top 5
-
ఎక్కువ స్టోరేజ్.. ఉత్తమ ఫీచర్స్: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..
ఇండియన్ మార్కెట్లో.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్, మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న స్కూటర్లను మాత్రమే కాకుండా, అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.ఏథర్ రిజ్టా (Ather Rizta)ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ రిజ్టా ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.47 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. ఇందులో ఒక ఫుల్ హెల్మెట్, ఇతర వస్తువులను ఉంచవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.రివర్ ఇండీ (River Indie)ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఏకంగా 43 లీటర్లు. కాబట్టి రెండు హెల్మెట్స్ సులభంగా ఉంచవచ్చు. ఇది కాకుండా అదనపు బాక్సులను అటాచ్ చేయడానికి రెండు వైపులా అల్లాయ్ పన్నీర్ మౌంట్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 1.43 లక్షలు.బజాజ్ చేతక్ (Bajaj Chetak)35 లీటర్ల అండర్ సీట్ కలిగిన ఈ బజాజ్ చేతక్ కూడా.. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఎక్కువ స్టోరేజ్ కోసం కంపెనీ బ్యాటరీని ఫ్లోర్‌బోర్డ్‌లో ఫిక్స్ చేసింది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 (Ola S1 Pro Plus Gen 3)ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్టోరేజ్ కెపాసిటీ ఇతర ఓలా స్కూటర్ల కంటే ఎక్కువ అందిస్తుంది. దీని ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 32 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..
ఇండియన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ రేటున్న మొబైల్స్ ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ కథనంలో రూ. 10వేలు ధర వద్ద అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూసేద్దాం.మోటో జీ45 5జీ (Moto G45 5G)మార్కెట్లో సరసమైన మొబైల్ ఫోన్ల జాబితాలో మోటో కంపెనీకిని చెందిన 'జీ45 5జీ' ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 4 జీబీ. 8 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఎందుకుని వేరియంట్‌ను బట్టి ధరలు మారుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.45 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ (Infinix Hot 50 5G)ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ అనేది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పొందుతుంది. ఇది 4జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 5,000 mAh బ్యాటరీ కలిగి 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.9,499.రియల్మీ సీ63 (Realme C63)రియల్మీ సీ63 ధర రూ. 8,999 మాత్రమే. ఇది 6.67 ఇంచెస్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, 120 Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్ వంటివి పొందుతుంది. ఈ మొబైల్ 64 జీబీ, 128 జీబీ ర్యామ్ ఆప్షన్ పొందుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఇదీ చదవండి: సరికొత్త స్మార్ట్ గ్లాస్: చూడటానికే కాదు.. వినడానికి కూడా!వివో టీ3 లైట్ (Vivo T3 Lite)తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లలో.. వివో టీ3 లైట్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 6.65 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 840 నిట్స్ బ్రైట్నెస్ పొందుతుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 మిమీ జాక్ కూడా పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.రెడ్మీ 13 సీ 5జీ (Redmi 13C 5G)మార్కెట్లో 'రెడ్మీ 13 సీ 5జీ' ధర రూ. 7,199. ఇది 6.74 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను 600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్.. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ద్వారా శక్తిని పొందే ఈ ఫోన్ 8 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, మరొక 2 మెగా పిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ వంటి వాటి కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.Note: మొబైల్ ధరలు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, ర్యామ్ వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం కనిపించే అవకాశం ఉంటుంది. -
5 ఐటీ కంపెనీలు.. 3 నెలలు.. 2587 మంది టెకీలు..
దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.మార్చి త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్ఇలాంటి ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్‌ఫోర్స్ జోడింపులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వరుసగా రెండవ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ఐటీ పరిశ్రమ దూకుడుగా నియామకాలు చేపట్టిందని, ఫలితంగా వర్క్‌ఫోర్స్ అధికంగా పోగుపడిందని ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్-శామ్యూల్ చెబుతున్నారు. కంపెనీలు నియామకాలను తగ్గించడం, రీబ్యాలెన్స్ కోసం అట్రిషన్‌ను అనుమతించడం వలన ఉత్పాదకత లాభాలు కొంత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రాబడి వృద్ధి ఇకపై కేవలం హెడ్‌కౌంట్‌ను పెంచడంపై ఆధారపడి ఉండదని, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో అధిక బిల్లింగ్ రేట్లను పెంచుతుందని హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో పేర్కొన్నారు.అమెరికా ఐటీలో అనిశ్చితిఅమెరికాలో వచ్చిన కొత్త పరిపాలనలో హెచ్ వన్ బీ (H1B) వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలతో సహా ఇమ్మిగ్రేషన్ విధానాలు మారవచ్చు కాబట్టి యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నిపుణులు యూరప్ వంటి దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. అనిశ్చితి ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. -
తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్
చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ తరహా వాహనాలను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ కథనాల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే.. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)యమహా కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'రే జెడ్ఆర్ 125' రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 87,800 (ఎక్స్ షోరూమ్). 52 కిమీ / లీ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.2 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది.సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)రూ. 96,800 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న.. సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఒక లీటరుకు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఏకంగా 5.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)యమహా ఫాసినో 125 ధర రూ. 83000 నుంచి రూ. 97500 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆరు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ 49 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 125 సీసీ ఇంజిన్ 6500 rpm వద్ద 8.2 పీఎస్ పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే స్కూటర్లలో ఇది కూడా ఒకటి.హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ. 70,500 నుంచి రూ. 74,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 4.8 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. 110 సీసీ ఇంజిన్ ద్వారా ఇది 8.15 పీఎస్ పవర్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. రైడర్లకు కావలసిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి అవెనిస్ 125 ఒకటి. ఇది 49.6 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 94,500 నుంచి రూ. 95,300 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. -
భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!
మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.టీవీఎస్ రోనిన్ (TVS Ronin)చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇదిరాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.మోటరోలా ఎడ్జ్ 50 నియోమోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.వన్‌ప్లస్ నార్డ్ 4వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4వన్‌ప్లస్ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది.పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది. -
ఐదు బెస్ట్ కార్లు: తక్కువ ధర & ఎక్కువ సేఫ్టీ!
ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.మారుతి స్విఫ్ట్ (Maruti Swift)మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్‌క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.సిట్రోయెన్ సీ3 (Citroen C3)రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి. -
ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.హోండా షైన్ (Honda Shine)రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.బజాజ్ ప్లాటినా (Bajaj Platina)సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదేయమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)యమహా కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.ఎంజీ హెక్టర్ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.ఎంజీ విండ్సర్ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.హోండా సిటీరూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.రెనాల్ట్ కైగర్మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. -
సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!
భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.యమహా ఎంటీ-15యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.కేటీఎం 125 డ్యూక్యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్200రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు, తమ కార్లను సీఎన్జీ విభాగంలో లాంచ్ చేశాయి. ఈ కథనంలో రూ.8 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.టాటా పంచ్అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిన టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ విభాగంలో.. ఓ సరసమైన కారుగా లభిస్తోంది. ఇది ప్యూర్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.22 లక్షలు, రూ. 7.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఫ్యూయెల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో సీఎన్జీ బ్యాడ్జెస్ చూడవచ్చు.టాటా పంచ్ సీఎన్జీ కారులో 3.5 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫోర్ స్పీకర్ ఆడియో సెటప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ సీఎన్జీ కారు 6000 rpm వద్ద 72.4 Bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ కారు ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ (రూ. 5.92) వేరియంట్ ప్రారంభ ధర కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది 68 బీహెచ్పీ పవర్, 95.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ 6000 rpm వద్ద 72.4 Bhp, 3500 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.హ్యుందాయ్ ఆరాహ్యుందాయ్ ఆరా సీఎన్జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇందులోని ఇంజిన్ 68 Bhp, 95.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రియర్ సీటు హెడ్రెస్ట్ వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి సెలెరియోమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.73 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 5300 rpm వద్ద 55.9 Bhp పవర్.. 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు
మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఫ్రీడమ్ 125'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ ప్లాటినా 110రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు. -
భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలు
ఒకప్పటి నుంచి భారతదేశంలో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాయు కాలుష్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్గార ప్రమాణాలు కఠినంగా మారాయి. దీంతో కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేసాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.10 లక్షల లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన డీజిల్ కారు. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 Bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోరూ. 9.79 లక్షల ధర మధ్య లభించే మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' (బిఎస్4 మోడల్) మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ కారు. దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.కియా సోనెట్కియా సోనెట్ అనేది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 Bhp పవర్, 253 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో.. చూడటానికి కొంత బొలెరో మాదిరిగానే అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలుమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ కూడా మన జాబితాలో ఒకటి. రూ. 9.98 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 115 Bhp పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్
ఎస్‌యూవీలు, ఎంపీవీలు, సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశీయ విఫణిలో ఉన్న కార్ మోడల్స్ కోకొల్లలు. మార్కెట్లో ఎన్నెన్ని కార్లున్నా బడ్జెట్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బడ్జెట్ కార్ల విభాగంలో కూడా లెక్కకు మించిన కార్లు ఉండటం వల్ల.. ఇందులో బెస్ట్ కార్లు ఏవి అనేది కొందరికి అంతుచిక్కని ప్రశ్న. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో 800భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న, ఎక్కువ మంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందిన కార్లలో 'మారుతి సుజుకి ఆల్టో 800' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ.3.25 లక్షల నుంచి రూ.5.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. పనితీరు ఉత్తమంగానే ఉంటుంది.మారుతి సుజుకి స్విఫ్ట్మారుతి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. మంచి పర్ఫామెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైల్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ స్విచ్, మల్టీ-కలర్ ఇన్ఫర్మేషన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఎన్ని ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పాపులర్ బడ్జెట్ కారు. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అప్డేటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది రీడిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ గ్రిల్ వంటివి పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా టియాగోదేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా సరసమైన ధర వద్ద లభించే కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి టియాగో. 2016లో పరిచయమైన ఈ కారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 242 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీటు, రియర్‌వ్యూ కెమెరా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర రూ.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలుమారుతి సుజుకి వ్యాగన్ ఆర్రూ.5.41 లక్షల నుంచి రూ.7.12 లక్షల మధ్య లభించే 'మారుతి సుజుకి వ్యాగన్ ఆర్' మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. 2400 మిమీ వీల్‌బేస్ కలిగి ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ కారు పెద్ద క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ పొందిన క్యాబిన్‌లోని డ్యాష్‌బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారైంది. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. -
ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
భారతదేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్లో.. ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. తక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.బ్రిస్క్ ఈవీ ఆరిజన్ ప్రో: హైదరాబాద్‌కు చెందిన బ్రిస్క్ ఈవీ కంపెనీ మార్చి 2023లో ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసింది. ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 333 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల ధర మధ్య లభించే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ.రివోట్ ఎన్ఎక్స్100: భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో మరొకటి రివోట్ ఎన్ఎక్స్100. ఈ స్కూటర్ టాప్ వేరియంట్.. ఒక సింగిల్ చార్జితో 300 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 110 కిమీ/గం టాప్ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ. 1,59,000 (ఎక్స్ షోరూమ్).సింపుల్ వన్: బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. రూ. 1.54 లక్షల ధర వద్ద లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిమీ. ఇది కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 ప్రో జెన్ 2: దేశీయ టూ వీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ఎస్1 ప్రో జెన్ కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.1,47,499 ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ.ఇదీ చదవండి: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో అత్యుత్తమ కార్లు ఇవే..హీరో విడా వీ1 ప్రో: సింగిల్ చార్జితో 165 కిమీ రేంజ్ అందించే హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిమీ. ఇందులో 3.94 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కూడా దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది. -
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో అత్యుత్తమ కార్లు ఇవే..
వెహికల్ అంటే.. ఒక్క మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా అని వాహన ప్రియులు తెలుసుకున్నారు. కాబట్టి చాలామంది కార్ల కొనుగోలుదారులు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ కథనంలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ వెర్నాగత ఏడాది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ వెర్నా.. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. వెర్నా అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 28.18 పాయింట్లు, కిడ్స్ సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్ల స్కోర్ సాధించి.. మొత్తం మీద 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.రెండు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన హ్యుందాయ్ వెర్నా.. మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏడీఏఎస్ ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 17.42 లక్షల వరకు ఉంది.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్గ్లోబల్ ఎన్సీఏపీ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మరో కారు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్. ఇది పిల్లల సేఫ్టీలో 49కి గానూ 42 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 34కి గానూ 29.71 పాయింట్లు స్కోర్ సాధించింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హై-స్పీడ్ వార్ణింగ్, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ఈ కారు ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 19.41 లక్షల మధ్య ఉన్నాయి.టాటా నెక్సాన్సేఫ్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కార్లు. కంపెనీ కారైన నెక్సాన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటి. ఇది కిడ్స్ సేఫ్టీలో 44.52 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 32.22 పాయింట్లు సాధించి.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కారుగా నిలిచింది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లను కలిగి ఉన్న ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను టాటా నెక్సాన్ కారులో చూడవచ్చు. నెక్సాన్ ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉన్నాయి.టాటా హారియర్టాటా కంపెనీకి చెందిన సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది మరో కారు హారియర్. ఇది పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు, పెద్దల రక్షణలో 34కు 33.05 పాయింట్ల స్కోర్ సాధించింది. రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న హారియర్.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ధరతో లభించే మహీంద్రా స్కార్పియో గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ సాధించిన అత్యుత్తమ కార్లలో ఒకటి. ఇది అడల్ట్ సేఫ్టీలో 34కు 29.25 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 49కు 28.93 పాయింట్లు సాధించి సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.మహీంద్రా స్కార్పియో ఎన్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఇతర కార్లు➤స్కోడా స్లావియా➤టాటా సఫారి➤స్కోడా కుషాక్➤ఫోక్స్‌వ్యాగన్ టైగన్➤టాటా పంచ్➤మహీంద్రా ఎక్స్‌యూవీ300➤టాటా ఆల్ట్రోజ్➤టాటా నెక్సాన్➤మహీంద్రా ఎక్స్‌యూవీ700 -
బడ్జెట్ ధరలో బెస్ట్ స్కూటర్లు: గొప్ప మైలేజ్ కూడా..
ప్రపంచంలో అతిపెద్ద టూ వీలర్స్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో.. ఎప్పటికప్పుడు సరికొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని కొత్త టూ వీలర్స్ లాంచ్ అయినా.. ప్రజలు మాత్రం ఎక్కువగా కొన్ని స్కూటర్లను మాత్రమే ఎంపిక చేసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ దీపావళికి ఓ మంచి స్కూటర్ కొనాలనుకునే వారికి కూడా అలాంటివి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.హోండా యాక్టివాభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా అగ్రగామి అనే చెప్పాలి. ఇది ఇప్పటికే మూడు కోట్లు కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. ప్రస్తుతం యాక్టివా 125, యాక్టివా 6జీ వంటి రూపాల్లో అందుబాటులో ఉంది.యాక్టివా 125 ధర రూ. 84,085 నుంచి రూ. 92,257 మధ్య ఉంది. ఇది 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 51.23 కిమీ మైలేజ్ అందిస్తుంది. యాక్టివా 6జీ విషయానికి వస్తే.. దీని ధర రూ. 79624 నుంచి రూ. 84624 మధ్య ఉంది (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 59.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ జుపీటర్హోండా యాక్టివా తరువాత అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ టీవీఎస్ జుపీటర్. ఇది జుపీటర్ 110, జుపీటర్ 125 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.జుపీటర్ 110 ధర రూ. 77,400 నుంచి రూ. 90,150 మధ్య ఉంది. ఇది 113.3 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి 62 కిమీ మైలేజ్ అందిస్తుంది. జుపీటర్ 125 విషయానికి వస్తే.. దీని ధర రూ. 89,155 నుంచి రూ. 99,805 మధ్య ఉంది. ఇది 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 57.27 కిమీ మైలేజ్ అందిస్తుంది.హోండా డియోఎక్కువ మంది ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో హోండా డియో కూడా ఒకటి. రూ. 75630 నుంచి రూ. 82580 మధ్య ధరతో (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.సుజుకి యాక్సెస్ 125ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 83,482 నుంచి రూ. 94,082 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.టీవీఎస్ ఎన్‌టార్క్ 125టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 93,126 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 47 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఓ మంచి స్టైలిష్ స్కూటర్ కావాలనుకునే వారికి ఈ స్కూటర్ ఓ మంచి ఎంపిక అవుతుంది. -
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని కొందరు ఆలోచించవచ్చు. అలాంటి వారు ఏ కారు కొనాలి? దాని ధర ఎంత ఉంటుందనే సమాచారం కోసం వెతికే అవకాశం ఉంది. ఇలాంటి వారి సందేహాలకు సమాధానమే ఈ కథనం..ఎంజీ విండ్సర్ ఈవీఇటీవల భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎంజీ విండ్సర్' పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 38 కిలోవాట్ బ్యాటరీ 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.ఎంజీ కామెట్ ఈవీప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీటాటా కంపెనీకి చెందిన టియాగో ఈవీ నాలుగు వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం అనుభవం కోసం హర్మాన్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన టెక్-ఫార్వర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా పొందుతుంది.టాటా పంచ్ ఈవీదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ ఈవీ కూడా పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 265 కిమీ మరియు 365 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..సిట్రోయెన్ ఈసీ3ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఈసీ3 ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. -
ఆ ఐదు చోట్ల అంబరాన్నంటే దాండియా వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. ఈ నవరాత్రుల వేడుకల్లో దాండియాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాండియా అనేది గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు దేశమంతటా దాండియాకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఆ ఐదు ప్రాంతాల్లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలని చాలామంది తహతహలాడుతుంటారు. మరి ఆ ప్రాంతాలెక్కడున్నాయి? అక్కడ వేడుకల్లో పాల్గొనాలంటే ఎంత రుసుము చెల్లించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అహ్మదాబాద్ (గుజరాత్)గుజరాత్‌లోని పలు నగరాల్లో దాండియా వేడుకలు జరుగుతాయి. అయితే అహ్మదాబాద్‌లోని పసిఫిక్ మాల్లో జరిగే దాండియా నైట్‌కు ఎంతో ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.వడోదర (గుజరాత్)వడోదరలో నిర్వహించే దాండియా నైట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా టిక్కెట్ల ధరలు రూ.400 నుండి రూ.500 వరకు ఉంటాయి. కొన్నిచోట్ల టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుంది.థానే (మహారాష్ట్ర)దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు గుర్తింపు ఉంది. దాండియా వేడుకలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్లో పాల్గొనాలంటే ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300.ఢిల్లీఢిల్లీలోని రాజ్వాడ ప్యాలెస్‌లో దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో దాండియా ఆడేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో పాల్గొనేవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.బెంగళూరుబెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ అత్యంత వేడుకగా దాండియా నైట్ నిర్వహిస్తారు. జేపీ నగర్లో జరిగే ఈ ఈవెంట్‌కు వెళ్లాలంటే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఇండియన్ మార్కెట్లో 110 సీసీ బైకులు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఈ స్థానంలో 125 సీసీ.. 200 సీసీ బైకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కమ్యూటర్ బైకుల గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం.హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 95000 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే 'హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్' అనేది ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బైక్. 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 11.4 Bhp పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఎల్ఈడీ ఇండికేటర్స్, లేటెస్ట్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.టీవీఎస్ రైడర్ 125టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన 'రైడర్ 125' బైక్ కేవలం రెండున్నర సంవత్సరాల్లో 7,00,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125సీఎన్జీ బైక్ విభాగంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి బైక్.. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది పెట్రోల్ అండ్ సీఎన్జీ ట్యాంక్స్ కలిగి 330 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8000 rpm వద్ద 9.37 Bhp పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హోండా హార్నెట్ 2.0రూ. 1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. 184.4 సీసీ ఇంజిన్ కలిగిన హార్నెట్ 2.0 బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 17 బ్రేక్ హార్స్ పవర్, 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..బజాజ్ పల్సర్ ఎన్160అతి తక్కువ కాలంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైకులలో ఒకటి బజాజ్ పల్సర్. ఇది ప్రస్తుతం మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ పల్సర్ ఎన్160. దీని ప్రారంభ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 17.7 Bhp పవర్, 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
ధీమాగా బీమా.. ఇలా!
'ఇన్సూరెన్స్'.. ఈ పదం మన నిత్యజీవితంలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు, జంతువులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు అనేక ఆఫర్లను అందిస్తూనే ఉన్నాయి. అయితే మీరు వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. దానికి ఇన్సూరెన్స్ పొందాలనుకున్నప్పుడు, తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ కథనంలో చూసేద్దాం..బీమా కవరేజ్వాహనాలను ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ పాలసీ అందించే కవరేజ్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో మోటారు బీమా పాలసీ రెండు ప్రధాన రకాల కవరేజీలను అందిస్తుంది. అవి థర్డ్-పార్టీ లయబిలిటీ, సమగ్ర కవరేజ్ (Comprehensive Coverage).కొత్త కారును కొనుగోలు చేసే సమయంలోనే కారు డీలర్ ద్వారా థర్డ్-పార్టీ బీమా అందిస్తారు. ఇది ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. శారీరక గాయాలు, వైకల్యం, మూడో వ్యక్తి యొక్క వాహనం లేదా ఆస్తికి సంభవించే నష్టాలను మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. థర్డ్-పార్టీ బీమా పాలసీ నిబంధనల ప్రకారం, మీ వాహనానికి జరిగిన నష్టానికి ఈ కవరేజి ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు.ఇక సమగ్ర కవరేజ్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదం వంటి ఏదైనా ఊహించని సంఘటనల్లో కారుకు సంభవించే నష్టాలకు ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి మోటారు బీమా పాలసీని ఎంచుకునే ముందు మీకు కావలసిన కవరేజీ గురించి తెలుసుకుని ఎంచుకోవాలి.ప్రీమియం & ఐడీవీబీమా పాలసీని ఎంచుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ప్రీమియం లేదా ఐడీవీ (Insured Declared Value) గురించి కూడా తెలుసుకోవాలి. మీ కారు ఏదైనా రిపేరుకు మించి లేదా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోయినప్పుడు ప్రీమియం కవరేజీ నష్టాన్ని భర్తీ చేస్తుంది.ఐడీవీ విషయానికి వస్తే.. దీనిని ఎంచుకునే ముందు మీరు కారు ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేసుకోవాలి. కారు బీమా పాలసీని ఆన్లైన్లో సరిపోల్చేటప్పుడు, కారు మార్కెట్ విలువకు దగ్గరగా ఉండే IDVని ఎంచుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో మొత్తం కారు ధ్వంసమైనప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఈ కవరేజీ పనికొస్తుంది.యాడ్ ఆన్ కవర్స్మెరుగైన కవరేజ్ కోసం యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయవచ్చు. సమగ్ర మోటారు బీమా పాలసీలో కవర్ చేయని కొన్ని నష్టాలను దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు.ఉదాహరణకు.. ప్రమాదం సమయంలో కారు టైర్లకు డ్యామేజ్ జరిగితే.. ఆ నష్టాన్ని సాధారణ బీమా ద్వారా భర్తీ చేసుకోలేరు. కానీ ఈ యాడ్ ఆన్ కవర్స్ కొనుగోలు చేసి ఉంటే.. ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవచ్చు. కొత్త కారును కలిగి ఉన్నప్పుడు టైర్ కవర్, ఇంజిన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్, ఇన్వాయిస్ కవర్ వంటి వాటికోసం యాడ్ ఆన్ కవర్స్ ఎంచుకోవాలి.నో క్లెయిమ్ బోనస్నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ఒక సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయనందుకు బీమా కంపెనీలు అందించే రివార్డ్. మీరు కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు ప్రీమియంపై తగ్గింపు రూపంలో రివార్డ్ పొందవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు క్లెయిమ్ చేయని పక్షంలో.. మీరు మీ రెన్యూవల్ ప్రీమియంపై50 శాతం వరకు NCB తగ్గింపును పొందవచ్చు.ఇదీ చదవండి: కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండిఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలిఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది.రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని మీ అవసరాలకు సరిపోయే బీమా పాలసీని ఎంచుకోవచ్చు. -
ఇన్క్యుబేషన్ సెంటర్ల ఏర్పాటులో రామ్ఇన్ఫో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే లిస్టెడ్ సంస్థ రామ్ఇన్ఫో వచ్చే మూడేళ్లలో టాప్ 5 మధ్య స్థాయి టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. అంకుర సంస్థలకోసం అమెరికాలో రెండు, భారత్‌లో ఒకటి చొప్పున ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎల్ శ్రీనాథ్‌రెడ్డి బుధవారమిక్కడ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 1994లో ఏర్పాటైన రామ్ఇన్ఫో .. ఈసేవ, మీసేవ, సువిధా వంటి సొల్యూషన్స్‌తో అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలకు ఐటీ, డిజిటల్ పరివర్తన సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సాగిస్తున్న కార్యకలాపాలను 2024–25లో 15 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 135 మిలియన్ డాలర్ల ఆదాయం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
భారత్‌లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్‌లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
2023లో భారత్‌లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లోటస్ ఎలెట్రా (Lotus Eletre) ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. 2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు. ఎంజీ కామెట్ (MG Comet) ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3) 'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది. -
7 సీటర్ విభాగంలో టాప్ 5 కార్లు, ఇవే..
భారతీయ మార్కెట్లో కేవలం చిన్న కార్లకు మాత్రమే కాకుండా 7 సీటర్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొంత తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ టాప్ 5.. 7 సీటర్ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రెనాల్ట్ ట్రైబర్ ఇండియన్ మార్కెట్లో రూ. 6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే రెనాల్ట్ ట్రైబర్'' ఈ జాబితాలో చెప్పుకోదగ్గ 7 సీటర్. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 71 Bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎర్టిగా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. దీని ధరలు రూ. 8.64 లక్షల నుంచి రూ. 13.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 102 బీహెచ్‌పి పవర్ 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది. టయోటా రూమియన్ టయోటా కంపెనీకి చెందిన రూమియన్ అనేది మారుతి సుజుకి ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్. ఈ MPV ధరలు రూ. 10.29 లక్షల నుంచి రూ. 13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో ధరలు రూ. 9.64 లక్షల నుంచి రూ. 11.38 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 99 బీహెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే? కియా కారెన్స్ 7 సీటర్ విభాగంలో చెప్పుకోదగ్గ కారు కియా కారెన్స్. దీని ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 113 బీహెచ్‌పి పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కియా కారెన్స్ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. -
ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్‌హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం..
భూమి ఉపరితలం కింద ఉన్న రాళ్లు సహజంగా భూగర్భ జలాల్లో కరిగిపోయినప్పుడు సింక్ హోల్స్ ఏర్పడతాయి. ఇలా రాళ్ళు కరిగిపోతున్నప్పుడు, భూమి లోపల గుహలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గుహ పై భాగంలోని నేల బరువును తట్టుకోలేనప్పుడు, అది కూలిపోతుంది. అప్పుడు భారీ సింక్‌హోల్ ఏర్పడుతుంది. అయితే దానిలోనూ పర్యావరణ వ్యవస్థ అలానే ఉంటుంది. అలాంటి ఐదు లోతైన సింక్ హోల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియా ఓఝాయీ టియాంకెంగ్, చైనా చైనాలోని ఫెంగ్జీ కౌంటీలో జియా ఓఝాయీ టియాంకెంగ్లో అతిపెద్ద సింక్‌హోల్ ఉంది. ఈ సింక్ హోల్‌కు పిట్ ఆఫ్ హెవెన్ అనే పేరు పెట్టారు. ఇది 662 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన సింక్ హోల్గా గుర్తింపు పొందింది. బయూ కార్న్ సింక్‌హోల్, అమెరికా ఇది అమెరికాలోని లూసియానాలో ఉంది. 2012లో భూకంపాలు సంభవించిన సమయంలో ఇది బయటపడింది. భూగర్భంలోని ఉప్పు దిబ్బ కూలిపోవడంతో ఈ సింక్ హోల్ ఏర్పడింది. 2014 నాటికి ఇది 229 మీటర్ల లోతు కలిగివుంది. కాపర్ మైన్ సింక్‌హోల్, చిలీ 2020, జూలైలో చిలీలో ఒక సింక్ హోల్ బయటపడింది. ఇది 32 మీటర్ల చుట్టుకొలతతో 200 మీటర్ల లోతున ఉందని అంచనా. ఈ సింక్ హోల్ రాగి గనుల సమీపంలో ఏర్పడింది. మిస్టరీ సింక్ హోల్, చైనా 2022లో చైనా శాస్త్రవేత్తలు గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో 192 మీటర్ల లోతైన సింక్‌హోల్‌ను కనుగొన్నారు. ఇది 306 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పుతో ఉంది. అది ఎంత పెద్దదంటే దానిలోపల పెద్ద అడవి వ్యాపించింది. గ్రేట్ బ్లూ హోల్, అమెరికా గ్రేట్ బ్లూ హోల్ సముద్రంలో ఉంది. ఇది అమెరికాలోని బెలిజ్ తీరంలో ఉంది. ఇది 124 మీటర్ల లోతు కలిగివుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన బెలిజ్ బారియర్ రీఫ్ రిజర్వ్ సిస్టమ్‌లో భాగంగా ఉంది. ఇది కూడా చదవండి: పాక్‌లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా? -
ఈ సీఈఓల జీతాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
ఒకప్పటి నుంచి కూడా చాలామంది ఎక్కువ సంపాదించాలంటే ఐటీ ఫీల్డ్‌లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్న సంగతి తెలిసిందే. లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, టూర్లు, షికార్లు, ఐదు రోజుల పనిదినాలు ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది కావున మెజారిటీ యువత ఈ ఉద్యోగంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. అయితే కరోనా మహమ్మారి తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా విజృంభణ తరువాత చాలా వరకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి, అదే సమయంలో కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోయాయి. అయితే సీఈఓలు మాత్రం రికార్డు మొత్తంలో జీతాలు తీసుకుంటున్నారు. మనం ఈ కథనంలో ఎక్కువ జీతాలు తీసుకుంటున్న ఐటీ కంపెనీల CEOల జీతాలను గురించి తెలుసుకుందాం. థియరీ డెలపోర్టే (Thierry Delaporte) ఎక్కువ జీతాలు తీసుకుంటున్న సీఈఓల జాబితాలో విప్రో CEO 'థియరీ డెలపోర్టే' ఉన్నట్లు సమాచారం. ఈయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ డాలర్లను వేతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 82.2 కోట్లు. సలీల్ పరేఖ్ (Salil Parekh) ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఎక్కువ సాలరీ తీసుకుంటున్నవారి జాబితాలో ఒకరు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 56.4 కోట్లు వేతంగా అందుకున్నట్లు సమాచారం. అంతకు ముందు సంవత్సరంలో ఈయన జీతం ఇప్పటికంటే 21 శాతం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఎక్కువ జీతం తీసుకుంటున్న రెండవ సీఈఓగా రికార్డ్ సృష్టిచాడు. ఇదీ చదవండి: మూడు బ్యాంకుల కొత్త ప్రకటనలు.. ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! రాజేశ్ గోపీనాథన్ (Rajesh Gopinathan) టీసీఎస్ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 29 కోట్లు వార్షిక వేతంగా అందుకున్నట్లు సమాచారం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 13 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఐటీ కంపెనీ ఉద్యోగుల సగటు జీతం కంటే ఇది సుమారు 427 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓగా కృత్తివాసన్ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్! సి విజయ్ కుమార్ (HCL Technologies) 2022-23ఆర్థిక సంవత్సరంలో రూ. 28.4 కోట్లు వార్షిక వేతనం తీసుకున్న హెచ్‌సిఎల్ టెక్ సీఈఓ 'సి విజయ్ కుమార్' మన జాబితాలో ఒకరు. అయితే ఈ యన ఈ సారి తన వేతనం భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం. -
ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు
Top 5 Hybrid Cars In India: భారతీయ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఈ విభాగంలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు రూ. 16.46 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ఒక లీటరుకు గరిష్టంగా 27.97 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ. 18.29 లక్షల నుంచి రూ. 19.79 లక్షల వరకు ఉంటుంది. ఇది 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. ఇది సిటీ అండ్ హైవే రెండింటిలోనూ 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగిన ఈ కారులో తక్కువ ఇతర మోడల్స్ కంటే కూడా తక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ రూ. 18.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య లభించే ఈ కారు కూడా మన జాబితాలో ఉత్తమ మైలేజ్ అందించే బెస్ట్ కారు. ఇది 23.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే సిటీ అండ్ హైవే వంటి వాటిని లోబడి కొంత వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉండవచ్చు. పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. ఇదీ చదవండి: ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్! మారుతి సుజుకి ఇన్విక్టో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో హైబ్రిడ్ మోడల్ ఇన్విక్టో. దీని ప్రారంభ ధర రూ. 24.79 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 28.42 లక్షలు. మైలేజ్ విషయానికి వస్తే.. ఇది ఒక లీటరుకు గరిష్టంగా 23.24 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. మన జాబితాలో ఇది కొంత ఖరీదైన కారు అనే చెప్పాలి. అయితే ధరకు తగిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! టయోటా ఇన్నోవా హైక్రాస్ టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 25.30 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. ఇది 23.24 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఉత్తమ పనితీరుని అందించే ఈ కారు అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. -
ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!
Best Smartwatches Under Rs. 1500: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో టెక్నాలజీ వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. నేడు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాకుండా స్మార్ట్‌వాచ్‌లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ. 1500 కంటే తక్కువ ధర వద్ద లభించే లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 (Fastrack Revoltt FS1) రూ. 1200 వద్ద అందుబాటులో ఉన్న 'ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1' ఎక్కువ ప్రజాదరణ పొందిన బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. దీనిని ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. 1.83 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా పొందింది. 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. నాయిస్ క్రూ (Noise Crew) మన జాబితాలో రెండవ స్మార్ట్‌వాచ్ 'నాయిస్ క్రూ'. దీని ధర రూ. 1499 మాత్రమే. దీనిని రిటైల్ స్టోర్స్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 1.38 ఇంచెస్ రౌండ్ డిస్ప్లే కలిగి ఐపీ68 రేటింగ్ పొందుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది. పెబుల్ ఫ్రాస్ట్ ప్రో (Pebble Frost Pro) రూ. 1299 వద్ద లభించే పెబుల్ బ్రాండ్ 'ఫ్రాస్ట్ ప్రో' స్మార్ట్‌వాచ్ మంచి ప్రజాదరణ పొందిన లేటెస్ట్ మోడల్. ఇది 1.96 ఇంచెస్ డిస్ప్లే కలిగి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రొటేటింగ్ వంటి ఆఫ్షన్స్‌తో పాటు వినియోగదారులకు ఆధునిక కాలంలో ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! నాయిస్ ఐకాన్ బజ్ (Noise Icon Buzz) మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌వాచ్ నాయిస్ ఐకాన్ బజ్. రూ. 1299 వద్ద లభించే ఈ వాచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 1.69 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఈ లేటెస్ట్ ప్రొడక్ట్ బ్లూటూత్ కాలింగ్ వంటి వాటితో పాటు వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా పొందుతుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! ఫైర్-బోల్ట్ నింజా టాక్ (Fire-Boltt Ninja Talk) ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన నింజా టాక్ ధర రూ. 1499. రౌండ్ డయల్ డిజైన్ కలిగి చూడ చక్కగా కనిపించే ఈ వాచ్ ఎంతోమంది వినియోగద్రూలకు ఇష్టమైన ఉత్పత్తి. 120 స్పోర్ట్స్ మోడ్స్‌తో బ్లూటూత్ కాలిగి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారుని ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. -
భారత్‌లో టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లు ఇవే!
Affordable Cars With Sunroof: ఆధునిక కాలంలో కార్ల కొనుగోలుదారులు లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న వాటిని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో కస్టమర్ల సౌలభ్యం మేరకు కావలసిన ఫీచర్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు సన్‌రూఫ్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. కాగా ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఎస్‌యువిలలో కూడా ఈ ఫీచర్ లభిస్తోంది. మార్కెట్లో లభించే టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా సన్‌రూఫ్ ఫీచర్‌తో దాని విభాగంలో లభించే సరసమైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 13.96 లక్షల నుంచి రూ. 19.20 లక్షల వరకు ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ ఇంజన్ & 1.5-లీటర్, డీజిల్ ఇంజన్ పొందుతుంది. రేండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి. ఎంజి ఆస్టర్ (MG Aster) రూ. 14.21 లక్షల నుంచి రూ. 18.69 లక్షల మధ్య లభించే ఈ ఎంజి ఆస్టర్ సన్‌రూఫ్ ఫీచర్ లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5-లీటర్, పెట్రోల్ అండ్ 1.3-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్స్ పొందుతుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. రెడ్ కలర్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. కియా సెల్టోస్ (Kia Seltos) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ పాపులర్ కారు సెల్టోస్ సన్‌రూఫ్ ఫీచర్‌తో లభించే అత్యుత్తమ కారు. దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తాయి. కాగా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలు ఇందులో లభించడం విశేషం. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు ఎంతోమంది ప్రజలకు నచ్చిన మోడల్ కావడం గమనార్హం. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) రూ. 15.41 లక్షల నుంచి రూ. 19.83 లక్షల మధ్య లభించే మారుతి సుజుకి గ్రాండ్ విటారా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి టాప్ 5 కార్లలో ఒకటి. ఒక మిడ్-సైజ్ ఎస్యువి సన్‌రూఫ్ ఫీచర్‌తో రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్‌గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?) టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) టయోటా కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మన జాబితాలో అత్యధిక ధర వద్ద లభించే సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన కారు. దీని ధర రూ. 16.04 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. బ్లాక్ అండ్ బేజ్ కలర్ ఆప్షన్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 1.5-లీటర్ పెట్రోల్ & 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో e-CVT పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
ఆఫ్ రోడింగ్ అంటే ఈ కార్లు ఉండాల్సిందే - ఎందుకంటే?
ఆధునిక కాలంలో భారతీయ మార్కెట్లో అనేక వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో కొంతమంది హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేస్తే, కొంతమంది ఎంపివిలను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామంది ఆఫ్ రోడింగ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే ఐదు ఆఫ్-రోడ్ కార్లను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Zimny) ఆఫ్ రోడింగ్ అనగానే గుర్తొచ్చే కార్ల జాబితాలో మారుతి కంపెనీకి చెందిన జిమ్నీ ఒకటి. దీని ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV 4x4 హార్డ్‌వేర్, దృఢమైన సస్పెన్షన్, లైట్ కర్బ్ వెయిట్, నారో ట్రాక్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. మహీంద్రా థార్ (Mahindra Thar) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న థార్ పర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ కారుని ఎగబడి మరి కొనుగోలు చేస్తుంటారు. దీని ధర రూ. 13.87 లక్షల నుంచి రూ. 16.78 లక్షల వరకు ఉంటుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ కలిగిన ఈ SUV ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) అమ్మకాల పరంగా థార్, జిమ్నీ అంత ఆదరణ పొందనప్పటికీ ఆఫ్ రోడింగ్ విషయం ఇది కూడా అద్భుతమైన చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 14.75 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా మన జాబితాలో అద్భుతమైన కారు. ఇది SUV అయినప్పటికీ ఆఫ్ రోడింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. కావున అద్భుతమైన ఆఫ్ రోడర్‌గా కూడా పనిచేస్తుంది. దీని ధర రూ. 17.69 లక్షల నుంచి రూ. 24.52 లక్షల మధ్య ఉంది. ఇది ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, లో లెవెల్ గేర్‌బాక్స్ అండ్ మెకానికల్ లాకింగ్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంలో రచ్చ రచ్చ చేసిన వామిక గబ్బి - వైరల్ వీడియో) ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ (Isuzu D-Max V-Cross) ఆఫ్ రోడింగ్ విభాగంలో అత్యంత ఖరీదైన కారు ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్. దీని ధర రూ. 23.50 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు ఉంది. ఇది సాధారణ ఆఫ్ రోడింగ్ వాహనాల మాదిరిగా కాకుండా లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో వెనుక ఒక చిన్న లగేజ్ స్పేస్ ఉంటుంది. అయినప్పటికీ ఇది మంచి పనితీరుని అందిస్తుంది. -
మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్ - ధరలు ఎలా ఉన్నాయంటే?
Best Smartphones Under 35000: దేశీయ విఫణిలో రోజురోజుకి కొత్త స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే చాలా మంది కొంత తక్కువ ధర కలిగిన బెస్ట్ అండ్ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ మార్కెట్లో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద మొబైల్ కొనాలని చూస్తున్న వారు ఈ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ చూడవచ్చు. ఇందులో రియల్మీ, మోటోరోలా, పోకో బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రియల్మీ 11 ప్రో ప్లస్.. ప్రస్తుతం చాలామంది కొనుగోలుదారులు రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మన జాబితాలో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో 'రియల్మీ 11 ప్రో ప్లస్' (Realme 11 Pro+) ఒకటి. దీని ధర రూ. 27,999 మాత్రమే. ఇందులో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ వంటివాటితో పాటు ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫీచర్స్ చాలా ఆధునికంగా ఉంటాయి. మోటోరోలా ఎడ్జ్ 40.. మన జాబితాలో రెండవ స్మార్ట్‌ఫోన్ 'మోటోరోలా ఎడ్జ్ 40' (Motorola Edge 40). దీని ధర రూ. 29,999. ఈ మొబైల్ 144 Hz రిఫ్రెష్ రేటుతో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 13 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సెంటర్డ్ పంచ్-హోల్ కెమెరా ఉంది. 4400 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 68 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 3.. రూ. 33,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ 3' (OnePlus Nord 3) స్మార్ట్‌ఫోన్ ఆధునిక ఫీచర్స్ అయిన సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అండ్ అలర్ట్ స్లైడర్ ఉన్నాయి. 120 Hz రేటుతో 6.74 ఇంచెస్ ఫుల్లీ హెచ్డీ డిస్ప్లే కలిగి వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్లను పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 80 వాట్స్ పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) పోకో ఎఫ్5.. మన జాబితాలో రూ. 29,999 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ 'పోకో ఎఫ్5' (Poco F5). ఇది 120 Hz 6.67 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్లతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా పొందుతుంది. డిజైన్ & ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?) ఐక్యూ నియో 7 ప్రో ( iQOO Neo7 Pro).. రూ. 34,999 వద్ద లభించే ఈ ఐక్యూ నియో 7 ప్రో ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న మొబైల్. ఇది అండర్-స్క్రీన్ బయోమెట్రిక్ రీడర్ కలిగి 6.78 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుక వైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా పొందుతుంది. -
ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు!
Highest Paid Instagram Stars 2023: ఆధునిక కాలంలో వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ రాజ్యమేలుతున్నాయి. సాధారణ ప్రజలను పక్కన పెడితే సెలబ్రిటీలు మాత్రమే ఇందులో బాగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఇన్‌స్టా ఒకటి. ఇది చాలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్. దాదాపు అన్ని బ్రాండ్లు, విక్రయదారులు, ఏదో ఒక సమయంలో, ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కలిసి పనిచేసే ప్రణాళికలను కలిగి ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు? వారు ఒక పోస్ట్‌కి ఎంత సంపాదిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీలలో ఒకడు. ఇతడు ఒక ఫోటో లేదా వీడియోని పోస్ట్ చేస్తే సుమారు 2.8 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. 643 మిలియన్స్ పాలొవర్స్ కలిగి ఉండటం వల్ల ఇంత మొత్తం చెల్లిస్తారని కూడా కొంతమంది చెబుతున్నారు. కైలీ జెన్నర్ కైలీ బ్యూటీ బ్రాండ్, కైలీ కాస్మోటిక్స్ ఓనర్ అయిన జెన్నర్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ సంపాదించే సెలబ్రిటీల జాబితాలో ఒకరు. ఈమె ఈమెకు సుమారు 415 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. జెన్నర్ ఒక పోస్టుకి లేదా వీడియోకి 1.8 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. లియో మెస్సీ ఇక జాబితాలో మూడవ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీ అర్జెంటీనా దేశానికి చెందిన లియోనెల్ మెస్సీ. ఇతనికి 511 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ లేదా వీడియో షేర్ చేస్తే 1.6 మిలియన్ డాలర్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!) సెలీనా గోమెజ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను కలిగిన ఉన్న స్పానిష్ గాయని, నటి 'సెలీనా గోమెజ్' ఇన్‌స్టాలో ఒక పోస్టుకి 1.4 మిలియన్ల డాలర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈమెకు 456 మిలియన్స్ కంటే ఎక్కువ మంది పాలొవర్స్ ఉన్నారు. అంతే కాకుండా ఈమె అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా ఉంది. (ఇదీ చదవండి: సెలబ్రిటీలతో కలిసి బిజినెస్.. ఆ నయా ట్రెండ్ మొదలుపెట్టిందే ఇతడు!) డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదించే సెలబ్రిటీల జివితలో ఐదవ వ్యక్తి డ్వేన్ జాన్సన్. ఈయన "ది రాక్"గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు. ఈయన మొదట డబ్ల్యుడబ్ల్యుఈ టీవీ షోలో రెజ్లర్‌గా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా అనేక యాక్షన్ చిత్రాల్లో కూడా కనిపించాడు. ఇతడు ఒక పోస్టుకి ఇన్‌స్టాలో 1.1 మిలియన్ డాలర్లు తీసుకుంటాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!
Top 5 Best Smartphones: ఆధునిక కాలంలో మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన స్మార్ట్‌ఫోన్ ఎవరి చేతిలో చూసిన కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో లభించే మొబైల్స్ ఉన్నాయి, సరసమైన ధరలో లభించే ఫోన్లు ఉన్నాయి. ఈ కథనంలో రూ. 20 వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ స్మార్ట్ఫోన్లను గురించి మరిన్ని తెలుసుకుందాం. రెడ్మీ నోట్ 12 భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్మీ బ్రాండ్‌కి సంబంధించిన 'నోట్ 12' రూ. 20,000 కంటే తక్కువ ధర లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 16,999. ఇందులోని 5,000mAh బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ద్వారా పనిచేసే ఈ మొబైల్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్లను పొందుతుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 రూ. 18,999 వద్ద లభించే 'ఐక్యూ జెడ్7' మన జాబితాలో రెండవ ఉత్తమ మోడల్. ఇందులో 5,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 6.38 ఇంచెస్ 90Hz AMOLED డిస్ప్లే ఉంటాయి. ఈ మొబైల్ 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. మోటో జీ73 దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న మోటో బ్రాండ్ మొబైల్ ఇప్పటికీ అదే రీతిలో ముందుకు సాగుతున్నాయి. ఇందులో మోటో జీ73 స్మార్ట్‌ఫోన్ రూ. 18,999 వద్ద లభించే పాపులర్ మోడల్. ఇది 6.5 ఎల్సీడీ డిస్ప్లే పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 10 ప్రో 5జీ రియల్మీ 10 ప్రో 5జీ కూడా మన జాబితాలో సరసమైన వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 18,999. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో LCD ప్యానెల్ పొందుతుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీ కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రూ. 19,999 వద్ద లభించే 'వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' ఆధునిక ఫీచర్స్ కలిగిన అద్భుతమైన మోడల్. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఫుల్ HD+ LCD డిస్ప్లే కలిగిన ఈ మోడల్ 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు హై రిజల్యూషన్ 108MP ప్రైమరీ సెన్సార్ పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు లభిస్తుంది. -
టాప్ ౩౦ హెడ్‌లైన్స్
-
తక్కువ ధరలో లభించే బెస్ట్ గ్యాడ్జెట్స్!
Best Affordable Gadgets: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు సరసమైన ధర వద్ద లభించే వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలంటి వారి కోసం రూ. 500 కంటే తక్కువ ధర వద్ద లభించే 5 బెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ రూ. 399 వద్ద లభించే విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ చాలా మందికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్. ఇది మానిటర్లు, కీబోర్డులు, ఫోన్స్, ఎయిర్ పాడ్స్, ల్యాప్ టాప్ వంటి వాటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో క్లీనర్ కిట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్ మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో గ్యాడ్జెట్ 'వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ అండ్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్'. దీని ధర రూ. 200 కంటే తక్కువ కావడం గమనార్హం. QOCXRRIN వైర్లెస్ బ్లూటూత్ అనేది పేరుకు తగ్గట్టుగానే ఇది బ్లూటూత్ ట్రాకర్. అంతే కాకుండా దీనిని ఆండ్రాయిడ్ పరికరాలతో ఉపయోగించవచ్చు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, దీని పరిధి 25 మీటర్ల వరకు ఉంటుంది. 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్ దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ మోడల్ 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్. దీని ధర రూ. 333 మాత్రమే. ఇది దాదాపు చాలా పరికరాలకు ఉపయోగపడే విధంగా రూపుదిదుకున్న యూనివెర్సల్ ఛార్జింగ్ కేబుల్. ఈ కేబుల్ ద్వారా యాపిల్ పరికరాలకు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వంటి వాటికి ఛార్జింగ్ వేసుకోవచ్చు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా రూపొందించారు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ కీ చైన్ అనేది మహిళలు, పురుషులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం. ఈ కారణంగా కీ చైన్ల వినియోగం ఆధునిక కాలంలో కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రూ. 200 కంటే తక్కువ ధర వద్ద కీ చైన్ కావాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఈ మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ (Multi-function keychain light). ఇది కేవలం కీ చైన్ మాదిరిగా మాత్రమే కాకుండా లైట్‌గా కూడా పనికొస్తుంది.ఇందులో LED లైటింగ్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అయస్కాంతం ఉండటం వల్ల డోర్ లేదా హ్యాండిల్స్ వంటి వాటికి తగిలించుకోవచ్చు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) Hkaudio ఎమ్28 టిడబ్ల్యుఎస్ ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ పవర్ బ్యాంక్‌తో కూడిన Hkaudio M28 TWS ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ధర కూడా రూ. 500 కంటే తక్కువ. ఇది USB టైప్ ఏ పోర్ట్ కలిగి బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో లభిస్తుంది. ఇది గేమింగ్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఇయర్ఫోన్గా ఉపయోగపడుతుంది. -
భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Top 5 Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనికి కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు.. లేదా వాతావరణ సమతుల్యతను కాపాడటం కోసం కావచ్చు. కారణం ఏదైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వినియోగం రెండూ పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు అధిక రేంజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఏవి? అవి అందించే రేంజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 (Mercedes-Benz EQS 580) ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఈక్యూఎస్ 580' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 857 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుమారు రూ. 1.55 కోట్లు విలువైన ఈ కారు 107.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది. కియా ఈవీ6 (Kia EV6) ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ కంపెనీకి చెందిన ఈవీ6 ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 708 కిమీ పరిధిని అందిస్తుంది. రూ. 60 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 350 kW డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) 2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలైన ఈ కారు ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 631 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. సుమారు రూ. 45 లక్షల ధర వద్ద విడుదలైన ఈ కారు మంది డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. 72.6 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు 217 hp పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ధర పరంగా ఇది కియా ఈవీ6 కంటే తక్కువగానే ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 కూడా మన జాబితాలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. సుమారు రూ. 1.95 కోట్ల ధర కలిగిన ఈ కారు ఒక ఛార్జ్‌తో 625 కిమీ రేంజ్ అందిస్తుంది. 101.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు 539 bhp పవర్ 745 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 239 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున వేరే వారికి డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..) బివైడి ఆట్టో 3 (BYD Atto 3) భారతీయ మార్కెట్లో గత కొన్ని రోజులకు ముందు విడుదలైన 'బివైడి ఆట్టో 3' ఎలక్ట్రిక్ కారు ఒక ఛార్జ్‌తో 521 కిమీ పరిధిని అందిస్తాయి. రూ. 33.99 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 60.48 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 201 hp పవర్ 310 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. (ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్) భారతీయ మార్కెట్లో కేవలం ఈ కార్లు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యూ ఐ4, ఆడి ఈ-ట్రాన్ జిటి, ఆడి ఈ-ట్రాన్, పోర్స్చే టైకాన్, జాగ్వార్ ఐ-పేస్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?
Affordable Cars in 2023: భారతదేశంలో ప్రస్తుతం చాలామంది సొంతవాహనాలను కలిగి ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ సొంతంగా కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కొంతమంది ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తే మరి కొందరు వారి రేంజ్ కి తగ్గట్టుగా తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. నిజానికి ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కంటే సరసమైన ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే టాప్ అండ్ బెస్ట్ 10 కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బజాజ్ క్యూట్ భారతదేశంలో అతి తక్కువ ధరకు లభించే సరసమైన కారు బజాజ్ కంపెనీకి చెందిన క్యూట్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 2.64 లక్షల నుంచి రూ. 2.84 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకుల ధర కంటే చాలా తక్కువ. ఇది 216 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 35 కిమీ నుంచి 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది మంచి డిజైన్, మంచి ఫీచర్స్ పొందుతుంది. డాట్సన్ రెడీ గో అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ కంపెనీకి చెందిన డాట్సన్ రెడీ గో కూడా మన జాబితాలో తక్కువ ధరకు లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 3.8 లక్షల నుంచి రూ. 4.96 లక్షల వరకు ఉంది. ఇది 799 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 20.7 కిమీ నుంచి 22 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2017లో NDtv స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న ఈ కారు ప్రొడక్షన్ ఇప్పుడు ఇండియాలో ఆగిపోయింది. కానీ విక్రయాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) రెనాల్ట్ క్విడ్ మన జాబితాలో చెప్పుకోదగ్గ సరసమైన కారు మాత్రమే కాదు, అత్యంత సురక్షితమైన కారు కూడా. దీని ధర రూ. 4.7 లక్షల నుంచి రూ. 6.33 లక్షల మధ్య ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ డిజైన్ పరంగా ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులోని 799 ఇంజిన్ ఒక లీటరుకు 22 కిమీ నుంచి 23 కిమీ మధ్య మైలేజ్ అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కువ అమమకాలు పొందుతున్న కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. (ఇదీ చదవండి: రూ. 5.1 కోట్ల మెక్లారెన్ కొత్త సూపర్‌కార్ ఇదే - పూర్తి వివరాలు) మారుతి ఆల్టో 800 ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మారుతి ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ఆధునిక కాలంలో మాత్రమే కాకుండా ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంది. ఇది ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్లో అందుబాటులో ఉంది. కావున మునుపటికంటే మంచి డిజైన్, ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 796 సిసి ఇంజిన్ లీటరుకు 24.7 కిమీ నుంచి 31.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందిస్తున్న కారణంగా కూడా ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?) మారుతి ఎస్ ప్రెస్సో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో కారు ఎస్-ప్రెస్సో. ఇది కూడా తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 6.1 లక్షల మధ్య ఉంటుంది. ఇందులోని కె10బి పెట్రోల్ ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది లీటరుకు 24.8 కిమీ నుంచి 32.7 కిమీ మైలేజ్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. -
భారత్‌లో టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే!
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తారా స్థాయిలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలన్నీ ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి వివరాలేంటి అనే మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం. ఓలా ఎస్1 భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన 'ఎస్1 ప్రో' ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఈ స్కూటర్ ధర ఈ 99,999. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీల ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. ఇది 2.98 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 121 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్' ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 1.05 లక్షలు. ఇందులో 3.04 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్‌తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లు. టీవీఎస్ ఐక్యూబ్ 5 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఏథర్ 450ఎక్స్ బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన ఏథర్ మార్కెట్లో '450ఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.17 లక్షల నుంచి రూ. 1.39 లక్షలు మధ్య ఉంది. ఇందులోని 2.23 కిలోవాట్ బ్యాటరీ 70 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ 80 కిమీ కాగా, ఛార్జింగ్ టైమ్ 5.45 గంటలు. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ రూ. 72,240 వద్ద లభిస్తున్న హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ మార్కెట్లోని ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇది 1.87 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ స్కూటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. బజాజ్ చేతక్ బజాజ్ ఆటో భారతదేశంలో విక్రయిస్తున్న 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఒక ఛార్జ్‌తో 85 నుంచి 95 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్లో 3 కిలోవాట్ బ్యాటరీ నిక్షిప్తమై ఉంటుంది. ఇది 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు మాత్రమే. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి, కావున ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కావున ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారు తప్పకుండా ఆ రాష్ట్రంలో అందించే సబ్సిడీ, ఇతర వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
పవర్ ఫుల్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 బెస్ట్ బైక్స్!
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం. కెటిఎమ్ 390 డ్యూక్: ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్డేట్లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్‌బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హోండా సిబి300ఆర్: హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్: మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. -
భారత్‌లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్‌పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్‌పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
మ్యాక్స్‌వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు
Maxwell Lists His Top Five T20 Players Ahead Of T20 WC 2021: పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు, విశ్లేషకులు తమతమ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్ డాషింగ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం ప్రపంచ టీ20 జట్టుకు తన ఐదుగురు ఫేవరెట్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించాడు. ఈ జాబితాలో మ్యాక్సీ అనూహ్యంగా ఇద్దరు ఆసీస్ వెటరన్ ప్లేయర్స్‌కు చోటు కల్పించడం విశేషం. తన ఫస్ట్ ఛాయిస్ ఆటగాడిగా అఫ్గాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఎంపిక చేసిన మ్యాక్స్‌వెల్.. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్, విండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రసెల్‌లను తన జట్టులోకి ఎంపిక చేశాడు. అయితే వికెట్‌కీపర్ కోటాలో అతను అనూహ్యంగా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చోటు కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆఖరుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్‌ను మ్యాక్సీ తన జట్టులోని తీసుకున్నాడు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సమర్ధులని, అందుకే వీరిని తన జట్టులోకి ఎంపిక చేశానని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. చదవండి: పేలవ డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్ట్ Two all-rounders, a leg-spinning sensation and two Australians of the past 🏏 Glenn Maxwell’s top five T20 Players 🎥 pic.twitter.com/Yn2lUsCgE4 — T20 World Cup (@T20WorldCup) October 6, 2021 -
‘లారెస్’ టాప్–5లోకి సచిన్ 2011 ఫైనల్ సంబరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లారెస్ అవార్డు అందుకునే దిశగా సచిన్ ‘2011 ప్రపంచకప్ ఫైనల్ సంబర ఘట్టం’ మరో అడుగు ముందుకు వేసింది. ముంబై వాంఖడే మైదానంలో ఫైనల్ గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన దృశ్యం అవార్డు కోసం పోటీ పడుతుంది. ఇప్పటి వరకు 20 ఎంట్రీలు అవార్డు రేసులో ఉండగా వాటిని ఐదుకు కుదించారు. ఈ టాప్–5లో సచిన్ సంబరానికి చోటు దక్కింది. ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అనే టైటిల్‌తో నాటి క్షణం అవార్డు బరిలో నిలిచింది. ఫిబ్రవరి 16న ఓటింగ్ ముగిశాక... బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను 17న ప్రకటిస్తారు. -
అప్పటి నుంచి టాప్–5లోనే...
రష్యా తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో దిగింది 1996లో! అట్లాంటా (అమెరికా) ఆతిథ్యమిచ్చిన సమ్మర్ ఒలింపిక్స్ నుంచి గత ‘రియో’లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ వరకు రష్యా పతకాల పట్టికలో ‘టాప్–5’లోనే నిలిచింది. 1996 అట్లాంటాలో 63 పతకాలతో రెండో స్థానంలో... 2000 సిడ్నీలో 89 పతకాలతో రెండో స్థానంలో... 2004 ఏథెన్స్లో 90 పతకాలతో మూడో స్థానంలో... 2008 బీజింగ్‌లో 60 పతకాలతో మూడో స్థానంలో... 2012 లండన్‌లో 68 పతకాలతో నాలుగో స్థానంలో... 2016 రియో ఒలింపిక్స్‌లో 56 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకంటే ముందు సోవియట్ యూనియన్‌లో భాగంగా బరిలోకి దిగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక తొలిసారి 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో ‘యూనిఫైడ్ టీమ్’గా పోటీపడింది. ఇక వింటర్ ఒలింపిక్స్‌లోనూ రష్యా ఆధిపత్యాన్ని చాటింది. రెండు సార్లు 1994, 2014లో అగ్రస్థానాన్ని పొందిన రష్యన్ బృందం వాంకోవర్ (2010)లో మినహా ప్రతీసారి టాప్–5లోనే నిలిచింది. వాంకోవర్‌లో మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది. -
బడ్జెట్ టాప్ 5
ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, 2018–19 సంవత్సరానికి తన బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని బడా దేశాల బడ్జెట్లపై దృష్టి సారిద్దాం. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అత్యధిక మొత్తాలతో బడ్జెట్లు ప్రవేశపెట్టే దేశాల జాబితా రూపొందించింది. ఇందులో భారత్ 22వ స్థానంలో ఉంది. 2016వ సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం టాప్ 5 బడ్జెట్ల వివరాలు... (రూ.లక్షల కోట్లలో) అమెరికా రెవెన్యూ : 391 వ్యయం : 446 లోటు : 55 చైనా రెవెన్యూ : 217 వ్యయం : 245 లోటు : 28 జపాన్ రెవెన్యూ : 116 వ్యయం : 132 లోటు : 16 జర్మనీ రెవెన్యూ : 103 వ్యయం : 101 మిగులు : 2 ఫ్రాన్స్ రెవెన్యూ : 88 వ్యయం : 93 లోటు : 5 -
ఆటో ఎక్స్‌పోలో టాప్-5 ఏంటో తెలుసా?
కొత్తకొత్త కార్లు, బైక్‌లు, స్పోర్ట్స్ వెహికిల్స్ 2016 ఆటో ఎక్స్‌పోలో అదరహో అనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక లక్షణాన్ని కలిగిఉండి చూపరుల కళ్లను కట్టిపడేస్తున్నాయి. అలా కట్టిపడేసే వాటిల్లో కూడా టాప్ 5 వెహికిల్స్ ఉన్నాయి? అవి ఎలాంటి ఫీచర్స్ తో ఉన్నాయో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి.. ఫోక్స్ వాగన్ అమియో: భారత కార్ల మార్కెట్లో ఫోక్స్ వాగన్ పల్లకిలాంటిది. ఇప్పుడు ఈ కారు మారుతీ డిజైర్, హుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజికి పోటీగా ఆటో ఎక్స్పో-2016ల్లో దూసుకెళ్తోంది. 1.2 లీటరు పెట్రోలు ఇంజిన్, 1.5 లీటరు డీజిలు ఇంజిన్ సామర్థ్యంతో ఈ న్యూ మోడల్ కారు మార్కెట్లోకి త్వరలో రాబోతుంది. ఈ ఫోక్స్ వాగన్ కారులో వాటర్ వేగాన్ని తట్టుకోవడంతోపాటు మిర్రర్ లింక్‌తో కనెక్ట్ అయిన టచ్ స్క్రీన్, ఆటోమాటిక్ హెడ్ లైట్స్, పర్ఫెక్ట్ వైఫర్స్ సిస్టమ్స్ ఈ కారు ప్రత్యేకతలు. టాటా కైట్ 5: ఆటో ఎక్స్పోల్లో ఆవిష్కరించిన కార్లలో కాంపాక్టు టాటా కైట్ ఫైవ్. 1.05 లీటరు డీజిల్ ఇంజిన్, 1.2 లీటరు పెట్రోలు ఇంజిన్, సామర్థ్యం కలిగి ఉన్న ఈ కారు 2017లోపు షోరూంల్లోకి ప్రవేశించనుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు మార్కెట్లోకి రానుంది. చెవ్రోలెట్ ఎసెన్షియా: మిగతా కార్లకు పోటీగా ఎసెన్షియా కంపెనీ కొత్త కాంపాక్టు చెవ్రోలెట్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిధ్ధమవుతోంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, పార్కింగ్‌లో ఇబ్బందిలేకుండా ఉండేందుకు వెనుక కెమెరా, శాటిలైట్ నావిగేషన్ వంటి ఫీచర్స్‌తో ఆటో ఎక్స్పోల్లో అదరగొడుతోంది. కంపెనీ యూఎస్పీ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ మోడల్‌ను కూడా 2017లోనే మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జాగ్వార్ ఎక్స్ఈ: బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ ఏ4, మెర్సిడస్ బెంజ్ సి క్లాస్ పోటీగా జాగ్వార్ ఎక్స్ఈ దూసుకుపోతోంది. 2.0 లీటరు పెట్రోలు ఇంజిన్ సామర్థ్యం కల్గిన ఎక్స్ఈ రూ. 39.90 లక్షల ఖరీదు. ఢిల్లీ ఆటో షోరూంల్లో లభ్యమవుతున్న ఈ కారును కేవలం రెండు రాష్ట్రాల్లోనే విడుదల చేశారు. జాగ్, న్యూ బేబీగా ఎక్స్ఈ చక్కర్లు కొడుతోంది. బీఎమ్‌డబ్ల్యూ 7: బీఎమ్‌డబ్ల్యూ కంపెనీకి చెందిన కొత్త రకం సిరీస్ బీఎమ్‌డబ్ల్యూ 7. 2016 ఆటో ఎక్స్పోల్లో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతున్న ఈ కారును అధిక మైలేజీని ఇవ్వడంతోపాటు స్పీడుల్లో దేనికి తీసిపోని విధంగా దీన్ని రూపొందించారు. బరువుపరంగా చూసిన ఇది చాలా తేలికైంది. వివిధ రకాలైన ఫీచర్స్‌తో ఆటో ఎక్స్పోల్లో అదరహో అనిపిస్తోంది.