tourism
-
బిమ్స్టెక్ బలోపేతానికి 21 సూత్రాలు
బ్యాంకాక్: భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్టెక్ సభ్యదేశాల చెల్లింపుల వ్యవస్థలతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా వ్యాపారం, వాణిజ్యంతో పాటు పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ‘బిమ్స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఈ మేరకు 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన తెరపైకి తెచ్చారు. శుక్రవారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బహుళ రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం(బిమ్స్టెక్) సదస్సులో మోదీ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి కూటమి ముఖ్యమైన వేదిక అన్నారు. ‘‘భాగస్వామ్య దేశాల మధ్య సహకారం, అనుబంధం బలపడాలి. ఇందుకు 21 సూత్రాల ప్రణాళికను అమలు చేద్దాం. అందులో భాగంగా బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ (బోధి) ఏర్పాటు చేద్దాం. దీనికింద ఏటా సభ్యదేశాలకు చెందిన 300 మంది యువతకు భారత్‌లో శిక్షణ ఇస్తాం. సామర్థ్య నిర్మాణంలో ప్రపంచ దేశాలకు ఆదర్శ నమూనాగా నిలిచే సత్తా మన కూటమికి ఉంది. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటూ ఎదుగుదాం. డిజిటల్ ప్రజా సదుపాయాల (డీపీఐ) విషయంలో అనుభవాలు పంచుకుందాం. ఐటీ రంగ శక్తిసామర్థ్యాల సాయంతో బిమ్స్‌టెన్‌ను సాంకేతికంగా బలోపేతం చేసుకుందాం. బిమ్స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏటా వ్యాపార సదస్సులు నిర్వహిద్దాం. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారాలు చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. సదస్సులో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. మారిటైమ్ ట్రాన్స్‌పోర్టు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. బంగాళాఖాతంలో శాంతి, సౌభాగ్యం, భద్రత, సుస్థిరతే లక్ష్యంగా ‘బ్యాంకాక్ విజన్–2030’ను ఆమోదించారు.బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇటీవలి భూకంపంలో మయన్మార్, థాయ్‌లాండ్ ల్లో వేలాది మంది మరణించడం పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘విపత్తుల నిర్వహణ విషయంలో అంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత్‌లో బిమ్స్టెక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టెయినబుల్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్టు సెంటర్ నెలకొల్పుదాం. బిమ్స్టెక్ దేశాలకు మానవ వనరుల శిక్షణ నిమిత్తం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేద్దాం. ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు నలందా యూనివర్సిటీలో బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్íÙప్లు ఇస్తాం. కూటమి దేశాల మధ్య ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ పనులను వేగవంతం చేద్దాం. ఈ ఏడాది బిమ్స్టెక్ యూత్ లీడర్ల సదస్సు నిర్వహించనున్నాం. 2027లో తొలి బిమ్స్టెక్ క్రీడలు నిర్వహిద్దాం’’ అని సూచించారు.నేపాల్‌తో సంబంధాలకు ప్రాధాన్యం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఓలీతో ఫలవంతమైన చర్చ జరిగిందని మోదీ వెల్లడించారు. నేపాల్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత జనరల్ మిన్ ఆంగ్ లైంగ్‌తో మోదీ భేటీ అయ్యారు. భూకంపం నుంచి కోలుకోవడానికి సాయమందిస్తామని చెప్పారు. మయన్మార్‌లో సంఘర్షణలకు తెరపడాలంటే ప్రజాస్వామిక విధానంలో సజావుగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. థాయ్‌లాండ్ రాజు మహా వాజిరాలాంగ్‌కాన్ దంపతులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసుకోవడంపై చర్చించారు. సారనాథ్ బౌద్ధ స్థూపం నమూనాను థాయ్‌లాండ్ రాజుకు మోదీ అందజేశారు. మోదీ శ్రీలంక పర్యటన ప్రారంభం థాయ్‌లాండ్‌లో మోదీ రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. అనంతరం ఆయన శ్రీలంక చేరుకున్నారు. అక్కడ మూడు రోజులపాటు పర్యటిస్తారు. అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకేతో సమావేశమవుతారు. మోదీ చివరిసారిగా 2019లో శ్రీలంకలో పర్యటించారు. 2015 తర్వాత ఆయన శ్రీలంకలో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి.వాట్ ఫో ఆలయాన్ని దర్శించుకున్న మోదీ ప్రధాని మోదీ బ్యాంకాక్‌లో వాట్ ఫో బౌద్ధ ఆలయాన్ని దర్శించుకున్నారు. 46 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్ర సైతం ఉన్నారు. అశోక స్తంభం నమూనాను మోదీ వాట్ ఫో ఆలయానికి బహూకరించారు. భారత్, థాయ్‌లాండ్ మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. -
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
భారతదేశంలో అత్యంత ఇష్టమైన హాలిడే స్పాట్. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా గోవా పర్యాటక శాఖ భాగస్వామ్యంతో ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) రాష్ట్రంలోని సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను హైలైట్ చేసే డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించింది. గోవా పర్యాటక శాఖతో సహకారంతో 'రీడిస్కవర్ గోవా' ప్రచారం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఇందులో గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లు , నైట్ లైఫ్‌లకు సంబంధించిన ఎన్నో తెలియనవి వివరాలను విశేషాలను పొందుపర్చింది.గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే, ఎయిర్బిఎన్బి కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ నటుడు అభయ్ డియోల్ సమక్షంలో ఈ గైడ్‌బుక్‌ను ఆవిష్కరించారు. పర్యాటకుల సౌకర్యార్థం ఈ ‘గోవా అన్‌సీన్’గైడ్ బుక్‌లో చెఫ్‌లు, ట్రావెల్ రైటర్లు , కళాకారులతో సహా స్థానిక నిపుణుల అభిప్రాయాలను కూడా ఇందులో ఉన్నాయి. గోవా సంప్రదాయాలు, ప్రత్యేకమైన పాక అనుభవాలు కూడా ఈ డిజిటల్గైడ్బుక్లో లభ్యం. పాకశాస్త్ర విద్వాంసుడు అవినాష్ మార్టిన్స్, ఫుడ్ రైటర్, నోలన్ మస్కరెన్హాస్, కళాకారుడు , కంటెంట్ సృష్టికర్త సిద్ధార్థ్ కెర్కర్, గోవాగెట్టర్ వ్యవస్థాపకుడు గర్వ్ వోహ్రా, ట్రావెల్ రైటర్ ఇన్సియా లాసెవాల్లా ,టీవీ హోస్ట్ మరియు కంటెంట్ సృష్టికర్త స్కార్లెట్ రోజ్ అనుభవాలు, సిఫార్సులతో దీన్ని తీసుకొచ్చారు.గోవా పర్యాటక శాఖతో భాగస్వామ్యంతో ‘రీడిస్కవర్ గోవా’ , ‘గోవా అన్‌సీన్’ వంటి కార్యక్రమాల ద్వారా, రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వం, డైనమిక్ కమ్యూనిటీలు, ప్రత్యేకమైన వసతిని ప్రదర్శించడానికి కృషి చేస్తున్నామని హోమ్ స్టే బుకింగ్ వెబ్సైట్ ఎయిర్బిఎన్బి ఇండియా , ఆగ్నేయాసియా దేశ అధిపతి అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ తెలిపారు. “ రడిస్కవర్ గోవా 2.0 ప్రచారం & గోవా అన్‌సీన్ గైడ్‌బుక్ ఆవిష్కారంపై మాట్లాడుతూ , పర్యాటకం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, ,పునరుత్పాదక పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రయోజనాలు స్థానిక వ్యాపారాలు, సంఘాలు మరియు కొత్త తరం వ్యవస్థాపకులకు చేరేలా నిర్ధారిస్తుందని గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి రోహన్ ఖౌంటే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్రామీణ గోవాలో హోమ్‌స్టేలను ప్రోత్సహించడం ద్వారా మహిళలు, యువతకు సాధికారత కల్పించాలన్ని భావిస్తున్నట్టు వెల్లడించారు. https://news.airbnb.com/wp-content/uploads/sites/4/2025/03/Airbnb-Goa-Unseen-Guide.pdf -
అమెరికా పర్యటనా?... వద్దు బ్రో!
లీడ్స్ (యూకే): ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్–3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదార్ల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నవారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. → అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5 శాతం పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ ‘టూరిజం ఎకనామిక్స్’ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9 శాతం వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం. → ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు తగ్గనున్నట్లు అంచనా. → అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45 శాతంగా ఉంటోంది. → అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది. → అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నవారిలో 36 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ ‘లెగర్’ తెలియజేసింది. → గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్‌లు 70 శాతం పడిపోయాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ‘ఓఏజీ’ ప్రకటించింది. → పర్యాటకుల రాక తగ్గుతుండడం పట్ల యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10 శాతం తగ్గినా 2.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని స్పష్టంచేసింది. 1.40 లక్షలు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. → అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయిందని, పర్యాటకులకు అది అనువుగా లేదని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, వలసదార్లతోపాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. → పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్‌లో 53 శాతం, జర్మనీలో 56 శాతం, స్వీడన్లో 63 శాతం, డెన్మార్క్‌లో 74 శాతం మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. → అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తుంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3 శాతం తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6 శాతం తగ్గాయి. → అమెరికాకు వెళ్తే అరెస్టయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదముందని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. → అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్‌ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్నవారు యూరప్ దేశాలను డెస్టినేషన్‌గా ఎంచుకున్నారు. → 2026లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరుగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
మరో అపచారం.. పవనానంద స్వామి ఎక్కడ?
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
ప్రైవేటుతో పర్యాటక శోభ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ప్రైవేటు సంస్థల పెట్టుబడులతో వర్ధిల్లుతోంది. మన దేశంలోనూ ప్రధాన పర్యాటక ప్రాజెక్టులు ప్రైవేటు సంస్థల చేయూతతోనే ముందుకు సాగుతున్నాయి. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు తెలంగాణలో ఎన్నో ఉన్నా.. కనీస వసతులు లేక పర్యాటకులు కన్నెత్తి చూడటం లేదు.ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యాటకానికి ఊపు ఇచ్చేందుకు ప్రత్యేక టూరిస్టు పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 నాటి అవసరాలకు సరిపోయేలా పాలసీని రూపొందించినట్టు పేర్కొంది. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహసక్రీడలు, మెడికల్, వెల్నెస్, ఎకో–టూరిజం.. ఇతివృత్తాలుగా ఆయా సెక్టార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. భద్రమైన గమ్యం పర్యాటకులు ముందుగా గమనించేది ఆ ప్రాంతం భద్రమేనా, కాదా అన్నది. దీని కి పాలసీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ భద్రమైన ప్రాంతమన్న భావన పర్యాటకుల్లో వచ్చేలా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. పర్యాటకులతో స్థానికులు, గైడ్లు, దుకాణదారులు ఫ్రెండ్లీగా మెలిగేలా చర్యలు తీసుకోవటంతోపాటు ఆయా ప్రాంతాలను సీసీ కెమె రాల నిఘా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రోత్సాహకాలు ఇలా..: అడ్వెంచర్ టూరిజం కేంద్రాల్లో కనీస పెట్టుబడి మొత్తం రూ.25లక్షలుగా నిర్ధారించారు. దీనికి ఈపీసీపై సబ్సిడీ మొత్తం 25శాతంగా ఖరారు చేశారు. కారవాన్ పార్క్ ప్రాజెక్టుల్లో కనీసం పెట్టుబడి రూ.25 లక్షలు, సబ్సిడీ 25 శాతం, టూర్ ఆపరేటర్ల కారవాన్లలో కనీస పెట్టుబడి రూ.25 లక్షలు సబ్సిడీ 25శాతం, హౌస్ బోట్ ప్రాజెక్టుల్లో కనీస పెట్టుబడి రూ.కోటి, ఈపీసీ సబ్సిడీ 25 శాతం, వే సైడ్ ఎమినిటీస్ విషయంలో కనీస పెట్టుబడి రూ.2 కోట్లు, సబ్సిడీ 10 శాతంగా ఖరారు చేశారు.వీటికితోడు నెట్ స్టేట్ జీఎస్టీని పెట్టుబడిదారులకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. స్పెషల్ టూరిజం ఏరియా (ఎస్టీఏ)ల విషయంలో ఆయా ప్రాజెక్టుల ఆధారంగా వయబిలిటీ గ్యాప్ ఫండ్ (బేసిక్ ఎమినిటీస్ కోసం), ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, భూములకు తక్కువ లీజు మొత్తం వంటి రాయితీలు కల్పిస్తారు. కొన్ని రకాల ప్రాజెక్టుల్లో ఇండస్ట్రియల్ పవర్ శ్లాబ్స్, ప్రాపర్టీ ట్యాక్సుల్లో రాయితీలుంటాయి. నిర్ధారిత ప్రాజెక్టులకు ల్యాండ్ కన్వర్షన్ చార్జీలను రీయింబర్స్ చేస్తారు.సర్కారు పెట్టుకున్న లక్ష్యాలివీ.. ⇒ వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలి. ఈ ఐదేళ్లలో కనీసం 3 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ⇒ జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలి. ⇒ అంతర్జాతీయ పర్యాటక పటంలో తెలంగా ణ సమున్నతంగా నిలిచేలా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా ప్రభావం చూపాలి. రాష్ట్ర జీఎస్డీపీలో పర్యాటక రంగం వాటా 10 శాతానికి మించి ఉండాలి.⇒స్పెషల్ టూరిజం ఏరియాలు.. అద్భుత వసతులు – సాక్షి ప్లస్(ఈ–పేపర్)లో -
ప్యాలెస్‌లో ప్రయాణం రాజస్థాన్ విహారం
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో వారం రోజుల ప్రయాణం. ఇది ప్రయాణం మాత్రమే కాదు... ఒక అనుభూతి. రాజస్థాన్ కోటలను చూడాలి... థార్ ఎడారిలో విహరించాలి. రాజపుత్రులు మెచ్చిన జానపద కళల ప్రదర్శనలను ఆస్వాదించాలి.ఇవన్నీ మామూలుగా కాదు... సకల మర్యాదలతో రాజసంగా ఉండాలి.పర్యటన ఆద్యంతం కాలు కింద పెట్టకుండా సౌకర్యంగా ఉండాలి. రాజస్థాన్ టూరిజం... సామాన్యులకు రాజలాంఛనాలను అందిస్తోంది. ఇందుకోసం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక రైలునే సిద్ధం చేసింది. ఇది టూర్ మాత్రమే కాదు... ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్.ఇంకెందుకాలస్యం... ట్రైన్ నంబర్ 123456... ప్లాట్ మీదకు వస్తోంది... లగేజ్‌తో సిద్ధంగా ఉండండి.రాజస్థాన్ పర్యాటకం రాజసంగా ఉంటుంది. సాధారణ ప్యాకేజ్‌లు క్లస్టర్లుగా కొన్ని ప్రదేశాలనే కవర్ చేస్తుంటాయి. పింక్‌సిటీ, బ్లూ సిటీ, గోల్డెన్ సిటీ, లేక్ సిటీలన్నింటినీ కవర్ చేయాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ సౌకర్యంగా ఉంటుంది. 7 రాత్రులు 8 రోజుల ప్యాకేజ్‌లో రైలు న్యూఢిల్లీ సఫ్దర్ గంజ్ స్టేషన్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. 8 రోజు ఉదయం ఏడున్నరకు అదే స్టేషన్లో దించుతుంది.ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో జయ్‌పూర్, సవాయ్ మాధోపూర్, చిత్తోర్ఘర్, ఉదయ్‌పూర్, జై సల్మీర్, జో«ద్‌పూర్, భరత్పూర్, ఆగ్రాలు కవర్ అవుతాయి. ఈ పర్యాటక రైలు 1982, జనవరి 26 నుంచి నడుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో టూరిజమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ రైల్వేస్– రాజస్థాన్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టూర్ విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పర్యటిస్తున్నారు.తొలిరోజు: ఢిల్లీ టూ జయ్పూర్పర్యాటకులకు రాజపుత్రుల సంప్రదాయ రాచమర్యాదలందిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్‌కి చేరగానే రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతారు. పూలమాల వేసి, బొట్టు పెట్టి, గంధం రాస్తారు. షెహనాయ్ రాగం, కచ్చీఘోదీ నాట్యం, ఏనుగు అంబారీల మధ్య రిఫ్రెష్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింకులు, బార్) తో వెల్కమ్ చెబుతారు. పర్యాటకులు ఎవరికి కేటాయించిన గదిలోకి వాళ్లు వెళ్లిన తర్వాత ఆరున్నరకు రైలు ఢిల్లీ స్టేషన్ నుంచి పింక్‌సిటీ జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రైల్లో విందు భోజనం ఇస్తారు.రెండవ రోజు: జయ్‌పూర్ టూ సవాయ్ మాధోపూర్అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ట్రైన్ జయ్‌పూర్‌కి చేరుతుంది. పర్యాటకులు నిద్రలేచి రిఫ్రెష్ అయిన తర్వాత ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఎనిమిది గంటలకు రైలు దిగి (లగేజ్ రైల్లోనే ఉంటుంది) సైట్ సీయింగ్ కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి మారాలి. నగరంలో ఆల్బర్ట్ హాల్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్‌మంతర్ (ఖగోళ పరిశోధనాలయం)ని చూడడం. మధ్యాహ్నం లోహగర్ ఫోర్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్తారు. లంచ్ అక్కడే. ఆ తర్వాత సూర్యాస్తమయంలోపు అమేర్ ఫోర్ట్ విజిట్, షాపింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటలకు ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. ఏడు గంటల తర్వాత రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో డిన్నర్. ప్రయాణం సవాయ్ మాధోపూర్‌కు సాగుతుంది.మూడవ రోజు: మాధోపూర్ టూ చిత్తోర్ఘర్తెల్లవారు జామున ఐదు గంటల లోపు సవాయ్ మాధోపూర్ చేరుతుంది. రిఫ్రెష్ అయి ఆరు గంటలకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్ విజిట్‌కి వెళ్లాలి. నేషనల్ పార్క్ పర్యటన పూర్తి చేసుకుని పదింటికి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రైలు చిత్తోర్ఘర్ వైపు సాగిపోతుంది. లంచ్ రైల్లోనే. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తోర్ఘర్ చేరుతుంది. రైలు దిగి సైట్ సీయింగ్‌కి వెళ్లాలి. ఆరు గంటలకు కోట లోపల టీ తాగి, లైట్ అండ్ సౌండ్ షో ను ఆస్వాదించి ఏడున్నరకు రైలెక్కాలి. ఎనిమిది గంటలకు రైల్లోనే డిన్నర్.నాలుగవ రోజు: చిత్తోర్ఘర్ టూ జై సల్మీర్ వయా ఉదయ్పూర్రెండు గంటలకు చిత్తోర్ఘర్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకు లేక్‌సిటీ ఉదయ్‌పూర్ చేరుతుంది. రైలు దిగి తొమ్మిదింటికి వాహనంలోకి మారి సైట్‌సీయింగ్, షాపింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒకటిన్నరకు బోట్ రైడ్, ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం. మూడు గంటలకు తిరిగి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగు గంటలకు జై సల్మీర్‌కు ప్రయాణం. రాత్రి భోజనం రైల్లోనే ఎనిమిది గంటలకు.ఐదవ రోజు: జై సల్మీర్ టూ జోద్పూర్రైలు ఉదయం తొమ్మిదిన్నరకు జై సల్మీర్కి చేరుతుంది. రైలు దిగి గడిసిసార్ సరస్సు. జై సల్మీర్ కోట, నగరంలోని హవేలీలు చూసుకుని షాపింగ్ చేసుకుని తిరిగి రైలెక్కాలి. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు రైలు దిగి ఎడారిలో విహారం, క్యామెల్ రైడ్ ఆస్వాదించాలి. రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాల వినోదం, రాత్రి భోజనం కూడా అక్కడే చేసుకుని రాత్రి పది గంటలకు రైలెక్కాలి. పన్నెండు గంటలలోపు రైలు జై సల్మీర్ నుంచి బ్లూ సిటీ జో«ద్‌పూర్‌కు బయలుదేరుతుంది.ఆరవ రోజు: జో«ద్‌పూర్ టూ భరత్పూర్రైలు ఉదయం ఏడు గంటలకు జో«ద్‌పూర్‌కు చేరుతుంది. ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిదిన్నరకు సైట్ సీయింగ్ కోసం రైలు దిగాలి. మెహరాన్‌ఘర్ ఫోర్ట్, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియం చూసుకున్న తర్వాత షాపింగ్. ఒకటిన్నరకు బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో రాజలాంఛనాలతో విందు భోజనం చేసిన తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగన్నరకు రైలు జో«ద్‌పూర్ నుంచి భరత్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.ఏడవ రోజు: భరత్పూర్ టూ ఆగ్రారైలు ఉదయం ఆరు గంటలకు భరత్‌పూర్‌కి చేరుతుంది. వెంటనే సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. ఘనా బర్డ్ సాంక్చురీ విజిట్ తర్వాత ఎనిమిది గంటలకు మహల్ ఖాజ్ ప్యాలెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలెక్కాలి. పది గంటలకు రైలు ఆగ్రాకు బయలుదేరుతుంది. పదకొండు గంటలకు ఆగ్రా రెడ్ ఫోర్ట్ చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ తర్వాత మూడు గంటలకు తాజ్‌మహల్ వీక్షణం. ఐదున్నర నుంచి షాపింగ్, ఏడున్నరకు రైలెక్కి డిన్నర్ తర్వాత ఎనిమిది ముప్పావుకి ఢిల్లీకి బయలుదేరాలి.ఎనిమిదవ రోజు: ఆగ్రా టూ ఢిల్లీఉదయానికి రైలు ఢిల్లీకి చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, లగేజ్ సర్దుకుని ఏడున్నరకు దిగి ప్యాలెస్ ఆన్ వీల్స్‌కి వీడ్కోలు పలకాలి.తరగతుల వారీగా ట్రైన్ టికెట్ వివరాలు:⇒ ప్రెసిడెన్షియల్ సూట్లో క్యాబిన్‌కి... 2,67,509 రూపాయలు⇒ సూపర్ డీలక్స్‌లో క్యాబిన్‌కి... 2,18,207 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ సింగిల్ ఆక్యుపెన్సీ... 1,10,224 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి... 71,712 రూపాయలు⇒ ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. పన్నెండేళ్ల లోపు పిల్లలకు సగం చార్జ్.⇒ ఒక క్యాబిన్లో ఇద్దరికి అనుమతి. పిల్లలను పేరెంట్స్తోపాటు అదే క్యాబిన్లో అనుమతిస్తారు.ప్యాలెస్ ఆన్ వీల్స్ మరిన్ని వివరాల కోసం...Email : palaceonwheels.rtdc@rajasthan.gov.in Website: Palaceonwheels.rajasthan.gov.inపులి కనిపించిందా!ఈ టూర్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీతం, స్థానిక ఘూమర్, కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తూ సాగే కామెల్ సఫారీ, డెజర్ట్ సఫారీలు, క్యాంప్‌ఫైర్ వెలుగులో ఇసుక తిన్నెల మీద రాత్రి భోజనాలను ఆస్వాదించవచ్చు. భరత్‌పూర్‌లోని కెలాడియా నేషనల్ పార్క్‌కి సైబీరియా నుంచి వచ్చిన కొంగలను చూడవచ్చు. ఈ పక్షులు ఏటా సైబీరియా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నవంబర్‌లో ఇక్కడికి వలస వస్తాయి.మార్చి వరకు ఇక్కడ ఉండి ఏప్రిల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఈ కొంగలతోపాటు వందల రకాల పక్షులుంటాయి. రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లి జీప్ సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీ చేస్తూ పులి కనిపిస్తుందేమోనని రెప్పవేయకుండా కళ్లు విప్పార్చి బైనాక్యులర్‌లో చూసి చూసి... దూరంగా ఎక్కడో పులి అలికిడి కనిపించగానే భయంతో కూడిన థ్రిల్‌తో బిగుసుకు పోవచ్చు.ఏడు హెరిటేజ్ సైట్లను చూడవచ్చుప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాకేజ్‌లో యునెస్కో గుర్తించిన ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్లు కవర్ అవుతాయి. అవేంటంటే... జయ్‌పూర్‌లోని జంతర్ మంతర్, రణతంబోర్లో రణతంబోర్ కోట, చిత్తోర్‌ఘర్‌లో చిత్తోర్ఘర్ కోట, జై సల్మీర్‌లో జై సల్మీర్ కోటతోపాటు థార్ ఎడారి, భరత్పూర్ కెలాడియో నేషనల్ పార్క్, ఆగ్రాలో తాజ్ మహల్. ఇవన్నీ యునెస్కో గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్లు. ఈ గౌరవంతోపాటు తాజ్‌మహల్‌కి ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో కూడా స్థానం ఉంది. -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
ఎంతో సుందరమైన ప్రాంతాలు.. మేఘాలయా వెళ్తే తప్పక చూడాల్సిందే! (చిత్రాలు)
-
అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..
ప్రకృతి మన తెలుగువాళ్లకు వెయ్యి కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. గుజరాత్‌కి మాత్రం 16 వందల కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. ఆ తీరమే ఆ రాష్ట్రానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. ఆ అరేబియా తీరమే విదేశీ వర్తకానికి దారులు వేసింది. ఆ తీరానే శ్రీకృష్ణుడు... మన జాతిపిత గాంధీజీ పుట్టారు. సోమనాథుడు వెలిశాడు... గోరీ మనదేశం మీద దండెత్తాడు. ఆ తీరం పర్యాటకపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వారక నుంచి సోమనాథ్ వరకు ప్రయాణమే ఈ వారం పర్యాటకం.అదిగో ద్వారక...బేట్ ద్వారక... ఇది ద్వారక తీరం నుంచి కనిపించే దీవి. సముద్ర తీరాన విహరించడంతోపాటు సముద్రం మధ్యలో పడవలో పయనించడాన్ని కూడా ఆస్వాదించవచ్చు. కృష్ణుడి ద్వారకను చూసి ఆ నేల మీద నడిస్తే కలిగే పులకింతను మాటల్లో చెప్పలేం. పురాణకాలంలో కూడా ప్రజలు ద్వారక ప్రధాన పట్టణం నుంచి బేట్ ద్వారకకు పడవలో ప్రయాణం చేసినట్లు గ్రంథాల్లో ఉంది. చారిత్రక యుగంలో కూడా ద్వారక గురించి సింధు నాగరకత, హర΄్పా నాగరకత, మౌర్య సామ్రాజ్య రచనల్లో కనిపిస్తుంది. ఈ తీరం నుంచి రోమన్‌తో వర్తక వాణిజ్యాలు జరిగేవి. ఇక్కడి మ్యూజియాలలో ప్రశాంతంగా గడిపే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టూర్ ΄్లాన్ చేసుకోవాలి. ఓఖా– బేట్ ద్వారకలను కలిపే బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ మీద ఆగి ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.అంబానీ సొంతూరుచోర్వాడ్ బీచ్... ఇది సోమనాథ్‌కు 40కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బీచ్ క్లీన్‌గా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి, చక్కటి ఫొటోలు తీసుకోవడానికి బాగుంటుంది. అరేబియా సముద్రం ఈతకు అనువైనదే. కానీ చోర్వాడ్ దగ్గర మాత్రం ఈత క్షేమం కాదు. ఇక్కడ బీచ్ విజిట్ పూర్తయిన తర్వాత దీరూబాయ్ అంబానీ ఇంటిని చూడడం మర్చిపోవద్దు. నిజమే... ఇది అంబానీల సొంతూరు. ఈ ప్రదేశానికి చోర్వాడ్ అనే పేరు ఎందుకు వచ్చిందా అనే సందేహం తొలుస్తూనే ఉందా? అరేబియా తీరం నుంచి విదేశీ వ్యాపారం విరివిగా జరిగేది. సముద్రంలో ఓడల్లో సరుకుల రవాణా జరుగుతోందంటే అసంకల్పిత చర్యగా ఆ సరుకును దొంగలించే దొంగలు కూడా సిద్ధమై ΄ోతారు. ఆ సముద్రపు దొంగలు నివాసం ఏర్పరుచుకున్న ప్రదేశం ఇది. దొంగల నివాస ప్రదేశం అనే అర్థంలోనే పేరు స్థిరపడి΄ోయింది. రుక్మిణి కల్యాణంమాధవ్పూర్ బీచ్... ఇది పోర్బందర్ నుంచి వెరావల్‌కు వెళ్లే హైవే మీద ఉంటుంది. సముద్ర తీరాన హైవే ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణిస్తూ అరేబియా సముద్రపు నీటి నీలం గాఢతను చూడవచ్చు. ఆకాశానికి– సముద్రానికి మధ్య రేఖ ఎక్కడో తెలుసుకోవడం ఓ పెద్ద పజిల్. అన్నట్లు ఇక్కడ తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం ఉంది.స్థానికులను అడిగితే దారి చూపిస్తారు. పోర్బందర్ వరకు కొబ్బరి నీరు దొరకవు. కానీ మాధవ్‌పూర్ నుంచి సముద్ర తీరాన కొబ్బరి బోండాలు కనిపిస్తాయి. సముద్ర తీరాన కామెల్ రైడ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద వాళ్లు మొహమాట పడకుండా ఒంటె విహారాన్ని ఆస్వాదించాలి. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్లిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఓషో ఆశ్రమం కూడా ఉంది.ఓఖా– మాధీ బీచ్...ఇది ద్వారక వెళ్లే దారిలో వస్తుంది. హైవే మీద వాహనాన్ని ఆపుకుని దిగి ΄ావు కిలోమీటరు నడిస్తే ΄ాదాలు సముద్రపు నీటిలో ఉంటాయి. ఇక్కడ వర్తక వాణిజ్యాలేవీ జరగవు. కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇతర ప్రమాదాలు కూడా ఏవీ జరగవు. కాబట్టి సముద్రంలో స్నానం, స్విమ్మింగ్ సరదా తీరుతుంది. ఇక్కడ జనం రద్దీ తక్కువ. కాబట్టి ఏకాంతపు పర్యటనకు ఇది మంచి ప్రదేశం. సూర్యాస్తమయాన్ని వీక్షించడంతో΄ాటు రాత్రి బస ΄్లాన్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం.కృష్ణుడికి బాణం దెబ్బవెరావల్ బీచ్... ఇది సోమనాథ్‌కు నాలుగుకిలోమీటర్ల దూరాన ఉంది. ఇది శ్రీకృష్ణుడు ప్రణత్యాగం చేసిన ప్రదేశం. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే వేటగాడు జింక కాలుగా భావించి బాణం వేశాడని, కృష్ణుడు గాయపడి ప్రణత్యాగం చేశాడని చెబుతారు. ఈ ప్రదేశం భాల్క తీర్థంతో సందర్శన స్థలంగా అభివృద్ధి చెందింది. ఈ సంఘటన క్రీ. పూర్వం 3102, ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీగా భావిస్తారు. కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం అంతమైందని, మరుక్షణం నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. వెరావల్ తీరంలో ప్రాచీన కాలం నుంచి వర్తక వాణిజ్యం జరిగేది.సౌరాష్ట్ర కశ్మీరంమహువా బీచ్... ప్రశాంతతకు మారు పేరు ఈ ప్రదేశం. ఏడాదంతా చల్లగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేరళలో ఉన్నామా అనిపిస్తుంది. కొబ్బరిచెట్లు విస్తారంగా ఉంటాయి. ఈత చెట్లు కూడా. రెండు– మూడు గంటల కోసం వెళ్లడం కంటే రాత్రి బస ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సముద్ర తీరాన భవానీ మాత ఆలయం ఉండడంతో స్థానికులు భవానీ బీచ్ అంటారు.మన పర్షియా ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ్ర΄ాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది.గాంధీజీ పుట్టాడుచౌపాటీ బీచ్... ఇది పోర్బందర్లోని అరేబియా తీరం. ΄ోర్బందర్ అంటే మన జాతిపిత గాంధీజీ పుట్టిన ఊరు. అంతకంటే ముందు పౌరాణిక కథనాలను చూస్తే ఇది శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ప్రదేశం కూడా. గాంధీజీ ఇంటితోపాటు సుధాముడి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఈ ఆలయంలో అటుకులను ప్రసాదంగా ఇస్తారు. పోర్బందర్ జిల్లాకేంద్రమే, కానీ పట్టణంలో పెద్ద హడావుడి ఉండదు. తీర ప్రాంతం మాత్రం అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. పోర్టు ఉండడంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఉంటాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన ఫ్లెమింగోలు కూడా వేసవిలో ఇక్కడ సేదదీరుతుంటాయి. వాటి కోలాహలాన్ని కూడా ఆస్వాదించవచ్చు.జ్ఞాపకాలు దండిదండి సత్యాగ్రహం గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండుగా బయలుదేరి ఈ ప్రదేశంలో సముద్రపు నీటిని సేకరించి మరిగించి ఉప్పు తయారు చేశాడు. ఆ సంఘటనకు చిహ్నంగా ఇక్కడ గాంధీజీ ఉప్పు రాశి పోస్తున్న విగ్రహం ఉంటుంది. ఈ తీరంలో విహరించడంతో΄ాటు దండి సత్యాగ్రహం సమయంలో గాంధీజీ బస చేసిన సైఫీ బంగ్లాను కూడా చూసి ఒక ఫొటో తీసుకోవచ్చు.గాయపడిన ఆలయంసోమనాథ్ బీచ్... ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ ప్రదేశం విదేశీ దాడులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. మహమ్మద్ గోరీ అనేకసార్లు మనదేశం మీద దాడులు చేశాడు. అరేబియా సముద్రం మీద వచ్చి ఈ తీరం నుంచే భారత భూభాగంలోకి అడుగుపెట్టేవాడు. ఆలయ సంపద దోపిడీతోపాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం వంటివన్నీ చరిత్రపుటల్లో దాక్కున్నాయి. ఈ ఆలయం ఎన్నిసార్లు పునర్నిర్మాణం చేసుకుందో తెలియాలంటే చరిత్ర పుస్తకాలు చదవాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న మారు– గుర్జర శైలి నిర్మాణం నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీజీ అనుమతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నం. అందుకే ఆయన గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో వల్లభాయ్ పటేల్ విగ్రçహాన్ని ప్రతిష్ఠించారు.అరేబియా సముద్రం చిరు అలలతో మంద్రమైన సవ్వడితో ఆలరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత అలజడిగా ఉంటుంది. అలలు వేగంగా వచ్చి ఆలయ గోడలను తాకుతుంటాయి.మన పర్షియా ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ప్రాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది. (చదవండి: యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!) -
వన్యప్రాణులతో హాయ్.. హాయ్
ఠీవిగా నడిచే సింహం...మెడ సాగదీసే జిరాఫీ,.. ఘీంకరించే ఏనుగులు...గాల్లో బెలూన్లను అందుకునే డాల్ఫీన్స్... ఇలా వివిధ రకాల జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో దగ్గరగా వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపేలా ఇండోనేసియా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇవేకాక... చిన్నారులను సైతం ఆకట్టుకునేలా సెంట్రల్జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నాజిప్లైన్, గోకార్ట్ వంటివి ఏర్పాటు చేసింది.సాక్షి, అమరావతి: వన్యప్రాణి పర్యాటకంపై ఇండోనేసియా దృష్టి సారించింది. ప్రకృతి ఒడిలోకి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆసియాలో... ఆఫ్రికాను పోలిన సఫారీ అనుభవాన్ని అందిస్తోంది. వీసా నిబంధనలను సైతం సరళతరం చేసింది. 2025 నాటికి కోటిన్నర మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనేది లక్ష్యం. ఈక్రమంలో భారతీయ మార్కెట్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దీంతో ఇప్పుడు భారత్‌తో సహా 97 దేశాలకు చెందిన ప్రయాణికులు ఆన్లైన్లో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై ఈ–వీసా ఆన్ అరైవల్స్‌లో ఇండోనేసియా చుట్టిరావచ్చు. వాస్తవానికి ఇండోనేసియా ఇన్»ౌండ్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులతో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్–2024 డేటా ప్రకారం ఇండోనేసియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 7.10 లక్షలకు చేరుకుంది. ఇది గతేడాదికంటే 17.20 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. కుటుంబంతో సహా విహార, సాహస యాత్రలు, బీచ్ అందాలు, సాంస్కృతిక పర్యటనల సమ్మేళనంతో ఇండోనేసియా భారతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలోనే ‘తమన్ సఫారీ’ ఒక ప్రధాన వన్యప్రాణుల గమ్యస్థానంగా మారింది. కంగారూలూ కనిపిస్తాయితమన్ సఫారీ ప్రిజెన్లో ప్రయాణికులకు ఆ్రస్టేలియా వన్యప్రాణులను పరిచయం చేస్తుంది. కంగారూలు, వొంబాట్స్, ఈములతో పాటు త్వరలో కోలాస్ వంటి జంతువులు సందర్శించవచ్చు. ఇక్కడ చిన్నచిన్న ఏటీవీ వాహనాల్లో సాహస యాత్రలు కూడా చేయవచ్చు. సెంట్రల్ జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నా జిప్‌లైన్, గోకార్ట్ వంటివి చిన్నారులకు మంచి అనుభవాలను అందిస్తున్నాయి. సింహాలను చూస్తూ భోజనం చేయవచ్చు. తమన్ సఫారీ బాలిలో కొమోడో డ్రాగన్లు, ఒరంగుటాన్లు (కోతిజాతి), స్టార్లింగ్ పక్షుల అందాలను వీక్షించొచ్చు. ప్రిడేటర్ ఫీడింగ్ సెషన్లు, జీప్ సఫారీలు వంటి సాహస యాత్రలు ఉంటాయి. నీటి కింద భోజనం చేస్తూ వరుణ షో, అగుంగ్షోల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సంస్కృతి ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. జకార్తా అక్వేరియం సఫారీలో మెరై్మడ్ షోలు, అక్వాట్రెక్కింగ్, అండర్ వాటర్ ఫాంటసీ డైనింగ్లు ఉంటాయి. వీటితో సఫారీల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలను అందిస్తున్నాయి. సందర్శకులకు మొక్కల ఆధారిత వంటకాలనూ అందిస్తున్నాయి.ఆకట్టుకుంటున్న బహుళ సఫారీ పార్కులు వివిధ దేశాల్లో ఉన్న జూ మాదిరిగా కాకుండా ఆఫ్రికా తరహాలో జంతువుల మధ్య వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ‘తమన్ సఫారీ’ సాహస యాత్రను తలపిస్తోంది. ఇక్కడ జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో వీక్షించవచ్చు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఇండోనేసియా... ప్రధాన విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలకు సమీపంలోనే సఫారీలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇండోనేసియాలో బహుళ సఫారీ పార్కుల యాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తమన్ సఫారీ బోగోర్ (పశ్చిమ జావా), తమన్సఫారీ ప్రిజెన్ (తూర్పు జావా), తమన్ సఫారీ బాలి, సోలో సఫారీ (సెంట్రల్ జావా), జకార్తా అక్వేరియం సఫారీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నైట్ సఫారీ..24 గంటలూ సాహసం! ఇండోనేసియా సఫారీల్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో తమన్ సఫారీ బోగోర్ 24 గంటల పాటు వన్యప్రాణుల మధ్య సాహసయాత్రలను నిర్వహిస్తోంది. అందుకే అత్యధిక సందర్శకులు దీనికే క్యూ కడుతున్నారు. ప్రయాణించే వాహనంలో భోజన సదుపాయాలు సైతం కల్పిస్తుండటంతో రోజంతా చుట్టిరావచ్చు. సింహాలు, జిరాఫీలు, ఏనుగులతో పాటు వివిధ దేశాల జంతువులను చూడొచ్చు. దీనికి తోడు డాల్ఫీన్లతో ఈతకొట్టడం, పెంగ్విన్లకు ఆహారం అందించడం వంటి అనుభవాలు పొందవచ్చు. ముఖ్యంగా పర్యాటకులు రాత్రిపూట కూడా వన్యప్రాణులను చూసేలా నైట్ సఫారీ ఉంది. అక్కడే రిసార్టుల్లో బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. -
దేవభూమిలో వేసవి విహారం..!
హిమాలయ పర్వత శ్రేణులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. హిల్ స్టేషన్ల రాష్ట్రం అనడం కంటే దీనిని హిల్‌స్టేట్ అనడమే కరెక్ట్. మబ్బులు... అన్ని చోట్లా నేలకు నింగికి మధ్యలో పర్యటిస్తుంటాయి. ఇక్కడ మాత్రం... నేల మీదకు దిగి పర్యాటకుల్ని పలకరిస్తుంటాయి. అందుకే దీనిని దేవభూమి అంటారు... ఓసారి వెళ్లి చూసొద్దాం...అడ్వెంచరస్ ఔలిఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏడాదంతా మంచు దుప్పటి కప్పుకునే ప్రదేశం ఔలి. పదివేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది సాహసక్రీడల వేదిక. మంచు మీద స్కీయింగ్ చేయడానికి మనదేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రదేశం ఇది. ఔలి ఎక్కడుంది అని చె΄్పాలంటే దగ్గరలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాన్ని చెప్పాలి. జోషిమఠ్‌కు ఏడు కిలోమీటర్ల దూరాన ఉంది. ఔలి నుంచి హిమాలయ శిఖరాలను చూడవచ్చు. మబ్బుల మధ్య కేబుల్ కార్జోషిమఠ్ నుంచి ఔలికి కేబుల్ కార్లో వెళ్లాలి. నేల మీద విస్తరించిన తెల్లటి మంచు, మంచును చీల్చుకుని ఎదిగిన చెట్లను తాకుతూ మంద్రంగా కదులుతున్న మబ్బుల మధ్య సాగుతుంది విçహారం. ప్రభుత్వ రిసార్టులు, గెస్ట్ హౌస్‌లలో బస చేయడం మంచిది.ఐఏఎస్ బడి ముస్సోరీ..ముస్సోరీ... ఐఏఎస్‌లకు పాఠాలు చెప్తుంది. వింటర్ స్పోర్ట్స్ ఆడిస్తుంది. వేసవిలో చల్లగా అలరిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరాన ఉంది ముస్సోరీ పట్టణం. ఢిల్లీ నుంచి ముస్సోరీకి డెహ్రాడూన్ మీదుగానే వెళ్లాలి. ఇది ఆ రాష్ట్ర శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్ నుంచి 35 కిమీల దూరం.ముస్సోరీ పట్టణానికి చేరడానికి ముందే ముస్సోరీ లేక్ పలకరిస్తుంది. కొండల మీద సరస్సును ఆసక్తిగా చూసి ఒక ఫొటో తీసుకుని ముందుకు సాగాలి. ఈ పట్టణం అంతా కొండవాలులోనే ఉంటుంది. మాల్‌రోడ్, క్యామెల్స్ బ్యాక్ రోడ్... లైబ్రరీ రోడ్... ఇలా ప్రదేశాల పేర్లన్నీ రోడ్లే. ఇక్కడ హ్యాపీవ్యాలీ కనిపించేటట్లు రోడ్ మీదనే వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ మరొక ఫొటో తీసుకుని ముందుకెళ్లడమే. రోప్ వే లో ముస్సోరీ పట్టణం ఏరియల్ వ్యూ చూస్తూ గన్హిల్కి చేరాలి. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇక్కడ నుంచి హిమాలయాలు కనిపిస్తాయి. కెంప్టీ వాటర్ ఫాల్, ఝరిపానీ జలపాతం, లాల్తిబ్బ, లాండౌర్లను చుట్టేసిన తర్వాత ఐఏఎస్‌లకు శిక్షణనిచ్చే (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) అకాడమీ తప్పకుండా చూడాలి. మౌంటనియరింగ్ ట్రైనింగ్ అకాడెమీ, దిగంతాల్లో కనిపించే యమునానదిని చూస్తూ తిరుగుప్రయాణం కొనసాగించాలి.సంస్కృతంలో పాలించే నైనితాల్..నైనితాల్... మహాపర్వతాలు, వాటి మధ్య విశాలమైన చెరువులు, వాటి తీరాన నివాస ప్రదేశాలు... ఇదీ నైనితాల్ భౌగోళిక స్వరూపం. నైనితాల్ ఆ రాష్ట్రానికి న్యాయ రాజధాని. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది తెలుసా! హిందీతోపాటు సంస్కృతం కూడా అధికారిక భాష. నైనితాల్ జిల్లా కేంద్రం నైనితాల్ పట్టణం. తాల్ అనే పదానికి అర్థం కూడా సరస్సు లేదా చెరువు అని. దీని చుట్టు పక్కల సాత్తాల్, భీమ్తాల్, నౌకుచియాతాల్ ఉన్నాయి. అందుకే దీనిని లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ టూర్లో వరుసగా అన్నింటినీ కవర్ చేయవచ్చు. ఇక్కడి వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. బ్రిటిష్ పాలకులు తాము నివసించడానికి అనువైన ప్రదేశాలను వెతుకుతూ ఈ చెరువు తీరాన అధికారిక నివాసాలను కట్టుకున్నారు. వాటిని కూడా ఈ టూర్లో చూడవచ్చు. అల్మోరా కూడా నైనితాల్‌కు దగ్గరలోనే ఉంది. అల్మోరాలో రామకృష్ణ కుటీరం ఉంది. స్వామి వివేకానందుడు కొంతకాలం ఇక్కడ ధ్యానం చేసుకుంటూ గడిపాడు. మనం మబ్బులను చూడాలంటే తల పైకెత్తాలి, కానీ ఇక్కడ తల దించి చూడాలి. మన పర్యటన మబ్బులకు పైన సాగుతుంటుంది.నాటి రాణివాసం రాణికేత్..ఈ ప్రదేశం సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. రాణికేత్... అల్మోరా పట్టణానికి దగ్గరలో ఉంది. ఇక్కడ జనావాసం కంటే మిలటరీ శిక్షణ కార్యకలాపాలే ఎక్కువ. అందమైన ప్రదేశం అని చెప్పడం అంటే ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తక్కువ చేయడమే. పదాలకందనంతటి మహోన్నతంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన కాత్యూరి పాలకుడు సుధార్దేవ్ సతీమణి రాణి పద్మిని ఇక్కడ నివసించేదని, రాణి నివాసం చుట్టూ ఉన్న ప్రదేశానికి రాణీకేత్ (రాణిగారి భూములు) అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్రదేశం కొంతకాలం నేపాల్ రాజుల పాలనలో ఉండేది. బ్రిటిష్ పిలకులు స్వాధీనం చేసుకోవడంతో భారత్‌లో భాగమైంది. నేపాల్ సంస్కృతి కనిపిస్తుంది. రాణి నివాసం మాత్రం కనిపించదు.బహుగుణ పుట్టిన తెహ్రీ..తెహ్రీ పేరు విన్న వెంటనే గుర్తు రాదు, కానీ ఇది మనకు తెలిసిన ప్రదేశమే. తెహ్రీ డ్యామ్ పేరు తెలిసిందే. పర్యావరణ ΄ోరాటయోధుడు సుందర్‌లాల్ బహుగుణ పుట్టిన ఊరు, చి΄్కో ఉద్యమం చేసిన ప్రదేశం ఇది. ఇప్పుడు మనకు కనిపించేది కొత్త తెహ్రీ పట్టణం. అసలు జనావాసం డ్యామ్ నిర్మాణంలో మునిగిపోయింది. భాగీరథి, భిలాంగ్న నదుల కలయిక ఈ ప్రదేశం. ఈ నదులు ఆ తర్వాత గంగ, యమున నదులతో సంగమిస్తాయి.కవుల స్ఫూర్తి చమోలిచమోలి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో సౌకర్యాలు బాగానే ఉంటాయి. అనేక పుణ్యతీర్థాలకు, ప్రకృతి సౌందర్యక్షేత్రాలకు కేంద్రం వంటిది. బదరీనాథ్, కేదార్నాథ్, కర్ణ ప్రయాగ, నంద రయాగ, విష్ణుప్రయాగలు ఇదే రూట్లో కలుస్తాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తో΄పాటు మన దేశపు ఉత్తరభాగాన చివరి గ్రామం మాణా వరకు వెళ్లవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కవులు వచ్చేవారని చెబుతారు. కాళిదాసు వంటి మహాకవుల రచనల్లో ప్రతిబింబించిన వర్ణన ఇక్కడి ప్రకృతి దృశ్యాల ప్రభావమే.ప్రశాంత మున్సియారీఈ ప్రదేశం7, 217 అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయ పర్వత శ్రేణులు మధ్యలో విస్తరించిన భూభాగం. ఇక్కడ నిలబడి ఎటు వైపు చూసినా హిమాలయాలే కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలను అదృష్టవంతులనవచ్చా లేక స్థితప్రజ్ఞత సాధించిన తాత్వికవాదులనవచ్చా అనేది అర్థం కాదు. ముఖాల్లో ప్రసన్నత తాండవిస్తుంటుంది. జీవితాన్ని ప్రశాంతంగా గడపడం, సంతృప్తిగా జీవించడం ఎలాగో తెలిసిన వాళ్లు. వాతావరణాన్ని బట్టి పంటలు పండించుకోవడం, ఆవులు, గేదెలను పోషించుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు. పరుగులు ఉండవు, అసంతృప్తి ఉండదు, ఆవేదన కనిపించదు. జీవితం విలువ తెలిసిన వాళ్లు, జీవించడం తెలిసిన వాళ్లు అని చెప్పవచ్చు.కిలకిలరవాల ముక్తేశ్వర్..ఇది నైనితాల్ జిల్లాలో చిన్న గ్రామం. 7,500 అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల్లోని కుమావ్ పర్వతశ్రేణిలో ఉంది. (ఢిల్లీ నుంచి 343 కిమీలు). ఇక్కడ ముక్తేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివుడిని దర్శించుకోవడంతో సరిపెట్టుకోకూడదు. దగ్గరలో ఉన్న రుద్రధారి జలపాతాన్ని చూడాలి. రంగురంగుల పక్షులను, మృదువైన కువకులను ఆస్వాదించాలి. వాహనాన్ని ఆపి ఇంజన్ శబ్దం లేకుండా నిశ్శబ్దంలో వినిపించే పిట్టల రెక్కల టపటపలను, సన్నని తీయగా సాగే రాగాల మాధుర్యాన్ని ఆలకించాలి. ఈ అవకాశం నగరంలో దొరకదు. అలాగే 20 కి.మీల దూరాన ఉన్న ఐవీఆర్ఐ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)ని చూడాలి.భానుడి విన్యాసాల చక్రత..ఇది డెహ్రాడూన్ నుంచి వందకిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనిపిస్తాయి. ఎండాకాలంలో హిమాలయాల వీక్షణంలో దాగిన అద్భుతం ఏమిటంటే... ఒక పర్వతశిఖరం సూర్యుడి కిరణాలు నేరుగా పడుతూ ఎర్రగా ప్రజ్వరిల్లుతున్నట్లు ఉంటుంది. దాని పక్కనే మరొక శిఖరం పక్క శిఖరం నీడ పడి ఇంకా సూర్యోదయాన్ని చూడలేదన్నట్లే కనిపిస్తుంది. సూర్యాస్తమయం సమయంలోనూ ఇలాంటి అద్భుతాలను ఆస్వాదించవచ్చు. వేసవిలో టైగర్ ఫాల్స్ జలపాతం జల్లును ఆస్వాదించవచ్చు. డెహ్రాడూన్ వంటి నగరాల్లో హోటల్ రూమ్ అద్దెతో పోలిస్తే ఇక్కడ అద్దెలు తక్కువ. వెకేషన్‌ని ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయవచ్చు.హానిమూన్ ధనౌల్టీ..ఇది ఇటీవల పర్యాటక రంగం కొత్తగా అభివృద్ధి చేసిన ప్రదేశం. ముస్సోరీ పట్టణం జన సమ్మర్థం అధికం కావడంతో అది టూరిస్ట్ ప్లేస్‌కి పరిమితమైంది. వెకేషన్ కోసం పర్యాటకుల ప్రయాణం ధనౌల్టీ వైపు సాగుతోంది. ముఖ్యంగా హనీమూన్ జంటలకు ఇది బెస్ట్ వెకేషన్. ఢిల్లీ నుంచి 325 కి.మీ.ల దూరం. కారులో తొమ్మిద గంటల ప్రయాణం. ఈ టూర్లో ఢిల్లీ నగరం వదిలి, ఉత్తర ప్రదేశ్ భూభాగాన్ని దాటినప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన ఆనవాళ్లు పచ్చదనంతో స్వాగతం పలుకుతాయి. తమిళనాడు దాటి కేరళలో అడుగుపెట్టినప్పుడు కనిపించేటంతటి స్పష్టమైన మార్పును ఇక్కడా చూడవచ్చు. పచ్చదనాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రకృతి కొంత ప్రదేశాన్ని జీవితకాలపు లీజుకు తీసుకున్నట్లు ఉంటాయి ఈ ప్రదేశాలన్నీ. అందుకే ఈ రెండూ దేవుడి రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.ప్యాకేజ్‌లిలా...డెహ్రాడూన్ నుంచి ఔలి మూడు రోజుల టూర్ ప్యాకేజ్ ఒక్కొక్కరికి 32 వేలవుతుంది. ఇందులో డెహ్రాడూన్ – ఔలి రెండువైపులా హెలికాప్టర్ జర్నీ, రెండు రోజులు లగ్జరీ హోటల్లో బస ఉంటాయి. హెలికాప్టర్ రైడ్‌లో హిమాలయాల శిఖరాలను చూడవచ్చు. ఔలిలో స్నో స్పోర్ట్స్ స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో స్లెడ్జింగ్, స్నో ట్యూబింగ్, స్నో బైకింగ్ చేయవచ్చు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్‌లు కూడా సౌకర్యంగా ఉంటాయి. హిల్ స్టేషన్ ప్యాకేజ్‌లు 15 వేల నుంచి 35 వేల వరకు ఉన్నాయి. హనీమూన్ కపుల్ ప్యాకేజ్‌లు, ఏడెనిమిది మంది బృందం వెళ్లాలన్నా అందుకు తగిన ప్యాకేజ్‌లున్నాయి. రైలు ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఎదురైతే గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కూడా ఉంటుంది. ఫోన్ లేదా ఈ మెయిల్లో సంప్రదించవచ్చు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ పాట్లు..! ఈసారి ఏకంగా..) -
పర్యాటకంపై ప్రై‘వేటు’
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక శాఖకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రచించి అభివృద్ధికి కృషిచేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోంది. పర్యాటక యూనిట్ల అభివృద్ధి, ఆధునికీకరణ, పర్యాటకుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా ఒక్క చర్య చేపట్టకపోగా.. వాటిని ప్రైవేటు సంస్థకు అప్పగించే చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 11 కీలమైన యూనిట్లు, వాటి నిర్వహణ, ఆస్తులను చెన్నైకి చెందిన స్టెర్లింగ్‌కు అప్పగింత ఖరారైందని సమాచారం. ఈ నేపథ్యంలోనే స్టెర్లింగ్ ప్రతినిధులు 11 టూరిజం యూనిట్లలో పర్యటించి ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలపై మదింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కీలకమైన యూనిట్లే ప్రైవేటుకు.. రాష్ట్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కీలకమైన 11 యూనిట్లు ఆదాయంతోపాటు అభివృద్ధిలోనూ ముందున్నాయి. వీటికి సొంత ఆస్తులు కూడా ఉన్నాయి. ఏపీలో ఏకైక పర్వత నివాస ప్రాంతమైన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, విశాఖ జిలా్లలోని అరకు, టైడా, అనంతగిరి, యాత్రి నివాస్, విజయవాడలోని భవానీ ఐలాండ్, బెరమ్ పార్క్, కోనసీమ జిల్లాలోని దిండి, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నెల్లూరులోని రిసార్ట్స్, బార్, రెస్టారెంట్, అతిథి గృహలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాపారం,ఆదాయంలో ప్రాధాన్యత సాధించాయి. ఈ యూనిట్ల ఏటా ఆదాయం రూ.కోట్లలోనే ఉంటుంది. నెల ఆదాయం రూ.18 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటోంది. 436 మంది భవిష్యత్ ప్రశ్నార్థకం ఈ11టూరిజం యూనిట్లలో 436 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవి ప్రైవేటు సంస్థ చేతికి వెళ్లిపోతే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. వీరిని ఉద్యోగులుగా కొనసాగించడం, కొనసాగించకపోవడం ఆ సంస్థ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగుల్లో ఆప్కాస్, కాంట్రాక్టు, రెగ్యులర్ ప్రాతిపదికన నియమితులైన వారున్నారు.ప్రైవేటు చేతికి యూనిట్లు వెళితే వీరంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఏపీ టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. స్టెర్లింగ్ సంస్థకు చెందిన ఉద్యోగులు, సిబ్బందిని టూరిజం యూనిట్లలో నియమించుకుని కార్యకలాపాలను కొనసాగించే అవకాశాలే అధికంగా ఉంటాయని అంటున్నారు. గత ప్రభుత్వంలో రూ.82 కోట్లతో అభివృద్ధి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి సందర్శకులను విశేషంగా ఆకర్షించడం ద్వారా ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. ఈ నేపథ్యంలో 11 టూరిజం యూనిట్లలో నవీకరణ, పునరుద్ధరణ పనుల కోసం రూ.82.12 కోట్లతో పనులు మంజూరు చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు నిర్వహించి పనులు అప్పగించారు. అభివృద్ధి పనులు పూర్తయితే పర్యాటక శాఖకు మరింత ఆదాయం పెరుగుతుంది. ప్రైవేటుకు అప్పగిస్తే అభివృద్ధి చేసి అప్పనంగా ఇచ్చినట్టే. భరోసా ఇవ్వడం లేదు పర్యాటక శాఖకు చెందిన 11 యూనిట్లను ప్రైవేటుకు అప్పగిస్తే మా పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. 25 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఉద్యోగుల వయసు 50–55 ఏళ్లు. ఉన్నపళంగా వీళ్లని తొలగిస్తే ఎలా బతకాలి. రూ.కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశాక ప్రైవేటుకు అప్పగించడం సరైన నిర్ణయం కాదు. ఇప్పుడున్న విధానం కొనసాగిస్తే మరింత ఆదాయం కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు. దీనిపై ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదు. అందుకనే ఉద్యోగులతో కలిసి సీఎంకు విన్నవించనున్నాం. – పీటీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఏపీ టూరిజం ఎంప్లాయీస్ యూనియన్ ‘స్టెర్లింగ్’ పరిశీలన పూర్తి పది టూరిజం యూనిట్ల ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలను మదింపు చేసేందుకు ఆతిథ్య రంగంలో చెన్నైకు చెందిన స్టెర్లింగ్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు పది యూనిట్లలో పర్యటించి పరిశీలనలు పూర్తి చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా యూనిట్లలో ప్రతినిధులకు అతిథి మర్యాదలు చేయాలని ఈడీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. యూనిట్ల మేనేజర్లు దగ్గరుండి మర్యాదలు చేయడంతో పాటు పరిశీలనకు సహకరించి వారు అడిగిన సమాచారం ఇచ్చారు. ఆస్తులను పరిశీలించి వాటి స్థితిగతులపై సమీక్షించుకుని వెళ్లారు. -
దేశీయ పర్యాటకుల ఆకర్షణలో ఏపీది 4వ స్థానం
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్ణాటక, ఐదో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. 2022తో పోలిస్తే 2023లో ఆంధ్రప్రదేశ్‌లో దేశీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీని ప్రకారం.. 2022లో 19.27 కోట్ల మంది రాష్ట్రంలో పర్యటించగా 2023లో 25.47 కోట్ల మంది పర్యటించారు. అంటే.. 2022 కన్నా 2023లో 6.2 కోట్ల మంది పెరిగారు. ఇక 2023లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లోనే 86.11 శాతం మంది ఉండగా మిగతా రాష్ట్రాల్లో కేవలం 13.89 శాతమే ఉన్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, 2022తో పోలిస్తే 2023లో దేశీయ పర్యాటకుల సంఖ్య 77.86 కోట్లు పెరిగారు. 2022లో ఈ సంఖ్య 173.10 కోట్లుండగా 2023లో 250.96కి పెరిగింది. అలాగే, 2023లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ కూడా ఉన్నాయి. -
ఆధ్యాత్మిక పర్యాటకం.. ఆనందమయం
ప్రపంచం ఆధ్యాత్మికతను స్మరిస్తోంది. మానసిక చింతన, ప్రశాంత జీవనం కోసం వెతుకుతోంది. హాలిడే ట్రిప్పుల్లోని సంతోషాన్ని ఆధ్యాత్మిక పరవశ పర్యటనలుగా మారుస్తోంది. ఈ క్రమంలోనే 2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378.22 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 2,260.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ‘ట్రావెల్ టూరిజం వరల్డ్’ నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనుంది. –సాక్షి, అమరావతి విశ్వాసమే నడిపిస్తోంది..ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వ్యక్తిగత సంపద పెరిగేకొద్దీ, ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పండుగలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత సాయంతో ముందుగా వర్చువల్ టూర్లు చేసిన తర్వాత పర్యటనలను ఖరారు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, భారతదేశం, ఇటలీ వంటి దేశాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని లోతైన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనుభవాలను కోరుకునే సందర్శకుల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆధ్యాత్మిక అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చే ప్రత్యేక పర్యటనలను అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలకు అవకాశాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆనందం..ఆధ్యాత్మిక పర్యటనలు శారీరక–మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజంగా మారుతోంది. ధ్యానం, యోగాపై దృష్టి సారించే విహార యాత్రలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తున్నాయి. యూఎస్, కెనడా వంటి దేశాల్లో స్థానిక ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (క్యాథలిక్ చర్చి)కు తాకిడి పెరుగుతోంది. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు యూరోపియన్ నాగరికతను అన్వేíÙంచడానికి మైలురాళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా–పసిఫిక్‌లో అయితే భారతదేశంలో దేవాలయాలు, పీఠాలు, చర్చిలు, మసీదులను దర్శించుకునే వారు పెరుగుతున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, చైనా–జపాన్ దేశాల్లో బౌద్ధారామాలు వంటి పవిత్ర స్థలాలను లక్షలాది మంది సందర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యం–ఆఫ్రికాలో అయితే సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, జెరూసలేం తీర్థయాత్రలు ఎక్కువ ఉంటాయి. -
అయ్యన్న వ్యాఖ్యలతో స్తంభించిన మన్యం
సాక్షి, పాడేరు/బుట్టాయగూడెం: గిరిజనుల ప్రధాన చట్టం 1/70ని సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ తొలిరోజు విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్షాల నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. పాడేరు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా బంద్ జరిగింది. పాడేరు, అరకు, రంపచోడవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తదితర ప్రాంతాల్లో గిరిజనులంతా ఏకమై సంపూర్ణ బంద్ చేశారు. మన్యం మొత్తం స్తంభించడంతో సీఎం చంద్రబాబు దిగి వచ్చారు. 1/70 చట్టాన్ని సవరించబోమని స్వయంగా ‘ఎక్స్’లో ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అఖిలపక్ష నాయకులతో మంగళవారం సమావేశమై గిరిజన చట్టాలు, హక్కులను పరిరక్షిస్తామని సీఎం ప్రకటించారని, 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. దీంతో మంగళవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. బంద్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు.గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకూటమి ప్రభుత్వ పెద్దలు గిరిజన హక్కులు, చట్టాల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు హెచ్చరించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందన్నారు. 1/70 చట్టాన్ని సవరించి గిరిజనుల సంపదను దోచుకునేలా స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలిరోజు బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని, ప్రభుత్వం గిరిజనులకు నష్టం చేసే ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే› విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బాలరాజుగిరిజన చట్టాలను సవరించాలంటూ వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం సవరణ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.స్పీకర్ అయ్యన్నపై జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదురాజవొమ్మంగి: గిరిజనుల చట్టం 1/70పై వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకా యల అయ్యన్నపాత్రుడుపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయ కులు జడ్డంగి పోలీస్ స్టేషన్లో మంగళవా రం ఫిర్యాదు చేశారు. టూరిజంతో పాటు ఇతరత్రా మన్యం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలన్న అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం నాయకులు తెడ్ల రాంబాబు, సత్యన్నారాయణ, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, సవిరెల చంద్రుడు, పలువురు మహిళా నాయకులు చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న అయ్యన్న ఇలా మాట్లాడటం చట్ట వ్యతిరేకమని అన్నారు.వేకువజాము నుంచే బంద్మంగళవారం వేకువజాము పాడేరులో వైఎస్సార్ïÜపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సీపీఎం, సీపీఐతో పాటు గిరిజన, ప్రజా సంఘాలన్నీ మంగళవారం బంద్ చేపట్టాయి. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, సీపీఎం రాష్ట్ర నేతలు పి.అప్పలనరస, కిల్లో సురేంద్రతో పాటు నేతలంతా గిరిజనులకు అయ్యన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పెదబయలులో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో నేతలంతా రోడ్లపై బైఠాయించారు. అరకు లోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఘాట్‌లో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, వైఎస్సార్సీపీ నేతలంతా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగానే మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారపు సంతలు రద్దయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షను వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగానే పనిచేశాయి. బ్యాంకులు తెరచుకోలేదు. అకిలపక్ష నేతలు రోడ్లపైనే భోజనాలు చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివే యించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించారు. -
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
సాక్షి, అమరావతి: పర్యాటక రంగమే కీలక ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ప్రభుత్వం భారతీయుల రాకపై ఆశలు పెట్టుకుంది. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఎన్నడూ లేనివిధంగా వినూత్న నిర్ణయాలతో అడుగులు వేస్తోంది. 2023లో మాల్దీవుల మంత్రులు భారత ప్రధాని మోదీపై అవమానకర రీతిలో విమర్శలు చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులు ఘాటుగా స్పందించి మాల్దీవుల పర్యాటకాన్ని బహిష్కరించారు. చాలా ట్రావెల్ కంపెనీలు సైతం మాల్దీవుల పర్యాటకాన్ని బ్లాక్ లిస్టు చేశాయి. దీంతో మాల్దీవుల పర్యాటకంలో కీలకంగా ఉండే భారతీయులు భారీగా తగ్గిపోయారు. ఫలితంగా ఆదాయ వనరులు క్షీణించడంతో పాటు అక్కడి స్థానికుల ఉపాధికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ క్రమంలో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు గత అక్టోబర్‌లో మాల్దీవులు అధ్యక్షుడు ముయిజు భారతదేశాన్ని సందర్శించారు. ఈ తర్వాత రెండు నెలల్లో పర్యాటకుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. 3 లక్షల మందిని ఆకర్షించే లక్ష్యంతో.. మాల్దీవుల పర్యాటకంలో భారతీయలే అగ్రస్థానంలో ఉండేవారు. కోవిడ్–19 తర్వాత 2020–23 వరకు ఇదే పరిస్థితి ఉండేది. కానీ.. దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మాల్దీవులకు భారతీయ పర్యాటకులు తగ్గిపోయారు. 2023లో 18.87 లక్షల మంది విదేశీ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లగా.. గతేడాది 20.46 లక్షలకు పెరిగారు. ఇందులో చైనా మొదటి స్థానం, రష్యా రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ద్వీప సమూహ దేశానికి భారత పర్యాటకుల సందర్శనలు తగ్గిపోయాయి. 2023లో 2.09 లక్షల మంది పర్యటిస్తే 2024లో 1.30 లక్షలకు పడిపోయారు. 2024లో ఆక్కడి పర్యాటకం 6వ స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో భారతీయులపై గంపెడాశలు పెట్టుకున్న మాల్దీవుల ప్రభుత్వం ఈ ఏడాది 3 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రణాళికలు వేస్తోంది.విమాన సర్వీసులు పెంపుభారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నెలవారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ మీడియాలో విస్తృత ప్రచారంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలని భావిస్తోంది. ఇక మాల్దీవుల్లో క్రికెట్ వేసవి శిబిరాలను కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా భారతదేశంలోని మరిన్ని గమ్యస్థానాల నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడుతోంది. కోల్‌కతా, పుణె, చెన్నై వంటి కొత్త గమ్యస్థానాల నుంచి విమానాలు నడపనుంది. -
టూర్‌కీ ఉంది ఓ ట్యాక్స్!
ఏపీ సెంట్రల్ డెస్క్: ఒత్తిడితో కూడుకున్న జీవితం నుంచి కాస్తంత సేద తీరడానికి ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. చిల్ కావాలని కోరుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరి ఆర్థిక స్థోమతలను బట్టి వారు దేశీయ, విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు అత్యధిక సంఖ్యలో వెళ్తున్నవారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న వాటిలో బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నవారిని పర్యాటక పన్నులు (టూరిస్టు ట్యాక్సెస్) కలవరపెడుతున్నాయి. విదేశాల్లోనే కాకుండా మనదేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్‌లోనూ పర్యాటకులపై గ్రీన్ ట్యాక్స్ విధిస్తుండటం గమనార్హం.పర్యాటక పన్ను ఎందుకంటే.. పర్యాటక పన్నులనేవి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. గత కొన్నేళ్లుగా, ఆమ్స్టర్డామ్, వెనిస్, బాలి తదితర నగరాలు పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. అక్కడ పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఆయా నగరాల్లో ఇతర వసతుల కల్పనకు, పరిశుభ్రంగా ఉంచడానికి పర్యాటక పన్ను విధిస్తున్నాయి. అలాగే పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు అవసరం కాబట్టే తాము పర్యాటక పన్నును వసూలు చేస్తున్నామని ఆయా నగరాలు చెబుతున్నాయి. ఓవర్ టూరిజంతో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికే తాము టూరిస్టు ట్యాక్స్ వసూలు చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్బర్గ్ నగరం వచ్చే ఏడాది జూలై నుంచి పర్యాటక పన్నును వసూలు చేస్తామని ప్రకటించింది. ఎడిన్బర్గ్ బాటలోనే మరికొన్ని నగరాలు కూడా నడవడానికి సిద్ధమవుతున్నాయి. కలవరపెడుతున్న ఓవర్ టూరిజం.. కొన్ని దేశాలు పర్యాటకుల రాకపై ఆందోళన చెందుతుంటే మరికొన్ని దేశాలు ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే కొన్ని రెట్ల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) వంటివి ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ నగరాల్లో ఉన్న జనాభాను మించి సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ నగరాలకు పోటెత్తుతుండటంతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సమస్యగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టు నివాస, ఆహార సదుపాయాలు కల్పించడానికి, హోటళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలాలు అవసరం పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఇళ్ల స్థలాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అత్యధికంగా ధర చెల్లించాల్సి వస్తోంది.అదేవిధంగా నిత్యం పర్యాటకులతో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. దీంతో స్థానికులు తమ దైనందిన పనులు చేసుకోవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరప్ దేశం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఇటీవల ఓవర్ టూరిజం సమస్యను అరికట్టాలని స్థానికులు నిరసనలకు దిగడం ఇందుకు నిదర్శనం. ఇళ్ల స్థలాల కొరత, ట్రాఫిక్ సమస్యలే కాకుండా తమ ప్రాంతాలకు భారీ ఎత్తున తరలివస్తున్న పర్యాటకులతో పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆయా దేశాల పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర అపరిశుభ్రమైన చర్యలతో చెత్తకుప్పల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఓవర్ టూరిజం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులకు మరింత భారమేనా? అయితే ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు ట్యాక్స్ విధించడం పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు ట్రావెల్ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పర్యాటకులపై మరింత అదనపు ఖర్చు పడుతుందంటున్నారు. పర్యాటకులపై పన్ను విధించడం వల్ల వారు పన్ను లేని వేరే కొత్త గమ్యస్థానాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. దీనివల్ల పన్ను విధిస్తున్న దేశాలకు పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ట్రావెల్ ఆపరేటర్లు మాత్రం పర్యాటక పన్ను విధించడం మంచి విషయమేనని చెబుతున్నారు. పర్యాటకులకు వసతులు కల్పించడానికి, ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కోవడానికి టూరిస్టు ట్యాక్స్ ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పర్యాటక పన్నులు... ⇒ ఇటలీలోని వెనిస్ పర్యాటకుల తాకిడిని నియంత్రించడానికి ‘డే–ట్రిప్పర్ ట్యాక్స్’ పేరుతో ఒక్కో పర్యాటకుడి నుంచి రోజుకు 5 యూరోలు వసూలు చేస్తోంది. ⇒ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో పర్యాటకులు తమ హోటల్ బిల్లుపై 7% అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాకుండా రాత్రి అక్కడే ఉంటే సిటీ ట్యాక్స్ కింద మరో 3 యూరోలు సమరి్పంచుకోవాల్సిందే. ⇒ భారత్ పొరుగు దేశం భూటాన్ సైతం పర్యాటకుల నుంచి రోజువారీ రుసుమును వసూలు చేస్తోంది. వసతి, భోజనం, సాంస్కృతిక పర్యటనలను కవర్ చేయడానికి రోజుకు 200 నుంచి 250 డాలర్లను రోజువారీ సందర్శకుల రుసుము కింద తీసుకుంటోంది. ⇒ ఓడ లేదా విమానం ద్వారా వెళ్లే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ’సయోనారా ట్యాక్స్’ కింద జపాన్ 1,000 యెన్లు వసూలు చేస్తోంది. ⇒ యూకేలోని మాంచెస్టర్‌లోని హోటళ్లలో ఒక రాత్రి నివాసం ఉంటే ప్రతి పర్యాటకుడు ఒక పౌండ్.. నైట్ ట్యాక్స్ కింద చెల్లించాల్సిందే. ⇒ స్పెయిన్‌లోని బార్సిలోనాలో వసతి రకాన్ని, ప్రదేశాన్ని బట్టి ఒక్కో రాత్రికి 4 యూరోల వరకు టూరిస్టు ట్యాక్స్ చెల్లించాలి. ⇒ గతేడాది అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్ టూరిస్టు ట్యాక్స్‌ను ఏకంగా మూడురెట్లు పెంచింది. అంతర్జాతీయ పర్యాటకులు ఆ దేశంలో అడుగుపెడితే 135 న్యూజిలాండ్ డాలర్లను చెల్లించాల్సిందే. ⇒ భారతీయ పర్యాటకులు అత్యధికంగా వెళ్లే దేశాల జాబితాలో ఉన్న మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, గ్రీస్, క్రొయేషియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్ తదితర దేశాల్లోనూ టూరిస్టు ట్యాక్స్‌లు అమల్లో ఉన్నాయి. ⇒ గతేడాది యూకే.. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)ను ప్రవేశపెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరప్ దేశాల నుంచి యూకేకు రావాలనుకునేవారు ముందుగా ఈటీఏకి దరఖాస్తు చేసుకోవాలి.. అలాగే నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని దేశాలకు యూకే వర్తింపజేయనుంది. ⇒ ఈ ఏడాది జనవరి 1 నుంచి రష్యా పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ⇒ ఈ ఏడాది మధ్య నుంచి థాయ్‌లాండ్ పర్యాటక పన్నును విధించడానికి సిద్ధమవుతోంది. విమానం ద్వారా తమ దేశంలో ప్రవేశించే పర్యాటకులు 300 బాత్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అదే భూ లేదా సముద్ర మార్గం ద్వారా థాయ్‌లాండ్‌లో ప్రవేశిస్తే టూరిస్టు ట్యాక్స్ కొంత తక్కువ ఉంటుంది. ⇒ మనదేశంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను నియంత్రించడానికి పర్యాటకుల నుంచి రూ.20 గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.పర్యాటకులు ఏం చేయాలి? విదేశాల్లో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే, ముందు ఆయా దేశాల్లో పర్యాటకులపై ఎలాంటి పన్నులు ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమమని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. కొన్ని దేశాలు పర్యాటకులు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచే పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటారనేదాని ఆధారంగా ఈ రుసుములు ఉంటున్నాయి. మరికొన్ని దేశాలు పర్యాటకులు టూర్‌ని ముగించుకుని వెళ్లిపోతున్నప్పుడు పన్నును (డిపార్చర్ ట్యాక్స్) వసూలు చేస్తున్నాయి. కాబట్టి పర్యాటకులు తమ పర్యటనలకు ముందే ఈ ట్యాక్సుల గురించి తెలుసుకోవాలని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. -
నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..
ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా గుజరాత్‌లోని యువత నూతన స్టార్టప్(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్ నిర్వహణ.కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్‌పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.సందీప్ ప్రజాపతి గుజరాత్(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
ప్రపంచ పర్యాటకం కళకళ
2024 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా జనం పర్యాటనల్లో మునిగిపోయారని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ) ప్రకటించింది. గత ఏడాది ఏకంగా 140 కోట్ల మంది జనం పర్యటనల్లో బిజీగా మారారని యూఎన్‌డబ్ల్యూటీఓ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2019 డిసెంబర్లో మొదలైన కోవిడ్ సంక్షోభం దెబ్బకు కుదేలైన ప్రపంచ పర్యాటకం మళ్లీ నాలుగేళ్ల తర్వాత 99 శాతం పుంజుకోవడం విశేషం. 2014 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఏకంగా రూ.172 లక్షల కోట్లు ఖర్చుచేశారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక్కో పర్యాటకుడు గత ఏడాది మొత్తంలో పర్యాటకం కోసం దాదాపు రూ.86,000 ఖర్చుచేశాసినట్లు స్పష్టమైంది. ఎక్కువ ఎక్కడికి వెళ్లారు? గణాంకాల ప్రకారంచూస్తే అత్యధికంగా 74.7 కోట్ల మంది జనం యూరప్ దేశాల్లో పర్యటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి యుద్ధంలో మునిగిపోవడంతో పర్యాటకులు ఉక్రెయిన్, రష్యా వాటి సమీప దేశాల రీజియన్‌లో సందర్శనలపై ఆసక్తి కనబరచలేదు. దేశాలవారీగా చూస్తే ఫ్రాన్స్‌కు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఫ్రాన్స్ పర్యాటక బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది ఆ దేశానికి 10 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఆ తర్వాత స్పెయిన్‌లో 9.8 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ‘‘అత్యధిక సందర్శకులతో ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. 2024 సమ్మర్ ఒలింపిక్స్, పారిస్‌లో ప్రఖ్యాత నోట్రే డేమ్ క్యాథడ్రల్ చర్చి పునఃప్రారంభం, రెండో ప్రపంచయుద్ధంలో నార్మాండీపై దాడుల ఘటనకు 80 ఏళ్లు పూర్తవడంతో జరిగిన కార్యక్రమాలను చూసేందుకు ఏడాది పొడవునా భారీగా జనం తరలివచ్చారు’’అని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 31.6 కోట్ల మంది పర్యటించారు. స్పెయిన్‌లో విభిన్న పరిస్థితి ‘‘మా ప్రాంతానికి రండిబాబు. పర్యటించి ఇక్కడి వ్యాపారాన్ని పెంచండి’’అనే రాష్ట్రాలు, దేశాలనే మనం చూశాం. అందుకు భిన్నంగా స్పెయిన్ వ్యవహరించినా మళ్లీ అదే దేశానికి జనం వరసకట్టడం గమనార్హం. సెవిల్లే సిటీలోని ప్లాజా డీ ఎస్పానా వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసి పోవడంతో అక్కడి స్థానిక యంత్రాంగం అక్కడ ఎవరు పర్యటించినా చార్జీలు వసూలుచేస్తామని హెచ్చరించింది. 1929 నిర్మించిన అక్కడి ప్రాంతంలో జనం, వ్యాపారాలు పెరిగిపోయి వీధివ్యాపారుల ఆక్రమణలు అధికమై, పాత కట్టడాలు దెబ్బతింటున్నాయని నగర మేయర్ జోస్ లూయిజ్ శాంజ్ చెప్పారు. ఇటలీలో వెనీస్, ఫ్లోరెన్స్ నగరాల్లో బృంద పర్యాటకాలపై నిషేధం, రాత్రిళ్లు బీచ్‌లలో ఈతకొట్టడంపై నిషేధాజ్ఞలున్నాసరే ఆ దేశంలో పర్యాటకం గతంతో పోలిస్తే 23 శాతం పెరిగింది.ఆశ్చర్యపరిచిన చిన్న దేశాలు భారత్‌తో పోలిస్తే అధిక మండే ఎండలుంటే ఖతార్‌లో అత్యధిక మంది సందర్శకులు వచ్చారు. అక్కడ గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 137 శాతం పెరగడం విశేషం. గత ఏడాది అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌గా ఖతార్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. దోహాలోని హమాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ కిరీటాన్ని సాధించింది. ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అత్యంత చిన్న దేశం ఆండోర్రాలోనూ పర్యాటకుల రద్దీ పెరిగింది. డొమెనికన్ రిపబ్లిక్, కువైట్, అల్బేనియా, ఎల్ సాల్వడార్ వంటి చిన్న దేశాలకూ పెద్ద సంఖ్యలో సందర్శకులు క్యూ కట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆతిథ్యానికి మౌలిక పరిశ్రమ హోదా
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగం తమకు మౌలిక పరిశ్రమ హోదా కల్పించాలని దీర్ఘకాలంగా కోరుతోంది. అయినప్పటికీ ఈ దిశగా నిర్ణయం రావడం లేదు. రానున్న బడ్జెట్లో అయినా దీనిపై సానుకూల ప్రకటన చేయాలని ఈ రంగం కోరుతోంది. పన్నులను హేతుబద్దీకరించాలని, వీసా జారీ ప్రక్రియలను సులభంగా మార్చాలని, పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు రాష్ట్రాలు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కేబీ కచ్రు డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన పరిశ్రమ డిమాండ్లను ఆయన మీడియాతో పంచుకున్నారు.డిమాండ్లివీ..→ సమావేశాలు సదస్సులు, ప్రదర్శనలకు (మైస్) అనుకూలమైన కేంద్రాలను ప్రభుత్వం గుర్తించి, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి. → ఆతిథ్య పరిశ్రమకు పన్ను పెద్ద సమస్యగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రకాల పన్నులు అమలవుతున్నాయి. వీటిని హేతుబద్దీకరించాలి. సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ అనుసరిస్తున్న మాదిరి అత్యుత్తమ విధానాలను అనుసరించాలి. → దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, జపాన్ పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తమ జీడీపీని వృద్ధి చేసుకున్నాయి. → గతంలో ఒక హోటల్ తెరవాలంటే 100 రకాల అనుమతులు అవసరమయ్యేవి. అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ అనుమతుల ప్రక్రియను మరింత సులభంగా మార్చాలి. సింగిల్ విండో విధానం తీసుకురావాలి.→ రాష్ట్రాల స్థాయిలోనూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. పెట్టుబడులు కావాలి..ప్రభుత్వం ఒక్కటే కావాల్సినన్ని పెట్టుబడులు అందించలేదు. ప్రైవేటు రంగం ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడులపై తగిన రాబడి వచ్చే విధంగా (ఆర్వోవై) ప్రోత్సాహకం కల్పిస్తే చాలు. అప్పుడే పెట్టుబడులతో ముందుకు వస్తారు. థాయ్‌లాండ్ జీడీపీలో పర్యాటకం నుంచి 25 శాతం వాటా వస్తుంటే.. మన జీడీపీలో 6 శాతం మించడం లేదు. మౌలిక పరిశ్రమ హోదా కల్పించం వల్ల ఆకర్షణీయమైన రేట్లకే రుణాలు లభిస్తాయి.’’– కేబీ కచ్రు, హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్జీఎస్టీ తగ్గించాలి.. దేశీయ పర్యాటక రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, ప్ర యాణాలకు ప్రాధాన్యం, విస్తరిస్తున్న మధ్య తర గతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లక్ష్యత చర్యలు అవసరం. ఇందులో పరిశ్రమ హోదా కల్పించాలి. ఆతిథ్య రంగంలో పెట్టుబడులు, అభివృద్ధిని ప్రోత్సహించాలి. హోటల్ నిర్మాణానికి జీఎస్టీ క్రెడిట్‌తోపాటు, జీఎస్టీ రేట్లను కమ్రబద్దీకరించడం వల్ల మొత్తం నిర్మాణ వ్యయాలు తగ్గుతాయి. ఈ చర్యలు దేశీ పర్యాటకాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.–రాజేష్ మాగోవ్, మేక్ మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు–సీఈవో నైపుణ్య కల్పన అవసరం..రుణాలు పరిశ్రమకు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలపై ఎక్కువ భారం పడుతోంది. ఆతిథ్య రంగానికి రుణాల రేట్లు 10.75% నుంచి 22.50% వరకు ఉన్నాయి. ఈ రేట్లను 7–8%కి తీసుకురావాలి. దీనివల్ల భారం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా వృద్ధి, స్థిరత్వం సాధ్యపడతాయి. ఈ రంగంలో నైపుణ్యాలకు కొరత నెలకొంది. నిపుణుల లేమితో 30% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు అవసరం. దీనివల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది.– మేహుల్ శర్మ, సిగ్నమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వ్యవస్థాపకుడు–సీఈవో -
ఆంధ్రా ఊటీ పెదమల్లాపురం
కొండా కోనల మధ్య ప్రకృతి అందిస్తున్న సోయగాల వనం ఆ గ్రామం. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ గిరిజన గ్రామం చుట్టూ ప్రతి అంగుళం పరవశింపజేస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఎత్తయిన కొండలు, పాములా మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తయిన రెండు కొండల మధ్య పాలసముద్రం పొంగుకొస్తోందా అనేట్టు జాలువారే జలపాతాలు.. ఎటు చూసినా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే అందాలే.సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రా ఊటీగా పాచుర్యం పొందిన ఈ ప్రాంతం కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామం. దీనికి సమీపంలోని సిద్ధివారిపాలెం గ్రామం పర్యాటకులకు మరింత ప్రత్యేకమైనది. ఈ గ్రామంలోని కొండల నడుమ శబరిమలై తరహాలో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. 2009లో అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు శంకుస్థాపన చేసిన ఈ ఆలయం 2011లో ప్రారంభమైంది.తొలుత ఆథ్యాత్మిక కేంద్రంగా విలసిల్లి కాలక్రమంలో పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ఇక్కడికి వెళ్లే దారిలో ఎత్తయిన కొండలు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, పచ్చటి చెట్లు కనువిందు చేస్తాయి. కొత్త అచ్చింపేట ృ గౌరంపేట మధ్యలో అమ్మాయి గొప్పు ఘాట్ పర్యాటకులను కట్టిపడేస్తోంది. కొత్త అచ్చింపేట తర్వాత నిటారుగా పచ్చదనంతో నిండిన నిమ్మలగాడి కొండ, ములుకొండ, దారలలొద్దు కొండలు పర్యాటకులకు స్వర్గధామమే. చూపు తిప్పుకోలేనంతగా ఇక్కడి అందాలు పర్యాటకులన కట్టిపడేస్తాయి. అక్కడి నుంచి ముందుకు వెళితే కొండల మధ్య పాల నురగా జారుతున్నట్లుగా వేళంగి మల్లికార్జున లొద్దు జలపాతం కనువిందు చేస్తుంది. మహాశివరాత్రి నాడు పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు, భక్తులతో ఈ గిరిజన ప్రాంతం పరవశించిపోతోంది.ఇలా వెళ్దాం రండి..చెన్నై- కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారికి 20 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య గిరిజన గ్రామం సిద్ధివారిపాలెం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి 28 కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం ృ విజయవాడ మధ్య హైవేపై కత్తిపూడి జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగితే శంఖవరం మండలం. 3 కిలోమీటర్లు వెళితే నెల్లిపూడి, అక్కడి నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే శంఖవరం వస్తాయి. శంఖవరం నుంచి గొంది కొత్తపల్లి, గౌరంపేట మీదుగా 9 కిలోమీటర్ల దూరంలో అమ్మాయిగొప్పు ఘాటీ వస్తుంది. 200 మీటర్ల ఎత్తులో ఉండే అమ్మాయిగొప్పు కొండను చూస్తే పర్యాటకులు ఆ కొండ మీద పడిపోతుందేమోననే అనుభూతి చెందుతారు. దీనికి సమీపంలోనే నిమ్మలగాడి కొండ. అక్కడి నుంచి కుడివైపు వెళితే సిద్ధివారిపాలెం అయ్యప్పస్వామి ఆలయం దర్శనమిస్తుంది. నిమ్మలగాడి కొండ నుంచి సిద్ధివారిపాలెం వరకూ 2 కిలోమీటర్లు పుంత రోడ్డు. కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లొచ్చు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళితే పెదమల్లాపురం వస్తుంది. ఇక్కడికి 2.2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య వేళంగి మల్లికార్జున ధార జలపాతం కనిపిస్తుంది.అభివృద్ధి చేయాలిపెదమల్లాపురానికి నిత్యం వందల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు సిద్ధివారిపాలెంలోని ఆంధ్రా శబరిమలై దేవస్థానంతో పాటు పరిసర ప్రాతాల్లోని జలపాతం వంటి ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. అప్పుడు పర్యాటకులు మరింతగా పెరుగుతారు. - పాము రాములమ్మ, సిద్ధివారిపాలెం, శంఖవరం మండలంరోడ్లు విస్తరించాలినిత్య వందలాదిగా వస్తున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి రోడ్లు వెడల్పు చేయాలి. ఈ ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదించే సుందర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎత్తయిన కొండలు, చూడచక్కని జలపాతం, పచ్చని చెట్లు, చూసేకొద్దీ చూడాలనిపించే అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టి పెడితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. -చొప్పా శ్రీను, జి.కొత్తపల్లి -
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ : డెస్టినేషన్ టూరిజం
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగానే కాకుండా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడానికి వినూత్నంగా హెలీ–టూరిజం, సీ టూరిజం అభివృద్ధి చేశామని కేరళ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సజీవ్ కే.ఆర్ తెలిపారు. కేరళ ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని తాజ్ డెక్కన్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సజీవ్ కేరళ పర్యాటక విశేషాలను వెల్లడిస్తూ.. ఇప్పటికే మంచి ఆదరణ ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు బేకల్, వయనాడ్, కోజికోడ్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలను పరిచయం చేయడం పై దృష్టి సారించామని అన్నారు. నూతన ప్రాజెక్టులతో పాటు బీచ్, హిల్ స్టేషన్స్, హౌస్బోట్లు, బ్యాక్‌వాటర్ విభాగం వంటి అంశాలు సందర్శకులకు హాట్స్పాట్లుగా మారాయన్నారు. కేరళలో పర్యాటకుల సంఖ్య 2022లో పెరిగిందని, 2023 నుంచి ఈ ఆదరణ రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో 1,08,57,181 దేశీయ పర్యాటకులు రావడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళ కళాకారులు మోహినియాట్టం, కథక్, కత్తిసాము వంటి సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ వేదికగా బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్, ఢిల్లీ, జైపూర్, చెన్నై, కోల్‌కతా తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటక రంగ సంస్థలు, ప్రముఖులు బీ టు బీ సమావేశాల్లో పాల్గొన్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కనకక్కున్ను ప్యాలెస్‌లో నిషాగంధి నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత నృత్యకారులు మోహినియాట్టం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, మణిపురి వంటి శాస్త్రీయ నృత్య రూపాలను ప్రదర్శిస్తారు. జనవరి 23–26 వరకూ కోజికోడ్ బీచ్‌లో ప్రసిద్ధ కేరళ సాహిత్య ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో 12కి పైగా దేశాల నుంచి 400 మంది ప్రముఖులు పాల్గోనున్నారు. అంతేకాకుండా సుమారుగా 200 సదస్సులు జరగనున్నాయి. వీటిలో విలాసం, విశ్రాంతిని, కేరళ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి అంశాలు ప్రధానంగా నిలువనున్నాయి. -
‘‘వావ్.. బ్యూటీఫుల్!’’.. థాయ్‌లాండ్‌లో అత్యంత అందమైన ప్రాంతాలివిగో (చిత్రాలు)
-
అందాలు ‘ఏరు’కొందామా..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకో టూరిజం.. ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో పాపికొండలు, అరకు వంటి ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలే మనకు గుర్తొస్తాయి. అందుకే ఆయా ప్రాంతాలకే ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతుంటారు. కానీ పర్యాటకులకు ప్రకృతి పర్యాటకానికి అసలైన నిర్వచనం ఇచ్చేందుకు.. అచ్చమైన తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త థీమ్‌తో ముందుకొచి్చంది. ఎకో–టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా భద్రాచలం, పరిసర ప్రాంతాలను కలుపుతూ ఏరు–2025 ది రివర్ ఫెస్టివల్ పేరిట వేడుకలు నిర్వహించనుంది. ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారిని ఆకర్షించేలా ఈ నెల 9, 10, 11 తేదీల్లో రివర్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టింది. భద్రాచలంతోపాటు పర్ణశాల, బొజ్జుగుప్ప, కిన్నెరసాని, కనకగిరి (చండ్రుగొండ) గుట్టలకు పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తోంది.ఏమిటీ రివర్ ఫెస్టివల్ ప్రత్యేకత.. గోదావరి గలగలల చెంతన (కరకట్ట వెంబడి) ప్రత్యేక గుడారాలతో కూడిన క్యాంపింగ్ సైట్.. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా పూర్తిగా వెదురు, గడ్డితో గుడిసెలు, మంచెల ఏర్పాటు.. బోటింగ్ సదుపాయం.. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరించనున్నాయి. అలాగే కొండలు, గుట్టల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. మరింతగా పల్లె వాతావరణం కోరుకొనే వారి కోసం భద్రాచలానికి 17 కి.మీ. దూరాన ఉన్న బొజ్జుగుప్ప అనే గిరిజన గ్రామంలో మరో వేదిక సిద్ధం చేస్తున్నారు. అక్కడకు చేరుకొనే అతిథులకు గిరిజన సంప్రదాయ రీతిలో స్వాగ తం పలికేలా గ్రామస్తులకు శిక్షణ సైతం ఇచ్చారు. అలాగే తాటి మొద్దులతో సిద్ధం చేసిన డయా స్పై కొమ్ము, కోయ నృత్యాలతో పర్యాటకులను వారు అలరించనున్నారు. ఈ వేదికకు సమీపాన తామర పూలతో నిండిన చెరువులో బోటింగ్, ఫిషింగ్‌కు ఏర్పాట్లు చేశారు.ఆకులు, దుంపలతో వంటకాలు..ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో వంటకాలు.. గిరిజన తెగలకు చెందిన ఆచార వ్యవహారాలు, పనిముట్లు, అలంకరణ గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఐటీడీఏ క్యాంపస్‌లోని గిరిజన మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్థానిక గిరిజనులు సేకరించిన తేనె, కరక్కాయ, ఇప్పపూలు తదితర అటవీ ఉత్పత్తులు అమ్మనున్నారు. అడవుల్లో దొరికే, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో గిరిజనులు చేసిన వంటలను ప్రత్యేకంగా పర్యాటకులకు వడ్డించనున్నారు. -
గోవాలో ఏం జరుగుతోంది?.. సీఎం రియాక్షన్ ఇదే!
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్కడి పర్యాటకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గోవాలో పరిస్థితులు మునుపటిలా లేవని.. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందన్న గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుగా వ్యవహరించొద్దంటూ ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ గోవాలో ఏం జరుగుతోందంటే.. ఈసారి ఇయర్ ఎండ్‌లో గోవాకు సందర్శకుల తాకిడే లేకుండా పోయిందని.. హోటల్స్, బీచ్‌లు బోసిపోయాయని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుళ్ల చేస్తున్న మాఫియా ముఠాలే అందుకు కారణమని విశ్లేషించాయి కూడా. అయితే..ఈ కథనాలకు మూలం.. కొందరు సోషల్ మీడియా(Social Media) ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన పనేనని తేలింది. అయినప్పటికీ అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలతో సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి ఇయర్ ఎండ్ వేడుకులకు గోవాకు పెద్దగా పర్యాటకులెవరూ రాలేదని.. వేరే ప్రాంతాలకు వెళ్లారని పోస్టులు చేశారు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పు. గోవా గురించి తప్పుడు సందేశాలు పంపారు వాళ్లు. వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి తీర ప్రాంతాన్ని ఆస్వాదించండి’’ అని సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు ఇచ్చారు.అదే సమయంలో గోవా(Goa)లో జరిగే పలు మాఫియాల మీద ఆయన స్పందించారు. గోవాకు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రాంతాలను ఆస్వాదించాలి. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలి అనుకోవాలి. అంతేగానీ.. చేదు అనుభవాలతో తిరిగి వెళ్లకూడదు. పర్యాటకులతో సవ్యంగా మసులుకోకుంటే.. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. అలాగే.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించేలా చూస్తామని ప్రకటించారాయన. ‘‘యావత్ దేశం నలుమూలల నుంచి గోవాకు ఇదే మా ఆహ్వానం. నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు గోవాకు ఎంతో కీలకం. రకరకాల పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే గోవాలో అన్ని హోటల్స్ నిండుగా ఉన్నాయి. విమానాలు కూడా నిండుగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో.. కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని పేర్కొన్నారాయన.నిజంగానే పడిపోయిందా?చిన్నరాష్ట్రమైన గోవా జనాభా సుమారు 16 లక్షలు. పర్యాటకుల సంఖ్య మాత్రం ఏయేడు కాయేడూ పెరుగుతూనే వస్తోంది. అయితే తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి.2015లో గోవాను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఐదు లక్షల 20 వేలు2023లో సుమారు 8 లక్షల 50 వేల మంది పర్యటించారు2019లో ఏకంగా 9 లక్షల 40 వేల మంది పర్యటించి రికార్డు క్రియేట్ చేశారు2024 నవంబర్‌నాటికి ఆ సంఖ్య సుమారు 4 లక్షలుగా ఉంది.*ఓహెర్లాడో గణాంకాల ప్రకారంఒక్కడితో మొదలై.. గోవా టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సోషల్‌మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. గోవా మునుపటి ఫ్రెండ్లీ స్పాట్‌లా లేదని.. పర్యాటకానికి ప్రతికూలంగా మారిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పర్యాటక ప్రాంతాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే టైంలో.. గోవాలో మోసాలు ఎక్కువగా జరుగుతాయనే భావన పర్యాటకుల్లో విపరీతంగా పేరుకుపోయిందని చెబుతూ రామానుజ్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తప్పుడు గణాంకాలతో అతను పోస్ట్ చేశాడంటూ గోవా పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఈసారి ఏకంగా సీఎం ప్రమోద్ సావంత్‌కే ఓ లేఖ రాశారు. విదేశీ పర్యాటకులు గోవాను ఏమాత్రం సురక్షిత ప్రాంతంలా భావించడం లేదని, ట్యాక్సీ సర్వీసుల మొదలు.. లిక్కర్, హోటల్, ఫుడ్, చివరికి చిరువ్యాపారులు సైతం తమను దోపిడీ చేస్తున్నారనుకుంటున్నారని, ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో గోవా పర్యాటకానికి గడ్డు పరిస్థితులు తప్పవని సీఎంకు సూచించాడాతను. అటుపై.. అతనికి మద్ధతుగా ఖాళీ బీచ్‌లు, హోటల్స్, సెలబ్రేషన్స్ ఫొటోలు పెడుతూ వస్తున్నారు. చదవండి👉🏾: రెస్టారెంట్ సిబ్బందితో గొడవ.. గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య -
సిద్దిపేట ‘శిల్ప’విలాపం!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా సిద్దిపేట ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి పర్యాటకంగా మరిన్ని సొబగులు అద్దేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించింది. కోమటి చెరువు దగ్గర శిల్పారామం, నెక్లెస్‌రోడ్ పనుల పూర్తి, రంగనాయకసాగర్ దగ్గర పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సంవత్సరం నుంచి ముందుకు సాగడం లేదు. పిల్లర్ల దశలోనే కాటేజీలుచిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో 3 టీంఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తయారు చేసేందుకు రూ.100 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. నీటిలో తేలియాడే కాటేజీలు, వాటర్ షోలు, పెద్ద బంకెట్ హాల్ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.కాటేజీల నిర్మాణం పనులు పిల్లర్ల దశలోనే నిలిచి పోయాయి. ఇప్పటికే రంగనాయకసాగర్‌ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు, ప్రజలు ఎదురు చుస్తున్నారు. 10 ఎకరాల్లో శిల్పారామం కోమటి చెరువు సమీపంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.23 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా అలాగే చేనేత హస్తకళా ప్రదర్శన, పలు కుల వృత్తులకు చేయూతనందించేందుకు పనులను ఏప్రిల్, 2023లో ప్రారంభించారు. శిల్పారామం పనులు డిసెంబర్ 2023 వరకు వేగంగా సాగాయి. తర్వాత అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్రాఫ్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ ఇలా అన్ని రకాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. నిలిచిన ఆర్టిఫిషియల్ బీచ్ సిద్దిపేట శిల్పారామంలో ఆర్టిఫిషియల్ బీచ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. బీచ్ నిర్మాణం పూర్తయితే సముద్రం బీచ్ దగ్గర పొందే అనుభూతి సిద్దిపేటలో లభిస్తుందని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆ పనులు కూడా నిలిచిపోయాయి. అలాగే కోమటి చెరువు నెక్లెస్‌రోడ్ పూర్తి నిర్మాణం కోసం రూ.15 కోట్లను కేటాయించారు. ఆ పనులూ ఆగిపోయాయి. సిద్దిపేటలో మహతి ఆడిటోరియం కోసం రూ.50 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ని«ధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టర్లు తప్పుకున్నారు పలు పనులకు సంబంధించిన పాత కాంట్రాక్టర్లు తప్పుకున్నారు. పనులు జరుగుతుంటే రన్నింగ్ బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. అలాగే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సమయం కూడా ముగిసింది. – నటరాజ్, డీఈ, పర్యాటక శాఖ -
Year Ender 2024: ఈ దేశాల్లో పర్యాటకుల తాకిడి.. హనీమూన్ స్పాట్లో జంటల సందడి
కొద్దిరోజుల్లో 2024కు వీడ్కోలు చెప్పబోతున్నాం. ఈ నేపధ్యంలో ముగుస్తున్న ఏడాదిలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నెమరువేసుకుంటుంటాం. ఈ కోవలోకి టూరిజం రంగం కూడా వస్తుంది. 2024లో ఏ దేశంలో టూరిస్టుల తాకిడి అధికంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సర్వేలోని వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.ఫ్రాన్స్2024లో 89.4 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ఫ్రాన్స్ కళకళలాడింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ను సందర్శించడానికి టూరిస్టులు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో పారిస్ ఈ ఏడాది పర్యాటకులతో నిండిపోయింది. పలు జంటలు 2024లో హనీమూన్ కోసం పారిస్‌కు వచ్చారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చూడాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రాంతం ఎప్పుడూ టూరిస్టులతో రద్దీగా ఉంటుంది.స్పెయిన్నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో స్పెయిన్ దేశం ఉంది. పర్యాటక పరంగా స్పెయిన్ దేశం టూరిస్టులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా పేరొందింది. క్యాథలిక్ మతానికి చెందిన వారు అధికంగా ఇక్కడ నివసిస్తున్నారు. గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది 85 మిలియన్లకు పైగా పర్యాటకులు స్పెయిన్‌కు తరలివస్తుంటారు. ఫ్రాన్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇష్టపడదే దేశం స్పెయిన్. 2024లో ఇప్పటివరకూ 83.7 మిలియన్ల మంది పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు.అమెరికా2024 చివరినాటికి అమెరికాకు 79.3 మిలియన్ల మంది పర్యాటకులు వస్తారనే అంచనాలున్నాయి. పర్యాటకులు సందర్శిస్తున్న ప్రదేశాల జాబితాలో అమెరికా ముందంజలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. న్యూయార్క్‌లోని ఎత్తయిన భవనాలు, లాస్ ఏంజిల్స్‌లోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.చైనాఅన్ని రంగాలలో ముందంజలో ఉన్న చైనా టూరిజంలోనూ దూసుకుపోతోంది. ఈ రంగంలో చైనా తనదైన ముద్ర వేసింది. 2024 చివరినాటికల్లా 65.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శిస్తారనే అంచనాలున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చైనాలోని టెర్రకోటా ఆర్మీ, లింటాంగ్ డిస్ట్రిక్ట్, జియాన్, షాంగ్సీ, బీజింగ్ పురాతన అబ్జర్వేటరీ, డాంగ్చెంగ్, టెంపుల్ ఆఫ్ హెవెన్, డాంగ్చెంగ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంటాయి.ఇటలీయూరప్లోని ఇటలీ అత్యంత విలాసంతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటలీ 2024లో 64.5 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించనుందనే అంచనాలున్నాయి. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ వంటి నగరాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ దేశంలోని అమాల్ఫీ తీరాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
మంచు కొండల్లో విహారానికి సై
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది. లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొత్త అనుభూతినిచ్చింది.. కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది. – విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు. -
భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం..ప్రకృతి అందాలకు నెలవు..!
భారతదేశంలో రైల్వేస్టేషన్ లేని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా..?. అరచేతిలో ప్రపంచాన్ని చూసేలా టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతున్న రోజుల్లో ఇంకా అలాంటి రాష్ట్రం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోకండి. అయితే ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి తప్పక ఉంటుంది కదా..! అంటారేమో..అయినప్పటికీ రైల్వే నిర్మాణ సాధ్యం కాలేదు. ఈ ఆధునాత కాలంలో టెక్నాలజీనే శాసించే స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే నిర్మాణం సాధ్యం కాలేదని సందేహాలు మెదులుతున్నాయి కదూ..! ఇంకెందుకు ఆలస్యం అది ఏ రాష్ట్రం, దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!.భారతదేశం అత్యంత ప్రశంసనీయమైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం. అలాంటి దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రం కూడా ఉందంటే.. నమ్మశక్యంగా లేదు కదా!. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో ఉంది. సినిమా వాళ్ల ఫేమస్ లోకేషన్ పాయింట్ కూడా ఇదే. మంచు కొండల్లో పాట అనగానే మనవాళ్లు చకచక వచ్చి వాలిపోయే రాష్టం. అదేనండి సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రకృతి రమ్యతకు ఎలాంటి వారైనా పరవశించిపోవాల్సిందే. అంతలా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదంటే..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు ఉన్నాయి. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మిచడం సాధ్యం కాలేదు.అదీగాక ఇక్కడ తరుచుగా కొండచరియలు విరిగిపడతాయి. అక్కడ ఆ ప్రమాదం అత్యంత సర్వసాధారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంతవరకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారనుంది. ఇటీవలే మోదీ అక్కడ రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్పో స్టేషన్‌ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్. ఇక్కడ సరస్సుల ప్రసిద్ధ ఆకర్షణ. తప్పక సందర్శించాల్సిన టూరిజం స్పాట్లు కూడా ఈ సరస్సులే. రత్నాల వలే భూమిలో పొదిగి ఉన్న ఆ సరస్సుల సహజ సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ రాష్ట్రంలో సందర్శించాల్సిన సరస్సులివే..క్రోస్ లేక్, ఉత్తర సిక్కింక్రోస్ లేక్, స్థానికంగా కల్పోఖ్రి సరస్సు అని పిలుస్తారు. ఇది ఉత్తర సిక్కింలో దాచిన రత్నం. 4,260 మీటర్ల ఎత్తులో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చోళము సరస్సు, ఉత్తర సిక్కించోళము సరస్సు, ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది 5,330 మీటర్ల ఎత్తులో ఉత్తర సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దులో ఉంది.కథోక్ సరస్సు, పశ్చిమ సిక్కింపశ్చిమ సిక్కింలోని ప్రసిద్ధ పట్టణం యుక్సోమ్ సమీపంలో ఉన్న కథోక్ సరస్సు ప్రశాంతమైన ప్రదేశం. ఈ అందమైన సరస్సు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. ఇది సిక్కిం మొదటి చోగ్యాల్ (రాజు) చారిత్రక పట్టాభిషేకంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.(చదవండి: శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని) -
తిరుమలలో ‘టూరిజం’ దర్శనాలు రద్దు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సరోగసీ టూరిజం నేరం
సరోగసీపై చట్టాన్ని ఇటలీ విస్తృతం చేసింది. సరోగసీ టూరిజాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించిన బిల్లును సెనేట్ 58–84 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం 2004 నుంచే ఇటలీలో అమలులో ఉన్న సరోగసీ నిషేధాన్ని యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలకు వెళ్లేవారికి వర్తింపజేస్తుంది. దీనిని ఉల్లంఘించిన వారికి ఒక మిలియన్ డాలర్ల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే సరోగసీ ద్వారా జని్మంచిన పిల్లలను ఇప్పటికే దేశంలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులను ఈ చట్టం ప్రభావితం చేయబోదు. అయితే తమ పిల్లలు పాఠశాలలో చేరి్పంచే సమయంలో సమస్యల పాలవుతామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సెనేట్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వాగతించారు. కాగా, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్ దగ్గర కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎల్జీబీటీక్యూ జంటలను తల్లిదండ్రులుగా మారకుండా చేసే ఈ చట్టాలు మధ్యయుగాల నాటివని విమర్శించారు. మెలోనీ 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యంత సాంప్రదాయిక సామాజిక ఎజెండాను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. స్వలింగ సంఘాలను చట్టబద్ధం చేసిన చివరి యురోపియన్ దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటాలియన్ కేథలిక్ చర్చి ఒత్తిడితో స్వలింగ వివాహాలకు మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు. పోప్ ఫ్రాన్సిస్ సరోగసీపై ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిషేధానికి పిలుపునిచ్చారు. పిల్లలు దేవుడు ఇచ్చే బహుమతి అని, వాణిజ్య ఒప్పందం కాదని నొక్కి చెప్పారు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులను చర్చికి స్వాగతిస్తూ ఫ్రాన్సిస్ చర్చి విధానాలను మార్చారు. అబార్షన్, సరోగసీలను మాత్రం బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం రాజకీయంగా మెలోనికి సవాలుగా మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊరి దారిలో టూరిజం
చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలనుకున్నా, ఇంజినీరింగ్ అద్భుతాలను చూడాలనుకున్నా ఈఫిల్ టవర్కో, లండన్ బ్రిడ్జ్కో ప్లాన్ చేసుకోవచ్చు! లేదంటే బుర్జ్ ఖలీఫానో, సిడ్నీ ఒపేరా హౌస్నో సందర్శించొచ్చు! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనీ చుట్టి రావచ్చు, డిస్నీల్యాండ్‌తో అబ్బురపడొచ్చు!దూరభారం అనుకునేవాళ్లు తాజ్‌మహల్, ఎర్రకోటతో సరిపెట్టుకోచ్చు! కాని, చల్లటి గాలిలో, పచ్చటి నేలమీద సేద తీరాలనుకుంటే, ట్రెడిషనల్ లైఫ్ స్టయిల్ని పరిచయం చేసుకోవాలనుకుంటే, పలు యాసలను వినాలనుకుంటే, స్థానిక రుచులను ఆస్వాదించాలనుకుంటే మాత్రం పల్లెలే ద బెస్ట్ హాలీడే స్పాట్స్! ఇప్పుడు చిన్నా పెద్దా అందరి వీకెండ్స్‌ను, సెలవులను అవే ఆక్యుపై చేస్తున్నాయి! వీళ్లకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానికులూ ఉత్సాహపడుతున్నారు. పరాయి ఊళ్లో సొంతింటి భావనను కలిగిస్తున్నారు!ఆ జర్నీనే రూరల్ టూరిజం. ఆ హాస్పిటాలిటీయే హోమ్ స్టేస్! ఆ ట్రెండ్ మీదే ఈ కథనం!సెలవుల్లో ఇదివరకైతే అమ్మమ్మ వాళ్లూరో, నానమ్మ వాళ్లూరో వెళ్లేవాళ్లు. చెట్లు– పుట్టలు, చేనులు– చెలకలు, చెరువులు– బావులు, కొండలు– గుట్టలు తిరగడం వల్ల ఆ ఊరి భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వనరుల మీద తెలియకుండానే ఒక అవగాహన ఏర్పడేది. అలాగే అక్కడి సంస్కృతీ సంప్రదాయాలూ తెలిసేవి. అక్కడి పిల్లలతో ఆటలు, ఈతలు, సరదాలు, కబుర్లు, కాలక్షేపాలతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ప్రత్యేకతలు, వైవి«ధ్యాలు అర్థమయ్యేవి. తెలివిడి వచ్చేది. నగరీకరణ పెరగడం, చదువుల ఒత్తిడి, మొదటి తరానికి, మూడో తరానికి కనెక్టివిటీ తగ్గడం వల్ల గ్రామీణ భారతం కథల్లో, సినిమాల్లో వినిపించే, కనిపించే ఫిక్షన్‌గా మారిపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు రోబోటిక్ లైఫ్ స్టయిలే లా ఆఫ్ లైఫ్‌గా మారిపోయింది. ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్లా వారంలో అయిదు రోజులు ఆఫీస్ పనితో కుస్తీ, వీకెండ్ షాపింగ్ మాల్స్‌లో వ్యాహ్యాళి. ఏడాదికి ఒకసారో, రెండుసార్లో లాంగ్ డెస్టినేషన్ టూర్స్ తప్ప ఆ షరా మామూలులో మార్పు లేదు. కోవిడ్ పుణ్యమా అని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలతో ఇంట్రడక్షన్ లేని, ట్రాఫిక్, టార్గెట్స్, ప్రాజెక్ట్స్‌తోనే డీప్ రిలేషన్షిప్లో పడిపోయిన నగర జనాభాలో కోవిడ్ ఒక రియలైజేషన్‌ను తెచ్చింది. పని, పొల్యూషనే కాదు ప్రకృతి, పల్లెలతో ఇంటరాక్షన్ చాలా అవసరమని, ఆ సమయం ఆసన్నమైందని! అందుకే కోవిడ్ ఇంట్రడ్యూస్ చేసిన (అంతకుముందు అరుదుగా ఉండే) వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. లాప్టాప్, బ్యాక్‌ప్యాక్‌తో పల్లెలకు చేరుకున్నారు. పచ్చని ఆవరణం, స్వచ్ఛమైన గాలితో సేదతీరారు. పని ఒత్తిడిని తగ్గించుకున్నారు. కొత్త ఉత్సాహాన్ని నింపు కున్నారు. ‘బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి? పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి? పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది? కూరగాయలను ఏ మార్కెట్లో తయారు చేస్తారు?’ లాంటి ప్రశ్నలు వేసే పిల్లలకూ పల్లెలతో ప్రత్యేక పరిచయం అవసరమని గుర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టాక పల్లె సందర్శనను జీవనశైలిలో భాగం చేసుకున్నారు. వీకెండ్స్ నుంచి వెకేషన్స్ దాకా ప్రతి సందర్భాన్నీ రూరల్ టూర్‌కే రిజర్వ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సకుటుంబ సమేతంగా! క్యాంప్‌లు వేసుకునేవాళ్లు, ట్రెకింగ్ని ఇష్టపడేవాళ్లు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలనుకునే వాళ్లు, సాగు నేర్చుకోవాలనుకునే వాళ్లు, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ను కోరుకునేవాళ్లు, నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్నవాళ్లు, గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు.. ఎట్సెట్రా ఎట్సెట్రా అభిరుచికి తగినట్టుగా గ్రామీణ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రావెల్ గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మొత్తంగా రూరల్ టూరిజాన్ని ఓ ఒరవడిగా మార్చారు. వాళ్లందరికీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు, వనాలు, నదీ, సముద్ర తీరప్రాంతాలు ఆతిథ్యమిస్తున్నాయి.ముందుగా ఉత్తరాంధ్రకు వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి, కొబ్బరి తోటలకు ఆలవాలమైన ఉద్దానం, సైబీరియా వలస పక్షుల విడిది కేంద్రాలు తేలుకుంచి, తేలినీలాపురాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా స్టడీ టూర్ పేరిట ఈ ప్రాంతాల్ని సందర్శిస్తుంటారు. తేలినీలాపురంలో సైబీరియ¯Œ పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. వారాంతాల్లో ఈ కేంద్రాలు టూరిస్ట్‌లతో బిజీగా ఉంటాయి. మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలోని పాలకొండ ఏజెన్సీలో జలపాతాలకు, హిల్ వ్యూ పాయింట్లకు కొదువ లేదు. ఇది అరుదైన జంతుజాతులకూ నెలవు. దీనికి పరిశోధకుల తాకిడీ అధికమే!ఆంధ్రా ఊటీ అందాల అరకు..పచ్చటి లోయలు, అబ్బురపరచే గుహలు, అలరించే థింసా నృత్యాలు, వెదురు బొంగులో చికె¯Œ ఘుమఘుమలు, మైమరపించే కాఫీ కమ్మదనం, మేఘాలను ముద్దాడే పర్వతాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుతమైన ప్రదేశం. కోవిడ్‌లో కూడా బాగా కట్టడి చేస్తే తప్ప సందర్శకుల తాకిడి ఆగని ప్రాంతం. అరకు వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానిక గిరిజనులు రిసార్ట్స్ మాదిరి అతిథి గృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచు ముసుగేసుకునే లంబసింగి, పాడేరు కూడా సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడికి అక్టోబర్ చివరివారంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోస్తాకు వస్తే.. ఆంధ్రా కేరళగా పిలుచుకునే కోనసీమ రూరల్ టూరిజానికి అసలు సిసలైన కేంద్రం. ప్రకృతి అందాలు, పసందైన రుచులకు ఈ ప్రాంతాన్ని మించింది లేదు. సువిశాల గోదావరి, అది సముద్రంలో కలిసే అంతర్వేది, ఓడల రేవు, మడ అడవుల కోరంగి, ఫ్రెంచ్ కల్చర్‌తో ఆసక్తి రేకెత్తించే యానాం, పట్టునేత ఉప్పాడ, పూల వనాల కడియం, ప్రకృతి సోయగాల పాపికొండలు, ధవళేశ్వరం, మన్యప్రాంతాల రంపచోడవరం, మోతుగూడెం, మారేడుమిల్లి, సూర్యోదయాల గుడిసె, గలగలపాడే సెలయేరుల పింజరకొండ.. ఇలా అన్నింటినీ చుట్టిరావాల్సిందే.. పనసపొట్టు కూర నుంచి పులసల పులుసుదాకా, పూతరేకుల నుంచి కాకినాడ కాజా దాకా అన్నింటినీ రుచి చూడాల్సిందే! ఇంకా ఆంధ్రలో కృష్ణా పరీవాహక ప్రాంతాలు, హార్సిలీ హిల్స్, బెలూం కేవ్స్, గండికోట, కొండవీడు, ఉదయగిరి, ఒరవకల్లు, చంద్రగిరి, పెనుకొండ లాంటివాటినీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. దక్షిణ భారతంలో కేరళ, ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతంలో ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో మేఘాలయాలో రూరల్ టూరిజం ఎక్కువగా ఉంది. మనదేశంలో రూరల్ టూరిజం ద్వారా రూ. 4,300 కోట్ల అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇది గ్రామీణ భారతానికి, పట్టణ భారతానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందని, అందుకే దీన్నో ఇండస్ట్రీగా, భారీ ఆదాయ వనరుగా పేర్కొనవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు చేరితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం, రామప్ప, పాండవులగుట్ట, వాజేడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తే రాచకొండ, భువనగిరి ఫోర్ట్, కొలనుపాక, వైజాగ్ కాలనీ, మెదక్‌లో నర్సాపూర్, ఏడుపాయల ప్లాన్ చేసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నల్లమల ఉండనే ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రోజంతా గడపాలనుకునేవారికి ‘టైగర్ స్టే ప్యాకేజీ’ అందుబాటులోకి వచ్చింది. ఇదే దారిలో వటవర్లపల్లి సమీపంలో మల్లెలతీర్థం, ఆక్టోపస్ వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన్ననూర్, ఈగలపెంట ఊళ్లల్లో తిరిగి అక్కడివారి జీవన శైలిని పరిశీలించవచ్చు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లోని సుందర ప్రదేశాలనూ సందర్శించొచ్చు. వారాంతాల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలూ రద్దీగా ఉంటున్నాయి. ఉత్తర తెలంగాణకు చేరితే.. వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా తెలంగాణ– ఆంధ్ర– మరాఠీ సంస్కృతి, గోదావరి ప్రవాహం, పచ్చని చేలతో భలే ఆకట్టుకుంటుంది. నిజామాబాద్‌లో నిజాంసాగర్, కందకుర్తి, శ్రీరాంసాగర్, పసుపు పంటల అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాలను చూడాల్సిందే.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకం ..ఇది వైవిధ్యాలకు నెలవు. పచ్చని ప్రకృతి, ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, మహారాష్ట్ర ప్రభావం.. ఇవన్నీ కలిసి దీనికి స్పెషల్ అపియరెన్స్‌ను ఇస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి, అబ్జర్వ్చేయడానికి జనాలు ఇక్కడికి వస్తుంటారు. చలికాలంలో జీరో డిగ్రీకి వెళ్లే తిర్యాణిలాంటి ప్రాంతాలను చూసేందుకు, ఆ మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు భ్రమణకాంక్ష కలవారు ఇక్కడికి క్యూ కడుతుంటారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, కుంటాల, పొచ్చెర, సప్తగుండాలతో పాటు 30కి పైగా చిన్నా పెద్దా జలపాతాలు మరచిపోలేని అనుభూతులను పంచుతున్నాయి. వీటితోపాటు గోదావరి, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వెన్‌గంగా తీరాలు, సమీప గ్రామాలు, జోడే ఘాట్, ఇం్రదవెల్లి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గిరిజన కోటలు, పూర్వయుగం నాటి ఆనవాళ్లున్న ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి దేశవిదేశాల అధ్యయనకారులూ వస్తుంటారు. ఇలా రూరల్ టూరిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో డెస్టినేషన్స్ ఉన్నాయి. గ్రామీణ పర్యాటకం ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్‌ను నేర్పుతుంది. ప్రకృతి వనరుల మీద అవగాహన కల్పిస్తుంది. వాటి మీద గౌరవాన్ని పెంచుతుంది. శ్రమ విలువను చూపిస్తుంది. నిరాడంబర జీవన శైలి అవసరాన్ని తెలియజేస్తుంది. పరిణతినిస్తుంది. రూరల్ టూర్‌ని ఇంకా మొదలుపెట్టని వాళ్లు ఐటినరీ ప్రిపేర్ చేసేసుకోండి ఇక! ఇన్పుట్స్: కడారి రాజా, కిషోర్ కుమార్ పెరుమాండ్ల, పాదం వెంకటేశ్, తాండ్ర కృష్ణగోవింద్, ఆకుల రాజుపెద్దగా ఖర్చులేనిది..రూరల్ టూరిజాన్ని ఇష్టపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా! ఇలాంటి పర్యటనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ప్రకృతికి నష్టం చేయకుండా గ్రామీణ, నేచర్ బేస్డ్గా ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రాల ఆర్థిక వృద్ధికీ మేలు కలుగుతుంది. – శ్యామ్‌సుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) తెలంగాణ చాప్టర్పల్లెల గురించి తెలియాలినాకు రకరకాల భాషలు, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్కిటెక్చర్‌ను తెలుసుకోవడం, పరిశీలించడం ఇష్టం. అందుకే చాలా తరచుగా దేశీ, విదేశీ యానాలు చేస్తుంటా. వీకెండ్స్‌లో కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటా. కరోనా తర్వాత రూరల్ టూర్స్ పెరిగాయి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రిటైర్డ్ ఎంప్లాయ్సే ఎక్కువగా రూరల్ టూర్స్‌ని ఇష్టపడేవాళ్లు! ఇప్పుడు ఫ్యామిలీస్, యూత్, స్కూల్ పిల్లలూ వస్తున్నారు. శుభపరిణామం. మనదేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అర్థంకావాలంటే మన గ్రామాల గురించి తెలియాలి. కాబట్టి పల్లెటూళ్లకు వెళ్లాలి. – గిరిజ పైడిమర్రి, విహంగ (వైహెచ్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ -
ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు పెంచితే.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) పేర్కొన్నారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో కీలకమని నితిన్ గడ్కరీ సూచించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని మంత్రి హాస్పిటాలిటీ రంగానికి తమ బలమైన మద్దతును వ్యక్తం ప్రకటించారు. ఇది విస్తారమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నవాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. ఇది పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాత్రమే.. ఆధునిక నగరాలు, ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సుముఖత చూపిస్తున్నారని ఆయన అన్నారు. -
దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం
తక్కువ ఖర్చు.. అత్యాధునిక సౌకర్యాలు.., చికిత్స పద్ధతులు, సుశిక్షితులైన వైద్యులు, నాణ్యమైన వైద్యానికి భారత దేశం కేరాఫ్ అడ్రస్. అత్యంత క్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే దేశంలో వైద్య పర్యాటకం (మెడికల్ టూరిజం) ఏటేటా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత దేశానికి వచ్చి వైద్యం పొంది వెళ్తున్నారు. గత పదేళ్లలో ఏటా వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య దాదాపు ఐదింతలు పెరిగింది. ఇదిలాగే కొనసాగి, 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు భారత దేశ మెడికల్ టూరిజం పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి. – సాక్షి, అమరావతిదేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. వివిధ జబ్బులతో బాధపడే విదేశీయులు చికిత్స కోసం భారత్‌కు రావడానికి సరళమైన నిబంధనలతో దీనిని రూపొందించింది. ఈ వీసాతో భారత వైద్య పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశ ఆరోగ్య సంరక్షణ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గతంలో మోదీ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. గతేడాది 8.7 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఈ ఏడాది (2024)లో 10.4 బిలియన్ డాలర్ల మేర మెడికల్ టూరిజంలో పెరుగుదల ఉంటుందని ఫార్చ్యూన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 17.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి.వివిధ రకాల వ్యాధులకు చికిత్స కోసం 2014లో 1.39 లక్షల మంది విదేశీయులు భారత్‌కు రాగా, ఆ సంఖ్య గత ఏడాది (2023) 6.35 లక్షలకు పెరిగింది. అదే విధంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం 2017–19 మధ్య రెండేళ్లలో మెడికల్ టూరిజంలో వృద్ధి 34.5 శాతంగా నమోదైంది. కరోనా కారణంగా 2020లో కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ మెడికల్ టూరిజం గణనీయంగా పుంజుకుంది. గుండె సంబంధిత సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, క్యాన్సర్ వైద్యం, ఇతర చికిత్సలకు విదేశీయులు తెలంగాణాలోని హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, విజయవాడల్లోని ఆస్పత్రులకు కూడా వస్తున్నారు. -
దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!
మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్ టూర్. వడయార్ రాజకుటుంబీకులు మైసూర్ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్‌ను ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. ప్యాలెస్ లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. దర్బార్ హాల్లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్ కోసం కూడా కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్ సిల్క్ చీరలను కొనడంతో ట్రిప్ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేయాలి.ఉదయాన్నే చూడాలి..!మైసూర్ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. ప్యాలెస్ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙ ప్యాలెస్ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్ వేయడం మంచిది పెద్దవాళ్లు ప్యాలెస్ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్ చైర్లను వాడుకోవచ్చు. గైడ్ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్ చేయవచ్చు ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. దానికి చార్జ్ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్ గురించిన వివరాలను వింటూ తిలకించాలి రాత్రి లైట్ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే అవకాశం ఉంటుంది. (చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి.. హోటళ్లు కిటకిట
సిమ్లా: ప్రస్తుతం దేశంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా నేపధ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వ్యాపారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది.పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుండి పర్యాటకులు హిమాచల్ చేరుకుంటారు. దీంతో ఇక్కడి హోటళ్లలోని గదులు 80 శాతం వరకూ నిండిపోయాయని తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ నరేన్ సహాయ్ మీడియాతో మాట్లాడుతూ పండుగగ సీజన్ ప్రారంభమైందని,అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లాంగ్ వీకెండ్ రాబోతోందని, ఈ సందర్భంగా పర్యాటకులు హిమాచల్‌కు అధిక సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం, బెంగాలీ పర్యాటకులు వస్తున్నారని, దీపావళి సమయంలో గుజరాతీ పర్యాటకులు సిమ్లాను సందర్శిస్తారన్నారు.నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని హోటల్ వ్యాపారి ప్రిన్స్ కుక్రేజా మీడియాకు తెలిపారు. వారాంతాల్లో గదుల బుకింగ్స్ కూడా జరుగుతున్నాయన్నారు. గత వారాంతంతో పోలిస్తే, ఈ వారాంతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శించేందుకు రానున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ నుండి పర్యాటకులు హిమాచల్‌కు తరలివస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
రండి.. తిని తరించండి
ప్రజల్లో విభిన్న ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటకం కొత్త రుచులను అన్వేషిస్తోంది. ఫలితంగా భారతదేశంలో పాకశాస్త్ర సంస్కృతిని ఆస్వాదించే పర్యాటకం (గ్యాస్ట్రోనమీ టూరిజం) ఊపందుకుంటోంది. విదేశీ పర్యాటకులు భారత పాకశాస్త్ర సంస్కృతి, కొత్త వంటకాల తయారీపై మక్కువతో మన దేశానికి క్యూ కడుతున్నారు. 2023లో విదేశీ పర్యాటకుల రాకపోకలు 15.6 శాతం పెరిగాయి. ఈ పర్యాటకులలో అత్యధికులు తమ ప్రయాణంలో భాగంగా పాకశాస్త్ర అనుభవాలను కోరుకుంటారు. దేశంలోని సుసంపన్నమైన అహారం, వంటల సంప్రదాయాలు, విభిన్న ప్రాంతీయ వంటకాలు, ప్రామాణికమైన ఆహార అనుభవాలపై విదేశీ పర్యాటకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. – సాక్షి, అమరావతిపాకశాస్త్ర పర్యాటకంలో టర్కీదే అగ్రస్థానంప్రపంచవ్యాప్తంగా గ్యాస్ట్రోనమీ పర్యాటకులను ఆకట్టుకోవడం, సరికొత్త అనుభూతులను అందించడంలో టర్కీ ముందంజలో ఉంది. గతేడాది రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైన అక్కడి పాకశాస్త పర్యాటక మార్కెట్ నుంచి 2025 నాటికి రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగా 2,200 కంటే ఎక్కువ స్థానిక ఆహార, పానీయాల వెరైటీలున్నాయి. ముఖ్యంగా గాజియాంటెప్, అదావా, హటే, ఇజ్మీర్ వంటి నగరాల్లో గ్యాస్ట్రోనమీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 41 రకాల విభిన్న ఆహార పదార్థాల తయారీ విధానంపై ప్రత్యేక కోర్సుల, శిక్షణను అందిస్తోంది. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 16 శిక్షణ కేంద్రాలున్నాయి.స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 360 కంటే ఎక్కువ గ్యాస్ట్రోనమీ పండుగలను చేపడుతూ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే గాజియాంటెప్ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తించింది. మసాలా వంటకాల నుంచి మొఘలాయ్ వరకు.. దక్షిణాదిలోని మసాలా కూరల నుంచి ఉత్తరాదిలోని మొఘలాయ్ వంటకాల వరకు భారతీయ హోటళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికితోడు వీధుల్లో అమ్మే ఆహారాలు (స్ట్రీట్ ఫుడ్) సైతం అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారాయి. ఈశాన్య భారతదేశం అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచులను అందిస్తోంది. ఇక గోవా కేవలం స్థానిక వంటకాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వంటకాలను కూడా ప్రవేశపెడుతోంది. వీధి వంటకాల్లో లక్నోలో లభించే నెహారీ కుల్చా, షీర్మల్, మలై మఖాన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో లభించే చోలే–కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్, పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఆహారోత్సవాలతో ఆకర్షణవివిధ నగరాల్లో అనేక సంస్థల భాగస్వామ్యంతో ఆహారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నార్త్–ఈస్ట్ స్లో ఫుడ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ సొసైటీ (నెస్పాస్) ఏటా నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని మావ్‌లాంగ్‌లో నిర్వహించే ‘సేక్రేడ్ గ్రోవ్’ (మతపరమైన తోట చెట్ల పండుగ) ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలోని స్థానికులు తయారుచేసి వడ్డించే వివిధ అటవీ, స్థానిక ఆహార వంటకాలను సంరక్షించేందుకు, ఆయా వంటకాలపై ప్రచారానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తున్నాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తూ గ్యాస్ట్రోనమీ టూరిజానికి ఊతమిస్తున్నాయి. -
పండుగ సీజన్లో పర్యాటకానికి ఉత్తమ ప్రదేశాలు: ఎయిర్‌బీఎన్‌బీ
రాబోయే పండుగలను.. శరదృతువు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది కొత్త ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన వెకేషన్ రెంటల్ కంపెనీ 'ఎయిర్‌బీఎన్‌బీ' (Airbnb) భారతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రయాణ అనుభవాలను అందించడానికి టాప్ ట్రెండింగ్ ప్రదేశాలను వెల్లడించింది. ఇందులో కాన్పూర్, లక్షద్వీప్, ఉజ్జయిని వంటివి ఉన్నాయి.కాన్పూర్‌లో దసరా ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తారు. ఉష్ణమండల ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన లక్షద్వీప్ కూడా పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఉజ్జయినిలో ఆధ్యాత్మిక శోభను చూడవచ్చు. ఇవన్నీ సహజ సౌందర్యమైన సాంస్కృతిని.. వాటి ప్రాముఖ్యతను తెలియజేసే గమ్యస్థానాలు.అంతర్జాతీయ ప్రదేశాల కోసం అన్వేషించేవారికి టోక్యో, అమాల్ఫీ, బాకు వంటివి చెప్పుకోదగ్గవి. టోక్యోలోని పార్కులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అమాల్ఫీ తీరం పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. బాకు ప్రాంతం వాస్తుశిల్పం, గొప్ప చరిత్రను తెలియజేస్తాయి. భారతీయ పర్యాటకులు మంచి ప్రదేశాలను సందర్శించాలనుకున్నప్పుడు ఇవన్నీ మరుపురాని మధురమైన అనుభూతులను అందిస్తాయి.ఓ వైపు పండుగ సీజన్, మరోవైపు శరదృతువు.. ఈ సమయంలో భారతీయులు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. అలాంటి ఈ ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ 'అమన్‌ప్రీత్ బజాజ్' పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27) సమీపిస్తోంది. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ "పర్యాటకం మరియు శాంతి". దీని అర్థం ఏమిటంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి, సంస్కృతుల మీద అవగాహన కల్పించడం. పర్యాటకులు విభిన్న ప్రకృతి దృశ్యాలను.. మెరుగైన అనుభవాలను అన్వేషించడానికి టూరిజం ఎంతో ఉపయోగపడుతుంది. -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగం
దేశ పర్యాటక రంగంలో రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రధానంగా టెక్నాలజీ సేవలందిస్తున్న కంపెనీల్లో గణనీయంగా ఉద్యోగుల అవసరం ఏర్పడబోతున్నట్లు కొన్ని కంపెనీల అధికారులు తెలిపారు.ట్రావెల్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ కంపెనీలు 2024లో భారీగా ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. మేక్మైట్రిప్, ఈజ్‌మైట్రిప్, అగోడా, ర్యాడిసన్ హోటల్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్ వంటి సంస్థలు ఇప్పటికే డిమాండ్‌కు అనుగుణంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి. సాంకేతికత, కస్టమర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కేంద్ర సబ్సిడీ ప్రక్రియ గడువు తగ్గింపురాడిసన్ హోటల్ గ్రూప్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ శర్మ మాట్లాడుతూ..‘పర్యాటక రంగం కొవిడ్ సమయంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. క్రమంగా కరోనా భయాలు వీడి ఈ రంగం పుంజుకుంటోంది. ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితుల కంటే వేగంగా ఈ రంగం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ సంవత్సరం రాడిసన్ హోటల్ గ్రూప్ దేశవ్యాప్తంగా 3,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అన్నారు. -
విస్తరిస్తున్న విదేశీ టూరిజం
విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్‌బౌండ్) టూరిజం మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్‌గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి, అమరావతిమధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడిభారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ హాలిడే మేకర్లలో అతిపెద్ద వనరుగా భారత్ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యాటకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జపాన్ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.231 శాతం పెరుగుదలఅమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియత్నాం ప్రయాణించినట్టు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.విదేశాలకు పెరుగుతున్న విమానాలు ఆ్రస్టేలియా, చైనా, జపాన్ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్‌లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్రయాణాలు ప్రీ–పాండమిక్ స్థాయిలో 97 శాతానికి చేరింది. భారతీయ విదేశీ టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్‌ను సూచిస్తోంది.టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్‌ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
జమ్ముకు పర్యటకులు ఖైదీల్లా వచ్చి వెళ్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి టూరిజం అభివృద్ధి చెందినట్లు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. టూరిజం అభివృద్ధి చెందటం కాదు..టూరిస్టులు ఖైధీల వలే వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఆయన ఓ జాతీయా మీడియాతో వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఒకవైపు.. జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతూనే అమర్నాథ్ యాత్ర సందర్భంగా కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నాయి.అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇంత భారీగా భద్రతా బలగాలను ఎప్పుడూ మోహరించలేదు. జమ్ము కశ్మీర్‌కు వచ్చే.. టూరిస్టులు భయం కుప్పిట్లో ఖైదాల వలే బస్సుల్లో వచ్చి.. వెళ్లిపోతున్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుమారు 200 ఏళ్ల కాలం పట్టిందిర. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కూడా చాలా సమయం పడుతుంది. గత ఐదేళ్లుగా జమ్ము కశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కేంద్రం ఇక్కడ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీనికి రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జూన్‌లో జరిగిన ఉగ్రదాడే నిదర్శనం’ అని అన్నారు.ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ -
ప్రపంచ దేశాల్లో పర్యాటక రంగం కొత్త పుంతలు (ఫొటోలు)
-
ట్రెండ్ మారుతోంది.. విషాదాలపై ఆసక్తి
సాక్షి, అమరావతి: మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ పర్యాటక రంగం కూడా సరికొత్త మార్గంలో పయనిస్తోంది. ప్రకృతి రమణీయత, కొత్త ప్రదేశాల అందాలు, సంస్కృతుల సందడుల నుంచి మారణహోమ క్షేత్రాల సందర్శన దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకాలం ప్రశాంతత కోసం పర్యాటకం కాగా... ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. భయానక వాతావరణానికి అద్దంపట్టే ప్రాంతాల సందర్శనకు డిమాండ్ పెరుగుతోంది.చరిత్రలో నిలిచిపోయిన విషాదాలు, చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. చరిత్రలోని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలనే కోరిక, ప్రత్యేకమైన విజ్ఞాన అనుభవం కోసం పర్యాటకులు ‘డార్క్ టూరిజం’ దిశగా మొగ్గు చూపుతున్నారు. ఘోరకల్లోల పరిస్థితులు, విపత్తులకు దారితీసిన సంఘటనల గురించి తెలుసు కోవాలనే ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇటీవల డార్క్ టూరిజం ఊపందుకుంది. డార్క్ టూరిజం అంటే... డార్క్ టూరిజం అనగా ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు గుర్తుగా మిగిలిన ఆనవాళ్లను సందర్శించడం. ఈ జాబితాలో తరచుగా మరణాలు, విషాద ఘటన, విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా పూర్వపు యుద్ధ భూములు, జైళ్లు, నిర్బంధ శిబిరాలు, స్మారక చిహ్నాలు సైతం ఉన్నాయి. మారణ హోమాలు, హోలిస్టిక్, పారానార్మల్(ఘోస్ట్ టూర్స్, మంత్రగత్తెల ప్రాంతాలు), యుద్ధభూమి, న్యూక్లియర్ విస్ఫోటాలు జరిగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఘోస్ట్ హౌస్‌లు, గ్రహాంతరవాసులు–యూఎఫ్‌వోలు (గాలిలో గుర్తుతెలియని ఎగిరే వస్తువులు) గుర్తించిన ప్రదేశాల సందర్శన కూడా డార్క్ టూరిజం కిందకే వస్తుంది.డార్క్ టూరిజానికి ఈ దేశాలు ప్రసిద్ధి.. అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, బంగ్లాదేశ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్(జీసీసీ)దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ దేశాల్లో డార్క్ టూరిజం ప్రసిద్ధి చెందు తోంది. అమెరికాలోని ఓ సర్వే ప్రకారం.. 82 శాతం మంది పాస్‌పోర్టు ప్రయాణికుల్లో కనీసం ఒక చీకటి ప్రదేశాన్ని సందర్శించినట్టు తేలింది. తాజాగా కేరళలోని ప్రకృతి విపత్తును తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులువెళుతున్న నేపథ్యంలో డార్క్ టూరిజంపై చర్చ జరుగుతోంది.ఒక్కో దేశంలో.. ఒక్కో విషాద ఘటన.. ⇒ చరిత్రలోని చీకటి ప్రదేశాలపై యాత్రికులకు ఆసక్తి పెరుగుతోంది. మిస్టరీలను తెలుసుకుంటూ థ్రిల్ కావడానికి పర్యాటకులు సాహసాలు చేస్తున్నారు. ⇒ ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో చాలామంది విదేశీ పర్యాటకులు అక్కడి యుద్ధాన్ని నేరుగా చూసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేసుకుని వెళ్లారు. గతంలో ఉక్రెయిన్ అందాలను వీక్షించేందుకు వచి్చన పర్యాటకులు ఇప్పుడు శిథిలమైన ఉక్రెయిన్ను కూడా చూసేందుకు క్యూ కట్టడం విశేషం. ⇒ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నైరుతి పోలాండ్‌లో యూదులను నాజీలు చిత్రహింసలు పెట్టిన నిర్బంధ శిబిరం (ఆష్విట్జ్), న్యూక్లియర్ పేలుళ్లు జరిగిన ప్రాంతం (చెర్నోబిల్), అమెరికాలోని గెట్టిస్బర్గ్ పట్టణంలోని యుద్ధభూమి(సివిల్‌వార్) డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందాయి. ⇒ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన ప్రదేశాన్ని కూడా ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. ⇒ చాలాకాలం కిందట ఫ్రాన్స్‌లో బహిరంగ ఉరి శిక్షలను అమలుచేసిన ప్రాంతాలను చూడటానికి కూడా సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ⇒ జపాన్‌లో అణుబాంబులతో నాశనమైన హిరోíÙమా, నాగసాకి పట్టణాలు, కంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (గ్రౌండ్ జీరో), రువాండా (మారణహోమం) ప్రాంతాలను కూడా సందర్శించే అంతర్జాతీయ పర్యాటకులు పెరుగుతున్నారు.మన దేశంలో డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రదేశాలు... ⇒భారతదేశంలో స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకాలను గుర్తుచేసే ఫోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలు. ⇒అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ (జనరల్ డయ్యర్ భారతీయులను ఊచకోత చేసిన ప్రాంతం)ఉద్యానవనం, స్మారక చిహ్నం. ⇒ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఎత్తయిన రూప్‌కుండ్ సరస్సు(అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంటుంది). ⇒రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో కుద్దార గ్రామం (ఇక్కడి ప్రజలు ఒక్కరాత్రిలో అంతరించిపోయారని పురాణాలు చెబుతున్నాయి). ⇒మహారాష్ట్రలోని పుణేలో శనివార్ వాడ చారిత్రక కోట (అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం ఉంది). ⇒రాజస్థాన్‌లో భాంగర్ కోట(మొఘల్ దళాలు చేసిన ఊచకోత) ⇒గుజరాత్‌లోని అరేబియా తీరంలో డుమాస్ బీచ్ (పురాణాల ప్రకారం ఒకప్పుడు ఇది హిందువుల శ్మశాన వాటికని, అందుకే అక్కడ ఇసుక నల్లగా ఉంటుందని నమ్మకం). ⇒ గుజరాత్‌లోని లోథాల్ సింధూ లోయ నాగరికత ప్రదేశాలు ⇒ముంబైలోని తాజ్ హోటల్ (2008లో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతం). ⇒ భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పాండ్ (భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగిన ప్రదేశం). ⇒గుజరాత్‌లోని భుజ్ (భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం). ⇒ తాజాగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో అధికారుల విజ్ఞప్తుల మేరకు వెనక్కి తగ్గారు. -
‘సాగర్’ చుట్టూ స్కైవాక్ వే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ చుట్టూ టూరిజం డెస్టినేషన్సర్కిల్గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అక్కడ స్కైవాక్ వే నిర్మించాలని.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం తీసుకొస్తున్న నేపథ్యంలో ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని కలిపి ఒక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోని బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక కేంద్రంగా బుద్ధవనం..: కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆరై్కవ్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితోపాటు తాజాగా అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో చేర్చింది. అందలో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. నాగార్జునసాగర్ డ్యామ్అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జునసాగర్సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్లో విహారించే సదుపాయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యాటకులు వెళ్లి రావడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్కొండ చుట్టూ రహదారుల విస్తరణ... గోల్కొండ కోట చుట్టూ ఉన్న రహదారులు ఇరుకుగా ఉన్నాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇళ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వలయాకారంలో డిజైన్ హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కైవాక్ వే డిజైన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక హబ్‌గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనాలను తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్‌కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని.. ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
1000 ఎకరాల్లో కొత్త జూపార్క్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు వెలుపల వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్‌లో ఉంచాలని చెప్పారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొలి్పన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. పట్టణ అటవీకరణను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘స్పీడ్’(స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతగిరిలో హెల్త్ టూరిజం అభివృద్ధి..అనంతగిరిలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందంటూ, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలో అక్కడ నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. వెల్నెస్సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహా్వనించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని, పర్యాటక రంగంలో ముందున్న రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు. బంగారు తాపడం పనుల్లో వేగం పెంచండి యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన, విడిది చేసేందుకు కాటేజీల నిర్మాణంపై దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామప్ప ఆలయం ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని అధునాతన సాంకేతికతను వినియోగించి పునర్నిర్మించాలని చెప్పారు. పర్యాటకంపై వేర్వేరు పాలసీలు టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణాతో పాటు వసతి సౌకర్యం, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా పర్యాటక ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్నిచోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ పద్ధతిలో.. హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వీటి నిర్వహణ నిరంతరం మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని రేవంత్ చెప్పారు. పర్యాటక రంగంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా టూరిజం అభివృద్ధి జరగాలన్నారు. హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలి హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసే హెల్త్ హబ్‌లో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే‹Ùరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండివేములవాడ ఆలయ విస్తరణపై సీఎం ఆదేశాలుసాక్షి, హైదరాబాద్/వేములవాడ: వేములవాడ ఆలయ విస్తరణ డిజైన్లు, నమూనాలకు వెంటనే శృంగేరి పీఠం అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సహా వేములవాడ ఆలయ అర్చకులు సీఎంను కలిశారు. ఆలయ విస్తరణకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. అధికారులు బదులిస్తూ శృంగేరి పీఠానికి వెళ్లి అను మతులు తీసుకోవలసి ఉందని చెప్పడంతో.. వెంటనే వెళ్లి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వి నోద్, స్థపతి వల్లి నాయగం, ప్రధానార్చకుడు ఉమేశ్ శర్మ, అధికారులు రాజేశ్, రఘునందన్ తదితరులున్నారు. -
మధుర, బృందావనమే కాదు... ఇక్కడ కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి.. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకగా చేసుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోనున్నారు. భారతదేశమంతటా ఈ పండుగ వేళ భక్తులలో ఆనందం వెల్లివిరుస్తుంది. జన్మాష్టమి వేడుకలు కేవలం మధుర-బృందావనంలోనే కాకుండా గుజరాత్, ముంబై, కేరళలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. మధుర- బృందావనం (ఉత్తర ప్రదేశ్)బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం. అందుకే జన్మాష్టమి వేళ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బృందావనంలో జన్మాష్టమి వేడుకలు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడి ఆలయాలను వివిధ రకాల అందమైన పూలతో అలంకరిస్తారు. రోజంతా భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోతుంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో నివసించే వారు జన్మాష్టమి నాడు మధుర, బృందావనాలను సందర్శిస్తుంటారు.ద్వారక (గుజరాత్)గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే జన్మాష్టమి సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు.పూరి (ఒడిశా)ఒడిశాలోని పూరీలో కూడా మధుర-బృందావనంలో మాదిరిగానే వారం రోజుల ముందుగానే జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణునికి ఇచ్చే హారతిని చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ముంబై (మహారాష్ట్ర)జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే దహీ-హండీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదర్, వర్లీ, థానే, లాల్బాగ్లలో నిర్వహించే దహీ హండీని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.గురువాయూర్(కేరళ)గురువాయూర్ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని బృహస్పతి, వాయుదేవుడు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి గురువాయూర్ దేవాలయం అని పేరు వచ్చిందంటారు. ఇక్కడ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి. -
వీకెండ్ మస్తీ..హాయిగా కునుకు : ‘స్లీప్ టూరిజం’
పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్‌కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.అలెప్పీ..కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.నాకో: హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్‌స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది. దువార్స్: పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది. -
Union Budget 2024-25: పర్యాటకానికి పరిశ్రమ హోదా..
పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబద్ధీకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు.‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హైదరాబాద్ టు సింగపూర్
సాక్షి, సిటీబ్యూరో: సింగపూర్ టూరిజం బోర్డు కన్ను హైదరాబాద్ మీదకు మళ్లింది. హైదరాబాదీల్లో పర్యాటకం పట్ల పెరుగుతున్న ఆసక్తి సింగపూర్‌కు కనకవర్షం కురిపిస్తోంది. సింగపూర్‌కు వెళ్లి రావడాన్ని మనోళ్లు వీకెండ్లో తమ సొంతూరికి వెళ్లివచ్చినట్లు భావిస్తున్నారు. అందుకు సాక్ష్యం ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో చేసిన ప్రయాణాలే. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఐదు లక్షలకు పైగా పర్యాటకులు భారత్ నుంచి సింగపూర్ విమానం ఎక్కారు. అందులో సింహభాగం హైదరాబాదీలే అంటున్నారు సింగపూర్ టూరిజమ్ బోర్డుకు చెందిన ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా ఏరియా డైరెక్టర్ వాంగ్ రేంజీ. సింగపూర్ గురించిన మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే...ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెకేషన్సింగపూర్ ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ మనిషి నిర్మించిన హరితసౌధం. మాన్‌మేడ్ నేచర్ అనవచ్చు. చెంగి ఎయిర్‌పోర్టు ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇందులో 14 మీటర్ల వాటర్‌ఫాల్ ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్ వాటర్ ఫాల్. ఎయిర్‌పోర్టులో రకరకాల చెట్లు, మొక్కలు 63 వేలున్నాయి. మామూలుగా ఎయిర్‌పోర్టు అంటే రవాణా సదుపాయ కేంద్రం మాత్రమే. కానీ చెంగి ఎయిర్‌పోర్టును టూరిస్ట్ డెస్టినేషన్‌గా మలుచుకున్నాం. హాట్ ఐలాండ్ అయిన సింగపూర్‌ని కూల్‌గా మార్చింది మాన్‌మేడ్ గ్రీనరీనే. ఇది గార్డెన్ సిటీ కాదు, సిటీ ఇన్ గార్డెన్ అంటాం. జెన్ జెడ్ నుంచి, న్యూలీ మ్యారీడ్ కపుల్, పిల్లలతో వచ్చే కుటుంబాలు అన్నీ సంతోషంగా గడిపే విధంగా ఉంటుంది. క్రూయిజ్‌లో నైట్ స్టే చేయడం నుంచి కోరల్ రీవ్స్‌ను చుట్టి రావడం, కనోపీ ట్రీ గార్డెన్ మీద స్కై వాక్... ప్రతిదీ గొప్ప అనుభూతిగా మిగులుతుంది.యూపీఐతో చెల్లింపులుడిజిటల్ పేమెంట్స్ విస్తృతంగా వాడుకలోకి వచ్చిన నేపథ్యంలో సింగపూర్ ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సింగపూర్ వెళ్లే ముందు కరెన్సీ మార్పిడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సింగపూర్‌లో ఎక్కడ షాపింగ్ చేసినా, హోటల్లో బస చేసినా మనం యూపీఐ ద్వారా చెల్లిస్తే ఆటోమేటిగ్గా ఆ రోజు మారకం విలువను బట్టి సింగపూర్ డాలర్లోకి కన్వర్ట్ అవుతుంది. మనకు రూపాయల్లో ఎంత చెల్లించిందీ స్పష్టంగా కనిపిస్తుంది.బడ్జెట్లో వెళ్లి రావచ్చుపర్యాటక ప్యాకేజీలు మధ్య తరగతి వాళ్లకు కూడా అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాం. సింగపూర్ ఎలాంటిదంటే ఓ లక్ష రూపాయలతో ఒక రోజు గడపవచ్చు, అదే లక్ష రూపాయలతో ఏడాది పాటూ నివసించవచ్చు. స్కై ఈజ్ లిమిట్ అనేది ఎంత నిజమో పైసా వసూల్లాగ కూడా టూర్ చేయవచ్చు. నేరుగా టికెట్ కొనుక్కుని విమానం ఎక్కేసి సింగపూర్‌లో దిగినా సరే ఎవరి బడ్జెట్‌కు తగినట్లు వాళ్లు రోజును గడపవచ్చు. ఇండియాలోని 17 నగరాలు సింగపూర్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ నగరాల నుంచి సింగపూర్‌కి వారానికి 288 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్ టూ సింగపూర్ సర్వీసులదే ప్రథమ స్థానం.పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్హైదరాబాద్ నుంచి సింగపూర్‌కి వెళ్లే టూరిస్టుల్లో మహిళలు, సోలో ట్రావెలర్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అలా వచ్చిన వారికి కూడా సురక్షితమైన ప్రదేశం సింగపూర్. పోలీస్ సేవలు పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సోలో విమెన్‌కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించే వ్యవస్థ ఉంది.దక్షిణాది రాష్ట్రాలకూ సింగపూర్‌కి ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకు అనేక విషయాల్లో అవినాభావ బంధం ఉంది. హైదరాబాద్ నుంచి పర్యాటకులు ఎక్కువ కావడంతో మెనూలో బిర్యానీని చేర్చాం. దక్షిణాది రుచుల రెస్టారెంట్ నిర్వహిస్తున్న విజయన్, ఇతర దక్షిణాది వంటల్లో నిష్ణాతులైన షెఫ్‌లు టూరిజమ్ బోర్డుతో కలిసి పని చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చిన పర్యాటకులు ఇడ్లీ, దోసె, రోటీలతో తమ ఇంటి భోజనాన్ని ఆస్వాదించాలి. -
దర్శనాల కోసం దళారులను సంప్రదించొద్దు
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం దళారులను సంప్రదించవద్దని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ఫోన్ నంబర్లతో కూడిన సమాచారంతో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు టీటీడీ కొన్ని టికెట్లను కేటాయించింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలియజేసింది. టూరిజం విభాగాల ద్వారా రావాలనుకునే భక్తులు నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొందరు దళారులు టూరిజం వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసి ఇస్తామని చెప్పి భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. -
భారత్‌లో జెన్‌జెడ్‌లు..థాయ్‌లాండ్‌ను చుట్టేస్తున్నారు
భారత్ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్‌లాండ్‌కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్‌బీఎన్‌బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్‌లు థాయ్‌లాండ్‌లో తమ సంస్థ రూముల్ని బుక్ చేసుకున్నారని తెలిపింది.హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్లో థాయ్‌లాండ్‌కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్‌బీఎన్‌బీ డేటా హైలెట్ చేసింది.భారతీయులు థాయ్‌లాండ్ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో జెన్‌జెడ్ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్‌లాండ్‌లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.ఎయిర్బీఎన్బీఅమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది.జెన్‌జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. -
‘క్రూయిజ్’కు పెరుగుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్‌ఫాల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్‌లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.లోతైన సముద్ర క్రూయిజ్‌లు, తీర ప్రాంత క్రూయిజ్‌లు, రివర్ క్రూయిజ్‌లు, యాచ్ క్రూయిజ్లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.దేశీయంగా పెరుగుదల..గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్‌కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్‌లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.క్రూయిజ్ పర్యటనలు ఇలా..ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్‌ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్‌లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది. -
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
మా మనమడు మొదటిసారి కాలేజీలో చేరుతున్న సందర్భంగా కుటుంబంతో కలిసి నేనూ జనవరి మొదటి వారంలో లబ్బాక్ ( Lubbock )లోని టెక్సస్ టెక్ ( Texas Tech ) యూనివర్సిటీకి కారులో షికారులాగా బయలుదేరాం. లబ్బాక్ ఏమిటీ అందం చందం లేని పేరు అన్నాను మా మనవరాలితో. ఆమె వెంటనే పొంగిపోతూ చెప్పిన సమాధానం ‘ తాతా ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ అఫ్ ఫేమస్ రాక్ ఎన్ రోల్ లెజెండ్ బడ్డీ హోలీ ( Buddy Holly )’ అని. ఏమిటో ఏది అడిగినా మ్యూజిక్ భాషలోనే జవాబు చెబుతుంది అనుకున్నాను మనసులోనే. ఎటు చూసినా అంతా హిస్పానిక్భూమి కొరత లేని దేశం యూఎస్. టెక్సస్ టెక్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణమే దాదాపు రెండువేల ఎకరాల్లో ఉంది. అయినా ఓపిక చేసుకొని కొన్ని ముఖ్యమైన భవనాలు తిరిగి చూసాము. ఎటు చూసినా అంతా హిస్పానిక్ వాతావరణం, ఇందులో చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది హిస్పానిక్స్నేట. అందుకే దీన్ని హిస్పానిక్ సర్వీసింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. మా వాడు చేరింది ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేసేది మాత్రం చెస్. క్రియేటివ్ సిటీగా..మరునాడు మా కారు న్యూ మెక్సికో రాజధాని ‘సాంత ఫె ( Santa fe )’ వెళ్ళింది. అక్కడి మారియేట్ హోటల్లో మా బస. సాంత ఫె ఒకప్పటి ( 1610 ) స్పానిష్ వాళ్ళ కాలనీ , సాంగ్రెడ్ క్రిస్టో పర్వతాల దగ్గరున్న 400 సంవత్సరాల నాటి పట్టణం. అన్నీ పూబ్లో స్టైల్ నిర్మాణాలు. అవి కళాసంస్కృతులకు ప్రసిద్ధి గాంచినవి. అందుకేనేమో యునెస్కో దీన్ని ఒక ‘ ప్రపంచ స్థాయి క్రియేటివ్ సిటీ ’ గా గుర్తించింది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా మార్చ్ నెలలో వస్తారట.మేము కొంచెం ముందే వెళ్ళాం. ఎంతైనా మంచు ప్రాంతం కదా చలి ఎక్కువగానే ఉంది. నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అయినా ఆ చలిని లెక్కచేయకుండా 5 వ తేదీ నాడు అందరితోకలిసి సాంత ఫె సమీపంలో నేనూ స్కీయింగ్ చేశాను. మావాళ్లు హెచ్చరిస్తున్నా పర్వాలేదు అని ప్రత్యేక పొడుగు చెక్క పాదుకలు ( Long flat runners అవే skis ) షూతో కలిపి వేసుకొని రెండుసార్లు జారిపడ్డా ఏమీ కానట్టు నవ్వుతూ, పడిలేచిన కెరటంలా లేచి, ఆ ఐస్ మీద చిన్నప్పుడు బడిలో జారుడు బండ ఆడినట్టు సరదాగా జారుతూ పిల్లలతో ఔరా! అనిపించుకున్నా. చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్మా విహారయాత్ర చివరి రోజు మేము సాంత ఫెలో చూసింది ఓ చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్ ‘మియో వోల్ఫ్ ’ ( Meo wolf ). ఇక్కడ అడుగు పెట్టగానే మాకు స్వాగతం చెప్పింది ఓ రాక్షసాకార రోబోట్. ఈ మ్యూజియంలోకి ప్రవేశించిన వారు ఈ భూలోకాన్ని మరిచి ‘మరో ప్రపంచం’లోకి ( శ్రీ శ్రీ చెప్పింది కాదు సుమా ! ) వెళ్ళిపోతారన్నారు. దాదాపు వంద మంది కళాకారులు సృష్టించిన విద్యుత్ వెలుగుల వింత ప్రపంచం ఇది. ఆర్ట్ & టెక్నాలజీ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనశాలను చూస్తే అర్థమౌతుంది. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇలాంటిది పెడితే సంవత్సరం పొడుగునా జనం వచ్చి చూసి ఆనందిస్తారు కదా! అనిపించింది. House of Eternal Returnగా వర్ణించిన ఈ రంగుల ప్రపంచంలో ఒక పూట గడిపి ఎట్లాగయితేనేం బయటపడ్డాం. నాలుగు రోజులకే లాడ్జింగ్, హోటల్ లతో విసుగెత్తి , ఇంటిమీద బెంగ పెట్టుకొని డాలస్ బాట పట్టాం ! వేముల ప్రభాకర్(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
విజయవాడ కృష్ణా నదిలో ‘సీ ప్లేన్’ ఎక్కి నేరుగా కాకినాడ వద్ద దిగాలనుకుంటున్నారా.. లేదా విశాఖ రుషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, మాల్దీవుల వంటి దేశాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ‘సీ ప్లేన్’లు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ–కాకినాడ, కాకినాడ– రుషికొండ, కోనసీమ–విశాఖపట్నం, రుషికొండ–లంబసింగికి హాయిగా సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకుపోయే అవకాశం కలుగుతుంది. తొలి దశలో ప్రతిపాదించిన 40 నిమిషాల ప్రయాణ షెడ్యూల్ విజయవాడ–కాకినాడ, కాకినాడ–రుíÙకొండ, రుషికొండ–లంబసింగి, లంబసింగి–రుషికొండ, రుషికొండ–కోనసీమ, కోనసీమ–విశాఖపట్నం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక గమ్యస్థానాల మధ్య దూరాన్ని చెరిపేసేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. అపార జలవనరుల మీదుగా ఆకాశంలో విహరిస్తూ సహజసిద్ధ పర్యాటక అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలోకి ‘సీ ప్లేన్’ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలను ఒకదానికొకటి అనుసంధానించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సీ ప్లేన్’ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి దశలో 9–10 మంది ప్రయాణ సామర్థ్యంతో ఆరు ప్రాంతాల్లో రెండు ‘ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్’లు నడిపేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19–20 సీట్లు ఉండే సర్విసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్.. ‘సీ ప్లేన్’ సేవలపై అంతర్జాతీయంగా పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మాల్దీవుల పర్యాటకంలో ఫ్లోటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, కెనడాలోనూ పెద్ద సంఖ్యలో సీ ప్లేన్లు పని చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో 48 శాతం సీ ప్లేన్ సేవలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కెనడాలో 34 శాతం, ఐరోపాలో 8 శాతం, ఆ్రస్టేలియాలో 4 శాతం, ఇతర ప్రాంతాల్లో 6 శాతం సేవలు అందిస్తున్నాయి. కాగా, పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలకు గంట దూరంలోనే విమాన సేవలుండాలనే ప్రాథమిక అంశాలకు పెద్దపీట వేస్తున్నాం. అందుకే సీ ప్లేన్ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించాం. ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని నీటి వ్యవస్థలను సీ ప్లేన్లకు ల్యాండింగ్ గ్రౌండ్‌గా ఉపయోగించవచ్చు. వీటి ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తాం’ అని పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్‌లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్‌సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్‌ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్‌లో 26 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం, బీహార్‌లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్‌కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
దిగొచ్చిన మాల్దీవ్స్.. ప్లీజ్ అంటూ భారత్‌కు అభ్యర్థన
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో.. అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్‌ను బతిమాలడం మొదట్టింది. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్‌ను కోరారు. సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మాక్కూడా ఓ చరిత్ర ఉంది. మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్యానికి భారత్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. భారత్ నుంచి వచ్చేవారికి మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుంది. దయ చేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని కోరుతున్నా. మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యటకం ఆధారపడి ఉంటుంది’ అని ఇబ్రహీం ఫైసల్ భారత్‌ను కోరారు.ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి మాల్దీవులు పర్యాటకం దెబ్బతింది. మరోవైపు.. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారతీ సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో కొంత మంది సైనికులు భారత్‌కు వచ్చారు. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
కోవిడ్ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.తాజాగా ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్ఎల్బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్‌లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. -
ఖైదీలా కాకుండా టూరిస్ట్‌గా సందర్శించే జైళ్లు ఇవే!
ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసుంటారు. కానీ పర్యాటక ప్రదేశాల్ల ఉన్న జైళ్ల గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే ఈ జైలుకి ఖైదీలుగా వెళ్లాల్సిన పనిలేదు. సరదాగా ఓ టూరిస్టులా వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇదేంటీ జైళ్లకు పర్యాటుకుల్లా వెళ్లాడమా అని అనుమానంతో ఉండకండి. ఎందుకంటే వీటిని చూస్తే మన దేశ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర కథలు, స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అనేక గొప్ప కథలు తెలుసుకుంటారు. ఆ జైళ్లను చూడగానే అలనాడు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన నాటి త్యాగధనులు కళ్లముందు మెదులుతారు. మనకవి జైళ్లలా కాదు పవిత్రమైన ప్రదేశాల్లా అనిపిస్తాయి. అవేంటో చూద్దామా!. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ ఈ జైలు చూస్తే కాలాపని మూవీ గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది నాటి స్వాతంత్య్ర సమరయోధుల బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించ కథలుగా తెలుసుకోవాచచు. అంతేకాదండోయ్ ఇది కాలాపని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల కోసం రోజు ఈ జైలు తెరిచి ఉంటుంది. పైగా వారికోసం లైట్, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనవేళలు ఉంటాయి. ఎరవాడ జైలు, పూణే, మహారాష్ట్ర ఎరవాడ, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో సహా చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన పోరాటంలో ఈ జైల్లోనే బంధిలయ్యారు. ఇందలో గాంధీ, తిలక్ పేరుతో ఉరి గది కూడా ఉంది. దీన్ని 1831లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. తీహార్ జైలు, ఢిల్లీ భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుంటారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేయిస్తారు. సంగారెడ్డి జైలు, హైదరాబాద్ హైదరాబాద్‌లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల కోసం మ్యూజియంగా మారింది. జీవితంలో జైలు పాలయ్యే గండం ఉన్నవాళ్లు అదిపోగొట్టుకునేందుకు ఇక్కడకు వచ్చి ఒక రోజంతా ఉండి వెళ్తారట. అంతేగాదు ఇక్కడ ‘ఫీల్ ది జైల్’ పథకం కింద జైలులో ఒక రోజంతా గడిపి రావొచ్చట. వైపర్ ఐలాండ్, అండమాన్ ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే వారిని శిక్షించడం కోసం ఇక్కడకి తరలిచేవారట. ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచడం జరగుతుంది. కానీ ఇది అంత ఫేమస్ కాలేదు. బహుశా భయానక శిక్షలు విధించడమే అందుక కారణమై ఉండొచ్చు. (చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
Fact Check: పర్యాటకంపై రామోజీ నాటకం
సాక్షి, అమరావతి : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈనాడు రామోజీరావు. నిత్యం తన క్షుద్ర పత్రికలో వండివారుస్తున్న అశుద్ధ కథనాలు చూసి పాఠకులు ఛీకొడుతున్నా ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా బాబు పల్లకిని మోయడమే పనిగా పెట్టుకున్నారు. గ్రాఫిక్స్ బొమ్మలు, కనికట్టు కథనాలతో అప్పట్లో ప్రజల్ని మభ్యపెట్టిన బాబు మాదిరిగా రామోజీ కూడా ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు రంగరించి తన ఈనాడులో అభూతకల్పనలను అచ్చోస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలో టూరిజం రంగంపై ఆయన కక్కింది కూడా అక్షరాల విషమే. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచినా.. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘లేపాక్షి’ ఘనత సాధించినా.. అలాగే, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో తాత్కాలిక జాబితాలోనూ ఏపీ చోటు దక్కించుకున్నా.. విశాఖలోని రుషికొండ బీచ్‌కు వరల్డ్ ఫేమస్ ‘బ్లూఫ్లాగ్’ సర్టిఫికేషన్ రావడంతో అక్కడ వరుసగా నాలుగేళ్లుగా బ్లూఫ్లాగ్ జెండా రెపరెపలాడుతున్నా.. అలాగే.. గతేడాది జీఐఎస్ సదస్సుల్లో ఏకంగా రూ.17వేల కోట్లకు పైగా పెట్టుబడులు పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తినా బాబు జాకీ లిఫ్టర్ రామోజీకి ఇవేమీ కనపడవు. నిజానికి.. ఇదంతా దేశంలోనే అత్యుత్తమ పర్యాటక పాలసీని సీఎం వైఎస్ జగన్ తీసుకురావడంవల్లే పెట్టుబడిదారులు క్యూ కట్టారనేది ఎవరూ కాదనలేని సత్యం. కరోనా రెండేళ్ల కాలం మినహా.. మిగిలిన మూడేళ్లలోనే ఇది సాధ్యపడింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఏపీ పర్యాటకానికి దక్కిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ పర్యాటకం మొత్తం ఏపీ వైపు చూస్తుంటే.. కళ్లకు టీడీపీ గంతలు కట్టుకున్న గురవింద రామోజీ మాత్రం కళ్లుండీ కబోదిలా నటిస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచిని చెప్పకపోగా.. ప్రజల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశాన్ని భుజానకెత్తుకుని టన్నుల కొద్దీ అసత్యాలతో ‘ఈనాడు’లో నింపి పారేస్తున్నారు. ఇందులో భా గమే శుక్రవారం ‘పర్యాటకం.. పక్కా నాటకం’ అంటూ ఈనాడు వండిన ఓ ఫక్తు నాటకీయ కథనం. అప్పట్లో బీచ్‌లలో అశ్లీలత ప్రోత్సాహానికి కుట్ర ఇక అప్పట్లో పర్యాటకం ముసుగులో చంద్రబాబు సంప్రదాయలకు పాతరేశారు. విశాఖ బీచ్‌లో లవ్ ఫెస్టివల్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహించే కుట్రకు తెరతీశారు. దీనిపై ప్రజలు, మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే రామోజీకి పర్యాటకాభివృద్ధిగా కనిపిస్తుందంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. చంద్రబాబు బీచ్‌లను బహిరంగ అశ్లీలతకు వాడుకోవాలని చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 288 బీచ్‌లను గుర్తించి అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి కోస్టల్ జోన్ టూరిజాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో క్రూయిజ్ టెర్మినల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. కానీ, చంద్రబాబు ప్రచార పిచి్చతో రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేయడాన్ని రామోజీ ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. రికార్డు స్థాయిలో ఏపీటీడీసీ ఆదాయం.. ప్రపంచ పర్యాటకం మొత్తం కరోనాతో కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. ఏపీటీడీసీ ఆదాయాన్ని టీడీపీ ఐదేళ్ల పాలనతో పోలిస్తే రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2022–23లో ఏకంగా రూ.162.25 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22తో పోలిస్తే 10.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. విచిత్రంగా 2017–18లో టీడీపీ హయాంలో మాత్రం రూ.1.99 కోట్ల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం గమనార్హం. మరి రామోజీ చెబుతున్న పర్యాటకం కుంటుపడితే ఒక్క హరిత హోటళ్లు, బోటింగ్ ద్వారా ఇంత వృద్ధి ఎలా సాధ్యపడుతుందో రామోజీనే చెప్పాలి. మరోవైపు.. నాస్తికత్వపు వాసనలు పోని రామోజీ టీటీడీ టూర్ ప్యాకేజీలపైనా విషం చిమ్మారు. సెంట్రలైజ్డ్గా అత్యాధునిక సౌకర్యాలతో ఉత్తమ రవాణా మార్గాల్లో సేవలందిస్తుంటే.. పర్యాటక సంస్థ ఆదాయానికి గండి కొట్టేస్తున్నట్లు ఆయన గుండెలు బాదుకున్నారు. కేంద్రం మెచ్చిన ఏపీ.. ఇక రూ.200 కోట్లతో అరకు, గండికోట అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గండికోట ప్రాంతంలో 4,336 ఎకరాల్లో పర్యాటక సిటీని అభివృద్ధి చేయనున్నారు. అరకు లోయలోనూ సుందర హోటళ్లు, అడ్వెంచర్, ఎకో పర్యాటకానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి. సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, విజయవాడ దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అహోబిళం, నాగార్జునసాగర్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రూ.3వేల కోట్ల పనులకు శ్రీకారం.. జీఐఎస్‌లో చేసుకున్న ఒప్పందాల్లో దాదాపు రూ.3,049.90 కోట్ల విలువైన సివిల్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి రెడీగా ఉంటుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కల్పించేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓ అండ్ ఎం) 87 ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. అప్పట్లో అద్దె సూట్లు తొడిగేసి.. వాస్తవానికి.. చంద్రబాబు హయాంలో ప్రచార పిచ్చి పీక్స్‌లో ఉండేది. గ్రాఫిక్స్ బొమ్మలు, కనికట్టు సదస్సులతో ప్రజలను నిరంతరం మభ్యపెడుతూనే ఉండేవారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో రోడ్ల పక్కన కనిపించిన ప్రతిఒక్కరికీ అద్దె సూట్లు తొడిగేసి మరీ వారికి పెట్టుబడిదారుల కలరింగ్ ఇచ్చేశారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు వారితో దొంగ ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా జగమెరిగిన సత్యం. అప్పట్లో పర్యాటక రంగంలో తన అనుయాయులకు తప్ప మిగిలిన ఎవరికీ ఒక్క కాంట్రాక్టు, లేదా ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటే చంద్రబాబు పాలనంతా పైన పటారం లోన లొటారం అనే స్పష్టమైంది. ఇక వీటినే రామోజీరావు గొప్పగా కీర్తిస్తూ పతాక శీర్షకల్లో బాబుకు నిర్లజ్జగా భజన చేసి ప్రజలను దగా చేశారు. కానీ, సీఎం జగన్ దార్శనిక పిలుపుతో గతేడాది విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (జీఐఎస్)లో మొత్తం రూ.13.11 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఒక్క పర్యాటక రంగంలోనే 117 ఒప్పందాల ద్వారా రూ.17,127 పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 39,170 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రణాళిక రచించారు. కానీ, చంద్రబాబు దొంగ ఒప్పందాలను అడ్డగోలుగా కీర్తించిన అదే రామోజీరావు.. సీఎం జగన్ పాలనలో వాస్తవాలకు పాతరేస్తూ దు్రష్పచారానికి తెగబడడం సిగ్గుచేటు. ఆతిథ్య ఆంధ్ర.. మరోవైపు.. సీఎం జగన్ సారథ్యంలో ఆతిథ్య రంగం అభివృద్ధి బాట పడుతోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటల్ రంగ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్‌తో పాటు దేశీయ సంస్థలైన గార్రిసన్ కన్స్ట్రక్షన్, మేఫెయిర్ హోటళ్లు వచ్చాయి. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో ఈ రంగంలో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్పటికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యా యి. ఇక్కడ శంకుస్థాపనలు జరగ్గా త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. ఒక్క ఒబెరాయ్ సంస్థల ద్వారానే సుమారు 11వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతిలో నోవోటెల్ సంస్థ రూ.125 కోట్లతో మూడువేల మందికి ఉపాధి, విశాఖపట్నలో మేఫెయిర్ సంస్థ రూ.525 కోట్లతో, మరో రూ.404 కోట్లతో హయత్ రీజెన్సీ ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మాణానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే విజయవాడలో సుమారు రూ.100 కోట్లతో హయత్ న్యూ లగ్జరీ స్టార్ హోటల్, గుంటూరులో ఐటీసీ హోటళ్లు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. చంద్రబాబు హ యాంలో ఇలాంటి అభివృద్ధి లేకపోగా విదేశీ యులను తీసుకొచ్చి పర్యాటకంలో విపరీతమై న దుబారా ఖర్చులు చేశారు. బహుశా రామోజీకి రూపాయి రాక కంటే.. రూపాయి ఖర్చుచేయడమే అభివృద్ధిగా కనిపించినట్లుంది. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం
దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి. విస్తృతంగా ఉద్యోగాల కల్పన ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్ స్పాట్స్‌లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్ ప్లానింగ్ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు. అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భాగంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కోరుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది. టాప్‌లో తిరుపతి.. దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ (65 లక్షలు), రోమ్‌లోని వాటికన్ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్‌లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది. -
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది. -
మారిషస్‌ను మాల్దీవుల అనుకున్న నెటిజన్లు.. ‘ఎక్స్’ పోస్టులు వైరల్
భారత్-మాల్లీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్యదీప్‌ను పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి అందాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. మాల్దీవుల మంత్రులు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు భారత దేశంలోని ప్రముఖులంతా మాల్దీవుల కంటే.. స్వదేశానికి చెందిన లక్ష్యదీప్, అండమాన్ ద్వీపాలకు పర్యటనకు వెళ్లాలని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి విదితమే. భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మారిషస్ ద్వీప దేశం భారతీయ పర్యటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ‘మరిషస్ టూరిజం(ఇండియా)’ ‘ఎక్స్’ (ట్విటర్)లో భారతీయ పర్యటకులు తమ దేశంలోకి రావాల్సిందిగా స్వాగంతం పలికింది. ‘మారిషస్‌లోని అందాలను అన్వేషించటం కోసం భారతీయులకు స్వాగతం. 2024 ఏడాదిలో మారిషస్ ద్వీపాన్ని సందర్శించండి. అక్కడి అందాలను చూసి కొత్త శక్తి, అనుభూతిని ఆస్వాధించండి. టన్నుల కొద్ది సాహసాలు, అనుభవాలు మీ కోసం ఎదురు చేస్తున్నాయి. ఈ రోజు మీ హాలీ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి!’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, భారతీయ నెటజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. మారిషస్ ద్వీపాన్ని పలువురు భారతీయ నేటిజన్లు మాల్దీవులగా పొరపాటు పడ్డారు. ‘మాల్దీవులపై మాకు ఆసక్తి లేదు. మాకు లక్ష్యదీప్ ఉంది’, ‘ మీరు మా ప్రధానమంత్రిని అవమానించారు. అందుకే మేము మీ దేశాన్ని పర్యటించము’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో స్పందించిన మారిషస్ టూరిజం.. ‘హాయ్, ఇది మారిషస్ దేశం. మాల్దీవుల ద్వీపం కాదు. రెండు వేర్వేరు ద్వీపాలు’ అని స్పష్టత ఇచ్చింది. వెంటనే నెటిజన్లలో నవ్వులు పూచాయి. మరికొంత మంది నెటిజన్ల స్పందిస్తూ.. మాల్దీవుల కంటే మారిషస్ పర్యటన బాగుటుందని కామెంట్లు చేశారు. ‘ మాల్దీవుల కంటే స్నేపూర్వకంగా ఉండే మారిషస్ పర్యటనకు వెళ్లటం ఉత్తమం’, మాల్దీవుల కంటే మారిషస్ చాలా చాలా మంచి పర్యటక ప్రాంతం’ అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు ‘ఎక్స్’ వైరల్ అవుతున్నాయి. -
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
Interim Budget 2024: లక్షద్వీప్‌కు నిర్మలమ్మ వరాలు
ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్‌లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్‌లను టూరిస్ట్ హబ్‌గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్‌లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌ను కేటాయించారు. సహజమైన బీచ్‌లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్ మైషో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
Maldives: తగ్గిన భారత్ టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా
మాలె: భారత్, మాల్దీవుల వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకంలో భారత్ వాటా తగ్గిపోయింది. గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో మూడవ స్థానంలో ఉండే భారత్ వివాదం అనంతరం ఐదవ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవుల టూరిజంలో భారత దేశ వాటా 7.1 శాతంగా ఉండి 3వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో చైనా కనీసం మాల్దీవుల టూరిజంలో అధిక వాటా కలిగిన దేశాల జాబితాలో కనీసం టాప్ టెన్‌లో కూడా లేదు. అలాంటిది వివాదం తర్వాత మాల్దీవుల టూరిజంలో చైనా, బ్రిటన్ల వాటా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు చైనా మూడవ స్థానానికి, బ్రిటన్ అయిదవ స్థానానికి ఎగబాకాయి. జనవరి 2వ తేదీన ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు బహిరంగ విమర్శలు చేశారు. దీంతో భారత పర్యాటకుల్లో చాలా మంది మాల్దీవుల టూర్లు రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు ట్రెండింగ్‌గా మారింది. ఇదీచదవండి.. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం -
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉద యం 8.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు విశాఖ జిల్లా భీమిలిలో పర్యటన సీఎం జగన్ శనివారం విశాఖ జిల్లా భీమిలిలో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగే వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. -
టెంపుల్, ఎకో టూరిజాలతో సర్క్యూట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో ఎకో టూరిజాన్ని కలిపి టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖల బడ్జెట్ అంచనాలపై సమీక్ష జరిగింది. గిరిజనుల లబ్ధికి ఔషధ మొక్కల తోటల పెంపకం చేపట్టండి.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్నో ప్రముఖ ఆలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థికపరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత ఔషధ మొక్కల తోటలను పెంచాలన్నారు. ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ ప్లాంటేషన్లకు సంబంధించి మార్కెటింగ్‌ను అనుసంధానించాలని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజానికి హైదరాబాద్వాసుల్లో ఆదరణ ఉందని, ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించి ప్రతిపాదిత బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, దేవాదాయ కమిషనర్ అనీల్ కుమార్, పీసీసీఎఫ్ డోబ్రియల్ పాల్గొన్నారు. -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
అనంతగిరి అందాలకు కొత్త సొబగులు
వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు బిజీలైఫ్నుంచి ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్లేని ప్రదేశంలోకి వెళ్లిపోవాలని ఆరాట పడుతూ ఉంటారు. అటు అధ్యాత్మికం.. ఇటు ఆహ్లదకరమైన వాతావరణం కలగలిపిన పర్యాటక అందాలకు కేరాఫ్ అడ్రస్.హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాలోని అనంతగిరి కొండలు ఎత్తైన కొండలు, లోతైన లోయలు, మలుపులు తిరిగిన రోడ్లు, అలిసిన మనుసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచి పిక్నిక్ స్పాట్ అనంతగిరి కొండలు.. తాజాగా ఈ పర్యాటక అందాలకు మరిన్ని హంగులు అద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రాజెక్ట్ డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఏకో టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా అటవీ సంపద దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధి చేస్తారు. చెట్లను నరకకుండా.. కొండలను తొలచకుండా ఏకో టూరిజం ప్రాజెక్ట్ పనులు చేపట్టనున్నారు. అడ్వంచరస్ టూరిజంలో భాగంగా ట్రెక్కింగ్, రోప్ వే వంటివి ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి సేదతీరడానికి వస్తుంటారు. వీకెండ్ లో పర్యాటక అందాలను ఎంజాయ్ చేయడానికి బైక్ లపై రయ్... రయ్ మంటూ వచ్చేస్తుంటారు. అనంతగిరి కొండలకు అటు.. ఇటు రెండు సాగు ప్రాజెక్టులు ఉండటం పర్యాటక అభివృద్ధికి మరింత అనుకూలంగా మారింది. ఒక వైపు సర్పన్ పల్లి.. మరోవైపు కోటపల్లి ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ లు, హోటల్స్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ ప్రాజెక్ట్ ల్లో బోటింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అనంతగిరి అభివృద్ధి కోసం ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. పెద్దసంఖ్యలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఇక్కడ నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. జూ పార్క్ తరహాలో పక్షుల, జంతువుల కోసం 213 ఎకరాలను కేటాయించారు. త్వరలోనే పర్యాటక అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశముంది. అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పొందవచ్చు. 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ నవాబ్ నిర్మించాడట ఈ ఆలయాన్ని. హైదరాబాద్ నవాబు కలలోకి అనంత పద్మనాభస్వామి వచ్చి టెంపుల్ కట్టమని ఆదేశించడంతో అనంత పద్మనాభ స్వామి దేవాలయం కట్టారనీ అందుకే ఈ ప్రదేశానికిఅనంతగిరి కొండలు అని పేరు వచ్చిందని ప్రతీతి. -
ఛలో లక్షద్వీప్.. మంచిది కాదు!
కవరత్తి: మాల్దీవులపై కోపంతో.. సొంత పర్యాటకాన్ని ప్రొత్సహించుకునే క్రమంలో సోషల్ మీడియాలో ఛలో లక్షద్వీప్ ట్రెండ్ తీసుకొచ్చారు కొందరు భారతీయులు. అయితే.. లక్షద్వీప్‌కు పర్యాటకులు పోటెత్తడం ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు అక్కడి ఏకైక ఎంపీ. పగడాల నేల లక్షద్వీప్ చాలా సున్నితమైందని.. పైగా పర్యావరణపరంగా చాలా పెళుసుగా ఉండటంతో అతి పర్యాటకం దీవులకే ముప్పు తెస్తుందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌కు ఎన్నో పరిమితులున్నాయి. ఇక్కడికి నేరుగా విమాన సౌకర్యం లేదు. హోటల్ గదులు 150 వరకే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ద్వీపం పెళుసు జీవావరణ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు పోటెత్తడాన్ని నియంత్రించాల్సి ఉంటుంది అని ఎంపీ మొహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆలోచనను ప్రతిపాదించింది. ఈ ప్లాన్.. ఇక్కడి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం రూపొందించబడిన గ్రంథం లాంటిది. దీవుల సామర్థ్యం ఆధారంగానే.. ఇక్కడ సౌకర్యాల ఏర్పాటు జరగాలని.. పర్యాటకుల్ని అనుమతించాలంటూ స్పష్టంగా సూచించింది ఈ కమిటీ. కాబట్టి.. ఈ దీవులకు నియంత్రణ పర్యాటకం(controlled tourism) సరైందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌లోని.. 36 దీవులకుగానూ 10 మాత్రమే జనావాసంగా ఉన్నాయి. ఇక్కడి జనాభాలో 8 నుంచి 10 శాతం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పైగా టూరిజం జాబితాలో చాలామందికి ఇది ఉండకపోవచ్చు. కేవలం మాల్దీవుల మీద కోపంతో.. చాలామంది లక్షదీవులకు వెళ్తామంటూ చాలామంది చెబుతున్నారు. ఇది కేవలం భావోద్వేగపూరితమైన చర్య మాత్రమే అని తెలిపారాయన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన.. ఆ సమయంలో దిగిన ఫొటో షూట్ తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు బెడిసి కొట్టడాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతూ అక్కడి ప్రతిపక్షాలు రచ్చే చేశాయి. దీంతో ముగ్గురు మంత్రుల్ని తొలగించాల్సి వచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే.. చైనాతో భేటీ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వరం మారింది. ఈ క్రమంలో.. తమది చిన్నదేశమే అయినా బెదిరింపుల్ని ఉపేక్షించబోమని, మార్చి 15వ తేదీలోపు అక్కడ మోహరించిన భారత సైన్య సిబ్బంది వెనుదిరగాలంటూ అల్టిమేటం ప్రకటించారాయన. -
భారీ పెట్టుబడులే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటనకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. ఇందులో నోవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆ్రస్టాజనిక్, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులు, సీఐఐ, నాస్కాం వంటి చాంబర్స్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం సమావేశం కానుంది. దావోస్ పర్యటనలో భాగంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం బృందం సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏఐపై శ్రీధర్‌బాబు ప్రసంగం: కృత్రిమ మేధ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’’అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర బృందం కలవనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం కానున్నట్టు తెలిపారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ కేర్– లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండ్రస్టియల్ రెవెల్యూషన్ (సీ4ఐఆర్)’సదస్సు హైదరాబాద్‌లో జరగబోతోందని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ బలాబలాలను, ప్రాధాన్యతలను చాటనున్నట్టు వివరించారు. ఫోరం చర్చల్లో మాట్లాడనున్న రేవంత్ తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడే అవకాశం దక్కింది. అక్కడ జరిగే చర్చాగోష్టిలో.. పురోగమిస్తున్న వైద్యరంగంపై రేవంత్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ‘‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’’అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ‘అగ్రి–ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం–రైతుల జీవనోపాధి పరిరక్షణలో భాగంగా వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల’పై సీఎం ప్రసంగించనున్నారు. -
బై బై మాల్దీవులు చలో లక్షద్విప్
సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ వందలాది మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల ప్రయాణం కావడం, ఎక్కువ సంఖ్యలో దీవులు, ఆకట్టుకునే బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో మూడు, నాలుగు రోజుల పాటు గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ టూర్లు పూర్తిగా తగ్గిపోయాయి. సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు స్వర్గధామంగా భావించే మాల్దీవుల పట్ల నగరవాసులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. పర్యాటకులతోపాటు కొత్తగా పెళ్లయిన జంటలు మాల్దీవులను హనీమూన్‌కు ఎంపిక చేసుకుంటారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా మాల్దీవులు కొంతకాలంగా కేరాఫ్‌గా మారింది. కానీ ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంతోపాటు నగరం నుంచీ అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. ఇప్పటికే ప్యాకేజీలు బుక్ చేసుకున్న వాళ్లు పర్యటనలు వాయిదా వేసుకుంటుండగా, కొత్తగా ఎలాంటి బుకింగ్‌లు కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు తెలిపాయి. పలు ఎయిర్‌లైన్స్, ట్రావెల్స్ సంస్థలు విమాన, ప్యాకేజీ చార్జీలను తగ్గించినప్పటికీ మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నగరానికి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని వెళ్లే వాళ్లు కూడా తమ పర్యటనలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే డిమాండ్ కూడా బాగా తగ్గిందన్నారు. లక్షద్విప్ వైపు సిటీ చూపు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా నగర పర్యాటకులు లక్షద్విప్ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో లక్షద్వీప్‌కు పర్యాటక ప్యాకేజీలు, విమాన చార్జీలు కూడా పెరిగాయి. లక్షద్విప్‌లో రెండు రోజుల క్రూయిజ్ పర్యటనకు గతంలో రూ.20 వేలు ఉంటే ప్రస్తుతం రూ.35 వేల వరకు ప్యాకేజీ ధరలు పెరిగాయి. ప్యాకేజీల వివరాలను తెలుసుకొనేందుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు సికింద్రాబాద్‌కు చెందిన ఒక పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. లక్షద్విప్తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకూ సిటీజనులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గోవా, డామన్ డయ్యూ, కోవలం తదితర ప్రాంతాలకు సైతం సిటీ టూరిస్టులు తరలివెళ్తున్నారు. ప్యాకేజీల్లో భారీ రాయితీలు ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లే టూరిస్టులు తగ్గిపోవడంతో ట్రావెల్స్ సంస్థలు, ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గతంలో మూడు రోజుల ప్యాకేజీ రూ.55,000 నుంచి రూ.72,000 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు తగ్గించినట్లు ఒక ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. అలాగే రూ.లక్షల్లో ఉండే ప్రీమియం ప్యాకేజీలపైనా భారీ తగ్గింపును ప్రకటించారు. ప్రీమియం ప్యాకేజీలపై రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గించినట్లు మరో ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలో సింగిల్ జర్నీ గతంలో రూ.20 వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.15వేల వరకు తగ్గించారు. మరోవైపు ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్నవారు మాత్రం తమ పర్యటనలను రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకుంటున్నారు. బుకింగ్‌లను రద్దు చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో వాయిదా వేసుకుంటున్నారు. కానీ కొత్తగా బుకింగ్‌లు మాత్రం కావడం లేదు. అన్ని ట్రావెల్స్ సంస్థల్లో మాల్దీవులకు బుకింగ్‌లు పూర్తిగా స్తంభించాయి. -
పర్యాటకంలో ‘పీపీపీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అపార పర్యాటక వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా పర్యాటక సామర్థ్యం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా సర్వే చేసింది. వీటిల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పర్యాటక సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత అడ్వెంచర్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో పర్యాటక అనుభూతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రఖ్యాత హోటల్ రంగ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నది. ‘అడ్వెంచర్’కు కేరాఫ్ గండికోట వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాంతాన్ని ఎకో, అడ్వెంచర్ టూరిజానికి చిరునామాగా మార్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటలో ఇప్పటికే అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎర్రమల కొండలను చీలుస్తూ వేగంగా ప్రవహించే పెన్నానదిలో బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చనుంది. వీటితో పాటు అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ త్వరలో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. కృష్ణానదిపై ‘రోప్ వే’ విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ప్రాజెక్టును ప్రతిపాదించింది. విజయవాడలోని బెరంపార్కు నుంచి భవానీద్విపంలోకి కృష్ణా నదిపై 1.2 కిలోమీటర్ల ఏరియల్ పాసింజర్ రోప్‌వేను నిర్మించనుంది. దీంతో రాష్ట్రంలో ఆరుచోట్ల పాటు సీప్లేన్, మరో ఫైవ్‌స్టార్‌హోటల్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కన్వెక్షన్ సెంటర్‌తో కూడిన హోటల్ నిర్మాణం, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం బీచ్‌లో హోటల్ సౌకర్యంతో కూడిన బీచ్ రిసార్టు, నంద్యాల జిల్లాలో వెల్నెస్ టూరిజం, వేసైడ్ ఎమినిటీస్ కల్పనకు టెండర్లు ఆహ్వానించింది. -
ఆర్నెల్లలో అందుబాటులోకి రానున్న ప్రాజెక్టులు
-
మాల్దీవుల బాయ్‌కాట్‌కు పిలుపు
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవ్స్–ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపిచ్చింది. భారతప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు సహించబోమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇందుకు నిరసనగా మాల్దీవ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్‌ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. ఇదీ చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. -
రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా..
కొవిడ్ వల్ల కుదేలైన భారత పర్యాటకం తిరిగి పుంజుకొంటోంది. ప్రపంచ గమనానికి అనుగుణంగా పర్యాటక రంగంలో మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కొత్త వ్యాపార నమూనాలను చేపడుతున్నారు. సామాన్య ప్రజలు పర్యాటకం నుంచి గరిష్ఠ లబ్ధి పొందగలిగేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) గతంలోనే పిలుపిచ్చింది. సుందర ప్రదేశాలు, పుణ్య స్థలాలకు భారత్‌లో కొదవలేదు. ఆధునిక కాలంలో మెడికల్ టూరిజం, సాహస పర్యాటకం, సముద్ర విహారం, పర్యావరణ పర్యాటకం ఊపందుకొంటున్నాయి. దాంతోపాటు తాజాగా రివర్ టూరిజంను అభివృద్ధి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. రివర్ క్రూజ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి రూ.45 వేల కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోల్‌కతాలో జరిగిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) సమావేశంలో ఈ మేరకు ప్రకటన విడుదుల చేశారు. రూ.45 వేలకోట్లలో 2047 నాటికి క్రూజ్ వెసెల్స్ కోసం రూ.35వేల కోట్లు, క్రూజ్ టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మరో రూ.10వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి: హౌతీ అటాక్స్.. ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న నౌకలు! షిప్పింగ్ ఓడరేవుల మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పరిశ్రమల ప్రముఖులను కలిసి అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రివర్ క్రూజ్ టూరిజంను ఎనిమిది నుంచి 26 జలమార్గాలకు విస్తరించనున్నారు. రాత్రి బసలతో కూడిన క్రూజ్ సర్క్యూట్లను 17 నుంచి 80కి పెంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
India-Maldives Row: ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే!
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమూ చేపట్టారు. ఈ అంశంపై తాజాగా ఇజ్రాయెల్ స్పందించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్లో #ExploreIndianIslands ట్యాగ్‌తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది. అద్భుతమైన ఆకర్షణ కలిగిన లక్షద్వీప్ దీవులను సందర్శించాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. డీశాలినేషన్ కార్యక్రమం.. లక్షదీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. డీశాలినేషన్ (నీటిని శుభ్రపరిచే ప్రక్రియ) ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత ఏడాది లక్షదీవుల్లో ఇజ్రాయెల్ నిపుణులు పరిశీలించారు. మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నెలకొన్న వేళ డీశాలినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. We were in #Lakshadweep last year upon the federal government's request to initiate the desalination program. Israel is ready to commence working on this project tomorrow. For those who are yet to witness the pristine and majestic underwater beauty of #lakshadweepislands, here… pic.twitter.com/bmfDWdFMEq — Israel in India (@IsraelinIndia) January 8, 2024 ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. ఇదీ చదవండిL: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు -
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు!
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్ -
భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు
మాలె: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు నేడు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్
మాలె: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ విరుచుకుపడ్డారు. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ..? అని ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు. 'భవిష్యత్తులో లక్షద్వీప్ కచ్చితంగా పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపారు. లక్షద్వీప్ ప్రజలు ఎల్లప్పుడూ పర్యాటక కోణంలో ఉండాలని కోరుకునే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రభుత్వం టూరిజం కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని మేము కోరుకున్నాను. దీంతో యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. దానితో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?' అని ఆయన ప్రశ్నించారు. ఇదీ జరిగింది..! ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీంతో మాల్దీవులు ఆ మంత్రులను పదవి నుంచి తప్పించింది. ఢిల్లీలో మాల్దీవుల హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. #WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block. He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw — ANI (@ANI) January 8, 2024 మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. బైకాట్ మాల్దీవులు.. ఈ వివాదంపై నెటిజన్లు ఫైరయ్యారు. మాల్దీవుల పర్యాటకాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినదించారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును సెలబ్రెటీలు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. దిద్దుబాటు చర్యలు ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం కూడా స్పందించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మంత్రులను పదవి నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ వివాదం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు -
మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంతత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్ వేటు వేయటం గమనార్హం. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బోమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం తీవ్రంగా ఖండిచారు. ‘భారత్‌పై మాల్దీవులు దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం. కానీ, వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులులో ఎన్నోసార్లు పర్యటించాను. అయితే ఇటువంటి సమయంలో భారత్‌లోని దీవులను పర్యటిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం’ అని బాలీవుడ్ నటుడు ఆక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘చాలా పరిశుభ్రమై లక్ష్య ద్వీప్ బీచ్‌ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం’ అని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇక.. వీరితోపాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం -
మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని పేర్కొంది. ప్రభుత్వ హోదాలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేసింది. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు. ఖండించిన మాజీ అధ్యక్షుడు.. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆమె ఉపయోగించిన భాష భయంకరమైనదని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో భారత్ మంచి మిత్రుడని అన్నారు. "ప్రధాని మోదీపై మంత్రి మరియం షియునా భయంకరమైన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని భారతదేశానికి స్పష్టమైన హామీ ఇవ్వాలి" అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అన్నారు. ఇదీ చదవండి: ‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్ పరిస్థితి ఏంటి?’ -
లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్.. పనిచేస్తున్న పర్యాటక దేశ వెబ్సైట్లు
మాలె: మాల్దీవులకు చెందిన ప్రభుత్వ ప్రధాన వెబ్సైట్లు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. సాంకేతిక సమస్యతో శనివారం రాత్రి కొంత సమయం పాటు పనిచేయకుండా పోయిన మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, టూరిజం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లను కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు. ప్రభుత్వ ప్రధాన వెబ్సైట్లు సాంకేతిక సమస్య తలెత్తి కొంత సేపు డౌన్ అయ్యాయని దేశ ప్రెసిడెంట్ ఆఫీసు ఎక్స్‌లో పోస్టు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఎస్ఐటీ) వెబ్సైట్ల పూర్తిస్థాయి పునరుద్ధరణ కోసం పనిచేస్తోందని ప్రెసిడెంట్ ఆఫీసు తెలిపింది. ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నామని ప్రకటించింది. మరోపక్క ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఇటీవల సందర్శించిన తర్వాత ఆయన ఫొటోలపై మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ఎక్స్‌లో చేసిన పోస్టులు దుమారం రేపాయి. రమీజ్ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌లో లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్‌కు వెళ్లాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఈ వివాదానికి మాల్దీవుల వెబ్సైట్లు డౌన్ అవడానికి సంబంధం లేదని తెలుస్తోంది. Please note that the President’s Office website is currently facing an unexpected technical disruption. NCIT and other relevant entities are actively working on resolving this promptly. We apologise for any inconvenience caused. Thank you for your understanding and patience. pic.twitter.com/jUOopsQTUs — The President's Office (@presidencymv) January 6, 2024 The move is great. However, the idea of competing with us is delusional. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. 🤷🏻♂️ https://t.co/AzWMkcxdcf — Zahid Rameez (@xahidcreator) January 5, 2024 ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం -
విశాఖ టు సింగపూర్
విశాఖ సిటీ: ప్రపంచ పర్యాటక పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించేలా అంతర్జాతీయ క్రూయిజ్ పర్యాటకం మార్చిలో ప్రారంభమవుతుందని విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టు ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టు అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పోర్టు ప్రగతిని వివరించారు. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం ద్వారా విశాఖ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్‌కు క్రూయిజ్ నడిపేందుకు లిట్టోరల్ క్రూయిల్ లిమిటెడ్ సంస్థలో ఎంవోయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవులకు క్రూయిజ్ సర్విసులు నిర్వహించేందుకు లిట్టోరల్ సంస్థ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ నుంచి థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా లక్ష్యం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో 74 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31వ తేదీ నాటికి 60 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా..వచ్చే మార్చి నాటికి పోర్టు చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 80 మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కేవలం ఆదాయార్జనపైనే కాకుండా..జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ.. ఆధునికీకరణ, యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తూ.. నాణ్యతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కార్బన్ రహిత పోర్టుగా.. విశాఖ పోర్టును కార్బన్ రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోనే కేవలం సోలార్ పవర్లో నిర్వహిస్తున్న ఏకైక పోర్టుగా గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌తో విద్యుత్ అవసరాలలో స్వయం సంమృద్ధిని సాధించగా..మరో 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ స్థాయిలో 5.65 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి ♦ శీఘ్ర సరకు రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధిపై దృష్టి ♦ ప్రస్తుతం విశాఖ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా 43 శాతం, ♦ రైలు ద్వారా 26 శాతం, పైప్‌లైన్ ద్వారా 21 శాతం, ♦ కన్వేయర్ల ద్వారా 10 శాతం సరకు రవాణా ♦ రైలు ద్వారా 60 శాతం రవాణా చేయాలన్న లక్ష్యంతో విద్యుత్‌లైన్లతో రైలు మార్గం అభివృద్ధి ♦ ఆటంకం లేకుండా పోర్టు నుంచి రోడ్డు మార్గాల ద్వారా సరకు రవాణాకు రూ.501.65 కోట్లతో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రోడ్డును 10 లైన్లకు విస్తరణ ♦ 20 శాతం సరకు రవాణాకు కోస్టల్ షిప్పింగ్‌కు చర్యలు 2030 నాటికి పూర్తి ల్యాండ్ లార్డ్ పోర్టుగా... ♦ వచ్చే ఐదేళ్లలో పీపీపీ టెర్మినల్స్ ద్వారానే మొత్తం సరకులో 75 శాతాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు ♦ 2030 చివరి నాటికి 100 శాతం కార్గో రవాణా పీపీపీ టెర్మినల్స్ ద్వారానే నిర్వహించాలని లక్ష్యంగా ♦ 2030 నాటికి విశాఖపట్నం పోర్టు పూర్తి ల్యాండ్ లార్జ్ పోర్టుగా మార్పు ♦ అసెట్ లైట్ మోడల్ విధానంలో పీపీపీ పద్ధతిలో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం ♦ డబ్ల్యూ క్యూ 7, 8 బెర్తులు ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6 బెర్త్ యంత్రీకరణ పనులు ♦ మరో బెర్త్ ఈక్యూ 6 యంత్రీకరణ పనులను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు రంగం సిద్దం ♦ ఒకవైపు పోర్టు అభివృద్ధిపైనే కాకుండా కాలుష్య నియంత్రణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి ♦ ఇందులో భాగంగా రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు జంక్షన్ నుంచి మారియట్ హోటల్ వరకు రోడ్డు అభివృద్ధికి పోర్టు బోర్డు అంగీకారం. ♦ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు -
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక నేడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్రపతి దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో దిగనున్నారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, మేడ్చల్ జిల్లా కలెక్టర్, రాచకొండ కమిషనర్ తదితరులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 20వ తేదీ న భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించను న్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
క్రూయిజ్ టూరిజానికి జాతీయ వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు జాతీయ వ్యూహానికి రూపకల్పన చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏడు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జాతీయ వ్యూహానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు. జాతీయ వ్యూహంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్క్యూట్ ఎనేబుల్మెంట్, మార్కెట్ డెవలప్మెంట్, సులభతర వాణిజ్యం, టెర్మినల్ చుట్టూ ఇంటిగ్రేటెడ్ టూరిజం, పెట్టుబడులను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత నిర్మాణం, పరిపాలన మొదలైన అంశాలు క్రూయిజ్ టూరిజానికి ప్రధాన స్తంభాలుగా గుర్తించినట్టు తెలిపారు. విశాఖపట్నంలో క్రూయిజ్ కమ్ కోస్టల్ కార్గో టెర్మినల్ ప్రారంభమైందని వెల్లడించారు. కేబుల్ టీవీ చట్టం స్థానంలో బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, స్వీయ నియంత్రణ ఆవశ్యకత దృష్ట్యా ప్రస్తుతం ఉన్న కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నియంత్రణ చట్టం–1995 స్థానంలో బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు–2023ని తీసుకువస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తూర్పు కనుమల్లో సర్వే అవసరం లేదు దేశంలోని అడవుల విస్తీర్ణం, అటవీ భూముల కోతపై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రెండేళ్లకోసారి సర్వే చేస్తోందని.. అందువల్ల తూర్పు కనుమల్లో అటవీ భూముల కోతపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వర్చువల్ కోర్టు అమలులో లేదు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి వర్చువల్ కోర్టు అమలులో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వర్చువల్ కోర్టులను స్థానిక హైకోర్టులతో సంప్రదింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని.. ఇందులో కేంద్రానికి నేరుగా ప్రమేయం ఉండదని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 288 బీచ్‌ల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తీర ప్రాంతంలో 288 బీచ్‌ల అభివృద్ధికి, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్–2019లో చేర్చడానికి ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పంపినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గండికోట, అరకు–లంబసింగి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి స్వదేశీ దర్శన్–2.0లో చేర్చినట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు బీద మస్తానరావు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. -
అంతరిక్ష పర్యాటకం! అక్కడే విందు విలాసం..!
అంతరిక్ష పర్యాటకం ఇటీవలి కాలంలోనే మొదలైన ధోరణి. సంపన్న పర్యాటకులను భూమికి సుదూరంగా వ్యోమసీమలో విహారయాత్రలకు తీసుకుపోయేందుకు పలు అంతరిక్ష పర్యాటక సంస్థలు పోటాపోటీగా విలాసాలను కల్పిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన అంతరిక్ష పర్యాటక సంస్థ ‘జెఫాల్టో’ అంతరిక్ష పర్యాటకుల కోసం వ్యోమసీమలో విందువిలాసాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘జెఫాల్టో’ సంస్థ తన పర్యాటకులను బెలూన్ ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకుపోనుంది. ఇది భూమికి 25 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించనుంది. అంతరిక్షంలోకి చేరుకోగానే, బెలూన్‌లోనే పర్యాటకులకు విందు ఏర్పాటు చేయనుంది. పర్యాటకులు అంతరిక్షం నుంచి భూమిని తిలకిస్తూ విందు ఆరగించవచ్చు. తొలుత ఈ యాత్రను 2025లో ప్రారంభించాలని తలపెట్టినా, పర్యాటకుల నుంచి స్పందన బాగుండటంతో 2024 చివర్లోనే ఈ యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ‘జెఫాల్టో’ తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు యాత్రికులను అంతరిక్షానికి తీసుకుపోవడానికి బుకింగ్‌లు ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష విహారయాత్రలు చేపట్టిన సంస్థలేవీ తమ యాత్రికులకు అంతరిక్షంలో విందువిలాసాలను కల్పించలేదు. ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న తొలి సంస్థగా ‘జెఫాల్టో’ రికార్డులకెక్కనుంది. ఈ యాత్రకు వెళ్లడానికి టికెట్టు ధర 1.20 లక్షల యూరోలు (రూ.1.07 కోట్లు) మాత్రమే! (చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !) -
TS: టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టూరిజం ఎండి మనోహర్‌ను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట తిరుమలకు వెళ్లిన మనోహర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు తీసుకుంది. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ అధికారులు ప్రొటోకాల్ పాటించనవసరం లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం ఈసీఐకి సీఈవో వికాస్ రాజు నివేదిక పంపారు. ఈ రిపోర్ట్ ఆధారంగా మనోహర్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. -
ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు గెలుపొందిన కేరళ టూరిజం
కేరళ రాష్ట్రంలోని పర్యాటక శాఖకు ప్రత్యేకస్థానం ఉంది. సమష్టిగా పనిచేసి ఏకంగా ప్రపంచ అవార్డులు సొంతం చేసుకుంటుంది. అక్కడి ప్రజలు, ప్రభుత్వ విధానంలో మరింత స్ఫూర్తి నింపుతుంది. ఓ జీవన గమనంలో ఉండేంతటి ఆశయాలూ, సవాళ్లూ, అన్నింటికన్నా మానవీయ కోణాలూ, స్థానిక ప్రజల ఆర్థిక ప్రమాణాలు... వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న కేరళ పర్యాటకు శాఖ ఆచరణీయం అవుతుంది. ఫలితంగా..రాష్ట్ర బాధ్యతాయుత టూరిజం మిషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికిగాను కేరళ ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు’ని కైవసం చేసుకుంది. నాటి భారతదేశం అంతటా అంటరానితనం ఉన్నా..కేరళలో ఆ దురాచారం మరీ ఎక్కువ. ఆ నేపథ్యంలోనే నారాయణగురు అనే ఆధ్యాత్మికవేత్త స్థానికంగా ఎన్నో సంఘసంస్కరణల్ని తీసుకొచ్చాడు. విద్యా సంస్థల్ని నెలకొల్పాడు. ఆయన ప్రభావంతో చైతన్యం పొందిన ఎందరో నేతలు అరవై ఏళ్ళలో అటు రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగానూ కేరళ పునర్వికాసానికి కారణమయ్యారు. వాళ్ళే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్టు పార్టీల్లో చేరారు. పాలన ఎవరిదైనా సరే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. అందరికీ సమాన విద్యావకాశాలతో 1980 నాటికే 91 శాతం అక్షరాస్యతని సాధించారు. ఇవన్నీ బాగానే ఉన్నా..ఆర్థికాభివృద్ధిలో మాత్రం ఆ రాష్ట్రానిది వెనకంజే. ఓ వైపు ఎత్తైన కొండలూ దట్టమైన అడవులూ, మరోవైపు సముద్రం, మంచినీటి కాలువలు వీటి మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ కాబట్టి కేరళలో భారీ పరిశ్రమల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. సుగంధద్రవ్యాల ఎగుమతి, చేపలు పట్టడం, ఆ పరిశ్రమకి కావాల్సిన తాళ్ళు పేనడం..ప్రజల ఉపాధికి ఇవే శరణ్యమయ్యాయి. చదువుకున్న యువతీయువకులు ఇతర దేశాలకు వలస వెళ్ళడం పెరిగింది. 1980 నాటి కేరళ పరిస్థితి ఇది. దాన్ని మార్చి..ఆర్థిక అభివృద్ధిని సాధించాలనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు వాళ్ళకి కనిపించిన ఏకైక అవకాశం పర్యటకం. నాటి నుంచి నేటి వరకు పర్యాటకం పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు గణనీయమైన ప్రయోజనాలను సమకూరుస్తున్నారు. దానికితోడు ప్రకృతిని, తరాలుగా వస్తున్న వారసత్వ సంపదను పరిరక్షించడంలో సహాయపడుతున్నారు. ఫలితంగా ఎన్నో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంటున్నారు. దాంతోపాటు ఆర్థికంగా పుంజుకుంటున్నారు. తాజాగా గెలుపొందిన గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్టనర్షిప్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం (ఐసీఆర్టీ), బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా సంస్థలను పర్యాటక కార్యకలాపాలకు అనుసంధానించారు. స్వదేశీ ఉత్పత్తులనే మార్కెటింగ్ చేశారు. అందుకు రాష్ట్ర మిషన్ సమ్మిళిత పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దాంతో అత్యంత విలువైన అవార్డును సొంతం చేసుకున్నారు. కేరళ టూరిజం ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి. 2019లో ఆదాయం: రూ.45,010.69 కోట్లు(కరోనా ముందు) 2020లో ఆదాయం: రూ.11వేలకోట్లు 2021లో ఆదాయం: రూ.12285 కోట్లు 2022లో ఆదాయం: రూ.35168 కోట్లు రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం: 10 శాతం 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య: 1.83 కోట్లు 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు: 12లక్షల మంది 2019లో రాష్ట్ర విదేశీ మారకపు ఆదాయం: సుమారు రూ.10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ 2030’ ద్వారా మరింత ప్రోత్సహం అందిస్తుంది. ఈ మిషన్ ప్రకారం 2030 వరకు రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 12-20 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నారు. -
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఏడు దేశాలకు ఉచిత వీసాల జారీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి ఆమోదం తెలిపారు. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేయిషయా, థాయ్‌లాండ్ పౌరులకు ఉచితం వీసాలు జారీ ప్రతిపాదనను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితాలో అమెరికా లేకపోవడం గమనార్హం పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం తక్షణలమే అమల్లోకి వస్తుందని, మార్చి 31 వరకూ కొనసాగనుందని విదేశాంగమంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. శ్రీలంకకు పర్యాటకులను ఆకర్షించే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటకశాఖ పేర్కొంది. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు శ్రీలంక పేర్కొంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య 5 మిలియన్లకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించింది. కాగా ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశం ప్రకటించిన ఉచిత వీసాల జాబితాలో మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న రాష్ట్రాలు కావడం విశేషం. శ్రీలకం నిర్ణయంతో ఆయా దేశాలకు చెందిన పర్యాటకులకు వీసా ఖర్చు, సమయం తగ్గనుంది. చదవండి: రావణుడి వైభోగం ఎంత.. అవశేషాలు ఎక్కడ ఉన్నాయి Cabinet approves issuing of free visas to India, China, Russia, Malaysia, Japan, Indonesia & Thailand with immediate effect as a pilot project till 31 March - — M U M Ali Sabry (@alisabrypc) October 24, 2023 -
ఆ మేరకే సీఆర్ జెడ్ నుంచి అనుమతులు
-
‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడీఓపీ జాతీయ అవార్డు–2023కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 25నుంచి జూలై 31 మధ్య దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి 14 ఉత్పత్తులకుచోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా బృందం (జాతీయ స్థాయి టీమ్) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 14 ఉత్పత్తులు ఇవే.. రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు (శ్రీకాకుళం), బొబ్బిలి వీణ (విజయనగరం), అరకు కాఫీ (ఏఎస్ఆర్), సముద్ర రొయ్యలు (విశాఖ), పులగుర్త చొక్కాలు, చీరలు (తూర్పుగోదావరి), ఉప్పాడ జాందానీ చీరలు (కాకినాడ), కొబ్బరి, కొబ్బరి పీచు (అంబేడ్కర్ కోనసీమ), మంగళగిరి చేనేత చీరలు (గుంటూరు), పెద్ద రొయ్యలు (బాపట్ల), ఉదయగిరి చెక్క కత్తిపీట (నెల్లూరు), చేనేత సిల్క్ చీరలు (కర్నూలు), మదనపల్లె సిల్క్ చీరలు (అన్నమయ్య), సిల్క్ చీరలు (శ్రీ సత్యసాయి), వెంకటగిరి చీరలు (తిరుపతి) ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా తరఫున ఆరాధన, హరిప్రీత్‌సింగ్, నమీర అహ్మద్, రాబిన్ ఆర్ చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజులపాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవార్డుకు ఎంపికైతే మంచి మార్కెటింగ్ వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితీసి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించేలా అవార్డులు ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 24 జిల్లాల్లో ప్రత్యేకత సంతరించుకున్న 38 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి ఓడీఓపీ జాతీయ అవార్డుకు దరఖాస్తు చేశాం. ఏపీ నుంచి 14 ఉత్పత్తులను తుది పరిశీలనకు ఎంపిక చేయగా.. వాటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉండటం గొప్ప విషయం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటికి మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. – కె.సునీత, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం(నేడు) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమా చారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. -
ఆ అభిమానం మరువలేనిది
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రవాస భారతీయులు చూపుతున్న అభిమానానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్లరూపంలో కురిపించాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సంజయ్ భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం అట్లాంటాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మోదీపై మీరు చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. మోదీ 9 ఏళ్ల పాలన అవినీతికి తావు లేకుండా కొనసాగుతోంది. అభివృద్ధిలో భారత్ ప్రపంచదేశాల్లో అగ్రగామిగా నిలవాలంటే మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీరంతా సమయం తీసుకుని ఎన్నికల సమయంలో భారత్ రండి. మోదీ తరఫున ప్రచారం చేయడంతోపాటు ఓట్లు వేయాలి’అని కోరారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్ కోరారు. -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్‌లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్‌లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్‌లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్‌ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
Sheybarah Resort దుబాయ్ మరో అద్భుత ఆవిష్కారానికి నాంది పలుకుతోంది. సౌదీ అరేబియాలోని మునుపెన్నడూ చూడని విధంగా ఒక లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ హోటల్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సౌదీకి చెందిన రెడ్ సీ గ్లోబల్ (RSG) సంస్థ విడుదల చేసింది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెరిచేందుకు సిద్ధంగా ఉంది. అలాగే మెగా-ప్రాజెక్ట్ ది రెడ్ సీలో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించింది. హైపర్-లగ్జరీ రిసార్ట్ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది. ఆధునిక టచ్‌తో పాటు, రిసార్ట్ మడ అడవులు, ఎడారి వృక్షజాలం, సహజమైన పగడపు దిబ్బలపై రిఫ్లెక్టివ్ డిజైన్ విజువల్ అప్పీల్‌తో విభిన్న పర్యావరణ అనుకూలంగా ఇది సిద్ధమవుతోంది. ఈ రిసార్ట్‌లో, పగడపు దిబ్బల పైన ఉండేలా LEED-ప్లాటినం భవనం నిర్మిస్తోంది. "ఏరియల్ అకామడేషన్ పాడ్స్" అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్ర స్వర్గంలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయట.పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్‌తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఉపయోగిస్తోంది. ఆకాశం, సముద్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ షేబరా ఆర్బ్స్ నీటిపై తేలుతాయి. అంతేకాదు, షేబరా హోటల్ 73 విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్‌లైన్ క్రింద ఉన్న పగడపు దిబ్బలుచూస్తే మతిపోవాల్సిందే. ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనున్నాయి. రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల స్టెయిన్లెస్-స్టీల్ ఆర్బ్లతో చాలాయూనీక్గా రూపొందించారు. నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్ పూర్తిగా అందుబాటులోకి రావాలని, ఈ మెరైన్ ప్యారడైజ్ అందాలను ఆస్వాదించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫోటోలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అడ్రస్ బీచ్ రిసార్ట్, ఆఫీస్ ఆఫ్ ది ఫ్యూచర్, సిటీ వాక్, మరిన్నింటితో సహా దుబాయ్‌లోని కొన్ని ఐకానిక్ ప్రాజెక్ట్‌లను అందించిన ఘనత కిల్లా డిజైన్ సొంతం. نفخر بأن جزيرة #أمهات في #وجهة_البحر_الأحمر سترحب بطلائع زوارها قريباً! لقد وصلت نسبة الإنجاز في تطوير منتجع "سانت ريجيس البحر الأحمر" لـ 93%، فيما وصلت جاهزية منتجع "نجومه، ريتز كارلتون ريزيرف" لـ 87.% كم هي نسبة حماسَك أنت؟ pic.twitter.com/Fyg8MCMTzs — البحر الأحمر الدولية (@RedSeaGlobalAR) August 14, 2023 /> -
హార్బర్లకు సమాంతరంగా ఆహ్లాదం
సాక్షి, అమరావతి : ఫిషింగ్ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వాటి పక్కనే రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే ఫిషింగ్ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది. జువ్వలదిన్నెలో 90 శాతం పనులు పూర్తి సుమారు రూ.1523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో ఈ సెప్టెంబర్ నాటికి సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా 5,900 బోట్లు నిలుపుకొనే అవకాశం రావడంతో పాటు ఏటా 2,37,350 టన్నుల చేపలను పడతారని అంచనా. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 555 మత్స్యకార గ్రామాల్లోని 6.3 లక్షల మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. -
సీఎం పర్యటనతో కరెంటు తీగలకు లింకేంటి!
సాక్ణి, అమరావతి: రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విద్యుత్ తీగలకు సీఎం పర్యటనతో లింకు పెట్టి ఈనాడులో ఆదివారం ప్రచురించిన కథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వాస్తవాలు దాచి తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాల్లో 85 శాతానికి పైగా మరణాలకు పంపిణీ వ్యవస్థలోని లోపాలే కారణమని రాసిన వార్తలో నిజం లేదంటున్న సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు’ ఇటీవల అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన దృష్ట్యా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలను ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. డిస్కంలో ప్రతి విద్యుత్ ఉద్యోగికి సరైన శిక్షణ ద్వారా అవగాహన కల్పిం చి, భద్రతా పరికరాలు అందించి, ఉద్యోగుల ప్రమాదాలు తగ్గించాం. ఎలక్ట్రికల్ షార్ట్ పోల్స్, లాంగ్ స్పాన్ ఉన్న చోట్ల మిడిల్ పోల్స్ ఏర్పాటు, ఒరిగిన స్తంబాలను సరి చేయడం, విద్యుత్ నియంత్రికల ఎత్తు పెంచడం, ఎర్తింగ్ ఏర్పాటు వంటివి క్రమం తప్పకుండా చేస్తున్నాం.సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ, లక్షలాది విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులను చేపడుతున్నాం. నగరాలు, పట్టణాల్లో ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, వ్యాపార ప్రాంతాలు, ఇరుకు రోడ్లలో 30 ఏళ్లు దాటిన పోల్స్ , కండక్టర్స్ మార్చడం ద్వారా విద్యుత్ ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ శివాలయం వీధిలో కండక్టర్ లేని ఎంసీసీబీ బాక్స్‌తో కూడిన ఓవర్ హెడ్ కేబుల్ ఏర్పాటు చేసే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. వర్షాల వల్ల పెదవేగి మండలం పినకమిడి పొలాల్లో నీరు నిలిచిన కారణంగా ఒరిగిపోయిన స్తంభాలను సరిచేశాం. విశాఖపట్నం పాత పోస్టాఫీస్ ప్రాంతంలో లక్ష్మి థియేటర్ దగ్గర వాడవీధిలో పోల్కి పోల్కి మధ్యలో ఉన్న బేర్ కండక్టర్ తొలగించి ఎల్టీ ఏబీ కేబుల్ వైరు అమర్చాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇదో నిరంతర ప్రక్రియ. ఈ చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ‘కండక్టర్లు మార్చాం’ గతేడాది నవంబర్ నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎల్టీ లైన్ కండక్టర్‌ను 2,403 కిలోమీటర్లు, 11 కేవీ లైన్ కండక్టర్ 2,256 కిలోమీటర్లు, 33 కేవీ లైన్ కండక్టర్ 256 కిలోమీటర్లు, ఎల్టీ కేబుల్ 1,089 కిలోమీటర్ల మేర మార్చాం. ఒరిగిన ఎల్టీ విద్యుత్ స్తంభాలు 6,873, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 7,498, 33 కేవీ విద్యుత్ స్తంభాలు 3,254 కొత్తవి వేశాం. విద్యుత్ లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎల్టీ లైన్ల పరిధిలో 3,317 చోట్ల, 11 కేవీ లైన్ల పరిధిలో 3,383 చోట్ల, 33 కేవీ లైన్ల పరిధిలో 860 చోట్ల ప్రమాదాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేశాం. రోడ్డు క్రాసింగ్‌ల వద్ద ఎల్టీ లైన్ పరిధిలో 19,068, 11 కేవీ లైన్ల పరిధిలో 10,763, 33 కేవీ లైన్ల పరిధిలో 954 విద్యుత్ స్తంభాలను సరిచేశాం. సబ్స్టేషన్ల పరిధిలో ప్రొటెక్షన్‌ను పటిష్టం చేయడం ద్వారా లైన్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా వెంటనే ట్రిప్ అయ్యేలా ఏర్పాటు చేశాం. ఈపీడీసీఎల్ పరిధిలో అన్ని విద్యుత్ ఉప కేంద్రాలకు, 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లు 2020 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సర్వే చేసి సరిదిద్దాం. ఈ క్రమంలో 38,850 వాలిన విద్యుత్ స్తంభాలను సరిచేసి వేలాడే వైర్ల మధ్యలో 7,454 మధ్యస్థ స్తంబాలను వేశాం. 31,324 విరిగిపోయిన స్తంభాలను మార్చి 2,557 కిలోమీటర్ల మేర వేలాడుతున్న వైర్లను సరిచేశాం. ప్రయాస్ కొత్తగా చెప్పిందేమీ లేదు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం రైతులకు ఒక వరం. దీనివల్ల రైతులకు విద్యుత్ ప్రమాదాలు తగ్గడమే కాకుండా చేలకు నీటిని కావలసిన విధంగా వాడుకుని పంటలు సంవృద్ధిగా పండిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించిన రోజే రైతులు, మోటార్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరికరాలను ప్రభుత్వమే తన ఖర్చుతో పెట్టాలని నిర్ణయించింది. మినీయేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ), ఎర్త్ పైప్ పెట్టడం వల్ల రైతుకు, మోటార్‌కు, ఎలక్ట్రికల్ సామగ్రికి భద్రత ఉంటుంది. వోల్టేజీ హెచ్చుతగ్గులను కెపాసిటర్ నివారిస్తూ మోటార్ సామర్థ్యం పెంచుతుంది. విద్యుత్ వృథా కాకుండా నివారిస్తుంది. ఇవన్నీ సీఎం జగన్ ఎప్పుడో ఆలోచించారు. ఇక్కడ ప్రయాస్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ‘తరచూ శిక్షణ ఇస్తున్నాం’ డిస్కంల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు తరచుగా భద్రత, లైన్ మరమ్మతులపై శిక్షణ ఇస్తున్నాం. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, లైన్లు దెబ్బతినడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించి వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, దెబ్బతినడం, లైన్లు వేలాడుతుండటం వంటి సమస్యలను గుర్తిస్తే వినియోగదారులు వెంటనే 1912 కాల్ సెంటర్‌కు సమాచారం అందిస్తే వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. -
'363 బీచ్‌లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనతో తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈనెల 7 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనుంది. ఈ బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా.. ఆ దేశంలో భారత అధికారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డునున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్, మన్యంకొండ వద్ద తొలిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ వాటర్ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. -
పర్యాటక శాఖపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
-
ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
ఈ యాప్ మహిళల కోసమే.. వాళ్లే ఆపరేటర్లు, గైడ్లు కూడా!
ఇంతవరకు ఎన్నో యాప్‌లు చూశాం. కానీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఉండే యాప్‌లు గురించి వినలేదు కదా. మహిళలు మాత్రమే ధైర్యంగా తమకి నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేలా భద్రతతో కూడిన యాప్‌లు ఇంతవరకు రాలేదు. టూరీజంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారు తమ స్నేహితులతో పూర్తి భద్రతతో వెళ్లేలా సరికొత్త యాప్‌ని రంగంలోకి తీసుకువచ్చింది ఓ రాష్ట్రం. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో వారికి టూరిస్టు గైడ్‌గా మహిళలే ఉంటారు. ఇదంతా ఎక్కడ? ఆ యాప్ ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే.. వివరాల్లోకెళ్తే..ఒంటరిగా ఉండే మహిళలు లేదా కేవలం మహిళలు తమ స్నేహితులతో టూర్‌కి వెళ్లాలనుకున్నా.. ఏ మాత్రం భయపడకుండా భద్రంగా వెళ్లేందుకు ఓ సరికొత్త యాప్‌ని తీసుకొచ్చింది కేరళ రాష్ట్రం. ఈ మేరకు కేరళ రాష్ట్రం సందర్శన కోసం మహిళా స్నేహపూర్వక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వారికి టూరిస్ట్ ఆపరేటర్లు, గైడ్లుగా మహిళలే ఉండేలా తగిన సౌకర్యాలతో కూడిన మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది కేరళ. అందులో భాగంగానే ఫ్రెండ్లీ టూరిజం విమెన్ ప్రాజెక్టును నోడల్ ఏజెన్సీ అయిన స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ చేపట్టి.. అందుకోసం ఓ యాప్‌ను కూడా సిద్దం చేయమని కోరింది . ఈ యాప్‌లో సామాజిక సాంస్కతిక అంశాలతో సహా అన్ని స్థాన నిర్ధిష్ట సమాచారం, చిత్రాలు ఉంటాయి. అలాగే కేరళలోని వివిధ ప్రాంతాల విశేషాల గురించి ఆ యాప్‌లోనే ఉంటుంది. రాష్ట్రంలో మహిళా పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వ విధాన ప్రాధాన్యత అని పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు సొంతంగా లేదా వ్యక్తిగతంగా గుంపులుగా దూర ప్రాంతాలకు వెళ్లడం ఓ ట్రెండ్‌గా మారిన ప్రంపంచంలో మనం జీవిస్తున్నాం అన్నారు. ఈ యాప్ సాయంతో మహిళలు హ్యాపీగా పర్యటించిలే గాకుండా వారికెలాంటి ఇబ్బంది తలెత్తదని మంత్రి రియాస్ ధీమగా చెప్పారు. సుమారు 1.5 లక్షల మంది మహిళలు.. ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మహిళల జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం కాన్సెప్ట్‌కు అనుగుణంగా గతేడాది అక్టోబర్‌లో రియాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చొరవ తోపాటు పర్యాటక శాఖ అనేక రకాల మహిళా స్నేహపూర్వక పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలను విడుదల చేస్తోంది. సుమారు 1.5 లక్షల మంది మహిళలు పాల్గొనే లక్ష్యంతో యూఎన్ మహిళలతో సహా వివిధ సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యాటక రంగంలో సుమారు 10 వేల మంది మహిళా వెంచర్ల తోసహా దాదాపు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. యాప్‌లో ఉన్న సౌలభ్యం.. ఈ యాప్‌లో మహిళలకు అనుకూలమైన పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలు, రిసార్ట్లు, హోటళ్లు, మహిళా సంస్థలు, గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్లు, మహిళా టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు హోమ్ స్టేలు, మహిళా టూర్ గైడ్ల తదితర అన్ని వివరాలు ఉంటాయి. అంతేగాదు ఈ యాప్‌లో మహిళల నేతృత్వంలోని హస్తకళలు, సావనీర్ ఉత్పత్తి, విక్రయ యూనిట్లు, విశ్రాంతి గదులు, క్యాంపింగ్ సైట్లు, లైసెన్స్ హౌస్బోట్లు, కారవాన్ పార్కులు, వివిధ ప్రదేశాలలో జాతి వంటకాల యూనిట్లు, పండుగలు, అనుభవపూర్వక సాహస ప్యాకేజీలు వంటి సౌకర్యాలు ఉంటాయి. యాప్‌లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేలా ఈ ఆర్టీ మిషన్ భారీగా కసరత్తు ప్రారంభించింది. ఆర్టీ మిషన్ చేపట్టిన ఫ్రెండ్లీ విమెన్ టూరిజం ప్రాజెక్టు కింద సుమారు 1800 మంది మహిళలు వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన మహిళలకి జూలై నుంచి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఉంటుంది. (చదవండి: అటు అండమాన్.. ఇటు దుబాయ్... ఎక్కడికి వెళ్లడం సులభం? ఎంత ఖర్చవుతుందంటే..) -
మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
ఆతిథ్య ఆంధ్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యాటకులకు ఆతిథ్య మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లకు పెట్టింది పేరైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్‌లతో పాటు దేశీయ సంస్థలైన గారిసన్, మేఫెయిర్ హోటళ్ల రాకతో సరికొత్త అనుభూతిని పంచనుంది. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో అతిథ్య రంగం విస్తరించనుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర పర్యాటకానికి సంబంధించి మొత్తం రూ.19,345 కోట్ల పెట్టుబడులతో 117 ఎంవోలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 51 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 45 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి వచ్చాయి. ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆతిథ్య రంగానికి చెందినవేనని అధి కా రులు తెలిపారు. 20 వరకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లు రాష్ట్రంలో రానున్నాయి. వీటి ద్వారా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.4949.41 కోట్ల పెట్టుబడులకు త్వరలో అన్ని అనుమతు లిచ్చి, పని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఒబెరాయ్ రూ.1,350 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్ప టికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు)లో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు వారాల్లోగా గండికోటలో కూడా హోటల్ నిర్మా ణానికి ఒప్పందాలు చేసుకుని జూలై చివరికి పను లు ప్రారంభించనుంది. అనంతరం రాజమండ్రి (పిచ్చుకలంక), హార్సిలీహిల్స్ ప్రాంతాల్లోనూ రిసార్ట్లు, కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయ నుంది. ఒబెరాయ్ సంస్థల ద్వారానే 10,900 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హయత్, తాజ్ గ్రూప్ ఐదు నక్షత్రాల హోటళ్లు తాజ్ సంస్థ విశాఖలో రూ.1050 కోట్లతో 60 ఎకరాల్లో లగ్జరీ రిసార్టులు నిర్మించనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ పరిశీలనలో ఉంది. తాజ్ నిర్మించే టెక్నాలజీ స్పేస్‌లో రెస్టారెంట్లు, షాపు లు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒ లింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ రానున్నాయి. హయత్ సంస్థ విశాఖ శిల్పారా మంలో రూ.200 కోట్లతో 3 ఎకరాల్లో, తిరుపతి శిల్పారామంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటి ద్వారా 5,100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడలో రూ.92.61 కోట్లతో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మించింది. ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనర సింహస్వామి ఆలయం వద్ద రూ.100 కోట్లతో స్పిరుచ్యువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ♦ ఏసీఈ అర్బన్ సంస్థ రూ.414 కోట్లతో 2,847 ఎకరాల్లో కాకినాడలో ఐదు నక్షత్రాల హోటల్‌తో పాటు కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి ♦ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ పేరూరులో రూ.218 కోట్లతో 5 ఎకరాల్లో, కడప శిల్పారామంలో 78.73 కోట్లతో రెండెకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లు..ఎకో–ఐఎస్ఎల్ఈ రిసార్ట్స్ సంస్థ అనంతగిరి (అరకు)లో రూ.243 కోట్లతో 43.1 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ ♦ గార్రిసన్ సంస్థ యండాడ (విశాఖ)లో రూ.122 కోట్లతో 3.87 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ – హోటల్ ♦ మైఫెయిర్ గ్రూప్ అన్నవరం (విశాఖ)లో రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో రిసార్టులు ♦ వైష్ణోవి వెర్సటైల్ వెంచర్స్ పేరూరులో రూ.125 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్ ♦ హిగ్గాని ఎంటర్ప్రైజెస్ విశాఖలో రూ.120 కోట్లతో టన్నెల్ అక్వేరియం – హోటల్ ♦ విశాఖ తెన్నేటి బీచ్‌లో ఎంవీ మా షిప్‌ను రూ.30 కోట్లతో షోర్ రిసార్టుగా తీర్చిదిద్ద ను న్నారు. శ్రీశైలంలో రూ.100 కోట్లతో రెండెకరాల్లో 3 నక్షత్రాల హోటల్, రూ.35.3 కోట్లతో రాయ చోటిలో రూ.45.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు రానున్నాయి. వీటికి డీపీఆర్‌లు సిద్ధంగా ఉండగా పీపీపీ గైడ్‌లైన్స్, అగ్రిమెంట్ పనులు వే గంగా పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తు న్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్న బాబు తెలిపారు. కాగా, ప్రభుత్వంతో ఆయా సంస్థలు కుదుర్చు కున్న ప్రతి ఒప్పందం అమలయ్యేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. -
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ
శ్రీనగర్: పాకిస్తాన్ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది. తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు. కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హర్తాళ్ పిలుపులు గత చరిత్ర కశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. -
జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన జవాబు
శ్రీనగర్: ఈ నెల 22–24 తేదీల మధ్య జి–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. జి–20కి సంబంధించిన ఏ విధమైన సమావేశాల్ని కూడా వివాదాస్పద ప్రాంతాల్లో జరపరాదని, అటువంటి సమావేశాలకు తాము హాజరుకాబోమని శుక్రవారం పేర్కొంది. దీనిపై భారత్ దీటుగా స్పందించింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు జరుకునే స్వేచ్ఛ మాకుంది. చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం అవసరం’అని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరు కారాదని టర్కీ ఇప్పటికే ప్రకటించగా, సౌదీ అరేబియా నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 100 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే, సుమారు 60 మంది హాజరవుతారని తాజాగా అంచనా వేస్తోంది. ఇలా ఉండగా, జి–20 సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ)ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చన్న అనుమానాల నేపథ్యంలో జి–20 సమావేశాల వేదిక, దాల్‌లేక్‌ను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. -
వీసా ప్రక్రియను సరళతరం చేయండి.. ప్రభుత్వానికి ఫిక్కీ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చే దిశగా వీసా ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేయాలని, యూజర్లకు సులభతరంగా ఉండేలా చూడాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ పేర్కొంది. అలాగే భారత్ వచ్చే టూరిస్టుల్లో భద్రతపరమైన ఆందోళనలను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ నాంగియా ఆండర్సన్‌తో కలిసి రూపొందించిన నివేదికలో ఫిక్కీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఈ రిపోర్టు ప్రకారం 2022 – 2027 మధ్య కాలంలో భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా 12 శాతం పెరగనుంది. ఇతరత్రా అవసరాలపై వెచ్చించగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, మధ్య తరగతి జనాభా వృద్ధి చెందుతుండటం, పర్యాటకానికి గమ్యస్థానంగా భారత్ గుర్తింపు పొందుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. మహమ్మారిపరమైన సవాళ్లు తలెత్తినప్పటికీ 2022లో భారత్‌కు 62 లక్షల మంది విదేశీ టూరిస్టులు వచ్చారు. ఇది 2021లో వచ్చిన 15.2 లక్షల మందితో పోలిస్తే దాదాపు 307 శాతం అధికం. 2022లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ట్రావెల్, టూరిజం రంగం వాటా 9.2 శాతంగా నిల్చింది. 4.46 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. పర్యాటకుల దృష్టికోణంలో భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అమలు చేయతగిన విధానాలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడగలదని నాంగియా ఆండర్సన్ మేనేజింగ్ పార్ట్నర్ సూరజ్ నాంగియా చెప్పారు. నివేదికలోని మరిన్ని అంశాలు .. ►వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. పర్యాటకం వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి. టెక్నాలజీని వినియోగించుకోవాలి. ►టూరిస్ట్ పోలీసుల సంఖ్యను పెంచడం ద్వారా పర్యాటకులకు భద్రతపరమైన భరోసా కల్పించాలి. టూరిస్టుల వేధింపులు, వారిపై నేరాలను కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ► భారత్‌లో ఆకర్షణీయమైన, విశిష్టమైన సాంస్కృతిక, సహజ సిద్ధ పర్యాటక స్థలాలు ఉన్నాయి. హెరిటేజ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నె స్ టూరిజం వంటివి ఆఫర్ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేయవచ్చు. ఇందుకోసం మార్కెటింగ్పరమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడం వంటి అంశాలు పరిశీలించవచ్చు. -
ఏపీ పర్యాటకం..ఈ అద్భుత ప్రాంతాలు చూశారా! (ఫొటోలు)
-
Andhra Pradesh: సాహస పర్యాటకంపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల, సాహస క్రీడల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వివిధ జిల్లాల్లో బోటింగ్‌కు అనువైన జల వనరులను, అడ్వెంచర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్‌కు వీలుండే ప్రాంతాలను గుర్తించింది. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించగా.. 50 ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే ఏపీటీడీసీ ఆయా సంస్థలతో ఏపీటీడీసీ పూర్తిస్థాయి అగ్రిమెంట్లు పూర్తి చేసుకోనుంది. అనంతరం సుమారు రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులతో జల, సాహస క్రీడల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇలా.. విశాఖపట్నం డివిజన్లో జోడుగుళ్లపాలెం, భీమిలి, సాగర్ నగర్, హిరమండలం డ్యామ్, శృంగవరపు కోట, తాండవ రిజర్వాయర్, పూడిమడక, కొండకర్ల ఆవ, మంగమారి పేట, యండాడ, శారదా రివర్, గోస్తనీ నది, కాకినాడ డివిజన్లో భూపతిపాలెం రిజర్వాయర్, హోప్ ఐలాండ్, పాలవెల్లి, అంతర్వేది, కర్నూలు డివిజన్లో సంగమేశ్వర, సుంకేసుల, గార్గేయపురం, చిన్న చెరువు, నెల్లూరు డివిజన్లో గుండ్లకమ్మ, ఏపూరపాలెం–చీరాల, కొత్తపట్నం బీచ్, పాపాయపాలెం, కొత్తకోడూరు, మైపాడు, నెల్లూరు ట్యాంక్, కడప డివిజన్లో పీర్ గైబుషా కోట, కర్నూలు డివిజన్లో ఒంటిమిట్ట, విజయవాడ డివిజన్లో హంసలదీవి, సూర్యలంక, అనుపు–నాగార్జున సాగర్, మోటుపల్లి బీచ్, రివెరా బీచ్ రిసార్ట్ ఫ్రంట్, రామాపురం–వేటపాలెం, తిరుపతి డివిజన్లో రాయలచెరువు, కడప డివిజన్లో బుక్కరాయ చెరువు (బుక్కరాయపట్నం), చిత్రావతి రివర్ (పుట్టపర్తి) ప్రాంతాల్లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అడ్వెంచర్, ఫన్ జోన్లు ఇలా.. విజయవాడ డివిజన్లోని బెరంపార్కు, ఎత్తిపోతల జలపాతం(పల్నాడు)లో ఫన్‌జోన్, గాలి బెలూన్ల గేమ్స్, కర్నూలు డివిజన్లోని శ్రీశైలం, విశాఖ డివిజన్ బొర్రా గుహల వద్ద వర్చువల్ క్రికెట్, 12డీ షోలు, బొర్రా గుహల ప్రాంతంలో స్కై సైకిల్, స్కై వాక్, బార్మా వంతెన, గాలికొండలో జిప్‌లైన్, కాకినాడ డివిజన్ దిండి, ద్వారకా తిరుమల, తిరుపతి డివిజన్ పులిగుండు, హార్సిలీ హిల్స్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలోని జింధగడ ట్రెక్కింగ్, నెల్లూరులోని నరసింహ కొండలో ప్రత్యేకంగా ట్రెక్కింగ్ సెంటర్లను ప్రవేశపెడుతున్నారు. -
హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు మే 11న ప్రత్యేక రైల్వే సేవలు ప్రారంభిస్తున్నట్టు సౌత్ స్టార్ రైల్ ప్రతినిధులు తెలిపారు. భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ‘సౌత్ స్టార్ రైల్’ నూతన రైల్వే సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా ‘సౌత్ స్టార్ రైల్’ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కశ్మీర్‌కు ప్రత్యేక రైల్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ రైలు కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ, ఈరోడ్, సేలం, ఎలహంక, పెరంబుదూర్ మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టూర్ ఆపరేటర్లను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ప్యాకేజీ వ్యవధి 12 రోజులని తెలిపారు. ఇందులో ప్రత్యేక సదుపాయాలతో పాటు ప్రయాణ బీమా, సైట్ సీయింగ్, భోజన వసతులు అందిస్తున్నామని రీజినల్ మేనేజర్ సంతోష్ వివరించారు. బుకింగ్ తదితర సమాచారం కోసం 7876101010 నంబర్ లేదా ఠీఠీఠీ.ట్చజీ ్టౌuటజీటఝ.ఛిౌఝలో సంప్రదించవచ్చని సూచించారు. -
అడ్వెంచర్ టూరిజానికి విస్తృత అవకాశాలు: కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సాహస పర్యాటకాని(అడ్వెంచర్ టూరిజం)కి విస్తృత అవకాశాలు ఉన్నా యని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి అనేక ప్రదేశాలున్నాయని తెలిపారు. ఆయా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి వినూత్న విధానాలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. రెండో పర్యాటక రంగ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో ‘సాహస పర్యాటకం’పై ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడ్వెంచర్ టూరిజానికి హిమాలయాలను మించిన ఉత్తమమైన ప్రదేశం మరొకటి ఉండదని, అందుకే ఈ సామర్థ్యాన్ని సద్వినియోగ పరుచుకునే దిశగా కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్, మౌంటనీరింగ్ వంటి వాటికి డిమాండ్ పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. పులుల సంరక్షణలో తెలంగాణ విఫలం పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో గొప్పలు మినహా క్షేత్రస్థాయిలో నిధులు అందడం లేదని, పులుల సంరక్షణకు రూ.2.2 కోట్లు కూడా కేటాయించక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. దేశంలో పులుల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి శనివారంతో యాభై ఏళ్లు పూర్తి కాగా ప్రపంచ అడవి పులుల సంఖ్యలో భారత్‌లోనే 70 శాతానికి పైగా పులులున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, పాఖల్, పోచారం, మంజీర, ప్రాణహిత వంటి వన్యప్రాణుల అభయారణ్యాలకు కేంద్రం రూ.30 కోట్లు ఇచి్చందని తెలిపారు. అనంతరం...కిషన్‌రెడ్డి అడ్వెంచర్ టూరిజంకు ఉన్న అవకాశాలపై వివిధ దేశాల ప్రతినిధులు ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. -
సాగర యాత్రకు సిద్ధం కండి
విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి ముస్తాబవుతోంది. పర్యాటక రంగంలో కీలకమైన క్రూయిజ్ సేవలందించేందుకు ఈసారి రెండు నౌకలుసిద్ధమవుతున్నాయి. సాగర జలాల్లో మూడు రోజులపాటు విహరిస్తూ.. విశాఖ నుంచి దక్షిణ భారత దేశంలోని పలు నగరాలకు సర్వీసులు నడిపేందుకు క్రూయిజ్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. మే నెల నుంచి ఎంఎస్సీ సంస్థ, జూన్ నుంచి కార్డిలియా సంస్థ సర్వీసులను ప్రారంభించనున్నాయి. మరోవైపు విశాఖపట్నం పోర్టులో నిర్మిస్తున్న క్రూయిజ్ టెర్మినల్ మే నాటికి అందుబాటులోకి రానుంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం తేడాది విశాఖ నుంచి చెన్నైకు సర్వీసులు నడిపిన ఎంప్రెస్ సంస్థకు చెందిన కార్డిలియా క్రూయిజ్ నౌక తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు మధురానుభూతిని అందించింది. ఇప్పుడు దాంతోపాటు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా లండన్, వెనిస్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు నడిపిస్తున్న ఎంఎస్సీ క్రూయిజ్ సంస్థ కూడా విశాఖ కేంద్రంగా సేవలకు సిద్ధమైంది. ఈ రెండు సంస్థల ప్రతినిధులు రెండు రోజుల క్రితం విశాఖపట్నం పోర్టు అధికారులతో సంప్రదింపులు జరిపారు. వీటికి అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. ఎంఎస్సీ క్రూయిజ్ మే నుంచి, కార్డిలియా నౌక జూన్ నుంచి సర్వీసులు నడపనుంది. ప్రతి మూడు రోజులకోసారి రోజు విడిచి రోజు నడిపించేలా పోర్టు అధికారులు వీటికి బెర్తులు అందించనున్నారు. ఒక్కో క్రూయిజ్ ఆరు నెలల పాటు విశాఖ నుంచి సర్వీసులు నడపనుంది. త్వరలోనే సర్వీసుల వివరాలను ఈ సంస్థలు ప్రకటించనున్నాయి. క్రూయిజ్లలో ఎన్నో సౌకర్యాలు ఈ క్రూయిజ్ నౌకలలో ప్రయాణించే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయి. ఒక్కోటి 11 అంతస్తులుండే ఈ భారీ నౌకల్లో ఒకేసారి 1,500 నుంచి 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు. వీటిలో ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్ షోలు ఉంటాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు ఉంటాయి. చురుగ్గా టెర్మినల్ నిర్మాణం విశాఖ పోర్టులోని గ్రీన్‌చానెల్‌లో రూ.72.26 కోట్లతో నిర్మిస్తున్న క్రూయిజ్ బెర్త్, టెర్మినల్ బిల్డింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మే నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా టెర్మినల్‌లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాధారణంగా బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఇక్కడ 330 మీటర్ల భారీ పొడవైన బెర్త్ నిర్మిస్తున్నారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్డ్ డెప్త్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ విశాలమైన బెర్త్ పైకి క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే కార్గో నౌకల్ని కూడా అనుమతిస్తారు. అంతర్జాతీయ పర్యాటకుల ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్ని నిర్మిస్తున్నారు. 2 వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్తోపాటు పరిపాలన భవనం, కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్వేస్, రెస్టారెంట్, లాంజ్‌లు, ఎంటర్టైన్మెంట్స్, షాపింగ్ మాల్స్, రెస్ట్‌రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి. గరిష్టంగా 2,500 మంది పర్యాటకులు రావొచ్చు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు నిరంతరాయంగా ఉండే అవకాశాలున్నాయని పోర్టు అధికారులు చెబుతున్నారు. -
గిరి సీమల్లో విదేశీ విరులు
సాక్షి, అమరావతి: ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి పరిసర ప్రాంతాల్లో విదేశీ పూల సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనలు ఫలించడంతో సంప్రదాయ పంటలు సాగు చేసే గిరిజనులకు పూల సాగుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా గిరి సీమల్లో పూలసాగు విస్తరణకు బాటలు పడ్డాయి. పూల వనాలను అగ్రి టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దడంతో గిరిజనులకు రెట్టింపు ఆదాయం వస్తోంది. పర్యాటకుల ద్వారా అదనపు ఆదాయం పూల వనాలను చూసేందుకు పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న టోకెన్ చార్జీల ద్వారా సీజన్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఈ ప్రాంత రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. నాణ్యమైన పూలు ఉత్పత్తి అవుతుండడంతో నర్సీపట్నం, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి హోల్‌సేల్ పూల వ్యాపారులు నేరుగా రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. పెట్టుబడులు పోను రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తోంది. పూల సాగుపై ఆసక్తి విదేశీ పూల రకాలు లంబసింగి పరిసర ప్రాంతాలు ఎంతో అనువైనవి. గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. పూల సాగుతో పాటు పర్యాటకం ద్వారా కూడా మంచి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. చట్టవిరుద్ధమైన పంటలను సాగు చేసే వారిని పూల సాగువైపు మళ్లించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – ఎం.సురేష్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, చింతపల్లి పరిశోధనా కేంద్రం విదేశీ పూల సాగుపై ఫలించిన పరిశోధనలు సాధారణంగా కొండ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, వలిశెలు, రాజ్మా చిక్కుళ్లుతో పాటు పసుపు, అల్లం, కాఫీ వంటి పంటలు సాగు చేస్తుంటారు. అకాల, అధిక వర్షాల వల్ల ఆశించిన దిగుబడులు రాక గిరిజనులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్ధమైన గంజాయి తదితర పంటల్ని సాగు చేస్తూ కొందరు తరచూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లించే లక్ష్యంతో గిరిసీమల్లో వాణిజ్య పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది. చింతపల్లి పరిశోధనా కేంద్రం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే విదేశీ పూల సాగుపై విస్తృత పరిశోధనలు చేసింది. రెండేళ్లుగా గ్లాడియోలన్, లిబియం, చైనా ఆస్టర్, జెర్బరా, తులిప్ వంటి విదేశీ పూల మొక్కల సాగుపై జరిపిన పరిశోధనలు ఫలించాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ నుంచి తెచ్చిన సీడ్స్‌తో లంబసింగి ప్రాంతంలో ప్రయోగాత్మక సాగు సత్ఫలితాలనివ్వడంతో ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇక్కడ సాధారణ వర్షపాతం 1,240 మి.మీ. కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 4–12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 23–38 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. చల్లని వాతావరణం, అధిక తేమ శాతం పూల సాగుకు కూడా అనుకూలం కావడంతో చింతపల్లి ఆర్ఎఆర్ఎస్ ద్వారా హెచ్‌ఏటీ జోన్లో విదేశీ పూల సాగుపై ఇప్పటివరకు సుమారు 400 మందికి శిక్షణనిచ్చారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారు సైతం పూలసాగుపై దృష్టి సారించేలా చేస్తున్నారు. 45 రోజుల్లోనే దిగుబడులు విదేశాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్, శ్రీనగర్, బెంగళూరు, పూణే, మదనపల్లి ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి వివిధ రకాల పూల రకాలను రైతులకు అందిస్తున్నారు. రైతు క్షేత్రాల్లో డ్రిప్ ఏర్పాటు చేసి ఎత్తయిన బెడ్లు, మల్చింగ్ విధానంలో సాగు చేయడంతో 45 రోజుల్లోనే దిగుబడులు మొదలవుతున్నాయి. -
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
CM Jagan: ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ ఆవిష్కరణ
సాక్షి, గుంటూరు: ఏపీకి కాబోయే పాలనా రాజధాని విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఇవాళ(శుక్రవారం) తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ బుక్స్‌ను ఆవిష్కరించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో.. ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ భాషల్లో పుస్తకాలు.. ఎయిర్పోర్ట్ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూనే.. రాష్ట్రంలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు పొందుపరిచారు. అంతేకాదు.. బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ.. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు టూరిజం శాఖ అధికారులు. దీంతో అభినందించిన సీఎం జగన్.. రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల్ వలవెన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణకు అతిథులు వస్తున్నారు.. కరోనా తర్వాత పెరిగిన సంఖ్య!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారికి కుదేలైన తెలంగాణ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. స్వదేశీ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. కరోనా కంటే ముందున్న స్థాయిలో కాకున్నా చాలావరకు మెరుగుపడింది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2023 ప్రకారం ఈ ఏడాది (2022–23)లో 68 వేల మందికిపైగా విదేశీ పర్యాటకులు, 6 కోట్ల మందికిపైగా స్వదేశీయులు (వివిధ రాష్ట్రాలకు చెందినవారు) తెలంగాణ ఆధ్యాతి్మక, పర్యాటక సొబగులను ఆస్వాదించేందుకు వచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సహా కొలనుపాక, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి, భద్రాద్రికి సందర్శకులు పోటెత్తుతున్నారు. కేవలం తీర్థయాత్రలేగాకుండా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం,చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలతోపాటు గతేడాది అట్టహాసంగా ప్రారంభమైన ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విదేశీ టూరిస్టుల్లో మాత్రం అగ్రభాగం వైద్యసేవలు పొందేందుకే వస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ఆఫిక్రా దేశాల నుంచి వస్తుండగా యూరప్, అమెరికా తదితర దేశాల నుంచి సందర్శకులు, ఐటీ నిపుణులు భాగ్యనగరానికి అత్యధికంగా వచ్చిన వారిలో ఉన్నారు. మహమ్మారి వ్యాప్తికి ముందు 9 కోట్లకు పైనే 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. లాక్డౌన్లు, కరోనా ఆంక్షల కారణంగా జనజీవనం దాదాపుగా స్తంభించింది. ఆ తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరగడం, టీకాలు అందుబాటులోకి రావడం, ఆంక్షలను సడలించడంతో క్రమంగా పర్యాటకం ఊపందుకుంటోంది. కరోనా వ్యాప్తికి ముందు 2016–17లో అత్యధికంగా 9.5 కోట్ల మందికిపైగా స్వదేశీ, 1.6 లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారు. కరోనా తాకిడి తర్వాత అత్యల్పంగా 2021–22లో 3.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులు, 5,917 మంది అంతర్జాతీయ పర్యాటకులు వచి్చనట్లు గణాంకాలు చెబుతున్నా యి. ఇక ఆ మరుసటి ఏడాదిలోనే ఈ సంఖ్యలో 89.84% (స్వదేశీ పర్యాటకులు), 1,056.01% (విదేశీ పర్యాటకులు) వృద్ధి నమోదు కావడం విశేషం. చదవండి వెల్డన్ పీటీఓ.. పాత వస్తువులతో కొత్త ఫర్నీచర్ -
భారతీయ సోర్స్ మార్కెట్‌గా హైదరాబాద్
రాయదుర్గం: దక్షిణాఫ్రికా టూరిజానికి మూడవ అతిపెద్ద భారతీయ సోర్స్ మార్కెట్‌గా హైదరాబాద్ నగరం ఆవిర్భవించిందని దక్షిణాఫ్రికా టూరిజమ్ ఎంఈఐఎస్ఈఏ హబ్ హెడ్ నీలిస్వాఎన్కాని పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని షరటాన్ హోటల్లో దక్షిణాఫ్రికా టూరిజమ్ వార్షిక రోడ్‌షో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ వరకు దాదాపు 50వేల మంది భారతీయులు దక్షిణాఫ్రికాకు పర్యటించడానికి వచ్చారని గుర్తు చేశారు. 33,900 మంది సందర్శకులను తీసుకరావాలనే లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 13 నుంచి 16వ తేదీ వరకు భారత్‌లోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, చెన్నయ్, హైదరాబాద్ ముంబాయి నగరాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్నామన్నారు. -
ఆంధ్రప్రదేశ్ టూరిజం దేశంలోనే మూడో స్థానంలో ఉంది: మంత్రి రోజా
-
బోటు నిండుగా ఆదాయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకం పరవళ్లు తొక్కుతోంది. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు చెందిన 12 బోటింగ్ యూనిట్లలో వివిధ రకాలైన 41 బోట్లు నిత్యం సేవలందిస్తున్నాయి. పాపికొండలు, విజయవాడ, శ్రీశైలం బోటింగ్ పాయింట్లకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రికార్డు స్థాయిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏపీటీడీసీ బోటింగ్ విభాగం ద్వారా రూ.6.25 కోట్లు ఆదాయం రాగా, మార్చి చివరి నాటికి రూ.8.32కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా బోట్ల కొనుగోలు రూ.2కోట్ల వ్యయంతో కొత్త బోట్ల కొనుగోలుకు ఏపీటీడీసీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారులు టెండర్లు పిలవనున్నారు. 50సీటింగ్ సామర్థ్యం కలిగిన మూడు బోట్లను కొనుగోలు చేసి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న విజయవాడ, శ్రీశైలం యూనిట్లకు కేటాయించనున్నారు. ఔట్ బోర్డ్ బోట్లు, స్పీడ్, డీలక్స్, పెడల్ బోట్లను సైతం కొనుగోలు చేయనున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌లోని స్టీల్ జెట్టీకి కూడా మరమ్మతులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురానున్నారు. కొత్త బోటింగ్ యూనిట్లపై దృష్టి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుత బోటింగ్ యూనిట్లలో సేవలను మెరుగుపరచడంతోపాటు కొత్త యూనిట్లను నెలకొల్పడంపై దృష్టి సారిస్తోంది. ఇటీవల పోచవరం(పాపికొండలు), వైఎస్సార్ జిల్లాలోని పర్నపల్లిలో జల పర్యాటకాన్ని అందుబాటులోకి తెచి్చంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పర్నపల్లిలో అమెరికన్ పాంటూన్ బోట్లను ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కస్టమైజ్డ్ బోట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడ గత నెలలో ఏకంగా రూ.8లక్షల వరకు ఆదాయం వచి్చంది. త్వరలో బ్రహ్మంసాగర్, దేవునికడపతోపాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కూడా బోట్లు నడిపేందుకు ఏపీటీడీసీ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. జల పర్యాటకానికి ఆదరణ పెరుగుతోంది. పర్యాటకులకు మెరుగైన సేవలందించేందుకు కొత్త బోట్లను సైతం కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదు. కొత్త బోటింగ్ పాయింట్లపైనా దృష్టి సారించాం. కరోనా తర్వాత ఇంత వేగంగా పుంజుకోవడం శుభపరిణామం. – కె.కన్నబాబు, ఎండీ, ఏపీటీడీసీ -
అత్యధిక ‘ఆతిథ్య’ బుకింగ్స్ జాబితాలో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పర్యాటకుల ఆసక్తిని దక్కించుకున్న అగ్రగామి ఆతిథ్య నగరాల్లో హైదరాబాద్ టాప్ 5గా నిలిచింది. ఈ విషయాన్ని పర్యాటకులకు హోమ్‌స్టేస్ అందించే ఆన్లైన్ వేదిక ఎయిర్ బిఎన్బి అధ్యయనం వెల్లడించింది. పర్యాటకాభిరుచుల గురించి గత ఏడాదికి సంబంధించి ఈ సంస్థ అధ్యయనం వెల్లడించిన పలు ఆసక్తికరమైన విశేషాల్లో... సోలో టూర్... సో బెటరూ... ఒంటరిగా ప్రయాణించడాన్ని అత్య«ధిక శాతం మంది ఇష్టపడుతున్నారని స్టడీ తేల్చింది. పర్యాటకశైలి ఆసక్తుల్లో సోలో ట్రావెల్ అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ ప్రయాణ శైలిగా నిలవగా, తర్వాత స్థానాల్లో జంటగా చేసే కపుల్ ట్రావెల్, ఆ తర్వాత కుటుంబతో కలిసి చేసే ఫ్యామిలీ ట్రావెల్ లు ఉన్నాయి. మాదాపూర్ కు...ఆఫ్ బీట్ జర్నీ... అంతగా ప్రాచుర్యంలో లేని ప్రాంతాలను (ఆఫ్–ది–బీటెన్–పాత్ ) పర్యాటకులు అన్వేషించడం పెరిగింది. దేశీయంగా తమిళనాడు, మహారాష్ట్ర, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆఫ్–బీట్ గమ్యస్థానాలను టూరిస్ట్‌లు అన్వేషిస్తున్నారు అలా ప్రచారంలో లేని పర్యాటకస్థలాలకు వీరు ప్రయాణించడం ఆయా ప్రాంతాలకు ప్రయోజనంతో పాటు పర్యాటకరంగ పురోభవృద్ధికి దోహదం చేస్తోంది. దేశంలోనే టాప్ 5 ఆఫ్–ది–బీట్–పాత్ ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నగరంలోని మాదాపూర్ తొలి స్థానంలో నిలవడం విశేషం ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడులోని రామేశ్వరం, వెల్లూరు, మేఘాలయలోని చిరపుంజి, మహారాష్ట్ర చించ్వాడ్లోని ఫింప్రిలు ఉన్నాయి. టాప్ సిటీస్‌కూ...సై అంతర్జాతీయ ప్రయాణం గత ఏడాది వేగవంతమైన పునరుద్ధరణను సాధించింది, ఈ పెరుగుదల ట్రెండ్ 2023లో కూడా కొనసాగనుంది భారతీయ పర్యాటకులు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల కోసం అన్వేషిస్తున్నారు. భారతీయ అతిథులు అత్యధికంగా శోధించిన అంతర్జాతీయ గమ్యస్థానాలలో వరుసగా దుబాయ్. లండన్. పారిస్. టొరంటో, న్యూయార్క్ లు ఉన్నాయి. ఆతిథ్యంలో ఢిల్లీ టాప్... చక్కని ఆతిథ్యం విషయానికి వస్తే అత్యధిక 5–స్టార్ రేటింగ్స్‌తో ఢిల్లీ, గోవా, కేరళ, మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అతిథులు నగర జీవితాన్ని ఆస్వాదించడానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కోల్‌కతాలను ఎక్కువగా ఎంచుకున్నారని అధ్యయనం వెల్లడించింది. అలాగే తాము బస చేసే చోట ఈత కొలను పక్కన ఆసీనులవడం లేదా ఇసుక బీచ్‌లో కిరణాలతో స్నానించడం వంటి ఆసక్తులు ఎక్కువగా ప్రదర్శించారు. బుకింగ్స్‌లో హైదరాబాద్‌కు 5వ స్థానం.. గత ఏడాది అత్యధిక బుకింగ్‌లతో భారతదేశంలోని టాప్ 5 ఆతిధ్య నగరాలుగా ముంబై (మహారాష్ట్ర), న్యూఢిల్లీ (ఢిల్లీ), గౌహతి (అస్సాం), గోవా (హైదరాబాద్) నిలిచాయి. ఒకే ఏడాది అత్యధికంగా ప్రయాణించిన భారతీయ అతిథిగా 115 కంటే ఎక్కువ బుకింగ్‌లు చేసిన ఓ పర్యాటకుడు నిలిచాడు. -
ఈసారి 6 లక్షల టూరిస్టులు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దాదాపు 5–6 లక్షల మంది భారతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించవచ్చని మలేషియా అంచనా వేస్తోంది. గత ఏడాది ఈ సంఖ్య సుమారు 3 లక్షలుగా నమోదైంది. శుక్రవారమిక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా టూరిజం మలేషియా సీనియర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ (ఆసియా, ఆఫ్రికా) మొహమ్మద్ అమీరుల్ రిజాల్ అబ్దుల్ రహీం ఈ విషయాలు తెలిపారు. కరోనాకు పూర్వం 2019లో భారత్ నుంచి 7.35 లక్షల పైచిలుకు టూరిస్టులు వచ్చారని, పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఏడాది తిరిగి ఆ స్థాయికి ఇది చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల్లో అత్యధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది 70 లక్షల మంది పైగా విదేశీ టూరిస్టులు మలేషియాను సందర్శించగా ఈ ఏడాది ఇది 1.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 30న ప్రారంభమైన టూరిజం మలేషియా రోడ్‌షోలు వివిధ నగరాల్లో ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్నాయి. -
ఈజ్ మై ట్రిప్ చేతికి ‘చెకిన్’
హైదరాబాద్: ఆన్లైన్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అయిన ఈజ్‌మైట్రిప్ ‘చెకిన్’ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. చెకిన్ అన్నది పర్యాటకులు ఎలాంటి బేరమాడే అవసరం లేకుండా హోటల్ బుకింగ్‌లపై డిస్కౌంట్‌కు వీలు కల్పించే రియల్‌టైమ్ మార్కెట్ ప్లేస్. ఆల్గోరిథమ్ ఆధారితంగా టాప్–5 హోటల్ చెకిన్ ఆఫర్లను ఇది అందించగలదు. చెల్లింపులు మాత్రం హోటల్ వద్దే చేయవచ్చు. మరోవైపు చెకిన్ యాప్ యాక్సెస్‌ను హోటల్ వారికి ఈజ్‌మైట్రిప్ అందించనుంది. దీని ద్వారా వారు ఎప్పటికప్పుడు త మ బుకింగ్‌లు, డిమాండ్ తీరును తెలుసుకుని, ధరలను నియంత్రించుకోవచ్చని ఈజ్‌మైట్రిప్ తెలిపింది. తద్వారా తమ ప్రాపర్టీలను వేగంగా విక్రయించుకోగలరని (బుకింగ్‌లు) పేర్కొంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
టూరిజం 2.0’.. అరకు, గండికోట
సాక్షి, అమరావతి: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.150 కోట్లకు పైగా అంచనాలతో మౌలిక వసతులను మెరుగుపర్చుకోనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్–2.0’ పథకం కింద దేశంలోని 36 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందులో అరకు–లంబసింగి సర్క్యూట్, గండికోట పర్యాటక ప్రదేశాలకు చోటు కల్పించింది. త్వరలోనే పనులు ప్రారంభించేలా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల కోసం ఆర్ఎఫ్పీలను సైతం ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్కృతికి, పౌర సమాజ స్థితిగతులను మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 2.0తో అందుబాటులోకి అధునాతన వసతులు 2.0 ప్రణాళికల ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా ఈ రెండు ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటక, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. పర్యాటకుల కోసం వాచ్ టవర్లు, రిసార్టులు, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్సులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్ లైట్ షోలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. స్థానిక కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టు, రహదారి సౌకర్యం, ల్యాండ్ స్కేప్, డిజిటల్ టెక్నాలజీ, స్థానిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించనున్నాయి. పర్యాటకుల ‘క్యూ’ అరకు లోయలో ఏపీ పర్యాటక సంస్థ 4 రిసార్టులను నిర్వహిస్తోంది. మయూరిలో 80, అరకు వేలీలో 58, అనంతగిరిలో 30, టైడా రిసార్టులో 23 గదులను అందుబాటులో ఉంచింది. ఇటీవల లంబసింగిలో సైతం 11 కొత్త కాటేజీలను నిర్మిచింది. మరోవైపు విశాఖపట్నం నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్లను నడుపుతోంది. అరకుతో పాటు బొర్రా గుహలు, వంజంగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు పరిసర ప్రాంతాలను పర్యాటకులు వీక్షించేలా చర్యలు చేపట్టింది. కాగా, కడప జిల్లాలోని గండికోటకు విశిష్ట చారిత్రక నేపథ్యంతో పాటు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ తరహాలో కొండలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా నది ఒంపులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడికి వారాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇందులో వాయు, జల, భూమిపై చేసే సాహస క్రీడల అకాడమీని నెలకొల్పారు. మరోవైపు 4వేల ఎకరాల్లో గండికోట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్‌ను సైతం తీసుకొస్తోంది. (చదవండి: AP: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ.. చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు) -
వైల్డ్ లైఫ్ టూరిజం పునః ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ‘ఎకోఫ్రెండ్లీ వైల్డ్ లైఫ్ టూరిజం’ తిరిగి ప్రారంభం కానుంది. 2021 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’ని జతచేసిన సరికొత్త హంగులు, ఆకర్షణలతో శుక్రవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టైగర్ సఫారీ కోసం సమకూర్చిన కొత్తవాహనాలను ఫ్లాగ్‌ఆఫ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మొదలుకానుంది. టూర్లో భాగంగా ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ని ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌తో మంత్రి ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న ఆరు కాటేజీలను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ఏటీఆర్ పరిధిలో పులుల కదలికల ఫొటోలు, పాదముద్రలు, ఇతర అంశాలతో తయారుచేసిన ‘ఏటీఆర్ టైగర్‌బుక్’ను ఆవిష్కరిస్తారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణకు కృషి చేస్తున్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్‌క్లబ్’ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ ఇలా... టూరిజం ప్యాకేజీలో... టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటివి జతచేశారు. దాదాపు 24 గంటల పాటు ఇక్కడ గడపడంతో పాటు రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బస వంటివి అందుబాటులోకి తేనున్నారు. స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. రాత్రిపూట అడవిలోని పర్క్యులేషన్ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణకు నైట్‌విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు చేశారు. ఎకోఫ్రెండ్లీ చర్యల్లో భాగంగా... జ్యూట్‌బ్యాగ్ వర్క్‌షాపు, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌సెంటర్, బయో ల్యాబ్‌ల సందర్శన ఉంటుంది. -
ప్రాణాంతక పర్యాటకం
దారుణం... అందరినీ కన్నీరు పెట్టించిన అనూహ్య ప్రమాదం. సంక్రాంతి పూట ఆదివారం ఉదయం హఠాత్తుగా జరిగిన నేపాల్ విమాన ప్రమాదఘటన తీవ్రత అలాంటిది. ఆ హిమాలయ దేశంలోని రెండో అతి పెద్ద దేశీయ విమానయాన సంస్థ యతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండింజన్ల ఏఆర్టీ–72 విమానం ప్రమాదానికి గురై, అయిదుగురు భారతీయులతో సహా అందులోని 72 మందీ ప్రాణాలు కోల్పోయారు. కాఠ్మండూకు పశ్చిమాన 125 కి.మీ.ల దూరంలో, పోఖరాలో కాసేపట్లో దిగాల్సిన విమానం వాతావరణం బాగున్నా ఇరుకు కొండమార్గంలో కూలిపోవడం దురదృష్టకరం. నేపాల్‌లో గత మూడు దశాబ్దాల్లో అతి పెద్ద విమాన దుర్ఘటన ఇదేనట. వరుస ప్రమాదాలతో అపకీర్తిని మూటగట్టుకున్న నేపాల్ నిద్ర మేల్కొని నిర్లక్ష్యం వీడాలని ఇది గుర్తుచేస్తోంది. టేకాఫైన 20 నిమిషాల్లో అంతా అయిపోయింది. అప్పటి దాకా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిన ప్రయాణం రెప్ప పాటున ఎగసిన అగ్నికీలల్లో ఆర్తనాదాల మధ్య దుఃఖభరితం కావడం దిగ్భ్రాంతికరం. విమానం కిందకు దిగుతున్న వేళ ప్రయాణికులు కొందరు ఫేస్బుక్ లైవ్ చేస్తుండడంతో యాదృచ్ఛికంగా ఈ ప్రమాద ఘటన దృశ్యాలు ప్రత్యక్షంగా సోషల్ మీడియాకు చిక్కాయి. విమానంలోని బ్లాక్ బాక్స్ దొరికింది గనక, దాని సమాచార విశ్లేషణతో ప్రమాద కారణాలు త్వరలోనే బయటపడవచ్చు. మూడు దశాబ్దాల క్రితం 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం కాఠ్మండు విమానాశ్రయానికి వస్తూ, ఘోర ప్రమాదానికి గురై 167 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నేపాలీ విమానయాన చరిత్రలో ఆ పీఐఏ ప్రమాదం అతి పెద్దది. ఆ తర్వాత ఈ హిమాలయ ప్రాంతంలో అనేక విమాన ప్రమాదాలు జరిగినా, ప్రాణనష్టం, తీవ్రతల్లో తాజా ఘటన మళ్ళీ ఆ గత చరిత్రను గుర్తు చేసింది. నిజానికి, ఇలాంటి విషాదాలు నేపాల్‌కు కొత్త కావు. ఎనిమిది నెలల క్రితమే నిరుడు మే నెలలో తారా విమానం కూలి, 22 మంది మరణించారు. 2000 నుంచి చూస్తే 22 ఏళ్ళలో నేపాల్‌లో 18 విమాన ప్రమాదాలు జరిగాయి. 350కి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ పర్వత ప్రాంత దేశంలో మారుమూల ప్రాంతాలు, సంక్లిష్టమైన రన్వేలు, ఆ పక్కనే ఎల్తైన కొండలు, ఇరుకైన కొండ మలుపుల లాంటివి అనేకం. కొమ్ములు తిరిగిన పైలట్లకూ అక్కడ విమానాలు నడపడం సవాలే. ప్రపంచంలోని అతి ఎల్తైన 14 పర్వత శిఖరాల్లో 7 నేపాల్‌లోనే ఉన్నాయి. పర్వతారోహకులకు సవాలు విసిరే ప్రసిద్ధ ఎవరెస్ట్ సైతం ఈ చిన్న హిమాలయ దేశంలోనే నెలకొంది. ఎల్తైన పర్వతశిఖరాలకు తోడు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు సరేసరి. కొన్నేళ్ళుగా నేపాల్‌లో జరిగినన్ని విమాన ప్రమాదాలు మరెక్కడా జరగలేదంటే ఇవే కారణం. పర్వత ప్రాంత నేపాలీ పర్యాటకమే ఆకర్షణగా విదేశీ పర్వతారోహకుల తాకిడి కొన్నేళ్ళుగా బాగా పెరిగింది. ఫలితంగా, ఆ దేశంలోని సంక్లిష్ట ప్రాంతాలకు సైతం సరకులనూ, మనుషులనూ తీసుకెళ్ళే విమాన రంగం కొన్నేళ్ళుగా విస్తరించింది. అదే సమయంలో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్ద లూక్లాలోని టెన్సింగ్– హిల్లరీ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోకెల్లా ప్రమాదభరితమైన వాటిలో ఒకటైంది. 1960 నుంచి 2019 ఏప్రిల్ వరకు జరిగిన ప్రమాదాలు, ప్రాణనష్టాల లెక్క చూస్తే లూక్లా, జామ్సమ్, సిమీకోట్, జుమ్లా, దోల్పాలు నేపాల్‌లో ప్రమాద భూయిష్ఠమైనవని తేల్చారు. పైపెచ్చు, నిర్వహణ లోపాలు, తగినంత శిక్షణ లేకపోవడం, ప్రమాణాలు పాటించకపోవడం, అలసిసొలసిన పైలట్లు – ఇలా అనేకం ఆ దేశ విమానయాన రంగాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటి నుంచి నేపాల్ పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. చివరకు యూరోపియన్ యూనియన్ సైతం భద్రతా కారణాల రీత్యా నేపాలీ విమానసర్వీసుల్ని నిషేధించాయంటే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ వైవిధ్యం, సంక్లిష్ట భౌగోళిక ప్రాంతమనేవి నేపాల్‌లో విమానయానానికి సవాళ్ళనీ, చిన్న విమానాలు తరచూ ప్రమాదాల పాలవుతున్నది అందుకేననీ నేపాల్ పౌర విమానయాన ప్రాధి కార సంస్థ 2019లోనే తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిష్కారానికి చేసిన ప్రయత్నాలే పెద్దగా లేవు. వరుస విమాన ప్రమాదాల పాపం నేపాల్ పాలకులదనేది అందుకే! ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ దర్యాప్తులు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు సంఘాలు నివేదికలు ఇస్తూనే ఉన్నాయి. కానీ, ఆ నివేదికల్లోని సిఫార్సుల అమలు శూన్యం. అందుకే, ప్రమాదాలు, ప్రాణనష్టం ఆగడమే లేదు. తాజా ఘటనాస్థలమైన పోఖరా విమానాశ్రయ ప్రాంతం ప్రమాదభరితమే. నేపాల్‌ను చంక నెట్టుకోవాలని చైనా చేస్తున్న దోస్తీ భారత్‌కు మరింత ప్రమాదభరితం. చైనాతో ఒప్పందంతో ఏడేళ్ళలో ఈ ఎయిర్పోర్ట్ వచ్చింది. బీజింగ్ ఒత్తిడితో, నిపుణుల మాట తోసిపుచ్చి, సర్వసన్నద్ధం కాకుండానే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఇటీవలే ప్రారంభించారు. హిమాలయ శ్రేణుల్లో భారత్‌ను ఇరుకున పెట్టాలన్నది డ్రాగన్ వ్యూహం కాగా, ప్రయాణికుల ప్రాణాల కన్నా పర్యాటకమే ముఖ్యమన్నట్టు నేపాల్ ముందుకు సాగడం దుస్సహం. షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (స్టోల్) విమానాలతో పర్యాటక వాణిజ్య లబ్ధికై విజువల్ ఫ్లైట్ నిబంధనల్ని కూడా ఆ దేశం గాలికొదిలేస్తోంది. గత పదేళ్ళలో జరిగిన 19 ప్రమాదాల్లో 16 ఘటనలు స్టోల్ విమానాలవే గనక, భారత్ మన పర్యాటకుల్ని అప్రమత్తం చేయాలి. ప్రాణాలకు పూచీపడని పొరుగు దేశంపై ఒత్తిడి తేవాలి. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ సైతం తన 193 సభ్య దేశాల్లో ఒకటైన నేపాల్ తన వైమానిక భద్రత పెంచుకొనేలా కట్టుదిట్టం చేయాలి. నివేదికల్ని బుట్టదాఖలు చేస్తున్న నేపాలీ పాలకులు తక్షణమే పూర్తిస్థాయి భద్రతే లక్ష్యంగా కఠినచర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రాణాలకు ప్రమాదం! -
‘బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లే యోచన లేదు’
విజయవాడ: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి ఆర్కే రోజా తేల్చిచెప్పారు. గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎపిసోడ్లో తర్వాత అన్‌స్టాపబుల్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని మంత్రి రోజా పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర చేసినా, పవన్ వారాహి అంటూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే, విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి ముగింపు వేడుకల్లో రోజా పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు బాగా జరిగాయి. ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం. టెంపుల్ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాం. నదీతీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. పబ్లిక్-ప్రైవేటు విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే సుదూర నదీ పర్యాటకం
సాక్షి, న్యూఢిల్లీ: నదీజలాల్లో పర్యాటకులు సుదూరాలకు విలాసవంత ప్రయాణం సాగించేలా రివర్ క్రూయిజ్ (షిప్) పర్యాటకానికి భారతీయ నదులు సిద్ధమయ్యాయి. 52 రోజులపాటు గంగావిలాస్ పేరుతో కొనసాగే ఈ పర్యాటక నౌక సేవలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నాను. గంగా నది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభం అవుతుంది. దాదాపు 3,200 కిలోమీటర్ల పాటు 5 రాష్ట్రాల్లో మొత్తం 27 నదుల్లో ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా మార్చి ఒకటిన అస్సాంలోని దిబ్రూగఢ్‌కు గంగా విలాస్ చేరుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పొడవైన నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యటన సందర్భాలు లేవని తెలిపారు. అందుకే తొలిసారిగా అత్యంత ఎక్కువ దూరాలకు గంగ, బ్రహ్మపుత్ర నదులపై కొనసాగే ఈ యాత్రపై ఆసక్తి నెలకొందని వివరించారు. ‘గంగా విలాస్ రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం. భారతీయ పర్యాటకరంగ రూపురేఖలు మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక భూమిక పోషించనుంది’ అని ఉద్ఘాటించారు. -
విహార యాత్ర అంటే ఆ దేశానికి వెళ్లాలంటున్న భారతీయలు!
కోవిడ్ తర్వాత సింగపూర్ తన పూర్వ వైభవాన్ని పొందింది. 2019 నుంచి కరోనాతో టూరిజం పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందర్శకుల తాకిడి పెరగడంతో 2022లో తిరిగి పుంజుకుంది. దీంతో నవంబర్ వరకు 5.37 మిలియన్లు టూరిస్టులు సింగపూర్‌ను సందర్శించారు. నవంబర్ వరకు సింగపూర్ టూరిజం బోర్డు (STB) నుంచి వచ్చిన డేటా ఆధారంగా.. 48 శాతం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, భారత్ నుంచే ఉన్నారు. డిసెంబర్ సాంప్రదాయకంగా సింగపూర్ సందర్శకులకు రద్దీగా ఉండే ప్రయాణ కాలం కావడంతో, ఈ సంఖ్యను కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో ఇండోనేషియా నుంచి 9.86 లక్షలు ఉండగా, భారత్ నుంచి 6.12 లక్షల మంది ఉన్నారు. సింగపూర్ టూరిజం అభివృద్ధిలో ఇండియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మలేషియా 495,470తో మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (476,480), ఫిలిప్పీన్స్ (325,480) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చివరగా 2019 ప్రీ-కోవిడ్ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా 19.1 మిలియన్ల మంది టూరిస్టులు సందర్శించారు. ఆ సంవత్సరంలో, సింగపూర్‌కు చైనా నుంచి 3.6 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారు. చివరకు తమ పౌరులను మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని చైనా గత వారం ప్రకటించడంతో, 2023లో సింగపూర్ టూరిజం మహమ్మారి అనంతరం పున్వరైభవానికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
అభివృద్ధి దిశగా పర్యాటక రంగం
కడప కల్చరల్ : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా వెళుతోందని నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఎంఎం ఆస్పత్రి అధినేత డాక్టర్ మహబూబ్‌పీర్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ టూరిజం సంస్థ ఇటీవల మరికొన్ని సంస్థలను కలుపుకుని బలోపేతం కావడం సంతోషదాయకమన్నారు. ఇటీవల గండికోటలో ఒబెరాయ్ సంస్థ హోటల్స్ నిర్మించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. సభాధ్యక్షుడు లయన్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మానస చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు రాయలసీమ సంస్థ ఒక్కటే జిల్లా పర్యాటకాభివృద్ధికి కృషి చేసిందని, ఇప్పుడు లయన్స్ క్లబ్‌తోపాటు పలు ప్రముఖ సంస్థలు కూడా ముందుకు వస్తుండడం సీమ సంస్థ పట్ల గల విశ్వాసమే కారణమన్నారు. ప్రత్యేక అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎన్.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంస్థ ప్యాట్రన్ పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ తాను మిత్రుల ప్రోత్సాహంతో రాసిన ట్రావెలాగ్‌ను త్వరలో ఆవిష్కరిస్తున్నామన్నారు. చీఫ్ ప్యాట్రన్ పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా రాయలసీమ సంస్థ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. రిటైర్డ్ ఇంజినీరు వెంకటరెడ్డి, సంస్థ ప్యాట్రన్ పద్మప్రియ చంద్రారెడ్డి, కోశాధికారి బాలగొండ గంగాధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను రాసిన కథకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతి రావడంతో సంస్థ సభ్యుడు షబ్బీర్ హుసేన్‌ను ఘనంగా సత్కరించారు. -
బొగ్గు ఎలా తవ్వుతారు..? కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు?
బొగ్గు ఎలా తవ్వుతారు.. అసలు నేలలో బొగ్గు నిక్షేపాలు ఎలా ఉంటాయి.. తోడిన బొగ్గును బయటకు ఎలా తీస్తారు.. బొగ్గులో రకాలెన్నుంటాయి.. ఆ బొగ్గుతో కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు.. ఈ ప్రశ్నలకు ఎవరో సమాధానాలు చెప్పడం కంటే, ప్రత్యక్షంగా ఆ ప్రక్రియలను తిలకిస్తే ఎంత బాగుంటుంది. కానీ, అలా నేరుగా చూసే భాగ్యం సామాన్యులకు దక్కడం కుదరదు. దాన్ని సాకారం చేసేలా ఇప్పుడు ఆర్టీసీ–సింగరేణి సంయుక్తంగా ఓ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. రూ.1,600 చెల్లిస్తే చాలు.. వీటన్నింటినీ దగ్గరుండి నేరుగా చూసి మధురానుభూతిని మూటగట్టుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని ఇదీ ఆ ప్రాజెక్టు.. దేశంలో ఉత్పత్తయ్యే బొగ్గులో 10 శాతానికిపైగా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు ప్రసాదిస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బొగ్గు–పర్యాటకానికి తెర తీశారు. ఇందులోభాగంగా ఇటీవలే ఆయన సింగరేణి అధికారులతో మాట్లాడి సంయుక్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. బుక్ చేసుకునే పర్యాటకుల తొలి బస్సు ఈనెల 28న సింగరేణికి వెళ్లనుంది. జనవరి నుంచి ప్రతీ శనివారం ఒక సూపర్‌లగ్జరీ బస్సు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండు నుంచి బయలుదేరుతుంది. పర్యాటకుల రద్దీ పెరిగితే ఈ ట్రిప్పుల సంఖ్య పెంచుతారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.1,600గా నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి దాన్ని రూ.1,850గా సవరించాలని భావిస్తున్నారు. ఉదయం జూబ్లీ బస్టాండులో బయలుదేరే బస్సు నేరుగా గోదావరి ఖనిలోని 7 ఇంక్లైన్ బొగ్గుగనికి చేరుకుంటుంది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలుత భూగర్భ గనిలో బొగ్గు తవ్వే విధానాన్ని చూపుతారు. ప్రత్యేక కన్వేయర్ ద్వారా వందల అడుగుల లోతులోని భూగర్భ గనిలోకి తీసుకెళ్లి చూపుతారు. మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడి ఓపెన్‌కాస్ట్ గని వద్దకు తీసుకెళ్తారు. బొగ్గు తవ్వేందుకే జరిపే పేలుళ్లు మొదలు తవ్వి పైకి తెచ్చే వరకు చూపుతూ వివరిస్తారు. తర్వాత అక్కడికి చేరువలో ఉన్న జైపూర్ పవర్‌ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి తీరును ప్రత్యక్షంగా చూపుతారు. జీడీకే–7ఎల్ఈపీ గని స్వాగత ద్వారం బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చార్జి అదనం నగరం నుంచి బయలుదేరాక సిద్దిపేట సమీపంలో ఓ హోటల్ వద్ద బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. అందుకయ్యే రూ.99ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి అండర్‌గ్రౌండ్ బొగ్గుగనిలోకి వెళ్లేటప్పుడు ఉచితంగా టీ, స్నాక్స్ ఇస్తారు. మధ్యాహ్నం అక్కడి గెస్ట్‌హౌజ్‌లో ఉచితంగా లంచ్ ఏర్పాటు చేస్తారు. తిరుగుప్రయాణంలో మళ్లీ సిద్దిపేట సమీపంలోని హోటల్లో డిన్నర్ ఉంటుంది. ఆ చార్జీని ప్రయాణికులే భరించాలి. ప్రస్తుతం ఈ ట్రిప్ చార్జీగా వసూలు చేసే రూ.1,600 నుంచి సింగరేణికి రూ.300 చెల్లిస్తారని సమాచారం. అందులో ఎంట్రి టికెట్, లంచ్ చార్జీ కలిసి ఉంటాయి. నేడు లాంఛనంగా ప్రారంభం సింగరేణి దర్శన్ యాత్రను మంగళవారం ఉదయం బస్‌భవన్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సింగరేణి డైరెక్టర్లు ఎస్,చంద్రశేఖర్, ఎన్.బలరాం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిసి ప్రారంభిస్తారు. తొలి ట్రిప్పు ఈనెల 28న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. చైర్‌కార్ ద్వారా గనిలోకి.. పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సంస్థ గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మ్యాన్‌రైడింగ్ చైర్‌కార్ ద్వారా గనిలోకి తీసుకెళ్లి బొగ్గు ఉత్పత్తి, యాంత్రీకరణ, అంశాలను చూపిస్తాం. గని ముందున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పర్యాటకులు పెరిగితే అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడైతే వారంలో ఒకసారి సందర్శన ఉండేలా నిర్ణయించాం. – ఎ.మనోహర్, జీఎం, ఆర్జీ–2 -
పున్నమి భవనానికి ఆధ్యాత్మిక హంగులు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలోని పున్నమి భవనం (హరిత హోటల్) ఆధ్యాత్మిక సొబగులతో త్వరలోనే భక్తులను ఆకర్షించనుంది. దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు ‘రీ ఎలివేషన్’పనులు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2001 ఫిబ్రవరి 4న అప్పటి టూరిజం శాఖ మంత్రి పెద్దిరెడ్డి.. పున్నమి గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం యాదాద్రీశుడి హుండీ లెక్కింపునకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రధానాలయం అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ పలుమార్లు ఈ హోటల్లోనే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హోటల్‌ను సైతం ఆధ్యాత్మిక రూపాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గతనెల 18న యాదాద్రి పర్యటనకు వచ్చిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఇందుకు సంబంధించిన నమూనాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పలు నమూనాలను సీఎం వద్దకు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన నేపథ్యంలో ఈఓ గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆచార్యులు, అధికారులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ‘రీ ఎలివేషన్’పనులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ఆహ్లాదపరిచే గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. -
గోదావరిఖని.. ఇక పర్యాటక గని!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పర్యాటక శోభను సంతరించుకుంటోంది. మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గనికి సింగరేణి అధికారులు కొత్తరూపు ఇస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టడంతో ఈ నెల 27 నుంచే పర్యాటకులు ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ మూడు ఏరియా జీఎంలు కె.నారాయణ, ఎ.మనోహర్, టి.వెంకటేశ్వర్రావుతో కలిసి 7 ఎల్ఈïపీ గనిని సందర్శించారు. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు అంటే అందరికీ తెలిసినప్పటికీ భూగర్భ గనిలోకి కార్మికులు ఎలా వెళ్తారు..? ఉత్పత్తి ఎలా తీస్తారు..? రక్షణ చర్యలు ఎలా ఉంటాయి..? ఇలా అనేక సందేహాలను పర్యాటకులకు నివృత్తి చేసేలా సింగరేణి చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే మొదటిసారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్ధం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గనిని కుటుంబసభ్యులతో సందర్శించారు. బొగ్గు గనులు, ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని, ఓసీపీ, పవర్ ప్లాంట్‌తోపాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటకస్థలాలను పొందుపర్చనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండీ శ్రీధర్‌కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది. టూర్ ఇలా.. హైదరాబాద్ నుంచి బయల్దేరే టూరిస్టులు మార్గమధ్యంలో లోయర్ మానేర్ డ్యాం సందర్శిస్తారు. ళీ అక్కడి నుంచి జీడీకే–7 ఎల్ఈపీ గనికి చేరుకుంటారు. అక్కడ సింగరేణి ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం, రక్షణ చర్యల గురించి వివరిస్తారు. ళీ ఇందుకు యైటింక్లయిన్ కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తారు. ళీ అక్కడ భోజనాలు ముగిసిన తర్వాత ఓసీపీ–3 వ్యూపాయింట్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఓసీపీ–3లో జరిగే బ్లాస్టింగ్ చూపిస్తారు. ళీ అక్కడి నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్‌కు తీసుకెళ్లి విద్యుదుత్పత్తి తీరును వివరిస్తారు. -
పాపికొండలకు పోటెత్తారు
రంపచోడవరం/దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు ఆదివారం తొలిరోజే పర్యాటకులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నా ఎక్కువమంది టికెట్లు బుక్ చేసుకున్నారు. రెండు బోట్లలో 112 మంది పర్యాటకులు బయలుదేరారు. మూడునెలల విరామం తరువాత పర్యాటక, పోలీసు, రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారుల పర్యవేక్షణ, సూచనల మధ్య పాపికొండల పర్యాటకం ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి రెండు బోట్లు ఉదయం 11 గంటలకు బయలుదేరాయి. మొదటి బోటుగా గోదావరి గ్రాండ్లో 82 మంది ఉన్నారు. వీరిలో బోటు పైభాగంలో 46 మంది, లోపల 36 మంది కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండోబోటు భగీరథిలో 30 మంది పర్యాటకులు ఉన్నారు. వీరందరిని టికెట్ ఆధారంగా అనుమతించారు. తొలిరోజు కావడంతో బోట్లు బయలుదేరేందుకు కొంత ఆలస్యం అయింది. రోజూ ఉదయం 9 గంటలకే పర్యాటకులతో బోట్లు బయలుదేరతాయని అధికారులు చెప్పారు. బెంగళూరు నుంచి కూడా కొందరు పర్యాటకులు పాపికొండల విహారానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది గోదావరిలో ప్రయాణించి పాపికొండల అందాలు చూడాలని కోరిక ఉంది. అయితే పాపికొండల రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. తిరిగి పాపికొండలకు బోట్లు తిరుగుతాయని చెప్పారు. దీంతో 8 రోజులు టూర్ ప్లాన్ చేసుకుని వచ్చాం. పాపికొండల టూర్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. – సుష్మ, పర్యాటకురాలు, బెంగళూరు జాగ్రత్తలు పాటించాలి.. పాపికొండల విహారయాత్రను విజయవంతంగా ముగించేందుకు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి. బోట్లో ప్రయాణించేటప్పుడు, తిరిగి బోట్ పాయింట్‌కు వచ్చేవరకు లైఫ్ జాకెట్లు తీయవద్దు. రోడ్డు ప్రయాణానికి, నీటిపై బోటులో ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గోదావరిలో బోటు వెళ్తున్నప్పుడు అటూ ఇటూ తిరగడం, అందరూ ఒకవైపు రావడం, తొంగిచూడడం చేయకూడదు. ఇలాచేస్తే బోటు ఒరిగిపోతుంది. సంతోషకరమైన ప్రయాణానికి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరం. – సురేష్‌బాబు, సీఐ రంపచోడవరం -
కోవిడ్ తర్వాత మారిన ట్రావెల్ ట్రెండ్స్
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ట్రావెల్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్’ ప్రకారం, 93% మంది భారతీయులు కోవిడ్ ముందుతో పోలిస్తే ప్రయాణాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారతీయులు ఈ ఏడాదిని టూర్స్‌కి మంచి సంవత్సరంగా భావిస్తున్నారు. భారతీయులను ప్రయాణానికి ప్రేరేపించేవాటిలో కొత్త అనుభవాలను కనుగొనడం 48శాతం మందికి ముఖ్యమైందిగా నిలిచింది. పెరిగిన ప్రయాణాలు.. 94 శాతం మంది ఖర్చు అలాగే 46% మంది విశ్రాంతి కోసం చూస్తున్నారు. టూర్స్‌ను ఇష్టపడుతున్నవారిలో 45% మంది కొత్త గమ్యస్థానాలను అన్వేషించారు. ప్రతీ 10 మందిలో ఐదుగురు తమ కలల గమ్యస్థానానికి ఒంటరిగా ప్రయాణించడానికి కూడా సై అంటున్నారు. రెండు ఆందోళనకర కోవిడ్ నేపధ్య సంవత్సరాల తర్వాత, భారతీయ టూర్ ఇష్టులలో ప్రయాణ సెంటిమెంట్ బాగా పుంజుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్.. ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా మారింది. ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్‌గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్,అన్అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ’నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది పనితో పాటే టూర్స్... ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్స్టారీల్స్తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. గత వారం, ఇండోనేషియా మరింత మంది విదేశీ పర్యాటకులను దేశంలోకి ఆహ్వానించడానికి ’డిజిటల్ నోమాడ్స్ వీసా’ని అందించింది. ప్రపంచంలోని ఏ ప్రదేశం నుండి అయినా పని చేయాలని కోరుకునే వారి కోసం మార్చిలో పోర్చుగల్ రెండేళ్ల నివాస వీసాను ప్రకటించింది. ఇటలీ కూడా వర్క్–ఫ్రమ్–ఎనీవేర్ బృందాల కోసం తన ప్రయాణ విధానాన్ని పునర్నిర్మిస్తోంది. వారిలో ఎక్కువ మంది హాలిడే మూడ్‌లో పని చేస్తుండడాన్ని బాగా ఇష్టపడుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు టూర్స్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపేరేటర్స్ చెప్పారు. .వర్క్‌తో పాటే విందు, వినోదం ‘‘మా రిసార్ట్స్‌లో 80శాతం వరకూ వర్కేషన్ కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, , ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’’ అంటూ ఐటీ ఉద్యోగి సూర్య చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. కేవలం పర్యావరణాన్ని ఆస్వాదించడం మాత్రమే కాకుండా వైవిధ్యమైన అభిరుచులను నెరవేర్చుకోవడానికి టూర్ ఇష్టులు తపనపడుతున్నారని క్లబ్ మహీంద్రా ప్రతినిధి చెప్పారు. వీటిలో ఇగ్లూలో బస చేయడం, ట్రీ హౌసెస్ మీద విందు ఆరగించడం, సమకాలీన కళా ప్రదర్శనలు, హార్స్ రైడింగ్, ఎటివి బైక్స్, పెయింట్ బాల్, నేచర్ వాక్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. అభిరుచులు మారాయి... మా 2.6లక్షల మంది సభ్యుల్లో 30శాతం మంది దక్షిణాది నుంచే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దిండిలో భాగస్వాములతో కలిసి ఆతిధ్య కేంద్రం నిర్వహిస్తున్నాం. కోవిడ్ తర్వాత ట్రావెల్ ట్రెండ్స్ బాగా మారాయి. అందుకు అనుగుణంగా మా ప్యాకేజీలు కూడా మారుస్తున్నాం. ఇటీవల బాగా పాప్యులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా రిసార్ట్స్ -
Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం
రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ► ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. ►జూన్ నెలలోనే కాపర్‌డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. ఉపాధిపై ప్రభావం పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బోట్లకు ఎన్వోసీ జారీ రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద 12 బోట్లను, వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు. 32 అడుగులకు అనుమతి ఇవ్వాలి గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –కొత్తా రామ్మోహన్రావు, బోట్ యజమానుల సంఘ ప్రతినిధి అనుకూలంగా నీటిమట్టం గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు బోట్ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్ డ్యామ్ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. –పి నాగరాజు, ఇన్చార్జి, టూరిజం కంట్రోల్ రూమ్ -
శ్రీకాకుళం.. ఆకట్టుకునేలా పర్యాటక రంగం
ఆర్థిక చోదక శక్తుల్లో పర్యాటక రంగం ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు కేవలం టూరిజం పరిశ్రమపైనే ఆధారపడి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశం, రాష్ట్రంలో పర్యాటక రంగం కొంత పురోగతి సాధిస్తున్నా.. ప్రకృతి అందాలకు నెలవైన చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అతి పొడవైన సముద్ర తీరం, కోనసీమ లాంటి ఉద్దానం, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. పర్యాటకంగా వాటిని తీర్చిదిద్దే కృషి ఇప్పుడిప్పుడే మొదలైంది. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓవైపు సాగర తీరం.. మరోవైపు మన్యం.. మధ్యలో కొండలు తదితర ఆహ్లాదకర అందాలతో జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం జిల్లా లోని టూరిస్ట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించడమే కాకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఆధ్మాత్మిక ప్రదేశాలను సైతం అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఉన్న చారిత్రక ప్రదేశాలకు కొత్త హంగులద్ది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి పథంలో... ► ఇప్పటికే శాలిహుండాన్ని పర్యాటక సౌకర్యాల కేంద్రంగా రూ.2.27 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ► పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయాన్ని రూ. 50లక్షలతో అభివృద్ధి చేశారు. ► తాజాగా శ్రీముఖలింగం క్షేత్రాన్ని ప్రసాదం స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.56 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ► శ్రీకూర్మం క్షేత్రాన్ని రూ.20 కోట్లతో, అరసవిల్లి క్షేత్రాన్ని రూ.30కోట్లతో ప్రసాదం స్కీమ్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. అరసవిల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమాచారం కేంద్రం, పర్యాటకుల సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు ఏడు సెంట్లు భూమిని దేవదాయ శాఖ ఇప్పటికే కేటాయించింది. దీనిలో 32 గదులు కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. రోప్‌వే ద్వారా అందాలు.. రోప్ వేలతో జిల్లా అందాలను తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో తొమ్మిది రోప్‌వే మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో నాలుగింటి కోసం రూ.119.34 కోట్లతో అంచనా నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్లింది. రెండో విడతలో మిగతా ఐదింటికి ప్రతిపాదనలు పంపించనుంది. ► శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా నుంచి పొన్నాడ కొండ వరకు రూ. 32.40 కోట్లతో, శాలిహుండం బుద్ధు ని కొండ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రూ.25.56 కోట్లతో, పలాసలో నెమలికొండ వద్ద రూ. 22.68 కోట్లతో, ఇచ్ఛాపురంలో రూ.17.64 కోట్లతో రోప్‌వే వేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవన్నీ మంజూరైతే జిల్లా పర్యాటకంగా మరింత ప్రగతి సాధించనుంది. పర్యాటక ప్రదేశాలెన్నో... ► జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ► తేలుకుంచి, బారువ, తేలినీలాపురం, దంతపురి, పొందూరు, కొరసవాడ, మందస, గొట్టా బ్యారేజీ, శాలిహుండం, పొన్నాడ కొండ తదితర చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ► తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఆకట్టుకుంటున్నాయి. ► రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలెన్నో. కళింగపట్నం, బారువ, శివసాగర్, గనగళ్లవానిపేట, మొగదలపాడు వంటి బీచ్‌లు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. శాలిహుండం, బారువ బీచ్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. శివసాగరం, గనగలవానిపేట, కళింగపట్నం బీచ్‌లను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. -
‘వైల్డ్ లైఫ్ టూరిజం’కి న్యూ లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొంగొత్త హంగులతో ‘వైల్డ్ లైఫ్ టూరిజం’సిద్ధమవుతోంది. తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వచ్చేనెల రెండోవారంలో మొదలు కానుంది. ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’లను అందుబాటులోకి తెచ్చి గతేడాది నవంబర్ 14న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలుకల్పించారు. గతేడాది ప్రారంభించిన ఈ టైగర్ సఫారీని ఈసారి మరిన్ని సౌకర్యాలతో మరింత ఆహ్లాదాన్ని పంచేలా జంతుప్రేమికులను అలరించేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. రాత్రి అడవిలో ప్రకృతి ఒడిలో సేదతీరేలా...: టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీలను కలు సుకుని వారి జీవనశైలిని తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని అదనపు ఆకర్షణలను జతచేస్తున్నారు. దా దాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదతీ రేలా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టిఇళ్లలో బసతో కొత్త అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమ య్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరి రక్షణ, పచ్చదనం కాపాడేందు కు అటవీశాఖ నిర్వహిస్తు న్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లను చూపిస్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌కు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్లడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈసారి అంతా కొత్త కొత్తగా.. గత ఏడాదితో పోల్చితే కొత్త కాటేజీలు సిద్ధం చేయడంతో పాటు, టైగర్ సఫారీకి అనువైన 8 కొత్త వాహనాలను కొంటున్నాం. అట వీ, జంతుప్రేమికులకు ఆహ్లాదం పంచడంతోపాటు, ఇక్కడ గడిపే సమయం మధురానుభూతులను నింపేందుకు దోహ దపడే చర్యలు చేపడుతున్నాం. నూతనంగా అందుబాటులోకి తెస్తున్న కాటేజీలతో పాటు మట్టి ఇళ్లు, ఒక ట్రీ హౌస్, ఎయిరోకాన్ హౌస్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో తరచుగా పులులు తారసపడుతుండటాన్ని బట్టి సంఖ్య పెరిగినట్టుగా అంచనా వేస్తున్నాం. చెంచుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పుట్టగొడుగులు, తేనేటీగల పెంపకంలో శిక్షణనిస్తున్నాం. – ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ