న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆర్థిక శాఖ కార్యాలయం ‘నార్త్‌బ్లాక్’లో శుక్రవారం బడ్జెట్ ముందరి సంప్రదాయ ‘హల్వా’ కార్యక్రమం సందడిగా సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ అక్కడి ఏర్పాట్లను ఒక్కసారి పరిశీలించారు.
బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్‌మెంట్‌లో ముద్రించనున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment