ఆధునిక కాలంలో భారతీయ మార్కెట్లో అనేక వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో కొంతమంది హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేస్తే, కొంతమంది ఎంపివిలను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామంది ఆఫ్ రోడింగ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే ఐదు ఆఫ్-రోడ్ కార్లను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Zimny)
ఆఫ్ రోడింగ్ అనగానే గుర్తొచ్చే కార్ల జాబితాలో మారుతి కంపెనీకి చెందిన జిమ్నీ ఒకటి. దీని ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV 4x4 హార్డ్‌వేర్, దృఢమైన సస్పెన్షన్, లైట్ కర్బ్ వెయిట్, నారో ట్రాక్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.
మహీంద్రా థార్ (Mahindra Thar)
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న థార్ పర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ కారుని ఎగబడి మరి కొనుగోలు చేస్తుంటారు. దీని ధర రూ. 13.87 లక్షల నుంచి రూ. 16.78 లక్షల వరకు ఉంటుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ కలిగిన ఈ SUV ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది.
ఫోర్స్ గూర్ఖా (Force Gurkha)
అమ్మకాల పరంగా థార్, జిమ్నీ అంత ఆదరణ పొందనప్పటికీ ఆఫ్ రోడింగ్ విషయం ఇది కూడా అద్భుతమైన చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 14.75 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు డీజిల్ ఇంజిన్ ఆప్షన్‍లో లభిస్తుంది.
(ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?)
మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N)
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా మన జాబితాలో అద్భుతమైన కారు. ఇది SUV అయినప్పటికీ ఆఫ్ రోడింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. కావున అద్భుతమైన ఆఫ్ రోడర్‌గా కూడా పనిచేస్తుంది. దీని ధర రూ. 17.69 లక్షల నుంచి రూ. 24.52 లక్షల మధ్య ఉంది. ఇది ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, లో లెవెల్ గేర్‌బాక్స్ అండ్ మెకానికల్ లాకింగ్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది.
(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంలో రచ్చ రచ్చ చేసిన వామిక గబ్బి - వైరల్ వీడియో)
ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ (Isuzu D-Max V-Cross)
ఆఫ్ రోడింగ్ విభాగంలో అత్యంత ఖరీదైన కారు ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్. దీని ధర రూ. 23.50 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు ఉంది. ఇది సాధారణ ఆఫ్ రోడింగ్ వాహనాల మాదిరిగా కాకుండా లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో వెనుక ఒక చిన్న లగేజ్ స్పేస్ ఉంటుంది. అయినప్పటికీ ఇది మంచి పనితీరుని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment