cbre
-
విస్తరిస్తున్న డేటా సెంటర్లు.. భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ మార్కెట్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆరేళ్ల వ్యవధిలో (2019–24) 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశ ఇన్వెస్టర్లు హామీ ఇచ్చారు. దీంతో 2027 ఆఖరు నాటికి ఈ విభాగంలోకి మొత్తం పెట్టుబడులు 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీ య సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి‘ అని నివేదిక పేర్కొంది. పెట్టుబడుల హామీలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అసాధారణ వృద్ధి.. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వ తోడ్పాటు, దేశ విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల దన్నుతో భారత డేటా సెంటర్ మార్కెట్ అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోందని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ రంగాల నుంచి డిమాండ్ నెలకొనడం, రాష్ట్రాల స్థాయిలో పాలసీలపరంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు మొదలైనవి ఇందుకు దోహదం చేస్తున్నాయని వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..2025 ఆఖరు నాటికి భారత డేటా సెంటర్ సా మర్థ్యం 2,070 మెగావాట్ల స్థాయికి చేరు కోనుంది. ప్రస్తుతం ఇది 1,255 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి 1,600 మెగావాట్లకు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. డేటా సెంటర్ల సంఖ్యాపరంగా ముంబై అగ్రస్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం డేటా సెంటర్ సామర్థ్యాల్లో 90 శాతం ఈ నగరాల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడం, డిజిటల్ పరివర్తన, ఇంటర్నెట్ విస్తృతి పెరగడం, సానుకూల విధానాలు, (ఏఐ) ఆధారిత డేటా మొదలైనవి డేటా సెంటర్ల వృద్ధికి తోడ్పడగలవు. అలాగే ఈ విభాగానికి మౌలిక రంగం హోదా ఇవ్వడం సైతం ఇందుకు దోహదపడుతున్న కీలకాంశాల్లో ఒకటి. దీనితో ఆపరేటర్లు, డెవలపర్లకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. డిజిటల్ వ్యక్తిగత డేటా భ ద్రత చట్టం (డీపీడీపీఏ) అమలు అనేది చట్ట బద్ధమైన డేటా ప్రాసెసింగ్‌కు, సంబంధిత వర్గాల విశ్వాసాన్ని చూరగొనేందుకు దోహదపడింది. -
రియల్ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ అసెట్స్‌లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్‌తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.2024 జనవరి–సెప్టెంబర్ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్ఎం–ఆర్ఈఐటీ ఫ్రేమ్‌వర్క్‌తో ద్వితీయ శ్రేణి నగరాల్లో అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది. -
ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్‌కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.డీల్స్ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్ డీల్స్‌లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీల్స్‌లో రెసిడెన్షియల్ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 13 శాతం, ఆఫీస్ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్ఈ తెలియజేసింది.ఇదీ చదవండి: ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్ ఎస్టేట్ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్‌ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్‌గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్ఈ వివరించింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస ఇళ్లకు (లగర్జీ) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. సెపె్టంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లతో పోల్చి చూస్తే 38 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కాస్త మెరుగ్గా 1,560 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. → ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి. → ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు తగ్గిపోయాయి. → పుణెలో రెట్టింపునకు పైగా పెరిగి 810 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి. → కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆధునిక అపార్ట్మెంట్ల వైపు మొగ్గు.. ‘‘ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్ పెరగడం చూస్తున్నాం. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మార్కెట్ మళ్లుతోంది. దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోలి్చతే కీలక వైవిధ్యంగా మారింది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం నివాస అనుభవం, ప్రపంచస్థాయి వసతులు మారిన కొనుగోలుదారుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. -
రియల్టీలో భారీగా పెరిగిన పెట్టుబడులు: సీబీఆర్ఈ
2024 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు 8.9 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం 2018లో ఈ పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లు, 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్లు, 2023లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు. రియల్ ఎస్టేట్ ఫండ్ – కమ్ – డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు మొదలైనవి చేసే ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీ పెట్టుబడులుగా వ్యవహరిస్తారు. డేటా ప్రకారం జూన్ త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు కొత్త గరిష్టాలకు ఎగిశాయి. జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో రియల్టీలోకి 2.6 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని సీబీఆర్ఈ చైర్మన్ (భారత్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఇన్వెస్టర్లు (ప్రధానంగా డెవలపర్లు) పెట్టుబడులకు నేతృత్వం వహించారు. ఆఫీస్ లీజింగ్ మార్కెట్ పుంజుకోవడం, గృహాల కొనుగోలు.. ఖర్చు చేసే విషయంలో వినియోగదారుల్లో రిస్కు సామర్థ్యాలు అసాధారణంగా పెరగడం తదితర అంశాలు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రియల్టీలోకి పెట్టుబడులు రావడానికి దోహదపడినట్లు నివేదిక వివరించింది. -
ఆఫీస్ స్పేస్‌లో.. దేశీ కంపెనీల హవా
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల వినియోగంలో దేశీ కంపెనీల వాటా గణనీయంగా మెరుగుపడింది. 2022కు ముందు తొమ్మిది పట్టణాల్లోని మొత్తం ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మూడింట ఒక వంతే ఉండగా, ఆ తర్వాత (2022 నుంచి 2024లో మొదటి ఆరు నెలలు) చోటుచేసుకున్న 154 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) లీజు లావాదేవీల్లో దేశీ కంపెనీల వాటా 47 శాతానికి (72 మిలియన్ ఎస్ఎఫ్టీ) చేరుకుంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, కోచి, అహ్మదాబాద్‌కు సంబంధించి గణాంకాలను ఈ నివేదికలో సీబీఆర్ఈ వెల్లడించింది. ‘‘వృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ పట్ల దేశీ కంపెనీల అంకిత భావాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మరింత పెరుగుతుంది. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంతో వేగంగా విస్తరిస్తోంది. నైపుణ్య మానవవనరులు దండిగా ఉన్నాయి. డిమాండ్‌ను కీలకంగా ఇవే నడిపిస్తున్నాయి. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత, సౌకర్యవంతమైన పని వాతావరణానికి భారత కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ పేర్కొన్నారు. టాప్–9 పట్టణాల్లో 2026 నాటికి అదనంగా 189 మిలియన్ ఎస్ఎఫ్టీల ప్రీమియం ఆఫీస్ వసతి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మెరుగుపడిన సామర్థ్యాలు.. అంతర్జాతీయ అనిశి్చతుల్లోనూ దేశ ఆర్థిక భవిష్యత్ వృద్ధి పట్ల స్థానిక కంపెనీల్లో ఉన్న ఆశాభావాన్ని సీబీఆర్ఈ డేటా తెలియజేస్తోందని భీవ్ వర్క్‌స్పేసెస్ వ్యవస్థాపకుడు, సీఈవో శేషురావు పప్లికర్ పేర్కొన్నారు. ‘‘ఇది దేశ వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ పరిణతిని తెలియజేస్తోంది. స్థిరమైన వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని భారత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నందున, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని శేషురావు వివరించారు. స్థానిక కంపెనీల సామర్థ్యాలను ఈ డిమాండ్ ధోరణులు తెలియజేస్తున్నట్టు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మ గ్రూప్ ఏవీపీ (ఆపరేషన్స్) ఆశిష్ శర్మ అన్నారు. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ రంగాల మద్దతుతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ పుంజుకున్నట్టు చెప్పారు. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
విలాస గృహాలకు గిరాకీ
న్యూఢిల్లీ: ప్రముఖ పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సహా టాప్–7 పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి ఖరీదు చేసే ఇళ్ల విక్రయాలు గతేడాది (2023లో) 75 శాతం అధికంగా నమోదయ్యాయి. సంపన్నులు (హెచ్ఎన్ఐలు) లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో గతేడాది విలాస గృహాల అమ్మకాలు 2,030 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2022)లో ఇవి 1,240 యూనిట్లు కావడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి విలువైన ఇళ్ల అమ్మకాలు 2023లో 12,935 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో 7,395 ఇళ్లు అమ్ముడుపోయాయి. ‘‘ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లకు ఉన్న ఆకర్షణ కొనసాగుతుంది. మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సమీప భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతుంది. ప్రాంతీయంగా కొంత అస్థిరతలు ఉండొచ్చు. మొత్తం మీద భవిష్యత్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2023లో 5,530 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో అమ్మకాలు 1,860 యూనిట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. ► ముంబైలో 4,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదిలో అమ్మకాలు 3,390 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణెలో 450 యూనిట్ల విక్రయాలు గతేడాది నమోయ్యాయి. అంతకుముందు ఏడాది ఇవి 190 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా 265 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతాలో 2022లో 300 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా, గతేడాది ఇవి 310 యూనిట్లకు పెరిగాయి. ► చెన్నైలోనూ విక్రయాలు 150 యూనిట్ల నుంచి 160 యూనిట్లకు పెరిగాయి. ► 2023లో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల కేటగిరీల్లో ఇళ్ల అమ్మకాలు 3,22,000 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ► మెరుగైన డిమాండ్ నేపథ్యంలో డెవలపర్లు 3,13,000 యూనిట్ల కొత్త ఇళ్ల యూనిట్లను ప్రారంభించారు. 2022తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. ఆర్థిక స్థితిలో మార్పు. ‘‘బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతోంది. మెరుగైన ఉపాధి అవకాశాలు ఏ్పడుతున్నాయి. దీంతో మరింత మందికి మెరుగైన జీవనశైలి చేరువ అవుతోంది. పేరొందిన సొసైటీల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’’అని గురుగ్రామ్‌కు చెందిన రియల్టీ సంస్థ క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. ఈ ధోరణి ఇక ముందూ కొనసాగడమే కాకుండా, భారత్ వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో మరింత విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్‌లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్‌లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్‌స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
లగ్జరీ ఇళ్ల గిరాకీ : కోట్లు అయినా...సరే! హైదరాబాదీల జోరు
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో భారతీయ రియల్ ఎస్టేట్ దూసుకుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పుంజుకుంది. స్మార్ట్, లగ్జరీ హోమ్స్, టాప్ క్లాస్ ఎమినిటీస్ ఉంటే చాలు ధర ఎంతైనా వెనుకాడ్డం లేదు. 4 కోట్ల రూపాయ విలువైన ఇళ్లను సొంతం చేసుకునేందుకు బడాబాబులు ఎగబడుతున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీకి అభిస్తున్న ఆదరణ, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఆదాయాలు, మెరుగైన జీవన ప్రమాణాపై పెరుగుతున్న ఆకాంక్ష,ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విలాసవంతమైన నివాసాల కొరత వంటి అనేక అంశాలు లగ్జరీ హౌసింగ్ అమ్మకాల పెరుగుదలకు దారితీసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2023 జనవరి-సెప్టెంబర్ మధ్య భారతదేశంలో రూ. 4 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన విలాస వంతమైన గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 తొలి తొమ్మిది నెలల్లో 97 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CBRE నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఏడు నగరాల్లో, ఈ సంవత్సరం 9,200 లగ్జరీ గృహాలు అమ్ముడైనాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 4,700 యూనిట్లు మాత్రమే. ఈ కాలంలో జరిగిన మొత్తం లగ్జరీ హౌసింగ్ విక్రయాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్‌ల వాటా 90 శాతంగా ఉందని వేదిక ఢిల్లీ-ఎన్సీఆర్లో 37 శాతం, ముంబైలో 35 శాతం, హైదరాబాద్‌లో 18 శాతం అమ్మకాలు జరిగాయి. మిగిలిన 4 శాతం పూణేలో నమోదైనాయి. (విడాకుల వివాదం : తొలిసారి స్పందించిన గౌతమ్ సింఘానియా) అంతేకాదు అక్టోబరు- డిసెంబరు పండుగల సీజన్లో లగ్జరీ హౌసింగ్ విక్రయాలు మరింత జోరందు కుంటాయని కూడా నివేదించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తొలిసారిగా లగ్జరీ గృహాలను కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లగ్జరీ లైఫ్‌పై పెరుగుతున్న ఆసక్తి, ఈ పెరుగుదలకు కొన్నికారణాలులుగా సీబీఆర్ఈ వెల్లడించింది. ఈప్రాధాన్యతల కారణంగా ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ విభాగంలో రెసిడెన్షియల్ అమ్మకాలతోపాటు, కొత్త లాంచ్‌లు పెరుగుతాయని అంచనా వేసింది. 2023లో 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. అలాగే సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను కోరుకునే అధిక-నికర-విలువ గల వ్యక్తులు (HNIలు), ప్రవాస భారతీయులు (NRIలు) ఆసక్తి కూడా ఈ పెరుగుదలకు దోహదపడుతోందని వెల్లడించింది. (ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?) -
ఖరీదైన ఇళ్లకు గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు అధిక డిమాండ్ నెలకొంది. రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 97 శాతం పెరిగి 9,200 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 4,700 యూనిట్లుగానే ఉన్నాయి. టాప్–7 పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ‘ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ3, 2023’ నివేదిక రూపంలో విడుదల చేసింది. ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ విలావంత ఇళ్ల అమ్మకాల్లో టాప్–3గా ఉన్నాయి. సెపె్టంబర్ క్వార్టర్లో మొత్తం విక్రయాల్లో 90 శాతం ఈ మూడు పట్టణాల్లోనే నమోదయ్యాయి. 9,200 యూనిట్ల అమ్మకాల్లో 37 శాతం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. ముంబై వాటా 35 శాతం, హైదరాబాద్ వాటా 18 శాతం, పుణె వాటా 4 శాతం చొప్పున ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూలైతో ముగిసిన త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం పెరిగి 2,400 యూనిట్లుగా ఉన్నాయి. జూలై త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ టాప్–3 మార్కెట్లుగా ఉండడం, కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య మార్కెట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పండుగల జోష్ ఈ ఏడాది పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు 2021 నుంచి చూస్తే అత్యధికంగా ఉంటాయని సీబీఆర్ఈ అంచనా వేసింది. 2021 పండుగ సీజన్లో 1,14,500 యూనిట్లు అమ్ముడుపోగా, 2022 పండుగల సీజన్లో 1,47,300 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాది పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు 1,50,000 యూనిట్లు మైలురాయిని దాటిపోవచ్చని సీబీఆర్ఈ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల విభాగాల్లో 2,30,000 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2,20,000 యూనిట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో నూతన ప్రాజెక్టుల ప్రారంభం విషయంలో ముంబై, పుణె, హైదరాబాద్‌లో మెరుగైన వృద్ధి కనిపించింది. ఈ మూడు పట్టణాలు మొత్తం నూతన ప్రాజెక్టుల ప్రారంభంలో 64 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
లగ్జరీ ఇళ్ల అమ్మకాలు డబుల్.. టాప్‌లో హైదరాబాద్!
Luxury housing sales: దేశంలో ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. ఖరీదు ఎక్కువైనా విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల్లో ఈ ధోరణి ఇటీవల మరింత పెరిగింది. ఈ క్రమంలో రూ.4 కోట్లు, అంతకంటే విలువైన లగ్జరీ నివాసాల అమ్మకాలు దాదాపు రెట్టింపైనట్లు రియల్ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ (CBRE South Asia Pvt.Ltd) ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా టాప్ ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 97 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 4,700 లగ్జరీ నివాసాలు అమ్ముడుపోగా ఈ ఏడాది వాటి సంఖ్య దాదాపు రెట్టింపై 9,200లకు చేరింది. మూడు నగరాల్లోనే 90 శాతం ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ అమ్మకాలలో మొదటి మూడు మార్కెట్లుగా ఉద్భవించాయి. మొత్తం టాప్ ఏడు నగరాల్లో జరిగిన అమ్మకాలలో దాదాపు 90 శాతం ఈ మూడు నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో దాదాపు 37 శాతం వాటాతో ఢిల్లీ-ఎన్సీఆర్ టాప్‌లో ఉండగా ముంబయి, హైదరాబాద్, పుణె వరుసగా 35 శాతం, 18 శాతం, 4 శాతం వాటాతో ముందంజలో ఉన్నాయి. ఈ తొమ్మిది నెలల్లో నమోదైన పటిష్టమైన అమ్మకాల ఆధారంగా ఈ పండుగల సీజన్లో హౌసింగ్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ కొత్త రికార్డును నెలకొల్పుతుందని, మొత్తం గృహాల విక్రయాలు 150,000 యూనిట్లను దాటతాయని అంచనా వేస్తున్నారు. -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్‌కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్‌లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్‌లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
రిటైల్ స్పేస్ లీజింగ్‌లో జోరు! హైదరాబాద్ వాటా..
ముంబై: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో మంచి పనితీరు చూపించింది. లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 24 శాతం పెరిగి 2.87 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో రిటైల్ లీజ్ పరిమాణం 2.31 చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధి 15 శాతంతో పోలి్చనా, ఈ ఏడాది ప్రథమార్ధంలో మంచి పురోగతి కనిపించింది. రిటైల్ స్పేస్ సరఫరా మాత్రం ఈ ఎనిమిది పట్టణాల్లో 148 శాతం పెరిగి 1.09 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సరఫరా 0.44 చదరపు అడుగులుగా ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సలి్టంగ్ కంపెనీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢీల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ కొత్త రిటైల్ లీజింగ్‌లో 65 శాతం వాటా ఆక్రమించాయి. 2023 జనవరి – జూన్ కాలంలో బెంగళూరు అత్యధికంగా 0.8 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ 0.7 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై, అహ్మదాబాద్ 0.4 చదరపు అడుగుల చొప్పున, ముంబై, హైదరాబాద్ మార్కెట్లు 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతా 0.06 చదరపు అడుగులు, పుణె 0.12 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేశాయి. డిమాండ్‌లో వృద్ధి షాపర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పట్టణాల్లో మాల్స్ నిర్మాణంలో 8 శాతం వృద్ధి కనిపించింది. రిటైల్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ల వాటా 59 శాతంగా ఉంది. విడిగా చూస్తే బెంగళూరు 35 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ మార్కెట్ 24 శాతం, చెన్నై 14 శాతం, హైదరాబాద్ మార్కెట్ వాటా 11 శాతం చొప్పున నమోదైంది. ఫ్యాషన్, వ్రస్తాల విభాగం నుంచి 38 శాతం, ఫుడ్, బెవరేజెస్ నుంచి 18 శాతం, లగ్జరీ, హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్ విభాగాల నుంచి 11 శాతం డిమాండ్ కనిపించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్ లీజులో 7 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఎనిమిది మార్కెట్లలో రిటైల్ లీజ్ పరిమాణంలో దేశీయ సంస్థల వాటా 75 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికాలకు సంబంధించి రిటైల్ లీజింగ్ ఆశావహంగా కనిపిస్తున్నట్టు సీబీఆర్ఈ సౌత్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. సెకండరీ లీజింగ్ మరింత జోరుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో ఆ గృహాలకు మహా గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో విలాస గృహాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) 430 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో విక్రయాలు 50 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది రెట్లకు పైగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఈ వివరాలను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ విలాస నివాసాలు జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. మొత్తం 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1,600 యూనిట్లతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా నమోదయ్యాయి. అన్ని రకాల ఇళ్లు కలసి ఈ ఏడు పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో 78,700 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 70,500 యూనిట్లుగా ఉన్నాయి. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 600 యూనిట్లు ఉంటే, అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో 1,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబైలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు 800 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు పెరిగాయి. ► పుణెలో 10 రెట్లు అధికంగా 150 యూనిట్లు అమ్ముడుపోగా, బెంగళూరులో కేవలం 50 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతాలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 50 యూనిట్ల నుంచి 100కు పెరిగాయి. ► చెన్నై మార్కెట్లో విలాస నివాసాల అమ్మకాలు 250 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 50 యూనిట్లుగానే ఉన్నాయి. బలంగా సొంతిల్లు ఆకాంక్ష 2022లో ఖరీదైన ఇళ్ల విభాగం బలమైన పనితీరు చూపించగా, ఆ తర్వాత కూడా అదే విధమైన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కొనసాగినట్టు సీబీఆర్ఈ తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత విలాస గృహాలకు డిమాండ్ ఎగిసింది. సొంతిల్లు కావాలని, విశాలమైన ఇళ్లు కావాలని కోరుకునే వారు పెరిగారు’’అని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. సొంతిల్లు కావాలనే ఆకాంక్ష ఈ ఏడాది కూడా విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. వినియోగ ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్యం, భద్రత, చుట్టూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడిన ప్రాజెక్టులకు డిమాండ్ ఉంటుందన్నారు. లగ్జరీ ప్రాపర్టీలకు కన్సల్టెన్సీ సేవలు అందించే సోథెబీ ఎండీ అమిత్ గోయల్ స్పందిస్తూ.. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో 5–7 ఏళ్ల పాటు బేర్, బుల్ సైకిల్ ఉంటుందని చెబుతూ.. ప్రస్తుతం కచ్చితంగా బుల్ సైకిల్ అని పేర్కొన్నారు. -
రియల్టీలో భారీ లావాదేవీలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు 2018–22 మధ్య భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. 12.2 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు సమారు) ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6,800 ఎకరాల భూమిని సమీకరించినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో డెవలపర్ల నుంచి భూముల కొనుగోలుకు ఆసక్తి పెరిగినట్టు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల్లో భూముల కొనుగోలు పెరిగిందని.. 6,800 ఎకరాల్లో అధిక భాగం 2021 జనవరి తర్వాత సమకీరించినదిగా పేర్కొంది. ‘‘భూముల క్రయ విక్రయాల పరంగా 2022 సంవత్సరం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని దీర్ఘకాలం కోసం చూస్తున్నట్టు ఇది తెలియజేస్తోంఇ’’ అని సీబీఆర్ఆ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మొత్తం కొనుగోలు చేసిన భూముల్లో నివాస, మిశ్రమ వినియోగానికి సంబంధించే 60 శాతంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనే భూముల సమీకరణకు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రానున్న సంవత్సరాల్లో ఈ విభాగాల నుంచి ప్రాపర్టీల సరఫరా ఎక్కువగా ఉంటుందని సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. గ్రీన్‌ఫీల్డ్ కార్యాలయాల అభివృద్ధికి సంబంధించి భూముల కొనుగోళ్లు మొత్తం పెట్టుబడుల్లో 19 శాతంగా ఉండగా, ఇండస్ట్రియల్ రంగంలో 9 శాతం, లాజిస్టిక్స్ అవసరాల భూముల కోసం 7 శాతం పెట్టుబడులు వచ్చాయి. పార్క్‌ల అభివృద్ధికి సంబంధించి భూముల సమీకరణ 3 శాతంగా ఉంది. ప్రాంతాల వారీ.. ► 2018–22 మధ్య జరిగిన భూముల కొనుగోళ్లలో 67 లావాదేవీలు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే నమోదయ్యాయి. 760 ఎకరాల కొనుగోలుకు 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబలు వచ్చాయి. ► ముంబైలో 960 ఎకరాలకు సంబంధించి 3.8 బిలియన్ డాలర్ల విలువైన 73 లావాదేవీలు నమోదయ్యాయి. ► బెంగళూరులో 1.1 బిలియన్ డాలర్ల విలువ చేసే 700 ఎకరాలకు సంబంధించి 44 లావాదేవీలు జరిగాయి. ► హైదరాబాద్ మార్కెట్లో 2018–22 మధ్య మొత్తం 24 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 970 ఎకరాల కొనుగోలుకు 0.9 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ► పుణె నగరంలో 450 ఎకరాలకు సంబంధించి 27 లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వీటి విలువ 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ► చెన్నై రియల్టీ మార్కెట్ 2.88 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది. ► ఇక దేశంలోని మిగిలిన పట్టణాల్లో 1,300 ఎకరా లకు సంబంధించి లావాదేవీలు నమోదయ్యాయి. విలువలు ఇలా... 2018–22 మధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మొత్తం మీద 43.3 బిలియన్ డాలర్ల విలువ చేసే (రూ.3.55 లక్షల కోట్లు) లావాదేవీలు చోటు చేసుకున్నట్టు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. నార్త్ అమెరికా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లను ఈక్విటీ రూపంలో సమకూర్చారు. ఈ కాలంలో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీకరించిన మొత్తం ఈక్విటీ నిధుల్లో ఇవి 58 శాతంగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం స్థిరంగా ఉంటుందని, 16–17 బిలియన్ డాలర్ల మేర రావచ్చని అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఆఫీస్ విభాగం అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగాల్లోకి పెట్టుబడులు వస్తాయన్నారు. -
దేశీ రియల్టీలో భారీ పెట్టుబడులు: ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు!
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో(2023-24) దేశీ రియల్టీ రంగంలో 13 బిలియన్ డాలర్ల(రూ. 1,07,081 కోట్లు) వరకూ ఈక్విటీ పెట్టుబడులు లభించవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. గత ఐదేళ్లలో 32 బిలియన్ డాలర్ల(రూ. 2,63,584 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులు రియల్టీలోకి ప్రవహించినట్లు సీబీఆర్ఈ పేర్కొంది. రానున్న రెండేళ్లలో పెట్టుబడులు గరిష్టంగా కార్యాలయ ఆస్తులకు మళ్లవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ అభిప్రాయపడింది. ఏడాదికి 6-7 బిలియన్ డాలర్ల చొప్పున రెండేళ్లలో దేశీ రియల్టీ రంగం 12-13 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకునే వీలున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లతోపాటు రీట్స్ తదితరాలు చేపట్టే ఈక్విటీ పెట్టుబడులపై సీబీఆర్ఈ నివేదిక రూపొందించింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇతర విభాగాలకూ రియల్టీ రంగ ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం ఆఫీస్ ఆస్తుల విభాగంలోకి ప్రవహించనుండగా.. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్, స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ తదుపరి స్థానాల్లో నిలవనున్నాయి. ఇక వీటికి అదనంగా డేటా సెంటర్లకు ప్రధానంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) లభించనున్నాయి. దేశీయంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి వంటి మూలాలు బలంగా ఉన్నట్లు సీబీఆర్ఈ చైర్మన్(ఆసియా, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. వీటికితోడు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్యం రానున్న ఏడాదిలో రియల్టీ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. సరఫరా చైన్ అవసరాల రిస్కులను తగ్గించుకునేందుకు పలు ప్రపంచ కార్పొరేట్లు చైనా+1 వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఉత్పాదక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైతం దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండియాకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. వెరసి రానున్న ఐదారేళ్లలో గ్లోబల్ సప్లై చైన్ రంగంలో ఇండియా మార్కెట్ వాటా బలపడనున్నట్లు అంచనా వేశారు. ఈ సానుకూల అంశాలతో ఆర్థిక వ్యవస్థ వార్షికంగా వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రపంచ సగటును మించుతూ దేశీ రియల్ ఎస్టేట్ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన ) నగరాల ముందంజ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రధానంగా మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాలు రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. 2018లో దేశీ రియల్టీ రంగంలో 5.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు లభించగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ బాటలో 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు దేశీ రియల్టీలో నమోదైనట్లు సీబీఆర్ఈ గణాంకాలు తెలియజేశాయి. (స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) 2018-22 కాలంలో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2018 నుంచి పెట్టుబడుల్లో ఈ నగరాలు 63 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే గత ఐదేళ్లలో నమోదైన 32 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు ఇక్కడికే ప్రవహించాయి. కాగా.. కార్యాలయ ఆస్తులు 13 బిలియన్ డాలర్లతో 40 శాతం వాటాను ఆక్రమించాయి. ఇదేవిధంగా స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకున్నాయి. ఇది ఐదేళ్ల మొత్తం పెట్టుబడుల్లో 39 శాతం వాటాకు సమానం! ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు 2023-24పై ఇండియా రేటింగ్స్ 2022–23లో 8-10 శాతం మేర పెరగొచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చని ఇళ్ల ధరలు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి తటస్థ అంచనాలతో ఉన్నట్టు తెలిపింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022–23లో క్రమబద్ధమైన అప్డ్రెంట్లో ఉంది. టాప్ 8 రియల్ ఎస్టేట్ క్లస్టర్లలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాలు పెరిగినా, మార్ట్గేజ్ రేట్లు పెరిగినా, దేశీయంగా, అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి తగ్గినా అమ్మకాలు పెరగడం ఆశాజనకనం’’అని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్వల్పకాలానికి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపించొచ్చని, మొత్తం మీద నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఒత్తిళ్లను సర్దుబాటు చేసుకోగలదనే అంచనాలను వ్యక్తం చేసింది. డిమాండ్ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపింది. అమ్మకాల ఊపు కొనసాగుతుందని, మొత్తం మీద వార్షికంగా చూస్తే విక్రయాలు 9 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 2022-23లో నిర్మాణ వ్యయాలు 8–10 శాతం మేర పెరిగాయని, దీంతో డెవలపర్లకు నిర్మాణ బడ్జెట్ 5–6 శాతం మేర అధికం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ డెవలపర్లు వచ్చే ఆరేడు నెలలపాటు ధరలు పెంచకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో డిమాండ్ బలపడే వరకు వేచి చూడొచ్చని పేర్కొంది. అందుబాటు ధరలు.. అందుబాటు ధరలు 2021-22లో ఇళ్ల అమ్మకాలను నడిపించినట్టు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ‘‘అయితే ద్రవ్యోల్బణం అమ్మకాల ధరలను పెంచేలా చేశాయి. 2022 మే నుంచి ఆర్బీఐ వరుసగా రెపో రేటు పెంపు 2022- 23లో అందుబాటు ధరల ఇళ్ల విభాగం డిమాండ్‌కు సవాలుగా నిలిచాయి. అంతేకాదు, మధ్య, ప్రీమియం విభాగంలోనూ కొనుగోళ్లను వాయి దా వేయడానికి దారితీశాయి. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని పెద్ద సంస్థలు, మంచి బ్రాండ్ విలువ కలిగినవి, 2023-24లో బలమైన నిర్వహణ పనితీరు చూపిస్తాయి. తద్వారా వాటి మార్కెట్ షేరు పెరగొచ్చు’’అని పేర్కొంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని డెవలపర్లు బలహీన అమ్మకాలు, వసూళ్లు, నిధుల లభ్యత పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
అద్దెకా! ఆ రోజులు పోయాయమ్మా.. రెండేళ్లలో గృహ ప్రవేశమే!
న్యూఢిల్లీ: భారతీయులు దాదాపు 45 శాతం మంది రాబోయే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్నారు. ఎక్కువ మంది అద్దెకు బదులుగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకుంటున్నరు. ‘వాయిసెస్ ఫ్రమ్ ఇండియా’’ పేరుతో ప్రాపర్టీ కన్సల్టెంట్-సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన ఒక సర్వే ఈ అంశాలను వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా 20,000 మంది ఈ సర్వేలో పాల్గొంటే ఇందులో భారతీయుల సంఖ్య 1,500. వీరిలో జెన్-జెడ్ (18-25 సంవత్సరాలు), లేట్ మిలీనియల్స్ (26-33 సంవత్సరాలు) ఎర్లీ మిలీనియల్స్ (34-41 మధ్య వయస్సులు), జెన్ ఎక్స్ (42-57 సంవత్సరాలు) బేబీ బూమర్స్ (58 దాటినవారు) ఈ సర్వేలో ఉన్నారు. ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని ఇండియా మార్టిగేజ్ గ్యారెంటీ కంపెనీ (ఐఎంజీసీ) ఇటీవలే తన తాజా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30-50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఐఎంజీసీ వివరించింది. -
ఊపు మీదున్న రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపింగ్ మాల్స్, ఖరీదైన వీధుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ గతేడాది 47 లక్షల చదరపు అడుగులు నమోదైంది. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో 2021తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో వెల్లడించింది. ‘భారత రిటైల్ రంగం రికవరీ బాటలో ఉంది. ఈ ఏడాదీ ఊపు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశీ బ్రాండ్లు ప్రథమ శ్రేణి నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించడమే ఇందుకు కారణం. 2022లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ బెంగళూరులో 16.8 లక్షల నుంచి 19.2 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ ఎన్సీఆర్ 3.6 లక్షల నుంచి 9.6 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో 6.4 లక్షల నుంచి 3.1 లక్షల చదరపు అడుగులకు, ముంబైలో 6.6 లక్షల నుంచి 3.9 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. 2023లో భారత్‌లో కొత్తగా 16 మాల్స్ రాబోతున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే స్థాయిలో మాల్స్ ఏర్పాటు కానున్నాయి’ అని వివరించింది. -
CBRE India: ఆఫీసు లీజింగ్‌లో భారత కంపెనీల పైచేయి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్‌లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్‌లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్‌లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. -
డేటా సెంటర్లు.. భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపారంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. గత ఐదేళ్లలో ఈ విభాగంలోకి 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని.. 2025 నాటికి మొత్తం పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు (రూ.1.6 లక్షల కోట్లు) చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేసింది. స్థిరమైన ఆదాయం వచ్చే ఆస్తుల పట్ల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. డేటా సెంటర్లు – రియల్ ఎస్టేట్‌లో డిమాండ్‌పై ఈ సంస్థ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. విధానపరమైన ప్రోత్సాహం, డిజిటలైజేషన్‌తో దేశంలో డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి టెక్నాలజీ అమలును వేగవంతం చేసిందని, దీంతో డేటా వినియోగం గణనీయమైన స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, ఈ కామర్స్, ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్‌ల ఆన్లైన్ విద్య, లొకేషన్ ఆధారిత పని, అత్యాధుని టెక్నాలజీలు.. మెషిన్ లెర్నింగ్, 5జీ, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలసి డేటా ట్రాన్స్‌మిషన్‌ను ఎన్నో రెట్లు పెంచినట్టు.. అధిక సామర్థ్యం కలిగిన సర్వర్ల అవసరం ఏర్పడినట్టు వివరించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం డేటా సెంటర్లు అన్నవి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్‌లో ముఖ్యమైన ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారినట్టు సీబీఆర్ఈ పేర్కొంది. స్థిరమైన ఆదాయం కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నందున ఈ రంగంలో పెట్టుబడులు మరిన్ని గరిష్టాలకు చేరాతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం డేటా కేంద్రాలకు మౌలికరంగ హోదాను కల్పించడాన్ని కూడా సానుకూలంగా పేర్కొంది. ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా వేసింది. ఈ సానుకూలతలతోనే 2025 నాటికి పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లు దాటతాయన్న అంచనాతో ఉంది. అంటే గత ఐదేళ్లలో వచ్చిన 14 బిలియన్ డాలర్లకు అదనంగా, వచ్చే ఐదేళ్లలో మరో 6 బిలియన్ డాలర్ల నిధులు ఈ రంగంలోకి రానున్నాయి. వివిధ రంగాల్లోని వ్యాపారాలు డిజిటల్ విభాగంలోకి విస్తరిస్తున్నందున డేటా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతుందని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. టెక్నాలజీ, ఆటోమేషన్ అన్నవి వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో డేటా కేంద్రాలు ఏ విధంగా విస్తరిస్తాయనేదానికి కీలకమని పేర్కొంది. -
ఆ సత్తా మన కంపెనీలకు లేదు
• ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటంలో తీసికట్టే • రియల్టీ సంస్థ సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి ముంబై: భారత కంపెనీల్లో 75 శాతానికి పైగా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేందుకు సిద్ధంగా లేవని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాల రిస్క్‌ను తగ్గించడానికి ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసే ప్రైవేట్ సంస్థల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉందంటున్న ఈ నివేదికలోని ముఖ్యాంశాలివీ... ⇔ ముందు చూపు, తగిన ప్రణాళిక లేనందునే భూకంపాలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని 96% కంపెనీలు అంగీకరించాయి. ⇔ తమ ప్రాజెక్టుల్లో ఆపదలను తగ్గించే చర్యలు తీసుకున్నామని చెప్పిన కంపెనీల సంఖ్య 21 శాతంగానే ఉంది. అన్ని భవనాలను వివిధ కాలవ్యవధుల్లో తనిఖీ చేయడం తప్పనిసరని 97 శాతం కంపెనీలు అంగీకరించాయి.