budget halwa
-
సందడిగా ‘బడ్జెట్ హల్వా’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆర్థిక శాఖ కార్యాలయం ‘నార్త్‌బ్లాక్’లో శుక్రవారం బడ్జెట్ ముందరి సంప్రదాయ ‘హల్వా’ కార్యక్రమం సందడిగా సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ అక్కడి ఏర్పాట్లను ఒక్కసారి పరిశీలించారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ముద్రించనున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు. -
మోదీ చక్రవ్యూహంలో దేశం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ముప్పేట దాడి చేశారు. ‘‘దేశమంతటా తీవ్ర భయోత్పాత వాతావరణాన్ని నెలకొల్పారు. దేశంపై ప్రధాని మోదీ పెను సమస్యల చక్రవ్యూహం పన్నారు. అది దేశమంతటినీ సర్వనాశనం చేస్తోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడిన రాహుల్ మోదీపైనా, ఎన్డీఏ ప్రభుత్వ పాలనపైనా సునిశిత విమర్శలు చేశారు. ఘాటైన పదజాలంతో కూడిన పదునైన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్ష సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినా, నిబంధనలు అనుమతించబోవంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే వారిస్తున్నా వెనక్కు తగ్గలేదు. బడ్జెట్ కేవలం బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనాలకు, సర్కారు రాజకీయ గుత్తాధిపత్యానికి కొమ్ము కాసేలా ఉదంటూ విమర్శించారు. ‘‘ఈ మోదీ మార్కు సమస్యల చక్రవ్యూహాన్ని విపక్ష ఇండియా కూటమి ఛేదిస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు, దేశవ్యాప్తంగా కులగణనకు సభ ఆమోదం లభించేలా చేసి తీరుతుంది’’ అని ప్రకటించారు. అభిమన్యుడిలా దేశం... నేటి హరియాణాలోని కురుక్షేత్రలో వేల ఏళ్ల కింద జరిగిన యుద్ధంలో ఆరుగురు ఒక్కటై చక్రవ్యూహం పన్ని బాలుడైన అభిమన్యున్ని పొట్టన పెట్టుకున్నారంటూ మహాభారత గాథను రాహుల్ ఉటంకించారు. ‘‘హింస, భయోద్వేగాలతో కూడిన చక్రవ్యూహమది. దాన్ని పద్మవ్యూహమని కూడా అంటారు’’ అంటూ బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ‘‘నేడు 21వ శతాబ్దంలో మన దేశంపై మోదీ ఓ నయా చక్రవ్యూహాన్ని పన్నారు. అభిమన్యునికి పట్టిన గతినే దేశానికి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ యువతను, రైతులను, మహిళలను, చిన్న, మధ్యతరహా వ్యాపారులను సర్వనాశనం చేసేందుకు రాత్రింబవళ్లు ప్రయతి్నస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు కేంద్ర స్థానంలో ఉండి చక్యవ్యూహాన్ని నియంత్రిస్తున్నారు. వాళ్లు మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అంబానీ–అదానీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్’’ అని చెప్పుకొచ్చారు. చివరి నలుగురూ సభలో లేనందున వారి పేర్ల ప్రస్తావనను అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేశారు. దాంతో అనంతరం ఆరుగురి పేర్లనూ రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ ప్రసంగం పొడవునా అధికార ఎన్డీఏ కూటమి సభ్యులంతా పెద్దపెట్టున నిరసనలకు దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు జోక్యం చేసుకోబోయారు. కానీ రాహుల్ అందుకు అవకాశమివ్వలేదు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దని స్పీకర్ స్పష్టం చేయడంతో అంబానీ, అదానీలను తన ప్రసంగం పొడవునా ఏ1, ఏ2గా సంబోధించారు. ‘‘ఏ1, ఏ2లను కాపాడేందుకు రిజిజు కూడా ప్రయతి్నస్తున్నారు. మీరిలా చేస్తే మాకే లాభం. వారిద్దరినీ ఇంకెంతగా కాపాడే ప్రయత్నం చేస్తారో చేయండి’’ అంటూ ఎద్దేవా చేశారు. చక్రవ్యూహం... మూడు శక్తులు మోదీ చక్రవ్యూహం వెనక మూడు శక్తులున్నాయని రాహుల్ అన్నారు. ‘‘మొదటిది గుత్తాధిపత్య ధోరణి. దేశ సంపదనంతా ఏ1, ఏ2 (అంబానీ, అదానీ) ఇద్దరికే మాత్రమే దోచిపెట్టే ప్రయత్నం. రెండోది సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వీటి సాయంతో విపక్షాలను అణగదొక్కే కుట్రలు. మూడోది అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న రాజకీయ, అధికారస్వామ్యం. మోదీ చక్రవ్యూహానికి గుండెకాయ వంటి ఈ శక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు.మధ్యతరగతికి వెన్నుపోటు కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతిని దారుణంగా వెన్నుపోటు పొడిచారని రాహుల్ ఆరోపించారు. ‘‘మోదీకి కాస్తో కూస్తో మద్దతుగా నిలిచిన వర్గం మధ్యతరగతి. కొవిడ్ సమయంలో ఆయన మొబైల్ టార్చిలు వేయమంటే వేసింది. పళ్లాలు మోగించండంటే మోగించింది. అలాంటి వర్గంపై బడ్జెట్లో పెను భారం వేశారు. తద్వారా వారి వెన్నులోనూ, ఛాతీలోనూ కత్తులు దింపారు మోదీ’’ అన్నారు. ‘‘ఇదీ మా మంచికే. మధ్యతరగతి ఇక ఇండియా కూటమి వైపు మొగ్గుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘మోదీ చక్రవ్యూహపు దు్రష్పభావాన్ని కేంద్ర బడ్జెట్ బలహీనపరుస్తుందని, యువత, రైతులు, కారి్మకులు, చిరు వ్యాపారులను ఆదుకుంటుందని ఆశించా. కానీ వ్యాపార, రాజకీయ గుత్తాధిపత్యాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా బడ్జెట్ రూపొందింది. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తారట! బడ్జెట్లో విత్త మంత్రి పేర్కొన్న ఈ పథకం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 99 శాతం మంది యువతకు అది అందని ద్రాక్షే. నిరుద్యోగ చక్రవ్యూహం, పేపర్ లీకేజీ చక్రవ్యూహం, అగ్నివీర్ చక్రవ్యూహం... ఇలా విద్యార్థులు, యువత, సైన్యంతో పాటు ఏ రంగాన్నీ వదలకుండా సమస్యల సుడిగుండంలో ముంచెత్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘మీరు సృష్టించిన అన్ని చక్రవ్యూహాలనూ మేం ఛేదించేస్తాం. దేశవ్యాప్త కులగణనే అందుకు సరైన అస్త్రం’’ అన్నారు. ‘‘దేశ యువత, వెనకబడ్డ వర్గాలు అభిమన్యులని ఈ చక్రవ్యూహ సృష్టికర్తలు అపోహ పడుతున్నారు. కానీ నిజానికి వాళ్లంతా ఆ వ్యూహాన్ని ఛేదించే అర్జునులు’’ అని హెచ్చరించారు. అగి్నవీర్ వంటి సున్నితమైన పథకంపై విమర్శలు సరికావంటూ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వెలిబుచ్చారు.మాది శివుని ఊరేగింపు ఇండియా కూటమిని శివుని పెళ్లి ఊరేగింపుతో రాహుల్ పోల్చారు. ‘‘అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మోదీ చక్రవ్యూహం కేవలం ఆరుగురికే పరిమితం. ఆ చక్రవ్యూహానికి, శివుని ఊరేగింపుకు పోరాటమిది’’ అన్నారు.‘హల్వా’ ఫొటోపై విసుర్లు ప్రసంగం సందర్భంగా లోక్‌సభలో రాహుల్ ప్రదర్శించిన బడ్జెట్ హల్వా ఫొటో కలకలానికి దారి తీసింది. బడ్జెట్ ముద్రణకు ముందు దాని తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా తయారు చేయడం రివాజు. అలా ఈసారి నిర్మలా సీతారామన్ బృందం బడ్జెట్ హల్వా తయారు చేస్తున్న ఫొటోను చూపిస్తూ, ‘‘ఇందులో కని్పస్తున్న 20 మంది అధికారుల్లో దళితులు, ఆదివాసీలు ఒక్కరు కూడా లేరు. మైనారిటీ, ఓబీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు’’ అంటూ రాహుల్ ఆక్షేపించారు. రాహుల్ ఆ ఫొటోను ప్రదర్శిస్తున్న సమయంలో నిర్మల రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ కని్పంచారు. -
Budget 2024 : బడ్జెట్ ‘హల్వా’ మెప్పిస్తుందా?
ఒక పక్క ధరాభారం... మరోపక్క పన్నుల మోత! దేశంలో వేతన జీవుల నుండి సామాన్యుల వరకు ఈ సెగ గట్టిగానే తగులుతోంది. వికసిత భారతదేశమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న మోదీ 3.0 సర్కారుకు ఉపాధికల్పన ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పారిశ్రామికంగా దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే.. ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలి్పంచాల్సిన అవసరం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపు అన్ని వర్గాలూ ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి సీతమ్మ బడ్జెట్ ‘హల్వా’ అందరినీ మెప్పిస్తుందా? వివిధ రంగాలు, పరిశ్రమ వర్గాల అంచనాలు సాకారమవుతాయా? మధ్యతరగతి ఆశలు నెరవేరుతాయా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి’.. కేంద్రంలోని మోదీ సర్కారు దీర్ఘకాలిక లక్ష్యం ఇది. అమెరికా, యూరప్, చైనా ఆర్థికవ్యవస్థలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి (7% పైనే)తో సాగిపోతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. ఈ స్వప్నం సాకారం కావాలంటే ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అవసరం. పన్నుల ఉపశమనం కలి్పంచాలన్న డిమాండ్లు ఉండనే ఉన్నాయి. రానున్న బడ్జెట్లో చరిత్రాత్మక, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉంటాయంటూ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇప్పటికే సంకేతం పంపారు. దీంతో ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమరి్పంచే 2023–24 పూర్తి స్థాయి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.పన్నుల భారం తగ్గించరూ.. ప్రస్తుత పరిస్థితి: ఆదాయపన్ను, జీఎస్టీ తదితరాల రూపంలో ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బాదుడు గడిచిన పదేళ్లలో గణనీయంగా పెరిగిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే.. 2023–24లో కేంద్ర సర్కారు రూ.34.6 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో సమకూర్చుకుంది. ఒక వస్తువు చేతులు మారుతున్న ప్రతి దశలోనూ పన్ను పరిధిలోకి వెళుతోంది. ఉదాహరణకు డీజిల్, పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్, వ్యాట్ ట్యాక్స్ విధిస్తుంటాయి. వాహనం వాడే ప్రతి ఒక్కరూ ఇంధనం కొనుగోలుపై పన్ను చెల్లిస్తున్నట్టే. వస్తు రవాణాకు వినియోగించే లారీలు, ట్రక్కులు, రైల్వే డీజిల్, విద్యుత్‌ను ఇంధనంగా వినియోగిస్తుంటాయి. ఆ దశలో అవి డీజిల్, విద్యుత్‌పై పన్ను చెల్లిస్తుంటాయి. ఆ చార్జీల భారం వస్తువులపై పడి, చివరికి వినియోగదారుడు తన వంతు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఒక కంపెనీ తన లాభం నుంచి 25 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాతే డివిడెండ్ పంపిణీ చేస్తుంది. ఈ డివిడెండ్ అందుకున్న వారు దానిపై తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా పన్ను చెల్లించాలి. అంటే రెండు దశల్లో డివిడెండ్‌పై పన్ను పడినట్టు అవుతోంది. ఇలా ప్రత్యక్షం కంటే, పరోక్ష పన్నుల భారం ప్రజలపై బాగా పెరిగిపోయింది. వ్యవసాయం– గ్రామీణంప్రస్తుత పరిస్థితి: రైతుల ఆదాయాన్ని, వారి ఆర్థిక స్థితిగతులు పెంచేందుకు కృషి చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయడం లేదు. 2023–24 బడ్జెట్లో సాగు రంగానికి రూ.1.25 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో పోలి్చతే కేవలం 0.6 శాతం పెంచి 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి కేటాయింపులు మాత్రం 4.2 శాతం పెంచి 1.80 లక్షల కోట్లు చూపించారు. అంచనాలు: పంట నష్టాన్ని తగ్గించి, మెరుగైన రేటు వచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు ప్రకటిస్తారన్న ఆశలు రైతన్నల్లో నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రైతులు అందరికీ నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం, పంట ఉత్పత్తి అనంతరం నిల్వ, సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సాహిస్తామని మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రకటనలు ఈ రంగానికి బలాన్నిచ్చేవే. ఇవి కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్లో అదనపు చర్యలు ఏమి ప్రకటిస్తారో చూడాలి. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలించవచ్చు. అంచనాలు: పాత పన్ను విధానం నుంచి ప్రజలను క్రమంగా కొత్త విధానంలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆశయం. పాత విధానంలో పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, ఈఎల్ఎస్ఎస్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం, గృహ రుణం చెల్లింపులపై గణనీయమైన పన్ను ప్రయోజనాలున్నాయి. అందరూ వీటిని వినియోగించుకోలేరు. కనుక అందరికీ ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ఉండేందుకు మినహాయింపుల్లేని కొత్త పన్ను విధానాన్నే అంతిమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకని నూతన పన్ను విధానంలోకి మళ్లే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు చేయవచ్చని అంచనాలున్నాయి. పరిశ్రమ భాగస్వాములు కూడా ఆర్థిక మంత్రిని ఇదే కోరాయి. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంచొచ్చన్న అంచనాలున్నాయి. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల ప్రాథమిక పన్ను మినహాయింపు పదేళ్ల నుంచి అదే స్థాయిలో కొనసాగుతోంది. దీన్ని పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. కానీ, పాత పన్ను విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు అందులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. పన్ను మినహాయింపులను పెంచడం వల్ల ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరిగి, అది వినియోగంలోకి వస్తుందని.. అంతిమంగా దేశ వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం వృద్ధి రేటు ఇక మీదటా గరిష్టాల్లో నిలదొక్కుకునేందుకు ఈ తరహా చర్యలు అవసరమన్న వాదన వినిపిస్తోంది. బీమాపై డిమాండ్లు ఇవీ.. ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ భారం తగ్గించాలన్న బలమైన డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేసేందుకు పన్ను రేటును 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ఆరోగ్యం, వైద్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు కలి్పస్తున్న వెసులుబాటులో (60ఏళ్లలోపు ఉంటే రూ.25 వేలు, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50 వేలు) గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోవడాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ద్రవ్యోల్బణానికి ముడిపెట్టి, ఈ సెక్షన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఏటా ఆటోమేటిక్‌గా పెరిగే విధంగా ఉంటే బావుంటుందని తెలిపింది. ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) మినహాయింపును పెంచాలన్న డిమాండ్ ఉంది. భారీ పన్ను వసూళ్లు అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకునేందుకు బడ్జెట్‌కు వెసులుబాటు ఉంటుందన్నది విశ్లేషణ.దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మారుతుందా? దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినట్టయితే దీర్ఘకాల మూలధన ఆస్తులుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. స్వల్పకాల మూలధన లాభాలపై 15 శాతం పన్ను, దీర్ఘకాల మూలధన లాభం రూ.మొదటి లక్ష తర్వాత మొత్తంపై 10 శాతం పన్ను అమలవుతోంది. అదే రియల్ ఎస్టేట్‌ను 24 నెలలు నిండినప్పుడే దీర్ఘకాల మూలధన ఆస్తిగా చూస్తున్నారు. వివిధ సాధనాల మధ్య గందరగోళం లేకుండా ఏకరూపత తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన ఆస్తుల కాలాన్ని రెండేళ్లకు పెంచడం లేదంటే రియల్ ఎస్టేట్ సాధనానికి రెండేళ్లకు బదులు ఏడాది కాలాన్ని దీర్ఘకాల ఆస్తిగా నిర్ణయించొచ్చని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఏడాదికే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు కలి్పస్తే మార్కెట్లోకి ఎక్కువ ప్రాపరీ్టలు విక్రయానికి వచ్చి, రేట్ల పెరుగుదల ఒత్తిడి తగ్గుతుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు రెండేళ్లకు పెంచితే అది కొంత నిరుత్సాహపరిచే అవకాశం లేకపోలేదు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్షకు పన్ను ఉపశమనం ఉండగా, దీన్ని రూ.2 లక్షలు చేయాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఆర్థిక మంత్రిని కోరింది.ఉపాధి ప్రస్తుత పరిస్థితి: తలసరి ఆదాయాన్ని పెంచడం ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. ప్రపంచంలో టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ పరిమాణం పరంగా 3,942 బిలియన్ డాలర్లతో (2024 జూలై 1 నాటికి ఐఎంఎఫ్ డేటా) భారత్ ఐదో స్థానంలో ఉంది. కానీ, తలసరి ఆదాయం 2730 డాలర్లతో (రూ.2.27 లక్షలు) టాప్–10లో చివరి స్థానంలో ఉంది. 2014 నుంచి చూస్తే తలసరి ఆదాయం రెట్టింపైనప్పటికీ.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఇది గణనీయంగా మెరుగుపడాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం వద్దనున్న ఏకైక అస్త్రం ఉపాధి కల్పన. సేవల రంగంపై ఆధారపడిన ఎకానమీని తయారీ వైపు మళ్లించడం ద్వారా ఉపాధి కల్పనను సాధించాలన్నది లక్ష్యం.అంచనాలు: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద వివిధ రంగాల్లో కొత్తగా తయారీ కేంద్రాల ఏర్పాటు, అదనపు ఉత్పాదకతపై ప్రోత్సాహకాలు అందిస్తోంది. దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఆయా ఉత్పత్తుల స్వావలంబన సాధించేందుకు (ఆత్మనిర్భర్ భారత్), ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయాలన్న (మేక్ ఇన్ ఇండియా) లక్ష్యాలు ఇందులో అంతర్లీనంగా ఉన్నాయి. దీంతో దేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడగలవని కేంద్రం భావిస్తోంది. ఆయా దిశల్లో తాజా బడ్జెట్ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.మౌలికంప్రస్తుత పరిస్థితి: దేశం పారిశ్రామికంగా మరింత పురోగతి చెందాలంటే, అందుకు మెరుగైన వసతులు అవసరం. అప్పుడే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు రహదారులు, రైల్వే, జలమార్గాలకు ప్రాధాన్యాన్ని పెంచింది. రైల్వే వసతుల ఆధునికీకరణపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.అంచనాలు: 2023–24లో రైల్వేలకు రూ.2.41 లక్షల కోట్లు చేయగా, ఈ విడత రూ.2.9–3 లక్షల కోట్లకు పెంచొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు రహదారుల నిర్మాణానికీ కేటా యింపులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 నాటికి జాతీయ రహదారుల నిడివి 91,287 కిలోమీటర్లు ఉండగా, 2023 డిసెంబర్ నాటికి 1,46,145 కిలోమీటర్లకు పెరిగింది. ఏటా 4,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం ఉండగా, దాన్ని, 12వేల కిలోమీటర్లకు విస్తరించారు. జీడీపీలో మూలధన కేటాయింపులను 3.5 శాతానికి పెంచొచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేస్తోంది. ఎకానమీ పురోగతికి మౌలిక రంగం కీలకమని భావిస్తున్న కేంద్రం ఈ విషయంలో ప్రైవేటు భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్లోనూ ఈ మేరకు నిర్ణయాలు ఉండవచ్చని అంచనా.హెల్త్కేర్ప్రస్తుత పరిస్థితి: దేశ ఉత్పాదకత పెరిగేందుకు ఆరోగ్యకర సమాజం ఎంతో అవసరం. 2023–24 బడ్జెట్లో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు చేసిన కేటాయింపులు రూ.80,517 కోట్లు. మొత్తం బడ్జెట్లో 2 శాతంలోపే. 2024–25 మధ్యంతర బడ్జెట్లో 13 శాతం పెంచి రూ.90,658 కోట్లు చూపించారు. ఈ నిధులు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. నూతన ఔషధాల ఆవిష్కరణపై చేసే ఖర్చుకు, డయాగ్నోస్టిక్స్పైన జీఎస్టీ మినహాయించాలని, పీఎల్ఐ కింద ఈ రంగానికి ప్రోత్సాహకాలు పెంచాలని పరిశ్రమ కోరుతోంది. 9–14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్ నుంచి నివారణకు టీకా ఇవ్వడాన్ని సార్వత్రిక టీకా కార్యక్రమం పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఉంది.అంచనాలు: కేన్సర్, జీవనశైలి వ్యాధుల నివారణకు వీలుగా ప్రజారోగ్యంపై మరింత పెట్టుబడులు అవసరమన్న సూచనలను బడ్జెట్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని మరింత మందికి చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. వైద్య ఉపకరణాల దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధికంగా కస్టమ్స్ డ్యూటీలు మన దేశంలోఉన్నాయని, వీటిని తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను పరిశీలించవచ్చు.విద్యారంగంవిద్యారంగానికి 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే 7% తక్కువగా రూ.1.2 లక్షల కోట్లనే 2024–25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్లో అయినా దీన్ని సరిదిద్దుతారేమో చూడాలి. విద్యా సేవలు, టెస్ట్ ప్రిపరేషన్, నైపుణ్య కోర్సులపై 18% జీఎస్టీ చాలా ఎక్కువన్న అభ్యంతరం ఉంది. నాణ్యమైన విద్యను అందుబాటు వ్యయాలకే అందించే దిశగా తగినన్ని పెట్టుబడులతోపాటు స్కాలర్íÙప్లు, ఆర్థిక సాయం, సులభంగా విద్యా రుణాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలు, ఎడ్టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా రుణాలు సులభం కావాలన్నది డిమాండ్.ఎంఎస్ఎంఈలు దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తున్న ఈ పరిశ్రమ కేంద్రం నుంచి మరింత సాయాన్ని ఆశిస్తోంది. తక్కువ వడ్డీపై రుణ సాయానికి తోడు, సులభతర రుణాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన, సానుకూల పన్ను విధానం, వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా నిబంధనల అమల్లో వెసులుబాటు తదితర రూపాల్లో సహకారాన్ని కోరుతోంది. ప్రతి జిల్లా స్థాయిలో ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు చేసి, వసతులు కలి్పంచడం, నైపుణ్యాభివృద్ధి కల్పనతో మరింత మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నాయి. ఎస్ఎంఈలకు 45 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది. హౌసింగ్ అందుబాటు ధరల ఇళ్లు, పర్యావరణ అనుకూల ఇళ్ల ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా డెవలపర్లకు ప్రోత్సాహకాలు కలి్పంచాలని రియల్టీ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విజయవంతమైన నేపథ్యంలో.. మరింత మందికి లబ్ధి చేకూరేందుకు ఈ పథకాన్ని 2.0 రూపంలో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. అందరికీ ఇళ్ల లక్ష్యం సాకారం దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయన్న అంచనాలు పెరిగాయి. గృహ రుణాలపై రూ. 5 లక్షల వరకు వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు కల్పించాలని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. ఈ రంగానికి పరిశ్రమ హోదా కలి్పంచాలన్న డిమాండూ ఉంది.పర్యావరణ ఇంధనాలు శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడగా, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ తదితర పర్యావరణ అనుకూల ఇంధనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని చేరుకోవాలంటే పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులకు ప్రోత్సాహం ఉండాలని, శుద్ధ ఇంధన వనరులకు మళ్లేందుకు, ఈ దిశగా పరిశోధన, అభివృద్ధికి తగినంత ప్రోత్సాహం అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న దశలో ఫేమ్ పథకం ద్వారా సబ్సిడీలు తొలగించడం సరికాదని పరిశ్రమ భావిస్తోంది.బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఎకానమీ పురోగతిలో కీలకమని కేంద్రం భావిస్తోంది. ఈ రంగంలో సంస్కరణలకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఇతర చట్టాలకు సవరణలను బడ్జెట్లో ప్రతిపాదించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించాలంటే బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980లకు సవరణలు తప్పనిసరి. ఈ రెండు చట్టాలు బ్యాంకుల జాతీయకరణ సమయంలో తెచ్చినవి. వీటిల్లో సవరణలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు, ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం లోపునకు తగ్గించుకునేందకు వీలు లభిస్తుంది.మోదీ సర్కారు రహదారులు, రైల్వేలు, జల్‌శక్తి, కమ్యూనికేషన్లకు పెద్ద పీట వేస్తున్నట్టు గత నాలుగు బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే తెలుస్తోంది. విద్య, వైద్యానికీ కేటాయింపులు పెంచినప్పటికీ రహదారులు, రైల్వేల స్థాయిలో లేకపోవడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా దేశ రక్షణ కోసమే పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నట్టు ఈ పట్టికను పరిశీలిస్తే తెలుస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Interim Budget 2024: ఆర్థికమంత్రి హల్వా విందు...
2024 మధ్యంతర బడ్జెట్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు ప్రతీకాత్మకంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికశాఖ నార్త్‌బ్లాక్‌లో హల్వా విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ అధికారికంగా ప్రారంభమవుతుంది. లోక్‌సభలో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంతవరకూ ముద్రణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ‘లాక్–ఇన్’లో ఉంటారు. బడ్జెట్‌కు ముందు సంప్రదాయంగా వస్తున్న ఈ హల్వా రుచుల ఆస్వాదన కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి కరాద్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంతా పాండే తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
Budget Halwa: హల్వానే కాదు ప్రతుల ముద్రణ వెనుక అంత కథ ఉందా?
యూనియన్ బడ్జెట్ దరిమిలా.. మరో ముఖ్యమైన బడ్జెట్ హల్వా. బడ్జెట్ తయారీలో చివరి ఘట్టంగా దీనిని పేర్కొంటారు. బడ్జెట్ తయారీలో పని చేసే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది కోసం హల్వా సిద్ధం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అయితే కాస్త గ్యాప్‌తో జరిగిన కార్యక్రమం కూడా ముగిసింది. ఏడాది గ్యాప్ తీసుకుని.. బడ్జెట్ హల్వా మళ్లీ మన ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడాయిలో వండిన హల్వా సీల్‌ను తెరిచి.. అందరికీ పంచి ఈ ఆనవాయితీని కొనసాగించారు. గురువారం నార్త్ బ్లాక్‌లో జరిగింది ఈ కార్యక్రమం. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం, పదిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కాకతాళీయంగా ఈసారి గణతంత్ర దినోత్సవం నాడే ఇది జరగడం గమనార్హం. కిందటి ఏడాది కరోనా కారణంగా హల్వాకు బదులకు స్వీట్లను పంచారు. బడ్జెట్ హల్వా కార్యక్రమం.. ఆర్థిక మంత్రి సమక్షంలో జరుగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా.. ఇతరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా ఐదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత రెండు బడ్జెట్‌లా మాదిరే ఈ ఏడాది కూడా పేపర్‌లెస్‌గా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారామె. హల్వా వేడుక.. అనేది బడ్జెట్లో ఓ ముఖ్యమైన ఘట్టం. బడ్జెట్ రూపొందించిన అధికారులకు, సిబ్బంది సేవలకు గుర్తింపుగా.. తీపిని అందించడం ద్వారా ఈ వేడుకను ప్రతీ ఏటా నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కిందటి ఏడాది మాత్రం బదులుగా స్వీట్లు పంచారు. బడ్జెట్ తయారీ అంతా ఫైనల్ బడ్జెట్ డాక్యుమెంట్ బయటకు వచ్చేదాకా అంతా గోప్యంగానే ఉంటుంది. బడ్జెట్ రూపొందించే అధికారులు, సిబ్బంది అంతా వందమంది దాకా ‘లాక్ ఇన్ పీరియడ్’లో ఉండిపోతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా(కుటుంబ సభ్యులతో సహా) ఉండిపోతారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాతే వాళ్లు బయటకు వచ్చేది. ఒక రకంగా చూసుకుంటే.. ఇది క్వారంటైన్ లాంటిదే!. గతంలో లాక్ఇన్ పీరియడ్ రెండు వారాలు ఉండేది. తర్వాత పదిరోజులు అయ్యింది. ఇప్పుడు బడ్జెట్ అనేది డిజిటల్ ఫార్మట్‌కు మారడంతో.. ఐదు రోజులకు కుదించారు. 1950లో బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించారు. అయితే ఆ సమయంలో బడ్జెట్ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి. దీంతో పెనుకలకలమే రేగింది. ఆపై ఢిల్లీ మింట్ రోడ్‌లోని ప్రింట్ ప్రెస్‌కు మారింది. ఆపై 1980 నుంచి నార్త్‌బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ ప్రెస్‌ను ఇందుకోసం శాశ్వతంగా వినియోగిస్తున్నారు. నార్త్ బ్లాక్ బేస్మెంట్లో 1980-2020 మధ్య కాలంలో బడ్జెట్ ప్రతులను ముద్రించేవాళ్లు. ఆ తర్వాత బడ్జెట్ డిజిటల్ కావడం, మొబైల్ యాప్ లేదంటే వెబ్సైట్ ద్వారా ప్రతులను పంచడంతో.. కేవలం కొన్ని డాక్యుమెంట్ల ముద్రణ మాత్రమే ఉంటోంది. యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in, యూనియన్ బడ్జెట్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. -
‘బడ్జెట్ హల్వా’ తయారీ
న్యూఢిల్లీ: ‘బడ్జెట్ హల్వా’ఉత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో జరిగింది. సాధారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణను హల్వా తయారీతో ఆరంభిస్తారు. ఈ ఆనవాయితీలో భాగంగానే వచ్చే నెల 5న ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణను ప్రారంభించే కార్యక్రమానికి ముందు హల్వా ఉత్సవం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజ్ భూషణ్ పాండే, దీపమ్ కార్యదర్శి అతను చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటి.. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, పారిశ్రామిక నిపుణులతో శనివారం సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్థిక వేత్తలు, వివిధ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్, గణాంకాలు, పథకాల అమలు శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌లు కూడా హాజరయ్యారు. -
హల్వాతో ప్రారంభం.. సూక్తితో ముగింపు
న్యూఢిల్లీ : మరి కొద్ది గంటల్లో మోదీ ప్రభుత్వం కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మన దేశంలో 26 మంది ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 76 బడ్జెట్ సెషన్లు జరిగాయి. బడ్జెట్‌కి సంబంధించి దాదాపు 72 ఏళ్లుగా మన దేశంలో పాటిస్తున్న కొన్ని సంప్రదాయాలను ఓ సారి చూడండి. 1. నేడు తాత్కలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తయారికి దాదాపు 5 నెలల సమయం పడుతుంది. గతంలో ఆర్థిక సంవత్సరం మార్చి - ఏప్రిల్ వరకూ ఉన్నప్పుడు ఫిబ్రవరి నెలాఖరు వరకూ కూడా బడ్జెట్ తయారి ప్రక్రియ కొనసాగేది. కానీ మోదీ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని ఫిబ్రవరి - మార్చికి మార్చింది. ఇప్పుడు జనవరి చివరి రోజు వరకూ బడ్జెట్ తయారీ కొనసాగుతుంది. 2. కొత్త డాటా ప్రకారం తొలుత కీలక అంశాలకు కేటాయింపులు ముగిసిన తర్వాత దీన్ని ఆర్థిక మంత్రికి అంద జేస్తారు. ఈ వివరాలన్నింటిని మార్పు చేయడానికి వీలులేని నీలం రంగు పేపర్లో చేర్చి ఆర్థికమంత్రికి ఇస్తారు. ఆయన దీన్ని పరిశీలించి తిరిగి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. తన దగ్గర ఉంచుకోవడానికి కుదరదు. ఈ నీలం రంగు బడ్జెట్ పేపర్ల సంప్రదాయాన్ని బ్రిటీష్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి తీసుకున్నాం. 3. ఇప్పుడైతే బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడ్తున్నాం. కానీ 1999 వరకూ కూడా బడ్జెట్‌ను ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రకటించేవారు. ఉదయం 11 గంటలకు ప్రకటించే సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా 2001 నుంచి ప్రారంభించారు. 4. బడ్జెట్ ప్రసంగం కనీసం ఒక గంటపాటు కొనసాగుతుంది. కానీ 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సేపు ప్రసంగించారు. దాదాపు 18,650 పదాలు వాడారు. తరువాతి స్థానంలో జైట్లీ నిలిచారు. గత ఏడాది జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ 18,604 పదాలు వాడారు. అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తి హెచ్ఎమ్ పాటిల్. 1977లో తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పాటిల్ కేవలం 800 పదాలను మాత్రమే వాడారు. 5. ఇక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం వరకూ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఫోన్లను ట్యాప్ చేయడం, జామర్స్, స్కానర్స్, రహస్య కెమరాలను ఏర్పాటు చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టేవరకూ ఎక్కడ ఎటువంటి సమాచారం లీక్ కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 1950 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. 6. అన్ని శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులు ముగిసాక ఆర్థిక మంత్రి కార్యాలయంలోని బేస్మెంట్లో ఉన్న ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ముద్రించడం జరుగుతుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి వారం ముందుగా ముద్రణ ప్రారంభమవుతుంది. హల్వా తయారీతో బడ్జెట్ ప్రింటింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆర్థికమంత్రి దాదాపు 100 మంది అధికారులకు, సిబ్బందికి ఈ హల్వా తినిపిస్తారు. 7. పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించేవరకూ ఆ శాఖకు సంబంధించిన సిబ్బందిని నార్త్ బ్లాక్ పరిసరాల్లోనే ఉంచుతారు. వారు బయటకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సెల్ ఫోన్లు వాడటం వంటివి నిషేధం. వారికి వడ్డించే ఆహారాన్ని కూడా పరీక్షిస్తారు. వైద్యులతో పాటు ఇంటిలిజెన్స్ అధికారులు, పోలీసుల భద్రత ఏర్పాటు చేస్తారు. 8. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్ పత్రాలున్న రెడ్ కలర్ లెదర్ బ్యాగ్‌ను పార్లమెంట్ బయట ప్రెస్ ఫోటోకాల్ నిమిత్తం ప్రదర్శిస్తారు. ఈ సంప్రదాయం రాణి విక్టోరియా కాలం నుంచి కొనసాగుతుంది. యశ్వంత్ సిన్హా, ప్రణబ్ ముఖర్జి వాడిన లెదర్ బ్యాగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. 9. బడ్జెట్ ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రి ప్రసిద్ధి చెందిన వ్యక్తులు చెప్పిన సూక్తులతో ప్రారంభిస్తారు. గతంలో మన్మోహన్ సింగ్ తన ప్రసంగానికి ముందు రవీంద్రనాథ్ ఠాగూర్, విక్టర్ హ్యూగో సూక్తులను ఉటంకించగా.. పి చిదంబరం వివేకానంద, తిరరువల్లువారు సూక్తులను ప్రస్తావించారు. వీరికి విరుద్ధంగా ప్రణబ్ ముఖర్జీ కౌటిల్యుడు, షేక్స్పియర్ సూక్తులను ఉటంకించారు. -
బడ్జెట్లో హల్వా ఎందుకు?
న్యూఢిల్లీ : పానకంలో పుడకలా... దేశం ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఈ స్వీటు గొడవవేంటీ అనుకుంటున్నారా? ఇదీ బడ్జెట్లో భాగమే! అవును, బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా హడావుడి మొదలవుతుంది. బడ్జెట్ రూపకల్పనలోని చివరి అంకం ఈ మిఠాయితోనే ఆరంభమౌతుంది. పత్రాలన్నీ సిద్ధమయ్యాక... ప్రింటింగ్‌కి పంపించే ముందు బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యులైన అధికారులందరూ హల్వా వండుకుని తింటారు. మామూలుగా అయితే, మన సంప్రదాయం ప్రకారం ఏపనినైనా పూజ చేసి మొదలుపెడతాం. కానీ, బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌కు ముందు అలాంటివేవీ ఉండవు. హల్వా పంచుకుని తినడమే అసలైన పండగ. ప్రింటింగ్ ఎక్కడ? బడ్జెట్ రూపొందించడం ఎంత పకడ్బందీగా జరుగుతుందో... ఆ పత్రాల ముద్రణ కూడా అంతే రహస్యంగా జరుగుతుంది. నిజానికి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలూ ప్రభుత్వ ముద్రణాలయాల్లో జరుగుతాయి. కానీ, బడ్జెట్ పత్రాలు మాత్రం అలా కాదు. పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రత్యేకమైన ముద్రణా యంత్రంలో మాత్రమే వీటిని ముద్రిస్తారు. మొదట్లో... అంటే, 1947 నుంచి 1950 వరకూ బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950 తరువాత ప్రింటింగ్‌ను మౌంట్‌రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కి మార్చాల్సి వచ్చింది. కారణం... ఆ ఏడాది బడ్జెట్ పత్రాల్లోని సమాచారం ముందుగానే లీక్ కావడం! తరువాత, 1980 నుంచి బడ్జెట్ పత్రాల ముద్రణ కోసం ప్రత్యేకమైన ప్రెస్‌ను నార్త్‌బ్లాక్‌లో ప్రారంభించారు. ఈ ‘బడ్జెట్ ప్రెస్’ హాలు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్, మోడరన్ మెషీన్స్, జామర్లు, సీసీ కెమెరాలు... బయట నుంచి చిన్న చీమ కూడా లోపలికి రాని విధంగా దీన్ని నిర్మించారు.