కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత ఫోన్లు బోర్ కొట్టేశాయా? లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టాప్ బ్రాండ్‌ల సరికొత్త స్మార్ట్ ఫోన్‌ల కోసం చూస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సమాచారం. షావోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, వీవో వంటి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు 2024 సంవత్సరం జనవరి నెలలో పలు మోడల్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఆయా మోడల్‌ల స్మార్ట్ ఫోన్‌ల లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు అందిస్తున్నాం..
వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 series)
వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ 12ఆర్ (OnePlus 12R)లను ఆ కంపెనీ భారత్‌లో జనవరి 23న రాత్రి 7.30 గంటలకు విడుదల చేయనుంది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ప్రకారం, వన్‌ప్లస్ 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. గరిష్టంగా 24GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చు.
కెమెరా పరంగా వన్‌ప్లస్ 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్‌ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
షావోమీ రెడ్‌మీ నోట్ 13 సిరీస్ (Xiaomi Redmi Note 13 series)
షావోమీ రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ను జనవరి 4న భారత్‌లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13 (Redmi Note 13), రెడ్‌మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్‌లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా అవే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, ప్రోప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoCతో రావచ్చు.
కెమెరా విషయానికొస్తే, నోట్ 13 మోడల్ 100MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ సిరీస్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 series)
ఇప్పటికే చైనాలో విడుదలైన వివో ఎక్స్100 సిరీస్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) మోడల్స్ ఉండే అవకాశం ఉంది. చైనాలో లంచ్ అయిన వేరియంట్‌ల ప్రకారం, ఇవి ఆండ్రాయిడ్ 14 ఆధారిత OriginOS 4పై రన్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో పాటు వివో V3 చిప్‌తో వస్తాయని భావిస్తున్నారు.
ఇక కెమెరా విషయానికి వస్తే రెండు 50MP ప్రైమరీ సెన్సార్‌తో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ రావచ్చు. అయితే ప్రో మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,400 mAh బ్యాటరీతో రావచ్చు.
- వీటితో పాటు 2024 జనవరిలో రానున్న మరికొన్ని స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. అయితే వాటి లాంచింగ్ తేదీలను ఆయా కంపెనీలు కన్ఫమ్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సి ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్, ఏసస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8), ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) మోడల్స్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment