ముంబై: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో మంచి పనితీరు చూపించింది. లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 24 శాతం పెరిగి 2.87 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో రిటైల్ లీజ్ పరిమాణం 2.31 చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధి 15 శాతంతో పోలి్చనా, ఈ ఏడాది ప్రథమార్ధంలో మంచి పురోగతి కనిపించింది. రిటైల్ స్పేస్ సరఫరా మాత్రం ఈ ఎనిమిది పట్టణాల్లో 148 శాతం పెరిగి 1.09 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సరఫరా 0.44 చదరపు అడుగులుగా ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సలి్టంగ్ కంపెనీ సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢీల్లీ ఎన్‌సీఆర్, అహ్మదాబాద్ కొత్త రిటైల్ లీజింగ్‌లో 65 శాతం వాటా ఆక్రమించాయి. 2023 జనవరి – జూన్ కాలంలో బెంగళూరు అత్యధికంగా 0.8 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్ 0.7 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై, అహ్మదాబాద్ 0.4 చదరపు అడుగుల చొప్పున, ముంబై, హైదరాబాద్ మార్కెట్లు 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతా 0.06 చదరపు అడుగులు, పుణె 0.12 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేశాయి.
డిమాండ్‌లో వృద్ధి
షాపర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పట్టణాల్లో మాల్స్ నిర్మాణంలో 8 శాతం వృద్ధి కనిపించింది. రిటైల్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్ల వాటా 59 శాతంగా ఉంది. విడిగా చూస్తే బెంగళూరు 35 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ మార్కెట్ 24 శాతం, చెన్నై 14 శాతం, హైదరాబాద్ మార్కెట్ వాటా 11 శాతం చొప్పున నమోదైంది. ఫ్యాషన్, వ్రస్తాల విభాగం నుంచి 38 శాతం, ఫుడ్, బెవరేజెస్ నుంచి 18 శాతం, లగ్జరీ, హోమ్ డిపార్ట్‌మెంట్ స్టోర్ విభాగాల నుంచి 11 శాతం డిమాండ్ కనిపించింది.
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్ లీజులో 7 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఎనిమిది మార్కెట్లలో రిటైల్ లీజ్ పరిమాణంలో దేశీయ సంస్థల వాటా 75 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికాలకు సంబంధించి రిటైల్ లీజింగ్ ఆశావహంగా కనిపిస్తున్నట్టు సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. సెకండరీ లీజింగ్ మరింత జోరుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment