరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని, ప్రతిపక్షాలు విసిరే వలలో చిక్కుకోవద్దని సూచించారు. ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుంటాయని, బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. శుక్రవారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్ధారించుకోవాల్సిన సమయం వచ్చిందని నొక్కిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మనకు దేశభక్తే స్ఫూర్తి ‘‘బీజేపీ అభివృద్ధి కోసం తపన పడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నాయి. సమాజంలోని చిన్నపాటి ఉద్రిక్తతలు, బలహీనతలను అడ్డం పెట్టుకొని మరింత విషం చిమ్ముతున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి శక్తులు, పార్టీల నుంచి కాపాడుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలి. జన సంఘ్ కాలం నుంచి దేశభక్తి, జాతి ప్రయోజనాలు, జాతి నిర్మాణమే మన విధానం, కార్యక్రమంగా కొనసాగుతోంది. అభివృద్ధి, విశ్వాసంపై బీజేపీ దృష్టి పెట్టడానికి దేశభక్తే స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి షార్ట్కట్లు మనకు వద్దు. మనం వేసే అడుగులు దారి తప్పకూడదు. మాట తూలకూడదు. అభివృద్ధి, సామాజిక న్యాయం, భద్రత పేదల సంక్షేమం, వారి జీవనాన్ని సరళతరం చేయడమే మనకు ముఖ్యం. పేదల సాధికారత కోసం కృషిని కొనసాగించాలి. మన మార్గం నుంచి పక్కకు వెళ్లకూడదు. మన దృష్టిని మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటిని లెక్కచేయాల్సిన అవసరం లేదు. ఎల్లవేళలా అభివృద్ధికే కట్టుబడి ఉండాలి. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధారించుకుంటోంది. పార్టీపరంగా కూడా 25 ఏళ్లకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ నెలలోనే 8 ఏళ్లు నిండుతాయి. ఈ 8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశాం. పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం. సమతుల అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రత కల్పించాం. దేశంలో భాషల ప్రాతిపదికగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోంది. జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇదే నిదర్శనం. భాషా వైవిధ్యం దేశానికి గర్వకారణం. ఇప్పుడు ప్రపంచమంతా గొప్ప అంచనాలతో భారత్ వైపు చూస్తోంది. అలాగే భారత్‌లోనూ ప్రజలు బీజేపీపై ప్రత్యేకమైన అనురాగం కురిపిస్తున్నారు. గొప్ప నమ్మకం, ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, బలోపేతం చేయడానికి వంశపారంపర్య పార్టీలపై బీజేపీ పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ విషయంలో బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలి’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
మౌలిక మార్పులే లక్ష్యంగా...
ముఖ్యమంత్రిగా, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఏ మౌలిక మార్పునూ చేయడానికి ప్రయత్నించలేదు. జగన్ ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికేం కావాలో అర్థం చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతర పాలనాపరమైన చర్యలను మననం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల అవస రాలనూ, ఆత్మగౌరవాన్నీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను గుర్తించారు. వ్యావసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాష్ట్రంలో మౌలిక మార్పులైన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలనను ప్రారంభించారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యవల్ల పెరుగుతున్న సామాజిక అంతరాలనూ, బహుజనులకు తగ్గుతున్న ఉద్యోగావ కాశాలనూ, ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించ లేక బహుజనులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులనూ, ఆత్మన్యూనతనూ గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు... తరతరాలుగా, సామాజిక దురన్యాయానికి గురువుతున్నారు. వీరిని పట్టించుకున్న పాలకులు దేశమంతటా వెదికినా వేళ్లమీద లెక్క బెట్టేంతమంది కూడా లేరు. పాలనా రంగంలో సముచితస్థాన మిచ్చినపుడే వారికి న్యాయం చేసినట్టవుతుంది. అధికారం వారి చేతికి అందినప్పుడే ‘సాధికారత’ సాధ్యమవుతుంది. అందుకే వైఎస్ జగన్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో ఈ వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ వీరికి అగ్ర తాంబూలం ఇచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థల అధిపతులుగా అధిక శాతం మంది ఈ వర్గాలవారే ఎన్నికయ్యేట్లు చూశారు. మంత్రి వర్గంలోనూ బహుజన వర్గాలకు ఎవ్వరూ ఊహించనంతమంది బహుజనులకు చోటివ్వడం ద్వారా జగన్ సామాజిక మార్పునకు పునాది వేశారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అన్ని రోగాలకు వర్తింపజేసేట్టు చట్టం చేయడం, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం ద్వారా వైద్యాన్ని అట్టడుగు జనం ముంగిటకు చేర్చగలుగుతున్నారు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా ఉంది. ఈ ప్రాంతాల మధ్య సామాజిక అంతరాల దొంతరలతోపాటూ, ఆర్థిక అసమానతలూ ఉన్నాయి. ఈ అంతరాలను తొలగించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు పెట్టాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మౌలికమార్పులతో వచ్చే ఎన్నికల నాటికి అజేయశక్తిగా నిలబడి తీరుతారు. (చదవండి: తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథకుడు, నవలా రచయిత -
ఈ నెల 26 నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నెల 26 నుంచి వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. సామాజిక న్యాయం పేరిట ఈ యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఏవిధమైన ప్రాధాన్యత ఇస్తోందనేది ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు మొత్తం శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నెల 26న శ్రీకాకుళం లేదంటే విజయనగరంలో బహిరంగ సభ 27న రాజమండ్రిలో సభ 28న నరసరావుపేటలో బహిరంగ సభ.. ఆ రాత్రికి నంద్యాలలో బస, 29న అనంతపురంలో బహిరంగ సభ (చదవండి: తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా) -
Congress Chintan Shivir: సోషల్ ఇంజనీరింగ్
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అంతర్గత ప్రక్షాళన దిశగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కాంగ్రెస్ లోతుగా మల్లగుల్లాలు పడుతోంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్‌లో శనివారం రెండో రోజు పార్టీ మథనం సుదీర్ఘంగా కొనసాగింది. అంశాలవారీగా అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు రోజంతా చర్చలు జరిపాయి. సమాజంలో అన్ని వర్గాలకూ మళ్లీ చేరువ కావాలంటే పార్టీలో సోషల్ ఇంజనీరింగ్‌కు తెర తీయడమే మార్గమని సామాజిక, న్యాయ కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం పార్టీ విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం కేటాయించాలని దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఒక నేతను రాజ్యసభకు గరిష్టంగా రెండుసార్లు మాత్రమే నామినేట్ చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా అసమ్మతి గళం విన్పిస్తున్న సీనియర్ నేతల ప్రధాన డిమాండ్ అయిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీని రద్దుకు, దాని స్థానంలో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు కూడా అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతుండటం మరో కీలక పరిణామం. సామాజిక న్యాయంపై మథనం కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ సలహా మండలి ఏర్పాటు చేయాలని సామాజిక న్యాయ కమిటీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. పార్టీలో బూత్ స్థాయి నుంచి డీసీసీ, పీసీసీ, ఏఐసీసీ, సీడబ్ల్యూసీ దాకా అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రస్తుతమున్న 20 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్‌కు పట్టుబట్టడంతో పాటు ఆ కేటగిరీకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నైష్పత్తికంగా రిజర్వేషన్లను వర్తింపజేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించింది. కులాలవారీ జనగణన జరపాలని కూడా కోరాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పునరుద్ధరించడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించింది. కమిటీ చర్చల వివరాలు, సిఫార్సులను కన్వీనర్ సల్మాన్ ఖుర్షీద్, సభ్యుడు కొప్పుల రాజు శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు. సామాజిక న్యాయ వ్యవహారాలపై రూపొందించాల్సిన విధానాలను సూచించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల నమ్మకాన్ని చూరగొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీ చీఫ్‌కు మండలి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఇప్పటిదాకా సరైన ప్రాతినిధ్యం దక్కని పలు ఉప కులాలను గుర్తించే ప్రక్రయను పార్టీపరంగా చేపట్టనున్నట్టు రాజు చెప్పారు. చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయనున్నామన్నారు. జీఎస్టీ పరిహారం మరో మూడేళ్లు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పొడిగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రస్ ఆర్థిక రంగ ప్యానల్ కన్వీనర్ చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. ‘‘మోదీ సర్కారు పాలనలో ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటు కింది చూపే చేస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగాయి. పెట్రో ధరల పెరుగుదల తదితరాలు సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయి. జీఎస్టీ చట్టాలను మోదీ స్కరారు పేలవంగా రూపొందించి, అన్యాయంగా అమలు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేనంత బలహీనంగా మారింది. తక్షణ పరిష్కార చర్యలు అవసరం’’ అని డిమాండ్ చేశారు. అన్ని అంశాల పైనా ఆర్థిక ప్యానల్ చర్చించినట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలూ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి.వాటిని ఎదుర్కొనే మార్గాలపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేక సమస్య మరింత తీవ్రతరమవుతోంది. కేవలం గత 7 నెలల్లో 22 బిలియన్ డాలర్లు దేశం నుండి బయటికి వెళ్లిపోయాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు 36 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. వీటిపై అంశాలవారీగా కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. ఆటోమేషన్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశ్రమ, వ్యాపారం, వాణిజ్య రంగాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కాంగ్రెస్ విశ్వసిస్తోందని చెప్పారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రియాంక? కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపనున్నట్టు సమాచారం. మరోవైపు, రాహుల్ ఇష్టపడని పక్షంలో ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించాలని చింతన్ శిబిర్ వద్ద పలువురు నేతలు కోరారు. శనివారమంతా నేతలు దీనిపై జోరుగా చర్చించుకున్నారు. త్వరలో జన్ అభియాన్2 ఏఐసీసీ నేతలతో సోనియా చర్చలు కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు జన్ జాగరణ్ అభియాన్ రెండో దశ నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. చింతన్ శిబిర్‌లో భాగంగా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జన్ జాగరణ్ అభియాన్‌తో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలు కోరారు. ఈ భేటీలో వచ్చిన ప్రతిపాదనలపై ఆదివారం చింతన్ శిబిర్ మూడో రోజు సీడబ్ల్యూసీ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. జన్ జాగరణ్ అభియాన్ తొలి దశను 2021 నవంబర్ 14–29 మధ్య దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టడం తెలిసిందే. -
అనితర సాధ్య సామాజిక నమూనా!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన నాలుగు రోజులకే అంబేడ్కర్ జయంతి రావడంతో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం– ‘సామాజిక న్యాయం’ నమూనాను– ‘14 ఏప్రిల్’ చట్రంలో ఉంచి పుటం వేయడానికి, ప్రధాన మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గట్టి ప్రయత్నమే జరిగింది. ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పే వాళ్ళది ఏ కులం?’ అంటూ, అందుకు– కారణం మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వమే అన్నట్టుగా... అందుకు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టే ప్రయత్నమే ఇందులో ప్రధానంగా కనిపించింది. ఈ తరహా ధోరణి కొత్తది. గడచిన పదేళ్లుగా తెలుగునాట ఉద్యమాలు– ‘ఆన్లైన్’లోనే జరగడంతో దానికీ ‘వర్క్ ఫ్రం హోం’ సౌలభ్యం వచ్చేసింది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? అనేది తెలుసుకుని, దాన్ని స్థానిక చూపుతో చూడ్డం, రాయడం, మాట్లాడ్డం, ఎప్పుడా అనేది మాత్రం ఇంకా స్పష్టం కావలసి ఉంది. అయినా ఇప్పుడొచ్చిన నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. కొత్త పార్టీ ప్రభుత్వం అన్నప్పుడు, ‘చెడు’ మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాతే, అక్కడున్న– ‘మంచి’ ఏమిటో ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తుంది. ఈలోగా శిలాసదృశ్యంగా ఉన్న (ఇమేజ్) రూపానికి బీటలు ఆపాదించడం తప్పనిసరి అవుతుంది; దాని వెనుకే మంచి–చెడుల మదింపు లేదా సమీక్ష మొదలవుతుంది. భజనతో ప్రయోజనం ఉండదు కానీ సమీక్ష ఎవరికైనా చాలా అవసరం. అలా ఈ ప్రభుత్వం తొలి వైఫల్యంగా చలామణిలో ఉన్నది, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్జీవోల– ‘చలో విజయవాడ’ నిరసన ర్యాలీ; దాన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం. దీన్ని గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చూసి ఉంటే– ‘ఉద్యోగులపై పోలీసుల దమనకాండ’, ‘విచక్షణారహితంగా ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జి’ వంటి వార్తలు, లైవ్ దృశ్యాలు, జగన్ ప్రభుత్వం తొలి– ‘బ్లాక్ రిమార్క్’గా ఇప్పటికే నమోదు అయ్యేవి. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గం మార్పు తర్వాత కూడా– ‘జగన్ మెత్తబడ్డాడు’ అనే వ్యాఖ్యతో అది కూడా మరో వైఫల్యంగా చలామణిలోకి తెచ్చే ప్రయత్నం మొదలయింది. నిజానికి– జిల్లాల జనాభా, వైశాల్యం, వనరులు, ‘డెమోగ్రఫీ’ వంటి ప్రాథమిక అంశాలను బట్టి ముందుగా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అయ్యాక, అప్పుడు మంత్రుల మార్పు జరిగింది. అంటే, రెండు దశల్లో పాత సంస్థానాల ప్రభావం తగ్గింపునకు గురైందన్నమాట. కనుక, ఈ మార్పును సరికొత్త– ‘మ్యాపింగ్’ దృష్టితో చూస్తే తప్ప దీని వెనుక ఉన్న– ‘లాజిక్’ అయినా, అస్సలు అటువంటిది ఎప్పుడు మొదలు అయిందనే దాని గత చరిత్ర అయినా స్పష్టం కాదు. దాన్ని– ‘వైఎస్ మ్యాపింగ్ ఫార్ములా’ అనొచ్చు. అందులో రెండు అంశాలు ఉండేవి: ‘నియోజక వర్గం ఎక్కడ?’ ‘కమ్యూనిటీ ఏది?’ (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) అమలులో అది ఇలా ఉండేది: 2009 ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక, కొత్తగా నియోజకవర్గం అయిన విజయవాడ శివారులోని పెనమలూరుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా కె.పార్థసారథి (యాదవ్) ఎన్నికయ్యాక, రాజశేఖరరెడ్డి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికి రెండవసారి గెలిచినవారిలో బందరు నుంచి పేర్ని నాని కూడా ఉన్నారు. అయినా– ‘జాగ్రఫీ’ ఇక్కడ కీలకం కావడంతో, కృష్ణా జిల్లాకు పార్థసారథి ఏకైక మంత్రి అయ్యారు. రెండవది– అదే 2009 ఎన్నికల్లో వరంగల్ (తూర్పు) కొత్తగా నియోజకవర్గం అయింది. బసవరాజు సారయ్య (రజక) మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ తాను పాటించిన– ‘ఫస్ట్ టైం ఎంఎల్ఏ’కి మంత్రి పదవి లేదు, అనే నిబంధన పక్కన పెట్టి మరీ వైఎస్ ఆయన్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ– ‘కులం’ ప్రాతిపదిక అయింది. అలా సారయ్య భారత దేశంలో రజక కులం నుంచి రాష్ట్ర మంత్రి అయిన రెండవ వ్యక్తి అయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి మొదటివారు. ఇటువంటి– ‘మ్యాపింగ్’ లోకి వచ్చేదే ఉత్తర, పశ్చిమ, తూర్పు భారత రాష్ట్రాలను దక్షణాదితో కలిపే– ‘వై’ జంక్షన్‌గా ప్రసిద్ధమైన విజయవాడను కొత్తగా జిల్లా చేసి, దానికి ‘ఎన్టీఆర్’ పేరు పెట్టడం! నిజానికి ఈ చర్య, ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం కంటే, ఒక ప్రధానమైన– ‘కమ్యూనిటీ’కి ఈ ప్రాంత చరిత్రలో ఇచ్చిన సముచితమైన గౌరవం అవుతుంది. విశ్లేషకులు– ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పేవాళ్ళది ఏ కులం?’ అంటూ అడగడం, ఇప్పటి సామాజిక మాధ్యమాలు తప్ప గత చరిత్ర తెలియనివారి వరకు వినడానికి బాగుండొచ్చు. కానీ, ఆ ప్రశ్నతో మళ్ళీ పాత తరానికి మర్చిపోయిన విషయాలు గుర్తుచేయడం అవుతుందేమో? ఎందుకంటే– ‘ఏ పదవి లేకుండానే చక్రంతిప్పే వాళ్ళది ఏ కులం?’ అని ఇప్పుడు అంటే– ‘వాళ్ళు గతంలో ఏ పార్టీల్లో ఉంటూ ఏ ప్రాంతాలకు ప్రజాప్రతినిధులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాల్లో ఉన్నారు? అనే ప్రశ్నకు కూడా ఇక్కడ మనం జవాబు వెతకాలి. (క్లిక్: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత) సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు ‘ఐపాక్’ ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేయాలా, వద్దా? అని ఢిల్లీలో సోనియా ఇంట జరిగిన చర్చల ప్రక్రియలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ ఎందుకు లేరు? వైఎస్ ఇక్కడ 2004లోనే గుర్తించి అమలు చేసిన– ‘మ్యాపింగ్’ కాంగ్రెస్ పార్టీని ఘనవిజయం దరి చేర్చినప్పుడు, 2024లో కూడా అది వారికి ఎందుకు అలిమి కావడం లేదు? ఎందుకంటే, ఒకప్పటి ‘వైఎస్ ఫార్ములా’ను ఇరవై ఏళ్ల తర్వాత, జగన్ ఇప్పుడు– ‘కటింగ్ ఎడ్జ్’ (అంచు మిగలని దశ)కు తీసుకు వెళ్ళారు కనుక! - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
‘సామాజిక న్యాయం’లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ‘బహుజన హితాయా.. బహుజన సుఖాయా’ అని చాటిన బుద్ధుడి వ్యాఖ్యలను ఆచరణలో నిజం చేసి చూపిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారని బహుజన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్ కితాబిచ్చారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కేటాయించడంపై స్పందించిన ఆయన.. శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. బుద్ధిజం, అంబేడ్కరిజం, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను సీఎం జగన్ సాకారం చేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో బహుజనుల కోసం ఏర్పడిన బీఎస్పీ సైతం రాజకీయ మనుగడ కోసం అగ్రవర్ణాలకు సీట్లిచ్చిందని, అగ్రవర్ణానికి చెందిన సీఎం జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రాతిపదికన నామినేటెడ్, మంత్రి పదవులు కేటాయించి యుగపురుషుడిగా నిలిచారని ప్రశంసించారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు, రాజకీయ పదవుల పేరుతో గౌడ–శెట్టిబలిజలకు, రిజర్వేషన్ పేరుతో కాపులకు ఇతర కులాలతో తగవులు పెట్టిందని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసేలా ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా చర్యలు చేపట్టారని గురుప్రసాద్ గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా బీసీ కులాల మేలు కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. కనీసం ఓటుకు, వార్డు మెంబర్‌కు కూడా అర్హతలేని సంచార జాతులకు ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని, బహుజనులు ఎల్లప్పుడూ ఆయన వెంటనే ఉంటారని గురుప్రసాద్ స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంనే మేం కోరుకున్నాం.. ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య రాష్ట్రంలో దళిత బహుజనులకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘకాలం కొనసాగాలని, ఇలాంటి ముఖ్యమంత్రే తమకు కావాలని కోరుకున్నామని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య చెప్పారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అనేక రాష్ట్రాల్లో బీసీ, దళితులు ముఖ్యమంత్రులైనా.. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా అణగారిన వర్గాలకు అగ్రపీఠం వేసిన వారు లేరన్నారు. దళితుల పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్‌లో సైతం అట్టడుగు వర్గాలకు అంతంత మాత్రంగానే ఉన్నత పదవులు దక్కాయని గుర్తుచేశారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చిన సందర్భాలు తక్కువేనని అన్నారు. దళిత బహుజనులకు చంద్రబాబు ఏనాడూ ప్రాధాన్యత శాఖలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రం తన వారితో త్యాగాలు చేయించి మరీ ఆయా పదవుల్లో ఎస్సీ, బీసీలను కూర్చోబెడుతుండటం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని చెంగయ్య కితాబిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎం వైఎస్ జగన్ రెండు పర్యాయాలు ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాష్ట్ర హోం మంత్రి పదవులివ్వడం ఆయనకే చెల్లిందన్నారు. సామాజిక విప్లవాన్ని సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు దళితబహుజనులు అండగా ఉంటారని తెలిపారు. -
న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం ఎక్కడ?
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బలహీనవర్గాలకు చెందిన న్యాయవాదుల విషయంలో సామాజిక న్యాయం నేతిబీర చందంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 1,104 మంది జడ్జిలు ఉంటే, అందులో కేవలం 92 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని చెప్పారు. అలాగే 16 మంది ఎస్సీ, ఎనిమిది మంది ఎస్టీ జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 16 హైకోర్టుల్లో అసలు ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమే లేదన్నారు. ఈ గణాంకాలు సామాజిక న్యాయం అమలు తీరుకు ప్రతిబింబమని చెప్పారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైకోర్టులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. అపర మేధావి, అభ్యుదయవాది, రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఓ కుల నాయకుడిగా చిత్రీకరించడం దారుణమని చెప్పారు. అంబేడ్కర్ తన జీవితాన్ని సామాజికన్యాయం కోసం ధారపోశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ దేశంలో సామాజికన్యాయం అమలు కావడం లేదని చెప్పారు. మనదేశం కులవ్యవస్థకు ప్రాధాన్యతనిస్తోందని, అందుకే అంబేడ్కర్‌ను ఓ కులానికి నాయకుడిగా చూపుతున్నారని తెలిపారు. అంతకుముందు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన భావజాలాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ అంబేడ్కర్‌ది మహోన్నత వ్యక్తిత్వమని చెప్పారు. అంబేడ్కర్ మార్గాన్ని అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ గంగారావు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనంటూ, అందరి హక్కుల పరిరక్షణకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇది సామాజిక కేబినెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మహా విప్లవం తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించిన ధీరోదాత్తుడు సీఎం జగన్ అని కొనియాడారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని మరోసారి నిరూపించారని చెప్పారు. అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగ లేదన్నారు. ఈసారి 25 మంది మంత్రుల్లో 70% బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదని, ఏనాడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఇప్పటి వరకు కేబినెట్లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారన్నారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదని తెలిపారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. సామాజిక న్యాయం నినాదం కాదు.. నిజం ► సామాజిక న్యాయం అన్నది నినాదం కాదని, నిజం చేసిన ఏకైక సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు పదవులిస్తున్నారు. అన్నీ పరిశీలించాకే కేబినెట్ తుది జాబితా ఇచ్చారు. ► తరతరాలుగా పేదరికంలో ఉన్న వర్గాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఏర్పాటైనప్పటి నుంచి మనసా వాచా కర్మణా అడుగులు వేస్తోంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టింది మొదలు ఇదే విధానంతో ముందుకు వెళ్తున్నారు. ► పాదయాత్ర సమయంలో అన్ని బీసీ కులాలతో సమావేశమై.. వారి ఇబ్బందులపై అధ్యయనం చేయించి, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసి బీసీలకు తాను చేయబోయే మంచి గురించి జగన్ వివరించారు. 2019లో అధికారంలోకి రాగానే వాటిని ఆచరణలో పెట్టారు. ► గత కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, 11 మంది ఓసీలకు అవకాశం కల్పించడం విప్లవాత్మక చర్య. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు కేబినెట్‌తో పోలిస్తే ఇది చాలా గొప్పది. బాబు బీసీలకు ఏమీ చేయలేదు. చంద్రబాబు అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు ► సోమవారం ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను పరిశీలిస్తే సీఎం జగన్.. బీసీలకు 10, ఎస్టీ 1, మైనారిటీ 1, ఎస్సీలకు 5 స్థానాలు కేటాయించారు. బీసీలకు ఆత్మబంధువు అని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదు. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం తప్ప. ► 2014లో 19 మందితో చంద్రబాబు ఆ వర్గాల వారికి 12 పదవులు మాత్రమే ఇస్తే.. ఇవాళ మేము 17 పదవులు ఇచ్చాం. నాడు ఎస్టీ, మైనార్టీలకు చోటే లేదు. అప్పుడు ఓసీ వారు 11 మంది కాగా, మిగిలిన అన్ని వర్గాల వారు కేవలం 8 మంది మాత్రమే. ► చంద్రబాబు తన కుమారుడిని కేబినెట్లోకి తీసుకోవడం కోసమే మంత్రి వర్గంలో మార్పులు చేశారు. 19 మందిలో ఐదుగురిని తీసేసి, 11 మందిని కొత్తగా తీసుకుని మొత్తం 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఓసీలు 15 మంది ఉన్నారు. చంద్రబాబు ఇలా అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు. అందరూ అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.. ► మొదటి నుంచీ సీఎం జగన్ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 70 శాతానికి పెంచారు. గతంలో ముగ్గురు మహిళలు ఉండేవారు. ఈ రోజు నలుగురుకి అవకాశం కల్పించారు. ► నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు. ఇది ఎన్నికల కోసం చేసింది కాదు. ఈ విషయాన్ని మేధావులు అందరూ గమనించాలి. ► కేబినెట్ పదవి అన్నది అధికారమే తప్ప హక్కు కానేకాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 25 కేబినెట్ బెర్తులు మాత్రమే ఉన్నాయి. అందరికీ మంత్రులుగా అవకాశం రాదు. కొంత మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం. పదవి వస్తే ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదు. రాకపోతే ప్రాధాన్యత ఇవ్వనట్లు అసలే కాదు. ఈ విషయాన్ని అందరు ఎమ్మెల్యేలూ అర్థం చేసుకుని, సహకరిస్తున్నారు. ► దివాళా తీసిన టీడీపీ ఎక్కడ అలజడి రేగుతుందా.. అని ఎదురు చూస్తోంది. అసంతృప్తి ఉన్నట్లు ఎల్లో మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మా పార్టీలో అసంతృప్తికి చోటు లేదు. అవకాశం రాలేదనుకుంటే పొరపాటే ► రాబోయే ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే నాయకులను జిల్లా స్థాయిలో కొంత మందిని, రాష్ట్ర స్థాయిలో మరికొంత మందిని వాడుకుంటాం. రకరకాల బాధ్యతలు ఇచ్చి ప్రా«ధాన్యత కల్పిస్తాం. అవకాశం రాలేదని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ► ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నది సీఎం జగన్ మాత్రమే. అందరిపై సీఎం జగన్‌కు ఒకే రకమైన అభిప్రాయం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా కేబినెట్ కూర్పు చేశారు. జిల్లాలు, సామాజిక వర్గాలను బట్టి కూర్పులో ప్రాధాన్యత ఇచ్చారు. ► మహాయజ్ఞంలా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది. వెనుకబడిన వర్గాలకు మొదటిసారిగా భారీ స్థాయిలో మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ముదునూరు ప్రసాదరాజు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్‌గా కొడాలి నానిని నియమించి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరిని బ్యాలెన్స్ చేయడంలో సీఎం జగన్ సఫలీకృతం అయ్యారు. ► సీఎం దృష్టిలో పార్టీ పదవి, మంత్రి పదవి రెండూ ఒక్కటే. ఎక్కడైనా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తే నాయకులు సర్ది చెబుతున్నారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. -
సామాజిక మహా విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరికొత్త సామాజిక మహా విప్లవం ఆవిష్కృతమయ్యింది. తొలిసారిగా 2019 నాటి కేబినెట్ కూర్పులో మొత్తం 25కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే 14 మంత్రి పదవులిచ్చి వారిని మెజారిటీ వర్గంగా కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. సామాజిక న్యాయాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తూ... తాజా పునర్వ్యవస్థీకరణలో ఏకంగా ఆ సంఖ్యను 17కు పెంచారు. దీంతో సోమవారంనాడు కొలువు దీరనున్న కొత్త కేబినెట్లో బలహీనవర్గాలకు చెందిన మంత్రుల సంఖ్య 70 శాతానికి చేరుతోంది. ఇక ఆది నుంచి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు... సొసైటీకి బ్యాక్ బోన్ (వెన్నెముక) క్లాస్ అని చెబుతున్న సీఎం... వారికి దీనిలో 10 బెర్తులు కేటాయించి కొత్త చరిత్రను ఆరంభించారు. అనుభవం, సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇదివరకటి కేబినెట్లో ఉన్న 11 మందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. కాకపోతే అందులోనూ ఇద్దరు ఓసీలు కాగా, మిగిలిన వారంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన వారు కావటం గమనార్హం. మహిళలకు సైతం సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ... ఇప్పటిదాకా ముగ్గురే ఉండగా ఇపుడా సంఖ్యను నాలుగుకు పెంచారు. అగ్రకులాల నుంచి నలుగురు కాపు, నలుగురు రెడ్డి కులస్తులకు మాత్రం కేబినెట్లో స్థానం కల్పించి... కొడాలి నానికి (కమ్మ) రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, విజయనగరానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి (వైశ్య) డెప్యూటీ స్పీకర్‌గా, ముదునూరి ప్రసాదరాజుకు (క్షత్రియ) చీఫ్ విప్‌గా, మల్లాది విష్ణుకు (బ్రాహ్మణ) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. తెలుగుదేశానికి పూర్తి భిన్నంగా... టీడీపీకి బీసీలే వెన్నుముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు తప్ప నిజంగా బీసీలకు చేసిందేమీ లేదని తాజా పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. గతంలో బాబు హయాంలో ఎప్పుడూ మెజారిటీ మంత్రివర్గ స్థానాలు అగ్రకులాలకే కేటాయించేవారని, సగానికన్నా ఎక్కువ స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించిన పరిస్థితి టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో 2017లో తన కుమారుడు లోకేష్ కోసం మంత్రివర్గాన్ని విస్తరించిన చంద్రబాబునాయుడు... 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంఖ్యను 10కే పరిమితం చేశారని,, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని... ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఆయా వర్గాల నుంచి ఓట్ల కోసం ఒక్కొక్కరికి హడావుడిగా స్థానమిచ్చి నాటకమాడారని వారు గుర్తు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి అటు చంద్రబాబు ... ఇటు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇదీ... వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం ► రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆశీస్సులు, మద్దతుతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ► 2019 జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 14 మంది (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఓసీ వర్గాల నుంచి 11 మందికి (44 శాతం) మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. ► ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇస్తే.. అందులో నాలుగు పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కట్టబెట్టారు. తద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం వైఎస్ జగన్ చాటి చెప్పారని రాజకీయ పరిశీలకులు అప్పట్లో ప్రశంసించారు. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. రాష్ట్ర శాసన మండలి చరిత్రలో తొలి సారిగా చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంను నియమించారు. ► శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లోనూ.. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వెఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఈ వర్గాలకు 67 శాతం పదవులు కేటాయించారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ► నామినేటెడ్ పదవుల్లో.. నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. విప్లవాత్మక నిర్ణయాల అమల్లో మరింత ముందుకు.. ► సామాజిక న్యాయ సాధనలో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సీఎం వైఎస్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ► 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఓసీ వర్గాలకు చెందిన ఎనిమిది మందికి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి చోటు కల్పించారు. ఇందులో పది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు.. ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అంటే మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. సామాజిక న్యాయంలో ఇది మహా విప్లవంగా రాజకీయ పరిశీలకులు, సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ► 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మహిళలకు మూడు మంత్రి పదవులు ఇస్తే.. పునర్ వ్యవస్థీకరణలో నలుగురికి మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు తాను ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. చంద్రబాబు సామాజిక మోసం ► విభజన నేపథ్యంలో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకుంది. 2014 జూన్ 8న 19 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఓసీలకు 11 మంది (58 శాతం)కి.. ఆరుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలకు.. వెరసి బీసీ, ఎస్సీలకు 42 శాతం మందికి చోటు కల్పించిన చంద్రబాబు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. ► కొడుకు నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యున్ని చేసిన చంద్రబాబు.. 2017 ఏప్రిల్ 2న తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. 25 మందితో ఏర్పాటు చేసిన ఆ మంత్రివర్గంలో ఏకంగా 15 మంది ఓసీల(60 శాతం)కు పదవులు ఇచ్చారు. కేవలం ఎనిమిది పదవులు బీసీలకు, రెండు పదవులు ఎస్సీలకు ఇచ్చారు. అంటే బీసీ, ఎస్సీలకు మంత్రివర్గంలో కేవలం 40 శాతం పదవులే ఇచ్చారు. ► బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు 2018 నవంబర్ 11న రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కనీసం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తికి.. ఆ పదవికి ఎన్నికయ్యేందుకు తగిన సమయం లేకున్నా ఓట్ల కోసం గిరిజన వర్గానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం చంద్రబాబు సామాజిక మోసానికి నిలువెత్తు నిదర్శనం. ► మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ ఫరూక్‌కు అదే సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పించారు. చివరి సారిగా మంత్రివర్గ విస్తరణను కలుపుకున్నా.. 13 మంది ఓసీలకు.. 12 మంది ఇతర వర్గాలకు పదవులు కేటాయించి సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేశారు. -
AP: సామాజిక అధికారం
సాక్షి, అమరావతి : సామాజిక న్యాయం అంటే ఎలా ఉంటుందో రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న పాలన స్పష్టం చేస్తోంది. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించినప్పుడే.. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న నిరుపేదలకు చేరుతాయన్నది సీఎం వైఎస్ జగన్ నమ్మకం. అప్పుడే వారు పురోభివృద్ధిలోకి వస్తారని.. ఇది సమసమాజ స్థాపనకు దోహదం చేస్తుందన్నది ఆయన విశ్వాసం. ఇందుకోసం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే నడుం బిగించారు. మంత్రివర్గం ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 60 శాతం పదవులు ఇస్తూ తొలి అడుగులోనే సరి కొత్త సామాజిక రాజకీయ విప్లవాన్ని సృష్టించారు. 34 నెలల్లో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవులనూ సింహ భాగం ఆ వర్గాలకే కేటాయిస్తూ ఎప్పటికప్పుడు సామాజిక న్యాయానికి సరి కొత్త నిర్వచనం ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం ఆ వర్గాలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేశారు. అందులోనూ సరిగ్గా సగం... అంటే 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తూ మరో చట్టం తీసుకొచ్చారు. వాటిని నిక్కచ్చిగా అమలు చేసి సామాజిక న్యాయమంటే ఇదేనని దేశానికి చాటి చెబుతున్నారని వివిధ రంగాల్లోని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించడాన్ని అభినందిస్తున్నారు. నాడు మాటల్లో.. – రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జనసేన, బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది. టీడీపీకి బీసీలే వెన్నెముక అని చెప్పే చంద్రబాబు.. అది ఓట్ల కోసమేనని అనేక సార్లు బయటపడిపోయారు. – 2014 జూన్ 8న చంద్రబాబు తొలిసారిగా 19 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తే.. అందులో కేవలం ఇద్దరు ఎస్సీలు, ఆరుగురు బీసీలకు స్థానం కల్పించారు. ఏకంగా 11 స్థానాలను అగ్రవర్ణాలకు ఇచ్చారు. అధికారం నుంచి దిగిపోయే వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. – ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని ఎస్సీలను.. సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకోవడానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను తోలుతీస్తానంటూ బెదిరించిన చంద్రబాబు.. సామాజిక న్యాయం పట్ల తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందన్నది తానే బహిర్గతం చేసుకున్నారు. నేడు చేతల్లో.. – దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86 శాతం), 22 లోక్‌సభ స్థానాల (88 శాతం)ను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని ఆఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. – ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం మంత్రి పదవులు ఇస్తూ 2019 జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. హోం శాఖ మంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళను నియమించారు. – అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, జల వనరులు, విద్య, రహదారులు భవనాలు వంటి కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి, వారికి పరిపాలనలో ప్రాధాన భాగస్వామ్యం కల్పించారు. – శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. శాసనమండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజును, వైస్ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ జకియా ఖానంను నియమించారు. ఇదీ సామాజిక న్యాయమంటే – శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. – వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. – జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆఖండ విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లనూ క్వీన్ స్వీప్ చేసింది. 13 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవుల్లో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. – మండల పరిషత్ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం పదవులను కేటాయించారు. – 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లోనూ అగ్రాసనం – రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. – వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. – 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. -
సామాజిక న్యాయానికే మరింత పెద్దపీట?
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గరపడింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక కూర్పు, అనుభవం, జిల్లాల అవసరాల ప్రాతిపదికన ప్రస్తుత మంత్రివర్గంలో 7 నుంచి 10 మందిని కొనసాగించే అవకాశముందని తెలిసింది. కొత్తగా 14 నుంచి 17 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక మంత్రివర్గం ఏర్పాటు నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు.. మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు వరకూ అన్నింటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019, జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. నాటి కేబినెట్లో ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులకు, నలుగురు రెడ్డి సామాజికవర్గం వారికి అవకాశం కల్పించారు. గిరిజన, మైనార్టీ, క్షత్రియ, వైశ్య, కమ్మ వర్గాల నుంచి ఒక్కొక్కొరికి స్థానం కల్పించారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురికి అవకాశం ఇస్తే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళలను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించారు. రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా.. సంక్షేమాభివృద్ధి పథకాలను ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి చేర్చి.. అభివృద్ధి పథంలోకి తేవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇక రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పుచేసి.. కొత్త వారితో ఏర్పాటు చేస్తానని.. పాత వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని మొదట్లోనే సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కానీ, కరోనా కారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొత్త కేబినెట్ కూర్పుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తొలుత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే.. ఇప్పుడు మరింత అధికంగా ప్రాధాన్యత దక్కుతుందని తెలిసింది. సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలు ప్రాతిపదికన మంత్రివర్గం ఏర్పాటుచేస్తారని చెబుతున్నారు. ఆశావహులు వీరే.. ► బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాలనాయుడు, పొన్నాడ సతీష్‌కుమార్, విడదల రజని, జోగి రమేష్, కొలుసు పార్థసారధి, బుర్రా మధుసూదన్ యాదవ్, కరణం ధర్మశ్రీ, ఉషాశ్రీ చరణ్.. ► ఎస్సీ సామాజికవర్గం నుంచి కొండేటి చిట్టబ్బాయ్, తలారి వెంకట్రావు, ఎలీజా, రక్షణనిధి, మేరుగ నాగార్జున, కిలివేటి సంజీవయ్య, కోరుముట్ల శ్రీనివాసులు, జొన్నలగడ్డ పద్మావతి.. ► ఎస్టీ సామాజికవర్గం నుంచి కళావతి, పీడిక రాజన్నదొర, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి.. ► ఓసీ సామాజికవర్గాల నుంచి ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి ► మైనార్టీ వర్గం నుంచి హఫీజ్ ఖాన్, ముస్తఫా తదితరులు మంత్రివర్గంలో ఆశావహులుగా ఉన్నారు. -
‘చేతి’కి చేదోడు
సాక్షి, అమరావతి: స్వయం ఉపాధినే నమ్ముకున్న చేతివృత్తిదారులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా వివక్షకు గురవుతూ కష్ట జీవులైన వీరంతా పండుగ సమయాల్లో కూడా ఇతరులకు సహాయపడే పనుల్లోనే నిమగ్నమవుతున్నారని గుర్తు చేశారు. అయితే వారి శ్రమకు తగిన ఆదాయం లభించని పరిస్థితులు నెలకొన్నాయని, చేతివృత్తిదారులకు చేయూత అందించకుంటే మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందన్నారు. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పి చెడు చేసిన గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరారు. మంచి మనసుతో పనిచేస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. భారీ స్వయం ఉపాధి రంగం స్వయం ఉపాధి రంగంలో అతి ఎక్కువగా దాదాపు 2.85 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. చేతివృత్తిదారులకు మనమంతా తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. వీరికి మంచిచేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు వారి అకౌంట్లలోకి బదిలీ చేస్తున్నాం. 98,439 మంది రజక సోదరులు, అక్కచెల్లెమ్మలకు రూ.98.44 కోట్లు ఇస్తున్నాం. 40,808 నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు రూ.40.81 కోట్లు సాయాన్ని నేరుగా అందజేస్తున్నాం. ఆ కష్టాలు స్వయంగా చూశా.. చేతివృత్తిదారుల శ్రమకు తగిన ఆదాయం దక్కని పరిస్థితులున్నాయి. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి రాగానే జగనన్న చేదోడు పథకాన్ని తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రెండున్నరేళ్లలో మొత్తం రూ.583.78 కోట్లు చేతివృత్తిదారులకు అందజేశాం. ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లిచ్చి కమీషన్లు కొట్టేశారు.. గత సర్కారు హయాంలో ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు లాంటివి ఏ కొద్దిమందికో ఇచ్చి అందులోనూ కమీషన్లు కొట్టేశారు. అవి కూడా నాసిరకం, ఉపయోగపడని సామాన్లే. ఎంతో మేలు చేసే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిన పరిస్థితులను కూడా గత ప్రభుత్వంలో మనం చూశాం. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అంటూ చెడు చేసిన గత ప్రభుత్వానికి, మంచి మనసుతో నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉందో గమనించమని కోరుతున్నా. బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ బీసీలంటే పనిముట్లు కాదు.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్‌లు కాదు. వారు సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మి ఆచరిస్తున్నాం. వారి జీవితాల్లో మార్పులు రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిగతా వారితో పోటీపడి ఎదగాలి. అందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని ఈ రెండున్నరేళ్లుగా మనసా, వాచా తపించాం. మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం లాంటి పథకాలతో పాటు నవరత్నాలతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ప్రతి అడుగులో తోడుగా నిలబడ్డాం. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ వాహనమిత్ర.. ఇలా పలు పథకాలను తెచ్చాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, 30 లక్షలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వడం ఇలా ఏది తీసుకున్నా ఎన్నికల ముందు ఏలూరులో ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తి.. వారికి ముద్దుబిడ్డ ► ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈరోజు రామోజీరావుకు.. అంటే ఈనాడుకు ముద్దుబిడ్డ. ► బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఇవాళ ఏబీఎన్, టీవీ 5కి ముద్దుబిడ్డ. ► బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్రజెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్. ► ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా బాబు బినామీల భూముల రియల్ ఎస్టేట్ కోసం కామ్రేడ్ సోదరులు జెండాలు పట్టుకునే పరిస్థితి. ► అమరావతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ప్రభుత్వం ఇంటి స్థ్ధలాలను కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసిన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న మహానుభావుల్లో మన కామ్రేడ్లు ఉన్నారంటే వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో గమనించాలని కోరుతున్నా. – సీఎం జగన్ రెండున్నరేళ్లలో ఏం చేశామో మచ్చుకు కొన్ని.. ► బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. కేబినెట్ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం మంత్రి పదవులిచ్చిన ప్రభుత్వం మనదే. ఐదుగురు డిప్యూటీ సీఎంలకు గానూ నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. ► శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇచ్చి గౌరవించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే అందులో 18 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు బీసీలకే ఇచ్చాం. ► స్థానిక సంస్థ్ధల ఎన్నికల్లో మొత్తం 650 మండలాలలో వైఎస్సార్ సీపీ 636 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా 427 మండల అధ్యక్ష పదవులు అంటే 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 9 పదవులు అంటే 69 శాతం ఇచ్చాం. ► 13 నగర కార్పొరేషన్ ౖచైర్మన్ల ఎన్నికలకు వెళ్లి దేవుడి దయతో 13 మనమే గెలిచాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 12 పదవులు అంటే 92 శాతం ఇచ్చాం. ► 87 మున్సిపాల్టీలలో 84 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధించగా 61 ౖచైర్మన్ పదవులు అంటే 73% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 118 అంటే 60 శాతం చైర్మన్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. ► నామినేటెడ్ కింద 137 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకుగానూ 79 పదవులు అంటే 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ► 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో 281 పోస్టులు అంటే 58 శాతం ఈ వర్గాలకే ఇచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనదే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో 83%ం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వగలిగాం. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకున్నారు. వారు ఏమన్నారంటే.. బీసీలు ఇది తమ ప్రభుత్వమని భావిస్తున్నారు ఈ రోజు చేదోడు పథక రచనలోనే మీ మనసును ఆవిష్కరించారు. పేదరికంలో ఉన్నవారిని అందులోంచి బయటపడేసేందుకు మీరు పాదయాత్ర అనే తపస్సు చేశారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మీకెన్ని కష్టాలు వచ్చినా వారిని ఆదుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని జీవించే రజకులు కానీ.. ఇతరులు కానీ ఏ పథకం వచ్చినా వారికి అదనంగా ప్రోత్సాహం ఇవ్వాలని రూ.10 వేలు రెండో ఏడాదీ ఇస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పథకం అమలు చేస్తున్నారు. తన అవసరాన్ని ఎవరికీ చెప్పుకోకుండా కేవలం భగవంతుడికే చెప్పుకున్నా అది జగనన్నకు వినపడింది. ఆ కుటుంబాల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడి ఇది తమ ప్రభుత్వం అని భావిస్తున్నారు. బలహీన వర్గాల వారి కష్టాలను మీరు తీరుస్తున్నారు. మీకు సూర్యభగవానుడు మరింత శక్తిని ఇవ్వాలని, మీ ద్వారా రాష్ట్రంలో పేదలందరికీ మంచి జరగాలని, మీరు తలపెట్టిన యజ్ఞఫలం ప్రజలకు అందే సమయంలో మీకు ఆ భగవంతుడు మరింతగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏ ప్రభుత్వం చేయని సాయం మీరు చేశారు ఆరేళ్లుగా టైలరింగ్ సెంటర్ నడుపుకుంటున్నాను. నా దగ్గర ముగ్గురు పని చేస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మాకు అందలేదు. మీరు చేస్తున్న సాయం మా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది. కరోనా కష్టకాలంలో ఈ సాయం మాకు చాలా ఉపయోగకరం. ఈ డబ్బుతో నేను టైలరింగ్ మెటీరియల్ తెచ్చుకుంటాను. నాకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలం వచ్చింది. మేం మా తల్లిదండ్రులకు సాయం చేసే పరిస్థితుల్లో లేకపోయినా మీరు మా ఇంటి పెద్దకొడుకులా వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చారు. వారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – తిరుమలశెట్టి వెంకట రమణమ్మ, టైలర్, కాకినాడ కరోనా టైంలో చాలా సాయం చేశారు నేను 15 ఏళ్లుగా టైలరింగ్ చేస్తున్నాను. మీరు పాదయాత్రలో మా కష్టాలు చూసి మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన డబ్బుతో నా షాప్ అభివృద్ధి చేసుకున్నాను. ఇప్పుడు రెండో విడత వస్తున్న డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటాను. నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి. రాష్ట్రంలో అనేకమంది పేద పిల్లలకు మీరు మంచి చదువులు చెప్పిస్తున్నారు. కరోనా టైంలో మీరు చాలా సాయం చేశారు. మీరు ప్రతి పథకాన్ని ఆపకుండా నెరవేరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. – ఎన్.సరళ, టైలర్, చిన్నాపురం, మచిలీపట్నం నాయీ బ్రాహ్మణులకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు గతంలో సాయం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు గతంలో మా నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాల్లో కూడా మాకు స్థానం కల్పించారు. మాకు ఉచిత కరెంట్ ఇచ్చారు. సెలూన్ షాప్లున్న నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మేం ఎవరూ కూడా బిల్ కట్టడం లేదు. గతంలో కరెంట్ బిల్లు గురించి చాలా ఆందోళన చెందేవాళ్లం. ఇప్పుడా ఇబ్బంది లేదు. గతంలో మేం చాలాసార్లు అందరినీ కలిశాం. ఎవరూ సాయం చేయలేదు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. – స్వామి చంద్రుడు, నాయీబ్రాహ్మణ సంఘ నాయకుడు, కర్నూలు దరఖాస్తు చేసుకోగానే సాయం నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్నాను. ఈ పథకం గురించి వలంటీర్ చెప్పారు. నేను దరఖాస్తు చేసుకోగానే సాయం అందింది. మీరు రెండో విడతగా చేస్తున్న సాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా అమ్మకు ఇంటి స్థలం వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందింది. నాకు డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగింది. థాంక్యూ అన్నా. – సంతోషికుమారి, టైలర్, విజయనగరం -
నేను ఏర్పాటు చేస్తున్న ‘సమాఖ్య’లోకి రండి: ఎంకే స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్లక్ష్యానికి గురవుతున్న వెనుకబడిన సామాజికవర్గాల సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేస్తున్న అఖిల భారత సామాజిక సమాఖ్యలో భాగస్వాములు కావాలని జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్తో పాటు దేశంలోని 37 పార్టీలకు బుధవారం ఈ మేరకు ఆయన లేఖ రాశారు. జాతీయ స్థాయిలో పార్టీలన్నీ సహకరిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని అందులో పేర్కొన్నారు. గత నెల 26న గణతంత్ర దినోత్సవం వేడుకల రోజు స్టాలిన్ ఈ సమాఖ్య ఏర్పాటును ప్రకటించడం తెలిసిందే. మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యంతో మన దేశ ప్రత్యేకమైన, వైవిధ్యమైన, బహుళ-సాంస్కృతిక సమాఖ్యకు ముప్పు వాటిల్లిందని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్నవారంతా ఏకమైతేనే ఈ శక్తులతో పోరాడగలమని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఏవిధంగా పోరాటం చేశామో.. అదే విశ్వాసం, ధ్యేయంతో ఏకం కావాలని పిలుపునిచ్చారు. (క్లిక్: 'సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) -
ప్రభుత్వ, రాజకీయ పదవుల్లోనూ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నమ్మకం, విశ్వసనీయత అని, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అదే కోవలో ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకాన్ని పొందారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆలిండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాని వ్యవస్థాపకుడు జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం సామాజిక న్యాయం అంశంపై జాతీయ స్థాయి వెబినార్ జరిగింది. ముఖ్య అతిథిగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, పలువురు ఎంపీలు, ఎన్జీవో సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలూ విద్యకు పెద్దపీట వేస్తున్నాయని చెప్పారు. విద్యకోసం చేసే ఖర్చు రానున్న తరాల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అనేది సీఎం జగన్ భావజాలమని మంత్రి వివరించారు. ఏపీలో రాజకీయ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తూ 50 శాతం మహిళలకు కేటాయించటమేగాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మంత్రివర్గంలోనూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. -
Andhra Pradesh: చేతల్లో.. సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 47 కార్పొరేషన్ల డైరెక్టర్లుగా సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని, మహిళలను నియమించడం ద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని సీఎం వైఎస్ జగన్ మరోసారి దేశానికి చాటి చెప్పారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో సంక్షేమ పథకాల అమలే కాకుండా, పదవుల పంపకంలోనూ ఆ వర్గాల ప్రజలకే అధిక శాతం కేటాయిస్తుండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. దీని వల్ల అట్టడుగు వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. తద్వారా సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. శనివారం 47 కార్పొరేషన్లలో 481 డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఇందులో 52 శాతం పదవులు అంటే 248 డైరెక్టర్ల పదవుల్లో మహిళలను నియమించింది. మిగిలిన 48 శాతం అంటే 233 డైరెక్టర్ల పదవుల్లో పురుషులకు అవకాశం కల్పించింది. డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని నియమించింది. మిగతా 48 శాతం ఓసీ వర్గం వారికి కేటాయించింది. సామాజిక రాజకీయ విప్లవానికి నాంది రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల్లోనే అధిక శాతం శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టికెట్లు ఇచ్చి సామాజిక రాజకీయ విప్లవానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన తర్వాత మంత్రి వర్గంలోనూ 60 శాతం పదవులను ఆ వర్గాలకు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి సరి కొత్త నిర్వచనం చెప్పారు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లోనూ ఆ వర్గాల ప్రజలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే అవకాశం కల్పించేలా ఏకంగా చట్టాన్ని తెచ్చారు. మాటలు కాదు.. చేతల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 137 నామినేటెడ్ పదవుల్లో 58 శాతం అంటే 79 పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ తరఫున 15 ఎమ్మెల్సీ పదవుల్లో 11 పదవులను ఆ వర్గాల వారికే కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు.. మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ పదవుల్లో 78 శాతం.. అందులో 60.46 శాతం పదవులు మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలన్నీ ‘నవరత్నాల’ సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరడానికి దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. తద్వారా ఆయా వర్గాల్లోని పేద ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుందని, ఇది సామాజికాభివృద్ధి.. మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని విశ్లేషిస్తున్నారు. -
YS Jagan: బడుగుల హృదయాల్లో శాశ్వత స్థానం
సామాజిక విప్లవాలు కేవలం నినాదాలు, డిమాండ్లు, డిక్లరేషన్లలతో ఉద్భవించవని.. పాలకుడి చిత్తశుద్ధితోనే సాధ్యం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి తాజాగా రుజువు పరిచారు. సుదీర్ఘకసరత్తు చేసి అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 135 రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ పదవులను, ఇతర కీలక పదవులను భర్తీ చేసి అందులో 57% పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని నియమించడం ద్వారా ఓ నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని ఓ గొప్ప సామాజిక విప్లవానికి అంకురార్పణ చేశారు. ఈ గౌరవాభి మానాలకు బడుగువర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆనందంతో వారు సంబరాలు జరుపుకున్నారు. అయితే, సామాజిక న్యాయానికి నిజమైన అర్థం తెలియని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడుతున్న కొన్ని మీడియా సంస్థలు.. ఇందులో కూడా మంచిని గ్రహించలేకపోయాయి. కువిమర్శలకు పాల్పడ్డారు. నిధులు లేని కార్పొరేషన్లను బలహీనవర్గాలకిచ్చారని సత్యదూర ప్రచారం చేశారు. 2007లో టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్‌లో బీసీల సదస్సు నిర్వహించి.. 2009 సాధారణ ఎన్నికలలో తమ పార్టీ తరఫున బీసీలకు 100 టికెట్లు ఇస్తామని ఓ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీల్లో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించారు. ఆ వర్గాలను తన చుట్టూ తిప్పుకొన్నారు. తీరా ఎన్నికలొచ్చేసరికి.. తన సహజ ప్రవత్తిని చాటుకొంటూ బీసీలకు మొండిచేయి చూపించారు. బీసీలకు కనీసం 60 పార్టీ టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. పైగా, 100 సీట్లు బీసీలకు ఇస్తే వారు గెలవలేరంటూ ఓ కుంటి సాకు చెప్పారు. మాట తప్పినందుకు చంద్రబాబు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. బీసీలకు క్షమాపణ చెప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్లపాటు అధికారం అనుభవించిన చంద్రబాబు ఏనాడూ సమాజంలో దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురౌతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన దాఖలాలులేవు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన క్యాబినెట్లో దాదాపు 4 ఏళ్లకుపైగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించకుండా అవమాన పరి చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను భర్తీచేస్తే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు భాగస్వామ్యం కల్పించాల్సి వస్తుందనే దుర్బుద్ధితో.. అనేక పదవులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేశారు. బడుగులకు సముచిత భాగస్వామ్యం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. అధికారంలోకి వస్తే వివిధ బీసీ వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ‘నవరత్నాలు’గా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. బలహీన వర్గాలకు సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పించడానికి 2019 ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిల్లో 41 సీట్లు బీసీ వర్గాలకు కేటాయించారు. ఎన్నికల సమయంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులలో 50% బలహీన వర్గాలకు కేటాయిస్తామని చెప్పారు. నామినేటెడ్ పదవులలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. బీసీవర్గాలకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక కార్పొరేషన్ ఉంటే.. వైఎస్ జగన్ తొలిదశలో 57 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటన్నింటికి పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల కూర్పులో 50 శాతం రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 1.80 లక్షల మంది ఉండగా అందులో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారితోనే భర్తీ చేశారు. నేతన్నలు, మత్స్యకారులు, నాయిబ్రాహ్మణులు, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, వడ్రంగులు.. ఇలా ప్రతి బడుగు వర్గానికి ప్రత్యేక పథకాలు ఏర్పరిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకొంటున్నారు. బీసీలను హేళన చేసిన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పేదలైన బహుజన వర్గాలవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడి సామాజిక జీవనంలో సమతుల్యత దెబ్బతింటుందని.. సంపన్నులు నివాసం ఉండేచోట బహుజనులు ఉండరాదన్న ఫ్యూడల్ మనస్తత్వంతో.. స్వయంగా జీవో జారీచేసిన దారుణ చరిత్ర చంద్రబాబుది. ‘న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు’ అంటూ సుప్రీంకోర్టుకు అధికార హోదాలో చంద్రబాబు లేఖలు రాసిన సంఘటనను ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ అనే జాతీయ పత్రిక బయటపెట్టింది. చంద్రబాబులో పడగవిప్పిన అగ్రకుల దురంహంకారం బీసీలను ఎంతో బాధించింది. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు చంద్రబాబును ఎన్నటికీ క్షమించబోమని వారు ఆనాడే శపథం చేశారు. ఇక, తమ సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వెళ్లిన పేద బీసీ కుల వృత్తులవారిని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వేలు చూపిస్తూ బెదిరించిన సంఘటన మరో చీకటి అధ్యాయం. అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా కుల, ప్రాంత, ఆర్థిక వివక్షను చూపించిన చంద్రబాబును బీసీలు ఇకపై ఎందుకు నమ్మాలి? నమ్మించి గొంతు కోసినందుకా? రాజ్యసభ పదవులను ఎస్సీ నేతలకు ఇస్తానని చెప్పి చివరి క్షణం వరకు ఊరించి.. సొంత వారికి ఇచ్చుకున్న చంద్రబాబును ఎస్సీలు ఇకపై నమ్ముతారా? క్రిందటేదాడి 4 రాజ్యసభ సీట్లు ఖాళీకాగా సీఎం జగన్ అందులో రెండింటిని పార్టీలోని సీనియర్ బీసీ నేతలకు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం చేయడం కాదా? గతాన్ని మరింత తవ్వితే చంద్రబాబు చేసిన తప్పులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి న్యాయంగా దక్కాల్సిన ఫలాలను ఏవిధంగా అందకుండా చేశారో బయటపడతాయి. మరోపక్క అవకాశం వచ్చినప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వర్గాల వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా చంద్రబాబు, టీడీపీ నాయకులు సామాజిక న్యాయానికి కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారాన్ని సాగించినంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండాపోతాయా? - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
YSRCongress Party: చేతల్లో సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సామాజిక న్యాయాన్ని మరోమారు చేతల్లో చూపించింది. సంక్షేమ పథకాలే కాదు.. పదవుల పంపకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తామని రుజువు చేసింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లోనూ వారికే ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల పాలక వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 74 మునిసిపాలిటీల్లో శుక్రవారం రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కోరం లేక రెండో మునిసిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నగర, పట్టణ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని కూడా సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు మునిసిపల్ పాలక మండళ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. రాష్ట్రంలో 85 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. వీరిలో బీసీ, మైనార్టీలు 24 మంది, ఎస్సీలు 22 మంది, ఎస్టీలు ఇద్దరు ఉన్నారు. ఈ లెక్కన 56 శాతం మేర బడుగు, బలహీన వర్గాలకు చెందిన మొత్తం 48 మంది రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయగా, 37 మంది ఓసీ కేటగిరి నుంచి ఆ స్థానాలు పొందారు. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో టీడీపీ మద్దతుదారుడు రెండో వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కేటాయింపునకు మించి.. వైఎస్సార్సీపీ గెలుపొందిన 12 మేయర్, 74 మునిసిపల్ చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 పదవులను కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. నిజానికి చట్టప్రకారం 45 పదవులు కేటాయిస్తే సరిపోతుంది. కానీ జనరల్ కేటగిరిలోనూ బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు ఇవ్వడమే కాకుండా మంత్రి వర్గంలోనూ 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అంతేకాకుండా 137 నామినేటెడ్ పదవుల్లో 58 శాతం మేర 79 పదవులు ఇచ్చారు. నామినేషన్ పనుల్లో 50 శాతం వారికి కేటాయించడంతో పాటు, వాటిలోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేసి సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా నలుగురు ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. 15 ఎమ్మెల్సీ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు, మున్సిపల్ మేయర్, చైర్ పర్సన్ పదవుల్లో 78 శాతం, వీటిలో 60.46 శాతం మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు తీసుకువచ్చి సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనాన్ని చేతల్లో చూపించారు. ఏలూరు మేయర్ ఎన్నిక ఏకగ్రీవం ఏలూరు టౌన్: ఏలూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా బీసీ మహిళ షేక్ నూర్జహాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో మొదటి డిప్యూటీ మేయర్‌గా గుడిదేశి శ్రీనివాసరావు, రెండో డిప్యూటీ మేయర్‌గా నూకపెయ్యి సుధీర్‌బాబు, విప్‌గా పైడి భీమేశ్వరరావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏలూరు కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొత్తగా కొలువుదీరిన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నూర్జహాన్ మేయర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. కోర్టు తీర్పు కారణంగా ఇక్కడ ఇటీవలే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఏపీ: మున్సిపల్ పదవుల్లోనూ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయ సాధనలో స్వర్ణయుగాన్ని తీసుకువస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించింది. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అగ్రస్థానం వేసింది. 85 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. బీసీలు 24 మందికి, ఎస్సీలు 22 మందికి, ఓసీలు 37, ఎస్టీలు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అన్ని వర్గాలు, కులాలకు వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, మేయర్,మున్సిపల్ చైర్పర్సన్ల పదవుల్లోనూ సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు వైఎస్సార్సీపీ పెద్దపీట వేసి సరికొత్త చరిత్రను లిఖించిన సంగతి తెలిసిందే. చర్రితలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కూడా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అగ్రాసనం వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి. -
సామాజిక న్యాయంలో ఏపీ ఫస్ట్
సాక్షి అమరావతి, సాక్షి నెట్వర్క్: ‘అన్ని వర్గాల వారికి రాజకీయంగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు వైఎస్ జగన్ పాలన సువర్ణ యుగం’ అని పలువురు మంత్రులు కొనియాడారు. రాష్ట్రంలో శనివారం భర్తీ చేసిన 137 నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకు కేటాయించడంతో పాటు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించడం సాహసోపేతం అని పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సామాజిక సమన్యాయం నామినేటెడ్ పోస్టులను అన్ని వర్గాల వారికి అప్పగించి సీఎం వైఎస్ జగన్ సామాజిక సమన్యాయం చేశారు. కొత్తతరం రాజకీయాలకు జగన్ శ్రీకారం చుట్టారు. సామాజిక న్యాయంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. – శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ సమానత్వం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ సమానత్వం లభించింది. నామినేటెడ్ పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు దక్కాయి. అధికారంలో ఉండగా డబ్బు తూకం పెట్టి పదవులను అమ్ముకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. – తిరుపతిలో నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శం 137 నామినేటెడ్ పదవుల్లో 50.4 శాతం అంటే.. 69 పదవులను మహిళలకు కట్టబెట్టడం ద్వారా.. తాను మహిళా పక్షపాతిననే విషయాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకుని దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఒక మహిళను ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళను హోం మంత్రిగా నియమించడమే కాకుండా.. 56 బీసీ కార్పొరేషన్ పదవుల్లోనూ సగం మహిళలకే ఇచ్చారు. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి స్వతంత్ర భారతంలో రికార్డు 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, పదవుల్లో సమతుల్యత ఇప్పుడు ఏపీలో సాధ్యమైంది. నమ్మిన సిద్ధాంతాన్ని చేతల్లో చూపిస్తూ 137 నామినేటెడ్ పదవుల్లో 79 పదవులు అట్టడుగు వర్గాలకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. ఒక్క మైనార్టీలకే 12 నామినేటెడ్ పదవులు ఇవ్వడం గర్వకారణం. – కడపలో అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి గాంధీజీ, పూలే, అంబేడ్కర్ ఆశయాల కొనసాగింపు రాష్ట్ర ప్రజల మనసు, సమస్యలు తెలిసిన ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్. అధికారంలోకి రాగానే బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. ఇందుకు నిదర్శనం.. కురుబ కులానికి చెందిన నాకు కీలకమైన మంత్రి పదవి ఇవ్వడమే. గాంధీ, పూలే, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం పాలన సాగిస్తున్నారు. – అనంతపురంలో శంకరనారాయణ, ఆర్అండ్బీ మంత్రి చంద్రబాబుకు మాటల్లేవ్ 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా చంద్రబాబు సామాజిక న్యాయం పాటించారా? ఎన్నికల ముందు ప్రచారం కోసం బీసీలను, ఎస్సీ, ఎస్టీలను వాడుకున్నారు తప్ప వారికేం గౌరవం ఇవ్వలేదు. సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం.. సీఎం జగన్ సాధించిన విజయాల్లో ముందు వరుసలో ఉంటాయి. – శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రి -
చేతల్లో సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: రాజకీయంగా సామాజికన్యాయ సాధన దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయ సాధనలో స్వర్ణయుగాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం 137 నామినేటెడ్ పదవులను ప్రకటించగా వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 79 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలకు 69 పదవులు ఇవ్వడం విశేషం. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సమ ప్రాధాన్యమిచ్చారు. 13 జిల్లాల్లోని అన్ని రెవెన్యూ డివిజన్లకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ పదవులను ప్రకటించారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన అర్హులు, సమర్థులైన నేతలను నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయడం ద్వారా తగిన గుర్తింపునిచ్చారని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్దపీట రాజకీయ అధికారాన్ని కల్పించడం ద్వారానే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించగలరన్న తన విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అనుసరించారు. కేవలం రిజర్వేషన్లు ఉన్న స్థానాలకే వారిని పరిమితం చేయాలన్న గత పాలకులకు భిన్నంగా నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం 50 శాతం పదవులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా చట్టం తీసుకురావడం ద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆ చిత్తశుద్ధిని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకు 58 శాతం పదవులు కేటాయించడం విశేషం. మొత్తం 137 పదవుల్లో ఆ వర్గాలకు ఏకంగా 79 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో కూడా కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్లుగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారిని ఎంపిక చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీ టిడ్కో, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, విశాఖపట్నం–కాకినాడ పెట్రోలియం– కెమికల్ – పెట్రో కెమికల్ పెట్టుబడుల సంస్థ, విశాఖపట్నం రీజనల్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ), సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్–ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు, సాహిత్య అకాడమి.. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ మొదలైన కీలక సంస్థల చైర్మన్ పదవులను బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వర్గాలకు అన్ని జిల్లాల్లోనూ కనీసం 50 శాతం పదవులు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. మహిళ సాధికారత దిశగా ముందడుగు మహిళలకు అన్ని రకాల అవకాశాల్లోనూ సగభాగం కల్పించడమే తన విధానమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నారు. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లోనూ అదే విధానాన్ని అనుసరించారు. ఏకంగా 50.40 శాతం పదవులు వీరికి కేటాయించడం ద్వారా తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. శనివారం ప్రకటించిన 137 పదవుల్లో మహిళలకు ఏకంగా 69 పదవులు ఇవ్వడం విశేషం. అత్యంత ప్రాముఖ్యమైన కార్పొరేషన్లకు మహిళలను చైర్పర్సన్లుగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్కాబ్, రాష్ట్ర సైన్స్ – టెక్నాలజీ కార్పొరేషన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ), రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఐడీసీ), రాష్ట్ర పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థ, విశాఖపట్నం రీజనరల్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ), విశాఖపట్నం–కాకినాడ పెట్రోలియం – కెమికల్ – పెట్రో కెమికల్ పెట్టుబడుల సంస్థ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, సాహిత్య అకాడమి, రాష్ట్ర నాటక అకాడమి, రాష్ట్ర దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ మొదలైన కీలకమైన కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులను మహిళలకే కేటాయించారు. వారిలో అత్యధికులు రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గుంటూరులోని 23వ వార్డులో వలంటీర్‌గా ఉన్న పఠాన్ ముంతాజ్‌ను రాష్ట్ర దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించడమే ఇందుకు తార్కాణం. అన్ని జిల్లాల్లోనూ మహిళలకు సమ ప్రాధాన్యమిచ్చారు. ఇది సామాజిక న్యాయ స్వర్ణయుగం ► అణగారిన వర్గాల రాజకీయ, ఆర్థిక అభ్యున్నతి సాధనే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలో సామాజిక న్యాయ స్వర్ణ యుగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. అందుకోసం రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం కేటాయించడం వైఎస్సార్సీపీ విధానంగా ఆయన ఎన్నికల ముందే ప్రకటించారు. ► 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతానికిపైగా సీట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సంప్రదాయంగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న కర్నూలు, అనంతపురం, హిందూపురం, రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గాలను కూడా తొలిసారిగా బీసీలకు కేటాయించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ► ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ ఏకంగా 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ► ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవినీ బీసీ వర్గాలకు ఇచ్చారు. అనంతరం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించారు. ఆ ప్రకారమే దేవలయాలు, మార్కెట్ కమిటీలు, ఇతర పాలక మండళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులు ఇచ్చారు. ► నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు బీసీలనే ఎంపిక చేశారు. తొలిసారిగా శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాస్ చంద్రబోస్, మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. ► 2019లో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ తరఫున, గవర్నర్ కోటాలో 15 మందిని ఎమ్మెల్సీలుగా శాసనమండలికి పంపారు. వీరిలో 11 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. ఎస్సీలకు 4, బీసీలకు 4, మైనార్టీలకు 3 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ► 11 మున్సిపల్ మేయర్లు, 74 మున్సిపల్ చైర్పర్సన్ల పదవుల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఈ పదవులన్నింటిలో 60.46 శాతం మహిళలకు ఇవ్వడం విశేషం. ► రాష్ట్రంలో తొలి సారిగా బీసీ వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్పర్సన్ పదవులను కేటాయించారు. 2019 ఎన్నికల ముందు కూడా బీసీ వర్గానికి చెందిన సుభాస్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తిలను ఎమ్మెల్సీలు చేశారు. ► మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరు కార్పొరేషన్ల ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. ► జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం టికెట్లు ఇచ్చారు. మొత్తం టికెట్లలో మహిళలకు 50 శాతం కేటాయించడం విశేషం. అయితే కోర్టులో కేసు కారణంగా ఈ ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. -
ఎమ్మెల్సీల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాజా నామినేటెడ్ ఎమ్మెల్సీల్లోనూ తన వినూత్నతను చాటుకున్నారు. సహజంగా ఇలాంటి ఎన్నికల్లో లాబీయింగ్, ఆర్థికస్థోమత, రాజకీయ ప్రాబల్యం లాంటి అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాని, వీటన్నింటినీ వైఎస్ జగన్ పూర్తిగా పక్కనపెట్టారు. సమాజంలో దిగువనున్న కులాలకు మరోసారి ప్రాధాన్యత కల్పించారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల్లో తన బీసీ యాదవ కులానికి సీఎం సముచిత ప్రాధాన్యం కల్పించడంద్వారా తన సొంత జిల్లా కడపలో సామాజిక న్యాయానికి వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. సీఎం నిర్ణయం వల్ల కడపజిల్లాలో ఆరున్నర దశాబ్దాల తర్వాత ఎమ్మెల్సీగా బీసీ యాదవ కులానికి చెందిన వ్యక్తి రమేష్‌యాదవ్ గవర్నర్‌కోటాలో నామినేట్ అయ్యారు. రమేష్‌యాదవ్‌కు విద్యావేత్తగా పేరుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1958లో ఏపీలో శాసనమండలి ఏర్పాటైంది. అప్పటినుంచి కడప జిల్లానుంచి 30 మంది ఎమ్మెల్సీలగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్ నిర్ణయం కారణంగా తొలిసారిగా యాదవులకు ఎమ్మెల్సీగా స్థానం లభించింది. గవర్నర్ కోటా కింద నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే... ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లకు గవర్నర్ ఈనెల 10వ తేదీన ఆమోదం తెలిపారు. ఈ నాలుగు సీట్లలో 2 ఎస్సీ, బీసీలకు వైఎస్ జగన్ కేటాయించారు. ఒక సీటును పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్సీకులానికి చెందిన మోషేన్‌రాజుకు ఇవ్వగా, కడపజిల్లాకు చెందిన రమేష్ యాదవ్‌కు రెండో సీటు ఇచ్చారు. మిగిలిన రెండింటిలో తూర్పుగోదావరిజిల్లాకు చెందిన తోట త్రిమూర్తులకు, గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిలను నామినేట్‌చేశారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల కోటాకు గానూ 5 స్థానాల్లో పూర్తి కాలానికి, మరో 4 స్థానాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో 2 స్థానాలకు గత ఏడాది ఆగస్టులో ఎన్నికలు జరిగాయి. తాజా 4 ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేశారు. అంటే మొత్తంగా 15 ఎమ్మెల్సీలకు నామినేటెడ్, ఎమ్మెల్యే కోటాల కింద ఎన్నికల లెక్కన భర్తీచేస్తే ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు ఇచ్చారు. 2018 తర్వాత భర్తీచేసి ఎమ్మెల్సీలో 12 ఎస్సీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. 3 ఓసీలకు ఇచ్చారు. సామాజిక న్యాయానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైయస్.జగన్ ఇస్తున్న సముచిత ప్రాధాన్యతం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి రాకముందు బీసీకి చెందిన జంగాకృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశంకల్పించింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ తరఫున ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు: పండువుల రవీంద్ర బాబు (ఎస్సీ) బల్లికళ్యాణ చక్రవర్తి (ఎస్సీ) డొక్కా మాణిక్య వరప్రసాద్ ( ఎస్సీ) కొయ్య మోషేన్‌రాజు (ఎస్సీ) మోపిదేవి వెంకట రమణ (బీసీ) ( తర్వాత ఈయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగిలిన కాలానికి ఈయన స్థానంలో పీవీవీ సూర్యనారాయణ రాజుకు పార్టీ అవకాశం కల్పించింది) దువ్వాడ శ్రీనివాస్ ( బీసీ) పోతుల సునీత (బీసీ) రమేష్‌యాదవ్ (బీసీ) సి.రామచంద్రయ్య ( బీసీ) జకియా ఖానుం ( మైనార్టీ) మహ్మద్ ఇక్బాల్ (మైనార్టీ) మహ్మద్ కరీమున్నీసా ( మైనార్టీ) చల్లా భగీరథరెడ్డి ( ఓసీ) లేళ్ల అప్పిరెడ్డి (ఓసీ) తోట త్రిమూర్తులు (ఓసీ) -
2 Years Of YS Jagan Rule In AP: బీసీలకు వెన్ను దన్ను
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయం అంటే అసలైన అర్థం ఇదేనని వైఎస్ జగన్ రెండేళ్ల పాలన స్పష్టం చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) వారు రెండేళ్ల క్రితం వరకూ వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరికి దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందలేదు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు... బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారికి అన్ని రంగాల్లో తగిన వాటా ఇచ్చేశారు. రెండేళ్ల పాలనలో ఇటు అభివృద్ది, సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం చేశారు. రాజ్యాధికారంలో కూడా బీసీలకు పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఈ విషయంలో గత చంద్రబాబు సర్కారుతో పోల్చి చూస్తే ఇప్పటి జగన్ సర్కారులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నవరత్నాల ద్వారా బీసీలకు అందించిన ఆర్థిక ప్రయోజనాలే కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో బీసీలకు సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలు మాత్రమే మంజూరుకు చర్యలకు తీసుకున్నారు. అదీ కూడా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా రెండేళ్ల ముఖ్యమంత్రి జగన్ పాలనలో నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని బీసీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక ఆర్థిక ప్రయోజనం పొందారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ► ఎన్నికల ముందు చెప్పిన మేరకు కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు చూడకుండా నవరత్నాల పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించింది. మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం గానీ సిఫార్సులకు ఎటువంటి ఆష్కారం ఇవ్వలేదు. ► వైఎస్సార్ నవశకం పేరుతో అర్హతగల ప్రతి ఒక్కరినీ నవరత్నాల పథకాలకు వలంటీర్ల ద్వారా గుర్తించారు. దీంతో ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హులైన బీసీలందరినీ ఆయా పథకాలకు ఎంపిక చేశారు. వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేశారు. ► 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు అంటే రెండేళ్ల పాలనలో నేరుగా నగదు బదిలీతో పాటు నగదేతర బదిలీ పథకాల ద్వారా 4.52 కోట్ల మంది బీసీలకు (పలువురికి ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి కలిగింది) రూ.65,752.20 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ► ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా 3.31 కోట్ల మంది బీసీలకు రూ.46,405.81 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నగదేతర పథకాల ద్వారా 1.21 కోట్ల మంది బీసీలకు రూ.19,346.39 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే ఉండటం గమనార్హం. -
రూ. 755 కోట్లు విరాళం
చార్లెట్: ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన జాతి వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ ముందుకొచ్చాడు. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు జోర్డాన్ 10 కోట్ల డాలర్ల (రూ. 755 కోట్లు) విరాళం ప్రకటించాడు. ఇందులో 4 కోట్ల డాలర్లు (రూ. 302 కోట్లు) ‘నైకీ’ రూపొందించిన ‘జోర్డాన్ బ్రాండ్’ తరపున అందజేస్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. ‘నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే’. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించేవరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం’ అని 57 ఏళ్ల చికాగో బుల్స్ మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ జోర్డాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టు చార్లెట్ హార్నెట్స్‌కు యజమాని అయిన జోర్డాన్... పోలీసుల దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. -
ఇదీ సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సామాజిక న్యాయం.. బీసీలకు సముచిత స్థానం విషయంలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. దీంతో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచి రాజకీయమైనా.. ప్రభుత్వ కార్యక్రమమైనా సామాజిక న్యాయానికే అగ్రతాంబూలం. దానికి నిదర్శనం ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలే.. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపివేయడంతో.. బీసీలకు 10 శాతం సీట్లను అదనంగా పార్టీపరంగా కేటాయించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 10 శాతానికి మించి జీవీఎంసీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించారు. మొత్తం 98 వార్డుల్లో ఏకంగా 65 వార్డుల్ని బీసీ వర్గాలకే కేటాయించి.. బీసీలకు సామాజిక న్యాయం అందించడంలో తానెంత ముందుంటానో నిరూపించారు. మహావిశాఖ నగరపాలకసంస్థకు ప్రభుత్వం బీసీలకు రిజర్వ్ చేసినవి 32 సీట్లుగా కాగా, అవి కాకుండా అన్రిజర్వ్డ్లోని మరో 33 సీట్లను కేటాయించారు. మొత్తం 65 సీట్లు బీసీలకు ఇచ్చి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. ఎస్సీలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వ్ చేసింది 8 కాగా, మరో 2 సీట్లు అదనంగా కేటాయించారు. -
ఏపీలో సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక పథకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని, మిగతా అన్ని రాష్ట్రాలూ వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ‘పూలే, అంబేడ్కరీ గౌరవ్శాలీ ఔర్ ఆదర్శ్వాదీ ముహిమ్(పగామ్)’ సంస్థ, అఖిల భారత బీసీ సమాఖ్య (ఏఐబీసీఎఫ్), వివిధ రాష్ట్రాల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కలిసి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు 200 ఏళ్లు బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న వివక్ష, స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అందకపోవడంపై జస్టిస్ ఈశ్వరయ్య విశ్లేషించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కాంగ్రెస్ హయాంలోగానీ, బీజేపీ హయాంలో గానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ‘సామాజిక న్యాయం అందాలంటే విద్య ఒక్కటే మార్గమని పూలే, అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. సామాజిక న్యాయం అందాలంటే దేశ సంపద సమానంగా పంపిణీ కావాలి. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే బీసీలు చట్టసభల్లోకి రావాలి. కేంద్ర సచివాలయంలో ఓబీసీ వర్గానికి చెందిన ఒక్క కార్యదర్శి కూడా లేరు. కేంద్ర కేబినెట్లో ఒక్క ఓబీసీ కూడా మంత్రిగా లేరు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉండాలంటే 15 శాతం కూడా అమలు కాలేదు. క్రీమీలేయర్ అని పెట్టి అన్యాయం చేస్తున్నారు’ అని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీలు రాజ్యమేలిన చోటా అందనన్ని ఫలాలు ఏపీలో అందుతున్నాయి.. బీసీలు రాజ్యాధికారం చేపట్టిన రాష్ట్రాల్లోనూ సమన్యాయం జరగడం లేదని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. యూపీలో మాయావతి రాజ్యమేలినా బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ అధికారం చేపట్టినప్పుడు కొన్ని బీసీ కులాలకే న్యాయం జరిగిందన్నారు. బీసీలు రాజ్యమేలిన రాష్ట్రాల్లోనూ అందని ఫలాలను ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మంత్రివర్గంలో బీసీలకు 60 శాతం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు పీజీ వరకూ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ‘నాణ్యమైన విద్యను మాకందించండి.. ఎటువంటి రిజర్వేషన్లూ అవసరం లేదు’ అని పూలే, అంబేడ్కర్ అన్నారని, అటువంటి విద్య అందిస్తున్న జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నవరత్నాల పేరిట సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నారని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పీజీ విద్యార్థులకు వసతి కోసం ఆర్థిక సాయం.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తోందని, విద్య, ఆరోగ్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తరహా కార్యక్రమాలు అమలుచేయాలంటూ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు.. ఏపీ సీఎం నవరత్నాల పేరిట సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నారని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పీజీ విద్యార్థులకు వసతి కోసం ఆర్థిక సాయం.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తోందని, విద్య, ఆరోగ్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తరహా కార్యక్రమాలు అమలుచేయాలంటూ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
‘అంత డబ్బు’ రాహుల్ వల్ల అవుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పేదల సంక్షేమం కోసం కనీస ఆదాయ పథకాన్ని తన పార్టీ తీసుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత జనవరి నెలలోనే ప్రకటించారు. వివరాలు అడిగితే ఈ విషయమై తమ పార్టీ నిపుణులతోని కలిసి కసరత్తు చేస్తోందని చెప్పారు. సోమవారం నాడు ఆయన ఈ విషయమై కొంత క్లారిటీ ఇచ్చారు. దేశంలో 20 శాతం మంది పేద ప్రజలు ఉన్నారని, వారిని కుటుంబాల పరంగా లెక్కిస్తే ఐదు కోట్ల కుటుంబాలు అవుతాయని, ప్రతి కుటుంబం జీవించాలంటే నెలకు కనీసం 12 వేల రూపాయలు అవసరమని, ప్రస్తుతం వారికి నెలకు ఆరు వేల రూపాయల ఆదాయమే వస్తోందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నెలకు నేరుగా ప్రతి పేద కుటుంబం ఖాతాలో నెలకు ఆరువేల రూపాయలు జమ చేస్తామని రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం సాక్షిగా హామీ ఇచ్చారు. పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే ‘న్యాయ్ (ఎన్‌వైఏవై)’ ఇంగ్లీషు సంక్షిప్త అక్షరాలతో హిందీ అర్థంతో పేరు కూడా పెట్టారు. ఈ పథకంపై సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దేశంలో 20 శాతం మందే పేదలే ఉన్నారని, వారి కుటుంబాలకు నెలకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయని రాహుల్ గాంధీ లేదా ఆయన ఆర్థిక వేత్తలు ఎలా అంచనా వేశారు ? 2011 తర్వాత ఇప్పటి వరకు సామాజిక వర్గాల అభ్యున్నతి ప్రాతిపదికన జన గణనే జరగలేదు. నాటి విశ్లేషణలోనే పలు లోపాలు ఉన్నాయి. తదుపరి సెన్సెస్ 2021లో జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈపథకాన్ని లాంఛనంగా ప్రారంభించి ‘సెన్సెస్’ అనంతరం పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా అమలు చేస్తారా? రాహుల్ గాంధీ మాటల ప్రకారం ఓ కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు వచ్చినా, నెలకు 11 వేల రూపాయలు వస్తున్నా, ఆ కుటుంబాల వారందరికి నెలకు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందే. ‘ధనిక, పేద అనే రెండు హిందుస్థాన్‌లు ఉండరాదు. ఒకే హిందుస్థాన్ ఉండాలి’ అని ఆయన అన్నారు. అలాంటప్పుడు వెయ్యి రూపాయలు ఆదాయం వస్తున్న కుటుంబానికి నెలకు 6 వేల రూపాయలు బ్యాంకులో వేస్తే ఆ కుటుంబం ఆదాయం నెలకు 7 వేల రూపాయలు అవుతుంది. అదే నెలకు 11 వేల రూపాయలు వస్తున్న కుటుంబానికి ఆరు వేలు జమచేస్తే ఆ కుటుంబం నెల ఆదాయం 17 వేల రూపాయలు అవుతుంది. అంటే, పేద కుటుంబాల మధ్య కూడా పది వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. ఇదెక్కడి సామాజిక న్యాయం? ఈ ప్రశ్నలు పక్కన పెడితే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?! అసలు అమలు చేయడం సాధ్యమా? ఓ కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయలు చెల్లించడమంటే ఏడాదికి 72 వేల రూపాయలు చెల్లించడం. ఐదు కోట్ల కుటుంబాలకు ఏడాదికి 72 వేల రూపాయలను చెల్లించాలంటే ఏడాదికి 3,60,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో 13 శాతం, జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం వాటాకు సమానం. ఏడాదికి ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి మించకూడదంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితి విధుంచుకోగా ఇప్పటికే ద్రవ్యలోటు 3.4 శాతానికి చేరుకుంది. అలాంటప్పుడు జీడీపీలో రెండు శాతం అంటే 3,60,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ నుంచి గానీ, ఆ పార్టీ సీనియర్ నాయకుల నుంచిగానీ సరైన సమాధానం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల పారితోషకాన్ని ప్రకటిస్తే అందుకు పోటీగా రాహుల్ గాంధీ ఏకంగా నెలకే ఆరువేల రూపాయలను ప్రకటించారు. దేశ, విదేశాల్లో పేరుకుపోయిన నల్లడబ్బును వెలికి తీసే ‘జన్‌ధన్’ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తానంటూ మోదీ ఇచ్చిన హామీ లాగే ఇది కూడా ‘జుమ్లా’ అవుతుందా? నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కుటుంబానికి 11 వేల రూపాయలు, 11 వేల రూపాయల వచ్చే కుటుంబానికి వెయ్యి చొప్పున, అందరికి సామాజిక న్యాయంగా 12 వేల రూపాయల కనీస ఆదాయం వచ్చేలా స్కీమ్‌ను అమలు చేస్తామని రాహుల్ చెప్పి ఉంటే బాగుండేది. అయితే పేద కుటుంబాలకు వస్తున్న ఆదాయాన్ని అంచనా వేయడం కూడా కష్టమే! -
దేశంలో మద్యపాన ప్రియులు 16 కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 14.6 శాతం (16 కోట్ల మంది) మద్యం సేవించేవారు ఉన్నారని ఓ సర్వే ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది. మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని సర్వేకోసం ప్రామాణికంగా తీసుకున్నారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. ప్రతి 180 మందిలో ఒకరు ఏదో ఒక సమయంలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారే. 15ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్ ఆధ్వర్యంలోని ఎన్డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం– సాధికారత శాఖ ఈ సర్వే చేసింది. ‘గతంలో 2001లోనూ సర్వే చేసి 2004లో ఫలితాలను ప్రకటించినా, అది రాష్ట్రాల వారీగా పూర్తి గణాంకాలను సమర్పించలేదు. అయితే ప్రస్తుత సర్వే దేశంలో గణనీయమైన స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని తెలుపుతోంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. వయోజనుల్లో ఈ రుగ్మతల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే స్పష్టం చేసింది’ అని నివేదిక తయారుచేశాం’ అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. జాతీయ స్థాయిలో 186 జిల్లాలలో ఈ సర్వే చేశారు. దేశ జనాభాలో 2.8 శాతం (దాదాపు మూడు కోట్లు) గత 12 నెలల కాలంలో తాము గంజాయి లాంటి మత్తు పదార్థాలను రుచిచూశామని చెప్పారు. సాధారణ మత్తు మందు ఉపయోగించే వారి సంఖ్య 1.14 కాగా, ఔషధ మత్తు మందులు (వైద్యులు చెప్పిన పరిమితికన్నా ఎక్కువ) ఉపయోగించే వారు 0.96 శాతం. 0.52 శాతం ప్రజలు సాధారణంగా లభించే నల్లమందును వాడుతున్నట్లు తెలిసింది. -
సామాజిక అన్యాయం
సాక్షి, అమరావతి: అక్షరాలా 12 కార్పొరేషన్లు, 11 బీసీ ఫెడరేషన్లు.. వీటికి బడ్జెట్ కేటాయింపులు రూ.3,746.8 కోట్లు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.30 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా ఎంతమందికి, ఎన్ని రుణాలు ఇచ్చారో చూస్తే.. కనిపించేది పెద్ద గుండుసున్నా. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు తదితర సామాజిక వర్గాల సంక్షేమం పట్ల నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతోంది. ఆన్లైన్ దరఖాస్తులకు మోక్షమెప్పుడో? లబ్ధిదారులకు రుణాలు విడిగా ఇవ్వకుండా ఎన్నికల ముందు మేళాలు నిర్వహించి, ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా పైసా కూడా రుణాలు ఇవ్వకుండా దగా చేసిన సర్కారు తీరుపై లబ్ధిదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నెలకోసారి రుణమేళాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. వచ్చే నెల నుంచి రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కొన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఈ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గతంలో ఏడు కార్పొరేషన్లు ఉండేవి. కొత్తగా ఎంబీసీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, దూదేకుల ముస్లిం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీసీల్లో వెనుకబడిన కులాల కోసం 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఒక్కో ఫెడరేషన్లకు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయించారు. రజక, కల్లుగీత కార్మిక ఫెడరేషన్లకు మాత్రం రూ.70 కోట్లు కేటాయించారు. ఈ అరకొర నిధులతో ఎక్కువ మందికి రుణాలు దక్కే అవకాశం లేదని బీసీ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారికి, టీడీపీ కార్యకర్తలకే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీసీల్లో అన్ని వర్గాలనూ మోసం చేశారు ‘‘వెనుకబడిన తరగతుల్లో అన్ని వర్గాల వారినీ తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజమైన లబ్ధిదారులకు రుణాలు అందడం లేదు. రుణమేళాలు పెట్టి అధికార పార్టీ కార్యకర్తలకు రుణాలు ఇవ్వాలని చూస్తున్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా బీసీ సబ్‌ప్లాన్ అంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రుణమేళాల పేరుతో మరో గిమ్మిక్కు ‘‘గత ఏడాది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి, అధికార పార్టీ నేతల బినామీలకే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఇప్పుడు రుణమేళాల పేరుతో ప్రభుత్వం మరో గిమ్మిక్కు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచింది. ఇప్పటిదాకా ఇవ్వని రుణాలను ఎన్నికల ముందు ఇస్తామని చెబుతున్నారంటే ప్రభుత్వ పెద్దల కుట్రను అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకుంటే సరిపోదు. – ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేత -
పాలనలో ‘దళిత్’ పదం వద్దు
న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో దళిత్ అనే పద ప్రయోగం తగదంటూ రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేంద్రం సూచించింది. అధికారిక వ్యవహారాలన్నింటిలోనూ షెడ్యూల్డ్ కాస్ట్ అనే పదానికి బదులుగా దళిత్ అని వాడరాదనీ, షెడ్యూల్డ్ కాస్ట్గానే దాన్ని ఉపయోగించాలని కోరుతూ మార్చి 15, 2018న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ లేఖరాసింది. అన్ని పాలనా వ్యవహారాల్లో, సర్టిఫికెట్లలో, అధికారిక లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో, రాజ్యాంగ పదమైన షెడ్యూల్డ్ కాస్ట్ అనే వాడాలని ఈ లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ లకు ఉద్దేశించిన ఈ లేఖలో మోహన్‌లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జనవరి 15, 2018న ఇచ్చిన తీర్పుని ఉటంకించారు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించని దళిత్ అనే పదాన్ని ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులనుద్దేశించి వాడకూడదని కూడా ఈ లేఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 1982 ఫిబ్రవరి 10న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాల్లో సదరు వ్యక్తి కులాన్ని ప్రస్తావించాలనీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏ అంశం కింద ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కాస్ట్‌గా గుర్తించారో కూడా పేర్కొనాలని, అంతేకానీ ‘హరిజన’ అనే పదాన్ని ఉపయోగించకూడదనీ చెప్పిన విషయాన్ని చర్చించింది. మళ్ళీ రెండేళ్ళ తరువాత అంటే 1990 ఆగస్టు 18న సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వాలను షెడ్యూల్డ్ క్యాస్ట్‌నే వాడాలని సూచించిందని కూడా లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లతో సంప్రదించి, కులాలు, జాతులు, తెగలను, లేదా ఆయా కులాల్లోని సమూహాలను ఆయా ప్రాంతాలను బట్టి రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్‌కి అనుగుణంగా చట్టం ప్రకారం ఆ లిస్ట్లోనికి అదనంగా చేర్చడం లేదంటే తీసివేయడం పార్లమెంటు చేస్తుంది. -
వెనుకబడిన జిల్లాలకు బాసటగా..
న్యూఢిల్లీ: అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలే సర్వస్వంగా భావించే ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రజలకు సాయపడేందుకు వచ్చామా? లేదా అన్నదే ముఖ్యమన్నారు. శనివారం పార్లమెంటు సెంట్రల్ హాలులో నిర్వహించిన ‘వియ్ ఫర్ డెవలప్మెంట్’ సదస్సులో కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘పిల్లలంతా స్కూళ్లకు వెళ్లినప్పుడు అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా ఉన్నపుడు మాత్రమే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లుగా భావించాలి. అభివృద్ధిలో వెనకబాటుకు నిధులు లేదా వనరుల కొరతో కారణం కాదు.. పాలనా లోపాల వల్లే ఆ పరిస్థితి కొనసాగుతోంది. అభివృద్ధికి కావాల్సినవి సుపరిపాలన, సమర్థవంతంగా పథకాల అమలు, అంకితభావంతో కార్యక్రమాల్ని నిర్వహించడమే’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఒక ఇంట్లో లేక ఊరిలో విద్యుత్ ఉండి పక్కింట్లో, గ్రామంలో లేకపోతే వారూ కరెంటు పొందేలా చూడాలని సామాజిక న్యాయం మనకు బోధిస్తుంది’ అని చెప్పారు. ‘మీరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా... ప్రజలకు సాయం చేసేందుకు వచ్చారా? లేదా? అన్నదే అసలు సంగతి. ఎన్ని ఆందోళనలు చేశారు... ఎన్ని సార్లు మీరు జైలు కెళ్లారు? అనేవి 20 ఏళ్లక్రితం ప్రాముఖ్యంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది’ అని చెప్పారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యాల్ని పూర్తి చేసే దిశగా చట్టసభ్యులు పనిచేయాలని మోదీ కోరారు. మళ్లీ మళ్లీ చట్టసభలకు ఎన్నికయ్యే వారిని రాజకీయాలకు అతీతంగా ఓటర్లు చూస్తారని చెప్పారు. ఏడాది కష్టపడితే మెరుగైన ఫలితాలు దేశంలోని వెనకబడ్డ 115 జిల్లాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చట్టసభ్యులు నిజాయతీగా ఒక ఏడాది పనిచేస్తే.. గొప్ప మార్పు సాధించవచ్చని, మానవ అభివృద్ధి సూచీలో భారత్ పైకి ఎగబాకుతుందని చెప్పారు. సులువుగా ఫలితాలు రాబట్టేందుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని, అందుకే అభివృద్ధి చెందిన జిల్లాల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఉంటే.. వెనకబడిన జిల్లాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వాటిని వెనకబడ్డ జిల్లాలుగా కాకుండా అభివృద్ధిని ఆకాంక్షించే జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ 115 జిల్లాలకు కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌లను నియమించాలని మోదీ కోరారు. ‘ఆ జిల్లాల అధికారులతో సమావేశమైనప్పుడు.. వారిలో 80 శాతం 40 ఏళ్లు పైబడ్డ వారే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మామూలుగా జిల్లా కలెక్టర్ వయసు 27–30 మధ్యలో ఉంటుంది’ అని అన్నారు. సుపరిపాలనతోనే అభివృద్ధి అందుబాటులో ఉన్న వనరులు, శ్రమ శక్తిని వాడుకుని అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మోదీ అన్నారు. సుపరిపాలన ప్రాముఖ్యత గురించి చెపుతూ.. పేద ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం సరిగా అమలు కాలేదని, ధనిక ప్రాంతాల్లో సమర్థంగా అమలైందని.. సుపరిపాలన వల్లే అది సాధ్యమైనట్లు గుర్తించానని ప్రధాని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోనే జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, సర్దార్ పటేల్ తదితరులు రాజ్యాంగాన్ని సిద్ధం చేశారన్న విషయాన్ని మోదీ గుర్తు చేసుకుంటూ.. అదే హాలులో చట్ట సభ్యులు దేశాభివృద్ధి కోసం సంఘీభావంగా హాజరుకావడాన్ని ఆయన ప్రశంసించారు. వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు అభివృద్ధి అంశంపై కలిసి కూర్చోవడం రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి సజీవ నిదర్శనమని పేర్కొన్నారు. చట్ట సభ్యులు రాష్ట్ర యంత్రాగానికి చేయూతగా ఉండాలని ఆకాంక్షించారు. -
ఇంతకాలం మాట్లాడనందుకు సిగ్గుగా ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయం గురించి ఆమె మాట్లాడింది. భావప్రకటనా స్వేచ్ఛ కోసం ఆమె పోరాడింది. తాను జీవించి ఉండటం కోసం కూడా తాను మాట్లాడింది. రాసింది. ఆమె, నేను కలసి పెరిగాం. గౌరీగా ఎదుగుతున్నప్పుడు కంటే మరణం తరువాతే మేం ఆమె నుంచి నేర్చుకుంటున్నాం’అని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. గౌరీ లంకేశ్ రచనల సంకలనం తెలుగు అనువాదం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని తనని అంతా ప్రశ్నిస్తున్నారని, నిజానికి ఇంతకాలం మాట్లాడనందుకు తాను సిగ్గుపడుతున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. గొంతు లేని వారికి తాను బలమైన గొంతుకైనం దుకు గౌరీ హత్య జరిగిందన్నారు. అయితే ఇదే మొదటిది కూడా కాదని గోవింద్ పన్సారే, కల్బుర్గి, దబోల్కర్‌ల వరుసలో గౌరీ లంకేశ్ కూడా హత్యకు గురైందన్నారు. ఇదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నా పదేళ్ల కూతురు సైతం నా క్షేమం గురించి భయపడింది. నా తల్లి దేవుడి ముందు మోకరిల్లింది.. నాకేమీ కాకూడదని.. ఇలా ఎందుకు జరుగుతోంది. ఎందుకీ హత్యలు.. నిశ్శబ్దాన్ని వీడి ప్రశ్నించాలని ప్రకాశ్ రాజ్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. నిశ్శబ్దం సమాజానికి పట్టిన పెద్ద జబ్బు నిశ్శబ్దం ఈ సమాజానికి పట్టిన పెద్దజబ్బు అని.. దాన్ని వదలించుకుని ప్రతిఒక్కరూ మార్పుకి నాంది పలకాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. గొంతులు పెగల్చుకుని అణగారిన వర్గాల, అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన మాట్లాడాలని అన్నారు. ‘కొన్ని గొంతులను మూయించి వాళ్లన్నీ సాధించామనుకొంటే పొరపాటు, భిన్నాభిప్రాయాలుంటే చర్చించాలి. కానీ చంపడాన్ని సహించకూడదు. ఇక మాట్లాడాల్సిన సందర్భమిదే. గౌరీ ఒంటరిగా పోరాడింది. ఇప్పుడందరం ఎవరికి వారుగా, కలసికట్టుగా, ఎక్కడైనా, సందర్భమేదైనా మాట్లాడాలి’ అని ప్రకాశ్ రాజ్ గద్గద స్వరంతో అన్నారు. ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ నగరంలోని లామకాన్‌లో గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని గౌరీ సోదరి కవితా లంకేశ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, సంపాదకుడు చందన్ గౌడ, ప్రొఫెసర్ సుశీతారూ, సీనియర్ పాత్రికేయురాలు వసంతలక్ష్మి ఆవిష్కరించారు. చందన్‌గౌడ సంపాదకత్వంలో వచ్చిన గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ సత్యాన్ని మరుగుపర్చడం కోసం ముసుగు హత్యలు జరుగుతుంటే మౌనంగా ఉండటం సమాజానికి చేటు చేస్తుందన్నారు. మతం అనేది జీవన విధానమని, హింస మతం లక్షణం కాదని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ చందన్ గౌడ మాట్లాడుతూ భయంలేని సమాజం కోసం గౌరీ లంకేశ్ తుది శ్వాస వరకు పోరాడారని అన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, కృష్ణవంశీ మాట్లాడారు. -
సామాజిక న్యాయం కోసం జేఏసీ
- జస్టిస్ చంద్రకుమార్ - కొత్త పార్టీ కూడా పెడతామని వెల్లడి హైదరాబాద్: కుల వివక్ష లేని సమాజం, ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందేలా చూసేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ ప్రకటించారు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కొత్త పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉమ్మడి నాయకత్వంతో పార్టీ కొనసాగు తుం దని వెల్లడించా రు. తెలంగాణ లో రాజకీయ పత్యామ్నాయంగా జేఏసీ ఉండ బోతోందని చెప్పారు. జేఏసీ మొదటి సమావేశాన్ని 16న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమాజంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోందని, దళితులు, ఆదివాసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జేఏసీలో భాగస్వామ్యం అయ్యేం దుకు కుల, వృత్తి సంఘాల వారు, అగ్రకులాలలోని పేదవారు, నిజాయితీగా పనిచేసేవారు 9394345252, 9505932030 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రొఫెసర్ ఐ.తిరుమలి మాట్లాడుతూ.. ‘ఆంధ్రాపాలన పోతే మనకు రాజకీయం దగ్గరవుతుంది, మన సమస్యలు వినేవారు వస్తారు అనుకున్నాం, రాష్ట్రం మారింది కాని పాలకుల తీరు మారలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అన్ని కులాలకు సామాజిక న్యాయం
అసెంబ్లీలో చట్టం చేయండి: తమ్మినేని చండూరు/సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే ముఖ్యమంత్రికి దండ పంపిస్తాం.. లేదంటే దండయాత్ర చేయక తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా చండూరుకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా అసెంబ్లీలో చట్టం చేయాలని సూచించారు. కులాలకు సమానంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడం ఆహ్వానించదగినదేనని.. అదేవిధంగా ఎంబీసీలకు అత్యాచార చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలోని అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని తమ్మినేని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అరవై ఏళ్లు దాటిన కార్మికులకు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధంగా పెన్షన్ ఇవ్వాలని కోరారు. -
మాటల్లోనే సామాజిక న్యాయం!
సందర్భం స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందా లనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. కానీ ఇవి ఇప్పటికీ అందరికీ చెందలేదు. ఎందుకు అందలేదు, అవి ‘‘అందని ద్రాక్ష’’గానే ఎందుకు మిగిలిపోయాయి అనే అంశంపై సమీక్ష చేస్తే రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి భంగం కలిగించే పరి ణామాలు జరగడమే దీనికి కారణమని స్పష్టమౌతుంది. జాతీయ భావాలు కలి గిన తరం అంతరించిన కొలది రాజకీయాలలో మార్పులు సంభవించాయి. తాత్కాలిక భ్రమలలో ప్రజలను ఆకట్టుకునే కుటిల ప్రయత్నాలు సాగాయి. 1975 తదుపరి 20 సూత్రాల పథకం లాంటివి అమలులోకి వచ్చాయి. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వాధికారుల అవినీతి, రాజకీయ నాయకుల జోక్యం మూలంగా పేదవర్గాలలో చురుకైన వారికి మాత్రమే సబ్సిడీలు అందేవి. 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన తర్వాత ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణల విధానాల మూలంగా గ్రామీణ చేతివృత్తులు చితికిపోయాయి. పాశ్చాత్యదేశాల అల వాట్లు వ్యాపించాయి. ఆఖరుకు వ్యక్తిగత జీవితాలపై ఆ ప్రభావం సోకింది. మన దేశ సంస్కృతికి గొడ్డలిపెట్టు లాంటి చర్యలు అమలులోకి వచ్చాయి. ఆఖరుకు సాంకేతిక విప్లవం పేరుతో మనం నివసించే ఇండ్లు, కట్టుకునే వస్త్రాలు, వినిమయదారుల వస్తువులు, విదేశాల నుండి దిగుమతి చేసుకోవడమో లేక పరి శ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అయితే కార్పొరేట్, పారి శ్రామిక, వ్యాపార, వాణిజ్యసంస్థల ఆస్తులు అనూహ్యంగా పెరి గాయి. సామాన్యుల బ్రతుకులు ఇప్పటికీ పూరిగుడిసెలు వెతల బతుకులుగానే మిగిలాయి. అంతరాలు బాగా పెరిగిపోయాయి ధనవంతులు మరింత ధనవంతులుగాను, నిరుపేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. సామాజిక, ఆర్థిక రంగాలు: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు సంభవించినప్పటికి, అట్టి ఫలితాలు సంపన్న కుటుంబాలకు మాత్రమే చెందాయి. ఇలాంటి పరిస్థితులలో ‘‘సామాజిక న్యాయం’’ అనే అంశం కేవలం ప్రభుత్వ బాధ్యతేనా? అది నినాదంగా మిగిలిపోవలసిం దేనా? అనే అంశంపై చర్చలు జరగాలి. సామాజిక న్యాయ అంశం చట్టాల ద్వారా బలవంతంగా అమలు చేసే అవకాశముంటుందా? ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలనే వాదన సరిౖయెంది. అయిుతే ప్రభుత్వం దాని అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. దీనికితోడు సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక అంశానికి పెద్ద పీట వేయాలి. వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంఘసేవకులు సామాజిక న్యాయం. తమ వ్యక్తిగత ఎజెండాగా గుర్తించి, అవినీతి, పక్ష పాతానికి పాల్పడకుండ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో, విద్య, వైద్య రంగాలలో సహకారం అందించగలిగితే తప్పనిసరిగా సామాజిక న్యాయం అర్హులకు అందుతుంది.. ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రసాదిం చిన కనీస ప్రాథమిక హక్కులు, మౌలిక సదుపాయాలను కూడా ఎందుకు అందించలేకపోయాయి? ఎన్నికల ముందు గరీబీ హటావో, స్వచ్ఛభారత్, అవినీతి, కుంభకోణాలు లేని ప్రభు త్వాలు ఏర్పరుస్తామంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు. ఎన్నికల కంటే ముందు ప్రజలు దేవుళ్ళు, తదుపరి దయ్యాలుగా భావిస్తుండటంతో అంతరాలు పెరిగి పోయాయి. తరతమ భేదాలతో పార్లమెంటరీ వ్యవస్థలన్నీ అవినీతి, కుంభకోణాలలో కొట్టుమిట్టాడు తున్నాయి. ఎన్నికల నిబంధనలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? ఎన్నికల నిబంధనలు ఉల్లం ఘించిన ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. వారిపైన కఠిన మైన చర్యలు లేవు. విచిత్రమేమిటంటే అఖరుకు ఓటర్లు కూడా అవినీతిలో భాగమైనారనేది ఈ మధ్య బహిరంగంగా విమర్శ సాగుతున్నది. ఇలాంటి వ్యవస్థలో చీకట్లో వెలుగు రేఖలు ప్రస రించే అవకాశం ఉంటుందా అనేది ప్రధాన ప్రశ్న. రాజకీయ వ్యవస్థ పూర్తిగా కుళ్ళి, కృశించి, స్వార్థపూరితంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నది. న్యాయ వ్యవస్థ తరచుగా చురకలు వేస్తున్నా పెద్దగా పట్టించుకునే పరిస్థితిలేదు. న్యాయవ్యవస్థకు కూడా అవి నీతి చీడపట్టుకున్నది. ఈ వ్యవస్థలతో మమేకమైన బ్యూరోక్రసి పీకలలోతు అవినీతి ఊబిలో కూరుకుపోÆుుంది. ఇలాంటి పరిస్థితు లలో ఈ దేశంలో సగటు జీవి బ్రతుకు గురించి ఆలోచించే వారెవరు? -కులాల వారిగా ఆర్థిక కేటాయింపులు, కార్పోరేషన్లు, పరిష త్తులు వేయటంకంటే, సమాజంలోని అన్ని పేదవర్గాల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు చేపట్టాలి. కులాలవారీగా కేటాయిం పులనేవి దోపిడి వ్యవస్థను కొనసాగించే కుట్రలో భాగాలు. ఓటు బ్యాంక్ రాజకీయాలకిదొక మేలిముసుగు. మద్యపానం సమాజంలోని పేదలను పీల్చిపిప్పి చేస్తుంది. చిన్న వయసులోనే అనారోగ్యం, నిస్సత్తువ, అకాల మరణాలు, వారి కుటుంబాలు అనాథలౌతుంటే, ఆ మద్యపానం ద్వారా వచ్చే ముదనష్టపు జబ్బుతో వితంతువుల పెన్షన్లు, సంక్షేమ కార్యక్ర మాలు చూపించి ఇదే సామాజిక న్యాయమంటారా! ఈ మోసా లకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరగాలి పోరాటాలు పెర గాలి. ప్రతిఘటించి నిలదీసే శక్తిగా మరాలి. అది రాజకీయ పోరాటం కావాలి. - చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 94909 52301 -
సామాజిక న్యాయంతోనే సమగ్ర అభివృద్ధి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రేగొండ (భూపాలపల్లి): సామాజిక న్యాయంతోనే తెలంగాణలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చేరుకోగా, రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేగొండలో తమ్మినేని మాట్లాడుతూ గత పాలకులు అవలంభించిన విధానాలనే సీఎం కేసీఆర్ అనుసరిస్తు న్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల వాటా ప్రకారంగా సంక్షేమ నిధులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మళ్లించి దోచుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు పాదయాత్రలో 21 జిల్లాలలో 2,500 కిలోమీటర్ల వరకు నడిచి 900 గ్రామాలను సందర్శించినట్టు తమ్మినేని చెప్పారు. -
పాలన అద్భుతమని అసెంబ్లీలో తీర్మానించాలి
♦ అలా చేస్తే పాదయాత్ర ఆపేస్తాం ♦ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ♦ సామాజిక న్యాయం అమలుపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి డిమాండ్ సాక్షి, హైదరాబాద్/మంచాల: రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అద్భుతంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే తమ పాదయాత్ర వెంటనే ఆపేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లేవని, అందుకే సామాజిక న్యాయం అమలు తీరుపై చర్చించేందుకు 5 రోజుల పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం-రాష్ర్ట సమగ్రాభివృద్ధిపై ఈ నెల 17న సీపీఎం ప్రారంభించిన 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో 100 కి.మీ. దాటింది. సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా ప్రజ లకు తమ్మినేని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు కావట్లేదని, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం మొదలు కాకపోవడంతో కేసీఆర్‌పై , సర్కారుపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి కాదు కదా.. చనిపోతే మూడు గజాల స్థలం కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆయా వర్గాల ప్రజలు ఇస్తున్న మద్దతు తమను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు గ్రామాల్లో అంతిమసంస్కారాలు చేసేందుకు కనీసం శ్మశానాలు కూడా కరువయ్యాయని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. కాగా, సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. పీసీసీ నేత ఎం.కోదండరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. -
‘కోటా’ సమీక్ష సూచనకు వక్రభాష్యం
రిజర్వేషన్లపై విధాన నిర్ణయాలను చేసే హక్కును రాజకీయ నాయకులకు కాక, సామాజిక సమానత, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి కలిగిన నిపుణులకు, పరిపాలనాదక్షులకు అప్పగించాలని కోరడంలో తప్పేముంది? పండిత దీనదయాళ్ ఉపా ధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం అమలుపై ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్య క్షులు మోహన్ భాగవత్ ‘పాంచజన్య’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... రాజ్యాంగ నిర్మాతల ఆశ.యాలకు, ఆకాం క్షలకు అనుగుణంగాను, సక్రమంగాను రిజర్వేషన్లు అమలు కావడం లేదని, అందుకు కారణం రాజకీయాలేనని అన్నారు. మొత్తం దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ కులానికి, ఏ రకమైన రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయించాలని సూచించారు. సామాజిక సమానత్వం పట్ల చిత్తశుద్ధి కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర కమిటీని వేసి, దాని ఆధ్వ ర్యంలోనే విధాన నిర్ణయాలను అమలు చేయాలని అన్నారు. ఇంతవరకు రిజర్వేషన్లు అమలు జరిగిన తీరు పైన, కలిగిన ఫలితాలపైన సమీక్ష జరపాలని కోరారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే... దళితులకు, గిరిజ నులకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమంటూ రాజకీయ నేతలు అనాలోచితమైన విమర్శలు గుప్పించారు. ఈ సంద ర్భంగా కొన్ని అంశాలను అంతా గమనించాల్సి ఉంది. 1. కేవలం ఆర్థిక వెనుకబాటుతనం కారణంగానే షెడ్యూల్డు కులాలకు (ఎస్సీ), తెగలకు (ఎస్టీ) రిజర్వే షన్లను కల్పించలేదు. శతాబ్దాలుగా అస్పృశ్యతకు గురైన కులాలను ఎస్సీ కులాలుగాను, ప్రధాన ప్రజాజీవన స్రవంతికి దూరంగా, శతాబ్దాలుగా అడవుల్లో నివసి స్తున్న గిరిజనులను ఎస్టీలుగాను గుర్తించారు. వారు కూడా మిగిలిన సమాజంతో సమంగా అభివృద్ధి చెంద టానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగా లలో రిజర్వేషన్లను కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా కాల క్రమేణా దళితులు, గిరిజనులు మిగిలిన సమాజంతో పాటు సమంగా పోటీ పడగల స్థాయికి చేరగలుగుతా రని రాజ్యాంగ నిర్ణేతల అభిప్రాయం. దీంతో ఆర్ఎస్ ఎస్‌కు పూర్తి ఏకీభావం ఉంది. 2. ఎస్సీ, ఎస్టీలకు 65 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలవుతున్నా ఆశించిన మేరకు వారి అభివృద్ధి జరగలేదన్నది తిరుగులేని వాస్తవం. పలు పార్లమెంటరీ కమిటీలు ఇదే విషయాన్ని నిర్ధారిం చాయి. యూపీఏ హయాంలో నాటి రాష్ట్రపతి చొరవతో పీసీ అలెగ్జాండర్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, అభివృద్ధిపై ఒక కమిటీని వేశారు. అంటే నాటి రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దును కోరారని అర్థమా? కాదు. నేడు భాగవత్ కూడా రిజర్వేషన్ల అమ లుపై సమీక్షను కోరారే తప్ప రద్దును కోరలేదే! 3. రాజ్యాంగ సభ, పటేల్ నాయకత్వంలో రిజర్వే షన్లపై నియమించిన ఉపసంఘం మతపరమైన రిజర్వే షన్లు దేశ విభజనకు దారి తీశాయని, దేశ సమైక్యత దృష్ట్యా వాటిని కొనసాగించరాదని సూచించింది. ముస్లిం, క్రైస్తవ సభ్యులు సహా రాజ్యాంగ సభ సభ్యు లంతా దాన్ని సమర్థించారు. నేడు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి మతపరమైన రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్నాయి. దీని అర్థం ఏమిటి? 4. ఎస్సీ, ఎస్టీలలో అనేక కులాలున్నాయి. ఈ 65 ఏళ్లలో రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందలేదు. అందువల్లనే ఎస్సీలలో వర్గీకరణ ఉద్యమం తలెత్తింది. పలు గిరిజన తెగలు నేటికీ అడవుల్లోనే నివసిస్తూ రిజర్వేషన్ల లబ్ధిని పొందలేకుండా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలలోని అన్ని కులాల వారు సమానంగా అభివృద్ధి చెందేటట్లు చూడా ల్సిన అవసరం సామాజిక న్యాయాన్ని వాంఛించే వారికి లేదా? ఈ సమస్యలు రాజ్యాంగ నిర్మాతలు ఊహిం చనివి. ఆది విస్మరించి, రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతి రేకిస్తామనడం ఎలా సబబు? 5. మరి కొన్ని కులాలను ఎస్సీ జాబితాలో చేర్చా లని పలువురు రాజకీయ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి ఒత్తిడులకులోనై కొందరిని ఎస్సీ జాబితాలో చేర్చడం వల్ల అస్పృశ్యతకు గురైన నిజమైన ఎస్సీలు అన్యాయానికి గురికారా? అలాగే రాజకీయ ప్రయోజ నాల కోసం గిరిజన తెగల నిర్వచనపు పరిధిలోకి రాని ఇతరులను ఎస్టీ జాబితాలోకి చేర్పించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవలసిన అవసరం లేదా? 6. అంగబలం, అర్థబలం గల కొన్ని అభివృద్ధి చెందిన కులాలు సైతం రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తు న్నాయి. ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలవం చుతున్నాయి. ఇది ఎక్కడకు దారి తీస్తుంది? రాజ్యాంగ స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ఓట్ల బ్యాంకులు, అధికారమే లక్ష్యంగా కొందరు రాజకీయ నేతలు ప్రతి కులానికి రిజర్వేషన్లను వర్తింపచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో బలహీన వర్గాలను కాపాడటం ఎట్లా? రిజర్వే షన్లపై విధాన నిర్ణయాలను చేసే హక్కును రాజకీయ నాయకులకు కాక, సామాజిక సమానత, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి కలిగిన నిపుణులకు, పరిపాల నాదక్షులకు అప్పగించాలని కోరడంలో తప్పేముంది? ఈ విషయాలపై మరింత చర్చ జరగాలని కోరుకుం దాం. రాష్ట్రంలోని ప్రముఖ దళిత, గిరిజన నాయకులు భాగవత్ ప్రకటనపై వివరణను కోరి, తెలుసుకుని... అందులో లోపాలేమీ లేవన్నారు. వారే మరోవంకతమ అనుయాయుల చేత ఆయన దిష్టి బొమ్మలను తగుల బెట్టిస్తుండటమే విచిత్రం ! (వ్యాసకర్త సామాజిక సమరసతా వేదిక, కన్వీనర్) మొబైల్: 9440901360 - కె.శ్యామ్‌ప్రసాద్ -
అప్పులోళ్ల కూటమికి చుక్కెదురు
గ్రీస్ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉన్నా, ఒక ప్రధాన నిర్ణయంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని రిఫరెండం నిర్వహించడం గొప్ప సాహసం. ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోతే గద్దె దిగుతామని సైతం అది ప్రకటించింది. ప్రపంచంలోనే అరుదైన రాజకీయ ప్రయోగమిది. గతంలో కమ్యూనిస్టు పార్టీలు అవలంబించిన విధానాలకు ఇది భిన్నమైనది. సోషలిజం, ప్రజాస్వామ్యం జమిళిగా నడవాలనే ఆలోచనకు కార్యరూపం. సోషలిజానికి నియంతృత్వమే మార్గమనే దృక్పథానికి గ్రీస్ రిఫరెండం తెరదించింది, చరిత్రను తిరగరాసింది. ‘‘ఈ రిఫరెండంలో విజేతలు, పరాజితులు లేరు. దానికదే గొప్ప విజయం. ఆధునిక యూరప్ చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం. ఈ రోజు ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని వంచ నకు గురిచేయవద్దు. సామాజిక న్యాయం ప్రాతిపదికగా పేదల, అణగారిన వర్గాల భారాన్ని ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న వాళ్ళు భరించాలి. అటువైపుగా గ్రీస్ సమాజం పయనించాలి.’’ గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అన్న మాట లివి. గత ఆదివారం జరిగిన రిఫరెండంలో ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రీస్ ప్రజ బ్రహ్మరథం పట్టింది. అధికారంలోని సిరిజా ప్రభుత్వానికి దాదాపు 61 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారు. గత జనవరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించినది 36.3 శాతం ఓట్లు మాత్రమే. ఈ ఆరు నెలల్లో ప్రజా మద్దతు రెట్టింపు కావడం విశేషం. ‘షరతులకు’ చెంప పెట్టు పెట్టుబడిదారీ విధానానికి పుట్టినిల్లు అయిన యూరప్‌లోని ఒక చిన్న దేశం గ్రీస్ ప్రజలు గత జనవరిలో అనూహ్యంగా సోషలిస్టు, ప్రజాస్వామ్యశక్తులైన వామపక్షాలకు మద్దతు పలికారు. యూరోపియన్ యూనియన్, యూరోపి యన్ సెంట్రల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లతో లేదా ‘అప్పులోళ్ల కూటమి’తో గత ప్రభుత్వాలు కుదుర్చుకున్న అసమాన ఒప్పం దాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అంగీకరించేది లేదని వామపక్ష ఐక్య ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలపైన పన్నుల భారం పెంచి, సంక్షేమ కార్యక్రమాలకు కత్తెర వేయాలనే రుణదాతల ఒత్తిడులకు తలవంచేది లేదని తేల్చిచెప్పింది, అదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే ఇటీవల గ్రీస్ ప్రభు త్వానికి అప్పులోళ్ల కూటమి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఒక వేళ తమ షర తులను అంగీకరించకపోతే, యూరోపియన్ యూనియన్ నుంచి, ఉమ్మడి కరెన్సీ అయిన యూరో నుంచి వైదొలగవలసి వస్తుందని అది అంతిమ హెచ్చరికలు సైతం చేసింది. ఈ పరిస్థితుల్లో గ్రీస్ వామపక్ష ప్రభుత్వం నిజ మైన ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించింది. అప్పులోళ్ల కూటమి విధిస్తున్న షరతులకు అంగీకరించడమా? లేక తిరస్కరించడమా? అనే కీలక నిర్ణయం తీసుకునే బాధ్యతను ప్రజలకే అప్పగించింది. ప్రజా వ్యతిరేకమైన ఆ షరతు లను తిరస్కరించాలనే సిరిజా ప్రభుత్వ వైఖరికి జూలై 5 రిఫరెండంలో ప్రజ లు భారీ ఎత్తున మద్దతు పలికారు. ఆ సందర్భంగా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ హుందాగా చేసిన ప్రకట నను మొదటే ఉల్లేఖించాం. అది ఒక పరిణతి చెందిన వ్యవస్థ దృక్పథానికి అద్దం పట్టింది. రిఫరెండం తమకు పోరాడే శక్తిని ఇచ్చిందంటూనే, నిజాయి తీతో తమ ప్రభుత్వం చేస్తున్న సమంజసమైన ఆర్థిక వాదనలకు యూరోపి యన్ యూనియన్ అంగీకరిస్తే, ఉమ్మడి కరె న్సీ ‘యూరో’ నుంచి వైదొలగే ఉద్దేశం లేదన్నారు. గ్రీస్ తీసుకోబోయే నిర్ణయం ఈయూ వైఖరిపైనే ఆధార పడి ఉందని సిప్రాస్ తేల్చి చెప్పారు. సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు జోసఫ్ స్టిగ్లిట్జ్, పాల్ క్రుగ్మెన్లుసహా వంద మందికిపైగా సామాజిక, రాజనీతి నిపుణులు గ్రీస్ ప్రజా తీర్పును కొనియాడారు. ఇప్పటికీ సోషలిస్టు విధానాలను అవలం బిస్తున్న చైనా, రష్యా, క్యూబా, అర్జెంటీనా, వెనెజులా లాంటి దేశాలు గ్రీస్‌కు పూర్తి మద్దతును ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక, సోషలిస్టు, కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు పెద్ద ఎత్తున గ్రీస్ ప్రజలను అభినందించారు. సిర్జియా ప్రభుత్వానికి మద్దతు పలికారు. సోషలిస్టు, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాతిపదిక పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్ కంపెనీల దురాశ వల్ల నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ఒకపూట తిండికి నోచుకోలేకున్నారు. అటు వంటి దుర్మార్గ వ్యవస్థను ఎదిరించడమే గ్రీస్ నేడు చేస్తున్నది. 2,500 ఏళ్ల కిం దటే ప్రజాస్వామ్య భావనకు పురుడుపోసిన గ్రీస్ ఈ రోజు కూడా ప్రజా స్వామ్య పరిణతికి ప్రతినిధిగా నిలిచింది. గ్రీస్ వామపక్ష కూటమి ప్రభుత్వా నికి పార్లమెంటులో మెజారిటీ ఉంది. కాబట్టి ప్రజలను సంప్రదించకుండానే అది నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక ప్రధాన నిర్ణయంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనుకోవడం, రిఫరెండం నిర్వహించడం గొప్ప సాహసం. అంతేకాదు, రిఫరెండంలో ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోతే అధికా రం నుంచి తప్పుకుంటామని సైతం అది ప్రకటించింది. ప్రపంచంలోని ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ, ఏ పార్టీ చేయలేని అరుదైన రాజకీయ ప్రయోగ మిది. అంటే గతంలో కమ్యూనిస్టు పార్టీలు అవలంబించిన విధానాలకు ఇది భిన్నమైనది. సోషలిజం, ప్రజాస్వామ్యం జమిళిగా నడవాలనే ఆలోచనకు ఇది కార్యరూపం. సోషలిజం అమలుకు నియంతృత్వమే మార్గమనే పాత దృ క్పథానికి గ్రీస్ రిఫరెండం తెరదించింది. చరిత్రను తిరగరాసింది. అదేవిధం గా అంతర్జాతీయంగా సోషలిజం, ప్రజాస్వామ్యం, సమగ్రాభివృద్ధి కాంక్షిస్తు న్న శక్తులు ఒకే వేదికపైకి రావడానికి గ్రీస్ రిఫరెండం ఆరంభమవుతుంది. చైనా, రష్యాలతోపాటు లాటిన్ అమెరికా దేశాల్లోని విప్లవ, వామపక్ష ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య సోషలిస్ట్ బ్లాక్ ఏర్ప ర్చుకోవడానికి ఇది బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ పెట్టుబడికి హెచ్చరిక అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్ శక్తులు తమ విధానాలను మార్చు కోక తప్పదని గ్రీస్ రిఫరెండం హెచ్చరికను పంపింది. ఇప్పటికే ఐఎంఎఫ్ తన విధానాలను సమీక్షించుకుంటూ కొన్ని రోజుల క్రితమే ఒక నివేదికను రూపొందించింది. వివిధ దేశాల ప్రభుత్వాలకు తమ సంస్థ ఇస్తున్న రుణాల వల్ల ఆ దేశాల పేదరికం తగ్గకపోగా మరిన్ని దుష్పరిణామాలకు కారణమవు తున్నాయని పేర్కొంది. పైపై సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తే దేశం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన సరైంది కాదని, ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం లాంటి వాటిపై దృష్టి పెట్టక పోతే ఫలితం ఉండదని ఆ నివేదిక తెలిపింది. గ్రీస్ పరిణామాలు, యూరప్ రాజకీయ, ఆర్థికవ్యవస్థల మీద కూడా బలమైన ప్రభావాన్ని కలగజేస్తాయని, యూరప్ ప్రజల్లో ప్రజాస్వామ్య చైతన్యాన్ని రగులుస్తాయని రాజకీయ పరిశీ లకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈయూ ఆర్థిక విధానాలవల్ల అక్కడి ప్రజ ల్లో పెరుగుతున్న అసంతృప్తికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఇది మార్గం చూపుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే కొందరు పెట్టుబడిదారీ మద్దతు దారులు మాత్రం గ్రీస్ తలబిరుసుదనం, రిఫరెండం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దుష్పలితాలను కలిగిస్తాయని, ఆర్థిక మాంద్యానికి దారితీసి, తీవ్ర పరిణా మాలు కలుగుతాయని వాదిస్తున్నారు. వీరి దృష్టిలో స్వతంత్రతకు చోటేలేదు. పెట్టుబడికి, దాని ఆధిపత్యానికి దాసోహం అనాలే తప్ప, ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడుకునే ప్రయత్నం చేయడమంటే వీరి దృష్టిలో నేరమే. అదే విధంగా అప్పులోళ్ల కూటమి మద్దతు లేకుండా గ్రీస్ ఒంటరిగా నిలబడి, మనుగడ సాగించలేదని వారు వాదిస్తున్నారు. క్యూబా స్ఫూర్తితో ముందుకు సాగాలి అయితే క్యూబా లాంటి దేశం దాదాపు నలభై ఏళ్ళుగా అమెరికా కుట్రలను, దాడులను, ఆంక్షలను తట్టుకొని ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది. వైద్య, ప్రజారోగ్య రంగాల్లో ఈ రోజు క్యూబాయే అందరికీ మార్గదర్శి. అందుకే క్యూబా స్ఫూర్తితో గ్రీస్ ముందుకు సాగాలి. ఎన్ని ఒడిదుడుకులనైనా, అడ్డం కులనైనా ఎదుర్కొని ఆత్మగౌరవంతో తలెత్తుకు నిలవాలి. చరిత్రలో గ్రీస్ దేశా నికి, జాతికి అటువంటి తాత్విక వారసత్వం ఉండనే ఉంది. తత్వశాస్త్రంలో ప్రపంచానికే అక్షరాభ్యాసం చేయించిన అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటోల వంటి వారు ఆ నేల తల్లి బిడ్డలే. అటువంటి గొప్ప తాత్విక రాజకీయ పునాదిని కలిగి, ప్రజాస్వామ్య భావనకు జన్మనిచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గ్రీస్ ప్రజలు, సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా ప్రభుత్వం ప్రపంచ ప్రజల్లో సోషలిజం, ప్రజాస్వామ్యాల పట్ల మరింత విశ్వాసాన్ని నింపుతారని ఆశిద్దాం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
సామాజిక న్యాయం..బీజేపీ లక్ష్యం
పలాస: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి జీఆర్ రవీంద్రరాజు అన్నారు. కాశీబుగ్గ టీకేఆర్ కల్యాణ మండపంలో మహాసంపర్క అభియాన్ కార్యశాల వర్క్‌షాపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు అధ్యక్షతన శనివారం జరిగింది. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు, మండలాల నుంచి పాల్గొన్న ముఖ్య కార్తకర్తలు, ప్రముఖలనుద్దేశించి రవీంద్రరాజు మాట్లాడారు. కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసి గ్రామాల్లో, పట్టణాల్లో పార్టీని బ లోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశప్రయోజనం, తర్వాత పార్టీ ప్రయోజనం, చివరిగా తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు చేసిన త్యాగాలు, కృషి గురించి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పి.వేణుగోపాలం, రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, జిల్లా ఇన్చార్జి పీవీఎన్ మాధవ్, జిల్లా సంపర్క ప్రముఖ్ డాక్టర్ కణితి విశ్వనాథం, జిల్లా సహ సంపర్క రౌతు చిరంజీవరావు, జిల్లా సభ్యత్వ సహ ప్రముఖ్ సంపతిరావు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటరావు, రాష్ట్ర మహిళామోర్చ ప్రధాన కార్యదర్శి జి.భాగ్యలక్ష్మి, పార్లమెంటరీ ఇన్చార్జి అట్టాడ రవిబాబు, కన్వీనర్ ప్రధాన మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సామాజిక' న్యాయం
న్యూఢిల్లీ: సామాజిక న్యాయం, సాధికారత శాఖకు ఈ బడ్జెట్లో రూ. 7 వేల కోట్లకు పైగా కేటాయింపులు జరిపారు. సామాజిక న్యాయం, సాధికారత విభాగానికి రూ. 6,524.82 కోట్లు, అంగవైకల్య వ్యవహారాల విభాగానికి రూ. 636.94 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీజసీల సామాజిక భద్రత, సంక్షేమానికి రూ. 2100 కోట్లను, పాకీపనివారిని ఆ పని నుంచి విముక్తి కలిగించి, స్వయం ఉపాధికి సహకరించే పథకానికి రూ. 460 కోట్లను కేటాయించారు. అంగవైకల్యం ఉన్నవారి సంక్షేమం కోసం రూ. 527.93 కోట్లను కేటాయించారు. ఇది గత సంవత్సర బడ్జెట్ కన్నా దాదాపు రూ. 160 కోట్లు అధికం. మరోవైపు, మహిళ, శిశు అభివృద్ధికి శాఖకు రూ. 10351 కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి.. పన్ను ఆదాయం అనుకున్నంతగా సమకూరితే.. బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులకు అదనంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి(ఐసీడీఎస్) రూ. 1500 కోట్లు, సమగ్ర శిశు రక్షణ పథకానికి(ఐసీపీఎస్) రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు. -
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం: పొన్నాల
కాంగ్రెస్‌లో చేరిన గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందనడానికి ఒక బీసీకి టీపీసీసీ చీఫ్ పదవి అప్పగించడమే రుజువని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులు, పోరాట సమితి జిల్లాల అధ్యక్షులతో కలసి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం మంది బీసీలు ఉన్నారని, జనాభా దామాషా పద్ధతిలో పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా బీసీలు అవకాశాల కోసం ఎదురు చూడడం లేదని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎదుగుతున్నారని చెప్పారు. గొల్లకుర్మ హక్కుల కోసం జరిగే పోరాటాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. గోసుల శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న గొల్ల కుర్మల హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జి.వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
'అందుకే కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేశా'
హైదరాబాద్ : సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ ఎంపీ, సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శనివారం చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం చూసే...తాను ప్రజారాజ్యాన్ని విలీనం చేశానన్నారు. -
పీడిత జన న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్
ప్రజానుకూల తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దీప్తిమంతం చేసిన అరుదైన న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్. పీడితుల పట్ల ఇంత ప్రేమను, పక్షపాతాన్ని ప్రదర్శించిన న్యాయమూర్తులు చాలా అరుదు. ఆయనకిప్పుడు వందేళ్లు. రిటైరయ్యాక కూడా అవిశ్రాంతంగా సామాజిక న్యాయంకోసం పోరాడుతున్నారు. ఒక సమాజ చరిత్రలో వందేళ్లు అంటే తక్కువ కాలమే కావ చ్చు. ప్రాకృతిక ప్రతిబంధకాలను అధిగ మించి ఒక వ్యక్తి జీవితం వందేళ్లు కొనసాగితే ఏ సమాజానికైనా అదొక అపురూపమైన విషయం. అలా జీవించడం మాత్రమే కాదు...న్యాయవాదిగా, మంత్రిగా, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వివిధ పాత్రలు పోషిస్తూ కూడా పీడిత జన పక్షపాతాన్ని కొనసాగించడం అసామాన్యం. అలాంటి అరుదైన వ్యక్తి జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ తన వందో పుట్టినరోజును ఈమధ్యే జరుపుకున్నారు. మన సమాజంలోని దురదృష్టవంతుల తరపున అవిశ్రాం తంగా పోరాడుతూ వచ్చిన ఈ విశిష్టవ్యక్తి పదవీ విరమణ తర్వాత కూడా ప్రశాంత జీవితం ఎంచుకోకుండా ఎక్కడ అన్యాయం కనిపించినా, తన నిరసన వాణిని నిరంతరం గా వినిపిస్తున్నారు. వి.ఆర్ కృష్ణయ్యర్ పూర్తి పేరు వైద్యనాథపుర రామకృష్ణ అయ్యర్. 1914 నవంబర్ 15న కేరళ రాష్ట్రంలో మలబారు ప్రాంతంలోని పాలక్కాడ్ సమీ పంలోని వైద్యనాథపురంలో జన్మించారు. 1952లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1957లో కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా చేరి శాస న, విద్యుత్, జైళ్లు, సాగునీటి శాఖల్లో మౌలిక మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం రద్దుతో మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టా రు. అటు తర్వాత కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులై 1980లో పదవీవిరమణ చేశారు. న్యాయవ్యవస్థ గౌరవా న్ని నిలబెడుతూ అసంఖ్యాక తీర్పులను వెలువరించి న్యాయాన్ని సామాన్యుల చెంతకు చేర్చారు. పద్మవి భూషణ్‌తోపాటు అనేక అవార్డులు ఆయన్ను వరించాయి. నాలుగు పర్యాటక గ్రంథాలతో సహా న్యాయ, సామాజిక, రాజకీయ అంశాలపై మొత్తం 105 పుస్తకాలు రచించారు. కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కృష్ణయ్యర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చడంపై పలువురు న్యాయనిపుణులు భృకుటి ముడిచారు. కాని అనుమానించిన వారే ఆరాధించేలా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ చిన్నపరెడ్డిల పై ఆయన ప్రభా వం ఫలితంగా 1970-80 మధ్య కాలంలో భారత రాజ్యాంగ దార్శనికత ఒక స్పష్టమైన వాస్తవంగా రూపు దిద్దుకుంది. ఈ క్రమంలో ప్రజాప్రయో జన వ్యాజ్యం దేశ ప్రజలకు ఒక వరమైంది. దశాబ్దాలుగా స్తబ్దతకు గురైన పాత న్యాయ నిబంధనలకు వీరు పాతరే శారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉప శమనం కలిగించే తీర్పులను ఈ న్యాయమూర్తుల త్రయం వెలువరించింది. దీని ఫలితంగా సామాన్యుల హృదయాల్లో న్యాయవ్య వస్థపై గౌరవం, ఆరాధన ఏర్పడింది. మన సర్వోన్నత న్యాయస్థానం కీర్తి ప్రతిష్టలు జాతీయంగా, అంతర్జాతీ యంగా మార్మోగాయి. చారిత్రాత్మక తీర్పు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక వివాదంపై జస్టిస్ కృష్ణయ్యర్ 1975 జూన్ 24న ఇచ్చిన తాత్కాలిక తీర్పు భారత న్యాయ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఎన్నికల్లో అవకతవకలకు గాను ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని అలహాబా ద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలంటూ ఆమెపెట్టుకున్న అప్పీలును కృష్ణయ్యర్ తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పుపై బేషరతు స్టే ఇవ్వడానికి కృష్ణయ్యర్ నిరాకరించారు. ఒక దేశ ప్రధానికి పార్లమెంటులో ఓటు హక్కు ఉండదని ప్రకటించిన అద్వితీయమైన తీర్పు అది. ఇందిర ఎన్నిక చెల్లదని ఆమెపై అనర్హత వేటు వేసిన ఈ తీర్పుతో ఆ మరుసటి దినం అంటే జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించి ఇందిరాగాంధీ దేశచరిత్రలో చీకటి అధ్యాయానికి నాంది పలికారు. ఆ తీర్పు అంతర్జా తీయ ప్రశంసలు పొందింది. సుప్రీంకోర్టు పరంగా చూస్తే అదొక అత్యుత్తమ కాలం. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఇందిర తరపున నాటి కేంద్ర న్యాయమంత్రి హెచ్.ఆర్ . గోఖలే తనను కలుసుకుంటానని చేసిన అభ్యర్థనను కృష్ణయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. భారత న్యాయ వ్యవస్థ ఉద్దీప్తం చెందిన క్షణాలవి. అవిశ్రాంత కార్యాచరణ న్యాయమూర్తులుగా, ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన వారు కూడా రిటైరవగానే ప్రభుత్వ పదవులు, గవర్నర్ పదవులు, ఇతర ప్రయోజనాలకు సిద్ధపడిపోతు న్న కాలాన్ని మనం చూస్తున్నాం. కానీ జస్టిస్ కృష్ణయ్యర్ కీర్తి పదవీ విరమణ అనంతరం మరింతగా గుబాళించిం ది. 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్మెంట్ పుచ్చుకున్నప్పటినుంచి ఆయన సామాజిక న్యాయ చాంపి యన్‌గా అవతరించారు. రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, సామాజిక న్యాయం వంటి పలు అంశాలపై ఆయన వ్యాఖ్యానాలు, ప్రతిస్పందనలు జాతీయంగా, అంతర్జాతీయంగా మన్ననలు పొందాయి. అంతర్జాతీయ న్యాయ కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ మైఖేల్ కిర్బీ (ఆస్ట్రేలియా), ఈ శతాబ్దిలోనే ఉమ్మడి న్యాయానికి సంబంధించిన అత్యున్నత మూర్తిగా కృష్ణయ్యర్‌ను ప్రశం సించారు. 90 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సామాజిక సమస్యలపై ఆయా సందర్భాల్లో స్పందిస్తూనే వచ్చారు. స్వస్థలమైన కేరళలో అనేక ప్రజా ఉద్యమాలు, ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. 2008లో ప్రముఖ న్యాయమూర్తులు, పౌర హక్కుల కార్యకర్తలతో కలిసి, అంతర్జాతీయ మానవ హక్కులకు కట్టుబడి ఉండాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. కోట్లమంది పైగా ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్న దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్, ఫైనాన్స్‌ను ప్రవేశపెట్టడానికి ఆయన 2010లో మద్దతు నిచ్చారు. శతవసంతాల జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్‌కు శతాసహస్రాభివందనాలు. కె.రాజశేఖరరాజు -
దేవెగౌడకు వాల్మీకి అవార్డు
దావణగెరె : మాజీ ప్రధాని దేవెగౌడకు బుధవారం నగరంలో రాజనహళ్లి వాల్మీకి గురుపీఠం నుంచి మొదటిసారిగా వాల్మీకి అవార్డు ప్రదానం చేశారు. జిల్లాలోని హరిహర తాలూకా రాజనహళ్లి వాల్మీకి గురుపీఠం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవెగౌడకు ఈ అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ.. ఎస్టీ వర్గానికి జేడీఎస్ పార్టీ తరపున 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్లు కేటాయించి సామాజిక న్యాయం కాపాడామన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఎల్జీ హావనూరుకు హావనూరే సాటి అని, మళ్లీ అలాంటి హావనూరు పుట్టబోరని అన్నారు. కార్యక్రమంలో వాల్మీకి గురుపీఠం ప్రసన్నానందపురి స్వామి, కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి జీఎం సిద్దేశ్వర్, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ శామనూరు శివశంకరప్ప, బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ శ్రీరాములు, హరిహర ఎమ్మెల్యే శివశంకర్, శివమూర్తి నాయక్, వడ్నాళ్ రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం జరుగుతుంది: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ ప్రకటించే శాసనసభ అభ్యర్థుల జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధ్యాన్యం లభిస్తుందన్న నమ్మకం ఉందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లోనూ రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పార్టీని గెలిపించి, సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతారన్నారు.