రిటైల్ బ్రాండ్స్ ప్రత్యేక దృష్టి
లిస్టులో తిరుపతి, అయోధ్య, వారణాసి
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్‌సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది.
వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్‌ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్‌మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్‌ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment