న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్ రికార్డు) కలిగి ఉందని రేటింగ్ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతం వృద్ధి అంచనాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ’స్లోయింగ్ డ్రాగన్స్, రోరింగ్ టైగర్స్’ అనే శీర్షికతో వెలువరించిన ఆసియా–పసిఫిక్ క్రెడిట్ అవుట్‌లుక్, 2024లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► సేవల రంగం పురోగతి, పెట్టుబడులకు సంబంధించిన మూలధనం క్రమంగా పురోగమించడం, వృద్ధికి దోహదపడే విధంగా యువత అధికంగా ఉండడం, ఉత్పాదకత మెరుగు వృద్ధికి ప్రధాన కారణాలు.
► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 6.9 శాతంగా ఉంటుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం రుణ భారాలను పెంచే అంశం. అయితే వృద్ధి బాట పటిష్టంగా ఉండడం మార్కెట్ విశ్వాసానికి, రెవెన్యూ సృష్టికి దోహదపడుతుంది.
► శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాలకు సంబంధించి నియంత్రణలు, సవాళ్లు తొలగడం తదుపరి దశ వృద్ధికి దోహదపడే అంశాలు.
► ఆర్థిక వ్యవస్థలో సేవల ప్రభావం కాలక్రమేణా పెరిగింది. వ్యవసాయం, ఇతర ప్రాథమిక పరిశ్రమలు వెయిటేజ్‌లు ఎకానమీలో తగ్గాయి. సేవల రంగం మరింత పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment