సాక్షి, అమరావతి: ఏపీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత నిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకు సింహ భాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు.
దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రు లు నాటి మాయావతి నుంచి నేటి సిద్ధరామయ్య వరకు ఎవరూ చేయని రీతిలో ఆ వర్గాలకు సీఎం జగన్ సమున్నత గౌరవం ఇచ్చి సామాజిక సాధికారత సాధన దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయ సాధనలో దేశానికే టార్చ్‌బే రర్ (మార్గ దర్శకుడు)గా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
దేశానికే ఆదర్శం
నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ రూ.2.11 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖా తాల్లో (డీబీటీ) జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లోకే రూ. 1,56,987.64 కోట్లు వేశారు. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ బాటలు వేశారు.
చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు
♦ నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్ పదవులిచ్చారు. ఇలా చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
♦ 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు.
♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ ప దవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇ చ్చా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వ ర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి.. 484 నామినేటెడ్ డైరెక్టర్ పద వులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.
♦ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే చైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్ పదవులుంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ చైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో సగభాగం 3,503 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు.
చేతల్లో సామాజిక న్యాయం
♦ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు.
♦ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురి(80 శాతం)ని ఆ వర్గాల నుంచే నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు.
♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70%) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం.
స్థానిక సంస్థల్లో..
♦ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే.. వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు.
♦ 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు.
♦ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు.
♦ రాష్ట్రంలో 14 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగాను 12 పదవులు (86 శాతం) ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment