4 Years Of YS Jagan Government
-
నడుస్తోంది నవశకం
సాక్షి నెట్వర్క్: సరిగ్గా నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారంతో ఏపీలో నూతన శకం ఆరంభమైందని వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నాలుగు సంవత్సరాల పాలన పూర్తిచేసుకున్న సీఎంకు వారు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో అమలవుతున్న నవరత్నాలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు వేర్వేరుచోట్ల స్పందించారు. వారేమన్నారంటే.. చరిత్ర తిరగరాసిన వైఎస్సార్సీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సాధించి వైఎస్సార్సీపీ తెలుగునాట చరిత్ర తిరగరాసింది. అప్పటికి పదేళ్ల క్రితం 2009 మేలో కడప నుంచి లోక్‌సభకు భారీ మెజారిటీతో ఎన్నికైన వైఎస్ జగన్ దశాబ్ద కాలంలో ఏ యువ రాజకీయ నా యకుడు ఎదుర్కొనని అడ్డంకులు, ఇబ్బందులను ధైర్యంగా అధిగమించారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ బాటలో జనం మధ్య దివిటీలా కదులుతూ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. నవరత్నాలు వంటి హామీలతో వైఎస్సార్సీపీ 2019లో చరిత్రాత్మక విజయం సాధించింది. కోవిడ్ వంటి విపత్కర సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి వైఎస్సార్సీపీ సర్కారు ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాలు ఎంతగానో ఉపకరించాయి. – ఎంపీ వి.విజయసాయిరెడ్డి చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాలన సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప పరిపాలన అందిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది. జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక వంటి పథకాలను తీసుకువచ్చి పేద విద్యార్ధికి విద్యను మరింత చేరువ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు. ప్రభుత్వాసుప త్రులనూ ఆధునీకరించటంతో పాటు కొత్త ఆసుపత్రులను నిర్మించారు. ఐదు మెడికల్ కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ఏకంగా 32 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మహిళలకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు. – మంత్రి విడదల రజిని బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ అధికారంలో ఉన్నప్పుడు తాటతీస్తా, తోకలు కత్తరిస్తా అంటూ బీసీలను బెదిరించి, భయపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ కల్పిస్తానంటూ కపట ప్రేమను ఒలకబోస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా? నాలుగేళ్లలో వైఎస్సార్సీపీకి 8 రాజ్యసభ స్థానాలు దక్కితే.. అందులో 4 స్థానాలను సీఎం జగన్ బీసీలకు ఇచ్చారు. సీఎం జగన్ తన కేబినెట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రూ.2.11 లక్షల కోట్ల లబ్ధిచేకూరిస్తే.. అందులో బీసీలకే రూ.99,680 కోట్లు ఇచ్చారు. – మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బాబు.. కపట నాటక సూత్రధారి కపట నాటక సూత్రధారి చంద్ర బాబు మరోసారి ప్రజలకు మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారం చేజిక్కించుకునేందుకు ఆరాటపడుతున్నాడు. అన్ని వ ర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సీఎం జగన్‌కు అభినందనలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎవరూ ఆలోచన చేయని విధంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నారు. కరోనా కాలంలో వైద్యానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టారు. 2014 ఎన్నికల మేనిఫె స్టోలో 650 వాగ్ధానాలను చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తరువాత అందులో కనీసం పదిశాతమైనా అమలుచేశారా? అదే జగన్ 98శాతం హామీలను అమలుచేశారు. బాబు రాజధాని పేరిట రైతుల భూములను కాజేశారు. – మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర దశ, దిశను మార్చిన ఘనత జగనన్నదే రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్ర దశ, దిశను మార్చివేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం బాటలో పయనిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్రెడ్డి జాతీయస్థాయిలో పలువురి నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. – ఎంపీ మోపిదేవి ప్రగతిపథంలో రాష్ట్రం పరుగులు సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. 2018–19నాటికి రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 22వ ర్యాంకులో ఉంటే ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అది ఒకటో స్ధానంలో నిలవడం ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనం. ఇదే ప్రజారంజక పాలనకు సూచి. ఈ విషయంలో ప్రతిపక్షాలు తమ మీడియా సపోర్టుతో బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాయి. 2019కి తలసరి ఆదాయంలో ఏపీ 17వ స్థానంలో ఉండగా సీఎం జగన్ 9వ స్థానంలో నిలబెట్టారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా అవలంబిస్తున్న నిర్మాణాత్మక కార్యక్రమాలతో రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2018–19లో ఏపీ వ్యవసాయ వృద్ధి –6.5 శాతంతో దేశంలో 27వ స్ధానంలో ఉంటే ప్రస్తుతం 8.5 శాతం వృద్ధిరేటుతో ఆరో స్థ్ధానంలో నిలబడింది. – మంత్రి చెల్లుబోయిన వేణు ఏపీ వైపు.. ఇతర సీఎంల చూపు దేశంలోని ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తుంటే చంద్రబాబు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మహానాడులో ఆయన చిత్రపటానికి చంద్రబాబు దండలు వేయడం సిగ్గుచేటు. మహనీయుడు ఎన్టీఆర్ ఆత్మ ఆ సమయంలో క్షోభకు గురై ఉంటుంది. ఆయన జీవించిన సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కున్నాడు. భగవంతుడు ఎన్టీఆర్‌కు ఐదు నిమిషాల ఆయుష్షు ఇస్తే అదే వేదికపై ఓ శూలంతో చంద్రబాబును చంపి.. తర్వాత ఎన్టీఆర్ వెళ్లిపోయేవాడు. మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అసత్యాలే. – మంత్రి జోగి రమేష్ సీఎం పథకాలవల్లే ధైర్యంగా గడపగడపకు పేదలకు జగనన్న ప్రభుత్వం ఇంటిపట్టాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతుంటే వాటిని చంద్రబాబు శ్మశానంతో పోల్చడం సరికాదు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్ లేదు. ఆ పార్టీకి ప్రజలు సమాధులు కట్టడం ఖాయం. దేశంలో ఏ రాష్ట్రం కానీ, ఏ పార్టీ నేతలు కానీ గడప గడపకు వెళ్లిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నందునే ప్రజాప్రతినిధులు గడప గడపకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. – డిప్యూటీ సీఎం నారాయణస్వామి టీడీపీ మేనిఫెస్టో విడ్డూరంగా ఉంది చంద్రబాబుకు నీతి, నిజాయితీలు ఏమిలేవు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలను కాపీకొట్టి టీడీపీ మేనిఫెస్టో అని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలపై ఒకప్పుడు విమర్శలు చేసి ఏపీ శ్రీలంకలా మారిపోతుందని, జనం సోమరులవుతారని అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పథకాలకే పేర్లు మార్చి మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. మా పథకాలపై లోకేశ్, చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోరు. జగనన్న ఇళ్లపై విమర్శలు చేసిన చంద్రబాబు ఒక్కరికైనా ఇల్లు కట్టి ఇచ్చారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావులు ఎన్ని రాతలు రాసినా రాష్ట్ర ప్రజలు నమ్మరు. తను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2024లో కూడా వైఎస్ జగన్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. – మంత్రి సీదిరి అప్పలరాజు -
ఊరూరా సంబరం
సాక్షి నెట్వర్క్: నవరత్నాల బాటలో సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు బైక్ ర్యాలీలతో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. పలుచోట్ల నేతలు కేకులు కట్ చేసి స్వీట్లు పంచారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతల్లో రుజువు చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సజ్జల పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి కేట్ కట్ చేశారు. నవరత్నాల ద్వారా సమసమాజ నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్ నిమగ్నమయ్యారని చెప్పారు. కాపీ కొట్టిన పథకాలతో టీడీపీ అధ్యక్షుడు కళ్లార్పకుండా అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. కర్నూలులో కోలాహలంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు మేయర్ బీవై రామయ్య, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ మధుసూదన్, ఇషాక్ బాషా, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధాకర్, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 కేఎన్ఎల్ 100 – నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరులో వైఎస్ఆర్ విగ్రహం వద్ద సంబరాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య తదితరులు ‘తూర్పు’న ఘనంగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. రాజానగరంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కాకినాడలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచారు. రామచంద్రపురంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. విజయనగరంలో సేవా కార్యక్రమాలు.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాయి. ఎస్.కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘ప్రకాశం’లో మిన్నంటిన సంబరం ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఒంగోలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో కేక్ కటింగ్, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నారాంబాబు, కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, చీమకుర్తిలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురంలో పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. వైఎస్సార్ జిల్లాలో వేడుకగా.. వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. కడపలోని హెడ్‌పోస్టాఫీసు ఎదుట వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. కమలాపురం నగర పంచాయితీ కార్యాలయంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ నాయకులకు కేక్ పంచి పెట్టారు. పులివెందుల పురపాలక కార్యాలయంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జమ్మలమడుగు మండలం పి.బొమ్మేపల్లిలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సుధీర్‌రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జెడ్పీ చైర్మన్ కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరులో చరిత్రాత్మకం.. ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పుంగనూరు నియోజకవర్గం సదుంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఎమ్మెల్సీ భరత్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. పెడన నియోజవకర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు, పార్టీ నేతలతో కలసి మంత్రి జోగి రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రంలో సంక్షేమ పాలన పదికాలాల పాటు కొనసాగాలని వేడుకున్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష కేక్ కట్ చేశారు. శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేక్‌లు కట్ చేశారు. సత్యవేడు నియోజక వర్గవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనంలో కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్వేటి నగరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కేట్ కట్ చేశారు. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు శాంతినగర్ కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. విశాఖలో వైభవంగా.. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఘనంగా సంబరాలు జరిగాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె రాజు కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అంబికాబాగ్ రామాలయం కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు కోలా గురువులు, జాన్ వెస్లీ, వి.మధుసూదన్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భీమిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి ఆనందపురం నుంచి తగరపువలస వరకూ ర్యాలీ నిర్వహించారు. పెందుర్తి నియోజవర్గంలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు అధ్వర్యంలో వేపగుంట జంక్షన్లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వేపగుంట నుంచి పెందుర్తి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజవర్గంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కేక్ కట్ చేశారు. చోడవరం నియోజకవర్గం గర్నికంలో ప్రభుత్వ విప్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు కేక్ కోశారు. అనకాపల్లిలో పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ కేక్ కట్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేటలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగులాపల్లి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు పాల్గొన్నారు. కృష్ణాలో కదం తొక్కిన శ్రేణులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దివంగత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు, చిరువ్యాపారులకు టిఫిన్ బండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కేక్ ట్ చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కేక్ కట్ చేశారు. గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పామర్రు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదల పెన్నిధి వలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇంటివద్దే అందిస్తూ పేదలకు రాష్ట్రం స్వర్గధామంలా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలోని మొగల్రాజపురం మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అన్ని సేవలను ఇంటివద్దే అందిస్తూ ముఖ్యమంత్రి జగన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వం ఆటుపోట్లు, ముష్కర మూకల దాడులను తట్టుకుని నాలుగేళ్లు పూర్తి చేసుకుందన్నారు. మేధావులు, పరిశీలకుల ముసుగులో కొందరు చేస్తున్న విపరీత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.11 లక్షల కోట్లను లబ్థిదారులకు నేరుగా, పారదర్శకంగా పంపిణీ చేసిందని సీనియర్ జర్నలిస్ట్ వీవీఆర్.కృష్ణంరాజు చెప్పారు. హార్టికల్చర్ హబ్‌గా ఏపీ సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ హబ్‌గా మారిందని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ సాగును రాష్ట్రంలో ప్రొత్సహిస్తున్నామన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంసీ.దాస్ చెప్పారు. నాగార్జున యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ.శ్రీనివాస్‌రెడ్డి, జర్నలిజం విభాగాధిపతి జి.అనిత, సీనియర్ జర్నలిస్ట్‌లు నిమ్మరాజు చలపతిరావు, మీడియా అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్ తిలక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనపై రచయిత గాజులపల్లి రామచంద్రారెడ్డి రాసిన సుపరిపాలన–సుజలాం–సుఫలాం పుస్తకాన్ని కార్యక్రమంలో ఆవిష్కరించారు. -
నాలుగేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్ల పాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘ దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తైందని, నాపై ఎంతో నమ్మకంతో మీరు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ నాలుగేళ్ల కాలంలో 98 శాతానికి పైగా ఎన్నికల హామీలను మన ప్రభుత్వంలో అమలు చేశాం. అలాగే వివిధ రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మన ప్రభుత్వంపై మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తైంది. నాపై ఎంతో నమ్మకంతో మీరు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ నాలుగేళ్ళ కాలంలో 98 శాతానికి పైగా ఎన్నికల హామీలను మన ప్రభుత్వంలో అమలు… pic.twitter.com/vJWpYUtwzO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2023 కాగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొనసాగిస్తున్నారు. చదవండి: ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన -
‘గతంలో మేనిఫెస్టోని అమలు చేయకుండా చంద్రబాబు మాయ చేశారు’
సాక్షి, కృష్ణా జిల్లా: మేం టీడీపీకి ఎందుకు భయపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ ఓ రాజకీయ పార్టీ.. వాళ్లేం సన్నాసులు కాదని ఎద్దేశా చేశారు. ‘ఓ పార్టీగా మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. చంద్రబాబు గతంలో కూడా మేనిఫెస్టోని ప్రకటించారు.. అమలు చేయకుండా మాయ చేశారు’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.. ‘‘నాలుగేళ్ల పాలన పూర్తైంది. భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటించాం. చెప్పింది చేశామని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డాం. ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నాం. నాలుగేళ్లలో మంచి జరిగిందో.. చెడు జరిగిందో ప్రజలే చెబుతారు. జగన్‌లా ధైర్యంలా మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా?’’ అని మంత్రి ప్రశ్నించారు. చదవండి: అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు -
AP: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, సీఎం స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఆయన కార్యదర్శులు కె. ధనుంజయ్ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా కూడ ఉన్నారు. చదవండి: Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు -
ప్రజలు నమ్మరని కూడా ఆయనకు తెలుసు: సజ్జల
సాక్షి, గుంటూరు: సమసమాజాన్ని నిర్మించే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని, అభివృద్ధి.. సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. నేటికి(మంగళవారం, మే 30 2023) సీఎంగా వైఎస్ జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించగా.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సజ్జల పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కట్టింగ్ నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో సీఎం జగన్ చేతల్లో చూపించారని, దీనిని కొన్ని గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. జగన్ ఏం అభివృద్ధి, సంక్షేమం తెచ్చారో ప్రజలకు తెలుసు. యాభై శాతం ఫలాలు మహిళల పేరుతోనే అందుతున్నాయి. కానీ, జనాల్ని మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు.దత్తపుత్రుడితో కలిసి ఎన్నికలకు పోవాలని చూస్తున్నాడు. ‘‘కళ్లార్పకుండా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం చేశాడో ప్రజలు మర్చిపోలేదు. అన్న క్యాంటిన్ పేరుతో ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశానని ఈరోజు చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా కిట్ బ్యాగులు తీసుకున్నాడు. ఇప్పుడు అమ్మ ఒడిని కాపీ కొట్టి.. అమ్మకు వందనం పేరుతో వస్తానంటున్నాడు. ప్రజలు నమ్మరని కూడా ఆయనకు తెలుసు. కానీ అబద్దాల హోరులో ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు. దొంగదెబ్బ తీసి పార్టీని ఆక్రమించిన చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తాడని అనుకోవద్దు అని ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి సజ్జల పిలుపు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి అంశ జగన్. ఆయన పేరును నిలపెట్టే విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా జగన్ కుటుంబ సభ్యులే. ఏ ఎన్నికలు వచ్చినా జగన్‌ను ప్రజలు ఆదరించటానికి కారణం అదే. చరిత్ర మనకి ఒక అవకాశం ఇచ్చింది. హామీలు అమలు చేస్తున్నందునే మనం జనంలోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. కానీ, పొత్తులతో పాచికలు వేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఏపీ ప్రజలే కాదు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అంటూ సజ్జల పేర్కొన్నారు. ఇదీ చదవండి: చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏముంది? -
నవశకానికి నాలుగేళ్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు.. వెళ్లారు. కానీ గత చరిత్రలను తిరగరాసి, గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి కొత్త చరిత్రకు నాందిపలికింది వైఎస్ జగన్ సర్కార్. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవల్లో కొత్త ఒరవడి నాంది పలికింది. సంక్షేమం అంటే ప్రజలు..ప్రజలంటేనే సంక్షేమం అన్న పదానికి నిర్వచనం చెప్పింది. రేషన్ కార్డు మొదలుకొని సామాజిక పెన్షన్ల వరకూ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందజేస్తూ అందరి ప్రభుత్వంగా పేరుగాంచింది...ఇలా వైఎస్సార్ సీపీ నాలుగేళ్ల పాలనలో లెక్కలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చూస్తోంది. చదువులకు పెద్దపీట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది స్కూళ్లలో నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ బడులు ప్రైవేటు స్కూళ్లను తలపిస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగింది. డ్రాపౌట్లు తగ్గుముఖం పట్టాయి. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపితే అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తున్నారు. స్కూళ్లలో మరుగుదొడ్ల నుంచి మంచినీళ్ల కుళాయిల వరకూ అన్నీ ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాదు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనకు నేరుగా సొమ్ములిస్తున్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా ఒక్కో విద్యార్థిపై గరిష్టంగా రూ.కోటి ఖర్చు చేసే జగనన్న విదేశీ విద్యాదీవెన అందుబాటులోకి తెచ్చి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. చుక్కల భూములకు విముక్తి గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా వైఎస్సార్ సీపీ సర్కారు వందేళ్ల క్రితం ఉన్న రికార్డులను సవరించి రీసర్వే చేపట్టింది. వివాదాల్లేని భూముల చిట్టాను తయారు చేస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 43 గ్రామాల్లో సర్వే పూర్తయింది. అలాగే 22–ఏలో ఉన్న భూములపై సాగుదారులకు హక్కులుండేవికావు. జగన్ సర్కారు అలాంటి భూములన్నిటికీ విముక్తి కల్పించి రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించింది. మెడికల్ కాలేజీలకు మహర్దశ అనంతపురం మెడికల్ కాలేజీకి మహర్దశ వచ్చింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ఇప్పటివరకూ అనంత మెడికల్ కళాశాలకు ఏకంగా 70 పీజీ సీట్లు అదనంగా వచ్చాయి. మరో రూ.450 కోట్లతో అదనపు కాలేజీకి కొత్త భవనాలకు పనులు ప్రారంభమయ్యాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద మెడికల్ కాలేజీ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఈ కాలేజీ అందుబాటులోకి రానుంది. ఫ్యామిలీ ఫిజీషియన్‌తో కొత్త చరిత్ర ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల వద్దకే వైద్యం వెళ్లింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఫ్యామిలీ ఫిజీషియన్‌తో కొత్త భరోసా వచ్చింది. ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ విధానంలో డయాబెటిక్, హైపర్ టెన్షన్‌తో పాటు పలు అసాంక్రమిక వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఒకప్పుడు పీహెచ్‌సీకి వెళితే వైద్యులే కనిపించేవారు కాదు. నాలుగేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులను నియమించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా అక్కడే వైద్యం అందించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేసి మిడ్‌లెవెల్ హెల్త్ప్రొవైడర్ను నియమించారు. దీంతో తమ సొంత గ్రామంలోనే వైద్యం అందే పరిస్థితులు కల్పించారు. నాలుగేళ్లలో లక్ష మందికి పైగా.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్సు వ్యవస్థ 2019 నాటికి పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో బాధితులు బిక్కు బిక్కుమనే పరిస్థితి. దీంతో అధికారంలోకి వచ్చీరాగానే జగన్ సర్కారు 108 వ్యవస్థపై దృష్టి సారించింది. మండలానికొక 108 అంబులెన్సును ఏర్పాటు చేసింది. దీంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్వీసులు మెరుగు పడ్డాయి. దీనికి తోడు మండలానికొక 104 వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇంటివద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నాయి. కరోనా సమయంలో 108 అంబులెన్సులే పెద్దదిక్కుగా ఉన్నాయి. రైతుకు భరోసా రైతే రాజు అని అని నమ్మిన ప్రభుత్వమిది. వైఎస్సార్ రైతు భరోసా పేరిట (పీఎం కిసాన్) పేరుతో 5.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.728 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.3 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గత ఏడాది రికార్డు స్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ.855 కోట్లు మంజూరైంది. మూడేళ్లలో రూ.1,200 కోట్లకుపైగా అందింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.120 కోట్ల మేర రైతులకు అందింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.250 కోట్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.14 కోట్లు అందజేసింది. డ్రిప్, స్ప్రింక్లర్లు కింద రూ.350 కోట్లు వ్యయం చేసింది. విత్తనం వేరుశనగ, పప్పుశనగ సబ్సిడీ కింద జగన్ సర్కార్ నాలుగేళ్లలలో ఏకంగా రూ.500 కోట్లు వ్యయం చేసింది. పారిశ్రామికాభివృద్ధి పరుగులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పారిశ్రామిక వృద్ధి పరుగులు పెడుతోంది. సరళీకృత పారిశ్రామిక విధానాలను అమల్లోకి తేవడంతో ఇతర రాష్ట్రాల పెట్టుబడి దారులు కూడా ఇక్కడకు వస్తున్నారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలతో సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఒక చరిత్ర. ప్రభుత్వాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే సంప్రదాయానికి జగన్ సర్కార్ స్వస్తి పలికింది. ప్రతి రెండువేల మంది జనాభాకు గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి సమస్యనైనా గ్రామం నుంచే పరిష్కరించుకునేలా చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,207 సచివాలయాలను ఏర్పాటు చేసింది. రేషన్ కార్డు నుంచి ఇంటిపట్టా వరకూ అన్ని పనులకూ సచివాలయమే వేదిక అయ్యింది. అలాగే వేలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. -
ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొనసాగిస్తున్నారు. పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయతకు మారు పేరుగా పాలన సాగుతోంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని ఎమ్మెల్యేలు స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రూ.3.02 లక్షల కోట్లు సాయం గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాల వారు ఇన్నాళ్లు వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరుకు దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా గత ప్రభుత్వంలో నోచుకోలేదు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వారికి తగిన వాటా ఇచ్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే కావడం గమనార్హం. ఆయా వర్గాలకు లబ్ధి ఇలా ♦ నాలుగేళ్లలో నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1,48,597 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.99,681 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.48,916 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఎస్సీలకు రూ.53,929 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.34,963 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.18,966 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎస్టీలకు రూ.15,114 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.10,395 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.4,719 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మైనారిటీలకు రూ.18,960 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.11,948 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.7,012 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా కాపులకు రూ.26,634 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.20,550 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.6,084 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇతరులకు రూ.38,871 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.33,531 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.5340 కోట్లు వ్యయం చేశారు. -
రైతుకు అసలైన భరోసా
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్‌పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. సున్నా వడ్డీ.. ఉచిత బీమా సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది. పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్తనం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసిరకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు సీజన్‌కు ముందే రెడీ సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్ పడింది. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్‌లో టెస్ట్ చేసి మరీ నాణ్యమైన సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు. గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే క్షణాల్లో వీహెచ్ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ను అందజేస్తున్నారు. అగ్రి ల్యాబ్‌లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. -
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్‌ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
అట్టడుగు వర్గాల ముందడుగు
సాక్షి, అమరావతి: ఏపీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత నిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకు సింహ భాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రు లు నాటి మాయావతి నుంచి నేటి సిద్ధరామయ్య వరకు ఎవరూ చేయని రీతిలో ఆ వర్గాలకు సీఎం జగన్ సమున్నత గౌరవం ఇచ్చి సామాజిక సాధికారత సాధన దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయ సాధనలో దేశానికే టార్చ్బే రర్ (మార్గ దర్శకుడు)గా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. దేశానికే ఆదర్శం నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ రూ.2.11 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖా తాల్లో (డీబీటీ) జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లోకే రూ. 1,56,987.64 కోట్లు వేశారు. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ బాటలు వేశారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦ నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్ పదవులిచ్చారు. ఇలా చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ♦ 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ ప దవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇ చ్చా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వ ర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి.. 484 నామినేటెడ్ డైరెక్టర్ పద వులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ♦ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే చైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులుంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ చైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో సగభాగం 3,503 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు. చేతల్లో సామాజిక న్యాయం ♦ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ♦ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురి(80 శాతం)ని ఆ వర్గాల నుంచే నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70%) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థల్లో.. ♦ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే.. వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు. ♦ 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగాను 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. -
ఆతిథ్య ఆంధ్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యాటకులకు ఆతిథ్య మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లకు పెట్టింది పేరైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్‌లతో పాటు దేశీయ సంస్థలైన గారిసన్, మేఫెయిర్ హోటళ్ల రాకతో సరికొత్త అనుభూతిని పంచనుంది. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో అతిథ్య రంగం విస్తరించనుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర పర్యాటకానికి సంబంధించి మొత్తం రూ.19,345 కోట్ల పెట్టుబడులతో 117 ఎంవోలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 51 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 45 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి వచ్చాయి. ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆతిథ్య రంగానికి చెందినవేనని అధి కా రులు తెలిపారు. 20 వరకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లు రాష్ట్రంలో రానున్నాయి. వీటి ద్వారా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.4949.41 కోట్ల పెట్టుబడులకు త్వరలో అన్ని అనుమతు లిచ్చి, పని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఒబెరాయ్ రూ.1,350 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్ప టికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు)లో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు వారాల్లోగా గండికోటలో కూడా హోటల్ నిర్మా ణానికి ఒప్పందాలు చేసుకుని జూలై చివరికి పను లు ప్రారంభించనుంది. అనంతరం రాజమండ్రి (పిచ్చుకలంక), హార్సిలీహిల్స్ ప్రాంతాల్లోనూ రిసార్ట్లు, కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయ నుంది. ఒబెరాయ్ సంస్థల ద్వారానే 10,900 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హయత్, తాజ్ గ్రూప్ ఐదు నక్షత్రాల హోటళ్లు తాజ్ సంస్థ విశాఖలో రూ.1050 కోట్లతో 60 ఎకరాల్లో లగ్జరీ రిసార్టులు నిర్మించనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ పరిశీలనలో ఉంది. తాజ్ నిర్మించే టెక్నాలజీ స్పేస్‌లో రెస్టారెంట్లు, షాపు లు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒ లింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ రానున్నాయి. హయత్ సంస్థ విశాఖ శిల్పారా మంలో రూ.200 కోట్లతో 3 ఎకరాల్లో, తిరుపతి శిల్పారామంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటి ద్వారా 5,100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడలో రూ.92.61 కోట్లతో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మించింది. ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనర సింహస్వామి ఆలయం వద్ద రూ.100 కోట్లతో స్పిరుచ్యువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ♦ ఏసీఈ అర్బన్ సంస్థ రూ.414 కోట్లతో 2,847 ఎకరాల్లో కాకినాడలో ఐదు నక్షత్రాల హోటల్‌తో పాటు కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి ♦ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ పేరూరులో రూ.218 కోట్లతో 5 ఎకరాల్లో, కడప శిల్పారామంలో 78.73 కోట్లతో రెండెకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లు..ఎకో–ఐఎస్ఎల్ఈ రిసార్ట్స్ సంస్థ అనంతగిరి (అరకు)లో రూ.243 కోట్లతో 43.1 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ ♦ గార్రిసన్ సంస్థ యండాడ (విశాఖ)లో రూ.122 కోట్లతో 3.87 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ – హోటల్ ♦ మైఫెయిర్ గ్రూప్ అన్నవరం (విశాఖ)లో రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో రిసార్టులు ♦ వైష్ణోవి వెర్సటైల్ వెంచర్స్ పేరూరులో రూ.125 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్ ♦ హిగ్గాని ఎంటర్ప్రైజెస్ విశాఖలో రూ.120 కోట్లతో టన్నెల్ అక్వేరియం – హోటల్ ♦ విశాఖ తెన్నేటి బీచ్‌లో ఎంవీ మా షిప్‌ను రూ.30 కోట్లతో షోర్ రిసార్టుగా తీర్చిదిద్ద ను న్నారు. శ్రీశైలంలో రూ.100 కోట్లతో రెండెకరాల్లో 3 నక్షత్రాల హోటల్, రూ.35.3 కోట్లతో రాయ చోటిలో రూ.45.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు రానున్నాయి. వీటికి డీపీఆర్‌లు సిద్ధంగా ఉండగా పీపీపీ గైడ్‌లైన్స్, అగ్రిమెంట్ పనులు వే గంగా పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తు న్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్న బాబు తెలిపారు. కాగా, ప్రభుత్వంతో ఆయా సంస్థలు కుదుర్చు కున్న ప్రతి ఒప్పందం అమలయ్యేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. -
మహిళలకు జగన్ ‘ఆసరా’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నయవంచనతో రాష్ట్రంలో కుదేలైన పొదుపు సంఘాల వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి జీవంపోసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి వాటి పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వారికి చెల్లించేలా ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలుచేయడంతో తిరిగి ఆ వ్యవస్థ గాడిలో పడింది. మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో దాదాపు ప్రతి పేదింటి మహిళ ఈ పొదుపు సంఘాల్లో సభ్యురాలైంది. రాష్ట్రంలో ఈ పురోగతిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికీ శ్రీకారం చుట్టింది. మరోవైపు.. వైఎస్ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవడం.. కుటుంబ అవసరాలకు సంఘం సభ్యులు ఉమ్మడిగా బ్యాంకుల నుంచి లోను తీసుకోవడం.. తిరిగి సకాలంలో అవి చెల్లించేవారు. ఈ సమయంలో 2014 ఎన్నికల ముందు, మహిళలెవరూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఈ వి షయాన్ని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. దీంతో అప్పటివరకు దేశా నికి ఆదర్శంగా నిలిచిన ఏపీలో పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని మహిళలు ఆ రుణాలపై వడ్డీ, చక్రవడ్డీలు పెరిగి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారు. చివరకు.. ఒక దశలో వారు తమ రోజువారీ పొదుపు సంఘాల కార్యక్రమాలను దూరంపెట్టారు. సంఘాలకు జగన్ పూర్వవైభవం.. కానీ, వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ‘పొదుపు’ మహిళల పేరిట అప్పటివరకు ఉన్న రూ.25,517 కోట్ల అప్పును వారికే నేరుగా నాలుగు విడతల్లో చెల్లించేందుకు సీఎం హోదాలో ఆయన వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో ఆయన జమచేశారు. మరోవైపు.. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించే పొదుపు మహిళలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే విధానానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దానికి మంగళం పాడింది. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు తిరిగి పొదుపు సంఘాల కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకున్నారు. అలాగే, చంద్రబాబు తీరుతో అప్పట్లో 60 శాతం పైబడి సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోతే.. ఇప్పుడు రాష్ట్రంలో 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు 99.5 శాతం మేర తమ రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. -
YS Jagan: 4 వసంతాల నవచరిత
ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు... ఏకంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10,592 గ్రామ, పట్టణ హెల్త్ క్లినిక్‌లు సేవలందిస్తున్నాయి. వీటి ఫలితమేంటో తెలుసా..? ► కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు ఇష్టంగా వెళుతున్నారు. రుచికరమైన భోజనం.. స్కూళ్లు తెరవకముందే చేతికందే పుస్తకాలు, యూనిఫామ్.. ఇంగ్లీషు విద్య.. ఎడ్యుటెక్ కంటెంట్‌తో అందే ట్యాబ్‌లు... ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేస్తున్నాయి. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా రైతుల్ని ఆర్బీకేలు చేయిపట్టి నడిపిస్తున్నాయి. విత్తు మొదలు పంట విక్రయం దాకా అన్ని సేవలూ అక్కడే. హెల్త్ క్లినిక్‌లోని ఫ్యామిలీ డాక్టర్... ఊళ్లలో మంచానపడ్డ వారికి ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నాడు. గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందుతున్నాయి. అవ్వాతాతలకు వలంటీర్లు ఠంచనుగా పింఛన్‌ను తెచ్చి చేతిలో పెడుతున్నారు. ► పేదలకు రేషన్ సరుకులూ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్లు పనిచేస్తున్నాయి. కాకపోతే... ఇవన్నీ సాధ్యమయింది కేవలం నాలుగేళ్లలో. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత!!. ► అందుకే ఇప్పుడు ఏపీ ఒక రోల్ మోడల్. సీఎంగా వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్బీకే, రేషన్ డోర్‌డెలివరీ, వలంటీర్ వ్యవస్థ... ఇలా అన్నిటినీ ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కొన్ని అమలు చేస్తున్నాయి కూడా!. ► ‘నిన్నటికన్నా నేడు బాగుంటే.. అదే అభివృద్ధి. ఊరైనా... మనుషులైనా’ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విధానం. ఈ సూత్రంతోనే ఆయన ప్రచారానికి విలువివ్వకుండా పని చేస్తూ పోతున్నారు. సొంతింటికి నోచుకోని 31 లక్షల కుటుంబాల్లో... మహిళలకు ‘పట్టా’భిషేకం చేశారాయన. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణమూ భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయింది కూడా. ఇక నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి... అమలు చేశారు. తన కేబినెట్లో, ప్రభుత్వ పథవుల్లో మహిళలకు సగభాగమిచ్చి... చేతల మనిషిగా చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు (56 శాతం) అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. సామాజిక న్యాయానికి చుక్కానిగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీనీ పంపకున్నా... జగన్ మాత్రం 8 సీట్లలో సగం బీసీలకే ఇచ్చారు. ఇక స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల సమగ్ర సర్వేని చేపట్టడమే కాక... రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన... నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఇవన్నీ ఒకెత్తయితే పారిశ్రామికంగా వేసిన అడుగులు మరో ఎత్తు. ఏపీకి సువిశాల తీరప్రాంతం ఉందంటూ గత పాలకుల్లా మాటలకే పరిమితం కాకుండా... కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్లు, మూడు ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మునుపెన్నడూ ఈ రాష్ట్రంవైపు చూడని... అంబానీ, అదానీ, జిందాల్, బంగూర్, భజాంకా తదితర దిగ్గజాలంతా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికగా విశ్వాసం వ్యక్తంచేయటమే కాక పెట్టుబడులూ పెడుతున్నారంటే... అది ముఖ్యమంత్రి దార్శనికతపై భరోసాతోనే. అందుకే... గడిచిన నాలుగేళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త చరిత్ర. -
దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు, మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి ఐటీలోనూ మేటి.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ ల్యాండ్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ కొప్పర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది. ఇందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్ 2019 డిసెంబర్ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది. -
రూ. లక్షన్నర కోట్ల ఎగుమతులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది. అత్యధికంగా ఆక్వా 2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు. విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు. -
ఆరోగ్యానికి బలం!
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగంలో నియామకాలతోపాటు పెద్ద ఎత్తున మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం మొదలు నాడు–నేడు ద్వారా వసతులతో తీర్చిదిద్దింది. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం లాంటి విప్లవాత్మక చర్యలతో ఆరోగ్య రంగం ముఖ చిత్రాన్నే మార్చేసింది. కొరతకు చెక్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 48,639 వైద్య సిబ్బంది పోస్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం. పదవీ విరమణ తదితర కారణాలతో ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. నాడు–నేడుతో మహర్దశ టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రూ.16 వేల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. నాడు–నేడు కార్యక్రమంతోపాటు 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలున్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. 882 చోట్ల పనులు పూర్తి కావటంతో ఆస్పత్రులు అధునాతనంగా తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఏడాదే 5 కొత్త వైద్య కళాశాలలు వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు కల్పించాలని నిర్దేశించుకోగా ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. తద్వారా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు అందుబాటులోకి రానుండగా ఆ తర్వాత ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది. ప్రజారోగ్యానికి రక్ష వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. 108 సేవలకు పూర్వ వైభవం దివంగత వైఎస్సార్ ప్రారంభించిన 108 అంబులెన్స్ సేవలను గత సర్కారు నిర్వీర్యం చేసింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. పల్లెల్లోనే వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగులను మధ్యాహ్నం నుంచి పరామర్శిస్తూ ఇంటి వద్దే వైద్య సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకూ వైద్యులు గ్రామాలకు వెళ్లి 1,17,08,895 మందికి వైద్య సేవలు అందించారు. -
సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజల జేజేలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా విజయోత్సవాలు జరుపుకొంటున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ముగ్ధులైన ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నగరం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరిలో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలతో సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరగిన బైక్ ర్యాలీల్లో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో హోం మంత్రి తానేటి వనిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల బైక్‌లతో 25 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ట్రాక్టర్ తోలుతూ ర్యాలీలో పాల్గొన్నారు. కడప నగరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమ బాబు, అఫ్జల్ఖాన్, ఏపీ సోషల్వెల్ఫేర్ బోర్డు ఛైర్మెన్ పులి సునీల్ కుమార్ ర్యాలీని నిర్వహించారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి కూడలి నుంచి సామవాయి మార్గం, అన్నమయ్య మార్గం మీదుగా ర్యాలీ విజయవంతంగా సాగింది. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పాల్గొన్నారు. అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమే ష్ బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నుంచి లక్ష్మీపురం వరకు 16 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కె.రక్షణనిధి ఆధ్వర్యంలో, విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. -
నాలుగేళ్లు నిండిన వైఎస్సార్సీపీ జనరంజక పాలన
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు నేటితో నాలుగు సంవత్సరాలు నిండుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన కొనసాగుతున్న సుపరిపాలన 2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగుబెడుతోంది. ఈ నాలుగేళ్లలో దాదాపు ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలు గతంలో అంటే-1953 అక్టోబర్ 1–1956 అక్టోబర్ 31 మధ్యన (నాటి ఆంధ్ర రాష్ట్రంలో) గాని లేదా 1956 నవంబర్ 1–2014 జూన్ 1 మధ్యన (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో) గాని కనిపించని ప్రభుత్వ జన సంక్షేమ పథకాలను, సర్వోతోముఖ ప్రగతిని స్వయంగా చూశారు. పేద ప్రజలు, బలహీనవార్గాల అభివృద్ధికి పెద్ద పీఠ వేసి అన్ని వర్గాల ప్రజలు చేయీ చేయి కలిపి ముందుకు సాగడానికి వైఎస్సార్సీపీ సర్కారు 2019 మే 30 నుంచీ నిజాయితీగా చేసిన ప్రయత్నాలకు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004–2009 మధ్య జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మాత్రమే రాష్ట్ర సర్కారు ఇలాంటి ప్రజాసంక్షేమానికి అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేసింది. 2014–2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన సాగిన ఐదేళ్ల పాలనతో కుదేలైన ఏపీ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే జగన్ గారు ప్రజాసేవకు అంకితమయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపైనే వృద్ధ్యాప్య పింఛన్లను పెంచుతూ ఫైలుపై సంతకం చేశారు. ఇలా మొదలైన పరిపాలనలో ఇప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు తన ఎన్నికల వాగ్దానపత్రంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసింది. ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేశామని ఈ నెల 23 సాయంత్రం ప్రియతమ ముఖ్యమంత్రి ట్విటర్ ద్వారా చేసిన ప్రకటన అక్షర సత్యం. మరోసారి తెలుగు ప్రజలకు సేవచేయడానికి ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 175 గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్న జగన్ గారి మాటలు వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమేగాక క్షేత్రస్థాయిలో పాలకపక్షానికి ప్రజల అనుకూల స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. పాలకపక్షంపై ప్రజల్లో అనుకూలతే సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వమైనా ప్రజల్లో వ్యతిరేకతను, అసంతృప్తిని ఎదుర్కొంటుంది. అలాంటిది ఏపీలో 4 సంవత్సరాలుగా కొనసాగుతున్న రాష్ట్ర సర్కారు పాలనపై జనామోదం నిరంతరం వ్యక్తమౌతూనే ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో, శాసనమండలికి జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో జనం తమ పాలకపక్షానికి నీరాజనం పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో జయాపజయాలపై కన్నా అన్ని వృత్తులు, రంగాల్లో ఉన్న ప్రజల ఆయురారోగ్యాలకే ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న పథకాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడం వల్ల అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్ల రూపాయల సహాయం ఆంధ్ర ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం వైఎస్సార్సీపీ హయాంలోనే మొదటిసారి. ప్రతిపక్షాల అభాండాలను, అడ్డంకులను విజయవంతంగా అధిగమిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రగతిపథంలో ముందుకు సాగడం దేశంలోనే అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అనేక రాష్ట్రాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలను, వాటి అమలు తీరును అధ్యయనం చేయడానికి రావడం రాష్ట్రానికే గర్వకారణం. నిర్ణీత కాలానికి ఎన్నికలు జరిగే ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అత్యధిక పాలక పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం గురించే ఆలోచిస్తాయి. ఇలాంటి పార్టీలకు తమ గెలుపు గురించి యావే తప్ప ప్రజ ల గోడు పట్టదు. కాని, వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల సర్కారు, ఆర్థిక సాయం అవసరమైన అన్ని వర్గాల మేలు కోసమే పరిపాలన సాగిస్తోంది. కొత్త పథకాలకు రూపం ఇస్తూ, ప్రజా సేవకు మరోసారి అంకితం కావడానికి రాజకీయంగా తన కృషి కొనసాగిస్తోంది. నిరంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్యన తిరగడమేగాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లతో ఎల్లవేళలా ప్రజలకు సేవలందించడం తెలుగునాట కొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రజల మేలు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ గారు చెప్పినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాలు గెలుచుకునే దిశగా పయనించడం తెలుగునాట ప్రజలకు శుభ పరిణామం. -విజయ సాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు