ఒకప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ అనేది కేవలం హై-ఎండ్ కార్లలో మాత్రమే లభించేది. ఇలాంటి కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల సామాన్యులకు సన్‌రూఫ్ కార్లు కొనటం కొంత కష్టమయ్యేది. అయితే ఇప్పుడు తక్కువ ధరకు లభించే కార్లలో కూడా సన్‌రూఫ్ లభిస్తోంది. దేశీయ మార్కెట్లో సరసమైన ధరకు లభించే టాప్ 5 సన్‌రూఫ్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన చౌకైన కార్లలో ఒకటి. ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో ఇది ఒకటి. సన్‌రూఫ్ కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన ఈ కారు ధర రూ. 9.1 లక్షలు. ఇది 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue):
భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ వెన్యూ. సబ్-కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన వెన్యూ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.93 లక్షలు.
మహీంద్రా ఎక్స్‌యువి300 (Mahindra XUV300):
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యువి300 ప్రారంభ ధర రూ. 8.41 లక్షలు. ఈ కాంపాక్ట్ ఎస్‌యువి సన్‌రూఫ్ కలిగి తక్కువ ధరకు లభించే ఉత్తమ మోడల్. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.
కియా సోనెట్ (Kia Sonet):
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ విడుదల చేసిన కార్లలో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యువి సోనెట్ కూడా సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు. ఇది సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు.
టాటా నెక్సాన్ (Tata Nexon):
టాటా నెక్సాన్ భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న అత్యంత సురక్షితమైన కారు. సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న సరసమైన కార్ల జాబితాలో ఇది చెప్పుకోదగ్గ మోడల్. ఈ ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 9.39 లక్షలు(ఎక్స్-షోరూమ్). టాటా నెక్సాన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌లో కూడా అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment