భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఇండియన్ మార్కెట్లో 110 సీసీ బైకులు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఈ స్థానంలో 125 సీసీ.. 200 సీసీ బైకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కమ్యూటర్ బైకుల గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్
రూ. 95000 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే 'హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్' అనేది ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బైక్. 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 11.4 Bhp పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఎల్ఈడీ ఇండికేటర్స్, లేటెస్ట్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.
టీవీఎస్ రైడర్ 125
టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన 'రైడర్ 125' బైక్ కేవలం రెండున్నర సంవత్సరాల్లో 7,00,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125
సీఎన్‌జీ బైక్ విభాగంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి బైక్.. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది పెట్రోల్ అండ్ సీఎన్‌జీ ట్యాంక్స్ కలిగి 330 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8000 rpm వద్ద 9.37 Bhp పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హోండా హార్నెట్ 2.0
రూ. 1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. 184.4 సీసీ ఇంజిన్ కలిగిన హార్నెట్ 2.0 బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 17 బ్రేక్ హార్స్ పవర్, 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
బజాజ్ పల్సర్ ఎన్160
అతి తక్కువ కాలంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైకులలో ఒకటి బజాజ్ పల్సర్. ఇది ప్రస్తుతం మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ పల్సర్ ఎన్160. దీని ప్రారంభ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 17.7 Bhp పవర్, 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment