దేశీయ విఫణిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను CNG కార్లుగా రూపొందించి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ కథనంలో 2023లో లాంచ్ అయిన బెస్ట్ సీఎన్‌జీ కార్లను గురించి తెలుసుకుందాం.
మారుతి గ్రాండ్ విటారా సీఎన్‌జీ (Maruti Grand Vitara CNG)
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 'సుజుకి గ్రాండ్ వితారా'.. ఏప్రిల్ 2023న సీఎన్‌జీ కారుగా అడుగుపెట్టింది. 1.5 లీటర్ కె15సీ ఇంజిన్ కలిగిన ఈ కారు 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ మోడల్ కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే కాకుండా హైవేలలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది.
మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ (Maruti Brezza CNG)
దేశీయ విఫణిలో లాంచ్ అయిన మరో మారుతి CNG కారు బ్రెజ్జా. 2023 'మే'లో విడుదలైన ఈ కారు డిజైర్ సీఎన్‌జీ మాదిరిగానే 1.5 లీటర్ కె12సీ ఇంజిన్ కలిగి 20.15 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సరసమైన ధర వద్ద లభిస్తున్న బెస్ట్ CNG కార్లలో ఒకటిగా ఉంది.
టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'పంచ్' మైక్రో SUV కూడా జూన్ 2023న CNG కారుగా లాంచ్ అయింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు 73 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ 3 సిలినార్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG)
2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన 'హ్యుందాయ్ ఎక్స్‌టర్' 2023 జులైలో CNG కారుగా మార్కెట్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ ఫోర్ సిలినార్ ఇంజిన్ కలిగిన ఈ కారు 74 పీఎస్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోడల్ 21 కిమీ?కేజీ మైలేజ్ అందిస్తుంది.
ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు!
టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ (Tata Altroz CNG)
టాటా ఆల్ట్రోజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో CNG కారుగా అందుబాటులో ఉంది. దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా మార్పు పొందినప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 74 పీఎస్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 25.15 కిమీ/కేజీ మైలేజ్ అందించే ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment