leasing
-
మాల్స్ అదుర్స్.. పుంజుకుంటున్న రిటైల్ రంగం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావం రిటైల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో షాపింగ్ మాల్స్ విలవిల్లాడిపోయాయి. ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి చూశాక ఇక ఆఫ్లైన్లోని రిటైల్ రంగం కోలుకోవడం కష్టమేమో అనిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం నుంచి షాపింగ్ మాల్స్ శరవేగంగా కోలుకున్నాయి. మాల్స్‌లోని రిటైల్ దుకాణాలలో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్‌లలో వీక్షకుల తాకిడి పెరగడంతో మాల్స్ నిర్వాహకులలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ►షాపింగ్ మాల్స్, హైస్ట్రీట్లలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో రిటైల్ లీజులు 137 శాతం పెరిగాయని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. అయితే రిటైల్ మార్కెట్ పరిమాణం ఇంకా పెరగాల్సి ఉందని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రిటైల్ రంగం చాలా వెనకబడి ఉంది. ►ఫ్యాషన్, హోమ్‌వేర్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వంటి రిటైలర్ల డిమాండ్‌ను బట్టి షాపింగ్ మాల్స్‌లో లీజు లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో రిౖ టెల్ లీజులు 17–28 శాతం మేర పెరిగి 55–60 లక్షల చ.అ.లకు చేరుతుందని అంచనా వేసింది. 20 19లో అత్యధికంగా 68 లక్షల చ.అ. లీజు లావాదేవీ లు జరిగాయి. 2021లో 39 లక్షలు, 2022లో 47 లక్షల చ.అ. రిటైల్ లీజు కార్యకలాపాలు పూర్తయ్యాయి. ►హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలలో నిర్మాణం పూర్తికాకముందే లీజులు జరుగుతున్నాయి. గత ఏడాది డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో పూర్తయ్యే దశకు చేరినా లీజు లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే ఈ ఏడాది కొంత సానుకూల వాతావరణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నగరంలో 2.5 లక్షల చ.అ. రిటైల్ స్థల లీజు లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం లక్ష చ.అ. స్థలం మాత్రమే లీజుకు పోయింది. రిటైల్ లీజులలో స్టోర్ల వాటా 33 శాతం ఉండగా.. ఫ్యాషన్, అపరెల్స్ షో రూమ్‌ల వాటా 30 శాతం, ఫుడ్ కోర్టుల వాటా 11 శాతంగా ఉంది. -
భారత కాంప్లియన్స్ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: విమానాల లీజుకు సంబంధించి అంతర్జాతీయ చట్టం నింధనల అమలులో భారత్ రేటింగ్‌కు ‘ది ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ)’ కోత పెట్టింది. భారత్‌కు నెగెటివ్ అవుట్‌లుక్ ఇచి్చంది. సీటీసీ కాంప్లియెన్స్ ఇండెక్స్‌లో భారత్ స్కోరును 3.5 నుంచి 2కు తగ్గించింది. సంక్షోభంలో పడిన గోఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకునే విషయంలో న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏడబ్ల్యూజీ అనేది లాభాపేక్ష రహిత చట్టబద్ధ సంస్థ. ఇందులో విమానాల తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సభ్యులుగా ఉన్నాయి. కేప్‌టౌన్ కన్వెన్షన్ కింద విమానయాన సంస్థలకు లీజుకు ఇచి్చన విమానాలను అద్దెదారులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, గోఫస్ట్ విషయంలో లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దివాల పరిష్కార ప్రక్రియ కిందకు వెళ్లడంతో మారటోరియం అమలవుతోంది. లీజుదారులకు సీటీసీ పరిష్కారాలు అందుబాటులో లేవని లేదా లీజుకు ఇచి్చన ఎయిర్‌క్రాఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఏడబ్ల్యూజీ పేర్కొంది. ‘‘గోఫస్ట్ దివాలా పరిష్కార చర్యలు ఆరంభించి 130 రోజులు అవుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ అమలు చేయాల్సిన గడువు కంటే ఇది రెట్టింపు’’అని ఏడబ్ల్యూజీ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సీటీసీపై సంతకం చేసినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. -
ఆఫీసు స్పేస్ అధరహో.. తాజా నివేదిక
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో 4-4.5 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరుగుతాయని కొలియర్స్ నివేదిక అంచనా వేసింది. స్థిరమైన ఆర్థికక దృక్పథంతో పాటు అమెరికా, యూకే, యూరప్ దేశాలకు ప్రధాన వ్యాపార వనరు ఇండియా కావటంతో ఇక్కడి ఆఫీసు స్పేస్‌పై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు రెపో రేట్లు స్థిరమైన దశలోకి చేరుకున్నప్పటికీ జీఎస్టీ వసూళ్లు, తయారీ, సేవా రంగాలు, ఈక్విటీ మార్కెట్ల వేగంతో ఈ వృద్ధి అవకాశాలున్నాయని కొలియర్స్ ఆఫీసు సర్వీసెస్ ఎండీ పీష్ జైన్ అన్నారు. ♦ ఆరు నగరాలలో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 1.01 కోట్ల చ.అ. స్థూల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. రెండో త్రైమాసికం (క్యూ2) నాటికి 46 శాతం వృద్ధి రేటుతో 1.46 కోట్ల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ1లోని ఆఫీసు స్పేస్ లావాదేవీలలో టెక్నాలజీ రంగం వాటా 24 శాతంగా ఉండగా.. 18 శాతం ఫ్లెక్సిబుల్ స్పేస్, 17 శాతం ఇంజనీరింగ్ మరియు తయారీ రంగం వాటాలున్నాయి. క్యూ2 నాటికి టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ రంగాలు 5శాతం వృద్ధిని సాధించాయి. ఇంజనీరింగ్, తయారీ రంగాలు క్యూ1తో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. కీలక రంగాలలో ఆరోగ్యకరమైన వృద్ధి, లీజుదారులకు విశ్వాసం పెరగడం వంటి కారణంగా ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) నగరంలో 40-60 లక్షల చ.అడుగులు హైదరాబాద్‌లో క్యూ1లో13 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 19 శాతం వృద్ధి రేటుతో 15 లక్షల చ.అ.లకు పెరిగింది. ఈ ఏడాది ముగింపు నాటికి సుమారు 40–60 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరుగుతాయని కొలియర్స్ అంచనా వేసింది. వివిధ విభాగాలలో డిమాండ్, వ్యాపార సెంటిమెంటే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 40–45 మిలియన్ ఎస్ఎఫ్టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్ వరకు) 24.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్ వరకు) మరో 15.3–20.3 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్‌ను కలపలేదు. వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్ స్పేస్ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్–జూన్ మధ్య 14.6 మిలియన్ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్ ఇండియా వివరించింది. పట్టణాల వారీగా.. బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 9–11 మిలియన్ ఎస్ఎఫ్టీ, చెన్నైలో 7–9 మిలియన్ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్ వర్క్స్పేసెస్కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్వోల్ట్ సహ వ్యవస్థాపకుడు అమల్ మిశ్రా తెలిపారు. -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్‌కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్‌లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్‌లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
రిటైల్ స్పేస్ లీజింగ్‌లో జోరు! హైదరాబాద్ వాటా..
ముంబై: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో మంచి పనితీరు చూపించింది. లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 24 శాతం పెరిగి 2.87 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో రిటైల్ లీజ్ పరిమాణం 2.31 చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధి 15 శాతంతో పోలి్చనా, ఈ ఏడాది ప్రథమార్ధంలో మంచి పురోగతి కనిపించింది. రిటైల్ స్పేస్ సరఫరా మాత్రం ఈ ఎనిమిది పట్టణాల్లో 148 శాతం పెరిగి 1.09 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సరఫరా 0.44 చదరపు అడుగులుగా ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సలి్టంగ్ కంపెనీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢీల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ కొత్త రిటైల్ లీజింగ్‌లో 65 శాతం వాటా ఆక్రమించాయి. 2023 జనవరి – జూన్ కాలంలో బెంగళూరు అత్యధికంగా 0.8 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ 0.7 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై, అహ్మదాబాద్ 0.4 చదరపు అడుగుల చొప్పున, ముంబై, హైదరాబాద్ మార్కెట్లు 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతా 0.06 చదరపు అడుగులు, పుణె 0.12 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేశాయి. డిమాండ్‌లో వృద్ధి షాపర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పట్టణాల్లో మాల్స్ నిర్మాణంలో 8 శాతం వృద్ధి కనిపించింది. రిటైల్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ల వాటా 59 శాతంగా ఉంది. విడిగా చూస్తే బెంగళూరు 35 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ మార్కెట్ 24 శాతం, చెన్నై 14 శాతం, హైదరాబాద్ మార్కెట్ వాటా 11 శాతం చొప్పున నమోదైంది. ఫ్యాషన్, వ్రస్తాల విభాగం నుంచి 38 శాతం, ఫుడ్, బెవరేజెస్ నుంచి 18 శాతం, లగ్జరీ, హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్ విభాగాల నుంచి 11 శాతం డిమాండ్ కనిపించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్ లీజులో 7 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఎనిమిది మార్కెట్లలో రిటైల్ లీజ్ పరిమాణంలో దేశీయ సంస్థల వాటా 75 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికాలకు సంబంధించి రిటైల్ లీజింగ్ ఆశావహంగా కనిపిస్తున్నట్టు సీబీఆర్ఈ సౌత్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. సెకండరీ లీజింగ్ మరింత జోరుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఆఫీస్ లీజింగ్‌లో స్తబ్ధత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఆఫీసు లీజ్ మార్కెట్ జూన్ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 6 శాతం క్షీణించి 13.9 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఏడు ప్రముఖ పట్టణాల్లో స్థూల ఆఫీస్ లీజు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సంయక్తంగా 8.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజును నమోదు చేశాయి. ఈ మూడు మార్కెట్లు సంయుక్తంగా 59 శాతం వాటాను ఆక్రమించాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్‌సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వెస్టియన్ నివేదిక పేర్కొంది. కాకపోతే మార్చి త్రైమాసికంలో పోలిస్తే, జూన్ క్వార్టర్లో ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ 17 శాతం పెరిగినట్టు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ వినియోగం, కొత్త వసతుల పూర్తి పెరిగినట్టు వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఆఫీస్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ రంగం ముందు ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్ ఉందని.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లోనూ కదలిక వచ్చినట్టు వివరించింది. సెపె్టంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ఉద్దేశ్యాలు మెరుగుపడినట్టు, దేశ వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్‌లో రియల్ ఎసేŠట్ట్ కార్యకలాపాల్లో చురుకుదనం కనిపించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. ► విడిగా చూస్తే హైదరాబాద్ ఆఫీస్ లీజు మార్కెట్లో 4 శాతం క్షీణత కనిపించింది. 2.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ► బెంగళూరులో 12 శాతం క్షీణించి 3.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► ముంబై మార్కెట్లో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 5శాతం తక్కువగా 2 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజు పరిమితమైంది. ► కోల్‌కతాలో ఏకంగా 88 శాతం క్షీణించి 0.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► జూన్ త్రైమాసికంలో ఆఫీస్ లీజులో టెక్నాలజీ రంగం 26% వాటా ఆక్రమించింది. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19%గా ఉంటే, ఫ్లెక్సి బుల్ ఆఫీస్ స్పేస్ వాటా 18%గా నమోదైంది. ► ఈ ఏడాది జనవరి–జూన్ వరకు దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల నికర లీజింగ్ స్థలం డిసెంబర్ త్రైమాసికంలో 31 శాతం తగ్గి 80 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అంతర్జాతీయంగా ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు తమ విస్తరణను ఆలస్యం చేయడమే ఇందుకు కారణమని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. అక్టోబర్–డిసెంబర్ కాలంలో చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్లో నికర లీజింగ్ డిమాండ్ అధికం కాగా, మిగిలిన నగరాల్లో తగ్గింది. నికర లీజింగ్ బెంగళూరు 50 శాతం క్షీణించి 12 లక్షల చ.అడుగులు, హైదరాబాద్‌లో 42 శాతం పడిపోయి 17.4 లక్షల చ.అడుగులు నమోదైంది. చెన్నైలో 45 శాతం పెరిగి 12.4 లక్షల చ.అడుగులు, ఢిల్లీ ఎన్సీఆర్లో 17 శాతం దూసుకెళ్లి 18.9 లక్షల చ.అడుగులుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, కోల్‌కత, చెన్నై నగరాల్లో 2021తో పోలిస్తే ఈ ఏడాది కంపెనీలు తీసుకున్న లీజింగ్ స్థలం 46 శాతం అధికమై 3.8 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. హైదరాబాద్‌లో 2022లో నికర లీజింగ్ రెండింతలై 89.6 లక్షల చ.అడుగులు నమోదైంది. -
ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్‌లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ ఏడు ప్రధాన నగరాల్లో 41–49 శాతం వృద్ధి చెందుతుందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోల్‌కత, ముంబై, పుణేలో నికర లీజింగ్ 2021లో 2.62 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022లో ఇది 3.7–3.9 కోట్ల చదరపు అడుగులు ఉండే అవకాశం ఉంది. మహమ్మారికి ముందు 2019లో నికర లీజింగ్ ఏకంగా 4.79 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరి–సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల నికర లీజింగ్ మూడేళ్ల గరిష్టం 3.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో మార్కెట్ అయిదేళ్ల (2015–19) సగటు దిశగా వెళ్తోంది. వచ్చే ఏడాది సైతం.. నూతనంగా కార్యాలయ స్థలాలను చేజిక్కించుకునే విషయంలో టెక్ కంపెనీల నుంచి డిమాండ్ తగ్గినప్పటికీ, తయారీ, ఆరోగ్య సేవలు, ఫ్లెక్స్ విభాగాల నుంచి పెరిగింది. 2023లోనూ ఇదే ట్రెండ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 3.7–4 కోట్ల చదరపు అడుగులు నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక రెసిడెన్షియల్ విభాగంలో ఈ ఏడాది అమ్మకాలు 2 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే దశాబ్దంలో అత్యధిక విక్రయాలు నమోదు కావొచ్చు. 2010లో దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2.16 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2022లో ప్రతి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 50,000 యూనిట్లను దాటాయి. గిడ్డంగులు, అసెంబ్లింగ్, విలువ ఆధారిత తయారీ విభాగంలో స్థల డిమాండ్ 2021 కంటే అధికంగా ఈ ఏడాది 4 కోట్ల చదరపు అడుగులు మించనుంది. -
లీజుకు మారుతీ కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. అద్దె వాహన సేవలను ప్రారంభించింది. ‘మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్’ పేరిట తాజా సర్వీసులను గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో కస్టమర్లు కారును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, లీజు పద్ధతిలో నచ్చిన కారును వినియోగించుకోవచ్చు. మారుతీ స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, నెక్సా, బాలెనో, ఎర్టిగా, సియాజ్, ఎక్స్ఎల్ 6 కార్లను లీజు సభ్యత్వ సేవలో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. 24, 36, 48 నెలల కాలపరిమితితో ఈ కార్లను అందజేస్తున్నట్లు వివరించింది. నెలవారీ చందాలోనే కారు నిర్వహణ, బీమా మొత్తాలు కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. భారత్‌లో ఈ సేవలను అందించడం కోసం.. జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లో లీజింగ్ సేవలను అందిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
లీజుకు షి‘కారు’!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డౌన్ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది నచ్చే వార్తే. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇపుడు వాహన తయారీ కంపెనీలు కార్ల లీజింగ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కార్ల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవి లీజు మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. లీజు ప్రయోజనం ఏంటంటే... కస్టమర్‌పై ముందస్తు (డౌన్ పేమెంట్) చెల్లింపు భారం ఉండదు. బీమా, రోడ్ ట్యాక్స్, యాక్సిడెంటల్ రిపేర్లు, మెయింటెనెన్స్ అంతా కార్ల కంపెనీయే చూసుకుంటుంది. ఓ ఐదేళ్ల పాటు నెలవారీ కంపెనీ నిర్దేశించిన సొమ్మును చెల్లిస్తే చాలు. ఐదేళ్ల తరువాత వాహనాన్ని తిరిగి కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. అంతే!!. కాల పరిమితి, ఈఎంఐ మొత్తం అనేవి మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విధానంలో కంపెనీలు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కార్లను లీజుకిస్తున్నాయి. లీజు పూర్తి కాకముందే కస్టమర్ మరో మోడల్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు కూడా!!. వినియోగదారు తనకు నచ్చిన మోడళ్లను తరచూ మార్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ చెప్పారు. లీజు విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందన్నారు. రిటైల్ కస్టమర్లకు సైతం.. దేశీయంగా 2018–19లో అన్ని కంపెనీలూ కలిసి 33,77,436 ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో విక్రయాలు ఏకంగా 19 శాతం పడిపోయాయి. బలహీన సెంటిమెంటు, వాహన ధరలు పెరగడం, ఆర్జించే వ్యక్తులపై పన్ను భారం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు ఉబెర్, ఓలా వంటి రైడ్ షేరింగ్ కంపెనీల కార్యకలాపాలు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తృతమవుతున్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవటానికి కంపెనీలు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో లీజింగ్ ఒకటి. కార్పొరేట్ క్లయింట్లకు లీజుపై వాహనాలను దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్ కస్టమర్లకూ ఈ సేవల్ని విస్తరించాయి. ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఎల్‌డీ ఆటోమోటివ్, రెవ్ కార్స్ వంటి లీజింగ్ కంపెనీల భాగస్వామ్యంతో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎఫ్సీఏ ఇండియా ప్రస్తుతం ఈ రంగంలోకి వచ్చాయి. మారుతీ, టాటా వంటి సంస్థలూ త్వరలో వస్తామనే సంకేతాలిస్తున్నాయి. ‘లీజింగ్ విధానం మంచిదే. మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తున్నాం’ అని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. తక్కువ ఖర్చుతో... ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్లను లీజుకు తీసుకోవచ్చు. నగరం, వాహనం మోడల్, కాల పరిమితిని బట్టి నెలవారీ లీజు మొత్తం మారుతుంది. అయిదేళ్ల కాల పరిమితిపై హ్యుందాయ్ శాంత్రో బేసిక్ మోడల్ కారు నెలవారీ అద్దె సుమారు రూ.7,670 ఉంది. క్రెటా విషయంలో రూ.17,640 చార్జీ చేస్తారు. ఇదే వర్షన్ క్రెటా కొనాలంటే డౌన్ పేమెంట్ రూ.2.7 లక్షలిచ్చాక, ఈఎంఐ రూ.18,900 దాకా అవుతోంది. ఇక మహీంద్రా కేయూవీ100ఎన్ఎక్స్టీ రూ.13,499, ఎక్స్‌యూవీ500 రూ.32,999లుగా నిర్ణయించారు. స్కోడా మోడల్ ప్రారంభ అద్దె రూ.19,856. ప్రస్తుతం సూపర్బ్ మోడల్ మాత్రమే ఈజీ బై కింద అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఫియట్, జీప్ మోడళ్లను ఎఫ్సీఏ ఇండియా లీజు కింద ఆఫర్ చేస్తోంది. -
సత్యం - అసత్యం
రుజుమార్గం మానవుడు తన నిత్య జీవితంలో అసత్యానికి తావు లేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. కానీ, నేడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు కనిపించ డం లేదు. తమకు సంబంధించినంతవరకు ఇత రులు అబద్దమాడకూడదని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తు న్నామో ఆత్మపరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవ ప్రవక్త మహ మ్మద్ (స) ప్రజలకు ఎటువంటి హెచ్చరికతో కూడిన సందేశమిచ్చారో గమనిద్దాం. సత్యం మానవులను మంచివైపునకు మార్గ దర్శనం చేస్తుంది. మంచివారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే అసత్యం మానవులను చెడువైపునకు మార్గదర్శనం చేస్తుంది. చెడు.. వారిని నరకం దాకా తోడ్కొని వెళుతుంది. సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు పలికేవారు కూడా సత్యానికి మించి సంపద మరొ కటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం అసత్యాన్నే ఆశ్రయిస్తారు. ఈనాటి పరిస్థితుల్ని మనం కాస్త నిశితంగా గమనిస్తే అసత్యం నేడు చెడుల జాబితా నుంచి మిన హాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందిందా అనిపిస్తుంది. తమ పబ్బం గడుపుకోవ డానికి చాలామంది తమకు ప్రయోజనాన్ని, లాభా లను చేకూర్చి పెట్టే ఒక సాధనంగా అబద్దాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. కానీ, మహమ్మద్ (స) ఎట్టి పరిస్థితిలోనూ అబద్దం ఆడవద్దని, సత్యం పలికిన కారణంగా మీరు సర్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయిం చవద్దని హితవు పలికారు. అసత్యాన్ని గురించి రేపు దైవం ముందు సమాధానం చెప్పు కోవలసి ఉంటుందన్నారు. ఒక వేళ మానవ సహజ బలహీనత కారణంగా పొరపాటున ఏదైనా అస త్యం దొర్లిపోతే, దానికి చింతించి పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడుకోవాలని సూచించారు. ఈనాడు చాలామంది చిన్న చిన్న ప్రయోజనాల కోసం చాలా తేలిగ్గా అబద్దాలాడేస్తుంటారు. ఇక వ్యాపార లావాదేవీల విషయమైతే, అబద్దాలా డందే వ్యాపారం సాధ్యం కాదని, అబద్దమా డకుండా లాభాలు గడించలేమన్నట్లు ప్రవర్తి స్తుంటారు. కొందరైతే అసత్యాన్ని వ్యాపార చతురతగా భావించి గర్వపడుతుంటారు కానీ, సత్యవంతుడైన వ్యాపారి ఇహలోకంలో ప్రజలకు ప్రేమపా త్రుడవుతాడని, ప్రజల దీవెన పొందుతాడని, పర లోకంలో దైవప్రసన్నతను చూరగొంటాడని మహ మ్మద్ ప్రవక్త (స) చెప్పారు. కనుక సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలక డానికి, అబద్దాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు కావడానికి ప్రయత్నిద్దాం. అబద్దా లకోరును ప్రజలు ఎన్నటికీ విశ్వసించరు, ప్రేమిం చరు, ఆదరించరు, గౌరవించరు. అవునా...? - యం.డి. ఉస్మాన్‌ఖాన్