Happy New Year 2024
-
2024 New Year Celebrations Pics: ప్రజలు తమ ప్రత్యేక పద్ధతిలో 2024 నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు
-
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా!
గతేడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. గతేడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలికిన లావణ్య తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. అంతే కాకుండా 2024లో తన న్యూ రిజల్యూషన్స్ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని.. తనపై తనకు మరింత ప్రేమ, అలాగే సోషల్ మీడియాకు తక్కువ టైమ్ కేటాయించాలని.. ఎక్కువ సమయం ప్రకృతితో మమేకం కావాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చింది. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
ఫ్యాన్స్‌కు కల్యాణ్ దేవ్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలతో మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం శ్రీజ, కల్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కల్యాణ్ దేవ్ తన ఫ్యాన్స్‌కు విషెస్ తెలిపారు. తన కూతురు నవిష్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. మమ్మల్ని అదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ఇటీవలే నవిష్క ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. నవిష్క బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?
కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. జనవరి 3నుంచి కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుతో కొత్త సంవత్సర ప్రయాణాన్ని భారత జట్టు మొదలుపెట్టబోతుంది. గతేడాది టీమిండియా అద్భుతంగా రాణించి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ.. కీలకమైన వరల్డ్ కప్‌ను అడుగు దూరంలో కోల్పోయింది. ఇప్పటికీ అభిమానులు భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో 2024 జూన్‌లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే విధంగా భారత జట్టు కూడా ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదిలో భారత జట్టు షెడ్యూల్‌పై ఓ లూక్కేద్దం అఫ్గానిస్తాన్‌తో టీ 20 సిరీస్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది ►జనవరి 11న మొహాలీలో తొలి టీ 20 ►జనవరి 14న ఇండోర్‌లో రెండో టీ 20 ►జనవరి 17న బెంగళూరులో మూడో టీ 20 ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. ఇక ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ►జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు - హైదరాబాద్ ►ఫిబ్రవరి 02 నుంచి 06 వరకు రెండో టెస్టు - విశాఖపట్నం ►ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు మూడో టెస్టు - రాజ్‌కోట్ ►ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు - రాంచీ ►మార్చి 07 నుంచి 11 వరకు ఐదో టెస్టు - ధర్మశాల ►ఏప్రిల్- మే: ఐపీఎల్ సందర్భంగా రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ ►జూన్: టీ20 ప్రపంచకప్ (వెస్టిండీస్, యూఎస్ఏలో) ►జులైలో శ్రీలంక పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, 3 టీ20లు టీమిండియా ఆడనుంది ►సెప్టెంబరులో భారత్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రానుంది. రెండు టెస్టులు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడనుంది. ►అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్(ఇంకా తేదీలను ఖారారు చేయలేదు) ►నవంబర్, డిసెంబరులలో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించనుంది . అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. (ఇంకా తేదీలను ఖారారు చేయలేదు) -
'కొత్త సంవత్సరం 2024' వస్తోంది.. అందరం కలిసి ఆహ్వానిద్దామా!
‘ఆ.. ఏం న్యూ ఇయర్ అండీ.. తిని నిద్రపోక’.. ‘మేం ఎక్కడికీ వెళ్లం.. ఎవరినీ పిలవం.. టీవీ చూసి నిద్రపోతాం’.. అంత నిర్లిప్తత... నిరాసక్తత ఎందుకు? న్యూ ఇయర్ అంటే కొత్త కాలెండర్.. కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం.. అర్ధరాత్రి పొద్దుపొడుపు.. లోలోపల నిర్లిప్తత ఉంటే కాలం బ్రైట్‌గా ఎలా షేక్‌హ్యాండ్ ఇవ్వగలదు? మన కోసం 2024 అనే అతిథి వస్తోంది. నలుగురితో కలిసి హుషారుగా ఆహ్వానించండి. కుటుంబమంతా కలిసి సెలబ్రేట్ చేయండి. మంచి ప్రారంభం సంతోషాలకు తొలిమెట్టు.' 2024 వస్తోంది.. వస్తే.. మనకేం సంబంధం? అదేంటి? 2024 ఊరికే వస్తుందా? కొత్త కాలచక్రాన్ని తీసుకుని వస్తుంది. పండుగ సెలవులు, ఇంక్రిమెంట్ సమయాలు, ప్రమోషన్ల ఆంకాక్షలు, పరీక్షల రిజల్ట్‌లు, పై తరగతుల అడ్మిషన్లు, జాబ్ ఇంటర్వ్యూలు, అమెరికా వీసాలు, పెళ్లి ముహూర్తాలు, ఎండల మామిడిపండ్లు, వానలతో ΄ారే ఏర్లు, దసరా సంబరాలు, అభిమాన హీరోల బ్లాక్బస్టర్లు... ఎన్నెన్ని తెస్తుందది. ఏమో.. కుదిరితే ప్రజాహితమైన మరిన్ని పాలనా విధానాలు కూడా తేవచ్చు. ఇవన్నీ ప్రత్యేక్షంగానో పరోక్షంగానో మనతో ముడిపడి ఉంటాయి. అందుకే కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం పలకాలి. హాయ్ చెప్తూ వెల్కమ్ చేయాలి. మాకై మంచి మంచి సంతోషాలను మోసుకురా సుమా అని ఆకాంక్షించాలి. నలుగురు ఉంటే సరదా.. వేడుక సమయాల్లో ఎప్పుడూ నలుగురు ఉంటేనే సరదా. డిసెంబర్ 31 రాత్రి అంటే మరీ ఆర్భాటం అక్కర్లేదు. నిషా ఉండాలన్న నియమం లేదు. హాయిగా కుటుంబ సమేతంగా గడిపి, విందు భోజనంతో, చక్కని ΄ాటలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఆరుబయట చలిమంట వేసుకుంటూ గడిపి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించవచ్చు. లేదా సమీపంలో ఉన్న దగ్గరి బంధువులనో, ఆప్త మిత్రులనో లిమిటెడ్‌గా పిలిచి ఎంజాయ్ చేయవచ్చు. ఇష్టమైన మనుషులు ఉంటే మానసికంగా చాలా ఉత్తేజం ఉంటుంది. మరీ ముఖ్యం.. ఇవాళ చాలామంది మిత్రుల పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. భార్యాభర్తలు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. అలాంటి మిత్రుల్ని పిలిచి ఈ సంతోష సమయాలను పంచవచ్చు. అలంకరణలూ ఆనందమే.. కొత్త సంవత్సరం కొత్త కాంతులు తేవాలని అందరికీ అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఇంటిని డల్‌గా ఉంచొద్దు. చక్కగా సర్దుకోవాలి. ΄పాత సామాన్లు తీసి బయట ΄పారేయాలి. వీలైతే కొత్త కర్టెన్లు, బెడ్షీట్లు మార్చవచ్చు. రంగు కాగితాలు, బెలూన్లు శోభను తెస్తాయి. మార్కెట్లో లేదా అమేజాన్‌లో తక్కువ ధరకే సీరియల్ లైట్లు దొరుకుతున్నాయి. అవి కొన్ని ఇంట్లో వెలిగిస్తే చాలా బాగుంటుంది. మంచి అగర్‌బత్తీలతో, రూమ్ స్ప్రేయర్లతో ఇంటిని పరిమళ భరితం చేసి కొత్త సంవత్సర ఆగమన ఘడియలకు సిద్ధమవ్వాలి. మంచి విందు.. చాలా పసందు! నలుగురూ కలిసి ఇలాంటి సమయంలో ఛలోక్తులతో, చతురోక్తులతో వంట చేస్తే బాగుంటుంది. ఆడవాళ్లకు యధావిధిగా వంట భారం అప్పజెప్పక పోవడమే మంచిది. పార్టీలు గట్రా ఉంటే స్నాక్స్ బయట నుంచి తెప్పించుకున్నా మెయిన్ కోర్స్‌ను ముచ్చట కొద్దీ వండుకోవచ్చు. అదో పద్ధతి. లేదంటే మిత్రులు కొన్ని పదార్థాలు వండుకుని వస్తే, కొన్ని పదార్థాలు మనం వండ వచ్చు. కష్టమూ సంతోషమూ పంచుకున్నట్టు అవుతుంది. చివరలో కేక్ ఎలాగూ కట్ చేస్తారనుకోండి. ఆటలూ పాటలూ.. దాగివున్న విద్యలు బయటపెట్టే సందర్భాలు ఇవి. ఎప్పుడో కాలేజీ రోజుల్లో పాడి ఉంటారు. ఇప్పుడు పాడండి. ఏవో ఇష్టమైన డైలాగులు అభినయించి ఉంటారు. ఇప్పుడూ చేయండి. పిల్లలతో కలిసి సరదాగా నాలుగు స్టెప్పులేయండి. ఇరుగు పొరుగుకు అభ్యంతరం లేని మోతాదులో సందడి చేయండి. వినడానికి ఘంటసాల, పి.సుశీల డ్యూయెట్లా, ఇళయరాజా తమిళ పాటలా అనే వాదనలు కూడా ఇలాంటి సమయాల్లో బాగుంటాయి. చివరగా.. నిద్రపోయే ముందు మనస్ఫూర్తిగా లోకంలో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కామనలు సృష్టికి తెలపండి. అలకలు, ఫిర్యాదులు ఏవైనా ప్రకృతికి ఉంటే దాని మనసు మెత్తబడేలా మనస్ఫూర్తిగా అందరి కోసం ప్రార్థన చేయండి. 'ప్రకృతి వింటుంది. కాలానికి చెబుతుంది. సృష్టి శిరసావహిస్తుంది. శుభమ్!' ఇవి చదవండి: Happy New Year 2024: వెల్కమ్ పార్టీ -
ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా!
‘కొత్త సంవత్సరం అంటే పార్టీ చేసుకోవడం మాత్రమే కాదు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం’ అనే ఎరుకతో వ్యవహరించాలి. ‘కొత్త సంవత్సరం తీసుకునే నిర్ణయాలు అట్టే కాలం ఉండవు’ అనే మాట ఎలా ఉన్నా ఎంతోమంది తమను తాము మెరుగుపరుచుకోవడానికి, వ్యసనాలకు దూరం కావడానికి అవి ఉపయోగపడ్డాయి. మే ది న్యూ ఇయర్ బ్రింగ్ యూ మోర్ హ్యాపీనెస్, సక్సెస్, లవ్ అండ్ బ్లెస్సింగ్స్ 2024 ఈజ్ యువర్ ఇయర్, ఐ కెన్ ఫీల్ ఇట్. చీర్స్ టు ఏ న్యూ ఇయర్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ న్యూ ఇయర్ బ్రింగ్స్ అజ్ లాట్స్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జ్జయిటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ లివ్స్ దిస్ న్యూ ఇయర్ విల్ బీ అవర్ ఇయర్.. హ్యాపీ న్యూ ఇయర్ ఏ న్యూ ఇయర్ ఈజ్ లైక్ ఏ బ్లాంక్ బుక్, అండ్ ది పెన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.. ఇట్ ఈజ్ యువర్ చాన్స్ టు రైట్ ఏ బ్యూటీఫుల్ స్టోరీ ఫర్ యువర్ సెల్ఫ్.. హ్యాపీ న్యూ ఇయర్. ఫుల్ జోష్‌తో ఫ్యూచర్ ప్లాన్.. ఆరోజుల్లో రావుగోపాల్రావు ఏమన్నారండీ? ‘మడిసన్నాక కాస్త కళాపోసణ ఉండాలి’ అని. ‘కళా పోషణ’ మాట ఎలా ఉన్నా కలర్‌ఫుల్ ఫ్యూచర్ ప్లాన్ కంపల్సరీగా ఉండాలి. ప్రతి విజేత విజయం వెనుక బలమైన ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం మన జీవితాల్లోకి వస్తుంది. 365 పేజీల ఖాళీ పుస్తకం మన చేతికి అందుతుంది. మొదటి పేజీలో ‘ఫ్యూచర్ ప్లాన్’ రాసుకున్న వారికి చివరి పేజీ కల్లా విజయం చేతికి అందుతుంది. ఈసారి ప్రయత్నించి చూడండి.. మోస్ట్ చాలెంజింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌గా చెప్పుకునే ‘నీట్’లో మెరిసిన విజేతలు చారుల్ హోనరియ, ఉమర్ అహ్మద్ గనై. పెద్ద విజయాలు సాధించడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డుగోడ కాదు అని నిరూపించారు వీరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కర్తార్‌పూర్ గ్రామానికి చెందిన చారుల్ ‘నీట్’ ప్రవేశ పరీక్షలో 720 మార్కులకు 680 మార్కులు తెచ్చుకుంది. ఆమె తండ్రి పేద రైతు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుమార్తెను చదువుకు దూరం చేయలేదు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమర్ అహ్మద్ గనై ‘నీట్’లో 720 మార్కులకు 601 మార్కులు తెచ్చుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన ఉమర్ అహ్మద్ కూలీపనులు చేస్తూనే చదువుకున్నాడు. ‘నీట్’లో ఆల్–ఇండియా ర్యాంక్(ఏఐఆర్) తెచ్చుకున్న ఈ ఇద్దరు విజేతలు అదృష్టవశాత్తు అపూర్వ విజయం సాధించిన వారు కాదు. ఈ ఇద్దరి విజయం వెనుక బలమైన ఫ్యూచర్ ప్లాన్ ఉంది. భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకున్నప్పుడు మన బలాబలాల గురించి విశ్లేషించుకునే అవకాశం దొరుకుతుంది. డాక్టర్ కావాలనేది చారుల్ లక్ష్యం. ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్న చారుల్ తన ఫ్యూచర్ ప్లాన్‌లో ‘ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించాలి’ అని రాసుకుంది. అక్షరాలా సాధించింది. ‘కొన్నిసార్లు చాలా కష్టపడినప్పటికీ ఫలితం చేతికి అందదు. దీనికి కారణం సరిౖయెన ప్రణాళిక లేకపోవడమే’ అంటున్న ఉమర్ అహ్మద్ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లాడు. ‘నీట్’ గత విజేతలు చెప్పిన టిప్స్, సలహాలు నోటు చేసుకునేవాడు. పొద్దున కూలి పనులతో అలిసిపోయినా, ఆ అలసటను పక్కన పెట్టి ‘నీట్’ కోసం ప్రిపేరయ్యేవాడు. ఈ ఇద్దరు మాత్రమే కాదు ‘భవిష్యత్ ప్రణాళిక’ ఆధారంగా వివిధ రంగాలలో విజయం సాధించిన యువతీ, యువకులు ఎంతోమంది కనిపిస్తారు. ‘భవిష్యత్ దర్శనం అనూహ్యం, అసాధ్యమైనది కాదు. నేటి ప్రణాళికతో అద్భుత భవిష్యత్ సృష్టించుకోవచ్చు’ ‘నేటి ప్రణాళిక.. రేపటి ఫలితం’ ‘నేటి కార్యాచరణపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది’ ‘మనలో డ్రీమర్, ప్లానర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వారు కలిసినప్పుడే విజయం సాధ్యం అవుతుంది’ ‘ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్.. లివ్ ఫర్ టుడే’ ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు ఎన్నో ఉన్నాయి. ► చెన్నైకి చెందిన 22 సంవత్సరాల అరుణ్‌ను కొన్ని సంవత్సరాలుగా ‘స్మోకింగ్’ అనే వ్యసనం దెయ్యంలా పట్టి పీడిచింది. గత సంవత్సరం తొలిరోజు ‘ఈరోజు నుంచి సిగరెట్ ముట్టను’ అన్నప్పుడు ఫ్రెండ్స్ బిగ్గరగా నవ్వారు. అయితే అరుణ్ ఇప్పటి వరకు ఒక్క సిగరెట్ కూడా ముట్టలేదు. ‘చాలా పెద్ద విజయం సాధించినట్లుగా ఉంది. సిగరెట్ తాగను అని ప్రతిజ్ఞ అయితే చేశానుగానీ నా మీద నాకే డౌట్ వచ్చేది. అయితే బయటికి మాత్రం గంభీరంగా ఉండేవాడిని. ఒక వ్యసనానికి వారం రోజులు దూరంగా జరిగితే చాలు మన మీద మనకు నమ్మకం వస్తుంది. ఒక నెల దూరంగా జరిగితే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక కొన్ని నెలలు దూరంగా ఉంటే ఎంత పెద్ద వ్యసనమైనా మన పరిసరాల్లో లేకుండా పారిపోతుంది’ అంటున్నాడు అరుణ్. గతంలో యువతరం కొత్త సంవత్సరం ఎజెండాలో వ్యసనానికి దూరంగా ఉండాలనేది ప్రధానంగా కనిపించేది. ఇప్పుడు మాత్రం అనేకానేక అంశాలు ఆ ఎజెండాలో వచ్చి చేరాయి. అందులో కెరీర్ ప్లానింగ్ ప్రధానమైనది. అదిగో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా! -
39 లక్షల జాబ్స్.. ఉద్యోగార్థులకు పండగే!
కొత్త సంవత్సరంలో జాబ్స్ కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు పండగ లాంటి వార్త ఇది. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో 39 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. స్థూల ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ 2024 ప్రథమార్థంలో భారతదేశంలో 3.9 మిలియన్ల ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని సాస్(SaaS), ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ బెటర్‌ప్లేస్ (BetterPlace) తమ సంవత్సరాంతపు నివేదికలో పేర్కొంది. ఈ పరిశ్రమల నుంచే అత్యధికం ఒక మిలియన్ డేటా పాయింట్లను విశ్లేషించిన బెటర్‌ప్లేస్ నివేదిక.. మొత్తం డిమాండ్‌లో 50 శాతం లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ-కామర్స్, ఐఎఫ్ఎం, ఐటీ పరిశ్రమలు వరుసగా 27 శాతం, 13.7 శాతంతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుంచి 0.87 శాతం, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(QSR) నుంచి 1.96 శాతం డిమాండ్ కొనసాగుతుందని నివేదిక విశ్లేషించింది. ఇదీ చదవండి: అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు! -
Jio New Year Offer: జియో ‘కొత్త’ ఆఫర్! బెనిఫిట్స్ ఇవే..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరిట రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద ఇప్పటికే ఉన్న ఏడాది కాలపరిమితి రీఛార్జ్ ప్లాన్ రూ.2,999పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. దీనివల్ల లాంగ్‌టర్మ్ ప్లాన్ వినియోగించే వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్లాన్ ప్రయోజనాలు ఇవే.. జియో రూ.2,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై 24 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం.. రోజుకు రూ.8.21 పడే ప్లాన్ ధర రూ.7.70లకే తగ్గుతుంది. రోజుకు 2.5 జీబీ అపరిమిత 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా, వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. వీటితో పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం మెంబర్షిప్ ఉండదు. ఇది కావాలంటే విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో న్యూ ఇయర్ ప్లాన్ ప్రయోజనాలు డిసెంబర్ 20 తర్వాత రీచార్జ్ చేసుకున్నవారికి వర్తిస్తాయి. కాగా ఆఫర్‌ను పొందేందుకు చివరి తేదీ అంటూ కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. -
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే!
దేశీయ విఫణిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను CNG కార్లుగా రూపొందించి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ కథనంలో 2023లో లాంచ్ అయిన బెస్ట్ సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం. మారుతి గ్రాండ్ విటారా సీఎన్జీ (Maruti Grand Vitara CNG) ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 'సుజుకి గ్రాండ్ వితారా'.. ఏప్రిల్ 2023న సీఎన్జీ కారుగా అడుగుపెట్టింది. 1.5 లీటర్ కె15సీ ఇంజిన్ కలిగిన ఈ కారు 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ మోడల్ కేవలం సిటీ డ్రైవింగ్‌కు మాత్రమే కాకుండా హైవేలలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి బ్రెజ్జా సీఎన్జీ (Maruti Brezza CNG) దేశీయ విఫణిలో లాంచ్ అయిన మరో మారుతి CNG కారు బ్రెజ్జా. 2023 'మే'లో విడుదలైన ఈ కారు డిజైర్ సీఎన్జీ మాదిరిగానే 1.5 లీటర్ కె12సీ ఇంజిన్ కలిగి 20.15 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సరసమైన ధర వద్ద లభిస్తున్న బెస్ట్ CNG కార్లలో ఒకటిగా ఉంది. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'పంచ్' మైక్రో SUV కూడా జూన్ 2023న CNG కారుగా లాంచ్ అయింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు 73 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ 3 సిలినార్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ (Hyundai Exter CNG) 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన 'హ్యుందాయ్ ఎక్స్టర్' 2023 జులైలో CNG కారుగా మార్కెట్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ ఫోర్ సిలినార్ ఇంజిన్ కలిగిన ఈ కారు 74 పీఎస్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోడల్ 21 కిమీ?కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ (Tata Altroz CNG) టాటా ఆల్ట్రోజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో CNG కారుగా అందుబాటులో ఉంది. దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా మార్పు పొందినప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 74 పీఎస్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 25.15 కిమీ/కేజీ మైలేజ్ అందించే ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. -
మరింత ప్రమాదకరంగా 2024..?
స్టాక్మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు లాభాల్లోకి వెళ్లక దాదాపు సంవత్సరం దాటింది. ఇటీవల మార్కెట్ కాస్త పుంజుకుని ఆల్‌టైమ్‌హైని చేరింది. దాంతో రానున్న ఏడాదిలో లాభాలు వస్తాయేమోననే ఆశలు చిగురించాయి. దానికితోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో 2024 కొంత ఆశాజనకంగా ఉంటుందనే వాదనలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా రానున్న ఏడాదిసైతం నష్టాల తిప్పలు తప్పవని, గతంలో కంటే మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన మార్కెట్ క్రాష్ రాబోతోందని ఆర్థికవేత్త హ్యారీ డెంట్ ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను నమ్మకూడదని కోరారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పెరిగిన మార్కెట్లు ప్రస్తుతం ఓవర్ వ్యాల్యుయేషన్లకు చేరుకున్నందున కుప్పకూలుతాయని జోష్యం చెప్పారు. అయితే ఈసారి వచ్చే మార్కెట్ క్రాష్ 1929-1932లో వచ్చిన మాంధ్యం తీవ్రతతో సమానంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలో ఎస్ అండ్ పీ500లో 86%, నాస్డాక్లో 92%, క్రిప్టో మార్కెట్ 96% కుప్పకూలే ప్రమాదం ఉందని డెంట్ సూచిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను లాభాల్లో ఉన్నప్పుడే విక్రయించటం వల్ల గణనీయమైన నష్టాలను నివారించవచ్చని తెలిపారు. అలాగే భవిష్యత్తులో షేర్ల ధరలు క్షీణించినప్పుడు పెట్టుబడి పెట్టి లాభాలను పొందేందుకు మంచి అవకాశమని సలహా ఇచ్చారు. ఇదీ చదవండి: ‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..? అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వచ్చే ఏడాది కీలక వడ్డీరేట్లను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇటీవల జరిగిన సమావేశాల ఆధారంగా తెలుస్తోంది. అయితే ఇలా రేట్ల తగ్గిస్తూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే చర్యలను మానుకోవాలని డెంట్ అన్నారు. దీని కారణంగా తేలికపాటి మాంధ్యం అంచనాలకు విరుద్ధంగా.. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికమాంధ్యానికి దారితీస్తుందన్నారు. ఈ ఆర్థికవేత్త 1989లో జపాన్‌లో జరిగిన ‘బబుల్ బర్స్ట్’, అమెరికా డాట్-కామ్ బబుల్, డోనాల్డ్ ట్రంప్ విజయం వంటి కీలక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇదే క్రమంలో కొందరు ఆర్థిక వ్యూహకర్తలు, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పెట్టుబడి సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లపై బుల్లిష్‌గానే ఉన్నాయి. -
కొత్త సంవత్సరంలో వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత ఫోన్లు బోర్ కొట్టేశాయా? లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టాప్ బ్రాండ్ల సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సమాచారం. షావోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, వీవో వంటి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 2024 సంవత్సరం జనవరి నెలలో పలు మోడల్లను లాంచ్ చేస్తున్నాయి. ఆయా మోడల్‌ల స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అందిస్తున్నాం.. వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 series) వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ 12ఆర్ (OnePlus 12R)లను ఆ కంపెనీ భారత్‌లో జనవరి 23న రాత్రి 7.30 గంటలకు విడుదల చేయనుంది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ప్రకారం, వన్‌ప్లస్ 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. గరిష్టంగా 24GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చు. కెమెరా పరంగా వన్‌ప్లస్ 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్‌ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ (Xiaomi Redmi Note 13 series) షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్‌ను జనవరి 4న భారత్‌లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 13 (Redmi Note 13), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్‌లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా అవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, ప్రోప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoCతో రావచ్చు. కెమెరా విషయానికొస్తే, నోట్ 13 మోడల్ 100MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ సిరీస్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 series) ఇప్పటికే చైనాలో విడుదలైన వివో ఎక్స్100 సిరీస్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) మోడల్స్ ఉండే అవకాశం ఉంది. చైనాలో లంచ్ అయిన వేరియంట్ల ప్రకారం, ఇవి ఆండ్రాయిడ్ 14 ఆధారిత OriginOS 4పై రన్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో పాటు వివో V3 చిప్‌తో వస్తాయని భావిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రెండు 50MP ప్రైమరీ సెన్సార్‌తో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ రావచ్చు. అయితే ప్రో మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,400 mAh బ్యాటరీతో రావచ్చు. వీటితో పాటు 2024 జనవరిలో రానున్న మరికొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే వాటి లాంచింగ్ తేదీలను ఆయా కంపెనీలు కన్ఫమ్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సి ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్, ఏసస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8), ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) మోడల్స్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. -
‘న్యూ ఇయర్ నుంచి జరిగే మార్పులు ఇవే’.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
మరికొద్ది రోజుల్లో 2023 ముగిసి.. 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో రోజూవారి జీవితంతో ముడిపడి ఉన్న ఆర్ధికపరమైన అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్, స్టాక్ మార్కెట్ మార్కెట్, బ్యాంక్ లాకర్, ఆధార్‌లో మార్పులు వంటి అంశాలు ఉన్నాయి. అయితే, డిసెంబర్ 31 ముగిసి న్యూఇయర్‌లోకి అడుగు పెట్టిన అర్ధరాత్రి నుంచి చోటు చేసుకునే మార్పుల కారణంగా ఎలాంటి ఆర్ధికరపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డిసెంబర్ నెల ముగిసే లోపు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాటిల్లో ప్రధానంగా డీమ్యాట్ అకౌంట్‌కు నామిని : మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా.. లేదంటే కొత్త ఏడాది నుంచి మొదలు పెట్టాలనే ప్రణాళికల్లో ఉంటే మాత్రం తప్పని సరిగా డీమ్యాట్ అకౌంట్లో నామిని వివరాల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారులు స్టాక్స్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా.. సెక్యూరిటీస్‌ని అమ్మాలన్నా, కొనాలన్నా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 లోపు నామినీ వివరాల్ని అందించపోతే ఇకపై మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసేందుకు అర్హులు, పైగా స్టాక్స్‌ను అమ్మలేరు, కొనలేరు. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ : ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ లాకర్ అగ్రమిమెంట్లో డిసెంబర్ 31,2023లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించాలి. నిబంధనల్ని పాటించకపోతే లాకర్ ఫ్రీజ్ అవుతుంది. ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉంటుందని అంచనా. ఆధార్ కార్డ్‌లో మార్పులు : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్‌లో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేసుకోవచ్చని సెప్టెంబర్ 14, 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌దారుల సౌలభ్యం మేరకు ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆధార్‌లో మార్పులు చేసుకోవాలంటే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 సర్వీస్ ఛార్జీ అంటే సులభంగా తీసుకోవద్దు. దేశంలో రోజూవారి కార్మికులు ఎంత సంపాదిస్తున్నారని తెలుసుకునేందుకు ప్లీటాక్స్ ఆనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో దినసరి కూలి రూ.178 అని తేలింది. కాబట్టే డిసెంబర్ 31 లోపు ఆధార్‌లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. సిమ్ కార్డ్‌లో మార్పులు : వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ఇప్పుడు మనం ఏదైనా టెలికాం కంపెనీ సిమ్ కార్డ్ కావాలంటే పేపర్లకు పేపర్లలో మన వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ప్రాసెస్ అంతా అన్లైన్లోనే జరుగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) తెలిపింది. కెనడాలో మారనున్న నిబంధనలు : ఈ నిర్ణయంతో జనవరి 1 నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందే అని చెప్పుకోవాలి. కెనడాలో చదువుకునేందుకు స్టడీ పర్మిట్ కావాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్ధుల వద్ద 10వేల డాలర్లు ఉంటే సరిపోయేదు. కానీ జనవరి 1,2024 ఆ మొత్తాన్ని 20,635 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది.