S&P
-
ఆర్థిక వృద్ధిలో భారత్ ఎకానమీ ట్రాక్ రికార్డ్ - ఎస్అండ్పీ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్ రికార్డు) కలిగి ఉందని రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతం వృద్ధి అంచనాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ’స్లోయింగ్ డ్రాగన్స్, రోరింగ్ టైగర్స్’ అనే శీర్షికతో వెలువరించిన ఆసియా–పసిఫిక్ క్రెడిట్ అవుట్‌లుక్, 2024లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సేవల రంగం పురోగతి, పెట్టుబడులకు సంబంధించిన మూలధనం క్రమంగా పురోగమించడం, వృద్ధికి దోహదపడే విధంగా యువత అధికంగా ఉండడం, ఉత్పాదకత మెరుగు వృద్ధికి ప్రధాన కారణాలు. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 6.9 శాతంగా ఉంటుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం రుణ భారాలను పెంచే అంశం. అయితే వృద్ధి బాట పటిష్టంగా ఉండడం మార్కెట్ విశ్వాసానికి, రెవెన్యూ సృష్టికి దోహదపడుతుంది. ► శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాలకు సంబంధించి నియంత్రణలు, సవాళ్లు తొలగడం తదుపరి దశ వృద్ధికి దోహదపడే అంశాలు. ► ఆర్థిక వ్యవస్థలో సేవల ప్రభావం కాలక్రమేణా పెరిగింది. వ్యవసాయం, ఇతర ప్రాథమిక పరిశ్రమలు వెయిటేజ్‌లు ఎకానమీలో తగ్గాయి. సేవల రంగం మరింత పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం. -
భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో చక్కటి వృద్ధి బాటన పయనిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తాజా ప్రకటనలో పేర్కొంది. పటిష్ట ఆర్థిక ఫండమెంటల్స్ (మూలాధారాలు) ఇందుకు దోహదపడతాయని వివరించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ’ సావరిన్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) ఎస్అండ్పీ తాజా ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ఎస్అండ్పీ ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్‌లుక్’ భారత్ పటిష్ట ఎకానమీని, ఆదాయ వృద్ధిని ప్రతిబింబిస్తోంది. బలహీన ఫైనాన్షియల్ అంశాల వల్ల ప్రతికూలతలు ఏర్పడకుండా పటిష్ట ఎకానమీ, ఆదాయాలు భరోసాను ఇస్తున్నాయి. ♦ దీర్ఘకాలిక, ‘ఏ–3’ షార్ట్–టర్మ్ ఫారెన్, లోకల్ కరెన్సీలకు ‘బీబీబీ’ సావరిన్ క్రెడిట్ రేటింగ్ కొనసాగిస్తున్నాం. ♦సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కనబరుస్తోంది. రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో వృద్ధిని బలపరిచేందుకు భారత్ పటిష్ట ఫండమెంటల్స్ దోహదపడతాయని అంచనావేస్తున్నాం. ♦ ప్రభుత్వ–ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, రుణ భారాల వంటి అంశాలను స్థిరీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఇవి మరికొంత కాలం అధికంగానే కొనసాగే వీలుంది. పెట్టుబడులకు కీలకం... భారత్ సావరిన్ రేటింగ్ విషయంలో యథాతథ వైఖరిని అవలంభిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ ఈ నెల ప్రారంభంలో చేసిన ప్రకటన నేపథ్యంలోనే ఎస్అండ్పీ తాజా ప్రకటనలో వెలువడింది. చక్కటి వృద్ధి తీరు, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం వంటి అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల విషయంలో పరిస్థితి బలహీనంగా ఉందని కూడా హెచ్చరించింది. తాజాగా ఎస్అండ్పీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఎస్అండ్పీ ‘బీబీబీ’ సావరిన్ రేటింగ్, అలాగే ఫిచ్ ఇస్తున్న ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌లు రెండూ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. చెత్త రేటింగ్‌కు ఒక అంచె అధికం. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-మూడీ స్ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ను ఇస్తోంది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) అంతర్జాతీయంగా దేశంలోకి పెట్టుబడులు రావడానికి ఆయా సంస్థలు ఇచ్చే రేటింగ్స్ కీలకం. రేటింగ్ పెంపునకు కేంద్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతిస్పందన రావడం లేదు. దీనితో భారత్‌కు సంబంధించి రేటింగ్ వచ్చే విషయంలో హేతుబద్దత కనబడ్డంలేదన్న విమర్శలూ తలెత్తుతున్నాయి. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) ఎకానమీపై ఐక్యరాజ్యసమితి విశ్వాసం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి పూర్తి విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. 2023లో 5.8 శాతం, 2024లో 6.7 శాతం వృద్ధిని దేశం నమోదుచేసుకుంటుందని ‘ఆర్థిక పరిస్థితులు-అవకాశాలు’ శీర్షికన రూపొందించిన ఒక తాజా నివేదికలో తెలిపింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని నివేదికలో అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ వృద్ధికి దోహదపడే ప్రధాన అంశంగా వివరించింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో భారత్ ఎకానమీ ప్రకాశవంతంగా కొనసాగుతోందని ప్రశంసించింది. 2023లో భారత్‌లో ద్రవ్యోల్బణం సగటును 5.5%గా ఉంటుందని అభిప్రాయపడుతూ తగ్గుతున్న అంతర్జాతీయ కమోడిటీ ధరలు, కరెన్సీ క్షీణత నెమ్మదించడం ఇందుకు కారణంగా ఉంటాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో 2.3%, 2024లో 2.5% వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. మరింత బిజినెస్ సమాచారం కోసం చదవండి : సాక్షి బిజినెస్ -
పోర్ట్‌ఫోలియో ఇలా అయితే బెటర్!
కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించి ఇప్పటికే ఒక మాసం ముగిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించాయి. ప్రధాన సూచీలు 70 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 సూచీలో 200కు పైగా స్టాక్స్ రెట్టింపునకు పైగా పెరిగాయి. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లోనూ అదే మాదిరి లాభాలు ఆశించడం అత్యాశే అవుతుంది. పెట్టుబడులంటే ఒక్క లాభాలే కాదు. మీ పెట్టుబడికి రక్షణ కూడా అవసరం. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైనా అధిగమించే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళికకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, ఈక్విటీల్లో అధిక రాబడులను చూసి లేదా బిట్‌కాయిన్ పరుగులు చూసి భారీగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదంటున్నారు. ఈక్విటీలతో పాటు ఇతరత్రా సాధనాలకు ఇన్వెస్టర్లు ఏ మేరకు పెట్టుబడులను కేటాయించుకోవాలన్న అంశంపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి... ఎకానమీ పుంజుకుంటుంది ప్రతీ ఇన్వెస్టర్ జీవితంలో ఏ దశలో ఉన్నారు.. లక్ష్యాలు, వాటికి ఎంత వ్యవధి ఉందనే అంశాల ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక అవరోధాలు ఏర్పడినప్పటికీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుంది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి చక్రంలోకి భారత్ ప్రవేశించనుంది. కంపెనీలు బలమైన లాభాల ఆర్జనకు ఇది వీలు కల్పిస్తుంది. మార్కెట్లు మంచి పనితీరు చూపించేందుకు మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభాలు పెరగనున్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఈక్విటీలు సా«ధారణం కంటే ఎక్కువే రాబడులను ఇస్తాయి. కరోనా సెకండ్‌వేవ్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, వాటిని భారత్ తట్టుకోగలదన్న విశ్వాసం ఉంది. – నీరజ్ కుమార్ ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్ /ఈటీఎఫ్‌లు మెరుగైనవి.. 2020 మార్చిలో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఏడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ 78 శాతం ర్యాలీ చేసింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఈక్విటీల పరిమాణం పెరిగి ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి సంపదను సమకూర్చుకునేందుకు సరైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఎంతో అవసరం. పెట్టుబడుల లక్ష్యాలకు ఇది కీలకం. ఆయా అంశాలను పరిశీలిస్తే... ► ఈక్విటీలు: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ వ్యయాలకే మార్కెట్ ఆధారిత రాబడులను అందుకోవచ్చు. ► స్థిరాదాయం: స్థిరమైన, మంచి వృద్ధికి అవకాశం ఉన్న ఎన్సీడీలు ఇప్పటికీ ఉన్నాయి. మార్కెట్ అస్థిరతలను తట్టుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులకు హెడ్జింగ్ కోసం ఈ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: దేశీయ మార్కెట్లలో ఉండే అస్థిరతలకు హెడ్జ్ (రక్షణగా)గా అంతర్జాతీయ ఈక్విటీలు ఉపయోగపడతాయి. అంతేకాదు బలమైన వృద్ధి అవకాశాలున్న అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ► బంగారం: ఈక్విటీ మార్కెట్ల తీరు ప్రతికూలంగా మారిన సందర్భాల్లో బంగారం పథకాల్లో పెట్టుబడులు.. స్థిరత్వాన్నిస్తాయి. పెట్టుబడుల కేటాయింపులు.. ► ఈక్విటీలు: 70 శాతం (నేరుగా స్టాక్స్‌లో 40 శాతం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు 20 శాతం, ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్‌కు 10 శాతం) ► ఫిక్స్డ్ ఇన్కమ్: 15 శాతం (డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు 10 శాతం, ఏఏఏ రేటెడ్ కార్పొరేట్ ఎన్‌సీడీలకు 5 శాతం). డెట్ ఫండ్స్‌లో అల్ట్రా షార్ట్ టర్మ్ లేదా లో డ్యురేషన్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్ లేదా డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: 10 శాతం (ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కు 5 శాతం, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్‌కు 5 శాతం) ► బంగారం: 5 శాతం (గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లు) – దినేష్ రోహిరా, 5నాన్స్ డాట్‌కామ్ సీఈవో ఇక ముందూ ఈక్విటీల ర్యాలీ 2021–22లో అంతర్జాతీయంగా అధిక ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ఇది ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి, ప్రధానంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది. దేశీయ ఈక్విటీలకు 50–60 శాతం మధ్య, అంతర్జాతీయ ఈక్విటీలకు 20–30 శాతం మధ్య కేటాయించుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. వ్యాల్యూ స్టాక్స్‌పై దృష్టి సారించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది కాలంలో ఇవి మంచి పనితీరు చూపిస్తాయి. బంగారం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 10 శాతం చొప్పున కేటాయించుకోవాలి. నిపుణుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. కేటాయింపులు.. ► బంగారం, ఫిక్స్డ్ఇన్కమ్: 10 శాతం ► అంతర్జాతీయ ఈక్విటీలు: 20–30% దేశీయ ఈక్విటీలు: 50–60% – దివమ్ శర్మ, గ్రీన్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ 60/40 ఫార్ములా.. ఇన్వెస్టర్ వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. సాధారణంగా 60/40 సూత్రాన్ని మేము సూచిస్తుంటాం. అంటే 60 శాతం కేటాయింపులు ఈక్విటీలకు, మిగిలిన 40 శాతం స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు, బంగారం కలయికగా ఉండాలి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు భారీ ర్యాలీ చేసినప్పటికీ 2021–22లోనూ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడులను ఇస్తాయని భావిస్తున్నాం. తక్కువ వడ్డీ రేట్లు, సరిపడా ద్రవ్యలభ్యత, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం, కార్పొరేట్ లాభాలు పుంజుకోవడం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగుతుంది. వచ్చే రెండేళ్లపాటు ఈక్విటీలు రెండంకెల రాబడులను ఇస్తాయన్నది అంచనా. కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని దేశం అధిగమించడానికి తగిన అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇది ఈక్విటీలకు సానుకూల అంశం. కేటాయింపులు ► ఫిక్స్డ్ ఇన్కమ్: 40 శాతం (ఇందులో బంగారం, వడ్డీ ఆదాయాన్నిచ్చేవి, స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు ఉండాలి) ► ఈక్విటీలు: 60 శాతం కేటాయించుకోవాలి. – గౌరవ్‌దువా, షేర్‌ఖాన్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ -
ఇలా అయితే వృద్ది అంచనాకు కోత తప్పదు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రికవరీకి సెకండ్‌వేవ్ కేసుల పెరుగుదల తీవ్ర అవరోధంగా మారుతున్న నేపథ్యంలో తమ తొలి వృద్ధి రేటు అంచనాలను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్&పీ) పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. కరోనా కేసుల తీవ్రతతో భారత్ ఎకానమీకి సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపింది. వ్యాపార కార్యకలాపాల్లో తీవ్ర అవరోధాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) భారత్ 11 శాతం వృద్ధి సాధిస్తుందన్నది ఎస్అండ్పీ తొలి అంచనా. తీవ్ర అనిశ్చితి కోవిడ్-19 తాజా కేసుల పెరుగుదల భారత్ వృద్ధి అవకాశాలను అనిశ్చితిలో పడేస్తున్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. దీనితో రికవరీకి అవరోధాలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తిరిగి తీసుకుంటే, అది వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని వివరించింది. ‘‘ఇదే జరిగితే మా తొలి అంచనా 11 శాతం వృద్ధిని సవరించే అవకాశం ఉంది’’ అని ఎస్అండ్పీ ప్రకటన తెలిపింది. మహమ్మారి వల్ల ఇప్పటికే ఉత్పత్తి, వృద్ధిలో తీవ్రంగా నష్టపోయిందని వివరించింది. దీర్ఘకాలంలో చూస్తే,జీడీపీలో 10 శాతానికి సమానమైన ఉత్పత్తి విలువను కోల్పోతున్నట్లు తెలిపింది. సెకండ్‌వేవ్‌లో పెద్ద ఎత్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం చాలా తీవ్ర విషయమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కేసులు కూడా భారీగా పెరుగుతుండడం ఎకానమీకి ప్రతికూలంగా మారుతోందని తెలిపింది. ఆయా అంశాలు ఆరోగ్య మౌలిక రంగాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు విశ్లేషించింది. రుణ పరిస్థితిపై ప్రభావం ఎస్అండ్పీ ఆర్థిక రంగానికి సంబంధించి విశ్లేషిస్తూ, 2021-22 బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చాలంటే భారీ వృద్ధి తప్పనిసరని తెలిపింది. తద్వారానే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇప్పటికే అధికంగా రుణ భారాన్ని స్థిరీకరించవచ్చని అంచనావేసింది. ఆయా అంశాలన్నీ సార్వహౌమ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలపింది. ప్రస్తుతం భారత్ ఎకానమీకి స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ను కొనసాగిస్తోంది. చెత్త (జెంక్)కు ఇది ఒక్క అంచ మాత్రమే ఎక్కువ. ఉపాధిపై ప్రతికూలత రాష్ట్రాల్లో స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్లు రోజూవారీ ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎస్అండ్పీ పేర్కొంది. ఆయా అంశాలన్నీ ఎకానమీ రికవరీకి అలాగే కార్పొరేట్ ఆదాయ, వ్యయాలకు గండి కొడుతున్నాయని పేర్కొంది. ఇక బ్యాంకులు సైతం భారీ మొండిబకాయిల స్థితిలోకి జారే ప్రమాదముందని హెచ్చరించింది. మరిన్ని ‘వేవ్స్’కు అవకాశం భారత్‌లో ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వేరియెంట్లు పాకడం నుంచి ఆసియా-పసిఫిక్ ప్రాంతం తప్పించుకోలేకపోచ్చన్న అనుమానాన్ని ఎస్అండ్పీ వ్యక్తం చేయడం గమనార్హం. కొన్ని వైరెస్ మ్యుటేషన్స్‌పై పోరులో కొన్ని వ్యాక్సినేషన్ల సామర్థ్యం పరిమితంగా ఉందని పేర్కొంటూ, ఈ కారణంగా ఆసియా పసిఫిక్ దేశాలు మరిన్ని వేవ్స్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది. ఫిచ్, మూడీస్ ఇలా... గత వారం మరో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ- ఫిచ్ భారత్ ఎకానమీ 2021-22 వృద్ధి రేటును 12.8 శాతంగా అంచనావేసింది. మరో సంస్థ-మూడీస్ తన నివేదికలో భారత్ వృద్ధిపై సెకండ్‌వేవ్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! -
ఫాంగ్ స్టాక్స్ దన్ను- మూడో రోజూ రికార్డ్స్
వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,444 వద్ద నిలవగా.. నాస్డాక్ 87 పాయింట్లు(0.76 శాతం) ఎగసి 11,466 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ మాత్రం 60 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,249 వద్ద స్థిరపడింది. ఫాంగ్ స్టాక్స్ మరోసారి లాభపడటంతో నాస్డాక్ 2020లో 38వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం జాక్సన్హోల్ వద్ద ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యాపిల్ డీలా షేర్ల విభజన తదుపరి డోజోన్స్‌లో యాపిల్ ఇంక్ వెయిటేజీ నీరసించగా.. ఇండెక్స్‌లో చేపట్టిన ఇతర మార్పులు ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డోజోన్స్‌లో ఎక్సాన్ మొబిల్ స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్‌కు చోటు లభిస్తుండగా.. హనీవెల్ ఇంటర్నేషనల్ రాకతో రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో ఫైజర్ ఇంక్‌ను తోసిరాజని యామ్జెన్ ఇంక్ డోజోన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. బోయింగ్ ఇంక్ 2 శాతం, యాపిల్ 1 శాతం చొప్పున క్షీణించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. అయితే ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ 3-1 శాతం మధ్య లాభపడటంతో ఎస్అండ్పీ, నాస్డాక్ రికార్డులు కొనసాగినట్లు నిపుణులు పేర్కొన్నారు. బెస్ట్ బయ్ వీక్ ప్రభుత్వం పేరోల్ ప్యాకేజీని పొడిగించకుంటే అక్టోబర్‌లో 19,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్ 2.2 శాతం డీలా పడింది. ఎలక్ట్రానిక్స్ చైన్ బెస్ట్ బయ్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా క్యూ3లో అమ్మకాలు క్షీణించవచ్చని అంచనా వేసింది. దీంతో ఈ షేరు 4 శాతం పతనమైంది. ఇక క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో మెడ్‌ట్రానిక్స్ షేరు 2.5 శాతం ఎగసింది. -
మొండిబకాయిలు.. బాబోయ్!
⇔ మొత్తం రుణాల్లో 15 శాతానికి చేరే అవకాశం ⇔ అత్యధికంగా ఎన్పీఏలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ⇔ పెరగనున్న పీఎస్‌బీల మూలధన అవసరాలు ⇔ బ్యాంకింగ్ రంగంపై 2018 నాటికి ఎస్అండ్పీ అంచనా న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం మొత్తం రుణాల్లో 15 శాతా నికి చేరనున్నాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణమైన మూలధన అవసరాలు మాత్రం 2019 దాకా పెరుగుతూనే ఉంటాయి. భారతీయ బ్యాంకుల కష్టాలు, చికిత్స మీద ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 మార్చి ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొత్తం నిరర్ధక ఆస్తుల పరిమాణం 13–15 శాతం దాకా పెరగొచ్చని, ఈ రుణాల్లో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే ఉండనుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ చాబ్రియా తెలిపారు. తాము రేటింగ్ ఇస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ఏటా నిరర్ధక రుణాల పరిమాణం పెరుగుతుండటం.. అధిక ప్రొవిజనింగ్‌కు, లాభాలు తగ్గడానికి కారణమవుతోందని వివరించారు. దీంతో అనూహ్య నష్టాలను భరించేం దుకు అందుబాటులో ఉన్న మూలధనం చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. రాబోయే 12 నెలల్లో బ్యాంకుల రుణ పరపతి మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని నివేదికలో ఎస్అండ్పీ తెలిపింది. దశాబ్ద కనిష్టానికి రుణాల వృద్ధి.. రుణాల మంజూరులో వృద్ధి ప్రస్తుతం దశాబ్ద కనిష్ట స్థాయిలో ఉన్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. బాసెల్ త్రీ నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకోవాలంటే బ్యాంకులు ఇతరత్రా వనరులపై ఆధారపడాల్సి రావొచ్చని లేదా ప్రాధాన్యేతర ఆస్తులను విక్రయించుకోవాల్సి ఉంటుందని దీపాలీ చెప్పారు. ఏదైనా సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికి ఆస్కారం లేకుండా బ్యాంకుల వద్ద మూలధనం తక్కువ స్థాయిలో ఉందని, లాభసాటిగా లేని ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాల్లో కోత విధించుకోవాల్సి కూడా రావొచ్చని దీపాలీ చెప్పారు. నిబంధనల ప్రకారం మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం 2019 దాకా పెరుగుతూనే ఉండొచ్చని, లాభదాయకత మాత్రం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు. 2016–19 మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రూ. 70,000 కోట్లు కేంద్రం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. అయితే, పీఎస్‌బీల అవసరాలు పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు సరిపోవని ఎస్అండ్పీ తెలిపింది. మూలధనం కొరత, అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కన్సాలిడేషన్‌కు తెరతీయొచ్చని పేర్కొంది. ప్రభుత్వం మూలధనం సమకూర్చడం, అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడం భారతీయ పీఎస్‌బీల రేటింగ్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషించగలవని ఎస్అండ్పీ తెలిపింది. -
చైనాతో భారత్‌కు పోలికా..?
‘రేటింగ్’పై సుబ్రమణియన్ ఆరోపణలను తోసిపుచ్చిన ఏజెన్సీ ముంబై: వివిధ దేశాలకు సార్వభౌమ రేటింగ్ ఇచ్చే విషయంలో అత్యంత పారదర్శకంగా, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన విధానాలను పాటిస్తున్నామని... భారత్ దీనికి మినహాయింపేమీ కాదని ఎస్అండ్పీ తేల్చిచెప్పింది. తాము అనుసరిస్తున్న ప్రమాణాలు, పద్ధతులన్నీ వెబ్సైట్లో సవివరంగా ఉన్నాయని సంస్థ డైరెక్టర్(సార్వభౌమ రేటింగ్స్) కైరన్ కరీ పేర్కొన్నారు. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు అస్థిరమైన ప్రమాణాలను పాటిస్తున్నాయంటూ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తీవ్రంగా దుయ్యబట్టిన నేపథ్యంలో ఎస్అండ్పీ ఈ విధంగా స్పందించింది. ‘రేటింగ్‌ను నిర్ణయించే విషయంలో విభిన్నమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. భారత్‌కు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధిని ప్రోత్సహించడంలో సమతుల్యతను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని కరీ వివరించారు. చైనా తలసరి ఆదాయం 5 రెట్లు ఎక్కువ గ్లోబల్ రేటింగ్ విధానాలకు సంబంధించి చైనా, భారత్‌ల మధ్య అసమానతలు ఉన్నాయని.. స్థిరమైన ప్రమాణాలను పాటించడం లేదంటూ ఆర్థిక సర్వేలో సుబ్రమణియన్ ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడం, దివాలా చట్టం అమలు, ద్రవ్య విధాన కార్యాచరణకు ఆమోదం, వస్తు సేవల పన్ను(జీఎస్టీ).. ఆధార్ బిల్లుకు మోక్షం వంటి పలు సంస్కరణలను రేటింగ్ ఏజెన్సీలు గుర్తించడం లేదని.. గతేడాది ఎస్అండ్పీ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను నిరాకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటువంటి చర్యలు వాటి(ఏజెన్సీలు) విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తాయని సుబ్రమణియన్ విమర్శించారు. ఎస్అండ్పీ నుంచి చైనాకు ప్రస్తుతం ‘ఏఏ మైనస్(ప్రతికూల అవుట్‌లుక్) రేటింగ్ ఉండగా.. భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్(స్థిర అవుట్‌లుక్)’. భారత్ కంటే చైనా రేటింగ్ ఆరు అంచెలు ఎక్కువ కావడం గమనార్హం. కాగా, 2010 నుంచి చూస్తే... చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 10 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోగా... భారత్ జీడీపీ వృద్ధి మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతూ వస్తోందని, అయినప్పటికీ.. ఎస్అండ్పీ చైనా రేటింగ్‌ను స్థిరంగానే కొనసాగిస్తోందంటూ సుబ్రమణియన్ పేర్కొన్నారు. అయితే, రేటింగ్స్ విషయంలో చైనాతో భారత్‌కు పోలికే లేదని కైరన్ కరీ స్పష్టం చేశారు. ‘చైనా తలసరి ఆదాయం భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువ. అంతేకాదు జీడీపీలో చైనా రుణ భారం కూడా దాదాపు 30 శాతం మాత్రమే. రుణాలపై భారత్ తమ ఆదాయాల్లో 21 శాతాన్ని ఖర్చు చేయాల్సి వస్తుండగా.. చైనా విషయంలో ఇది 3 శాతమే. అందుకే చైనా రేటింగ్ భారత్ కంటే అత్యంత మెరుగ్గా ఉంది’ అని కరీ వివరించారు. -
‘అప్పు’డే రేటింగ్ పెంచలేం!
అప్‌గ్రేడ్ చేయడానికి భారీ ప్రభుత్వ రుణమే అడ్డంకి... • బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి • ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు తాజా బడ్జెట్లో మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వ్యాఖ్యానించింది. అయితే, కొండంత ప్రభుత్వ రుణ భారం, బలహీనంగా ఉన్న పన్ను ఆదాయాలు... రేటింగ్ పెంపుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టిన బడ్టెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018–19కి ఈ లోటును 3 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016–17)లో ద్రవ్యలోటు 3.5%గా ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్య లోటుగా పరిగణిస్తారు. ‘ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుచుకునే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను బడ్జెట్ కళ్లకుకట్టింది. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా సమీపకాలంలో వృద్ధి రేటు దెబ్బతింటున్నప్పటికీ భారత్ ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రాముఖ్యం ఇస్తోంది’ అని ఎస్అండ్పీ పేర్కొంది. జీడీపీలో 68.5 శాతానికి రుణభారం... భారత ప్రభుత్వ రుణ భారం ప్రస్తుతం జీడీపీతో పోలిస్తే 68.5 శాతంగా ఉంది. 2016 సెప్టెంబర్ చివరినాటికి విదేశీ రుణ భారం 484.3 బిలియన్ డాలర్లు (రూ.32.93 లక్షల కోట్లు.. జీడీపీలో 24 శాతం). దీనికి అంతర్గత రుణాలు కలిపితే 68.5 శాతంగా లెక్కతేలుతుంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) సమీక్ష కమిటీ నివేదిక ప్రకారం 2023 నాటికి జీడీపీలో రుణ భారాన్ని 60 శాతానికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని బడ్జెట్లో జైట్లీ ప్రస్తావించారు. కాగా, ఆర్థిక, విధానపరమైన సంస్కరణలు గణనీయంగా మెరుగుపడిన పక్షంలో రుణ భారం 60 శాతం దిగువకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఎస్అండ్పీ తెలిపింది. ఇది భారత్ సార్వభౌమ రేటింగ్ పెరిగేందుకు రానున్న కాలంలో సానుకూలాంశంగా నిలుస్తుందని కూడా వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికైతే అధిక రుణ భారం, బలహీన పన్ను ఆదాయాలు రేటింగ్ పెంచేందుకు కీలకమైన అడ్డంకులని స్పష్టం చేసింది. ఎస్అండ్పీ ప్రస్తుతం భారత్‌కు ‘బీబీబీ మైనస్’ రేటింగ్(స్థిర అవుట్‌లుక్‌తో) ను కొనసాగిస్తోంది. ఇది జంక్ గ్రేడ్‌కు(పెట్టుబడులకు అత్యంత కనిష్టస్థాయి గ్రేడ్) ఒక్క అంచె మాత్రమే ఎక్కువ. ఈ ఏడాది(2017)లో భారత్ రేటింగ్‌ను పెంచే ప్రసక్తే లేదని 2016 నవంబర్‌లో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. జీడీపీలో రుణ భారాన్ని 60 శాతం దిగువకు తీసుకువచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. అదేవిధంగా మధ్యకాలానికి ద్రవ్యలోటు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గేవిధంగా ప్రభుత్వ పన్ను ఆదాయాలేవీ పెరుగుతాయని భావించడం లేదని పేర్కొంది. బ్యాంకులకు రూ.10 వేల కోట్లేనా? ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు మూలధనం కిందం ఈ బడ్జెట్లో రూ.10 వేల కోట్లను మాత్రమే కేటాయించడంపై ఎస్అండ్పీ పెదవి విరిచింది. ఇది ఏమాత్రం సరిపోదని.. దీనివల్ల బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం విషయంలో(బ్యాలెన్స్ షీట్ల క్లీన్అప్) జాప్యం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా లోటును బ్యాంకులు బీమా కంపెనీలు.. ఇతర ప్రభుత్వ సంస్థలు లేదంటే క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సిందేనని ఎస్అండ్పీ సీనియర్ డైరెక్టర్(ఆర్థిక సంస్థల రేటింగ్స్ విభాగం) గీతా చుగ్ పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని మూలధన నిధులను ఇస్తామంటూ ఆర్థిక మంత్రి జైట్లీ హామీనివ్వడం కాస్త ఊరటనిచ్చే విషయమని ఆమె చెప్పారు. కాగా, కొన్ని బ్యాంకులు అత్యంత బలహీనంగా ఉన్నాయని.. టేకోవర్ లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని చుగ్ హెచ్చరించారు. బాసెల్–3 నిబంధనల ప్రకారం 2019 చివరినాటికి దేశీ బ్యాంకింగ్ రంగానికి రూ.2.5 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయనేది ఎస్అండ్పీ అంచనా. కాగా, 2015లో మోదీ సర్కారు ప్రకటించిన ‘ఇంద్రధనుష్’ కార్యాచరణ కింద నాలుగేళ్లలో పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మూలధనం ఇవ్వాలనేది ప్రణాళిక. దీనిలో భాగంగా గడిచిన తొలి రెండేళ్లలో(2015–16, 16–17) రూ.25 వేల కోట్ల చొప్పున కేంద్రం కేటాయించింది. -
ఎప్పటికో లాభమైనా... ఇప్పటికి నష్టమే!
• పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై ఎస్అండ్పీ విశ్లేషణ • అసంఘటిత, గ్రామీణ, నగదు ఆధారిత విభాగాలకు నష్టం • సావరిన్ రేటింగ్ మాత్రం తగ్గకపోవచ్చు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతోపాటు, 2017 సెప్టెంబర్ నుంచీ అమల్లోకి వస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)– తక్షణం అసంఘటిత, గ్రామీణ, అలాగే ఆభరణాలు, రియల్టీ వంటి నగదు ఆధారిత విభాగాలపై ‘తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని’’ చూపించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో విస్తృత ప్రాతిపదికన డిమాండ్ తగ్గడం.... ఈ ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో అమలయ్యే జీఎస్టీ వల్ల పన్నుల భారం పెరిగి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించవచ్చని తాజా నివేదికలో అది విశ్లేషించింది. ‘‘భారత్‌లో పెద్ద నోట్ల రద్దు– జీఎస్టీ: స్వల్పకాలిక కష్టం– దీర్ఘకాలిక లాభం’’ అన్న పేరుతో ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ విశ్లేషకుడు అభిశేక్ దాంగ్రా ఒక వ్యాసం రాశారు. దాన్లో పేర్కొన్న వివరాలను చూస్తే... ⇔ పెద్ద నోట్ల ప్రభావంతో రుణ మంజూరీలకు సంబంధించి అటు కార్పొరేట్లు, ఇటు బ్యాంకులు స్వల్పకాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఇది జీడీపీ వృద్ధితీరు తగ్గుదలకూ దారితీయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును సంస్థ 7 శాతం నుంచి ఇప్పటికే 6.9 శాతానికి తగ్గించింది. ⇔ భారత ప్రభుత్వ సంస్కరణలు దీర్ఘకాలికంగా వ్యవస్థాగత ప్రయోజనాలను అందించేవే. అయితే స్వల్పకాలికంగా నిర్వహణ, సర్దుబాట్ల ఇబ్బందులు ఉంటాయి. ⇔ 2017 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం పడిపోతుందని మేము భావిస్తున్నాం. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో తిరిగి వృద్ధి ఊపందుకునే వీలుంది. దీర్ఘకాలికంగా చూస్తే...వృద్ధి తిరిగి 8 శాతం జోన్లోకి ప్రవేశించే అవకాశమూ ఉంది. నోట్ల రద్దు సమస్య స్వల్పకాలమే: నొమురా భారత్‌లో నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అంచనా వేసింది. దీర్ఢకాలంలో భారత్ వృద్ధి తీరుకు భరోసాను ఇచ్చింది. వచ్చే 12 నెలల కాలం చూస్తే... వృద్ధి విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదని పేర్కొంది. 2016, 17లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని, 2018లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వివరించింది. -
ఆర్బీఐపై నమ్మకాన్ని ఇది దెబ్బకొట్టింది!
ముంబాయి : కేంద్రప్రభుత్వం తీసుకున్న హఠాత్తు పరిణామం పాత నోట్లను రద్దు ప్రక్రియ వల్ల సెంట్రల్ బ్యాంకు గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని నిర్లక్ష్యం చేసినట్టు వెల్లడవుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ డైరెక్టర్ కైరాన్ కర్రీ అన్నారు. ఆర్బీఐ స్వాతంత్య్రానికి నోట్ల రద్దు ప్రక్రియ ముసుగులా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సెంట్రల్ బ్యాంకు క్రెడిబుల్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. కర్రీ మీడియాతో నిర్వహించిన భేటీలో ఈ విషయాలను వెల్లడించారు. పాత నోట్ల రద్దు ప్రక్రియ భారత్‌లో విధానపర నిర్ణయాలపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందని, ఆర్బీఐపై నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ క్రెడిబుల్ సంస్థగానే ఉందని తాము అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దాని అమలులో లోటుపాట్ల వల్ల కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాపైనా పలు కామెంట్లు వస్తున్నాయి. పాత కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పటికీ, కొత్త కరెన్సీ నోట్లు ప్రజలకు సరిపడ రీతిలో అందుబాటులోకి రావడం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజులు దాటినా ప్రజలు ఇంకా బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూలైన్లోనే నిల్చువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నగదు కొరతతో ఆర్థికవ్యవస్థలో చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అయితే సరిపడ నగదు అందుబాటులో ఉందని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆర్బీఐ, ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఆర్బీఐ ముందస్తు ఎలాంటి ప్రణాళికలు చేసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్వాతంత్య్రం ఎక్కడుందని పలువురు ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
ఆర్థిక వ్యవస్థకు దెబ్బ!
• వృద్ధి దిగజారుతుంది... వినియోగం తగ్గుతుంది • జీడీపీ మందగమనం దీర్ఘకాలంలో సానుకూలం • పన్ను ఆదాయాలు పెరుగుతారుు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు • రేటింగ్ ఏజెన్సీలు... మూడీస్, ఎస్అండ్పీ విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు చర్య స్వల్ప కాలంలో ఆర్థిక రంగ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుందని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. ఫలితంగా వృద్ధి రేటు బలహీన పడుతుందని స్పష్టం చేసింది. అరుుతే, దీర్ఘకాలంలో సానుకూలమని, పన్ను వసూళ్లు పెరుగుతాయని మూడిస్తోపాటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స సంస్థలు వెల్లడించారుు. నగదు కొరత ‘‘మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో 86 శాతం కరెన్సీ వెనక్కి వెళ్లిపోతుంది. అదే సమయంలో పాత నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణలపై పరిమితుల వల్ల వ్యక్తులు, వ్యాపార సంస్థలకు కొన్ని నెలల పాటు నగదు కొరత ఏర్పడుతుంది. బయటకు వెల్లడించని నగదు రూపంలో వ్యక్తుల సంపదకు నష్టం కలుగుతుంది. తమ ఆదాయానికి మూలాలను తెలియజేయడం ఇష్టం లేని వారు నగదును బ్యాంకుల్లో డిపాజిట్లు చేయకపోవచ్చు. భారత్‌లో వినియోగం ఎక్కువగా నగదు లావాదేవీల రూపంలోనే ఉంది. నగదు లావాదేవీల నుంచి డిజిటల్ చెల్లింపులకు మళ్లడం అనేది నిదానంగా జరగాల్సి ఉంది’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకులపై రెండు రకాల ప్రభావం ‘‘నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో భాగమైన అన్ని రంగాలపై అధికంగానే ప్రభావం చూపిస్తుంది. బ్యాంకులు మాత్రం లబ్ధి పొందుతారుు. డిజిటల్ పేమెంట్లు పెరగడం వల్ల వాటికి మధ్యవర్తులుగా వ్యవహరించే బ్యాంకులకు లాభదాయకం. డిపాజిట్లు 1-2 శాతం పెరగడం వల్ల లెండింగ్ రేట్లు తగ్గుతారుు. ఇది కూడా బ్యాంకులకు సానుకూలమే. కానీ, రుణాలు తిరిగి చెల్లించడంపై స్వల్ప కాలంలో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తులపై రుణాలు, వాణిజ్య వాహనాల రుణాలు, మైక్రోఫైనాన్స రుణాలపై ఈ ప్రభావం ఉంటుంది. దీంతో స్వల్ప కాలానికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే గణనీయమైన ప్రభావమే చూపుతుంది’’ అని మూడీస్ వివరించింది. కొన్ని త్రైమాసికాలపాటు... నోట్ల రద్దు ప్రభావం జీడీపీ వృద్ధి రేటుపై కొన్ని త్రైమాసికాల పాటు ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల స్వల్ప కాలంలో జీడీపీ వృద్ధి రేటు, ఆదాయాలపైనా ప్రభావం ఉంటుంది. వినియోగం తగ్గిపోరుు, జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. మధ్య, దీర్ఘకాలానికి చూసుకుంటే... బ్యాంకుల్లో రద్దరుున నోట్ల జమల ద్వారా ఆదాయ వెల్లడి కారణంగా పన్ను ఆదాయాలు పెరుగుతారుు. ప్రభుత్వ మూలధన వ్యయ కార్యక్రమానికి, ద్రవ్య స్థిరీకరణకు ఇది తోడ్పడుతుంది’’ అని మూడీస్ తన నివేదికలో విశ్లేషించింది. వ్యాపారాలకు కష్టం నోట్ల రద్దును అమలు చేయడం కూడా ఓ సవాలు. ఇది కూడా వృద్ధి రేటుపై ప్రభావితం చూపేదే. కార్పొరేట్ల విక్రయాలు, నగదు ప్రవాహం తగ్గడం వల్ల ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటారు. వీరిలో రిటైల్ విక్రయాల్లో ఉన్న వారిపై మరింత ప్రభావం పడుతుంది. మధ్య కాలానికి నగదు లభ్యత ఎంత త్వరగా అందివస్తుందన్న దాని ఆధారంగా కార్పొరేట్లపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ చెల్లిం పులు పెంచే ఉద్దేశంతో బ్యాంకుల్లోకి వచ్చిన నగదు అంతే మొత్తం తిరిగి వ్యవస్థలోకి వెళ్లకుండా అడ్డుకుం టుంది. ఈ చర్యలతో భారత్‌లో వ్యాపార నిర్వహణ వాతావరణం మెరుగుపడుతుంది. కానీ, ఆర్థిక రంగంపై ప్రతికూలత మరికొంత కాలం పాటు కొనసాగుతుంది. బ్యాంకులకు సవాలు: ఎస్అండ్పీ నోట్ల రద్దు నిర్ణయం వల్ల భారత్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స తన నివేదికలో స్పష్టం చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడం లాభదాయకమే అరుునా అవి దీర్ఘకాలం పాటు అలాగే నిలిచి ఉండవని పేర్కొంది. ‘‘నోట్ల రద్దు స్వల్ప కాలంలో అప్పులిచ్చే సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ల ప్రొఫైల్ రుణ చరిత్ర బలహీన పడడం వల్ల బ్యాంకులు ఎదుర్కొనే సవాళ్లు పెరిగిపోతారుు. దేశీయంగా పారిశ్రామిక కార్యకలాపాల కుంగుబాటు, కమోడిటీల ధరలు తక్కువగా ఉండడం, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వంటి చర్యల ఫలితంగా కంపెనీల పరపతి నాణ్యత గత కొన్నేళ్లలో బాగా దెబ్బతిన్నది. మెటల్ రంగంలో 34.4 శాతం, మౌలిక రంగంలో 17 శాతం రుణాలు ఒత్తిడిలో ఉన్నారుు. అరుునప్పటికీ భారత్‌లోని ఆర్థిక సంస్థలు తమ రేటింగ్‌ను నిలబెట్టుకుంటారుు. ఆర్థిక సవాళ్లు పెరిగినప్పటికీ బ్యాంకింగ్ రంగం గ్రూప్ 5లోనే ఉంటుంది. మార్చి నాటికి తలసరి జీడీపీ 1,703 డాలర్లుగా ఉంటుంది. నిర్వహణ పరంగా సమర్థవంతమైన బ్యాంకులు, అధిక లాభదాయకతను కలిగి ఉన్నవి డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటారుు. నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వృద్ధి రేటు తగ్గినా, దీర్ఘకాలానికి మంచి కలిగించే చర్యే. విధానాల రూపకల్పన మెరుగుపడడం వల్ల బలమైన ఆర్థిక, ద్రవ్య పనితీరుకు తోడ్పడుతుంది’’ అని ఎస్అండ్పీ తెలిపింది. -
భారత్ రేటింగ్ పెంచం..
ఈ రెండేళ్లలో అవకాశం లేదని ఎస్ అండ్ పీ స్పష్టీకరణ • ఆర్థిక శాఖ తీవ్ర స్పందన • అంతర్మథనం చేసుకోవాలని సూచన న్యూఢిల్లీ: విధాన స్థిరత్వం, ఆర్థిక సంస్కరణల చర్యలు తీసుకుంటున్నప్పటికీ. 2017 వరకూ భారత్ సార్వభౌమ రేటింగ్‌ను పెంచేది లేదని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అరుుతే దీనిపట్ల భారత్ ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. రేటింగ్ ప్రక్రియపై ఆయాసంస్థలు ఆత్మశోధన చేసుకోవాలని పేర్కొంది. ఎస్అండ్పీ ఆలోచనా ధోరణికి- ఇన్వెస్టర్ల అభిప్రాయాలకు మధ్య సంబంధం లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎస్ అండ్ పీ ప్రకటన ముఖ్యాంశాలు... ⇔ ప్రస్తుత రేటింగ్‌నే కొనసాగిస్తాం. ⇔ ప్రభుత్వ రుణ భారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 60 శాతం దిగువకు (ప్రస్తుతం 69 శాతం) తగ్గడానికి తగిన ప్రయత్నం చేయాలి. ⇔ సమీప కాలంలో రెవెన్యూ వసూళ్లు అర్థవంతమైన రీతిలో పెరుగుతాయని భావించడం లేదు. - భారత్ విదేశీ మారకద్రవ్యం పటిష్ట పరిస్థితికి, తీసుకున్న విధాన నిర్ణయాలకు ‘స్టేబుల్ అవుట్‌లుక్’తగిన విధంగా ఉంది. ఆయా అంశాలు అన్నీ పరిశీలనలోకి తీసుకుంటే, వచ్చే ఒకటి రెండేళ్లూ క్రెడిట్ రేటింగ్ మార్పు అవకాశాలు లేవు. ⇔ సంస్కరణల ఫలాలు చివరకు కనిపించకపోరుునా లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించలేకపోరుునా రేటింగ్సపై దిగువవైపు ఒత్తిడి ఉంటుంది. ⇔ భారత్ 2016లో 7.9 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని భావిస్తున్నాం. 2016-18 మధ్య సగటున 8 శాతంగా వృద్ధి రేటు ఉంటుంది. ఇక 2016లో కరెంట్ అకౌంట్‌లోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.4 శాతంగా ఉండే వీలుంది. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5% వద్ద కట్టడి జరిగే అవకాశం ఉంది. ⇔ బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే... ప్రైవేటు రంగం లాభదాయకత బాగుంటుంది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే, అంతర్గత మూలధన కల్ప న, మొండిబకారుుల వంటి అంశాల్లో సైతం ప్రైవేటు రంగం బ్యాంకుల పనితీరు బాగుంటుంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 45 బిలియన్ డాలర్ల మూలధన అవసరం ఉంటుంది. బలహీన లాభదాయకతను ఎదుర్కొనడానికి, అంతర్జాతీయ బాసెల్ 3 మూలధన ప్రమాణాలకు చేరడానికి ఇది అవసరం. అరుుతే భారత్ నుంచి 11 బిలియన్ డాలర్ల హామీనే లభిస్తోంది. ⇔ 1,700 డాలర్ల దిగువ తలసరి ఆదాయం ఆందోళనకరం. ⇔ సబ్సిడీల తగ్గింపులో ఆలస్యం సరికాదు. దీర్ఘకాలంలో పెండింగులో ఉన్న అవరోధాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం చర్యలు హర్షణీయం. ఇందులో జీఎస్టీ, కార్మిక, ఇంధన సంస్కరణలున్నారుు. ఇక ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ తీసుకున్న చర్యలు సానుకూలమైనవి. వివిధ సంస్థల రేటింగ్స ఇవీ.. ⇔ ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్‌కు ‘స్టేబుల్’అవుట్‌లుక్‌తో ‘బీబీబీ’రేటింగ్‌ను ఇస్తోంది. 2014 సెప్టెంబర్‌లో నెగిటివ్ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌లోకి మార్చింది. పటిష్ట ఎన్నికల ఫలితం ఆర్థిక సంస్కరణకు దోహదపడే అంశమరుునందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అప్పట్లో తెలిపింది. భారత్‌కు మరో రేటింగ్ సంస్థ- ఫిచ్ ‘స్టేబుల్ అవుట్‌లుక్’తో ‘బీబీబీ-మైనస్’రేటింగ్‌ను ఇస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ‘పాజిటివ్’అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’రేటింగ్ ఇస్తోంది. ఇవన్నీ దిగువస్థారుు పెట్టుబడుల గ్రేడ్లు కావడం గమనార్హం. మరో మాటలో చెప్పాలంటే ‘జంక్’స్టేటస్‌కు ఒక మెట్టు ఎక్కువ. మూడీస్ సెప్టెంబర్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్ సంస్కరణలు, పెట్టుబడులు బలహీనంగా ఉన్నాయని, మొండిబకారుులు పెద్ద సవాలని పేర్కొంది.. సంస్కరణల బాటలో తగిన ఫలితాలు కనిపిస్తే ఒకటి రెండేళ్లలో రేటింగ్‌ను పెంచుతామని తెలిపింది. ⇔ సంస్కరణల జోరు.. అయినా అప్‌గ్రేడ్ చేయలేదు: దాస్ ⇔ ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థలో చేపట్టని సంస్కరణలను భారత్ తీసుకుంది. అరుునా అప్‌గ్రేడ్ చేయలేదు. ఇది రేటింగ్ ఏజెన్సీలు ఆత్మశోధన చేసుకోవాల్సిన అంశం. పెట్టుబడిదారులు - రేటింగ్ ఏజెన్సీల మధ్య అభిప్రాయాల్లో వ్యత్యాసం ఉంది. భారత్ మాత్రం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, జీడీపీ వృద్ధి రేటు పెంపునకు, ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు కృషిని కొనసాగిస్తుంది. సంస్కరణల చర్యలతో ముందుకు వెళుతోంది. రేటింగ్‌ను పెంచకపోతే మేము పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదు. పెట్టుబడులకు తగిన దేశంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యోల్బణం కట్టడి, వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ దిశలో కీలక అడుగులుసహా పలు చర్యలను గడచిన రెండేళ్లలో కేంద్రం తీసుకుంది. వీటికి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల గుర్తింపూ లభించింది. ఇంకా రేటింగ్‌ను పెంచలేదంటే రేటింగ్ సంస్థల అంతర్మధనం తప్పదు. ఇక మొండిబకారుుల సమస్యల పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసు కుంటోంది. దీనిపై తగిన స్థారుులో దృష్టిని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం-ఆర్బీఐ సంయుక్త కృషిని కొనసాగిస్తున్నారుు. భారత్ సుస్థిర ఆర్థిక వృద్ధికి సైతం ఆర్బీఐ తన వంతు చర్యలను తీసుకుంటోంది. -
ఈ ఏడాదీ మొండిబకాయిల సెగ!
♦ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ అంచనా ♦ బ్యాంకింగ్ లాభదాయకత తగ్గుతుందని విశ్లేషణ న్యూఢిల్లీ: రుణ నాణ్యత, మొండిబకాయిల సమస్య, మూలధన అవసరాలు వంటివి రానున్న 12 నెలలూ బ్యాంకింగ్‌పై వత్తిడిని కొనసాగిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ క్రెడిట్ విశ్లేషకులు అమిత్ పాండే విశ్లేషించారు. ప్రధానంగా పారిశ్రామిక రంగం మందగమనం, కార్పొరేట్ల అధిక రుణ భారం వంటి అంశాలు ప్రత్యేకించి రుణ నాణ్యత అంశంలో సవాళ్లను విసురుతాయని ఆయన అన్నారు. బ్యాంకింగ్‌పై విడుదలైన ఒక ఎస్అండ్పీ నివేదిక సైతం ఇదే అంశాలను ప్రస్తావించింది. విశ్లేషణలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ రానున్న రెండు, మూడు త్రైమాసికాల్లోనూ భారత్ బ్యాంకింగ్ లాభదాయకత తగ్గుతుంది. కనీస రుణ రేటు తగ్గడం ఇందుకు ఒక కారణం. ♦ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ది రేటు 11 నుంచి 13 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న తరహాలోనే కార్పొరేట్ రుణాలతో పోల్చితే రిటైల్ రుణ వృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ♦ బ్యాంకింగ్ రుణ వ్యయాలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చు. ప్రస్తుత స్థూల మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ కేటాయిం పులు, బలహీన కార్పొరేట్ పనితీరు, ఎన్పీఏలు మరింతగా పెరిగే అవకాశాల వంటివి దీనికి ప్రధాన కారణం. ♦ అంతర్జాతీయ బాసెల్-3 ప్రమాణాలకు అనుగుణంగా తాజా మూలధన కల్పన మద్దతు బ్యాంకింగ్‌కు కీలకం కానుంది. ♦ మొండిబకాయిల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా... ప్రైవేటు రంగ బ్యాంకింగ్ పరిస్థితి బాగుంది. ఇదే పరిస్థితి రానున్న 12 నెలల్లోనూ కొనసాగుతుంది. రేటు కోత పావు శాతం: బీఓఎఫ్ఏ ఏప్రిల్ 5 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పావు శాతం తగ్గే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంల్) పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు అర శాతం తగ్గే వీలుందని అంచనావేసింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఆర్బీఐకి రేటు కోత నిర్ణయం తీలసుకుంటుందన్నది తమ అభిప్రాయమని ఆర్థిక సేవల దిగ్గజం ఒక ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం-వ్యయాలకు మధ్య వ్యత్యాసం) లక్ష్యాలకు కట్టుబడి ఉంటామన్న ప్రభుత్వ హామీ, ద్రవ్యోల్బణం అదుపులో ఉం డడం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.75%) తగ్గింపునకు కలసి వస్తున్న అంశంగా పేర్కొంది. కాగా చిన్న పొదుపు మొత్తాలపై రేటు కోత బ్యాంకింగ్ రేటు ప్రయోజనం బదలాయింపునకు దోహదపడుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషించింది. -
భారత్‌కు ద్రవ్యలోటు సవాళ్లు: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు విషయంలో భారత్ సవాళ్లను ఎదుర్కోనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- స్టాండెర్ట్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) పేర్కొంది. ఆదాయాలు బడ్జెట్ లక్ష్యాల మేరకు వసూలు కాకపోవడం, సబ్సిడీ కోతల్లో ఆలస్యం వంటి అంశాలు ద్రవ్యలోటుకు సవాళ్లు విసిరే అంశాలని వివరించింది. ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ, ఇది అంత సులభం కాదన్నది తమ అభిప్రాయమని ఎస్అండ్పీ రేటింగ్స్ సర్వీసెస్ భారత్ వ్యవహారాల విశ్లేషకుడు కైరన్ క్యూరీ పేర్కొన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువుల విషయంలో సబ్సిడీలకు సంబంధించిన అంశాలు ద్రవ్యలోటు లక్ష్యానికి సవాళ్లని ఆయన విశ్లేషించారు. అయితే రెవెన్యూ వైపు కొంత మెరుగుదల వల్ల స్వల్పకాలంలో మాత్రం ద్రవ్య క్రమశిక్షణ మెరుగ్గా ఉండే వీలుందన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు, పన్ను పరిధి పెంపునకు ప్రభుత్వ ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలను ఇచ్చే వీలుందని వివరించారు. -
పన్ను సమస్యలను పరిష్కరిస్తాం
విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక శాఖ హమీ * దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పన్ను సంబంధిత ఆందోళనలన్నింటినీ వీలైనంతం వేగంగా పరిష్కరిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అయితే, దేశంలో శాశ్వత కార్యకలాపాలను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరుతున్నట్లు కూడా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దిగ్గజ ఎఫ్‌పీఐలతో భేటీ అయ్యారు. సిటీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్, ఫిడిలిటీ, గోల్డ్‌మన్ శాక్స్, బ్లాక్‌రాక్ సహా రెండు డజన్లకుపైగా అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఈ భేటీలో ఎఫ్‌పీఐలు అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పన్ను సంబంధ సమస్యలు సహజంగా ఉత్పన్నమైనవే. దేశంలో ఫండ్ మేనేజ్మెంట్ పరిశ్రమ స్థితిగతులపై కూడా మేం చర్చించాం’ అని ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ, సెబీ, సీబీడీటీలకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్‌తో ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం(డీటీఏఏ) ఉన్న దేశాల నుంచి తమ నిధులను ఇక్కడికి తరలిస్తున్నారని.. దీనివల్ల వారికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నట్లు దాస్ చెప్పారు. అయితే, ఆయా సంస్థలు భారత్‌లోనే తమ కార్యకాలాపాలను నెలకొల్పినట్లయితే ఇక్కడి చట్టాల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ బాండ్లపై 5 శాతం విత్‌హోల్డింగ్ పన్ను అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు నోమురా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎండీ నీరజ్ గంభీర్ చెప్పారు. 2017తో ఈ 5 శాతం పన్ను విధింపునకు గడువు ముగియనుంది. ఈ ఏడాది వృద్ధి 7.5 శాతం పైనే... * ఎస్అండ్పీ అంచనాలతో విబేధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వెలిబుచ్చిన అనుమానాలను శక్తికాంత దాస్ తోసిపుచ్చారు. అది కేవలం ఆ సంస్థ అభిప్రాయం మాత్రమేనని.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంపైనే ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధి జోరందుకోవాడానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణ చర్యలను చేపట్టనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు. భారత్ ఆర్థిక మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయన్నారు. కాగా, భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఇప్పుడున్న బీబీబీ(మైనస్) స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా రేటింగ్ పెంచే అవకాశాల్లేవని స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యల్ప స్థాయి రేటింగ్. కాగా, విధాన, సంస్కరణల పరంగా తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని... రేటింగ్ అప్‌గ్రేడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా కోరుతున్న సంగతి తెలిసిందే. -
పెట్టుబడులకు ఇబ్బందులు: ఎస్అండ్పీ
ముంబై: భారత్‌లో పెట్టుబడుల వృద్ధికి కొన్ని ఇబ్బందులు పొంచి ఉన్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అధ్యయనం ఒకటి తెలిపింది. విధాన సంస్కరణల అమల్లో అడ్డంకులు, అధికారుల అలసత్వం భారత్‌లో పెట్టుబడులకు ప్రధాన అడ్డంకులని పేర్కొంది. దేశంలో కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి మందగమనంలో ఉందని, రుణ భారం కొనసాగుతోందని.. ఇవన్నీ పెట్టుబడులకు, భారీ వృద్ధికి విఘాతం కలిగిస్తున్న అంశాలని వివరించింది. భారత్‌సహా చైనా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలపై సైతం ఎస్అండ్పీ అధ్యయనం జరిపింది. ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌తో ‘బీబీబీమైనస్’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. పెట్టుబడులకు ఏమాత్రం సరికాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎగువ. ధరలు పెరిగే అవకాశం: నోముర ఇదిలాఉండగా, భారత్‌కు ఈ ఏడాది ఎల్ నినో ఇబ్బందులు పొంచి ఉన్నాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ- నోముర తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల దేశంలో ధరల తీవ్రత పెరగవచ్చని హెచ్చరించింది. -
చిన్న షాక్ తగిలినా భారత ఎకానమీకి ముప్పే
ఎస్అండ్పీ హెచ్చరిక న్యూఢిల్లీ: ఆర్థిక అంశాలపరమైన బలహీనతల నుంచి భారత సార్వభౌమ రేటింగ్‌కు ముప్పు కొనసాగుతోందని రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తెలిపింది. ఆర్థికపరమైన, కమోడిటీలపరమైన ఏ చిన్న షాక్ తగి లినా.. ఎకానమీని మెరుగుపర్చేందుకు ఇప్పటిదాకా చేసిన కృషి అంతా వృథాగా పోతుందని హెచ్చరించింది. ద్రవ్యపరంగా మరిన్ని సంస్కరణలు తీసుకోకపోతే నిలకడగా ప్రభుత్వ పెట్టుబడులను పెంచుకుంటూ పోవడం కేంద్రానికి కష్టంగా మారుతుందని ఎస్అండ్పీ తెలిపింది. భారత్‌లో ఇన్ఫ్రా ప్రగతికి ద్రవ్యపరమైన అవరోధాల పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వివరించింది. బడ్జెట్ లోటును కట్టడి చేసే దిశగా వ్యయాల్లో కోత పెట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం మంచి పరిణామమని ఎస్అండ్పీ క్రెడిట్ అనలిస్టు కిమ్ ఎంగ్ టాన్ పేర్కొన్నారు. అయితే, భారీ సబ్సిడీ వ్యయాలు భారంగా మారే అవకాశముందన్నారు. డిజిన్వెస్ట్మెం ట్ లక్ష్యాలను గానీ చేరుకోలేకపోతే ప్రభుత్వం పెట్టుబడుల్లో మరింత కోత విధించుకోవాల్సి రావొచ్చని టాన్ చెప్పారు. ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ రేటింగ్ ఇచ్చింది. పెట్టుబడులకు ఏమాత్రం అనువుగాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎక్కువ. -
‘మొండిబకాయిల’ పరిష్కారానికి కొంత సమయం: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, రుణ వృద్ధికి మరికొంత సమయం పడుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఆర్థికాభివృద్ధి అంశాలు బాగున్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్య పరిష్కారానికి మరి కొంత సమయం’ అన్న ప్రధాన అంశంపై ఈ నివేదిక రూపొందింది. సంస్థ క్రెడిట్ ఎనలిస్ట్ అమిత్ ఈ అంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు... - మైనింగ్, మౌలిక రంగంలో ఇబ్బందులు మొండి బకాయిలు, రుణ వృద్ధి మందగమన సమస్యలకు కారణాలు. ఈ సమస్యల పరిష్కారంతో బ్యాంకుల ‘రుణ’ నాణ్యతా మెరుగుపడుతుంది. - కీలక రంగాల పురోగతితో కంపెనీల అదాయాలు పెరుగుతాయి. ఇది మొండి బకాయిల సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది. - అయితే మొండిబకాయిల సమస్య దీర్ఘకాలం కొనసాగడం మంచిదికాదు. దీనివల్ల ఆర్థిక రంగంలో ఇబ్బందులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. - అభివృద్ధి, సమర్థవంతమైన పాలన తత్సబంధ అంశాలపై మోడీ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఈ హామీలను నెరవేర్చడం వృద్ధి బాటలో కీలకం. -
భారత్ వెలిగిపోతోంది..!
ఆసియా-పసిఫిక్ దేశాల్లోకెల్లా అత్యుత్తమ ఆర్థిక ప్రగతి... ⇒ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ వెల్లడి... ⇒ 2015-16 జీడీపీ వృద్ధి అంచనాలు భారీగా పెంపు ⇒ 7.9 శాతానికి ఎగబాకే అవకాశం... ⇒ బడ్జెట్ ముందు మోదీ సర్కారుకు బూస్ట్ ముంబై: మరో రెండు రోజుల్లో తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మోదీ సర్కారుకు ఊహించని బూస్ట్ లభించింది. ఆసియా-పసిఫిక్ దేశాన్నింటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ వెలుగు రేఖలా కనిపిస్తోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) గురువారం పేర్కొంది. అంతేకాదు రానున్న ఆర్థిక సంవత్సరం(2015-16)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాలను భారీగా పెంచింది. 7.9 శాతం వృద్ధి సాధించవచ్చని తాజాగా లెక్కగట్టింది. అంతక్రితం ఈ అంచనా 6.2 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2016-17లో వృద్ధి అంచనాను కూడా ఏకంగా 6.6 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. జీడీపీ గణాంకాలకు బేస్ రేటును కేంద్రం ప్రభుత్వం ఇటీవలే 2004-05 నుంచి 2011-12కు మార్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 2013-14 వృద్ధి రేటును 5 శాతం నుంచి 6.9 శాతానికి సవరించారు. ఈ ఏడాది(2014-15) వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతానికి(గతంలో 6%) పెంచారు కూడా. అయితే, తాజా వృద్ధి అంచనాల పెంపులో ఈ కొత్త బేస్ రేటును పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది ఎస్అండ్పీ విడుదల చేసిన నోట్లో స్పష్టం చేయలేదు. క్రూడ్ వరం... అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నేలకు దిగిరావడం... దేశీయంగా పెట్టుబడులు పెరుగుతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశాలను పెంచుతున్నాయని ఎస్అండ్పీ అభిప్రాయపడింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి రేటు కాస్త తగ్గనున్నప్పటికీ.. భారత్ ఎకానమీ మాత్రం వెలుగులు విరజిమ్ముతోందని తెలిపింది. అయితే, చైనా, జపాన్లలో మందగమనం కారణంగా మొత్తం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గతేడాది జూన్‌లో 100 డాలర్లకు పైగా ఉన్న క్రూడ్ బ్యారెల్ ధర.. ప్రస్తుతం 50 డాలర్ల స్థాయిలో కదలాడుతున్న విషయం విదితమే. దీనివల్ల అత్యధికంగా క్రూడ్ దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు దిగుమతుల బిల్లు భారీగా తగ్గడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మరింత అదుపులో ఉండేందుకు దోహదం చేస్తోంది. మరోపక్క, ప్రభుత్వానికి ఇంధన సబ్సిడీల భారం కూడా భారీగా తగ్గేందుకు వీలుకల్పిస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(శనివారం) ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి లక్ష్యం... అదేవిధంగా ద్రవ్యలోటు కట్టడి(గతేడాది జీడీపీలో 4.1 శాతంగా నిర్ధేశించారు)కి తీసుకోబోయే చర్యలను కూడా వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్అండ్పీ తాజా అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. మూడు రోజుల్లోనే ఎంత మార్పు... భారత్‌లో అధిక ద్రవ్యలోటు, తక్కువ తలసరి ఆదాయాలపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేయడంతోపాటు ఇలాగైతే రేటింగ్ పెంపు కష్టమేనంటూ చెప్పిన కొద్ది రోజులు కూడా కాకుండానే ఎస్అండ్పీ వృద్ధి రేటు అంచనాలను అనూహ్యంగా పెంచేయడం విశేషం. గతేడాది మోదీ నేతృత్వంలో ఏర్పాటైన సుస్థిర ప్రభుత్వం సంస్కరణలకు సానుకూల పరిస్థితులను సృష్టించాయని, అయినప్పటికీ.. పాలనా సామర్థ్యం ఒక్కటే పరపతి రేటింగ్ పెంపునకు సరిపోదని కూడా ఈ నెల 23న ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌కు బీబీబీ మైనస్(స్థిరమైన అవుట్‌లుక్‌తో) సార్వభౌమ పరపతి రేటింగ్‌ను ఎస్అండ్పీ కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో ఇదే అత్యంత తక్కువ స్థాయి రేటింగ్. దీనికంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు పూర్తిగా ప్రతికూలం) గ్రేడ్‌కు దిగజారినట్లే. మరో అగ్రగామి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా ద్రవ్యలోటు కట్టడి, సంస్కరణల పురోగతిపైనే భవిష్యత్తులో రేటింగ్ మెరుగుదల అవకాశాలు ఆధారపడి ఉంటాయని తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే. -
భారత్ పరిస్థితి భేష్: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తోందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) పేర్కొంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో దేశంలో సంస్కరణల ప్రక్రియ జోరందుకుందని పేర్కొంది. డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, బీమా రంగంలో సంస్కరణలకు ప్రయత్నం, ప్రభుత్వ వ్యయాలు తగ్గింపునకు కృషి ద్వారా ద్రవ్యలోటు కట్టడి చర్యలు వంటి అంశాలను ఈ సందర్భంగా ఎస్అండ్పీ ప్రస్తావించింది. 7% జీడీపీ వృద్ధి దిశగా విశ్వాసం గణనీయంగా మెరుగుపడినట్లు విశ్లేషించింది. ఇదే ప్రాంతంలోని కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు 2014 చివరినాటికి ఊహించినదానికన్నా పేలవ పనితీరును నమోదు చేసుకుంటున్నాయని పేర్కొంది. చైనా వృద్ధి మందగించిందని, జపాన్ మాంద్యంలోకి జారిపోయిందని పేర్కొంది. అమెరికా పటిష్ట రికవరీ ఎగుమతుల రంగానికి సానుకూల అంశమని పేర్కొంది.