హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల నికర లీజింగ్ స్థలం డిసెంబర్ త్రైమాసికంలో 31 శాతం తగ్గి 80 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అంతర్జాతీయంగా ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు తమ విస్తరణను ఆలస్యం చేయడమే ఇందుకు కారణమని జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. అక్టోబర్–డిసెంబర్ కాలంలో చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నికర లీజింగ్ డిమాండ్ అధికం కాగా, మిగిలిన నగరాల్లో తగ్గింది.
నికర లీజింగ్ బెంగళూరు 50 శాతం క్షీణించి 12 లక్షల చ.అడుగులు, హైదరాబాద్‌లో 42 శాతం పడిపోయి 17.4 లక్షల చ.అడుగులు నమోదైంది. చెన్నైలో 45 శాతం పెరిగి 12.4 లక్షల చ.అడుగులు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 17 శాతం దూసుకెళ్లి 18.9 లక్షల చ.అడుగులుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, కోల్‌కత, చెన్నై నగరాల్లో 2021తో పోలిస్తే ఈ ఏడాది కంపెనీలు తీసుకున్న లీజింగ్ స్థలం 46 శాతం అధికమై 3.8 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. హైదరాబాద్‌లో 2022లో నికర లీజింగ్ రెండింతలై 89.6 లక్షల చ.అడుగులు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment