Affordable Cars With Sunroof: ఆధునిక కాలంలో కార్ల కొనుగోలుదారులు లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న వాటిని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో కస్టమర్ల సౌలభ్యం మేరకు కావలసిన ఫీచర్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు సన్‌రూఫ్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. కాగా ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఎస్‌యువిలలో కూడా ఈ ఫీచర్ లభిస్తోంది. మార్కెట్లో లభించే టాప్ 5 బెస్ట్ సన్‌రూఫ్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా సన్‌రూఫ్ ఫీచర్‌తో దాని విభాగంలో లభించే సరసమైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 13.96 లక్షల నుంచి రూ. 19.20 లక్షల వరకు ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ ఇంజన్ & 1.5-లీటర్, డీజిల్ ఇంజన్ పొందుతుంది. రేండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి.
ఎంజి ఆస్టర్ (MG Aster)
రూ. 14.21 లక్షల నుంచి రూ. 18.69 లక్షల మధ్య లభించే ఈ ఎంజి ఆస్టర్ సన్‌రూఫ్ ఫీచర్ లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5-లీటర్, పెట్రోల్ అండ్ 1.3-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్స్ పొందుతుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. రెడ్ కలర్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది.
కియా సెల్టోస్ (Kia Seltos)
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ పాపులర్ కారు సెల్టోస్ సన్‌రూఫ్ ఫీచర్‌తో లభించే అత్యుత్తమ కారు. దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 1.5-లీటర్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తాయి. కాగా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలు ఇందులో లభించడం విశేషం. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు ఎంతోమంది ప్రజలకు నచ్చిన మోడల్ కావడం గమనార్హం.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara)
రూ. 15.41 లక్షల నుంచి రూ. 19.83 లక్షల మధ్య లభించే మారుతి సుజుకి గ్రాండ్ విటారా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి టాప్ 5 కార్లలో ఒకటి. ఒక మిడ్-సైజ్ ఎస్‌యువి సన్‌రూఫ్ ఫీచర్‌తో రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్‌వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్‌గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?)
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder)
టయోటా కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మన జాబితాలో అత్యధిక ధర వద్ద లభించే సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన కారు. దీని ధర రూ. 16.04 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. బ్లాక్ అండ్ బేజ్ కలర్ ఆప్షన్ ఇంటీరియర్ కలిగిన ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 1.5-లీటర్ పెట్రోల్ & 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో e-CVT పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment