భారత్ రేటింగ్ పెంచం..
ఈ రెండేళ్లలో అవకాశం లేదని ఎస్ అండ్ పీ స్పష్టీకరణ
• ఆర్థిక శాఖ తీవ్ర స్పందన
• అంతర్మథనం చేసుకోవాలని సూచన
న్యూఢిల్లీ: విధాన స్థిరత్వం, ఆర్థిక సంస్కరణల చర్యలు తీసుకుంటున్నప్పటికీ. 2017 వరకూ భారత్ సార్వభౌమ రేటింగ్‌ను పెంచేది లేదని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అరుుతే దీనిపట్ల భారత్ ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. రేటింగ్ ప్రక్రియపై ఆయాసంస్థలు ఆత్మశోధన చేసుకోవాలని పేర్కొంది. ఎస్‌అండ్‌పీ ఆలోచనా ధోరణికి- ఇన్వెస్టర్ల అభిప్రాయాలకు మధ్య సంబంధం లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఎస్ అండ్ పీ ప్రకటన ముఖ్యాంశాలు...
⇔ ప్రస్తుత రేటింగ్‌నే కొనసాగిస్తాం.
⇔ ప్రభుత్వ రుణ భారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 60 శాతం దిగువకు (ప్రస్తుతం 69 శాతం) తగ్గడానికి తగిన ప్రయత్నం చేయాలి.
⇔ సమీప కాలంలో రెవెన్యూ వసూళ్లు అర్థవంతమైన రీతిలో పెరుగుతాయని భావించడం లేదు. - భారత్ విదేశీ మారకద్రవ్యం పటిష్ట పరిస్థితికి, తీసుకున్న విధాన నిర్ణయాలకు ‘స్టేబుల్ అవుట్‌లుక్’తగిన విధంగా ఉంది. ఆయా అంశాలు అన్నీ పరిశీలనలోకి తీసుకుంటే, వచ్చే ఒకటి రెండేళ్లూ క్రెడిట్ రేటింగ్ మార్పు అవకాశాలు లేవు.
⇔ సంస్కరణల ఫలాలు చివరకు కనిపించకపోరుునా లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించలేకపోరుునా రేటింగ్‌సపై దిగువవైపు ఒత్తిడి ఉంటుంది.
⇔ భారత్ 2016లో 7.9 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని భావిస్తున్నాం. 2016-18 మధ్య సగటున 8 శాతంగా వృద్ధి రేటు ఉంటుంది. ఇక 2016లో కరెంట్ అకౌంట్‌లోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.4 శాతంగా ఉండే వీలుంది. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5% వద్ద కట్టడి జరిగే అవకాశం ఉంది.
⇔ బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే... ప్రైవేటు రంగం లాభదాయకత బాగుంటుంది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే, అంతర్గత మూలధన కల్ప న, మొండిబకారుుల వంటి అంశాల్లో సైతం ప్రైవేటు రంగం బ్యాంకుల పనితీరు బాగుంటుంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 45 బిలియన్ డాలర్ల మూలధన అవసరం ఉంటుంది. బలహీన లాభదాయకతను ఎదుర్కొనడానికి, అంతర్జాతీయ బాసెల్ 3 మూలధన ప్రమాణాలకు చేరడానికి ఇది అవసరం. అరుుతే భారత్ నుంచి 11 బిలియన్ డాలర్ల హామీనే లభిస్తోంది.
⇔ 1,700 డాలర్ల దిగువ తలసరి ఆదాయం ఆందోళనకరం.
⇔ సబ్సిడీల తగ్గింపులో ఆలస్యం సరికాదు. దీర్ఘకాలంలో పెండింగులో ఉన్న అవరోధాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం చర్యలు హర్షణీయం. ఇందులో జీఎస్‌టీ, కార్మిక, ఇంధన సంస్కరణలున్నారుు. ఇక ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు సానుకూలమైనవి.
వివిధ సంస్థల రేటింగ్‌స ఇవీ..
⇔ ప్రస్తుతం ఎస్‌అండ్‌పీ భారత్‌కు ‘స్టేబుల్’అవుట్‌లుక్‌తో ‘బీబీబీ’రేటింగ్‌ను ఇస్తోంది. 2014 సెప్టెంబర్‌లో నెగిటివ్ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌లోకి మార్చింది. పటిష్ట ఎన్నికల ఫలితం ఆర్థిక సంస్కరణకు దోహదపడే అంశమరుునందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అప్పట్లో తెలిపింది. భారత్‌కు మరో రేటింగ్ సంస్థ- ఫిచ్ ‘స్టేబుల్ అవుట్‌లుక్’తో ‘బీబీబీ-మైనస్’రేటింగ్‌ను ఇస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ‘పాజిటివ్’అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’రేటింగ్ ఇస్తోంది. ఇవన్నీ దిగువస్థారుు పెట్టుబడుల గ్రేడ్‌లు కావడం గమనార్హం. మరో మాటలో చెప్పాలంటే ‘జంక్’స్టేటస్‌కు ఒక మెట్టు ఎక్కువ. మూడీస్ సెప్టెంబర్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్ సంస్కరణలు, పెట్టుబడులు బలహీనంగా ఉన్నాయని, మొండిబకారుులు పెద్ద సవాలని పేర్కొంది.. సంస్కరణల బాటలో తగిన ఫలితాలు కనిపిస్తే ఒకటి రెండేళ్లలో రేటింగ్‌ను పెంచుతామని తెలిపింది.
⇔ సంస్కరణల జోరు.. అయినా అప్‌గ్రేడ్ చేయలేదు: దాస్
⇔ ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థలో చేపట్టని సంస్కరణలను భారత్ తీసుకుంది. అరుునా అప్‌గ్రేడ్ చేయలేదు. ఇది రేటింగ్ ఏజెన్సీలు ఆత్మశోధన చేసుకోవాల్సిన అంశం. పెట్టుబడిదారులు - రేటింగ్ ఏజెన్సీల మధ్య అభిప్రాయాల్లో వ్యత్యాసం ఉంది. భారత్ మాత్రం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, జీడీపీ వృద్ధి రేటు పెంపునకు, ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు కృషిని కొనసాగిస్తుంది. సంస్కరణల చర్యలతో ముందుకు వెళుతోంది. రేటింగ్‌ను పెంచకపోతే మేము పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదు.
పెట్టుబడులకు తగిన దేశంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యోల్బణం కట్టడి, వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ దిశలో కీలక అడుగులుసహా పలు చర్యలను గడచిన రెండేళ్లలో కేంద్రం తీసుకుంది. వీటికి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల గుర్తింపూ లభించింది. ఇంకా రేటింగ్‌ను పెంచలేదంటే రేటింగ్ సంస్థల అంతర్మధనం తప్పదు. ఇక మొండిబకారుుల సమస్యల పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసు కుంటోంది. దీనిపై తగిన స్థారుులో దృష్టిని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం-ఆర్‌బీఐ సంయుక్త కృషిని కొనసాగిస్తున్నారుు. భారత్ సుస్థిర ఆర్థిక వృద్ధికి సైతం ఆర్‌బీఐ తన వంతు చర్యలను తీసుకుంటోంది.