భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్ | Piyush Goyal Strengthens India Economic Ties With Korea and Myanmar | Sakshi
Sakshi News home page

భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్

Published Sat, Sep 21 2024 2:57 PM | Last Updated on Sat, Sep 21 2024 4:34 PM

Piyush Goyal Strengthens India Economic Ties With Korea and Myanmar

లావోస్‌లోని వియంటైన్‌లో జరిగిన 12వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' దక్షిణ కొరియా.. మయన్మార్‌ దేశాల సహచరులతో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిని పెంచడానికి పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం గురించి ఈ సమావేశంలో చర్చించారు.

కొరియా వాణిజ్య, పరిశ్రమల, ఇంధన మంత్రి 'ఇంక్యో చియోంగ్‌'తో చర్చలు జరిపిన విషయాన్ని మంత్రి పీయూష్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. ఫోటోలను కూడా షేర్ చేశారు. భారత్ - కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!

భారతదేశంలో దక్షిణ కొరియా పెట్టుబడులు ఉపాధి.. పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ కొరియాతో మాత్రమే కాకుండా.. మయన్మార్ విదేశీ ఆర్థిక సంబంధాల మంత్రి డాక్టర్ 'కాన్ జా'తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే మార్గాలను గురించి పీయూష్ గోయల్ చర్చించారు. మొత్తం మీద ఇప్పుడు జరిగిన చర్చలు దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతాయని పలువురు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement