ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్షలు తీవ్రంగా మండిపడిపడుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఆమె పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అస్థిరత, ద్వేషం సృష్టించడానికి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ‘‘మూడోసారి (2024 లోక్‌సభ ఎన్నికలు) కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావటంతో ఆ పార్టీ, టూల్‌కిట్ గ్యాంగ్ భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో ద్వేషాన్ని పెంచాలని భావిస్తోంది. నేడు భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండటం మేము పట్ల గర్వపడుతున్నాం. చిన్నమొత్తాల పెట్టుబడిదారులకు సల్యూట్ చేస్తున్నా. పెట్టుబడిదారులకు టూల్‌కిట్, హిండెన్‌బర్గ్ నివేదికలపై నమ్మకం లేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment