ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
హీరో ప్లెజర్ ప్లస్
మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.
టీవీఎస్ జెస్ట్ 110
టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.
హోండా డియో
అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
హీరో జూమ్ (Hero Xoom)
హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు
హీరో డెస్టినీ ప్రైమ్
ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment