India rating
-
భారత కాంప్లియన్స్ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: విమానాల లీజుకు సంబంధించి అంతర్జాతీయ చట్టం నింధనల అమలులో భారత్ రేటింగ్‌కు ‘ది ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ)’ కోత పెట్టింది. భారత్‌కు నెగెటివ్ అవుట్‌లుక్ ఇచి్చంది. సీటీసీ కాంప్లియెన్స్ ఇండెక్స్‌లో భారత్ స్కోరును 3.5 నుంచి 2కు తగ్గించింది. సంక్షోభంలో పడిన గోఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకునే విషయంలో న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏడబ్ల్యూజీ అనేది లాభాపేక్ష రహిత చట్టబద్ధ సంస్థ. ఇందులో విమానాల తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సభ్యులుగా ఉన్నాయి. కేప్‌టౌన్ కన్వెన్షన్ కింద విమానయాన సంస్థలకు లీజుకు ఇచి్చన విమానాలను అద్దెదారులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, గోఫస్ట్ విషయంలో లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దివాల పరిష్కార ప్రక్రియ కిందకు వెళ్లడంతో మారటోరియం అమలవుతోంది. లీజుదారులకు సీటీసీ పరిష్కారాలు అందుబాటులో లేవని లేదా లీజుకు ఇచి్చన ఎయిర్‌క్రాఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఏడబ్ల్యూజీ పేర్కొంది. ‘‘గోఫస్ట్ దివాలా పరిష్కార చర్యలు ఆరంభించి 130 రోజులు అవుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ అమలు చేయాల్సిన గడువు కంటే ఇది రెట్టింపు’’అని ఏడబ్ల్యూజీ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సీటీసీపై సంతకం చేసినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. -
భారత్ రేటింగ్ మార్చడం లేదు!
న్యూఢిల్లీ: భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్... స్థిర అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ సావరిన్ రేటింగ్ ఉంది. ఇది అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. 12 సంవత్సరాల నుంచీ ఇదే గ్రేడింగ్‌ను భారత్‌కు ఫిచ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే పరిస్థితి లేదని ఫిచ్ తాజాగా స్పష్టం చేసింది. బలహీన ద్రవ్య పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్‌కు ఇబ్బందులు ఉన్నాయని ఫిచ్ స్పష్టం చేసింది. భారత్ దీర్ఘకాల ఫారిన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ–’గానే కొనసాగిస్తున్నాం అని ఫిచ్ ఈ ప్రకటనలో పేర్కొంది. ఫిచ్ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►మధ్య కాలికంగా వృద్ధి పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య పరిస్థితులకు కూడా మధ్య కాలికంగా సానుకూలంగా ఉన్నాయి. అయితే ద్రవ్య పరిస్థితులు పేలవంగా ఉండడం, బలహీన ఫైనాన్షియల్‌అంశాలు, వ్యవస్థాగత అంశాలు బాగుండకపోవడం వంటి అంశాలు రేటింగ్ పెంపునకు ప్రతికూలంగా ఉన్నాయి. ►ముఖ్యంగా స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్‌కు ప్రతికూలతలు స్పష్టంగా ఉన్నాయి. రుణ వృద్ధి పడిపోయింది. మొండిబకాయిలు సహా బ్యాం కింగ్ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంక్షోభం అనంతరం తలెత్తిన లిక్విడిటీ పరమైన అంశాలు కూడా ఇక్కడ గమనార్హం. ► ఇక ప్రభుత్వ రుణ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 70 శాతానికి చేరింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను 3.3 శాతానికి (6.24 లక్షల కోట్లు) కట్టడి చేయడం కష్టంగానే కనబడుతోంది. ఆదాయాలు తక్కువగా ఉండడం ఇక్కడ గమనార్హం. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి నెలనెలా లక్ష రూపాయల పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నా... ఇప్పటి వరకూ అది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. కేవలం 2 నెలలు (ఏప్రిల్, అక్టోబర్) మినహా లక్ష కోట్లు వసూళ్లు జరగలేదు. ►ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో వ్యయాల అదుపు కష్టమే. ఒకపక్క రాబడులు తగ్గడం, మరోపక్క అధిక వ్యయాల తప్పని పరిస్థితులు ద్రవ్యలోటు పరిస్థితులను కఠినం చేసే అవకాశం ఉంది. ► ఇతర వర్థమాన దేశాలతో పోల్చిచూస్తే, ప్రపంచబ్యాంక్ గవర్నెర్స్ ఇండికేటర్ తక్కువగా ఉంది. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచీ కూడా బలహీనంగా ఉంది. ► ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు కట్టడిపై భయాలు రేటింగ్ పెంపు అవకాశాలకు గండికొడుతున్నాయి. ► ఇక 2019 మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందన్న అంచనాల్లో మార్పులేదు. 2017–18లో ఈ రేటు 6.7 శాతం. అయితే కఠిన ద్రవ్య పరిస్థితులు, బలహీన ఫైనాన్షియల్ రంగ బ్యాలెన్స్‌షీట్ అంశాలు, అంతర్జాతీయ క్రూడ్ ధరలు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. అయితే 2019–21 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 7.3 శాతానికే పరిమితం కావచ్చు. ప్రభుత్వ వర్గాల నిరాశ? ఫిచ్ రేటింగ్ పెంపునకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. 2004 తరువాత మొట్టమొదటి సారి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ (ఫిచ్ ప్రత్యర్థి) 2017 నవంబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కి అప్‌గ్రేడ్ చేసింది. తర్వాత భారత్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ నేపథ్యంలో రేటింగ్ పెంపు సమంజసమని ఫిచ్‌ను ఒప్పించడానికి కేంద్రం ప్రయత్నం చేసింది. 2006 ఆగస్టు 1న ఫిచ్ భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీబీ+’ నుంచి ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచీ అదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే 2012లో అవుట్‌లుక్‌ను ‘నెగిటివ్’కు మార్చింది. కానీ తదుపరి ఏడాదే ‘స్థిరానికి’ పెంచింది. కాగా మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ కూడా తన భారత్ ప్రస్తుత రేటింగ్ ‘బీబీబీ–’ నుంచి అప్‌గ్రేడ్‌చేయడానికి ససేమిరా అంటోంది. ప్రభుత్వ అధిక రుణ భారం, అల్పాదాయ స్థాయి దీనికి కారణాలుగా చూపుతోంది. ఇదే రేటింగ్‌ను 2007 నుంచీ ఎస్అండ్పీ కొనసాగిస్తోంది. -
మోడీకి షాకిచ్చిన ఎస్అండ్పీ
సాక్షి, న్యూఢిల్లీ : మోడీ సంస్కరణలకు మెచ్చిన మూడీస్ భారత క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయగా.. మరో రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ మాత్రం మోడీకి షాకిచ్చింది. భారత సావరిన్ రేటింగ్‌ను ఎస్అండ్పీ అప్‌గ్రేడ్ చేయలేదు. భారత సావరిన్ రేటింగ్‌ను స్థిరంగా 'బీబీబీ-'గానే ఉంచింది. అదేవిధంగా భారత్‌పై తన అవుట్‌లుక్‌ను కూడా స్థిరంగానే ఉంచుతున్నట్టు తెలిసింది. మూడీస్ అప్‌గ్రేడ్ అనంతరం ఎస్అండ్పీ కూడా భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తుందని అందరూ భావించారు. కానీ తాజాగా ఎస్అండ్పీ మాత్రం తన రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా, ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌తో వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్ల నుంచి సెన్సెక్స్ లాభపడుతూ వస్తోంది. భారత్‌లో అత్యధిక మొత్తంలో ద్రవ్యలోటు, తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వం రుణాలు బలహీనమైనవిగా ఎస్అండ్పీ పేర్కొంది. రెండు క్వార్టర్ల నుంచి అంచనావేసిన దాని కంటే తక్కువ వృద్ధి నమోదైనప్పటికీ, 2018-20లో భారత ఆర్థికవ్యవస్థ వేగవంతంగా పరుగులు తీయగలదని ఈ రేటింగ్ సంస్థ అంచనావేస్తోంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులు పెరుగుతూ ఉంటాయని తెలిపింది. అయితే తక్కువ తలసరి ఆదాయం, అధిక మొత్తంలో ద్రవ్యలోటు, ప్రభుత్వంపై ఉన్న రుణ భారం దేశీయ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతున్నట్టు ఎస్అండ్పీ వివరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి మూడీస్ భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు మార్చింది. -
ఇండియా రేటింగ్‌ను మార్చట్లేదు: ఫిచ్
♦ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగింపు ♦ 11 ఏళ్లుగా ఇదే దిగువస్థాయి పెట్టుబడుల రేటింగ్ ♦ 2017–18లో వృద్ధి 7.7 శాతం ముంబై: భారత్ సావరిన్ రేటింగ్‌లో ఎటువంటి మార్పు చేయడం లేదని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ స్పష్టం చేసింది. దీనితో ఈ రేటు స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగనుంది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇది దిగువస్థాయి రేటింగ్. మరో మాటలో చెప్పాలంటే ‘జంక్’ (చెత్త) స్థాయికి ఇది ఒక మెట్టు ఎక్కువ. దాదాపు 11 సంవత్సరాల నుంచీ ఇదే రేటింగ్‌ను ఫిచ్ కొనసాగిస్తోంది. భారత్ సావరిన్ రేటింగ్‌ను 2006 ఆగస్టు 1వ తేదీన ఫిచ్ ‘బీబీప్లస్’ స్థాయి నుంచి ‘స్టేబుల్ అవుట్‌లుక్’తో ‘బీబీబీ మైనస్’కు పెంచింది. 2012లో ఒకసారి అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చినా, అటు తర్వాతి సంవత్సరంలో మళ్లీ‘స్టేబుల్’కు మార్చింది. ఇదే రేటును కొనసాగించడానికి ప్రధాన కారణాల్లో ‘పటిష్టంగాలేని పబ్లిక్ ఫైనాన్స్ వ్యవస్థ’ ఒకటని ఫిచ్ వివరించింది. 2016–17లో వృద్ధిరేటు 7.1 శాతంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2017–18లో 7.7 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నట్లు ఫిచ్ తాజా నివేదికలో పేర్కొంది. మరిన్ని వివరాలను పరిశీలిస్తే... స్వల్పకాలంలో పటిష్ట వృద్ధి ధోరణిని, సానుకూల విదేశీ ఆర్థిక అంశాల సమతుల్యతను తాజా రేటింగ్ సూచిస్తోంది. బలహీన ద్రవ్య పరిస్థితి, క్లిష్ట వ్యాపార వాతావరణ పరిస్థితులు వ్యవస్థలో కొనసాగుతున్నాయి. అయితే వ్యవస్థాగత సంస్కరణలు సరిగా అమలు చేస్తే– వ్యాపార పరిస్థితులు మెరుగుపడే వీలుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఎన్డీఏ ప్రభుత్వం తాను కోరుకుంటున్న సంస్కరణల ఎజెండాను తరచూ ప్రకటిస్తోంది. దీనిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే పెట్టుబడులు, వాస్తవ జీడీపీ వృద్ధిపై ఈ సంస్కరణల కార్యక్రమం ఏ మేరకు పడుతుందన్న అంశం... ఆయా కార్యక్రమాల అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. -
భారత్ రేటింగ్ పెంచం..
ఈ రెండేళ్లలో అవకాశం లేదని ఎస్ అండ్ పీ స్పష్టీకరణ • ఆర్థిక శాఖ తీవ్ర స్పందన • అంతర్మథనం చేసుకోవాలని సూచన న్యూఢిల్లీ: విధాన స్థిరత్వం, ఆర్థిక సంస్కరణల చర్యలు తీసుకుంటున్నప్పటికీ. 2017 వరకూ భారత్ సార్వభౌమ రేటింగ్‌ను పెంచేది లేదని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అరుుతే దీనిపట్ల భారత్ ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. రేటింగ్ ప్రక్రియపై ఆయాసంస్థలు ఆత్మశోధన చేసుకోవాలని పేర్కొంది. ఎస్అండ్పీ ఆలోచనా ధోరణికి- ఇన్వెస్టర్ల అభిప్రాయాలకు మధ్య సంబంధం లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎస్ అండ్ పీ ప్రకటన ముఖ్యాంశాలు... ⇔ ప్రస్తుత రేటింగ్‌నే కొనసాగిస్తాం. ⇔ ప్రభుత్వ రుణ భారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 60 శాతం దిగువకు (ప్రస్తుతం 69 శాతం) తగ్గడానికి తగిన ప్రయత్నం చేయాలి. ⇔ సమీప కాలంలో రెవెన్యూ వసూళ్లు అర్థవంతమైన రీతిలో పెరుగుతాయని భావించడం లేదు. - భారత్ విదేశీ మారకద్రవ్యం పటిష్ట పరిస్థితికి, తీసుకున్న విధాన నిర్ణయాలకు ‘స్టేబుల్ అవుట్‌లుక్’తగిన విధంగా ఉంది. ఆయా అంశాలు అన్నీ పరిశీలనలోకి తీసుకుంటే, వచ్చే ఒకటి రెండేళ్లూ క్రెడిట్ రేటింగ్ మార్పు అవకాశాలు లేవు. ⇔ సంస్కరణల ఫలాలు చివరకు కనిపించకపోరుునా లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించలేకపోరుునా రేటింగ్సపై దిగువవైపు ఒత్తిడి ఉంటుంది. ⇔ భారత్ 2016లో 7.9 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని భావిస్తున్నాం. 2016-18 మధ్య సగటున 8 శాతంగా వృద్ధి రేటు ఉంటుంది. ఇక 2016లో కరెంట్ అకౌంట్‌లోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.4 శాతంగా ఉండే వీలుంది. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5% వద్ద కట్టడి జరిగే అవకాశం ఉంది. ⇔ బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే... ప్రైవేటు రంగం లాభదాయకత బాగుంటుంది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే, అంతర్గత మూలధన కల్ప న, మొండిబకారుుల వంటి అంశాల్లో సైతం ప్రైవేటు రంగం బ్యాంకుల పనితీరు బాగుంటుంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 45 బిలియన్ డాలర్ల మూలధన అవసరం ఉంటుంది. బలహీన లాభదాయకతను ఎదుర్కొనడానికి, అంతర్జాతీయ బాసెల్ 3 మూలధన ప్రమాణాలకు చేరడానికి ఇది అవసరం. అరుుతే భారత్ నుంచి 11 బిలియన్ డాలర్ల హామీనే లభిస్తోంది. ⇔ 1,700 డాలర్ల దిగువ తలసరి ఆదాయం ఆందోళనకరం. ⇔ సబ్సిడీల తగ్గింపులో ఆలస్యం సరికాదు. దీర్ఘకాలంలో పెండింగులో ఉన్న అవరోధాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం చర్యలు హర్షణీయం. ఇందులో జీఎస్టీ, కార్మిక, ఇంధన సంస్కరణలున్నారుు. ఇక ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ తీసుకున్న చర్యలు సానుకూలమైనవి. వివిధ సంస్థల రేటింగ్స ఇవీ.. ⇔ ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్‌కు ‘స్టేబుల్’అవుట్‌లుక్‌తో ‘బీబీబీ’రేటింగ్‌ను ఇస్తోంది. 2014 సెప్టెంబర్‌లో నెగిటివ్ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌లోకి మార్చింది. పటిష్ట ఎన్నికల ఫలితం ఆర్థిక సంస్కరణకు దోహదపడే అంశమరుునందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అప్పట్లో తెలిపింది. భారత్‌కు మరో రేటింగ్ సంస్థ- ఫిచ్ ‘స్టేబుల్ అవుట్‌లుక్’తో ‘బీబీబీ-మైనస్’రేటింగ్‌ను ఇస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ‘పాజిటివ్’అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’రేటింగ్ ఇస్తోంది. ఇవన్నీ దిగువస్థారుు పెట్టుబడుల గ్రేడ్లు కావడం గమనార్హం. మరో మాటలో చెప్పాలంటే ‘జంక్’స్టేటస్‌కు ఒక మెట్టు ఎక్కువ. మూడీస్ సెప్టెంబర్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్ సంస్కరణలు, పెట్టుబడులు బలహీనంగా ఉన్నాయని, మొండిబకారుులు పెద్ద సవాలని పేర్కొంది.. సంస్కరణల బాటలో తగిన ఫలితాలు కనిపిస్తే ఒకటి రెండేళ్లలో రేటింగ్‌ను పెంచుతామని తెలిపింది. ⇔ సంస్కరణల జోరు.. అయినా అప్‌గ్రేడ్ చేయలేదు: దాస్ ⇔ ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థలో చేపట్టని సంస్కరణలను భారత్ తీసుకుంది. అరుునా అప్‌గ్రేడ్ చేయలేదు. ఇది రేటింగ్ ఏజెన్సీలు ఆత్మశోధన చేసుకోవాల్సిన అంశం. పెట్టుబడిదారులు - రేటింగ్ ఏజెన్సీల మధ్య అభిప్రాయాల్లో వ్యత్యాసం ఉంది. భారత్ మాత్రం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, జీడీపీ వృద్ధి రేటు పెంపునకు, ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు కృషిని కొనసాగిస్తుంది. సంస్కరణల చర్యలతో ముందుకు వెళుతోంది. రేటింగ్‌ను పెంచకపోతే మేము పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదు. పెట్టుబడులకు తగిన దేశంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యోల్బణం కట్టడి, వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ దిశలో కీలక అడుగులుసహా పలు చర్యలను గడచిన రెండేళ్లలో కేంద్రం తీసుకుంది. వీటికి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల గుర్తింపూ లభించింది. ఇంకా రేటింగ్‌ను పెంచలేదంటే రేటింగ్ సంస్థల అంతర్మధనం తప్పదు. ఇక మొండిబకారుుల సమస్యల పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసు కుంటోంది. దీనిపై తగిన స్థారుులో దృష్టిని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం-ఆర్బీఐ సంయుక్త కృషిని కొనసాగిస్తున్నారుు. భారత్ సుస్థిర ఆర్థిక వృద్ధికి సైతం ఆర్బీఐ తన వంతు చర్యలను తీసుకుంటోంది.