Indian economy
-
దక్షిణాది మేల్కొనాలి!
భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు... విద్య, ఆరోగ్య రంగాల్లో గొప్ప పురోగతి సాధించాయి. పరిశ్రమలు, ఐటీ, ఎగుమతుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్న ప్పటికీ, రాను రానూ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ రాష్ట్రాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 35–40% వాటా కలిగి ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు ఐటీ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. దేశ ఐటీ ఎగుమతుల్లో 60% దక్షిణాదిదే. అంతేకాక, దేశ ఎగుమతుల్లో దక్షిణాది వాటా 45 శాతానికి పైగా ఉంది. చెన్నై, విశాఖపట్నం, తూత్తుకుడి, మంగళూరు వంటి పోర్టులు అంతర్జాతీయ వాణి జ్యానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. తమిళ నాడు ఆటోమొబైల్ రంగంలో దేశానికి హబ్‌గా మారింది. కర్ణాటక ఏరోస్పేస్–డిఫెన్స్ మాన్యు ఫ్యాక్చరింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫార్మా – బయోటెక్ పరిశ్రమల్లో దేశంలోనే ముందంజలో ఉన్నాయి.తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అత్యుత్తమ వైద్య సేవలను అంది స్తున్నాయి. కేరళ సాక్షరతా రేటు 96%, తమిళనాడు 82%, తెలంగాణ 72% కాగా, దేశ సగటు దీని కంటే తక్కువ. వ్యవసాయం, సహజ వనరుల పరంగా కూడా దక్షిణాది ముందుంది. కాఫీ, కూర గాయలు, పత్తి, మిర్చి, మామిడి ఉత్పత్తిలో ఈ ప్రాంతం దేశానికి ప్రధాన ఆదాయం అందిస్తోంది.అయితే, ఈ స్థాయిలో అభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి భారీగా పన్నులు చెల్లిస్తూనే తక్కువ నిధులు పొందు తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం అధిక నిధులు కేటాయించడంతో, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ మొత్తమే అందుతోంది. జనాభా ప్రాతి పదికన నిధుల పంపిణీ విధానాన్ని అనుసరించడం వల్ల ఈ అన్యాయం జరుగుతోంది. దీనికితోడు, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పునర్విభజన ప్రకారం, జనాభా ప్రాతి పదికన ఉత్తరాది రాష్ట్రాలకు అధిక సీట్లు రావచ్చు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవచ్చు. ఇది కేంద్ర రాజకీయ వ్యవస్థను ఉత్తరాదికి దృష్టి మళ్లించే ప్రమాదాన్ని పెంచుతోంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందుండటంతో, నియో జకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వాటి స్థానాలు తగ్గిపోతూ, భౌగోళికంగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడుతోంది.ఇది మాత్రమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా అమలుకావడం లేదు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేరళకు ఎయిమ్స్ ఆసుపత్రికి కేంద్రం అనుమతిని ఇంకా మంజూరు చేయలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసు కోలేదు. కర్ణాటక, తమిళనాడులో కొత్త హైవే ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ, వాటి అమలుకు కేంద్రం నుంచి ఆలస్యం అవుతోంది.దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచి, ఆర్థిక నిధుల పంపిణీలో సమానత్వాన్ని కోరాలని రాష్ట్రాలు డిమాండ్ చేయాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను పునః సమీక్షించాలని డిమాండ్ చేయాలి. ఫెడరల్ ప్రెజర్ గ్రూప్ ఏర్పాటుచేసి, దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం సమన్వయ ప్రయత్నాలు చేపట్టాలి.– శ్రీనివాస్ గౌడ్ ముద్దంఫైనాన్స్ రంగంలో నిపుణులు -
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు. ఇక త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వెల్లడించనుంది.ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని.. ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 4 నుంచి కీలక చర్చలను నిర్వహించనుంది. మల్హోత్రా కీలక రేట్లలోని మార్పును ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది. ఆ రోజు BPS రేటు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది.శక్తికాంత దాస్ పదవీ విరమణ తరువాత.. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి ఎంపీసీ (Monetary Policy Committee) అవుతుంది. రేటు తగ్గింపు గురించి చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పెంచడానికి క్లిష్టమైన చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ చర్చలు ఫిబ్రవరి 4 నుంచి 7 మధ్య జరగనున్నాయి. రెపో రేటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఫిబ్రవరి 7 ఉదయం 10:00 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. గవర్నర్ మల్హోత్రా మధ్యాహ్నం 12:00 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత భారత ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్ 2025పై తన ఆలోచనల వెనుక గల కారణాల గురించి మాట్లాడతారు. -
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) తన ఎనిమిదవ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. బడ్జెట్ తయారీ చివరి దశకు గుర్తుగా 'హల్వా వేడుక' కూడా ముగిసింది. కాగా త్వరలో సమర్పించనున్న బడ్జెట్‌ను రూపొందించే వ్యక్తులు ఎవరనేది, ఈ కథనంలో చూసేద్దాం.తుహిన్ కాంత పాండే (ఆర్థిక & రెవెన్యూ కార్యదర్శి)తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆర్ధిక, రెవెన్యూ విభాగాల్లో ఈయనకు గొప్ప అనుభవం ఉంది. పన్ను రాయితీలను బ్యాలెన్స్ చేస్తూ.. ఆదాయాలను తగ్గకుండా చూసుకోవాల్సిన పని ఈయనదే. బడ్జెట్ ప్రారంభం కావడానికి ముందు.. పాండే ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా రాబోయే సెషన్లో ఆదాయపన్ను చట్టాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.వీ అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు)అనంత నాగేశ్వరన్ ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ఈయన ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యునిగా పనిచేశారు. అతను, అతని బృందం రచించిన ఆర్థిక సర్వే అభివృద్ధిని ప్రోత్సహించడం, సంస్కరణ ఫలితాలను అంచనా వేయడం వంటివి చేస్తుంది.మనోజ్ గోవిల్ (డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శి)మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శిగా చేరడానికి ముందు.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. రాయితీల హేతుబద్ధీకరణ మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చు నాణ్యతను మెరుగుపరచడం వంటివి గోవిల్ బృందం విధి.అజయ్ సేథ్ (ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి)అజయ్ సేథ్.. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన తుది బడ్జెట్ పత్రాలను సిద్ధం చేయడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఆర్ధిక వనరులను నిర్వహించడం, వ్యయాల నియంత్రణ అంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి.ఇదీ చదవండి: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్సీక్ఎం నాగరాజు (డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)నాగరాజు 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు.. ప్రైవేట్ వాణిజ్య మైనింగ్ రంగంలో ఉన్నారు. ఆ సమయంలోనే సుమారు 113 కంటే ఎక్కువ బొగ్గు గనులను వేలం వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన బృందం డిపాజిట్ల మొబలైజేషన్, ఫిన్‌టెక్‌ల నియంత్రణ, బీమా కవరేజిలను పెంచడం వంటివి చూస్తుంది.అరుణిష్ చావ్లా (డీఐపీఏఎం & డీపీఈ సెక్రటరీ)అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి. అయితే ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడు. చావ్లా ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆస్తుల నిర్వహణ, డిజ్ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా.. ఐడీబీఐ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ప్రణాళికలు తయారు చేశారు. -
పనిగంటల్లో మహిళను మరిచారా?
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్‌గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్‌లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 6.6 శాతం
భారత ఆర్థిక వ్యవస్థపై (Indian economy) ఐక్యరాజ్యసమితి ఆశావహ దృక్పథాన్ని ప్రకటించింది. 2025లో భారత్ జీడీపీ (GDP) 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది.మౌలికరంగ వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయాల ప్రభావం రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2025’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను (UN report) విడుదల చేసింది. భారత్ జీడీపీ 2024లో 6.8 శాతం వృద్ధి చెందగా, 2025లో 6.6 శాతం, 2026లో 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో అంచనాలు వెల్లడించింది.సేవలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రకాల వస్తు ఎగుమతుల్లో బలమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని తెలిపింది. 2024లో వర్షాలు ఆశాజనకంగా ఉండడం 2025లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని పేర్కొంది. భారత్‌లో భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, ఫిజికల్, డిజిటల్ అనుసంధానత, సోషల్ ఇన్ఫ్రాపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు 2025లోనూ బలంగా కొనసాగుతాయని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం దిగొస్తుంది.. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో 4.8 శాతం ఉండగా, 2025లో 4.3 శాతానికి దిగొస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. మధ్యకాలానికి ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి అయిన 2–6 శాతం మధ్యే ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ఉపాధి మార్కెట్ 2024 వ్యాప్తంగా బలంగా ఉన్నట్టు, కార్మికుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలిపింది.పట్టణ ప్రాంత నిరుద్యోగం 2023లో 6.7 శాతంగా ఉంటే, 2024లో 6.6 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడినట్టు తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.8 శాతం, 2026లో 2.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2023, 2024లో 2.8 శాతంగా ఉండడం గమనార్హం. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
6.8 శాతం వరకూ భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్– 2025 మార్చి) 6.5 నుంచి 6.8 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల దిగ్గజం– డెలాయిట్ అంచనావేసింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7–7.3 శాతం శ్రేణిలో నమోదవుతుందని అంచనావేసింది. దేశీయ వినియోగం, డిమాండ్ ఎకానమీ పురోగతికి దోహదపడే ప్రధాన అంశాలని వివరించింది. ఈ నెల ప్రారంభంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం నుండి 6.6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో తాజా డెలాయిట్ నివేదిక వెలువడింది. ఎకానమీ పటిష్టమే.. 2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. (క్యూ1, క్యూ2ల్లో వరుసగా 6.7 శాతం, 5.4 శాతం వృద్ధి) ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్– ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై నిరంతరం దృష్టి సారించడం వంటి ప్రభుత్వ చొరవలు వృద్ధిని మరింత పెంచే అంశాలుగా ఉంటాయని మజుందార్ చెప్పారు. తాయా ఆయా అంశాలపై పూర్తి ఆశావాదంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → తయారీకి సంబంధించి ఎల్రక్టానిక్స్, సెమీ కండక్టర్లు, రసాయనాల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ సరఫరాల చైన్‌లో భారత్ స్థానాన్ని పటిష్టపరిచే పరిణామిది. → గత రెండున్నర నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వెనక్కివెళ్లినప్పటికీ, రిటైల్ దేశీయ సంస్థల పెట్టుబడుల వల్ల మూలధన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. → 2025 అంతటా డిమాండ్ బాగుంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ డిమాండ్ రెండూ కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యవసాయ ఆదాయాలు, సబ్సిడీల వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహాలు, డిజిటైజేషన్ అభివృద్ధి, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. → భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి వృద్ధిని కొనసాగించాల్సి ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, వాణిజ్య వివాదాలు, సరఫరా వయవస్థల్లో అంతరాయం, వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చసే అవకాశం ఉంది. → భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితుల నుండి దూరంగా ఎలా ఉంచాలన్న అంశంపై దృష్టి సారించాలి. అధిక సంఖ్యలో ఉన్న యువ శక్తి వినియోగం, నైపుణ్యల మెరుగు, మౌలిక సదుపాయాలను బలపరచడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయి. → సవాళ్లను అధిగమిస్తూ, స్వయం సమృద్ధి కలిగిన తయారీ రంగం పటిష్టతపై దృష్టి సారించాలి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ సెగ్మెంట్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. → భవిష్యత్ పురోగతికి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, విధాన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్న రాబోయే బడ్జెట్‌పై (2025–26) ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్‌ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్‌కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్‌పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్‌పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం మన్మోహన్సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది. నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్‌కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం.. నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు. ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది. గొప్ప మానవతావాదం చూపారు ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు. -
ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్ సింగ్. ఆర్థికశాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేసినా, ఆర్బీఐ గవర్నర్(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.ప్రధాన ఆర్థిక సలహాదారుగా..1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.ఆర్బీఐ గవర్నర్‌గా..1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?ఆర్థిక మంత్రిగా..1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం. -
విదేశీ మారకద్రవ్య నిల్వలు: భారత్‌లో ఇంత తగ్గాయా?
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్ల వద్ద నిలిచాయి.విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే.. ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఫారెక్స్ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల కారణంగా సంభవిస్తాయి.రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో సహాయపడటానికి ఆర్బీఐ చేసిన ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు పెరిగాయి.మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ.. బంగారం నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. -
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అధీకృత ఆర్థిక ఆపరేటర్ల (ఏఈవోలు) భాగస్వామ్య విస్తరణ, సమగ్ర స్వేచ్ఛా ఆర్థిక కేంద్రాలు, వినూత్నమైన విధానాలను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ అనుసంధానతతో నూతన బెంచ్‌మార్క్‌లను (ప్రమాణాలు) ఏర్పాటు చేయాలనే భారత్ లక్ష్యం’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఈవోల సదస్సులో భాగంగా మల్హోత్రా తెలిపారు. టెక్నాలజీ, విశ్వాసం రెవెన్యూ విభాగానికి రెండు స్తంభాలుగా పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్వహణలో భారత్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పీళ్లు, రిఫండ్లు, చెల్లింపులు తదితర సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!‘బిలియన్ల కొద్దీ బిల్లులను ఏటా జారీ చేస్తుంటాం. టెక్నాలజీ సాయం లేకుండా ఈ స్థాయిలో నిర్వహణ సాధ్యం కాదు. భారత్ అన్ని పోర్టులను ఆటోమేట్ చేయాలనుకుంటోంది. 20 ప్రధాన పోర్టుల్లో 17 పోర్టులు ఇప్పటికే ఆటోమేట్‌గా మారాయి. పోర్టుల్లో అన్ని సేవలను, అన్ని సమయాల్లో ఆన్లైన్, ఎలక్ట్రానిక్ రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
జీడీపీ.. జోరుకు బ్రేక్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో వృద్ధి మందగమనం నెలకొంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతానికి (2023 ఇదే కాలంలో పోల్చి) పరిమితమైంది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఇంతక్రితం 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం) భారత్ ఎకానమీ 4.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సమీక్షా కాలంలో తయారీ, వినియోగం, మైనింగ్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించినట్లు శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా వెల్లడించింది. 5.4 శాతం వృద్ధి రేటు ఎలా అంటే.. 2023–24 రెండవ త్రైమాసికంలో (2011–12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా) ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ, స్థిర ధరల వల్ల వాస్తవ జీడీపీ విలువ రూ.41.86 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలం (2024 జూలై–సెపె్టంబర్) ఈ విలువ రూ.44.10 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదయ్యింది. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని ప్రస్తుత ధరల వద్ద ఇదే కాలంలో జీడీపీ విలువ రూ.70.90 లక్షల కోట్ల నుంచి రూ.76.60 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రాతిపదికన వృద్ధి రేటు 8 శాతం. ఆరు నెలల్లో వృద్ధి 6 శాతం ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ద్రవ్యోల్బణం సర్దుబాటుతో స్థిర ధరల వద్ద గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ విలువ 82.77 లక్షల కోట్లుగా ఉంటే, తాజాగా 87.74 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 6%గా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే, విలువ రూ.141.40 లక్షల కోట్ల నుంచి రూ.153.91 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి వృద్ధి రేటు 8.9%.కీలక రంగాలు ఇలా... → తయారీ రంగంలో వృద్ధి రేటు 14.3 శాతం (2023 క్యూ2) నుంచి 2.2 శాతానికి పడిపోయింది. → వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 3.5 శాతానికి ఎగసింది. → మైనింగ్ అండ్ క్వారీయింగ్ విభాగంలో 11.1 శాతం వృద్ధి రేటు 0.01 శాతానికి క్షీణబాట పట్టింది. → ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సరీ్వసుల విభాగంలో వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది. → ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధి రేటు 10.5 శాతం నుంచి 3.3 శాతానికి మందగించింది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. → ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి రేటు తాజా సమీక్షా కాలంలో 6 శాతంగా నమోదయ్యింది. క్యూ1 (ఏప్రిల్–జూన్) ఈ విభాగం వృద్ధి రేటు 7.4%గా ఉంది.అక్టోబర్‌లో ‘మౌలిక’ రంగమూ నిరాశే.. ఇదిలావుండగా, ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల వృద్ధి రేటు అక్టోబర్‌లో 3.1 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే నెలతో పోలి్చతే (12.7 శాతం) వృద్ధి రేటు భారీగా పడిపోవడం గమనార్హం. బొగ్గు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించగా, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు రంగాల్లో ఏకంగా క్షీణత నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో మాత్రం వృద్ధి రేటు పెరిగింది. కాగా, ఈ ఎనిమిది రంగాలూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ 4.1 శాతం వృద్ధి సాధించగా, 2023 ఇదే కాలంలో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27%.వృద్ధి వేగంలో గ్లోబల్ ఫస్ట్.. తాజాగా గణాంకాలు వెలువడిన క్యూ2లో వృద్ధి వేగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే కొనసాగింది. భారత్ ఈ సమయంలో 5.4 శాతం వృద్ధి సాధిస్తే, రెండవ స్థానంలో ఉన్న చైనా ఇదే కాలంలో 4.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నిరుత్సాహమే, కానీ... జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదు కావడం నిరుత్సాహపరిచే అంశమే. అయితే ఎకానమీలోని కొన్ని విభాగాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇందులో ఉన్నాయి. ఆ అంశాలు ఎకానమీ ప్రమాదంలో లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. – వీ అనంత నాగేశ్వరన్, సీఈఏ -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ 2024లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ రిస్క్‌లు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగించేందుకు (2024 చివరి వరకు) దారితీయవచ్చని తెలిపింది.తగినన్ని ఆహార నిల్వలు, పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం (4 శాతం) దిశగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21 శాతానికి చేరడం తెలిసిందే. ‘‘పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణం రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్బీఐ అప్రమత్తతను తెలియజేస్తోంది’’అని మూడీస్ పేర్కొంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్ఈ ఏడాదికి చివరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 7–9 తేదీల మధ్య జరగనుంది. గృహ వినియోగం పెరగనుందని చెబుతూ.. పండుగల సీజన్లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని మూడీస్ తన నివేదికలో ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం, వ్యాపార సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. -
ఇదే లక్ష్యం.. జాతీయ సదస్సులో కేంద్రమంత్రి
ఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్‌లో రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. భారతదేశంలో వార్షిక వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యాన్ని 341.55 మిలియన్ టన్నులుగా నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో ఆరు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, 31 రాష్ట్రాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరిలు రైతులు వేగంగా పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.రైతుల ఆదాయం పెరగని ప్రాంతాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాము. అలాంటి ప్రాంతాల్లోని రైతులపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతుందని ఈ సమావేశంలో వెల్లడించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 131 రోజుల్లో రైతుల ప్రయోజనాల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని.. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. 17 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో విజయవంతంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగంలో రాష్ట్రాలు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.ధాన్యం ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందించడం, రైతులకు నష్టపరిహారం అందించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ధాన్యాలకు సరైన నిల్వ సౌకర్యాలు కల్పించడం వంటి వాటితో పాటు ప్రపంచానికి భారతదేశాన్ని ఆహార కేంద్రంగా స్థాపించడం వంటివి ప్రభుత్వ లక్ష్యాలని చౌహాన్ వివరించారు. రబీ సీజన్లో ఆవాలు, శనగలు మొదలైన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న కాంగ్రెస్ ఆరోపణలపై శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ప్రతిపక్షాల ప్రశ్నలకు వచ్చే సమావేశంలో సమాధానాలు చెబుతామని వెల్లడించారు. -
వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్సైజ్ నోట్బుక్లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్టీ పెంచినట్లు అధికారి తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.ఎక్సర్సైజ్ నోట్‌బుక్‌లపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీసమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్లపై ఉన్న జీఎస్టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.జీఎస్టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్టీలో మినహాయింపు ఉండవచ్చు. -
2035 నాటికి రోజుకు 12000 కార్లు రోడ్డుపైకి: ఐఈఏ
భారతదేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి ఆటోమొబైల్ పరిశ్రమ కీలకమని ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు వెల్లడించారు. ఈ తరుణంలో 2035 నాటికి రోజుకు 12,000 కొత్త కార్లు రోడ్డుపైకి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) పేర్కొంది. దీంతో 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.2035 నాటికి వాహనాల సంఖ్య పెరుగుతుంది, కాబట్టి రోడ్ల విస్తరణ కూడా చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఇంధన వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో పేర్కొంది.పరిశ్రమలో ఇంధన డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఐఈఏ వెల్లడించింది. అయితే 2070 నాటికి భారత్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇన్స్టాల్ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు ఐఈఏ వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి వాహన వినియోగం కూడా పెరుగుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు గిరాకీ కూడా 20235 నాటికి 7.1 మిలియన్ బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇంధన వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ప్రపంచ కార్ల మార్కెట్లో ఐదవ స్థానంలో ఉన్న భారత్.. ఇంధన వినియోగం, దిగుమతిలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించబడుతున్న ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. ఫ్యూయెల్ వాహనాల సంఖ్య రెండూ పెరుగుతాయని ఐఈఏ పేర్కొంది. -
భారత్ సరికొత్త రికార్డ్: ఆర్బీఐ
భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని ఆర్బీఐ పేర్కొంది.విదేశీ మార్కద్యవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లు దాటడంతో.. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. రీవాల్యుయేషన్ లాభాలు, స్పాట్ మార్కెట్ డాలర్ కొనుగోళ్ల కారణంగా విదేశీ కరెన్సీ ఆస్తులు 10.46 బిలియన్లు పెరిగాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్గత వారం (సెప్టెంబర్ 20) విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరి 692.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 20న బంగారం నిల్వలు కూడా 2.18 బిలియన్ డాలర్లు పెరిగి 65.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. తగినన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉపాధి కల్పనకు కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. దేశంలో నిరుద్యోగం పోవాలంటే.. ఉపాధి కల్పన తప్పకుండా జరగాలి. తయారీ రంగాలను తప్పకుండా ప్రోత్సహించాలని రాజన్ పేర్కొన్నారు.ఏడు శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టిస్తోందా? అనే ప్రశ్నకు, రఘురామ్ రాజన్ సమాధానమిస్తూ.. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన అప్రెంటిస్‌షిప్ పథకాలను స్వాగతిస్తున్నామని రాజన్ అన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎన్రోల్మెంట్ ఆధారంగా ప్రభుత్వం మూడు ఉపాధి ఆధారిత పథకాలను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.ఇదీ చదవండి: వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..వియత్నాం, బంగ్లాదేశ్‌లను ఉదాహరణలుగా చెబుతూ.. వస్త్రాలు, తోలు పరిశ్రమలో వృద్ధి సాధిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. భారత్ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన వ్యయానికి సంబంధించినంతవరకు ప్రైవేట్ రంగం ఇంకా ఎందుకు వెనుకబడి ఉందని అడిగిన ప్రశ్నకు రాజన్, ఇది ఒక చిన్న మిస్టరీ అని అన్నారు.యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గించడం వల్ల సెంట్రల్ బ్యాంకులు సముచితంగా భావించే వేగంతో ముందుకు సాగడానికి మరింత అవకాశం లభించిందని అన్నారు. -
అర్హతకు తగిన ఉపాధి లేకపోతే...
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్‌లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు. భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్‌టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్‌లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది. అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి. ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్‌కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.డా‘‘ పి.ఎస్. చారి వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823 -
నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ
గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్‌కు భారీ నిధులను కేటాయించింది.ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్‌లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్‌లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్‌లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. -
భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్
లావోస్‌లోని వియంటైన్లో జరిగిన 12వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' దక్షిణ కొరియా.. మయన్మార్ దేశాల సహచరులతో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిని పెంచడానికి పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం గురించి ఈ సమావేశంలో చర్చించారు.కొరియా వాణిజ్య, పరిశ్రమల, ఇంధన మంత్రి 'ఇంక్యో చియోంగ్'తో చర్చలు జరిపిన విషయాన్ని మంత్రి పీయూష్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. ఫోటోలను కూడా షేర్ చేశారు. భారత్ - కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు జరిపినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!భారతదేశంలో దక్షిణ కొరియా పెట్టుబడులు ఉపాధి.. పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ కొరియాతో మాత్రమే కాకుండా.. మయన్మార్ విదేశీ ఆర్థిక సంబంధాల మంత్రి డాక్టర్ 'కాన్ జా'తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే మార్గాలను గురించి పీయూష్ గోయల్ చర్చించారు. మొత్తం మీద ఇప్పుడు జరిగిన చర్చలు దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతాయని పలువురు భావిస్తున్నారు.Held productive talks with Mr. Inkyo Cheong, Minister of Trade, Industry and Energy, Republic of Korea. 🇮🇳🤝🇰🇷Deliberations were held on achieving more balanced trade, upgrading the India-Korea Comprehensive Economic Partnership Agreement (CEPA), promoting investments linked to… pic.twitter.com/5mgXtK6rSI— Piyush Goyal (@PiyushGoyal) September 21, 2024 -
ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు. -
మనం సాధించిందీ తక్కువేమీ కాదు!
భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. వికసిత్ భారత్–2047 అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి సాకారం చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథం ఉండటమే కాదు, దాన్ని తు.చ. అనుసరించడం అవసరం. వికసిత్ భారత్ అనేది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన వంటి వివిధ అంశాల ఆధారంగా ఉంటుంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించు కోవడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్వాతంత్య్ర సమరయోధుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ కలలను మనం ఎంతవరకు సాధించాము? భారతదేశం తన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందా? ఇవన్నీ ఈ సందర్భంగా చర్చ నీయాంశాలే.మన దేశం 3.937 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం 2023–24లో తలసరి ఆదాయం రూ. 2.12 లక్షలు. కానీ ఇప్పటికీ మనం 5 శాతం పేదరికంతో బాధపడుతున్నాము. 2023 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం (సీఎంఐఈ) ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగం రేటు 2024 మేలో 7 శాతం ఉంటే ఆ మరుసటి నెల (జూన్)లో 9.2 శాతానికి పెరిగింది. ఒక శాతం జనాభా సంపద వాటా 2022–23లో 40.1 శాతంగా ఉంది. 2023–24లో దేశంలోని పొదుపులో 92 శాతం సంపన్నులైన 20 శాతం మంది కలిగి ఉన్నారు.వీటితో పాటు 2023లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నే షనల్ యొక్క ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం 100కి 40 శాతం అవినీతి భారంతో భారతదేశం ఉంది. భారతదేశం 2023 నాటికి తన స్థూల దేశీ యోత్పత్తిలో దాదాపు 3–4 శాతం విద్యపై ఖర్చు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణపై 1.2–1.5 శాతం ఖర్చు చేస్తోంది. మానవాభివృద్ధి–సంబంధిత అంశాలపై మొత్తం వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 6–8 శాతంగా అంచనా వేయబడింది. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. సరళీకరణ ఆర్థిక వ్యవస్థలో ‘రెడ్ టేపిజం’ ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగా లలో కనిపిస్తుంది. అయితే ఇది వ్యాపారం, రాజకీ యాలు, క్రీడలు, వినోద రంగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం వర కట్నం, ఆడ శిశుహత్య, లింగ అసమానత్వం, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచా రాలతో కునారిల్లుతున్నాం.మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో; మొబైల్ వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ ర్యాంక్ కలిగి ఉంది. బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్‌పుట్ మరియు స్పేస్‌లో 5వ స్థానంలో ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులను స్వీకరించడంలో 8వ స్థానంలో ఉంది, 14వ అతిపెద్ద ఎగుమతిదారు మన దేశం. సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్, ఐటీ పరిశ్రమ పోటీ తత్వంలో18వ ర్యాంక్, హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో 30వ ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 40వ స్థానాన్ని భారత్ నిలుపుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఫిన్‌టెక్, పునరు త్పాదక శక్తి, బయోటెక్నాలజీ, డిజిటల్ లావా దేవీలు ఉన్నాయి.సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో నిరంతర ఆర్థికాభివృద్ధి మరియు విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. దేశంలోని పౌరులు తమ హక్కులను పరిరక్షించడానికి మానవ హక్కుల సంఘాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఫోర్త్ ఎస్టేట్, సమాచార హక్కు చట్టం మొదలైన ప్లాట్‌ఫారమ్‌లు, చట్టాల గురించి తెలుసుకోవాలి. పౌరుల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడినప్పుడే సమానత్వం, సౌభ్రాతృత్వం లభిస్తాయి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని సాధించగలుగుతాం.డా‘‘ పి ఎస్. చారి వ్యాసకర్త మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఆచార్యులుమొబైల్ : 83090 82823 -
ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు కాంగ్రెస్ కుట్ర: రవిశంకర్ ప్రసాద్
ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్షలు తీవ్రంగా మండిపడిపడుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఆమె పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అస్థిరత, ద్వేషం సృష్టించడానికి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ‘‘మూడోసారి (2024 లోక్‌సభ ఎన్నికలు) కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావటంతో ఆ పార్టీ, టూల్‌కిట్ గ్యాంగ్ భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో ద్వేషాన్ని పెంచాలని భావిస్తోంది. నేడు భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండటం మేము పట్ల గర్వపడుతున్నాం. చిన్నమొత్తాల పెట్టుబడిదారులకు సల్యూట్ చేస్తున్నా. పెట్టుబడిదారులకు టూల్‌కిట్, హిండెన్‌బర్గ్ నివేదికలపై నమ్మకం లేదు’’ అని అన్నారు. -
భారత్ వృద్ధి చెందాలంటే?.. రంగరాజన్ సూచన
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని పలువురు ఆర్థిక వేత్తలు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ 'రంగరాజన్' కీలక వ్యాఖ్యలు చేయారు.ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 14వ స్నాతకోత్సవంలో రంగరాజన్ ప్రసంగిస్తూ.. ఉద్యోగాలు లేకుండా సాధించే వృద్ధి వ్యర్థం. కాబట్టి పెట్టుబడి రేటును పెంచడం, వ్యవసాయం, తయారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం.. ఉపాధికి అనుకూలమైన రంగాలను ప్రోత్సహించడం ద్వారా వృద్ధిని సాధ్యమవుతుందని అన్నారు.ఏదైనా దిగుమతి ఖరీదైనదైతే దాని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవాలి. ఇది దేశానికి మంచిదని రంగరాజన్ అన్నారు. భారత్ ద్రవ్యోల్బణం.. రూపాయి - డాలర్ రేటు వంటి సమస్యతో సతమతమవుతోంది. అలాగే 6-7 శాతం వృద్ధి సాధిస్తే.. 2024 చివరి నాటికి 13000 డాలర్ల స్థాయికి చేరుకోవడం సులభమవుతుంది.ఉద్యోగాల కల్పన అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన సవాలుగా మారనుంది. భారతదేశం సాధించిన దాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. నాణ్యత, ప్రభావ పరంగా ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య సంస్కరణ అంటే యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. -
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది. -
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్మెంట్): రూ.2,65,808 కోట్లు.వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.విద్య: రూ.1,25,638 కోట్లు.ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.ఎనర్జీ: రూ.68,769 కోట్లు.సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు -
మినీ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న సవాళ్లు ఇవే..
Economic Survey 2024: భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో సంస్కరణల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇది అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో నాలుగింటిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్, ఆయన బృందం మధ్యంతర బడ్జెట్‌కు ముందు గత జనవరిలో వారి “మినీ ఎకనామిక్ సర్వే”లో పేర్కొన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రకటించనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌తోపాటు నేడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే-2024లో వీటిని ప్రస్తావించవచ్చు. 'ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ' అనే పత్రంలో పేర్కొన్న ఈ సవాళ్లను ఇప్పుడు తెలుకుందాం..ప్రపంచ ఆర్థిక ధోరణుల ప్రభావంభారతదేశ వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక ధోరణులు, వాణిజ్య విధానాల ప్రభావం మొదటి సవాలు. దేశ వృద్ధి కేవలం అంతర్గత అంశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక ఏకీకరణపై కూడా ఆధారపడి ఉందని పత్రం పేర్కొంది.బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీఇక రెండవ సవాలు ఏమిటంటే, పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచ మార్పుల మధ్య ఆర్థిక వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడం భౌగోళిక రాజకీయ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో సంక్లిష్ట సవాళ్లను కలిగిస్తుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మూడో సవాలుగా మినీ సర్వే పేర్కొంది. ఏఐ టెక్నాలజీతో మానవ ఉద్యోగాలకు పెంచిన ముప్పు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉపాధిపై దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటాయన్నది కీలకం.నైపుణ్యం, విద్య, వైద్యంస్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి , మంచి నాణ్యమైన విద్య, ప్రజారోగ్యాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమైనదని పత్రం పేర్కొంది. -
నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు: చైనాతో పోటీ పడాలంటే..
కేంద్ర బడ్జెట్‌కు ముందు.. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో లోక్‌సత్తా ఎడిటర్ గిరీష్ కుబేర్ రచించిన మరాఠీ పుస్తకం "మేడ్ ఇన్ చైనా" ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశానికి అనువైన ఆర్థిక విధానాలు అవసరమని అన్నారు. ఉద్యోగాల సృష్టిని పెంచడానికి, అసమానతలను తగ్గించగల సామాజిక ఆర్థిక నమూనా అవసరమని పేరొన్నారు.చైనాలో పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. కోవిడ్ 19 తర్వాత చాలా దేశాలు చైనాతో వ్యాపారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని గడ్కరీ అన్నారు. చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. చైనా నుంచి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే? సోషలిస్ట్, కమ్యూనిస్ట్ లేదా పెట్టుబడిదారీగా మారడానికి ముందు.. మనం ఉపాధిని సృష్టించగల ఆర్థిక వ్యవస్థగా మారాలని ఆయన అన్నారు.ఉపాధిని సృష్టించి పేదరికాన్ని తొలగించగల సామాజిక ఆర్థిక నమూనా భారతదేశానికి అవసరమని ఆయన అన్నారు. ఒకసారి చైనా అధ్యక్షుడితో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ.. చైనీయులు తమ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ప్రజల భావజాలం ఎలా ఉన్నప్పటికీ దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనతో చెప్పారని అన్నారు.పేదరికాన్ని తొలగించడానికి, మూలధన పెట్టుబడులను ఆకర్షించడానికి.. దాని నుంచి ఉపాధిని సృష్టించడానికి, ఎగుమతులను పెంచడానికి మన ఆర్థిక విధానాలలో సౌలభ్యాన్ని తీసుకురావాలి గడ్కరీ అన్నారు. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.గ్రామీణ, గిరిజన వర్గాల జనాభా పేదలుగా, ఉపాధి లేకుండా ఉంటే తలసరి ఆదాయం తగ్గుతుంది. ఇలా జరిగితే 'ఆత్మనిర్భర్ భారత్' సాధ్యం కాదని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. చైనా సాంకేతికతలో చాలా ముందుంది, దానితో పోటీ పడాలంటే భారతదేశం నాణ్యమైన తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. పొరుగు దేశంతో పోటీపడే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. మెర్సిడెస్ ఛైర్మన్ ఇటీవల పూణేలో తనను కలుసుకున్నట్లు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని తమ సంస్థ యోచిస్తున్నట్లు చెప్పారని గడ్కరీ తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ ఆటోమొబైల్ రంగం మరింత వృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. -
వృద్ధికి వర్షపాతం, ప్రపంచ సానుకూలతల దన్ను
న్యూఢిల్లీ: సాధారణ రుతుపవనాల అంచనాలు, ఇప్పటివరకు ఎటువంటి ప్రపంచ ప్రతికూలతలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడానికి దోహదపడే అవకాశం ఉందని ఎకనామిక్ థింక్ ట్యాంక్– ఎన్సీఏఈఆర్ తన నెలవారీ సమీక్షలో తెలిపింది.దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని హై–ఫ్రీక్వెన్సీ సూచికలు వెల్లడిస్తున్నాయని, 2024–25 వృద్ధి అంచనాలను దాదాపు అన్ని ఏజెన్సీలు కూడా ఎగువముఖంగా సవరిస్తున్నాయని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 7.2 శాతం శ్రేణిలో ఉంటుందని పలు సంస్థలు అంచనావేస్తున్న విషయాన్ని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా పేర్కొంటూ.. ఎకానమీ వృద్ధి 2024–25లో 7 శాతం ఖాయమని, 7.5 శాతం వరకూ కూడా ఈ రేటు పురోగమించే వీలుందని అన్నారు. పూనమ్ గుప్తా పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...మార్చి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు తోడు సాధారణ రుతుపవనాల అంచనాలు ఎకానమీకి ఊతం ఇస్తాయి.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉన్నందున, కీలక రెపో రేటు మరింత కఠినమయ్యే పరిస్థితులు లేవు.అయితే ఆహార ధరలు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసురుతున్న సమస్య. దీనిని పరిష్కరించడానికి విస్తృత విధాన ఫ్రేమ్‌వర్క్ అవసరం కావచ్చు. వాతావరణ సవాళ్లను తట్టుకునే ఆహార సరఫరాల చైన్‌ను వ్యవస్థీకరించడంతోపాలు, ప్యాక్ అయిన సురక్షిత ఆహార సరఫరాలవైపు క్రమంగా మారాలి. సరఫరా–డిమాండ్ అంతరాన్ని తగ్గించడానికి తగిన కృషి జరగాలి.ప్రధాన పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)లో వృద్ధి ఏప్రిల్ 2024లో వేగంగా ఉంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏడాది పొడవునా పటిష్టంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్‌లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ’సాధారణం కంటే ఎక్కువ’ రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నాయి. భారత్ ఎకానమీ పురోగతిలో ఇవన్నీ కీలకాంశాలు. -
భళా.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం. ఎన్ఎస్ఓ శుక్రవారం ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది. 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులుభారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది. మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్‌లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ 40.27 శాతం. 2024లో వృద్ధి 6.8%: మూడీస్ భారత్ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే,,, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.ద్రవ్యలోటు కట్టడిఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి.8.2% వృద్ధి ఎలా... 2011–12ను బేస్ ఇయర్‌గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే... ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 7.8% పరుగు ఇలా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన బ్యాంకింగ్ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్ చేసింది. – మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో నిర్మలా సీతారామన్ -
అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 'భారత్' ఒకటి. అదే సమయంలో అత్యంత పేద దేశం కూడా.. అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2024లో నిరుద్యోగిత రేటు 8.1%గా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) పేర్కొన్న విషయాన్ని రాజన్ హైలైట్ చేశారు.భారతదేశంలోని శ్రామిక జనాభాలో కేవలం 37.6 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు. పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిలోకి రావడం వల్ల భారత్‌కు మేలు జరుగుతుందన్నారు. యువకులకు కావలసిన ఉపాధి కల్పించగలిగితే.. దేశం మరింత వేగంగా డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.భారత్ క్రమంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో చేరుతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా 2047 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని రఘురామ్ రాజన్ అన్నారు.ఇక అసలు సమస్య ఏమిటంటే.. 2047-2050 నాటికి దేశంలో వృద్ధాప్యం పెరుగుతుంది. అప్పటికి భారతీయులంతా ధనవంతులు కాగలరా? అని రాజన్ అన్నారు. ప్రస్తుత జనాభా డివిడెండ్ శాశ్వతంగా ఉండదని, జనాభా వయస్సు పెరిగే కొద్దీ.. వర్క్‌ఫోర్స్‌లో సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు.Can India lift itself from the doldrums of a jobs crisis? Can the country grow rich before it grows old?My conversation with Raghuram Rajan, former head of India’s central bank and coauthor of “Breaking the Mold: India’s Untraveled Path to Prosperity” pic.twitter.com/hPz75GRE16— Fareed Zakaria (@FareedZakaria) May 19, 2024 -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8 -
అతివకు అందలం!
ముంబై: దేశంలో ఉద్యోగాలు, ఇతర క్రియాశీలక పనుల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోంది. మహిళా సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని చెప్పొచ్చు. ఇండియాలో 140 కోట్లకుపైగా జనాభా ఉండగా, వీరిలో 69.2 కోట్ల మంది మహిళామణులే. వీరిలో దాదాపు 37 శాతం మంది ఉద్యోగాలు, క్రియాశీలక పనుల్లో కొనసాగుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ‘కెరీర్‌నెట్స్’ అనే సంస్థ ‘ఇండియాలో మహిళా ఉద్యోగుల స్థితిగతులు’ పేరిట తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో హైదరాబాద్, పుణే, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2022తో పోలిస్తే 2023లో శ్రామికశక్తిలో అతివల ప్రాతినిధ్యం 2 నుంచి 5 శాతం పెరిగినట్లు తెలియజేసింది. జూనియర్ ప్రొఫెషన్ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో వారి భాగస్వామ్యం పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► 2023లో కాలేజీల నుంచి వచ్చి కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ► ఒకటి నుంచి ఏడేళ్ల అనుభవం ఉన్న మహిళలకు కొత్తగా జరుగుతున్న నియామకాల్లో 20 నుంచి 25 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ► దేశ రాజధాని ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో మహిళల నియామకం పెరిగింది. ఢిల్లీలో మాత్రం తగ్గిపోయింది. ► ఉద్యోగాల్లో మహిళల నియామకం రేటు హైదరాబాద్‌లో 34 శాతం, పుణేలో 33 శాతం, చెన్నైలో 29 శాతంగా నమోదైంది. ఢిల్లీలో ఇది కేవలం 20 శాతంగా ఉంది. -
భారత్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకటించింది. ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం. క్యూ1, క్యూ2 శాతాలు అప్.. 2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్ఎస్ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. 8.4 శాతం వృద్ధి ఎలా అంటే.. 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది. జనవరిలో మౌలిక రంగం నిరాశ 8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. తలసరి ఆదాయాలు ఇలా... మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి. -
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భావం ఖాయం
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, అదనపు సంస్కరణలు, మెరుగైన సాంకేతికతను అవలంభించడం వంటి చర్యలకు కేంద్రం సంపూర్ణ మద్దతును అందిస్తుందని భారత్ కార్పొరేట్ విశ్వసిస్తోంది. ఈ దన్నుతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన సీఎక్స్‌వో సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ నమోదు చేస్తుందని వ్యాపార ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంకన్నా ఎక్కువగా వృద్ధి రేటు నమోదవుతుందని 50 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఎకానమీపై పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ►అధిక రేటును అంచనా వేస్తున్న పారిశ్రామిక రంగాలలో ఆటోమోటివ్ (50 శాతం), వినియోగం, రిటైల్ (66 శాతం), సాంకేతికత, మీడియా, టెలికమ్యూనికేషన్ (47 శాతం) శక్తి, సంబంధిత వనరులు (44 శాతం) ఉన్నాయి. ►ప్రభుత్వ కార్యక్రమాలు, పెరిగిన వాణిజ్య భాగస్వామ్యాలు, లాజిస్టిక్స్ వ్యయాల తగ్గింపు, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచే విధానాలు (తయారీలో తెలివైన ఆటోమేషన్, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాల వైపు పెట్టుబడిని పెంచడం వంటివి) వృద్ధి ఊపును మరింత పెంచుతాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మారడం, బలమైన డిమాండ్, పట్టణీకరణ వృద్ధికి దోహదపడే ఇతర అంశాలు. ►ఆవిష్కరణలు, పరిశోధనలకు గ్లోబల్ హబ్‌గా భారతదేశం తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉత్పాదక రంగం, సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సెమీకండక్టర్ పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నందున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం నుండి సమగ్రమైన, దీర్ఘకాలిక పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. ►స్థానిక కంపెనీలకు పరిశోధనా, అభివృద్ధి రంగాల్లో మద్దతు అవసరమని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. 57 శాతం మంది పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మేధో సంపత్తి హక్కుల ఫ్రేమ్‌వర్క్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇటువంటి వ్యూహాత్మక చర్యలు భారతదేశానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. హై–టెక్నాలజీ తయారీ రంగాలలో పోటీతత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ►ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధునిక వ్యాపారానికి ఆధారం అయ్యిందని, వృద్ధికి అసాధారణ అవకాశాలను అందిస్తోందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. దాదాపు 99 శాతం మంది ఏఐ మరింత పురోగతిని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 70 శాతం వినియోగ, రిటైల్ వ్యాపారాలు ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. డేటా అంశాల్లో నైతిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెబుతున్నారు. ►4.0 సాంకేతికతలను (ఏఐ, ఎంఎల్, ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్) అమలు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు, దానితో పాటు మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో నిరంతర ప్రయత్నాలతో పాటు, ముఖ్యంగా టైర్–2, 3 నగరాల్లో మానవ, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ►భారతదేశ వృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన వ్యాపార విస్తరణకు, దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను ఖచ్చితత్వం అవసరమని 80 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ►భౌగోళిక ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో భాగంగా, జీ 20 దేశాలు సమన్వయంతో పనిచేయాలని, సరఫరాల చైన్‌ను క్రమబద్దీకరించాలని పారిశ్రామికవేత్తలు ఉద్ఘాటించారు. ►పునరుత్పాదక శక్తి ప్రాముఖ్యతను 100 శాతం మంది ఉద్ఘాటించారు. సాంకేతిక ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, పర్యావరణ– సామాజిక–కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ)వ్యూహాలు, కార్యక్రమాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కార్పొరేట్ భావిస్తోంది. డిజిటలైజేషన్ సాధికారతకు ప్రాధాన్యత సవాళ్లు, అవకాశాలకు సంబంధించి సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలను మేము పరిశీలించినప్పుడు, దేశం డిజిటలైజన్ సాధికారతను సాధించాల్సిన అవశ్యత ఎంతో ఉందన్న విషయం స్పష్టమైంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే బాటలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, తద్వారా ప్రపంచ వేదికపై భారత్ చెరగని ముద్ర వేయడానికి సంయుక్తగా, వ్యూహాత్మకంగా, సాంకేతికంగా తగిన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము. – సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురో గతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. -
మోదీతో అట్లుంటది ముచ్చట
-
Union Minister Amit Shah: ఎకానమీలో సహకార రంగ భాగస్వామ్యం పెరగాలి
న్యూఢిల్లీ: భారత్‌లో గత 75 సంవత్సరాల్లో సహకార ఉద్యమం ఆశించిన స్థాయిలో పురోగమించలేదని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్లుగా భారత్ ఎకానమీ ఆవిర్భవిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ లక్ష్య సాధనలో సహకార రంగం భారీ వాటాను కలిగి ఉండేలా చూడడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. దక్షిణ ఢిల్లీలోని నౌరోజీ నగర్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్బీసీసీ అభివృద్ధి చేసిన సెంట్రల్ రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర సహకార మంత్రి షా ప్రసంగించారు. 175 కోట్లతో ఈ కొత్త కార్యాలయాన్ని కొనుగోలు చేసినట్లు షా తెలిపారు. సహకార ఉద్యమం అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 30 నెలల్లో 60 పెద్ద కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ జూలై 2021లో ఏర్పాటయినట్లు వివరించారు. 21వ శతాబ్దంలోకి పురోగమనం స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి సహకార సంఘాల విజయగాథలు ఉన్నాయని, అయితే ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందలేదని షా అన్నారు. ‘‘ప్రధాని మోదీజీ లక్షిత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో, సహకార సంస్థలకు పెద్ద వాటా ఉండాలని ఇప్పుడు మేము నిర్ణయించుకున్నాము. సహకార రంగం 19వ శతాబ్దం నుండి నేరుగా 21వ శతాబ్దంలోకి పురోగమిస్తుంది’’ అని షా ఈ సందర్భంగా అన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మల్టీ–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించిందని అన్నారు. అలాగే పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు), పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించే పథకాన్ని బలోపేతం చేయడానికి నమూనా బై–లాస్‌ను తీసుకువచి్చందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల సంఘాల ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళ వినియోగ పీఏసీఎస్/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని షా తెలిపారు. ఇప్పటికే కొత్తగా 12,000 పీఏసీఎస్‌లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. సహకార రంగంలో మరిన్ని బ్యాంకులను తెరవాల్సిన అవసరాన్ని షా ఉద్ఘాటించారు. తమను తాము బ్యాంకులుగా మార్చుకోవాలని బహుళ–రాష్ట్ర క్రెడిట్ సొసైటీలను సూచించారు. మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ 2023లో 102కి చేరిందని ఆయన పేర్కొంటూ 2020లో 10 నుంచి 10 రెట్లు పెరిగిందని వివరించారు. నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీలకు డిమాండ్ ఐఎఫ్ఎఫ్సీఓ వినూత్న ఉత్పత్తులైన నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్)లను షా ఈ సందర్భంగా ఉటంకించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. నానో యూరియా, నానో డీఏపీ పిచి కారీ చేసేందుకు పీఏసీఎస్‌లు రైతులకు డ్రోన్ లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాగా, ఇటీవల షా ఆవిష్కరించిన నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఉన్న త స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద 2022 జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్
ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి) భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్ కన్‌క్లేవ్‌లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. -
ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా భారత్
ప్రపంచంలో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అత్యధిక జీడీపీ కలిగిన దేశాలలో 10వ స్థానంలో ఉన్న భారత్ పదేళ్ళ వ్యవధిలో 5వ స్థానానికి చేరిందని కొనియాడారు. వచ్చే అయిదేళ్ళలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులు అన్న అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యావత్తు మందకొడిగా సాగుతున్న నేపధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు పోతోందని అన్నారు. గత ఏడాది దేశ జీడీపీ భారీగా పెరిగి 7.2 శాతంగా నమోదైంది. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో దేశ జీడీపీ 7.6 శాతం వృద్ధితో మార్కెట్ అంచనాలను మించిపోయిందని గుర్తు చేశారు. పన్నుల వసూళ్ళలో గణనీయమైన వృద్ధి పన్నుల వసూళ్ళలో నానాటికి సాధిస్తున్న గణనీయమైన వృద్ధి భారత్ ఆర్థిక పురోగతికి ఇంధనంలా మారింది. పదేళ్ళలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 160 శాతం పెరిగాయి. 2013-14 మధ్య 6.4 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2022-23 నాటికి 16.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పన్నుల వసూళ్ళు 18 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ళు 13.3 లక్షల కోట్లు. అంటే సగటున 1.66 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్ళు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. పన్నులు పెద్దగా పెంచకుండానే ఇంత భారీగా పన్నులు వసూళ్ళు జరగడం వెనుక ప్రభుత్వ సామర్ధ్యం, పనితీరు స్పష్టం అవుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రదేశాలను అధిగమించి భారత్ దూసుకుపోతోంది. 2022లో దేశంలో 89 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అనుసరిస్తున్న అన్ని దేశాలను కలుపుకున్నా భారత్‌లో జరిగినన్ని డిజిటల్ లావాదేవీలు జరగలేదు. అంటే ప్రపంచ దేశాలలో జరిగిన రియల్ టైం పేమెంట్లలో సగానికి పైగా భారత్‌లోనే జరిగాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పడిపోతున్న రూపాయి మారకం విలువ దేశ ఆర్థిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా అంతే వేగంగా పడిపోవడం పట్ల విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో ఆసియా కరెన్సీలోకెల్లా మారకం విలువలో తీవ్ర ఒడిదుకులకు లోనైన కరెన్సీ రూపాయి. మొదటిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 రూపాయలు దాటేసింది. ప్రస్తుతం ఒక డాలర్‌కు రూపాయి విలువ 83 రూపాయల 40 పైసలకు చేరిందని అన్నారు. గడిచిన అయిదేళ్ళుగా రూపాయి మారకం విలువ ఇలా క్షీణిస్తూనే ఉంది. ముడి సరుకులు, ఆయిల్ దిగుమతులపై భారత్ భారీగా ఆధారపడినందున దీని ప్రభావం దేశంలోని ఉత్పాదక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. రూపాయి మారక విలువ క్షీణత ప్రభావంతో ఉత్పాదక రంగం తీవ్ర ఒడిదుకులను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం రూపాయి మారక విలువ క్షీణతతో ద్రవ్యోల్బణం 15 బేసిస్ పాయింట్లు పెరిగి సామాన్యుడిపై మరింత భారం పడింది. విదేశి మదుపుదార్లు భారత మార్కెట్ల నుంచి 18 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యంలో భారత మార్కెట్ల నుంచి విదేశి మదుపుదార్లు వెనక్కి తీసున్న మొత్తం 12 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే రూపాయి మారక విలువ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం చూపగలదో ఇంతకంటే ఉదాహరణ లేదని ఆయన అన్నారు. ఆదాయం, సంపద మధ్య పెరుగుతున్న అగాధం దేశంలోని 60 శాతం సంపద దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది చేతుల్లో ఉందన్నది కఠోర వాస్తవం. జనాభాలో 50 శాతం ప్రజల చేతుల్లో ఉన్న సంపద కేవలం 6 శాతం మాత్రమే. 2014 నుంచి తలసరి ఆదాయం రెట్టింపు అయి ఒక లక్షా 97 వేల రూపాయలకు చేరినప్పటికీ 197 దేశాల తలసరి ఆదాయంతో పోలిస్తే భారత్ 142వ స్థానంలో ఉండటం పట్ల విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ వాణిజ్య లోటు గత అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరింది. చైనాతో వాణిజ్య లోటు నానాటికీ విస్తరిస్తూ ఆందోళకర స్థాయికి చేరుకుంది. 2022లో చైనాతో ఇండియా వాణిజ్య లోటు 83 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి అది 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని తగిన విధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని వైఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. -
4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్?, కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలు!
ఇటీవల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్ డాలర్ల మైలు రాయిని చేరిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఎక్స్’ వేదికగా పలువురు ప్రముఖులు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో ఫోర్బ్స్ ఇండియా భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. దేశ రాజధాని. ఇవన్నీ కలిపి భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని దేశంగా నిలబెడుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత (2023లో) జీడీపీ 3.75 ట్రిలియన్ డాలర్లుగా ఉందని తేలింది. జీడీపీని బట్టే దేశాభివృద్ది ఎలా ఉందనే విషయాన్ని గుర్తించవచ్చు. ఇంతకీ జీడీపీ అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. ‘జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద’ని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని అర్ధం. తలసరి జీడీజీ విషయానికొస్తే ఇది దేశంలోని ప్రతి వ్యక్తికి సగటు ఆర్థిక ఉత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి (GDP)ని సూచించే కొలత. ఇది ఒక దేశ మొత్తం జీడీపీని దాని జనాభాతో గుణించడం ద్వారా అంచనా వేయొచ్చు.ఈ రెండు పారామీటర్స్‌ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రాంత జనాభా ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా కేంద్ర సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) జీడీపీ డేటాను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా మన దేశంలోని అత్యంత ధనిక,పేద రాష్ట్రాలను గుర్తింవచ్చు. -
వరల్డ్ కప్ ఫైనల్, దేశంలో బిజినెస్ అప్ & డౌన్
ప్రపంచకప్ ఫైనల్లో అహ్మాదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియాలో హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రభావం భారత్‌లోని పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆయా రంగాలకు చెందిన వ్యాపార విభాగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వాటిల్లో యూపీఐ లావాదేవీలు డల్ మ్యాచ్ జరిగే సమయంలో యూపీఐ చెల్లింపులతో సహా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. జనమంతా మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉండడంతో.. UPI ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోతాయని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా UPIలపై తీవ్రప్రభావం పడింది. కేవలం ఫుడ్ ఆర్డర్, హోటళ్ల బిజినెస్ మాత్రం జరిగింది. గత ఏడాది దీపావళి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు UPI లావాదేవీలు పూర్తిగా క్షీణించాయి. కింద ఇచ్చిన గ్రాఫ్ లో ఆ వివరాలను గమనించవచ్చు. ముఖ్యంగా కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు UPIలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత లావాదేవీలు సాధారణంగా మారాయి. అమ్మకాలలో హెచ్చుతగ్గులు ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో ఆన్లైన్ విక్రయాలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. టీమ్ జెర్సీలు, ఫ్లాగ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరగవచ్చు. మరోవైపు, ప్రజలు మ్యాచ్‌పై దృష్టి సారించడంతో క్రీడలకు సంబంధించిన ఆన్లైన్ విక్రయాలు భారీగా క్షీణించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్‌లు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బెట్టింగ్ యాప్స్ వినియోగం విపరీతంగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం లేదా గేమ్‌లోని వివిధ ఈవెంట్లపై బెట్టింగ్‌పై ఎక్కువ మొగ్గు చూపుతారు. బెట్టింగ్ కార్యకలాపాల పెరుగుదల, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ , బెట్టింగ్ సెక్టార్లో నిర్వహించే వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ కొనసాగుతున్న ఈ సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగించేందుకు ఔత్సాహికులు పోటీపడుతుంటారు. జరుగుతున్న లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వినియోగదారులు ఫాంటసీ లీగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త జట్లను ఏర్పాటు చేసి ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. బిజినెస్ ప్రమోషన్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది. టీవీలు, యాప్స్, లైవ్ స్ట్రీమ్‌లలో యూజర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని, సేవల ప్రచారానికి ఉపయోగిస్తుంటాయి. రెస్టారెంట్లు, బార్లపై ప్రభావం ప్రపంచ కప్ ఫైనల్‌ను ప్రదర్శించే రెస్టారెంట్లు, బార్లలో మ్యాచ్‌ను తిలకించేందుకు ఎగబడుతుంటారు. ఆ సమయంలో మద్యం, బిర్యానీతో పాటు ఇతర ఆహార వంటకాలు విపరీతంగా అమ్ముడు పోతుంటాయి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈవెంట్ జరిగే సమయంలో భారీగా ఎత్తున నెటిజన్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా ఉపయోగిస్తుంటారు. మ్యాచ్ ఫలితాల్ని బట్టి మీమర్స్.. మీమ్స్ క్రియేట్ చేసి వారి వారి సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
టోకు ద్రవ్యోల్బణం.. 7వ నెలా రివర్స్..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా ఏడవనెల అక్టోబర్‌లోనూ మైనస్‌లోనే నిలిచింది. సమీక్షా నెల్లో సూచీ మైనస్ (–)0.52 వద్ద ఉంది. సూచీలో అసలు పెరుగుదల లేకపోగా, క్షీణతలో ఉండే ఈ తరహా పరిస్థితిని ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. కొన్ని కీలక ఉత్పత్తుల ధరలు పెరక్కపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. వ్యవస్థలో తగిన డిమాండ్ లేని పరిస్థితితో పాటు, వార్షికంగా హైబేస్ కూడా ఈ పరిస్థితికి కారణంగా ఉంటుంది. ఇక్కడ గత ఏడాది అక్టోబర్‌ను చూస్తే టోకు ద్రవ్యోల్బణం 8.67 శాతం (హైబేస్తో)గా ఉంది. -
ఆర్థిక వృద్ధిలో భారత్ ఎకానమీ ట్రాక్ రికార్డ్ - ఎస్అండ్పీ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్ రికార్డు) కలిగి ఉందని రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతం వృద్ధి అంచనాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ’స్లోయింగ్ డ్రాగన్స్, రోరింగ్ టైగర్స్’ అనే శీర్షికతో వెలువరించిన ఆసియా–పసిఫిక్ క్రెడిట్ అవుట్‌లుక్, 2024లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సేవల రంగం పురోగతి, పెట్టుబడులకు సంబంధించిన మూలధనం క్రమంగా పురోగమించడం, వృద్ధికి దోహదపడే విధంగా యువత అధికంగా ఉండడం, ఉత్పాదకత మెరుగు వృద్ధికి ప్రధాన కారణాలు. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 6.9 శాతంగా ఉంటుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం రుణ భారాలను పెంచే అంశం. అయితే వృద్ధి బాట పటిష్టంగా ఉండడం మార్కెట్ విశ్వాసానికి, రెవెన్యూ సృష్టికి దోహదపడుతుంది. ► శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాలకు సంబంధించి నియంత్రణలు, సవాళ్లు తొలగడం తదుపరి దశ వృద్ధికి దోహదపడే అంశాలు. ► ఆర్థిక వ్యవస్థలో సేవల ప్రభావం కాలక్రమేణా పెరిగింది. వ్యవసాయం, ఇతర ప్రాథమిక పరిశ్రమలు వెయిటేజ్‌లు ఎకానమీలో తగ్గాయి. సేవల రంగం మరింత పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం. -
యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలనే విషయాలను వెల్లడించారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు. ఇదీ చదవండి: టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే? ప్రభుత్వంలో అవినీతి కూడా తగ్గించాలని, పని గంటలు పెంచాలని ఆలా జరగకపోతే పురోగతి సాధించిన దేశాలతో పోటీ భారత్ పోటీ పడటం సాధ్యం కాదని అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
డ్రాగన్ నుంచి షిఫ్ట్ అవ్వాలనే యోచనలో దిగ్గజ సంస్థలు.. ఎందుకంటే..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా తర్వాత చైనా జీరో కొవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో అక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కుంటుపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో తయారీ రంగంలో డ్రాగన్‌కు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో విదేశీ సంస్థలకు భారత్ మెరుగైన గమ్యస్థానంగా కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో భాగంగా తన విధానాల నుంచి వెనక్కు మళ్ళేది లేదని పలుమార్లు జిన్‌పింగ్ కరాఖండీగా చెప్పారు. మానవ వనరులు అధికంగా ఉండటంతో ప్రపంచంలోని వేలాది కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేశాయి. 2020లో వుహాన్‌లో కరోనా వ్యాప్తి చెందిన తరవాత దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు స్తంభించిపోయాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టిన తరవాత ప్రపంచ దేశాల్లో వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగింది. చైనాలో జీరో కొవిడ్ లాక్డౌన్ల వల్ల వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచానికి చైనా ఉత్పత్తి కేంద్రంగా మారింది. డ్రాగన్ అనుసరిస్తున్న విధానాలు దానికి ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలను ముందుకు తెచ్చాయి. ఆ ప్రయత్నాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ ముందున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఇప్పటికే తన విధానాలను భారత్ సవరించింది. ఇండియాలో 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో వియత్నాం నుంచి భారత్‌కు తీవ్ర పోటీ ఉంది. భౌగోళికంగా చైనాకు వియత్నాం చాలా చేరువలో ఉంది. పెద్దగా ఖర్చు లేకుండానే కర్మాగారాలను అక్కడకు తరలించవచ్చు. అయితే, వియత్నాంలో మౌలిక వసతుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. మౌలిక వసతుల విషయంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏటా దేశంలో జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. దిల్లీ-ముంబయిల మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ రహదారి, సరకులను తరలించే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలు, దేశ తీర ప్రాంతాల్లోని ఓడరేవులు..ఇలా పలు సంస్థలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా ఉన్నాయి. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం చైనాలోని కొన్ని విభాగాలను భారత్‌కు తరలించాలని యోచిస్తోంది. 2025 కల్లా 25శాతం ఐఫోన్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ యోచిస్తుంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వారికి అందించాలన్న చట్టంపై కొన్ని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మానవవనరుల పరంగా ఇప్పటికే భారత్ చైనాను దాటేసిందని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లోని ముఖ్యపట్టణాలతో పాటు ఇతర నగరాలను కలుపుతూ రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వెరసి ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు భారత్‌వైపు చూసేందుకు ప్రధానకారణం అవుతుంది. -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్‌హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్‌హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
భారత ఆర్థికవ్యవస్థను ఇంజిన్‌లా ముందుకు తీసుకెళుతున్న సేవారంగం
142 కోట్ల జనాభాలో 120 కోట్ల తక్కువ ఆదాయవర్గం కొనుగోలు శక్తి పెరిగితే ప్రగతి రథం పరుగులు పెడుతుంది! ప్రపంచంలో అనేక అభివృద్దిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం తరచు దర్శనమిస్తోంది. అయితే, ప్రపంచంలో అత్యధిక జనాభా, విస్తృత మార్కెట్ ఉన్న ఇండియా అంతర్జాతీయ కుదుపుల ప్రభావం పెద్దగా లేకుండా ముందుకు సాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6–7 శాతం మధ్య కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను సేవారంగం రైలింజిన్లా ముందుకు వేగంగా నడిపిస్తోంది. భారత జీడీపీలో 60% వాటా కలిగి ఉన్న సేవారంగం ఏడాదికి 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. జీడీపీ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో కొనసాగడానికి సేవారంగం ప్రధాన పునాదిగా పనిచేస్తోంది. సేవారంగం పోగా మిగిలిన రెండు కీలకరంగాలైన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు జీడీపీలో వరుసగా 26%, 14% వాటా కలిగి ఉన్నాయి. అనూహ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్న ఈ రెండు రంగాలు కాస్త అటూ ఇటూ అయినా పటిష్ఠమైన సేవారంగం ప్రగతితో భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఆరోగ్యంతో పరుగులు తీస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక–తయారీ రంగాలు వరుసగా 4%, 5.5% వార్షిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు రంగాల అభివృద్ధి రేటు మరో ఐదు శాతం పెరిగితే దేశ జీడీపీ రేటు 8 శాతానికి పెరగడం సాధ్యమేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. జనాభాలో నంబర్ 1 అయినా– యువత నైపుణ్యం, ప్రతిభాపాటవాలు పెరగాలి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరించిన మాట నిజమే. అలాగే, ఇక్కడి జనసంఖ్యలో యువత వాటా ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కాని, కళాశాలల్లో చదువులు పూర్తిచేసుకుని పట్టభద్రులుగా తిరిగొస్తున్న భారత యువతీయువకుల్లో ఉద్యోగాలు సమర్ధంగా చేసే నైపుణ్యాలు చాలా తక్కువని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటి యువతకు అవసరమైనంత నైపుణ్యం సమకూర్చడానికి సర్కారు 2015 జులై 15న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ (ఎనెస్ డీఎం) ఏర్పాటు చేసింది. మంచి శిక్షణ పొందిన, నైపుణ్యమున్న కార్మికుల కొరత దేశంలో తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎనెస్ డీఎం వివరిస్తూ, ‘‘ఇండియాలో ఉద్యోగంలో చేరడానికి ముందు శిక్షణ పొందిన ఉద్యోగలు లేదా కార్మికుల సంఖ్య కేవలం 2.3% మాత్రమే. అదే యూకేలో 68%, జర్మనీలో 75%, అమెరికాలో 52%, జపాన్ లో 80%, దక్షిణ కొరియాలో 96% ఉద్యోగ శిక్షణ పొందినవారే. ఉద్యోగాలిచ్చే సంస్థల యజమానుల అవసరాలకు అనుగుణంగా, దేశ ఆర్థిక ప్రగతిని పెంచడానికి యువత ప్రతిభాపాటవాలు పెంచడానికి తగిన శిక్షణ అవసరం’ అని నొక్కిచెప్పింది. పెరుగుతున్న వస్తుసేవల వినియోగం దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వృద్ధికి అనుగుణంగా వాటి వినియోగం కూడా వాంఛనీయ స్థాయిలో పెరుగుతోంది. బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ రూపొందించిన తన 2023 ఇండస్ వ్యాలీ నివేదిక ప్రకారం దేశంలో అగ్రశ్రేణి వినియోగదారులు 12 కోట్ల మంది ఉన్నారు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.10 లక్షలు. వారిలో రూ.29 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఓ చిన్న సంపన్న శ్రేణి జనాభా రెండున్నర కోట్ల మంది. ద్వితీయ శ్రేణి వినియోగదారుల జనాభా 10 కోట్లు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు. ఈ ఆదాయవర్గాన్నే మధ్య తరగతి అని పిలుస్తారు. ఇక అసలు సిసలు ఇండియాగా పరిగణించే మూడో తరగతి వినియోగదారుల సంఖ్య 120 కోట్లని అంచనా. వారి సగటు వార్షికాదాయం రూ.1.20 లక్షలు. డాలర్–రూపాయి మారకం విలువ, అమెరికాలో వస్తుసేవల ధరలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న భారతీయుడు అమెరికాలో అంతే మొత్తం ఆదాయం (డాలర్లలో 12,00) ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ సరకులు కొనుగోలు చేయగలడని బ్లూమ్ వెంచర్స్ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన 22 కోట్ల జనాభా ఉన్న మొదటి, రెండో అగ్రశ్రేణి వినియోగదారుల కొనుగోలు శక్తి భారత ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించడానికి దోహదం చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భావిస్తోంది. అయితే, 142 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది ఉన్న తక్కువ ఆదాయవర్గం ఆదాయం, కొనుగోలు శక్తీ కూడా అభిలషణీయ స్థాయిలో పెరిగితే భారత ప్రగతి రథం అందరూ కోరుకునే రీతిలో వేగం పుంజుకుంటుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్‌గార్ మేళాలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
భారత్ వృద్ధి మరింత పైకి.. డెలాయిట్ ఇండియా
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 నుంచి 6.3 శాతం వరకూ పురోగమిస్తుందని డెలాయిట్ ఇండియా తన తాజా ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి తీవ్రత తగ్గితే వచ్చే రెండేళ్లలో 7 శాతం వరకూ కూడా వృద్ధి పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ప్రస్తుతం తీవ్ర అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? అర్బన్ డిమాండ్‌సహా దేశీయంగా ఆటోమొబైల్, యూపీఐ లావాదేవీలు, దేశీయ విమాన ప్రకాణాలు, ట్రాక్టర్ అమ్మకాలు, ఐఐపీ నాన్–డ్యూరబుల్ గూడ్స్, ఎంజీఎన్ఆర్ఈజీఏ గణాంకాలు.. పూర్తి సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. (ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?) -
స్థానిక వినియోగమే భారత్‌కు బలం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం చూస్తున్న తరుణంలో, దేశీ వినియోగమే భారత్ ఆర్థిక వ్యవస్థకు సహజ ప్రేరణగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. భారత్ జీడీపీ అధిక శాతం దేశీయ డిమాండ్‌పైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అజయ్ బంగా బుధవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీ20కి సంబంధించిన అంశాలు, ప్రపంచబ్యాంక్, భారత్ మధ్య సహకారంపై ఆర్థిక మంత్రితో చర్చించినట్టు చెప్పారు. ‘‘జీ20లో ఏం చేశామన్నది, అలాగే సమావేశం ఎలా కొనసాగిందన్నది మాట్లాడుకున్నాం. జీ20లో భాగంగా ప్రపంచబ్యాంక్, భారత్ ఇంకా ఏం చేయగలవన్నదీ చర్చించాం. ప్రపంచబ్యాంక్‌కు పోర్ట్‌ఫోలియో పరంగా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ మార్కెట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది’’అని బంగా వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆరంభంలో మరింత క్షీణించేందుకు రిస్క్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుంది’’అని బంగా పేర్కొన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు గాను భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇక్కడకు విచ్చేశారు. గత నెలలోనే ఆయన ప్రపంచబ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత్ పర్యటనకు తొలిసారి విచ్చేశారు. విజ్ఞానం, టెక్నాలజీ అంతరాలను తగ్గించడమనేది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నట్టు బంగా తెలిపారు. -
సంస్కరణల మద్దతుతో దూసుకుపోతున్న భారత్
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలాలతో 2014 నాటికి అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ తెలిపింది. జీఎస్టీ, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక వ్యవస్థపై బెర్న్‌స్టీన్ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో దశాబ్దం అంటూ టైటిల్ పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడి, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, డిజిటైజేషన్, కరోనా సమయంలో తీసుకున్న వివేకవంతమైన చర్యలు, చమురు ధరలు నియంత్రణలో ఉండడం సానుకూలించినట్టు పేర్కొంది. ‘‘కొందరికి అదృష్టం రాత్రికి రాత్రే వరిస్తుంది. కానీ, చాలా మందికి ఎన్నో ఏళ్ల కృషితోనే ఇది సాధ్యపడుతుంది. భారత్ స్టోరీ ఇలాంటిదే. బలమైన పునాది నిర్మాణానికి దశాబ్దానికి పైనే సమయం పట్టినప్పటికీ మరింత నమ్మకమైనదిగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించింది’’ అని ప్రశంసించింది. కొన్ని విభాగాల్లో గొప్ప ఫలితాలు మోదీ నాయకత్వంలో భారత్ కొన్ని విభాగాల్లో అద్భుతమైన పురోగతి సాధించినట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు మెరుగైన విధాన వాతావరణం, మౌలిక రంగంపై వ్యయాలను పెంచడాన్ని ప్రస్తావించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, బలమైన పునాదులు పడ్డాయని, నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు వివరించింది. సానుకూల వృద్ధి చక్రానికి అవసరమైన పునాదులు పడినట్టు చెబుతూ, ఇక్కడి నుంచి దిగువవైపు రిస్క్ లు చాలా పరిమితమని అభిప్రాయపడింది. 5.7 శాతం చొప్పున ‘‘భారత్ జీడీపీ 2014 నుంచి 5.7 శాతం వార్షిక కాంపౌండెడ్ వృద్ధిని చూసింది. కోవిడ్ కాలాన్ని మినహాయించి చూస్తే వృద్ధి 6.7 శాతంగా ఉంటుంది. యూపీఏ హయాంలో ఉన్న 7.6 శాతానికంటే కొంచెం తక్కువ. కాకపోతే అప్పట్లో బేస్ కనిష్టంగా ఉండడం వల్ల అంత వృద్ధి సాధ్యపడింది’’అని బెర్న్‌స్టీన్ తెలిపింది. తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన సంస్థలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా మోదీ సర్కారుకు వచ్చినట్టు గుర్తు చేసింది. మోదీ హయాంలో భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా, తలసరి ఆదాయం విషయంలో 147వ ర్యాంకు నుంచి 127వ ర్యాంకుకు మెరుగుపడినట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా మారినట్టు పేర్కొంది. అంతకుముందు సర్కారు కాలంలో చేసిన తప్పులను సరిచేస్తూ, భారత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మంచి ఫలితాలనిచ్చినట్టు విశ్లేషించిది. డిజిటైజేషన్, అందరికీ ఆర్థిక సేవల విషయంలో భారత్ మంచి పురోగతి సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఖాతాలు కలిగిన వ్యక్తులు 2011 నాటికి 35 శాతంగా ఉంటే, 2021 నాటికి 77 శాతానికి పెరిగారని, జన్‌ధన్ ఖాతాలే 50 కోట్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘పలు పథకాల సబ్సిడీలకు ఆధార్‌ను వినియోగించడం ద్వారా మధ్యవర్తులు, జాప్యాన్ని సర్కారు నివారించింది. యూపీఐ ఎంతో ప్రగతి సాధించింది. ఓఎన్డీసీ ఏర్పాటుకు కావాల్సిన నమ్మకాన్ని కలిగించింది’’అని నివేదిక వెల్లడించింది. వీటిల్లో మెరుగుపడాలి భారత్ కొన్ని అంశాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని బెర్న్‌స్టీన్ నివేదిక అభిప్రాయపడింది. మానవాభివృద్ధి సూచీలో 2016 నుంచి క్షీణిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కాలంలో పాఠశాల సమయం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. మహిళా అక్షరాస్యత విషయంలో పెద్దగా మార్పు లేదని, అవినీతి నిర్మూలనలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. లింగనిష్పత్తి సెకండరీ స్కూల్ స్థాయిలో క్షీణించినట్టు తెలిపింది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్‌తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
రూ.88 వేల కోట్లు మిస్సింగ్! అన్నీ రూ.500 నోట్లు..
భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032.5 కోట్లు గల్లంతయ్యాయి. అన్నీ రూ.500 నోట్లు. ప్రింట్ అయ్యాయి కానీ ఆర్బీఐకి చేరలేదు. ఏమయ్యాయి ఈ నోట్లన్నీ? మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాలు ఈ వ్యత్యాసాన్ని బయటపెట్టాయి. ప్రింట్ అయినవెన్ని.. ఆర్బీఐకి చేరినవెన్ని? దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అవి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్. దేశంలోని ఈ మూడు మింట్‌లూ కొత్తగా డిజైన్ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే. గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్‌లో 2015 ఏప్రిల్ - 2016 మార్చి మధ్య ముద్రితమయ్యాయి. ఆర్టీఐ ప్రకారం.. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ నోట్లు ఆర్బీకి సరఫరా అయ్యాయి. సీఈఐబీ, ఈడీలకు లేఖలు కరెన్సీ నోట్ ప్రెస్‌లలో ప్రింట్ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు మనోరంజన్ రాయ్ లేఖలు కూడా రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యత సాధారణమే అని కొందరు సీనియర్ ఆర్బీఐ అధికారులు సమర్థించినట్లుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
రెండేళ్లలో నాలుగు... ఆరేళ్లలో మూడు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర విధానాలు 2014 నుండి దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి దారితీశాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని అన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆకర్షణీయ ప్రదేశంగా రూపొందిందనీ, ప్రపంచం దేశంపై తన విశ్వాసాన్ని ఉంచుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రస్తుత నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగించాలని వైష్ణవ్ కోరారు. 2014లో మోదీ ప్రభుత్వం అదికారంలోనికి వచ్చినప్పుడు దేశ ఎకానమీ ప్రపంచంలో పదవ స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఇది 5వ స్థానానికి మెరుగుపడిన విషయం తెలిసిందేనన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి కూడా అయిన వైష్ణవ్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► ఆరేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రభుత్వ హయాంలో ఎకానమీ పటిష్టంగా పురోగమిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతోంది. దేశాభివృద్ధే దృఢ సంకల్పంగా పూర్తి సానుకూల వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహణ జరుగుతోంది. ► కేంద్రం చేపట్టిన పలు పథకాలు, విధానాలు ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేశాయి. వారి జీవితాలో నాణ్యతను పెంచాయి. ► దేశ ప్రజల భవిష్యత్తు నేటి భారత్‌లో నిర్మితమవుతోంది. 2047 నాటికి, మీరు అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తారు. మీరు పురోగతి బాటన దేశాన్ని నడిపే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వోటుచేస్తే, భారత్ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. ► ప్రధానమంత్రి నాయకత్వం కొత్త ఆలోచనా విదానాన్ని, దృక్పథాన్ని తీసుకొచ్చింది. దేశాభివృద్ధికి సానుకూలంగా ఆలోచనలను మార్చింది. ► గతంలో పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసేవారు. 2014 నుండి ప్రభుత్వ పథకాలు ప్రజల సాధికారతకు దారితీశాయి. పరివర్తన, గుణాత్మక మార్పులను తీసుకువచ్చాయి. ప్రభుత్వ సేవలు, ఆర్థిక ఫలాలు అట్టడుగు స్థాయికి అందజేసేలా నిరంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం చేసే ప్రతి పైసా పేదల పురోగతికి దోహదపడాలన్నది కేంద్రం లక్ష్యం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్న తీరును ఆయా అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. ► వ్యాక్సిన్లను సకాలంలో పొందడం నుండి (కోవిడ్ సమయంలో), సురక్షితమైన తాగునీటిని అందించడం వరకూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సరసమైన గృహాలను అందించడం నుండి రైలు, విమాన రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వరకు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ దేశంలో వాస్తవ, సానుకూల మార్పును తీసుకువచ్చాయి. సమగ్ర పురోగతికి ఆయా చర్యలు దోహదపడుతున్నాయి. ► నేడు దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు జతయ్యాయి. 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను అందించారు. ► భారత్ నేడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది అవసరమైన వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం తగిన సౌలభ్యత కల్పిస్తోంది. ఈ పథకం మొత్తం కవరేజీ అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువ. ► ఇక దేశీయ మౌలిక సదుపాయాలు కూడా 2014 నుండి చక్కటి పురోగతి రూపాన్ని పొందాయి. గతంలో సరైన ఆలోచనా విధానం లేకపోవడం 2014కు ముందు ఈ రంగం అంతగా పురోగతి చెందలేదు. ► తొమ్మిదేళ్లలో 74 విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014 వరకు ఏర్పాటు చేసిన సంఖ్యకు సమానం. భారతదేశం 2014 వరకు జలమార్గాలు లేని స్థితిలో ఉండేది. ప్రస్తుతం దేశంలో ఈ సంఖ్య 111గా ఉంది. దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోంది. విమానాశ్రయాల మాదిరిగానే ప్రపంచ స్థాయి సౌకర్యాలను రైల్వేల్లో కల్పించడం జరుగుతోంది. ► ఇక దేశంలో డిజిటల్ సాంకేతికత పురోగతి పటిష్టంగా కొనసాగుతోంది. ఇది పేదలకు కొత్త అవకాశాలను తీసుకువచ్చింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య కూడా భారీగా పెరగడం ఇక్కడ గమనించాల్సిన అంశం. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్‌లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవం
డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్ ఛేంజర్‌లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్ పేమెంట్ సిస్టమ్. భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్ నిరూపించింది. భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్‌గా భారత్ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్–ప్రైవేట్ మోడల్ ఇది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్’ త్రయం ఉన్నాయి. అవి: జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి. మొదటి స్తంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి. ఇక రెండో మూలస్తంభం: ఆధార్ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నంబర్‌ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇక మూడో మూలస్తంభం: మొబైల్. ఇది భారతీయ టెలికామ్ రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటు, స్మార్ట్ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్ ప్రామాణీకృత జన్ ధన్ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది. యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్ పేమెంట్ యాప్స్ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. ఫిన్ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్స్’ (పీఓఎస్) వద్ద క్యూఆర్ కోడ్ ప్లేస్మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది. ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్‌గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్‌లో జరిగిన తక్షణ డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలిపారు. దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యా నించారు. డిజిటల్ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ యాప్‌ల వంటి డిజిటల్ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్‌కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది. టీ స్టాల్స్ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్ మెసేజ్‌లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి పేమెంట్‌తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది. ‘కౌంటర్‌పాయింట్’ ప్రకారం, భారత్‌లో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది. ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత, మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ ఛేంజర్‌గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి. – బీఎన్/‘పీఐబీ’ రీసెర్చ్ వింగ్ -
పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవలి పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు. ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ సెమినార్‌ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది. ► తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది. ► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్‌లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి. ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్‌లో దాదా పు అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది. ► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే. 2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్ భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా, వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను క్రిసిల్ తన వార్షిక నివేదిక వెలువరించింది. ఈ సందర్భంగా క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్ ఎఫెక్ట్‌తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు. మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం ► చౌక క్రూడాయిల్ దేశానికి సానుకూలం ► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్ సులువుగా దాటేయగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్‌కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
విధాన లోపం వ్యవస్థకు శాపం
2023 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ జీడీపీ పతనం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమితమైంది. ఈ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం. ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి సంబం ధించి డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి (జీడీపీ) రేటును మాత్రమే సాధించగలిగింది. అంతకు ముందరి త్రైమాసిక వృద్ధి రేటు 6.3 శాతం కంటే ఇది గణనీయమైన పతనం. 2022 ఆర్థిక సంవత్సరం తాలూకూ మూడవ త్రైమాసికంలోని 5.2 శాతం కంటే కూడా ఇది తక్కువ. ఈ జీడీపీ దిగజారుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం. వృద్ధి రేటును లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశా లుగా వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ వినియోగం లేదా వ్యయాలు, పెట్టుబడులు, నికర ఎగుమతులు ఉంటాయి. వీటిలో వ్యక్తిగత విని యోగానిది అతిపెద్ద వాటా. అది దేశీయ జీడీపీలో 55 నుంచి 60 శాతం మేరకు వాటాని కలిగి ఉంటుంది. కాగా, ఇది ప్రస్తుతం అంతకు ముందరి మూడవ త్రైమాసికంలోని వృద్ధి రేటుతో పోలిస్తే కేవలం 2.1 శాతం మాత్రమే ఎదుగుదలను చూపింది. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు పతనం వెనుక వ్యక్తిగత వినియోగ పతనం ఉందన్నది గమనించాల్సిన అంశం. ఈ వ్యక్తిగత వినియోగం తగ్గటం వెనుక అసమానతలతో కూడిన ఆర్థిక అభివృద్ధి ఉంది. దీనినే మనం ఆంగ్లాక్షరం ‘కే’ పై గీత, కింది గీతలతో పోలుస్తున్నాం. పై గీతను పోలిన ధనవంతులు మరింతగా ధనవంతులవుతుండగా, కింది గీతను పోలిన సామాన్య జనం మరింత కిందికి దిగజారుతున్నారు. ఈ అసమానతల అభివృద్ధికి వక్కాణింపుగా – ఇండియా రేటింగ్స్ సంస్థ ఆర్థిక వేత్త సునీల్ కుమార్ సిన్హా మాటలను చెప్పుకోవచ్చు: ‘ప్రస్తుత వినియోగ డిమాండ్ అనేది ప్రధానంగా ఉన్నత ఆర్థిక వర్గాలు వినియోగించే సరుకులు, సేవల నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం దేశంలోని ప్రజల వ్యక్తిగత వినియోగంలో సింహభాగం – ఉన్నత ఆదాయ వర్గాల నుంచే వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే – మెజారిటీ జన సామాన్యం కొనుగోళ్లు బల హీనంగా ఉన్నాయి.›ఫలితంగా అంతిమ లెక్కింపులో దేశంలో వ్యక్తిగత వినియోగం బలహీనపడుతోంది’. కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలో ప్రజల వినియోగం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తొలి దశలో ఈ వ్యక్తిగత వినియోగం పెద్దగంతులో పెరిగింది. కోవిడ్, లాక్ డౌన్ల కాలంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొను గోళ్లను వాయిదా వేసి ఉంచడం... కోవిడ్ బెడద తగ్గగానే ఒక్కసారిగా కొనుగోళ్లు చేయడం ఈ పెద్దగంతు వినియోగ పెరుగుదలకు కారణం. ఒక మారు ఈ తరహా కొనుగోళ్లు పూర్తయి పోగానే, మరలా వినియోగం తగ్గుముఖం పట్టసాగింది. కోవిడ్ అనంతర కాలంలో కూడా జఠిలంగానే మిగిలి పోయిన నిరుద్యోగం, పడిపోతున్న దేశీయ ఎగుమతులు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలన్నీ కల గలిసి ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. కోవిడ్, లాక్డౌన్లు, అనంతరం కూడా సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యారు. బంగారాన్ని తనఖా పెట్టడం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల పొదుపు స్థాయి దారుణంగా పడి పోయింది. కొత్తగా అప్పులు చేయగల స్థితి కూడా లేకుండా పోయింది. జీడీపీ పతనం కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమి తమైంది. అంటే, భారతదేశంలో జీడీపి వృద్ధి, మిగత ప్రపంచం తాలూకూ సమస్యలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అత్యధి కంగా ఉంటుందనే కట్టుకథను ఇది వట్టిదిగా కొట్టేసింది. పైన పేర్కొన్న దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆయా దేశాలలో ఆర్థిక అసమానతలు అత్యంత తీవ్రస్థాయిలో ఉండడం. భారత్ సహా దరిదాపు ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ఉదాహరణకు, అంత ర్జాతీయ కార్మిక సమాఖ్య గణాంకాల ప్రకారం 2008–11 కాలంలో మన దేశంలో నిజ వేతనాల పెరుగుదల 1 శాతం ప్రతికూల దిశగా ఉన్నది. అదే కాలంలో దేశంలో కార్మిక ఉత్పాదకత 7.6 శాతం పెరిగింది. పెరిగిన సంపద తాలూకు ప్రయోజనం కార్మికులు, ఉద్యోగు లకు దక్కక పోగా, వారికి అప్పటికే ఉన్న ఆర్థిక స్థితి దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది ఈ వేతనాల పతనమే. 2018 నాటి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తాలూకు ప్రపంచ వేతనాల నివేదిక కూడా ఈ అంశాన్నే చెబుతోంది. ఒక్క చైనా మినహా 2017లో ప్రపంచ వ్యాప్తంగా వేతనాల పెరుగుదల వార్షికంగా కేవలం 1.1 శాతం. జపాన్‌లో దశాబ్దాల కాలంపాటు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోయి ఉన్నాయి. మొత్తంగా జీ 20 దేశాల్లో 2017లో నిజ వేతనాల వృద్ధి కేవలం 0.4 శాతం. చైనాలో 2015 నాటికే సరుకు ఉత్పత్తి రంగంలోని కార్మికుల 1 గంట కాలపు వేతనాలు, అప్పటికే అధిక ఆదాయ దేశాలుగా ఉన్న గ్రీస్, పోర్చుగల్‌తో సమానంగా ఉన్నాయి. దాని వలన అక్కడ యావన్మంది ప్రజల కొనుగోలు శక్తి తగినస్థాయిలో ఉంది. ఫలితంగానే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం తన దేశీయ ఎగుమతులు కొంత మేర తగ్గినా, స్వయంగా తన దేశంలోనే పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి ద్వారా, ఆర్థిక వృద్ధిని కొనసాగించగలిగింది. ప్రస్తుతం తన జీరో కోవిడ్ పాలసీ, నిర్మాణ రంగం పట్ల కఠిన వైఖరి తరువాత కూడా చైనాలో కర్మాగారాల ఉత్పత్తి రికార్డు స్థాయిని అందుకుంది. దీనంతటికీ కారణం, కొనుగోలు శక్తి ప్రజానీకం అంతటిలోనూ విస్తారంగా పెరిగి ఉండడమే. మన దేశంలో నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాలు పొదుపు చర్యల రూపంలో ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పొదుపు చర్యల వల్ల ప్రతీ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలపై కోతలు పడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ విధానాలపై కోతలు పడడం చూశాం. ఈ పొదుపు చర్యలలో భాగంగానే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయింది. 2022లోనే దీనిలో 8.8 శాతం తగ్గుదల నమోదైంది. దీనంతటి ఫలితంగా ప్రజల ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి వేగంగా పడిపోతున్నాయి. దశాబ్దాల కాలం ప్రజల పన్నుల డబ్బు, శ్రమలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేగంగా ప్రైవేటు పరం అవుతుండడం... దేశంలోని రోడ్లు, రైలు మార్గాలు, స్టేడియాలు ఇత్యాది సమస్త మౌలిక సదు పాయాల వ్యవస్థలూ నగదీకరణ పేరిట ప్రైవేట్ పరం అవుతుండడంతో – ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే పేరిట (ద్రవ్యలోటు తగ్గింపు కోసం) నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ వంటి పన్ను భారాలను మోపడం ప్రజల కొనుగోలు శక్తి పాలిట అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా, మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గం – ఇప్పటి వరకూ జరిగినట్లుగా కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తూ పోయి, జన సామాన్యంపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసు కోవడం కాదు. సంపదలో సాధ్యమైనంతగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలకు తగిన వాటాను కల్పించడం! ప్రస్తుత వృద్ధి రేటు పతనం, దానికి మూలంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటి వాటిని పరిష్కరించలేని పక్షంలో మున్ముందు దేశ ఆర్థిక సమస్యలు మరింత జఠిలం కాగలవు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
అభివృద్ధిలో ‘బ్లూ ఎకానమీ’ కీలకపాత్ర
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది. బ్లూ ఎకనమీ అంటే.. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్ఏఐ20 అధ్యయనం చేస్తుంది. -
3.7 ట్రిలియన్ల ఎకానమీగా భారత్: ఆర్బీఐ
ముంబై: భారత్ 2023లో 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్బీఐ ప్రచురించిన జనవరి బులిటన్ పేర్కొంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది. -
ఎకానమీ శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశాజనక పరిస్థితిని సృష్టించాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించి సూచీ– ఐఐపీ 2022 నవంబర్‌లో (2021 నవంబర్‌తో పోల్చి) ఐదు నెలల గరిష్ట స్థాయి 7.1 శాతంగా నమోదయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ సూచీ వరుసగా రెండవనెల ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువన 5.72 శాతంగా నమోదయ్యింది. 2022 అక్టోబర్‌లో ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం ఈ గణాంకాల ముఖ్యాంశాలు... కీలక రంగాల పురోగతి ► తయారీ: సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్‌లో 6.1 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో 9.7 శాతం పురోగతి ఉంది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి వృద్ధి భారీగా 12.7 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉ త్పత్తి, డిమాండ్‌ను సూచించే ఈ విభాగం ఏకంగా 20.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► డ్యూరబుల్స్: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ఉత్పత్తికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 5.1 శాతం వృద్ధి నమోదుకాగా, సబ్సులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎఫ్ఎంసీజీ విభాగానికి సంబంధించిన కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా, నిర్మాణం: వృద్ధి 12.8 శాతంగా నమోదయ్యింది. ► తొమ్మిది నెలల్లో..: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంది. తగ్గిన ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ తగ్గడం మొత్త రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా, 2022 అక్టోబర్ వరకూ వరుసగా 10 నెలలు ఆ పైన కొనసాగింది. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, మరుసటి నెల డిసెంబర్లో మరింత తగ్గి 5.72 శాతానికి (2021 డిసెంబర్‌తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చే అంశం. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ నవంబర్‌లో 4.67 శాతం ఉండగా, డిసెంబర్లో మరింత తగ్గి 4.19 శాతానికి చేరింది. కూరగాయల ధరల స్పీడ్ వార్షికంగా 15 శాతానికి పైగా పడిపోయింది. పండ్ల ధరల స్పీడ్ 2 శాతంగా ఉంది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం 20 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 14 శాతం ఎగశాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల రేటు 11 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా 2022 మే తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోన 2.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి చేరింది. కొన్ని కమోడిటీల ఎగుమతుల నిషేధంసహా ధరల కట్టడికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. -
Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?
2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్‌లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?) పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. – డాక్టర్ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
కష్ట కాలంలోనూ భారత్ ఎకానమీ దూకుడు
న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది. ► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోంది. ► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అంచనా వేసింది. అధిక వడ్డీ ప్రభావం భారత్ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆయా ప్రతికూలతలను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోంది. ► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. -
క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటున్న ఎకానమీ
ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడగలుగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకుగాను తగిన చర్యలు తీసుకోవడానికి నియంత్రణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. 26వ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) నివేదికలో ఆయన ఈ మేరకు ముందుమాట రాశారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటంటే.. ► అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లలో ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాల కారణంగా ఆర్థిక మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. ఆహారం, ఇంధన సరఫరాలు ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశా లు, ఎకానమీలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ప్ర తి ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లతో పోరాడుతోంది. ► ఇటువంటి ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఎకానమీ స్థిర ఆర్థిక ముఖచిత్రాన్ని కలిగిఉంది. దేశీయ ఆర్థిక మార్కెట్లు స్థిరంగా, పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ తగిన మూలధనంతో పటిష్టంగా ఉంది. ఫారెక్స్ నిల్వలు, కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం), వాణిజ్యలోటు వంటి అంతర్జాతీయ ఆర్థిక అంశాల విషయంలో దేశానికి పూర్తి సానుకూల పరిస్థితి ఉంది. ► కొన్ని సవాళ్లను చెప్పుకోవాలంటే అందులో వాతావరణ మార్పులు–నిర్వహణ ఒకటి. అలాగే ఊహించని సవాళ్లు ఎదురయినప్పుడు వాటిని ఎదుర్కొనడం, ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టత, ఫైనాన్షియల్ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు, అందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూడ్డం వంటి అంశాలపై మరింత దృష్టి అవసరం. రెగ్యులేటర్లు, విధాన నిర్ణేతల ప్రాధాన్యత ఆయా అంశాలపై కొనసాగుతుంది. ► ఇక ద్రవ్యోల్బణం కట్టడికి తగిన అన్ని చర్యలనూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుంది. ఈ విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ► భారతీయ ఆర్థిక వ్యవస్థ తన పటిష్ట స్థూల ఆర్థిక మూలాధారాల నుండి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ప్రపంచ పరిణామాలను ఎదుర్కొనడంపై ఆర్బీఐ నిరంతరం దృష్టి సారిస్తుంది. ► రిజర్వ్ బ్యాంక్‌తో పాటు ఇతర ఆర్థిక నియంత్రణ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ అత్యున్నత స్థాయి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తాయి. అవసరమైనప్పుడు తగిన జోక్యాల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, పటిష్టతను పరిరక్షించడానికి, సంసిద్ధతతో ఉన్నాయి. ► 2023లో భారతదేశం జీ20 దేశాల ప్రెసిడెన్సీలో భాగంగా ప్రపంచ వేదికపై ప్రముఖ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఒక సమూహంగా జీ20 దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు.. ప్రపంచ సర్వతోముఖాభివృద్ధికి తగిన నిర్ణయాలను సమిష్టిగా తీసుకోవడం. ► ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లను పరిష్కరించడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో కరెన్సీ విషయంలో అన్ని స్థాయిల్లో ఏకాభిప్రాయ సాధన చాలా ముఖ్యం. ఈ విషయంలో తగిన ప్రయ త్నాలు జరగాలి. బ్యాంకింగ్ రంగం పటిష్టం... భారత్ బ్యాంకింగ్ రంగం తగిప మూలధనంతో పటిష్టంగా ఉందని 26వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక పేర్కొంది. భారత్ బ్యాంకింగ్ స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) సెప్టెంబర్ 2022 నాటికి ఏడేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి తగ్గాయని తెలిపింది. నివేదిక ప్రకారం, 017–18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరిన స్థూల మొండిబకాయిలు అటు తర్వాత క్రమంగా దిగివచ్చాయి. 2022 మా ర్చిలో ఇది 5.8 శాతానికి తగ్గింది. చెల్లింపుల్లో వైఫల్యాలు తగ్గడం, రికవరీలు మెరుగుపడ్డం, బకా యిల మాఫీ వంటి అంశాలు స్థూల మొండిబకా యిలు తగ్గడానికి కారణం. ప్రస్తుతం బ్యాంకింగ్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతోంది. రుణ నాణ్య త పెరిగింది. మూలధన నిల్వలు పటిష్టంగా ఉన్నా యి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. క్యూ2లో క్యాడ్ తీవ్రత కాగా, భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) జూలై–సెప్టెంబర్ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.4 శాతంగా నమోదయ్యిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల ప్రకారం, విలువలో ఇది 36.4 బిలియన్ డాలర్లు. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) క్యాడ్ అప్పటి జీడీపీ విలువలో 2.2 శాతం ఉంటే, విలువలో 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) క్యూ2లో జీడీపీలో క్యాడ్ 1.3 శాతం అయితే, విలువలో 9.7 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్)మధ్య క్యాడ్ 3.3 శాతంకాగా (జీడీపీ)లో 2021–22 ఇదే కాలంలో కేవలం 0.2 శాతంగా ఉంది. ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా పెరగడం క్యాడ్ తీవ్రతకు దారిస్తోందని గణాంకాలు వెల్లడించాయి. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో నిధులు క్రమంగా పెరుగుతున్నందున, క్యాడ్‌ను భారత్ సమర్థవంతంగా నిర్వహించగలిగిన స్థితిలోనే ఉందని ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే సరికి భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే క్యూ2లో భారీగా క్యాడ్ నమోదుకావడం తాజా ఆందోళనకు కారణం అవుతోంది. కరోనా తీవ్రత, ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. కాగా, 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్‌లుక్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
భవిష్యత్ భారత్‌దే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానున్న భారతదేశానిదే భవిష్యత్ అని, మరో ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన వర్చువల్ విధానంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి నైపుణ్యం కలిగిన విద్యార్థుల భాగస్వామ్యం అవసరమన్నారు. నైపుణ్య విద్యను అందించడంలో సెంచూరియన్ వర్సిటీ ముందుందని ప్రశంసించారు. సెంచూరియన్ చాన్సలర్ డాక్టర్ దేవీప్రసన్న పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సేవ్లానాయక్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. సెంచూరియన్ అధ్యక్షుడు డాక్టర్ ముక్తికాంత్ మిశ్రా, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డి.ఎన్.రావు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు, ఒడిశా క్యాంపస్ వైస్ చాన్సలర్ డాక్టర్ సుప్రియా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్‌కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
భారత్ వృద్ధిరేటు అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ► క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ► మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ► అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ► భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కోసం ఎంఎస్ఎంఈని ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: ఆహార ప్రాసెసింగ్ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు కీలకమని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం అవశ్యమని ఉద్ఘాటించారు. పారిశ్రామిక వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించన ఒక కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించడానికి సూక్ష్మ లఘు చిన్న మధ్య (ఎంఎస్ఎంఈ) రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల ఆదాయ పురోగతికే కాకుండా, పోషకాహార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ దిశలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దేశంలో క్రమంగా పురోగతి చెందుతోందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పురోగతికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి అనుసంధానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విభాగం నుంచి భారఎగుమతులు లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫుడ్ వేస్టేజ్‌ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాసెసింగ్ కీలక భూమికను పోషిస్తుందని అన్నారు. -
CMIE: నవంబర్‌లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్‌లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్‌గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి.