న్యూఢిల్లీ: విమానాల లీజుకు సంబంధించి అంతర్జాతీయ చట్టం నింధనల అమలులో భారత్ రేటింగ్‌కు ‘ది ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ)’ కోత పెట్టింది. భారత్‌కు నెగెటివ్ అవుట్‌లుక్ ఇచి్చంది. సీటీసీ కాంప్లియెన్స్ ఇండెక్స్‌లో భారత్ స్కోరును 3.5 నుంచి 2కు తగ్గించింది. సంక్షోభంలో పడిన గోఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకునే విషయంలో న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఏడబ్ల్యూజీ అనేది లాభాపేక్ష రహిత చట్టబద్ధ సంస్థ. ఇందులో విమానాల తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సభ్యులుగా ఉన్నాయి. కేప్‌టౌన్ కన్వెన్షన్ కింద విమానయాన సంస్థలకు లీజుకు ఇచి్చన విమానాలను అద్దెదారులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, గోఫస్ట్ విషయంలో లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దివాల పరిష్కార ప్రక్రియ కిందకు వెళ్లడంతో మారటోరియం అమలవుతోంది.
లీజుదారులకు సీటీసీ పరిష్కారాలు అందుబాటులో లేవని లేదా లీజుకు ఇచి్చన ఎయిర్‌క్రాఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఏడబ్ల్యూజీ పేర్కొంది. ‘‘గోఫస్ట్ దివాలా పరిష్కార చర్యలు ఆరంభించి 130 రోజులు అవుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ అమలు చేయాల్సిన గడువు కంటే ఇది రెట్టింపు’’అని ఏడబ్ల్యూజీ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సీటీసీపై సంతకం చేసినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment