సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యాటకులకు ఆతిథ్య మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లకు పెట్టింది పేరైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్‌లతో పాటు దేశీయ సంస్థలైన గారిసన్, మేఫెయిర్ హోటళ్ల రాకతో సరికొత్త అనుభూతిని పంచనుంది. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో అతిథ్య రంగం విస్తరించనుంది.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర పర్యాటకానికి సంబంధించి మొత్తం రూ.19,345 కోట్ల పెట్టుబడులతో 117 ఎంవోలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 51 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 45 ప్రాజెక్టులకు డీపీఆర్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి వచ్చాయి.
ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆతిథ్య రంగానికి చెందినవేనని అధి కా రులు తెలిపారు. 20 వరకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లు రాష్ట్రంలో రానున్నాయి. వీటి ద్వారా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.4949.41 కోట్ల పెట్టుబడులకు త్వరలో అన్ని అనుమతు లిచ్చి, పని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు.
ఒబెరాయ్ రూ.1,350 కోట్ల పెట్టుబడి
రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్ప టికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు)లో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు వారాల్లోగా గండికోటలో కూడా హోటల్ నిర్మా ణానికి ఒప్పందాలు చేసుకుని జూలై చివరికి పను లు ప్రారంభించనుంది. అనంతరం రాజమండ్రి (పిచ్చుకలంక), హార్సిలీహిల్స్ ప్రాంతాల్లోనూ రిసార్ట్‌లు, కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయ నుంది. ఒబెరాయ్ సంస్థల ద్వారానే 10,900 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
హయత్, తాజ్ గ్రూప్ ఐదు నక్షత్రాల హోటళ్లు
తాజ్ సంస్థ విశాఖలో రూ.1050 కోట్లతో 60 ఎకరాల్లో లగ్జరీ రిసార్టులు నిర్మించనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ పరిశీలనలో ఉంది. తాజ్ నిర్మించే టెక్నాలజీ స్పేస్‌లో రెస్టారెంట్లు, షాపు లు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒ లింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ రానున్నాయి.
హయత్ సంస్థ విశాఖ శిల్పారా మంలో రూ.200 కోట్లతో 3 ఎకరాల్లో, తిరుపతి శిల్పారామంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటి ద్వారా 5,100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడలో రూ.92.61 కోట్లతో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మించింది.
ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనర సింహస్వామి ఆలయం వద్ద రూ.100 కోట్లతో స్పిరుచ్యువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు
♦ ఏసీఈ అర్బన్ సంస్థ రూ.414 కోట్లతో 2,847 ఎకరాల్లో కాకినాడలో ఐదు నక్షత్రాల హోటల్‌తో పాటు కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి
♦ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ పేరూరులో రూ.218 కోట్లతో 5 ఎకరాల్లో, కడప శిల్పారామంలో 78.73 కోట్లతో రెండెకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లు..ఎకో–ఐఎస్‌ఎల్‌ఈ రిసార్ట్స్ సంస్థ అనంతగిరి (అరకు)లో రూ.243 కోట్లతో 43.1 ఎకరాల్లో 5 స్టార్ హోటల్
♦ గార్రిసన్ సంస్థ యండాడ (విశాఖ)లో రూ.122 కోట్లతో 3.87 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ – హోటల్
♦ మైఫెయిర్ గ్రూప్ అన్నవరం (విశాఖ)లో రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో రిసార్టులు
♦ వైష్ణోవి వెర్సటైల్ వెంచర్స్ పేరూరులో రూ.125 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్
♦ హిగ్గాని ఎంటర్‌ప్రైజెస్ విశాఖలో రూ.120 కోట్లతో టన్నెల్ అక్వేరియం – హోటల్
♦ విశాఖ తెన్నేటి బీచ్‌లో ఎంవీ మా షిప్‌ను రూ.30 కోట్లతో షోర్ రిసార్టుగా తీర్చిదిద్ద ను న్నారు. శ్రీశైలంలో రూ.100 కోట్లతో రెండెకరాల్లో 3 నక్షత్రాల హోటల్, రూ.35.3 కోట్లతో రాయ చోటిలో రూ.45.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు రానున్నాయి. వీటికి డీపీఆర్లు సిద్ధంగా ఉండగా పీపీపీ గైడ్‌లైన్స్, అగ్రిమెంట్ పనులు వే గంగా పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తు న్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్న బాబు తెలిపారు. కాగా, ప్రభుత్వంతో ఆయా సంస్థలు కుదుర్చు కున్న ప్రతి ఒప్పందం అమలయ్యేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment