January
-
వాహన రిటైల్ అమ్మకాలు 7% పెరిగాయ్
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు జనవరిలో 7% పెరిగాయని డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. ఈ ఏడాది తొలి (జనవరి) నెలలో మొత్తం 22,91,621 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో డిమాండ్ ఊపందుకోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. కాగా గతేడాది(2024) జవనరిలో ఈ సంఖ్య 21,49,117 యూనిట్లకు పరిమితమయ్యాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, మెరుగైన ఫైనాన్సింగ్ తదితర కారణాలు కలిసొచ్చాయని డీలర్లు చెప్పుకొచ్చారు. ఈ ఫిబ్రవరిలో అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతుందని 46%, నెమ్మదిస్తుందని 43%, మిగిలిన ఒకశాతం అమ్మకాల్లో క్షీణత ఉండొచ్చని డీలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘స్థిరమైన మార్కెట్ రికవరీ కారణంగా టూ వీలర్లు, త్రి చక్ర, ప్యాసింజర్, వాణిజ్య వాహనాలతో పాటు ట్రాక్టర్ల విక్రయాలు పెరిగాయి. మరోవైపు వడ్డీ రేట్ల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్య సవాళ్లు, మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు ఇంకా పరిశ్రమను వెంటాడుతున్నాయి’’ అని ఫాడా చైర్మన్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. -
దేశవ్యాప్తంగా పెరిగిన ట్రక్ అద్దెలు
ముంబై: దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ట్రక్ల అద్దెలు జనవరిలో గణనీయంగా కోలుకున్నాయి. శీతాకాలంలో పండ్లు, కూరగాయల దిగుబడులు ఇందుకు మద్దతుగా నిలిచాయి. కొన్ని మార్గాల్లో ట్రక్ల అద్దెలు 2024 డిసెంబర్‌తో పోలి్చతే జనవరిలో 4 శాతం వరకు పెరిగినట్టు శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ బులెటిన్ వెల్లడించింది. ‘‘సాధారణంగా జనవరి–మార్చి కాలం రద్దీగా ఉంటుంది. రబీ పంట తర్వాత వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పలు రంగాల్లోనూ తయారీ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి’’అని శ్రీరామ్ ఫైనాన్స్ తెలిపింది. వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, వ్యవసాయ ట్రైలర్ల అమ్మకాలు గత నెలలో గణనీయంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఢిల్లీ–ముంబై–ఢిల్లీ మార్గంలో ట్రక్ల అద్దెల ధరలు 4 శాతం పెరిగాయి. ముంబై–కోల్‌కతా–ముంబై మార్గంలో 3.7 శాతం మేర ధరలు అధికమయ్యాయి. ఢిల్లీ–హైదరాబాద్–ఢిల్లీ మార్గం, కోల్‌కతా–గువహటి–కోల్‌కతా మార్గంలో అద్దెలు 3.3 శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ‘‘లాజిస్టిక్స్ రంగంలో ట్రక్ల అద్దె రేట్లు పెరగడం సానుకూల సంకేతం. శీతాకాల పండ్లు, కూరగాయల దిగుబడులతో రవాణా, స్టోరేజీ వసతులకు డిమాండ్ పెరిగింది’’అని శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో వైఎస్ చక్రవర్తి తెలిపారు. -
జీఎస్టీ వసూళ్ల జోరు.. చాన్నాళ్లకు అత్యధికం
జనవరి నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 12.3% అధికంగా రూ.1.96 లక్షల కోట్లు వసూలైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేశీ వస్తు, సేవల ద్వారా 10.4% అధికంగా రూ.1.47 లక్షల కోట్లు వసూలైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ ఆదాయం 19.8% అధికంగా రూ.48,382 కోట్లు సమకూరింది. గతేడాది ఏప్రిల్ నుండి ఇవే అత్యధిక జీఎస్టీ వసూళ్లు కావడం విశేషం.మొత్తం జీఎస్టీ ఆదాయం జనవరి నెలకు రూ.1,95,506 కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అదే నెలలో రూ.23,853 కోట్లు రిఫండ్లు జారీ చేసినట్టు, ఇది క్రితం ఏడాది ఇదే నెలలో పోల్చి చూసినప్పుడు 24% పెరిగినట్టు పేర్కొంది. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర ఆదాయం 1.72 లక్షల కోట్లు అని, ఇది 10.9% వృద్ధికి సమానమని వెల్లడించింది.జీఎస్టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతుండడం ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, వ్యాపార సంస్థల నిబంధనల అమలుకు నిదర్శనమని కేపీఎంజీ పరోక్ష పన్నుల హెడ్ అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. రిఫండ్ల తర్వాత కూడా నికర వసూళ్లు అధికంగా ఉండడం ప్రశంసనీయమన్నారు.రాష్ట్రాల వారీగా..జనవరి నెలలో రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందుంది. రూ. 32,335 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది. గుజరాత్ తర్వాత రూ. 12,135 కోట్లు, కర్ణాటక రూ. 14,353 కోట్లు, తమిళనాడు రూ. 11,496 కోట్లు, హర్యానా రూ. 10,284 కోట్లతో ఆ తర్వాత స్థానాలలో నిలిచాయి. ఇక అత్యల్ప జీఎస్టీ వసూళ్లలో చూసుకుంటే రూ. 1 కోటి వసూళ్లతో లక్షద్వీప్ అట్టడుగు స్థానంలో ఉంది. మణిపూర్ (రూ. 56 కోట్లు), మిజోరాం (రూ. 35 కోట్లు), అండమాన్ నికోబార్ దీవులు (రూ. 43 కోట్లు), నాగాలాండ్ (రూ. 65 కోట్లు) చివరి నుంచి తర్వాతి స్థానాలలో ఉన్నాయి. -
కొత్త ఏడాది.. మంచి బోణీ మారుతీ సుజుకీదే..
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త ఏడాది జనవరిలో మొత్తం 2,12,251 వాహనాలు విక్రయించింది. గడిచిన ఏడాది ఇదే జనవరి అమ్మకాలు 1,99,364 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ఇందులో దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,66,802 యూనిట్ల నుంచి 1,73,599 యూనిట్లకు చేరాయి.విదేశాలకు ఎగుమతులు 23,921 యూనిట్లకు 27,100 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాలు 3% తగ్గి 57,115 వాహనాలకు చేరాయి. ఇందులో దేశీయంగా 54,003 వాహన అమ్మకాలు జరగ్గా.., విదేశాలకు ఎగుమతులు 11,600 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2024 జనవరిలో 67,615 యూనిట్ల విక్రయాలు అమ్ముడయ్యాయి.టాటా మోటార్స్ అమ్మకాలు 86,125 యూనిట్ల నుంచి 80,304 యూనిట్లకు పరిమితమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 24,609 నుంచి 19% పెరిగి 29,371కు చేరాయి. మహీంద్రాఅండ్‌మహీంద్రా విక్రయాలు 16% పెరిగి 85,432 యూనిట్లకు చేరాయి. -
అంధుల అక్షర శిల్పి
అంధులు సైతం సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందేనన్న ఆశయంతో వారి విద్యార్జన కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన అక్షర శిల్పి లూయీ బ్రెయిలీ. ఫ్రాన్స్‌లో ఒక మారుమూల గ్రామమైన కూప్వ్రేలో సైమన్, మోనిక్ దంపతులకు 1809 జనవరి 4న ఆయన జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు బ్రెయిలీ. ఆయన తల్లిదండ్రులు వృత్తి రీత్యా చర్మకారులు. లూయీ తన తండ్రితో కలిసి ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ఉండగా చువ్వ ఎగిరి వచ్చి లూయీ కంటిలో గుచ్చుకుంది. పేదరికం కారణంగా మంచి వైద్యం అందించలేక పోవటంతో కంటిచూపు మొత్తం పోయింది. తర్వాత కొంతకాలానికే ఇన్ఫెక్షన్ ఎక్కువై రెండవ కంటిచూపు కూడా పోయింది. అప్పుడు పిల్లాడి వయసు ఐదేళ్లు. అయితే అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు తమ పెద్ద పిల్లలతో పాటుగా లూయీని గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపించారు. అక్కడ కొడుకు కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి... చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. అతడిలోని చదువుకోవాలనే పట్టుదలను, తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.1821లో చార్లెస్ బార్బియర్ అనే సైన్యాధికారి తన సైనికులకు 12 చుక్కలతో నిగూఢ లిపిలో శిక్షణ ఇచ్చేవాడు. దాన్ని లూయీ అభ్యసించాడు. దానితో సంతృప్తి చెందకుండా ఆ లిపిపై పరిశోధనలు ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల కృషి అనంతరం 1832లో సరళమైన విధానంలో చుక్కల లిపిని కనుగొన్నాడు. దానికి ఆయన పేరుమీదనే తర్వాత బ్రెయిలీ లిపి అని పేరొచ్చింది. ఇది ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా ఆనాడే రూపొందిందంటే ఆయన ముందుచూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీని క్షయ మహమ్మారి పట్టి పీడించటంతో నాలుగు పదుల వయసులోనే 1852 జనవరి 6న కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్ర కారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయీ బ్రెయిలీ అంధుల అక్షర ప్రదాతగా ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.– పి. రాజశేఖర్ ‘ ఆలిండియా జనరల్ సెక్రెటరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (నేడు లూయీ బ్రెయిలీ జయంతి; జనవరి 6న వర్ధంతి) -
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలువివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.CBDT extends due date for determining amount payable as per column (3) of Table specified in section 90 of Direct Tax Vivad Se Vishwas Scheme, 2024 from 31st December, 2024 to 31st January, 2025.Circular No. 20/2024 dated 30.12.2024 issuedhttps://t.co/uYGf1Oh3g2 pic.twitter.com/agjuRsMHqg— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2024 -
బ్యాంకులకు వరుస సెలవులు
కొత్త ఏడాది (New Year 2025) మొదలవుతోంది. తొలి నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు (Bank holidays) ఉన్నాయి. వివిధ పండుగలు, విశేషమైన సందర్భాల కారణంగా జనవరిలో (January) చాలా రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో ముందుగా తెలుసుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. అన్ని ప్రభుత్వ సెలవులు, అలాగే రాష్ట్రాలవారీగా మారే కొన్ని ప్రాంతీయ సెలవు రోజుల్లో కూడా బ్యాంకులను మూసివేస్తారు. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.జనవరిలో సెలవులు ఇవే..జనవరి 1: బుధవారం- నూతన సంవత్సరాదిజనవరి 2: నూతన సంవత్సరం, మన్నం జయంతిజనవరి 5: ఆదివారం జనవరి 6: సోమవారం- గురుగోవింద్ సింగ్ జయంతి జనవరి 11: శనివారం- మిషనరీ డే, రెండవ శనివారం జనవరి 12: ఆదివారం- స్వామి వివేకానంద జయంతి జనవరి 13: సోమవారం- లోహ్రి జనవరి 14: మంగళవారం- మకర సంక్రాంతి, మాఘ బిహు, పొంగల్జనవరి 15: బుధవారం- తిరువళ్లువర్ దినోత్సవం (తమిళనాడు), తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం) జనవరి 16: ఉజ్జవర్ తిరునాల్ జనవరి 19: ఆదివారం జనవరి 22: ఇమోయిన్ జనవరి 23: గురువారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 25: శనివారం- నాల్గవ శనివారం జనవరి 26: ఆదివారం- గణతంత్ర దినోత్సవం జనవరి 30: సోనమ్ లోసర్దేశంలో రాష్ట్రాలవారీగా మారే జాతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులను మూసివేస్తారు. బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లు డిజిటల్‌గా వివిధ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు బ్యాంకు సెలవుల సమయంలో అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు తమ పనిని ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి. -
మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?
భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఒకటి. ఇప్పటి వరకు ఒక అకౌంట్ తీసుకుని చాలామంది దీనికి సంబంధించిన సేవలను వినియోగించుకునే వారు. కానీ 2025 జనవరి నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి.జనవరి నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లు & ధరలుఅమెజాన్ ఇండియా వివిధ అవసరాలు, బడ్జెట్లకు అనుగుణంగా ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో నెలవారీ ప్లాన్ ధర రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, ఏడాది ప్లాన్ రూ. 1499 వద్ద ఉన్నాయి. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి యూజర్లు ప్రయోజనాలను పొందవచ్చు. -
అయోధ్య: 10 రోజుల ముందుగానే వార్షికోత్సవాలు.. కారణమిదే..
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో వచ్చే ఏడాది(2025) జనవరిలో నూతన రామాలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పుటినుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది.అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం అయోధ్య ఆలయాన్ని సందర్శించుకుంటూ వస్తున్నారు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామాలయ వార్షికోత్సవ వేడుల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. దీనిప్రకారం జనవరి 22న కాకుండా జనవరి 11నే వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇలా 10రోజుల ముందుగా ఈ వేడుకలు నిర్వహించడం వెనుక ఒక కారణం ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.అయోధ్యలోని మణిరామ్ దాస్ కంటోన్మెంట్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పండితులతో సంప్రదింపులు జరిపారు. రాబోయే సంవత్సరంలో రామాలయంలో ఎప్పుడు ఏ ఉత్సవం నిర్వహించాలనేదీ నిర్ణయించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.ప్రతి సంవత్సరం పౌష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి నాడు ఈ ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. 2025లో ఈ తిధి జనవరి 11న వచ్చింది. దీని ప్రకారం అయోధ్యలో నూతన రామాలయ, బాల రాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవ కార్యక్రమాలు జనవరి 11న జరగనున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ సమావేశంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే వార్షికోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
Tirumala: శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 73,926 మంది స్వామివారిని దర్శించుకోగా 23,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 1 గంటల్లో దర్శనమవుతోంది. నిర్దేశించిన సమయానికే భక్తులు క్యూలోకి వెళ్లాలని టీటీడీ కోరింది.22న ఆర్జిత సేవా టికెట్ల విడుదలకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.22న వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అక్టోబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లుజనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాంశ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాంవయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అక్టోబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలజనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలంతిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
జనవరిలో 47 లక్షల కొత్త ఫోలియోలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో జనవరిలో 46.7 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. డిజిటల్ మార్గాల ద్వారా ఫండ్స్‌లో సులభంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటుకుతోడు, ఆర్థిక సాధనాల పట్ల పెరుగుతున్న అవగాహన ఈ వృద్ధికి తోడ్పుడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలించినా, నెలవారీగా ఫోలియోల పెరుగుదల 22.3 లక్షలుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తాజా డేటా వెల్లడిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఫోలియోలు 16.96 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది జనవరి చివరికి ఉన్న 14.28 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 19 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2023 డిసెంబర్ చివరి నుంచి ఈ ఏడాది జనవరి చివరికి ఫోలియోలలో 3 శాతం వృద్ధి నమోదైంది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి సంబంధించి ఇచ్చే గుర్తింపును ఫోలియో (పెట్టుబడి ఖాతా)గా చెబుతారు. ఒక ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు ఉంటాయి. పెరుగుతున్న అవగాహన ‘‘డిజిటల్ పరిజ్ఞానం పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆరి్థక అక్షరాస్యత అనేవి సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్‌లు కాకుండా ఇతర సాధనాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఇదే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇతోధికం కావడానికి దోహం చేస్తున్నాయి’’అని వైట్ఓక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. మెజారిటీ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డిజిటల్ ఛానళ్లనే ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో నమోదైన 46.7 లక్షల ఫోలియోలలో ఈక్విటీలకు సంబంధించి 34.7 లక్షలుగా ఉన్నాయి. దీంతో జనవరి చివరికి ఈక్విటీ పథకాలకు సంబంధించిన ఫోలియోలు 11.68 కోట్లకు చేరాయి. జనవరిలో హైబ్రిడ్ ఫండ్స్‌కు సంబంధించి 3.36 లక్షల ఫోలియోలు కొత్తగా నమోదయ్యాయి. దీంతో హైబ్రిడ్ పథకాలకు సంబంధించి మొత్తం ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. డెట్ పథకాలకు సంబంధించిన ఫోలియోలు వరుసగా ఐదో నెలలోనూ క్షీణతను చూశాయి. జనవరిలో డెట్ పథకాలకు సంబంధించి 74.66 లక్షల ఫోలియోలు తగ్గాయి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఫోలియోలు, పెట్టుబడులు గణనీయంగా పెరిగినప్పటికీ.. దేశ జనాభాలో ఈ సాధనాల వ్యాప్తి ఇప్పటికీ 3 శాతం మించలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 45 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు జనవరి చివరికి రూ.53 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
విపరీతంగా వాహన విక్రయాలు.. ఇంతలా కొనేశారేంటి?
న్యూఢిల్లీ: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో జనవరిలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హోల్‌సేల్ స్థాయిలో గత ఏడాది జనవరితో పోలిస్తే 14 శాతం పెరిగి 3,93,074 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలలో పీవీల విక్రయాలకు సంబంధించి ఇవి అత్యుత్తమ గణాంకాలు. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం టూ–వీలర్ల హోల్‌సేల్ విక్రయాలు 26 శాతం పెరిగి 14,95,183 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో వీటి సంఖ్య 11,84,376 యూనిట్లుగా ఉంది. వినియోగదారుల సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటంతో ప్యాసింజర్ వాహన అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటూ ఉండటంతో టూ–వీలర్ల విభాగం కూడా జనవరిలో వృద్ధి నమోదు చేసిందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. వాణిజ్య వాహనాల విభాగం పనితీరు అంత మెరుగ్గా లేనప్పటికీ వచ్చే రెండు నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 9 శాతం వృద్ధి చెందాయి. 48,903 యూనిట్ల నుంచి 53,537 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను పటిష్టం చేయడంపై, ముఖ్యంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలు..ప్రజా రవాణాపై ప్రభుత్వం 2024 బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టడమనేది ఆటో రంగం వృద్ధి గతి కొనసాగేందుకు దోహదపడగలదని అగర్వాల్ పేర్కొన్నారు. జనవరిలో అమ్మకాలు ఇలా.. మార్కెట్ లీడరు మారుతీ సుజుకీ హోల్‌సేల్ అమ్మకాలు 1,47,348 యూనిట్ల నుంచి 1,66,802 యూనిట్లకు చేరాయి. పోటీ సంస్థ హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 50,106 యూనిట్ల నుంచి 57,115కి పెరిగాయి. అటు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) హోల్‌సేల్ అమ్మకాలు 33,040 వాహనాల నుంచి 43,068కి చేరాయి. మోటర్‌సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ గతేడాది జనవరిలో 3,26,467 వాహనాలను విక్రయించగా ఈసారి 3,83,752 యూనిట్లు విక్రయించింది. అటు హోండా మోటర్‌సైకిల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,27,912 యూనిట్ల నుంచి 1,83,638 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు 1,38,860 యూనిట్ల నుంచి 1,78,056 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటర్ అమ్మకాలు 1,24,664 యూనిట్లుగా (గత జనవరిలో 1,00,354), సుజుకీ మోటర్‌సైకిల్ విక్రయాలు 78,477 యూనిట్లుగా (గత జనవరిలో 65,991) నమోదయ్యాయి. స్కూటర్లకు సంబంధించి హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 1,50,243 యూనిట్ల నుంచి 1,98,874 యూనిట్లకు చేరాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనవరిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ పథకాల్లోకి రెండేళ్ల గరిష్ట స్థాయిలో రూ.21,780 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్, థీమ్యాటిక్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. 2023 డిసెంబర్ నెలలో వచి్చన రూ.16,997 కోట్లతో పోల్చి చూసినప్పుడు 28 శాతం అధికంగా పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. చివరిగా 2022 మార్చి నెలలో రూ.28,443 కోట్లు ఈక్విటీ ఫండ్స్‌లోకి రాగా, ఇప్పటి వరకు అదే గరిష్ట రికార్డుగా కొనసాగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు ఆదరణ కొనసాగుతోంది. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ.18,838 కోట్లకు చేరాయి. డిసెంబర్ నెలలో వచి్చన సిప్ పెట్టుబడులు రూ.17,610 కోట్లను అధిగమించాయి. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. కొత్తగా 51.84 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాలు జనవరి చివరికి 7.92 కోట్లకు పెరిగాయి. ‘‘జనవరిలో అస్థిరతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బలమైన పనితీరు చూపించాయి. మార్కెట్ ఆటుపోట్లలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించడం, దీర్ఘకాలంలో సంపద సృష్టి దిశగా వారి నిబద్ధతను తెలియజేస్తోంది’’అని బ్రోకరేజీ సంస్థ ‘ప్రభుదాస్ లీలాధర్’ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ట పేర్కొన్నారు. జనవరిలో మూడు కొత్త ఈక్విటీ పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) సంయుక్తంగా రూ.967 కోట్లను సమీకరించినట్టు మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారియా తెలిపారు. విభాగాల వారీగా.. ► థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.4,805 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,257 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.600 కోట్ల పెట్టుబడుల రాక తగ్గింది. ► మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,039 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,287 కోట్లు ఆకర్షించాయి. 19 నెలల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్ నెలలో లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.281 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ ఫండ్స్ రూ.76,469 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. డిసెంబర్ నెలలో ఇదే విభాగం రూ.75,560 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.49,468 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.10,651 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ పథకాలలో ఇన్వెస్టర్లు రూ.657 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ► మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ జనవరి నెలలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత డిసెంబర్లో రూ.40,685 కోట్ల పెట్టుబడులను కోల్పోవడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్ చివరికి ఉన్న రూ.50.78 లక్షల కోట్ల నుంచి రూ.52.74 లక్షల కోట్లకు పెరిగింది. బంగారంలో హెడ్జింగ్.. ‘‘మిడ్‌క్యాప్ స్టాక్స్ 15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్ 20 శాతం మేర ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో విలువల అంతరాన్ని గుర్తించారు. అందుకు తగ్గట్టు పెట్టుబడుల్లో మార్పులు చేసుకున్నారు’’అని ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగా ఉండడంతో బంగారం సురక్షిత సాధనంగా, ద్రవ్యోల్బణానికి మంచి హెడ్జింగ్ సాధనంగా కొనసాగుతుందని మెలి్వన్ శాంటారియా పేర్కొన్నారు. -
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
2024లో ఆటో సూపర్స్టార్ట్
ముంబై: దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త సంవత్సరం శుభారంభం ఇచి్చంది. పలు ఆటో సంస్థలు 2024 జనవరిలో గత సంవత్సరం ఇదే నెలతో పోలి్చతే గణనీయమైన అమ్మకాలు జరిపాయి. మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా జనవరి అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం అమ్మకాలలో దేశీయ పరిమాణం జనవరిలో 2,78,155 నుండి 3,82,512 యూనిట్లకు పెరిగింది. ఇక ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 102 శాతం పెరిగి 36,883 యూనిట్లుగా ఉన్నాయి. -
జనవరిలో జీఎస్టీ @ రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జనవరిలో 10.4 శాతం పెరిగి రూ.1,72,129 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జూలైలో కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి రెండవ అతిపెద్ద భారీ వసూళ్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్లుపైబడిన వసూళ్లు ఇది మూడవసారి కావడం మరో విశేషం. జనవరి 31వ తేదీ 5 గంటల సమయం వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకూ జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి 16.69 లక్షల కోట్లకు ఎగసింది. 2023 ఏప్రిల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు చోటుచేసుకున్నాయి. -
టెక్ ఉద్యోగులపై లేఆఫ్ కత్తి!
కరోనా ముగిసింది.. ఉద్యోగాలకు ఏం భయం లేదనుకుని 2024లో అడుగుపెట్టిన టెకీలకు ఈ ఏడాది కూడా చుక్కెదురవుతోంది. 2024 ప్రారంభమైన మొదటి నెల కావొస్తున్నా.. ఉద్యోగుల్లో లేఆప్స్ భయం పోవడం లేదు. ఎందుకంటే జనవరిలో ఇప్పటికి ఏకంగా 24,564 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవడమే. మొదటి నెలలో లేఆఫ్స్.ఎఫ్‌వైఐ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు 91 టెక్ కంపెనీలు 24,564 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ కంపెనీ గత శుక్రవారమే తమ కంపెనీ సిబ్బందిలో 700 మందిని తొలగిస్తున్నట్ల ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. 2023లో మొత్తం 1187 టెక్ కంపెనీల నుంచి 2,62,595 మంది ఉయోగాలను కోల్పోయినట్లు లేఆఫ్-ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi నుంచి వచ్చిన డేటా ఆధారంగా తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక మెమోలో వెల్లడించింది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తొలగించింది. ఇవన్నీ చూస్తుంటే టెక్ ఉద్యోగులకు 2024 కూడా కలిసి రాదేమో అనే భావన చాలామందిలో మొదలైపోయింది. -
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ 'దేవేంద్ర సింగ్ చౌహాన్' ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో రేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఈ-కేవైసీ తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు ఇంకా ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తూ మరో నెల రోజులు అవకాశం కల్పించారు. రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గడువును 2024 జనవరి 31 పొడిగించారు. ఈ గడువు లోపల ఈ-కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గత రెండు నెలలుగా రేషన్ డీలర్లు ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీని కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తులు వంటివి తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే.. నిర్దిష్ట గడువు లోపల ఈ-కేవైసీ అప్డేట్ పొందని రేషన్ కార్డులను, నకిలీ రేషన్ కార్డులుగా గుర్తించి.. వాటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే ప్రజలు అప్పటి వరకు పొందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. 2023 డిసెంబర్ 30 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు 70.80 శాతం అని తెలుస్తోంది. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో (87.81 శాతం) ముందు వరుసలో ఉన్నట్లు.. అతి తక్కువ నమోదైన జిల్లాలో వనపర్తి (54.17 శాతం) ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే 2024లో బ్యాంకుల సెలవులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇప్పటికే విడుదకైనా జాబితా ప్రకారం, జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవని (సెలవు దినాలు) తెలుస్తోంది. రిపబ్లిక్ డే కారణంగా జనవరి 26 నేషనల్ హాలిడే, మిగిలిన రోజుల్లో ప్రాంతీయ పండుగలు, రెండవ & నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. జనవరి 2024లో బ్యాంక్ సెలవుల జాబితా జనవరి 1 (సోమవారం): దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జనవరి 11 (గురువారం): మిజోరంలో మిషనరీ డే జరుపుకున్నారు జనవరి 12 (శుక్రవారం): పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద జయంతిని జరుపుకున్నారు జనవరి 13 (శనివారం): పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో లోహ్రీ జరుపుకుంటారు జనవరి 14 (ఆదివారం): చాలా రాష్ట్రాల్లో మకర సంక్రాంతి జరుపుకుంటారు జనవరి 15 (సోమవారం): తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పొంగల్, తమిళనాడులో తిరువల్లువర్ దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 16 (మంగళవారం): పశ్చిమ బెంగాల్, అస్సాంలో తుసు పూజ జరుపుకుంటారు జనవరి 17 (బుధవారం): కొన్ని రాష్ట్రాల్లో గురు గోవింద్ సింగ్ జయంతి జరుపుకుంటారు జనవరి 23 (మంగళవారం): సుభాష్ చంద్రబోస్ జయంతిని అనేక రాష్ట్రాల్లో జరుపుకున్నారు జనవరి 26 (శుక్రవారం): భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి 31 (బుధవారం): అస్సాంలో మీ-డ్యామ్-మీ-ఫై జరుపుకుంటారు -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనున్నట్లు ఇదివరకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ద్వారా ఏకంగా రూ. 50000 కోట్ల వ్యాపారం జరగనున్నట్లు సీఏఐటీ (CAIT) అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జనవరి 22న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అతిరథ మహారధులు, అశేష భక్త జనం వెల్లువెత్తుతారు. దీంతో తప్పకుండా రూ. వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని 'ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (సీఏఐటీ) భావిస్తోంది. అయోధ్య రాముడు కొలువుదీరిన రోజున.. వ్యాపారులు మాత్రమే కాకుండా కళాకారుకులు కూడా భారీగా లాభపడే అవకాశం ఉందని CAIT సెక్రటరీ జనరల్ 'ప్రవీణ్ ఖండేల్వాల్' వెల్లడించారు. ఇదీ చదవండి: అయోధ్య ఎయిర్‌పోర్టుకి ఎవరి పేరు పెడుతున్నారో తెలుసా? విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులు, లాకెట్లు, కీ చైన్లు, రామ దర్బార్ చిత్రాలు, రామ మందిరం నమూనాలు, శ్రీరామ ధ్వజ, శ్రీరామ అంగవస్త్రం మొదలైనవి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. శ్రీరామ మందిర నమూనాలకు డిమాండ్ ఇందులో ముఖ్యంగా శ్రీరామ మందిర నమూనాలకు అధిక డిమాండ్ ఉందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు వీటిని హార్డ్‌బోర్డ్, పైన్‌వుడ్, కలప మొదలైన వాటితో విభిన్న సైజుల్లో తయారు చేశారు. ఈ మోడల్లను తయారు చేయడంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారని వాణిజ్య సంఘం నాయకులు వెల్లడించారు. పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వచ్చే భక్తులు ప్రత్యేక వస్త్రాలు ధరించడానికి ఆసక్తి చూపుతారనే ఆలోచనతో కుర్తాలు, టీ-షర్టులను అందుబాటులో ఉంచనున్నారు. వీటిపైన శ్రీరామ మందిర నమూనాలు ముద్రించి ఉంటారని తెలుస్తోంది. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ఇప్పటికే పిలుపునివ్వడంతో మట్టి దీపాలకు, రంగోలిలో ఉపయోగించే వివిధ రంగులకు, అలంకరణ పూలు, ఎలక్ట్రికల్ దీపాల వంటి వస్తువులకు విపరీతమైన గిరాకీ ఉంటుందని వాణిజ్య సంఘం సీనియర్ సభ్యులు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హోర్డింగ్‌లు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు మొదలైన ప్రచార సామగ్రి తయారీదారులు కూడా గణనీయమైన లాభాలను పొందనున్నారు. ఇదీ చదవండి: పనిచేయకుండా రూ.830 కోట్ల సంపాదిస్తున్నాడు - ఎలా అంటే? వస్తువులు, కరపత్రాల బిజినెల్ పక్కన పెడితే.. రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో దేశవ్యాప్తంగా శ్రీరామ మందిరానికి సంబంధించిన పాటలు పెద్ద సంఖ్యలో కంపోజ్ చేస్తారు. దీని వల్ల కంపోజర్స్, సింగర్స్ మాత్రమే కాకుండా ఆర్కెస్ట్రా పార్టీలు కూడా శ్రీరామ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలకు నిర్వహించి పెద్ద ఎత్తున లాభపడే లాభపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
Russia-Ukraine War: రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్ ‘నో’
కీవ్: తమ భూభాగంపై దురాక్రమణకు దిగిన రష్యాపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్ శతాబ్దకాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికీ తిలోదకాలు ఇచి్చంది. వందేళ్లకుపైగా ఉక్రెయిన్ జనవరి ఏడో తేదీనే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్.. రష్యాతోపాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్ క్యాలెండర్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఈఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ‘ ఉక్రేనియన్లు సొంత సంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించనున్నారు’ అని ఈ సందర్భంగా జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో క్రైస్తవ జనాభానే అధికం. ఉక్రెయిన్‌లో దశాబ్దాలుగా రష్యన్ ప్రాచీన చర్చి సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం. -
Aditya-L1: జనవరి ఆరున కక్ష్యలోకి ఆదిత్యఎల్1
అహ్మదాబాద్: భగభగమండే భానుడి వాతావరణం, సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్షనౌక ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన తన కక్ష్యలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనావేశారు. శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఎన్జీవో ఏర్పాటుచేసిన ‘భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజియాన్ పాయింట్(ఎల్) కక్ష్యలోకి ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన చేరుకుంటుందని భావిస్తున్నాం. ఆరో తేదీన ఎల్1 పాయింట్లోకి చేరగానే వ్యోమనౌక మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేకదిశలో ఇంజిన్‌ను మండిస్తాం. దాంతో అది ఆ కక్ష్యలో స్థిరంగా కుదురుకుంటుంది. ఆ కక్ష్యలోనే తిరుగుతూ సూర్య వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలుపెడుతుంది. వచ్చే ఐదేళ్లపాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేíÙంచనుంది. స్పేస్‌క్రాఫ్ట్ తన కక్ష్యలో కుదురుకున్నాక సౌరగాలులు, సౌర ఉపరితలంపై మార్పులు తదితరాల డేటాను ఒడిసిపట్టి భారత్‌కు మాత్రమేకాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది’’ అని సోమనాథ్ చెప్పారు. ‘‘ ప్రధాని మోదీ ఉద్భోదించినట్లు అమృతకాలంలో భారత్ ‘భారతీయ స్పేస్ స్టేషన్’ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం’ అని వివరించారు. -
కొత్త సంవత్సరంలో వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత ఫోన్లు బోర్ కొట్టేశాయా? లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టాప్ బ్రాండ్ల సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సమాచారం. షావోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, వీవో వంటి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 2024 సంవత్సరం జనవరి నెలలో పలు మోడల్లను లాంచ్ చేస్తున్నాయి. ఆయా మోడల్‌ల స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అందిస్తున్నాం.. వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 series) వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ 12ఆర్ (OnePlus 12R)లను ఆ కంపెనీ భారత్‌లో జనవరి 23న రాత్రి 7.30 గంటలకు విడుదల చేయనుంది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ప్రకారం, వన్‌ప్లస్ 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. గరిష్టంగా 24GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చు. కెమెరా పరంగా వన్‌ప్లస్ 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్‌ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ (Xiaomi Redmi Note 13 series) షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్‌ను జనవరి 4న భారత్‌లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 13 (Redmi Note 13), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్‌లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా అవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, ప్రోప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoCతో రావచ్చు. కెమెరా విషయానికొస్తే, నోట్ 13 మోడల్ 100MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ సిరీస్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 series) ఇప్పటికే చైనాలో విడుదలైన వివో ఎక్స్100 సిరీస్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) మోడల్స్ ఉండే అవకాశం ఉంది. చైనాలో లంచ్ అయిన వేరియంట్ల ప్రకారం, ఇవి ఆండ్రాయిడ్ 14 ఆధారిత OriginOS 4పై రన్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో పాటు వివో V3 చిప్‌తో వస్తాయని భావిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రెండు 50MP ప్రైమరీ సెన్సార్‌తో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ రావచ్చు. అయితే ప్రో మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,400 mAh బ్యాటరీతో రావచ్చు. వీటితో పాటు 2024 జనవరిలో రానున్న మరికొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే వాటి లాంచింగ్ తేదీలను ఆయా కంపెనీలు కన్ఫమ్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సి ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్, ఏసస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8), ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) మోడల్స్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. -
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్‌లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్‌లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్‌వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
వోల్వో కార్ ప్రియులకు షాక్.. జనవరి నుంచి ప్రైస్ హైక్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) 2024 ప్రారంభం (జనవరి) నుంచి తమ బ్రాండ్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి రెండు శాతం ధరలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా.. అస్థిర విదేశీ మారకపు రేట్లు కారణంగా ధరలను పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ధరల పెరుగుల ప్రకటించిన కంపెనీలలో వోల్వో మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ సంస్థలు ఉన్నాయి. వోల్వో కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లో సీ40 రీఛార్జ్, XC40, XC40 రీఛార్జ్ వంటి ఎలక్ట్రిక్ కార్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేస్తున్న కార్లు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వాహన ప్రియులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: మహమ్మారిలా వ్యాపిస్తున్న డీప్ ఫేక్.. మొన్న రతన్ టాటా.. నేడు నారాయణ మూర్తి ధరల పెరుగుదల గురించి వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా' మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులకు భరించడానికి ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
వచ్చే జనవరిలో పాకిస్థాన్ ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు పాక్ ఎలక్షన్ కమిషన్(ఈసీపీ) గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విజనపై ఈసీపీ ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ నెల 27న మొదటి లిస్టును విడుదల చేయనుంది. డీలిమిటేషన్ మొదటి లిస్టుపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత నవంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత దాదాపు 54 రోజులపాటు ఎన్నికల ప్రచారానికి సమయం కేటాయించారు. 2024 జనవరి చివరి వారంలో పోలీంగ్ జరగనున్నట్లు ఈసీపీ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో జాతీయ సభ ఆగష్టు 9న గడువుకు ముందే రద్దు చేయబడింది. డీలిమిటేషన్, జనగణన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని షహబాజ్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ప్రభుత్వం రద్దు అయిన 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ సమయం దాటిపోతున్నందున డీలిమిటేషన్ ప్రక్రియకు గడువు కుదించాలని రాజకీయ పార్టీలు ఈసీపీపై ఒత్తిడి పెంచాయి. కానీ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది. ఇదీ చదవండి: ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు -
ఐఐపీ డేటా: పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి 2023 జనవరిలో మంచి పనితీరును కనబరిచింది. ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) 5.2 శాతం పెరిగింది. 2022 డిసెంబర్లో సూచీ పెరుగుదల రేటు 4.7 శాతంగా ఉంది. ఇక 2022 జనవరిలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 2 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం విద్యుత్, తయారీ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. ఇవీ చదవండి: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్‌గ్లాసెస్: భారీ తగ్గింపుతో Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్ మిస్! -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2023 జనవరిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 32 లక్షల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరితో పోలిస్తే ఇది 93 శాతం అధికం అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ‘హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతలో 2022 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం తగ్గింది. గ్లోబల్ కార్పొరేట్లకు సెలవు కాలం కాబట్టి జనవరి నెల సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించాయి. వృద్ధి అంచనాలూ మందకొడిగా ఉన్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ జనవరి నెల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో ఐటీ, ఐటీఈఎస్ విభాగం అత్యధికంగా 28 శాతం వాటా కైవసం చేసుకుంది. జనవరిలో ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, ముంబై టాప్–3లో నిలిచాయి. ఈ మూడు నగరాల వాటా 77 శాతం’ అని జేఎల్ఎల్ వివరించింది. 2022 మార్చి నాటికి ప్రీమియం గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 73.2 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. అలాగే ఇతర గ్రేడ్స్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 37 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. -
దేశీయంగా విమాన ప్రయాణాలు రెట్టింపు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్పరమైన, బ్యాగేజ్పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరిన్ని కీలకాంశాలు.. ► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది. ► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్‌లో 10.53 లక్షల మంది, ఎయిర్ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్‌జెట్ ఫ్లయిట్స్‌లో 9.14 లక్షల మంది ప్రయాణించారు. ► టాటా గ్రూప్‌లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. ► మొత్తం ఏడు దేశీ ఎయిర్‌లైన్స్‌లోనూ సీక్వెన్షియల్‌గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్ఎఫ్) తగ్గింది. ► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది. -
11 కోట్లకు చేరిన డీమ్యాట్ అకౌంట్స్.. జనవరిలో 22 లక్షల ఖాతాలు
న్యూఢిల్లీ: వార్షిక ప్రాతిపదికన గత నెలలో డీమ్యాట్ ఖాతాలు 31 శాతం జంప్ చేశాయి. 11 కోట్లకు చేరాయి. ఖాతాలు సులభంగా తెరిచే వీలు, ఆర్థికంగా పొదుపు పుంజుకోవడం, ఈక్విటీ మార్కెట్ల రిటర్నులు మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేశాయి. వెరసి జనవరిలో 22 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా జత కలిశాయి. 2022 డిసెంబర్లో ఇవి 21 లక్షలు కాగా.. అక్టోబర్, నవంబర్లలో 18 లక్షలు, సెప్టెంబర్‌లో 20 లక్షలు చొప్పున ఖాతాలు పెరిగినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. గత నాలుగు నెలలతో పోలిస్తే జనవరిలో వేగం పుంజుకున్నప్పటికీ 2021–22లో నమోదైన సగటు 29 లక్షలతో పోలిస్తే వెనకడుగే. 2022 జనవరిలో నమోదైన 8.4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు 2023 జనవరికల్లా 11 కోట్లకు ఎగశాయి. కారణాలున్నాయ్.. క్లయింట్లకు ఖాతాలు తెరిచే విధానాలను బ్రోకింగ్ సంస్థలు సరళతరం చేయడం, ఈక్విటీ మార్కెట్లు లాభాలు అందించడం వంటి అంశాలు ఏడాది కాలంలో డీమ్యాట్ జోరుకు సహకరించాయి. ఆర్థిక అంశాలపై అవగాహన, యువతలో ట్రేడింగ్పట్ల పెరుగుతున్న ఆకర్షణ వంటివి సైతం ఇందుకు జత కలిసినట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. అయితే గత ఏడు నెలలుగా స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ డీమ్యాట్ ఖాతాల్లో వృద్ధి నమోదుకావడం గమనార్హం! జనవరిలో ఎన్ఎస్ఈ యాక్టివ్ ఖాతాల సంఖ్య 3 శాతం క్షీణించి 3.4 కోట్లకు పరిమితమైంది. వెరసి వరుసగా ఏడో నెలలోనూ యాక్టివ్ అకౌంట్లు నీరసించాయి. అయితే 2022 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 2.7 శాతం పుంజుకుంది. ప్రస్తుతం జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ టాప్–5 డిస్కంట్ బ్రోకర్స్‌గా నిలుస్తున్నాయి. ఎన్ఎస్ఈ మొత్తం యాక్టివ్ క్లయింట్లలో 59 శాతానికిపైగా వాటాను ఆక్రమిస్తున్నాయి. -
ఈక్విటీల్లోకి మళ్లీ పెట్టుబడుల వరద
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు జనవరిలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. రూ.12,546 కోట్లు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఒకనెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. 2022 డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ.7,303 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.2,258 కోట్లు, అక్టోబర్‌లో రూ.9,390 కోట్ల చొప్పున వచ్చాయి. ఇక 2022 సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,100 కోట్లు నెలవారీ గరిష్ట స్థాయిగా ఉంది. ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 23వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు రావడాన్ని గమనించొచ్చు. 2023 జనవరి గణాంకాలను ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. విభాగాల వారీగా.. అత్యధికంగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,902 కోట్లు, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.1,773 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,628 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.14,14 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,006 కోట్లు, సెక్టోరల్, థీమ్యాటిక్ పథకాల్లోకి రూ.903 కోట్లు, కాంట్రా ఫండ్స్‌లోకి రూ.763 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.716 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.183 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ స్థిరాదాయ పథకాల (డెట్) నుంచి జనవరిలో నికరంగా రూ.10,316 కోట్లు బయటకు వెళ్లాయి. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.5,042 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రూ.3,859 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రూ.3,688 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు విక్రయించారు. మనీ మార్కెట్ పథకాలు రూ.6,460 కోట్లు ఆకర్షించాయి. ఇక హైబ్రిడ్ పథకాలు సైతం రూ.4,492 కోట్లు ఆకర్షించగా, మల్టీ అస్సెట్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.2,055 వచ్చాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.5,813 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలపై నమ్మకాన్ని ఉంచారు. దీనికి నిదర్శనమే రూ.12,546 కోట్లు రావడం. నెలవారీగా చూస్తే ఇది 72 శాతం అధికం’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. సిప్ బలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,856 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో వచ్చిన రూ.13,573 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైగా రావడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. సిప్ ఖాతాల సంఖ్య 6.21 కోట్లుగా ఉంది. నికరంగా 9.20 లక్షల కొత్త సిప్ ఖాతాలు రిజిస్టర్ అయ్యాయి. ఒకవైపు ఎఫ్‌పీఐలు విక్రయాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడానికి సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
కొత్త ఏడాది.. 18 లక్షల కొత్త వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జనవరిలో అన్ని విభాగాల్లో కలిపి రిటైల్‌లో 18,26,669 వాహనాలు అమ్ముడయ్యాయి. 2022 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 14 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 22 శాతం అధికమై 3,40,220 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 10 శాతం ఎగసి 12,65,069 యూనిట్లుగా ఉంది. త్రీవీలర్లు 59 శాతం పెరిగి 65,796 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 16 శాతం వృద్ధి చెంది 82,428, ట్రాక్టర్లు 8 శాతం దూసుకెళ్లి 73,853 యూనిట్లకు చేరుకున్నాయి. 2020 జనవరితో పోలిస్తే గత నెల విక్రయాలు 8 శాతం తక్కువ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, యాజమాన్య ఖర్చు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. పునర్వినియోగపరచదగిన ఆదాయం అదే నిష్పత్తిలో పెరగలేదని చెప్పారు. పాత వాహనాల భర్తీ, సరకు రవాణా పెరుగుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నుంచి స్థిర మద్ధతు కారణంగా.. మార్కెట్లో డిమాండ్ కొనసాగి వాణిజ్య వాహనాల విభాగం కోవిడ్ ముందస్తు కంటే పెరగడానికి సహాయపడింది అని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!) -
శ్రీరస్తు.. కల్యాణమస్తు
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఏడాది శుభాకార్యాలకు మంచి తరుణం. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుండడంతో అంతా శుభం కలగనుంది. అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో కల్యాణ నామ సంవత్సరంగా ఈ ఏడాదిని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో గురుమూఢమి, జూలై నెలలో ఆషాఢం, అధిక శ్రావణం కావడంతో ఈ ఏడాది ఈ రెండు నెలల మినహా మిగిలిన 10 నెల ల్లో 104 పెళ్లి ముహూర్తులు ఉండడం విశేషం. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఏడాదంతా భాజాభంత్రిల మోత మోగనున్నాయి. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు తదితర శుభకార్యలకూ మూహూర్తులు ఉన్నాయి. 25 నుంచి ముహూర్తాలు ప్రారంభం ఈనెల 25 తేదీ నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెలలో 4, ఫిబ్రవరి 12, మార్చి 13, మే 16, జూన్ 7, ఆగస్టు 8, సెప్టెంబర్ 6, అక్టోబర్ 10, నవంబరు 14, డిసెంబర్లో 14 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్, జూలై నెలల్లో ముహూర్తాలు లేవు. జోరుగా వ్యాపారాలు జిల్లాలోని కల్యాణ మండపాలు, పంక్షన్ హాల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటిని పెళ్లిళ్లకు నెల నుంచి రెండు నెలల బుక్ చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోని సంపన్నులు తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది. పుణ్య క్షేత్రాల్లో ముందస్తు రిజర్వేషన్లు జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ద్వారాకతిరుమల, పశి్చమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాలు, భీమవరం, కాళ్లకూరు, తణుకు వెంకటేశ్వరస్వామి దేవస్థానాలు, భీమవరం భీమేశ్వరస్వామి, నర్సాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, యలమంచిలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈఏడాది పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది రెండు నెలల మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలకు ఈ ఏడాదంతా శుభపరిణామమే. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు ఏడాది కూడా అన్ని శుభకార్యాలకూ అనువైనది. – లింగాల సూర్యప్రసాద్, ఘనపాఠి, భీమవరం పంచారామక్షేత్రం అస్థాన వేదపండితులు -
జనవరిలో 15 రోజులు పని చేయని బ్యాంకులు, సెలవుల జాబితా ఇదే!
2023 జనవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జనవరి 2023లో 15 రోజుల వరకు పని చేయవు( ఆ తేదిలలో బ్యాంకులకు సెలవు). ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. కనుక కస్టమర్లు జనవరిలో ఏవైనా బ్యాంకు పనులుంటే దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ప్రతి నెల రెండు, నాలుగు మినహాయిస్తే తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. సెలవుల్లో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. జనవరిలో ఏ తేదిన ఉన్నాయో ఓ లుక్కేద్దాం! సెలవుల జాబితా ఇదే 1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్ 2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు 3 జనవరి 2023 ఇంఫాల్‌లో సెలవు 4 జనవరి 2023 ఇంఫాల్‌లో గణ ఎన్గయీ సందర్భంగా సెలవు 8 జనవరి 2023 ఆదివారం 12 జనవరి 2023 స్వామి వివేకానంద జన్మదినం (కోల్‌కతాలో బ్యాంకులు పని చేయవు) 14 జనవరి 2023 రెండో శనివారం 15 జనవరి 2023 ఆదివారం 16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం (చెన్నైలో సెలవు) 17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు సందర్భంగా చెన్నైలో సెలవు 22 జనవరి 2023 ఆదివారం 23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో సెలవు 26 జనవరి 2023 రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) 28 జనవరి 2023 నాలుగో శనివారం 29 జనవరి 2023 ఆదివారం -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి 2 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. పెరిగిన తయారీ ధరల భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు వివరణ ఇచ్చింది. పెరిగిన వ్యయాల్లో ఎక్కువ మొత్తాన్ని తామే సర్దుబాటు చేసుకున్నట్టు, కొంత మేర కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి రేట్లను పెంచనున్నట్టు టాటా మోటార్స్ లోగడే ప్రకటించగా, తాజాగా ఎంత మేర పెంచేదీ ప్రకటించింది. చదవండి: మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..! ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే! బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
జనవరిలో తగ్గిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత నెలలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత డిసెంబర్లో మొత్తం 1.12 కోట్ల మంది ప్రయాణించగా.. జనవరిలో 43 శాతం తక్కువగా 64.08 లక్షల మంది విమాన సేవలను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలను పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విడుదల చేసింది. స్పైస్‌జెట్ లోడ్ ఫ్యాక్టర్ (ప్రయాణికుల భర్తీ) 73.4 శాతంగా ఉంది. ఇండిగో 66.6 శాతం, విస్తారా 61.6 శాతం, గోఫస్ట్ 66.7శాతం. ఎయిర్ ఇండియా 60.6 శాతం, ఎయిరేషియా 60.5 శాతం చొప్పున లోడ్ ఫ్యాక్టర్ సాధించాయి. ఇండిగో అత్యధికంగా 35.57 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. దేశీయంగా 55.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్‌జెట్ 6.8 లక్షల మంది, ఎయిర్ ఇండియా (6.56 లక్షలు), గోఫస్ట్ (6.35 లక్షలు), విస్తారా (4.79 లక్షలు), ఎయిరేషియా ఇండియా (2.95 లక్షలు), అలియన్స్ ఎయిర్ 0.80 లక్షల మంది చొప్పున ప్రయాణికులను తీసుకెళ్లాయి. మెట్రో నగరాల నుంచి 94.5 శాతం మేర సకాలంలో విమాన సేవలను అందించి గో ఫస్ట్ ముందుంది. ఇండిగో 93.9 శాతం, విస్తారా 93.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఫ్రెషర్లకు కొలువుల పండగ!
న్యూఢిల్లీ: కాలేజీల నుంచి పట్టాలు పుచ్చుకుని కొలువుల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు తీపికబురు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో కంపెనీలు ఫ్రెషర్లను అధికంగా తీసుకోనున్నాయి. టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ‘కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్’ ఈ వివరాలు వెల్లడించింది. క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అర్ధ భాగంలో ఫ్రెషర్లను నియమించుకోవాలన్న ఉద్దేశం కంపెనీల్లో 30 శాతం ఎక్కువగా కనిపించినట్టు వివరించింది. 47 శాతానికి పైగా కంపెనీలు జూన్‌లోపు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు తెలిపాయి. గతేడాది ఇది 17 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం పట్ల సానుకూలత పెరగడం సంతోషాన్నిస్తోంది’’ అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీఈవో శంతనురూజ్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వృద్ధిపై దృష్టి సారించడం ఈ సానుకూల ధోరణికి కారణాలుగా తెలిపారు. ఫ్రెషర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగాలకు కలిపి చూస్తే నియామకాల ఉద్దేశం 50 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఫ్రెషర్లకు ఐటీ, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో అధిక కొలువులు రానున్నట్టు పేర్కొంది. వీటికి అధిక డిమాండ్ ‘‘డేటా అనలైటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్/వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిíఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లయ్ చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకూ డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్ల విషయానికొస్తే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోగలగడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి’’ అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెండ్, సహ వ్యవస్థాపకుడు నీతి శర్మ తెలిపారు. ఐటీలో 3.6 లక్షల కొలువులు ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అన్ఎర్త్ ఇన్సైట్’ సంస్థ పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 22.3%గా ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 19.5% నుంచి పెరిగినట్టు పేర్కొంది. జనవరి–మార్చి త్రైమాసికంలో 24%కి పెరగొచ్చని.. వచ్చే ఏడాది (2022–23)లో ఇది 16–18%కి తగ్గుతుందని అంచనా వేసింది. -
కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా!
కార్ల కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్. మన దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనాల్ట్' రెనాల్ట్ ఇండియా' కార్ల కొనుగోలు దారులకు కళ్లు చెదిరేలా డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జనవరి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా పలు కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక రెనాల్ట్ ఇండియా కార్లపై డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ రెండు వెర్షన్ల కారు కొనుగోలు దారులు డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మోడల్ 1.0-లీటరు వెర్షన్ కారు కొనుగోలుపై రూ 5,000 మై 2022 మోడళ్ల (08.లీటర్ వెర్షన్లు తప్ప)పై రూ 10,000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్‌ను దక్కించుకోవచ్చు.కార్పొరేట్, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆర్ఎక్స్ఈ 0.8 లీటర్ వేరియంట్ పై రూ.10,000 లాయల్టీ ప్రయోజనాల్ని పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ కారు కొనుగోలు దారులకు లాయల్టీ బెన్ఫిట్ కింద రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.దీంతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కారు కొనుగోలు దారులకు రూ.10,000, రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు దారులు ఎంవై 2021 మోడల్‌పై రూ. 10,000 (ఆర్ఎక్స్ఈ వేరియంట్ మినహా) డిస్కౌంట్, ఎక్ఛేంజ్ కింద రూ.20,000 వరకు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎక్స్ఈ వేరియంట్‌పై లాయల్టీ బోనస్ రూ.10,000, రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయితీ సభ్యులకు రూ.5,000 డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. సెలక్ట్ చేసిన వేరియంట్లపై కార్పొరేటర్లు,పీఎస్‌యూల(ప్రభుత్వ ఉద్యోగస్తులకు) రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా ఎంచుకోవచ్చు రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ అన్ని వేరియంట్లపై (ఆర్ఎక్స్ జెడ్1.5 ట్రిమ్ మినహా) రూ.50,000 ఎక్ఛేంజ్ ఆఫర్, రూ.50,000 డిస్కౌంట్ పొందవచ్చు. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన వేరియంట్లలో రూ.30,000, గ్రామీణ ప్రాంతాల కొనుగోలు దారులు రూ.15,000 వరకు సొంతం చేసుకోవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
బంగారం ఈటీఎఫ్‌ల ‘తళతళ’
న్యూఢిల్లీ: బంగారంపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి మరింత అధికమైంది. దీన్ని సూచిస్తూ జనవరిలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 45 శాతం అధికంగా రూ.625 కోట్ల మేర వచ్చాయి. దీంతో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ జనవరి చివరికి 22 శాతం అధికమై రూ.14,481 కోట్లకు చేరుకుంది. 2020 డిసెంబర్ చివరికి బంగారం ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.14,174 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 నవంబర్ నెలలో రూ.141 కోట్లు బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా బయటకు వెళ్లిపోగా.. ఆ తర్వాత నుంచి ఈ విభాగం పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. 2020 డిసెంబర్లో నికరంగా రూ.431 కోట్ల మేర పెట్టుబడులు బంగారం ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: పోకో ఎం3 కాసుల వర్షం! శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు! -
అల్లుడు వస్తున్నాడు
‘రాక్షసుడు’ వంటి హిట్ మూవీ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. పండగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ సంక్రాంతికి మా ‘అల్లుడు అదుర్స్’ చిత్రం ప్రేక్షకులకు సరైన ఎంపిక అని కచ్చితంగా చెప్పవచ్చు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రకాష్ రాజ్, సోనూ సూద్, ‘వెన్నెల’ కిశోర్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్ కుమార్ గంజి. -
జనవరి 1 నుంచి హోండా కార్ల ధరల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం హోండా కంపెనీ వచ్చే నెల జనవరి 1 నుంచి భారత్‌లో తన వాహన ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ధరల పెంపు నిర్ణయంపై ఇప్పటికే కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరెన్సీ అనిశ్చితులు, ఉత్పత్తి వ్యయం ఒత్తిళ్లతో కంపెనీ జనవరి నుంచి ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు కంపెనీ డీలర్లు తెలిపారు. తన అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) ద్వారా దేశంలో ఈ కంపెనీ కాంపాక్ట్, సెడాన్, అమెజ్ నుంచి ప్రీమియం ఎస్యూవీ సీఆర్–వీ వరకు పలు వాహనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద అమెజ్ ప్రారంభ ధర రూ.6.17 లక్షలుండగా, ఎంట్రీ లెవల్ సీఆర్వీ ధర రూ.28.71 లక్షలుగా ఉంది. -
జనవరి నుంచి కార్ల ధరలు మోతే!
సాక్షి, ముంబై: వాహన ధరల మోతకు మరో కంపెనీ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వివిధ మోడళ్లపై రూ.28 వేల వరకు ధరల్ని పెంచుతున్నట్లు శుక్రవారం రెనో కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కంపెనీ తయారీ చేసే క్విడ్, డస్టర్, ట్రిబర్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్, ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతో మోడళ్ల ధరలను పెంచాల్సివచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) హీరో మోటో కూడా... ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి ధరలను పెంచనుంది. వాహన మోడళ్లను బట్టి రూ.1,500 వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్లే ధరల పెంపునకు ప్రధాన కారణమని పేర్కొంది. స్టీల్, అల్యూమీనియం, ప్లాస్టిక్ వంటి అన్ని వస్తువుల వ్యయం క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ముడిసరుకు, కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఇప్పటికే మారుతీ, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు జవవరి 1 నుంచి తమ వాహనాలపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సన్నిహితుల సమక్షంలో పెళ్లి: సునీత
తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటున్న ఆమె త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలో మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో సోమవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో తమ పెళ్లి జరగనున్నట్లు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సునీత వెల్లడించారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా సునీత, రామ్ ఇద్దరికి ఇదీ రెండో వివాహమన్న విషయం తెలిసిందే. చదవండి: గాయని సునీత ఎంగేజ్మెంట్.. కాగా గత కొంత కాలంగా సునీతరెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు సునీతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తల్తెడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత -
జనవరి నుంచి ఆడి కార్ల ధరల పెంపు
ముంబై: అన్ని రకాల మోడళ్లపై 2 శాతం వరకు ధరల్ని పెంచుతున్నట్లు జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ ఆడి తెలిపింది. పెంచిన ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది. రూపాయి బలహీనత, పెరిగిన ఇన్పుట్ వ్యయాల దృష్ట్యా ధరల్ని పెంచుతున్నట్లు కంపెనీ వివరించింది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సిన్హా దిల్లాన్ మాట్లాడుతూ... కస్టమర్లకు మేలిరకమైన మోడళ్లను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, అయితే పెరిగిన ఇన్పుట్ వ్యయాలు, రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో ధరల్ని సవరించక తప్పడం లేదన్నారు. పెంచిన ధరలకు అనుగుణంగా రాబోయే వేరియంట్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దామని దిల్లాన్ తెలిపారు. స్కోడా ఆటో నుంచి అద్దెకు కార్లు ముంబై: స్కోడా ఆటో కంపెనీ అద్దెకు కార్లను ఇచ్చే ‘‘క్లవర్ లీజ్’’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా తన రాపిడ్, సూపర్బ్ మోడళ్లను 2 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో నెలకు రూ.22,580 ప్రారంభ ధరగా అద్దెకు ఇవ్వనుంది. కార్పొరేట్, రిటైల్ కస్టమర్లకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రాథమికంగా ఢిల్లీ, ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ వివరించింది. రోడ్ ట్యాక్స్, బీమా, యాక్సిడెంటల్ రిపేర్లు, ఎండ్–టు–మెయింటెనెన్స్, వెహికల్ రిప్లేస్మెంట్ లాంటి అన్ని ప్రయోజనాలు, సరీ్వసులు ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది. -
‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు జరపాలనే అంశంపై టీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల సంభవించిన వరద నష్టం నుంచి నగరవాసులు పూర్తిగా కోలుకోకముందే ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వరద సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం కూడా స్వల్ప వ్యవధిలో ఎన్నికల సన్నాహాలు చేయలేమనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితి కుదుటపడిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీసుకెళ్లినట్లు సమాచారం. కనీసం 45 రోజుల తర్వాతే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరిస్తే డిసెంబర్ నెలాఖరులో షెడ్యూలు విడుదల చేసి జనవరి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. సహాయక చర్యల్లో అధికారులు బిజీ.. గ్రేటర్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇంకా పలు కాలనీలు బురదలోనే ఉండటంతో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగిపోయింది. కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేని జనావాసాల్లో తాత్కాలిక మరమ్మతులపై జీహెచ్ఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తే సన్నద్ధం కావడం అసాధ్యమని అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 22 అసెం బ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీని ‘మినీ అసెంబ్లీ’గా పరిగణిస్తా రు. దీంతో అధికార యంత్రాం గాన్ని భారీగా మోహరించాల్సి రావడంతో ఎన్నికల వాయిదాకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. అంతా సర్దుకున్నాకే.. మూడ్రోజుల కింద గ్రేటర్ పరిధిలోని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కేటీఆర్‌ను కోరినట్లు సమాచారం. వరద బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం పంపిణీ గందరగోళంగా మారిన ప్రస్తుత సమయం లో ఎన్నికలకు వెళ్తే వ్యతిరేకత వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ముందస్తు ఎన్నికలు జరిగితే పార్టీ యంత్రాంగాన్ని తక్కువ వ్యవధిలో సమన్వయం చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. -
జనవరికల్లా కోవిడ్ వ్యాక్సిన్!
వాషింగ్టన్: ఈ యేడాది చివరికల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని, ఇప్పటికే 2.5 లక్షల మంది క్లినికల్ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణులు డాక్టర్ ఆంథోని ఫాసీ చెప్పారు. అమెరికాలో కోవిడ్–19 పరీక్షా ఫలితాలను రెండు మూడు రోజుల్లో అందించలేకపోతున్నామని, కనుక అమెరికా పౌరులంతా మాస్కులు ధరించడమూ, సమూహాల్లోకి వెళ్లకుండా ఉండడమూ, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని అమెరికా అధికారులు ఫాసీతో చెప్పారు. వ్యాక్సిన్ రావడం, కలకాదనీ, అది నిజం కాబోతోందని ఫాసీ అన్నారు. -
ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్థికమందగమనంపై భయాలు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన,. కొనసాగుతుండగానే జనవరి నెలలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంచనాలకుమించి ఆరేళ్ల గరిష్టానికి చేరింది. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది.సీపీఐ డేటా గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) బుధవారం వెల్లడించింది. 2019 జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 2.05 శాతంగా ఉంది. ఎన్ఎస్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్లో 14.12 శాతం నుండి 13.63 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణ రేటు 2019 జనవరిలో (-) 2.17 శాతంగా ఉంది. ఈ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది, 2019 డిసెంబర్లో 60.50 శాతంగా ఉంది. అదేవిధంగా, తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 5.25 శాతం వేగంతో పెరిగాయి. పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు ఈ నెలలో 16.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా మార్చి 2019 నుంచి క్రమంగా పెరుగుతూ నింగిని తాకిన ఉల్లిపాయల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసింది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల ధరల మంట దీనికి కారణంగా భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి నాటి పరపతి విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచింది. ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతానికి (2 శాతం మార్జిన్‌తో) అటూ ఇటూగా వుండాలే చూడాలని కేంద్రానికి ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ దేశంలోని పారిశ్రామిక ప్రగతి మరింత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఇప్పటికే నెగటీవ్ జోన్లోకి చేరిన పారిశ్రామికోత్పత్తి డిసెంబరులో 0.3 శాతానికి పతమైంది. ఉత్పాదక రంగం క్షీణించి, ఏడాది క్రితం ఇదే నెలలో 2.5 శాతం వృద్ధిని సాధించింది. చదవండి : దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
జనవరి నుంచి హీరో బైక్స్ ధరల పెంపు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచనుంది. ప్రస్తుతం హీరో కార్ప్ వాహనాల ధరల శ్రేణి రూ.39 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టొయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. -
నెఫ్ట్ చార్జీలపై ఆర్బీఐ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: సేవింగ్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (నెఫ్ట్) సేవలు 2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019 వరకు మొత్తం నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులు 96శాతంగా ఉన్నాయి. అదే సమయంలో నెఫ్ట్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) వ్యవస్థలు సంవత్సరానికి 252 కోట్లు, 874 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి నెఫ్ట్ లావాదేవీలు 20 శాతం యూపీఐ లావాదేవాలు 263శాతం వృద్ధిని సాధించాయని తెలిపింది. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), నెఫ్ట్ ఆర్బీఐ అందిస్తున్న రియల్ టైం పేమెంట్ వ్యవస్థలు. నెఫ్ట్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు నిధుల బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ పెద్ద మొత్తంలో నిధులను తక్షణమే బదిలీ చేసుకోవచ్చు. -
పదినెలల కనిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టానికి దిగి వచ్చింది. జనవరి నెలలో 2.76 శాతానికి పడిపోయింది. తయారీ వస్తువులు, ఇంధన ఉత్పత్తుల ధరలు ప్రభావంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. టోకుధరల ధరలు జనవరి నెలలో గత నెలతో పోలిస్తే 0.07 శాతం పెరగ్గా, వార్షిక ప్రాతిపదికన 1.84 శాతం పెరిగాయి. -
తక్షణ అవరోధం 36,480
నాటకీయంగా గతవారం ద్వితీయార్థంలో అమెరికాతో పాటు జపాన్, యూరప్ తదితర ధనిక మార్కెట్లు కుదుటపడిన నేపథ్యంలో తీవ్ర పతనం నుంచి భారత్ సూచీలు సైతం కోలుకున్నాయి. అయితే అమెరికా మార్కెట్ల రికవరీ తక్కువ ట్రేడింగ్ పరిమాణంతో జరుగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా బుల్స్‌ను ఆందోళనపర్చే అంశం. అయితే సాధారణంగా జనవరి తొలివారంలో దాదాపు ప్రపంచ సూచీలన్నీ స్థిరంగా ట్రేడవుతూవుంటాయి. జనవరి రెండోవారంలో ఒడిదుడుకులు మొదవుతుంటాయి. ఈ సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... డిసెంబర్ 28తో ముగిసిన వారం ప్రధమార్థంలో 35,010 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 36,195 పాయింట్ల స్థాయికి కోలుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 335 పాయింట్ల లాభంతో 36,077 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం కూడా అప్‌ట్రెండ్ కొనసాగితే సెన్సెక్స్‌కు 36,480 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. అటుపైన 36,560 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే ర్యాలీ 36,620–36,800 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 35,780 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభిస్తోంది. ఈ మద్దతు దిగువన 35,580 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తక్షణ నిరోధం 10,965 గతవారం ప్రధమార్ధంలో 10,534 పాయింట్ల వరకూ పతనమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,894 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితంవారంకంటే 106 పాయి ంట్ల లాభంతో 10,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 10,965 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన 10,985 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,100 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే నిఫ్టీకి 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,770 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతును అందించవచ్చు. ఈ లోపున ముగిస్తే వేగంగా 10,650 పాయింట్ల వరకూ పడిపోవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 10,535 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. -
కొద్దిగా చల్లబడిన రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, ముంబై: రీటైల్ ద్రవ్యోల్బణం కొద్దిగా చల్లారింది. డిసెంబరునాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరిలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది.అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆహార, ఇంధర ధరల పెరుగుదలను దీన్ని ప్రభావితం చేసింది. మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కొలమానం, సిపిఐ ఇండెక్స్ జనవరి నెలలో 5.07 శాతానికి పెరిగింది. డిసెంబరులో 5.21 శాతం నుంచి 5.14 శాతానికి తగ్గనుందని రాయిటర్స్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇంధనం, ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.90 శాతంతో పోలిస్తే తాజాగా 7.58 శాతంగా నమోదైంది. గృహ ద్రవ్యోల్బణం గత నెలలో 8.25 శాతం నుంచి 8.33 శాతానికి పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరింది. అక్టోబరు-డిసెంబరులో 4.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ..ఫిబ్రవరి నెలలో బడ్జెట్లో ప్రకటించిన అధిక దిగుమతి పన్నుల ధరల ఒత్తిడి కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. -
కొత్త స్విఫ్ట్ స్పోర్టీ లుక్‌లో: ప్రీ బుకింగ్స్
సాక్షి, న్యూడిల్లీ: మారుతి సుజుకి కొత్త 2018 మోడల్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. తన పాపులర్ మోడల్ కారు స్విఫ్ట్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీన్ని అధికారికంగా గా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్‌లు జనవరి మూడవ వారంలో ప్రారంభించనుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం దీనికి రూ .5 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య నిర్ణయించవచ్చని సమాచారం. ఇప్పటివరకు ఉన్నమోడల్స్కు పూర్తిగా డిఫరెంట్‌లో లుక్‌లో తీసుకొస్తోంది. అప్‌మార్కెట్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ, టు -పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్‌తో పాటు మెరుగైన ఇంధన సామర్ధ్యంతో, మరింత శక్తితో దీన్ని రూపొందిస్తోంది. ఇక ఇంజీన్ల విషయానికి వస్తే 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్లతో రానుంది. కాగా థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ స్పోర్ట్స్ కారు ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ టెన్‌కి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. -
ఆ హీరోయిన్ పెళ్లి ముహూర్తం ఖరారు
లైంగిక వేధింపుల కేసుతో ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ దక్షిణ భారత సినీ హీరోయిన్ భావన( కార్తికా మీనన్)పెళ్లి తేదీ ఖరారైంది. చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌తో భావన మార్చి 9న ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి విదితమే. నిశ్చితార్థం జరిగి ఇన్నాళ్ల గ్యాప్ తరువాత జనవరి 22న వీళ్ల వివాహం బెంగళూరులో జరగనుంది. త్రిసూర్ లోని 'లలు కన్వెన్షన్ సెంటర్'లో వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నిహిత మితృలకు, బంధువులకు ఆహ్వానాలు అందాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లోనటించిన భావన నమోదు చేసిన నటుడు దిలీప్‌పై లైంగిక వేధింపుల కేసు కేరళ చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పెళ్లిని సినీ పరిశ్రమకు దూరంగా జరుపుకోనున్నారు. కేవలం కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. -
అమెజాన్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, బెంగళూరు: ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశించిన అమెజాన్ కొత్త సంవత్సరంలో మరో సరికొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. టెనార్ బ్రాండ్ నేమ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను చేయనుంది. టెనార్ ఇ , టెనార్ జీ పేరుతో రెండు డివైస్‌లను విడుదల చేసిన అమెజాన్ వచ్చే జనవరిలో ఈ తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తన ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ కొద్ది రోజుల ముందు అమెజాన్ వీటిని లాంచ్ చేసిన సంగతి విదితమే. ఎంపిక, ధరలను అర్థం చేసుకోవటానికి , సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడంలో విక్రేతలు, వినియోగదారుల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడంలో కస్టమర్లు అభిప్రాయాలను గౌరవిస్తామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు.దీన్ని క్రాఫ్టెడ్ ఫర్ అమెజాన్‌గా కంపెనీ పిలుస్తోంది. మరోవైపు స్మార్ట్ఫోన్లకు సంబంధించి ఇండియాలో ప్రైవేట్ లేబుల్ మార్కెట్ కొత్త పరిణామమని నిపుణుల భావన. స్మార్ట్‌ఫోన్ టాబ్లెట్ మార్కెట్లో 8.5-9 బిలియన్ డాలర్ల వార్షిక రన్ రేటు పెరగనుందని రెడ్‌సీర్ కన్సల్టింగ్ సీఈవో అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
డిమానిటైజేషన్ : ఉద్యోగాల ఊచకోత
సరిగ్గా ఏడాది కిందట ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు దేశంమీద పడింది. ఏడాది తరువాత కూడా ప్రజలను పెద్ద నోట్ల రద్దు ప్రభావం వదిలిపెట్టడం లేదు. డిమానిటైజేషన్ ప్రభావం పడని రంగం లేదు.. అందులో ఉద్యోగాలు కూడా భాగమయ్యాయి. సాక్షి, న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు జరిగి నేటికి 12 నెలల పూర్తయ్యాయి. ఏడాది గడిచిన తరువాత కూడా ప్రభుత్వం ముందు వసూలు కానీ రుణాలు, నిరుద్యోగం ప్రభుత్వాన్ని సవాళ్లు విసురుతున్నాయి. దేశంలో పెరుగుతున్న శ్రామిక శక్తికి విలోమానుపాతంగా ఉపాధి మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం 2017 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఉద్యోగ, ఉపాధి మార్గాలు మందగించాయి. లేబర్ బ్యూరో ఆఫ్ ఎంప్లాయిమెంట్ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు ప్రబావం రోజువారీ కూలీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థల్లో ఉద్యోగస్తుల తగ్గింపు క్రమంగా కొనసాగుతూనే ఉంది. 2017 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో సీఎంఐఈ వర్గాలు దేశవ్యాప్తంగా 5,19,285 మందిపై సర్వే నిర్వహించింది. ఈ సమయంలో మూడింటరెండొంతుల మంది నిరుద్యోగులుగా మరిపోయారు. ఈ సర్వే ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మొత్తంగా 1.5 మిలియన్ ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద 2017 జులై మొదటి వారంలో 30. 67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఇతర సర్వేల ప్రకారం పెద్ద నోట్లరద్దు తరువాత సుమారు 107 సంస్థలు 14,668 మంది ఉద్యోగులను తొలగించాయి. దేశంలో భారీ సంస్థలుగా నిలిచిన ఎల్ అండ్ టీ (1888), హిందుస్తాన్ యూనిలీవర్ (1453), ఐడియా సెల్యులార్ (707), ఏసీసీ (535), టాటా మోటార్స్ (534), టాటా స్టీల్ (450), హిందాల్కో (439), టైటాన్ ఇండస్ట్రీస్ (422) మంది ఉద్యోగాలను తొలగించాయి. ఆలోమొబైల్, ఫార్మాస్యుటికల్స్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాల కోత పడింది. లేబర్ బ్యూరో క్వార్టర్లీ ఎంప్లాయిమెంట్ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 1.52 లక్షల క్యాజువల్ ఉద్యోగాలు, 46 వేల పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో కోత పడింది. -
‘కేలండర్’కి మారడం కష్టమా?
-
‘కేలండర్’కి మారడం కష్టమా?
- జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరంపై కేంద్రం కసరత్తు - భారత్‌లో 150 ఏళ్లుగా ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం - అభివృద్ధి చెందిన దేశాల్లో కేలండర్ఏడాదే ఆర్థిక ఏడాది - కేలండర్‌కు మారడం అంతర్జాతీయ వ్యవస్థకు అనుగుణం - దేశంలో రుతుపవనాల చక్రానికీ అనుగుణంగా ఉంటుంది - ఇప్పటికిప్పుడు అమలు చేస్తే చాలా వ్యయప్రయాసలు - జీఎస్టీ అమలు విషయంలో ఇప్పటికే కొంత గందరగోళం - దానికితోడు ఆర్థిక సంవత్సరాన్నీ మారిస్తే ఇంకా ఇబ్బందే - రెండుమూడేళ్లు ఆగటం ఉత్తమం: ఆర్థిక నిపుణుల సూచన (సాక్షి నాలెడ్జ్ సెంటర్) కొత్త సంవత్సరం అంటే.. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలు.. కొత్త ప్రణాళికలు! జనవరి 1తో మొదలయ్యే కొత్త సంవత్సరం ప్రపంచంతో పాటు భారత ప్రజలకూ క్రొంగొత్త కాలమే! కేలండర్మారడంతోనే కొత్త సంవత్సరంతో పాటు కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు భావిస్తాం. కానీ.. మన దేశ ఆర్థిక వ్యవస్థకు.. దానికి ముడిపడివున్న దేశ ప్రజల ఆర్థిక వ్యవహారాలకు మాత్రం కొత్త సంవత్సరం ఏప్రిల్1తో మొదలవుతుంది. ఇది 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక సంవత్సర వ్యవస్థ. చాలా దేశాల్లో.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కొత్త కేలండర్తోపాటే కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ఆరంభమవుతుంది. ఆయా దేశాల్లో జనవరి డిసెంబర్ఆర్థిక సంవత్సర వ్యవస్థ ఉండటమే దీనికి కారణం. దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జనవరి డిసెంబర్‌కు మార్చే అంశంపై కేంద్రంలోని మోదీ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. గత ఆదివారం నీతి ఆయోగ్పాలక మండలి సమావేశంలో మోదీ అ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్పు వల్ల లాభనష్టాలేమిటి? దీనిపై ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? 150 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానం..: బ్రిటిష్పాలకులు 1867లో బ్రిటన్సామ్రాజ్యంలో అనుసరించే విధానానికి అనుగుణంగా భారత ఆర్థిక వ్యవహారాల జమాలెక్కల కోసం ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ఇదే వ్యవస్థను కొనసాగించారు. 1992లో దేశంలో ఆర్థిక సంస్కరణల శకం మొదలైనపుడు.. ఆర్థిక సంవత్సర వ్యవస్థను కూడా జనవరి డిసెంబర్‌కు మార్చాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అవి ముందుకు సాగలేదు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర్ఆచార్య సారథ్యంలోని నిపుణుల కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆర్థిక మంత్రిత్వశాఖకు అందించిన నివేదికలో.. ఆర్థిక సంవత్సరాన్ని జనవరి డిసెంబర్‌కు మార్చాలని ప్రతిపాదించింది. దేశంలో కీలకమైన రుతుపవనాల చక్రానికి, రబీ, ఖరీఫ్పంటల కోత సమయాలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరాన్ని క్రమబద్ధం చేయడం ఈ కమిటీ చెప్పిన ప్రధాన కారణాల్లో ఒకటి. వ్యవసాయ ఆదాయం అతి ముఖ్యమైన మన దేశంలో ఆ ఆదాయం అందిన వెంటనే బడ్జెట్లను తయారు చేయాలని ప్రధాని మోదీ, నీతి ఆయోగ్చైర్మన్అరవింద్పణగరియాలు కూడా బలంగా భావిస్తున్నారు. దాదాపు 150 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ ఆర్థిక సంవత్సరం విధానాన్ని మార్చడమంటే భారీ మార్పే అవుతుంది. అదే జరిగితే.. దేశ బడ్జెట్తేదీని ప్రస్తుతమున్న ఫిబ్రవరి నుంచి నవంబర్నెలకు మార్చడం, పన్ను మదింపు సంవత్సరాన్ని మార్చడం, దానికి అనుగుణంగా సంబంధిత మౌలిక సదుపాయాలను పునర్వ్యవస్థీకరించడం, పార్లమెంటు సమావేశాల సమయాలను మార్చడం వంటి చాలా మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ‘కేలండర్’కి మారితే వల్ల లాభాలివీ..: ఆర్థిక సంవత్సరాన్ని కేలండర్సంవత్సరానికి మార్చడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ప్రస్తుతం అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనవరి డిసెంబర్ఆర్థిక సంవత్సరాన్నే పాటిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత ఎక్కువగా సమ్మిళతమవుతుండటం, దేశంతో చాలా అంతర్జాతీయ సంస్థల వాణిజ్య లావాదేవీలు పెరుగుతుండటం వంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక సంవత్సరాన్ని అభివృద్ధి చెందిన దేశాల విధానంలోకి మార్చడం.. అంతర్జాతీయ లావాదేవీలను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా స్వదేశంలో ఒక తరహా ఆర్థిక సంవత్సరాన్ని, భారత్‌లో మరొక తరహా ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించాల్సి వస్తున్న బహుళజాతి సంస్థలకు పద్దుల నిర్వహణలో ఉపశమనం లభిస్తుంది. ‘‘అంతర్జాతీయ విధానానికి మారడం మంచిది. మన దేశాన్ని మిగతా ప్రపంచం వరుసలో నిలుపుతుంది. వలస పాలకులు ప్రవేశ పెట్టిన విధానాన్ని అనుసరించడాన్ని కొనసాగించాల్సిన అవసరమేమీ లేదు’’ అని రేటింగ్ఏజెన్సీ అయిన క్రిసిల్‌లో ముఖ్య ఆర్థికవేత్త డి.కె.జోషి పేర్కొన్నారు. అలాగే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో బడ్జెట్ప్రవేశపెట్టే సమయానికి.. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుతుపవనాల రాకపై నిర్దిష్ట సమాచారం ఉండదు. ఇది ఆదాయ వ్యయాల అంచనాల పట్టికలో అనిశ్చితికి కారణమవుతుంది. కాబట్టి ఆర్థిక సంవత్సరాన్ని జనవరి డిసెంబర్మార్చితే ఈ అనిశ్చితికి తావుండదనేది పలువురు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇప్పటికిప్పుడు మారడం సమస్యాత్మకం..: ఆర్థిక సంవత్సరాన్ని ఉన్నపళంగా మార్చేస్తే కొన్ని సమస్యలూ ఉంటాయని మరికొందరు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ప్రవేశపెట్టే సమయాన్ని ఈ ఏడాది ఒక నెల ముందుకు జరిపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మార్పుకు సిద్ధం కావాల్సింది ప్రధానంగా ప్రభుత్వ సంస్థలే కానీ పరిశ్రమలు, కంపెనీలకు సంబంధించినది కాదు. కాబట్టి ఆ మార్పు సులభమైనదే. అదే ఆర్థిక సంవత్సరాన్ని మార్చడమంటే ప్రభుత్వ విభాగాలతో పాటు దేశంలోని అన్ని రంగాలూ అందుకు అనుగుణంగా తమ చిట్టాపద్దులను సవరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశంలోని కంపెనీలు, ప్రభుత్వ పన్ను విభాగాలు ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సర చట్రంలో నడుస్తున్నాయి. తక్షణమే ఈ సంవత్సరాన్ని మార్పు చేస్తే.. అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు భారీగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఒక్కసారే అయినా పెద్ద నష్టమే ఉంటుందని కేర్రేటింగ్ఏజెన్సీ ముఖ్య ఆర్థికవేత్త మదన్సబ్నవిస్పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల ప్రస్తుతమున్న వ్యవస్థలో పెద్దగా మారేదేమీ ఉండదనీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంవత్సరం మార్పు వెంటనే తీసుకువస్తే.. ఈ సంవత్సరంలో అమలులోకి తేనున్న వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే.. కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ శకానికి మారడం కోసం తంటాలు పడుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని కూడా మార్చేస్తే.. ఒకేసారి రెండు భారీ మార్పులకు అనుగుణంగా మారడం మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. రాష్ట్రాలు ఏమంటున్నాయంటే..: ఆర్థిక సంవత్సర వ్యవస్థ మార్పు ప్రతిపాదనలను గత ఏడాది మహారాష్ట్ర వంటి కొన్ని సంస్థలు వ్యతిరేకించాయి. ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ అమలు, ప్రణాళిక ప్రణాళికేతర వ్యయాలను కలిపివేయడం వంటి కీలకమైన నిర్మాణాత్మక మార్పులు జరుగుతోందని, పరిపాలనా సమయం, మానవవనరులను అధికంగా ఈ మార్పులపై వెచ్చించాల్సి వస్తోందని.. ఈ సమయంలో కొత్త ఆర్థిక సంవత్సర వ్యవస్థకి మారడం సాధ్యంకాకపోవచ్చునని మహారాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో పేర్కొంది. రెండు మూడేళ్లు ఆగితే మంచిది..: అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జనవరి డిసెంబర్ఆర్థిక సంవత్సరానికి మారడం మంచిదే. అది దేశంలో కీలకమైన రుతుపవన చక్రానికి కూడా అనుగుణంగా ఉంటుంది. అదే సమయంలో ఈ మార్పును అమలు చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. ప్రభుత్వం, పారిశ్రామిక రంగం ఒకసారే అయినా కొంతమేర నష్టపోవాల్సి ఉంటుంది. కొత్తగా అమలులోకి రానున్న జీఎస్టీ విషయంలో ఇప్పటికే పారిశ్రామిక వర్గాల్లో కొంత గందరగోళం ఉందని.. ఇప్పటికిప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని కూడా మార్చడం దీనిని మరింత పెంచుతుందని.. కాబట్టి ఆర్థిక సంవత్సరం మార్పు విషయంలో తొందరపడకపోవడం ఉత్తమమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన రెండు మూడేళ్ల తర్వాత ఆర్థిక సంవత్సరం మార్చుకోవచ్చని క్లియర్టాక్స్డాట్ఇన్సీఈఓ అర్చిత్గుప్తా పేర్కొన్నారు. -
ట్రంప్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన కొలువులు
అమెరికా వ్యాపార సంస్థలు ఒక్క నెలలో భారీగా ఉద్యోగులను నియమించుకున్నారు. జనవరి నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా పుంజుకున్నట్టు తాజా నివేదికలో తేలింది. ఆయా వాణిజ్య ఇతర సంస్థలు కొత్తగా 2లక్షల 27 వేల కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించినట్టు తెలిపింది. అయితే ఈ సంఖ్య లక్షా75 వేలుగా ఉండగనుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. చిల్లర వ్యాపారం, నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాల్లో ఈ ఉద్యోగాలు సాధించినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక తేల్చింది. గత డిశెంబర్ 157,000 ఉద్యోగాలతో పోలిస్తే ఈ నెలలో పెరిగినట్టు తెలిపింది. అలాగే 4.8 శాతం నిరుద్యోగ రేటుతో, 7.6 మిలియన్ల నిరుద్యోగులు ఉన్నట్టు నివేదించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య భారీగా ఉన్నట్టు తెలిపింది. గత సెప్టెంబర్ తో పోలిస్తే గరిష్టంగా ఉంది.జనవరి 2009-17 మధ్య కాలంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో 11.25 మిలియన్ ఉద్యోగాల పెరుగుదల నమోదైనట్టు బ్యూరో పేర్కొంది. మరోవైపు జనవరి నెల జాబ్ రిపోర్ట్ అంచనాలను మించి నమోదు కావడంతో అమెరికా మార్కెట్లు భారీలాభాలతో మొదలయ్యాయి. కాగా ఫర్ అమెరికన్స్, హైర్ అమెరికన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 10 ఏళ్ల కాలానికి 25 మిలియన్ల ఉద్యోగాల సృష్టించనున్నట్టు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియకు ముహుర్తం ఒకటి రెండు నెలల ముందు తీసుకున్నది కాదంట. దాదాపు 10 నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైందని తెలిసింది. గత జనవరిలోనే డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్టు బుధవారం పార్లమెంట్ ప్యానెల్‌కు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్యానల్‌కు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో పెద్ద నోట్లను రద్దుచేయమని ప్రభుత్వం నవంబర్ 7న సెంట్రల్ బ్యాంకుకు సూచించినట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అనంతరం ఒక్కరోజులోనే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న సంచలన నిర్ణయం ప్రకటించినట్టు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్, రూ.9.2 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పటిలోగా సాధారణ పరిస్థితి వస్తుందన్న ప్రశ్నకు ఉర్జిత్ పటేల్ సమాధనం చెప్పలేకపోయారని తెలిసింది. అయితే అవసరమైన నగదును సెంట్రల్ బ్యాంకు సరఫరా చేస్తుందని ఉర్జిత్ తెలిపారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల నగదు నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ప్యానల్ ముందు హాజరైన ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయనే దానిపై కనీసం నోరు కూడా మెదపలేదట. ఇదే విషయంలో ఉర్జిత్ పటేల్‌తో పాటు, అధికారులు కూడా శుక్రవారం ప్రజాపద్దుల కమిటీ ముందు హాజరుకావాల్సి ఉంది. -
భారీగా పెరగనున్న మారుతీ, హ్యుందాయ్ ధరలు!
ముంబై : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్లు కార్ల ధరలను భారీగా పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. జనవరిలో ఈ వాహన సంస్థలు కార్ల ధరలను రూ. 2500 నుంచి లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, గత కొన్ని నెలలుగా వరుసగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, రూపాయి విలువ పతనమవడం వంటివి కార్ల ధరలు పెంపుకు దోహదం చేస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి చేసుకునే కార్ల విడిభాగాల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో జనవరిలో తమ వాహన ధరలను పెంచాలని కార్ల తయారీ సంస్థలు యోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కార్ల సంస్థలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించేశాయి. మిగతా సంస్థలు కూడా ధరల పెంపు ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. న్యూఇయర్ ప్రారంభంలో మారుతీ సుజుకీ ధరలు పెంచడానికి ఎప్పుడూ మొగ్గుచూపదు. కమోడిటీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకే సిద్దమై ఉంటుంది. కానీ భారీ డిస్కౌంట్లు, రూపాయి పతనం వంటివి ఈ సంస్థ రెవెన్యూలకు గండికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి కార్ల ధరలను పెంచనున్నామని మారుతీ సుజుకీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ చెప్పారు. అయితే ధరలు ఎంతపెంచాలనే దానిపై తమ ధరల నిర్ణయ టీమ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో రెండో సారి మారుతీ కార్ల ధరలను పెంచుతోంది. హ్యుందాయ్ సైతం జనవరిలో తన కార్ల ధరలను పెంచనున్నట్టు తెలిసింది. తమ మోడల్స్‌పై రూ.4000 నుంచి రూ.1 లక్ష వరకు ధరలు పెంచేందుకు యోచిస్తున్నామని హ్యుందాయ్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. హ్యుందాయ్ ప్రీమియం ఎస్యూవీ, సాంటా ఫీలపై లక్ష రూపాయల ధర పెరగనుంది. -
ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: వరుసగా వాహన కంపెనీలు వాహనాల ధరలను పెంచేస్తున్నాయి. కార్ల దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో వచ్చే నెల 2017 జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.. జనవరి 1, 2017 నుంచి 1-2 శాతం ధరలు పెరగనున్నాయని, ఇది ఉత్పత్తి మరియు వేరియంట్లపై ఆధారపడి ఉంటుందని జిఎం ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ హర్ దీప్ బ్రార్ ఒక ప్రకటనలో చెప్పారు. ముడి పదార్థం ధరల పెరుగుదలతో ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగిందనీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేటు , అత్యధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణాల రీత్యా ధరలు పెంపు తప్పనిసరి అయిందన్నారు. కాగా దాదాపు అన్ని కంపెనీలు వచ్చే జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు ఇటీవల ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్, టయోటా, నిస్సాన్, బెంజ్ సహా అనేక కంపెనీల కార్ల ధరలు పెరగనున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పట్లో పెట్టరంట!
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్ తన తొలి పత్రికా సమావేశాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. ఇప్పట్లో ప్రెస్ మీట్ నిర్వహించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. జనవరి వరకు మీడియా ముందుకు రాకూడదని ట్రంప్ అనుకున్నారని ప్రస్తుతం శ్వేత సౌదం నుంచి అధికార బదిలీ వ్యవహారాలు చూస్తున్న ట్రంప్ అధికార ప్రతినిధి హోప్ హిక్స్ తెలిపారు. వాస్తవానికి అధికార బదిలీ నేపథ్యంలో ట్రంప్ ఈ గురువారం తొలి పత్రికా సమావేశం నిర్వహిస్తారని, అందులో ఆయన వ్యూహాలు, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కొత్తగా సిద్ధం చేసిన విధానాలు, వివాదాల విషయంలో తీసుకోబోయే పరిష్కార మార్గాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ ప్రకటనతో ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా ఈ ఒక్క ప్రకటనతో తనవైపునకు తిప్పుకునేలా పత్రికా సమావేశానికి కావాల్సిన సమాచారం సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, జనవరి వరకు అలాంటి కార్యక్రమం పెట్టుకోవద్దని ట్రంప్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలోనే ప్రమాణం చేయనున్నారు. -
అంతర్జాతీయ నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
విజయవాడ : జనవరిలో జిల్లాలో జరపతలపెట్టిన అంతర్జాతీయ సంగీత నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సంగీత నృత్య ఉత్సవాలపై సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 19 నుంచి 22 వరకు పవిత్రసంగమం వద్ద ఈకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించారు. వయోలి¯ŒS విద్యాంసులు ఎల్.సుబ్రమణ్యం జేసీ జి.చంద్రుడు, సబ్–కలెక్టర్ సలోనిసిదాన, సాంస్కృతికశాఖ డైరెక్టర్ డి.విజయభాస్కర్, టూరి జం ఈఈ మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
ఒకే బ్రాండ్‌గా ‘మహా’ సిమెంట్
వచ్చే జనవరికల్లా తమిళనాడు ప్లాంటు రెడీ ఉత్పత్తి 10 మిలియన్ టన్నులకు ఫార్మా రంగంలోకి మై హోమ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ రీబ్రాండింగ్ చేపట్టింది. మహా సిమెంట్, మహా శక్తి, మహా గోల్డ్ బ్రాండ్ల స్థానంలో ఇక నుంచి ‘మహా’ పేరుతో సిమెంటును విక్రయించనుంది. దక్షిణాదిన సుస్థిర వాటాతో ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అడుగు పెట్టినట్టు కంపెనీ ఈడీ ఎస్.సాంబశివరావు ఈ సందర్భంగా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో రీబ్రాండింగ్ చేపట్టినట్టు చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికిపైగా కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. నల్గొండ, కర్నూలు, వైజాగ్‌లలో ఉన్న కంపెనీ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 8.4 మిలియన్ టన్నులు. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద రూ.250 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంటు జనవరికల్లా సిద్ధమవుతోంది. ఈ ప్లాంటు తోడైతే కంపెనీ సామర్థ్యం 10 మిలియన్ టన్నులకు చేరనుంది. ఇదీ గ్రూప్ ప్రణాళిక..: ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50% ఉన్నట్లు మై హోమ్ ఇండస్ట్రీస్ తెలిపింది. వినియోగం పూర్తి స్థారుుకి చేరుకున్నాక విస్తరణ చేపట్టాలని కంపెనీని ప్రమోట్ చేస్తున్న మై హోమ్ గ్రూప్ భావిస్తోంది. ఇప్పటికే గుంటూరులో స్థలాన్ని సమకూర్చుకుంది. ఇక్కడ రూ.1,500 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని ప్లాంటులో మరో యూనిట్‌ను మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనుంది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారత్‌లో ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీల ప్లాంట్లను కొనుగోలు చేయడం లేదా సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. మై హోమ్ గ్రూప్ టర్నోవరు రూ.5,000 కోట్లు. ఇందులో సిమెంటు వ్యాపారం ద్వారా రూ.3,000 కోట్లు సమకూరుతోంది. ఈ విభాగం రెండు మూడేళ్లలో రూ.5,000 కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా. బల్క్ డ్రగ్, ఫార్మాలోకి..: సిమెంట్, నిర్మాణం, విద్యుత్, రవాణా రంగాల్లో ఉన్న మై హోమ్ గ్రూప్ బల్క్ డ్రగ్, ఫార్మా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఏ ఉత్పత్తులతో ఎంట్రీ ఇవ్వాలో అన్న అంశంపై ఒక బృందం ఇప్పటికే అధ్యయనం చేస్తోంది. ఆరు నెలల్లో స్పష్టత వస్తుందని సాంబశివరావు వెల్లడించారు. -
జనవరిలో సెట్స్ పైకి మహేష్,కొరటాల సినిమా
మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న కొరటాల శివ.. తాజాగా 'జనతా గ్యారేజ్' హిట్‌తో టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. 'జనతా గ్యారేజ్' తో తారక్ కెరీర్లోనే పెద్ద హిట్ అందించిన కొరటాల తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడనేది అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్‌తో తన నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుందని కొరటాల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. మహేష్‌తో చేయబోయే రెండవ సినిమా కూడా శ్రీమంతుడులానే మంచి కథతో ఉంటుందన్నారు. అలాగే జనవరి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని కొరటాల తెలిపారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. -
జనవరి చివర్లో బడ్జెట్!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరిపి జనవరి నెలాఖరులో ప్రవేశపెట్టటానికి మంచి కారణముందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ‘‘సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరపటం.. ప్రభుత్వ వ్యయాన్ని మెరుగుపరచటానికి, పన్ను ప్రతిపాదనలను ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు చేయటానికి దోహదపడుతుంది. దీనిని ప్రస్తుతం క్రియాశీలంగా పరిశీలిస్తున్నాం’’ అని వివరించారు. -
జనవరిలో సేవల జోరు..
న్యూఢిల్లీ: సేవల రంగం జనవరిలో మంచి పనితీరు ప్రదర్శించినట్లు నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) అవుట్‌పుట్ ఇండెక్స్ పేర్కొంది. ఈ రంగం క్రియాశీలత 19 నెలల గరిష్ట స్థాయిలో 54.3 పాయింట్లకు ఎగసినట్లు ఇండెక్స్ తెలిపింది. జనవరిలో ఈ సూచీ 53.6 పాయింట్ల వద్ద ఉంది. డిమాండ్, వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డం వంటి అంశాలు సేవల రంగం పురోగతికి కారణమని సర్వేను చేసిన మార్కిట్ సంస్థ ఎకనమిస్ట్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. కాగా తయారీ, సేవల రంగాలు రెండింటికీ సంబంధించిన నికాయ్ కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ డిసెంబర్లో 51.6 పాయింట్ల వద్ద ఉండగా, జనవరిలో 11 నెలల గరిష్ట స్థాయిలో 53.3 పాయింట్లకు ఎగసింది. -
నేడు జాతీయ బాలికా దినోత్సవం
-
24 జనవరి నుంచి 30 జనవరి, 2016 వరకు
వారఫలాలు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులకు శ్రీకారం. ఇంటా బయటా మీదే పైచేయి. సన్నిహితుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. భూ వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహీణి, మృగశిర 1,2 పా.) సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. లక్ష్యాల సాధనలో కుటుంబ సభ్యులు, మిత్రులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు తీరతాయి. ప్రముఖులతో చర్చలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానాలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. నిరుద్యోగులు, విద్యార్థుల కృషి అంతగా ఫలించే అవకాశం లేదు. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రం. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సహాయంతో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసు కుంటారు. ఇంటా బయటా మీకు ఎదురుండదు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాహనయోగం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పొరపాట్లు సరిదిద్దుకుని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. గులాబీ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) సంఘంలో విశేష గౌరవం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆదాయం కొంత పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. రుణబాధల నుంచి కొంతవరకూ బయటపడతారు. ప్రముఖ వ్యక్తి చేయూతనంది స్తారు. ఇళ్లు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు కాస్త తొలగుతాయి. లేత ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అర్చన చేయించుకుంటే మంచిది. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కీలక నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పనుల్లో అవరోధాలు నెలకొన్నా పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యాలపై చర్చలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్తుతి మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఈవారం పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు లేదు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రాబడి ఆశాజనకమే. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. నలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. శ్రమ ఫలించే సమయం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు. తెలుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. -
నేడు 9.30 గంటలకు కౌంట్‌డౌన్ షురూ
-
17 జనవరి నుంచి 23 జనవరి, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఇంటా బయటా ఎదురుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగు తాయి. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళాకారులకు సన్మానాలు. గులాబీ, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహీణి, మృగశిర 1,2 పా.) కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. మీ ప్రతిభకు గుర్తింపు. రాబడి కొంత పెరిగే అవకాశం. వ్యాపారాలు ఉత్సాహవంతం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరం. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఈ వారం విజయాల బాటలో సాగుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. వివాహయత్నాలు సానుకూలం. భూ వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. తెలుపు, తేనె రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) మొదట్లో చికాకులు, మానసిక అశాంతి తప్పకపోవచ్చు. బంధువుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ పుంజుకుంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసు కుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయ వర్గాలకు పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు సొమ్ము అందుతుంది. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. నీలం, నలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం. ఆస్తి వివాదాలు కొంత పరిష్కార మవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం లభిస్తుంది. రాబడి ఆశాజనకం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. లేత ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు గుర్తింపు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. భూ వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలలో పురోగతి. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. లేత నీలం, నలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. రామరక్ష స్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు తగిన గుర్తింపు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. నేరేడు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యపరంగా చికాకులు. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు. రాజకీయ వర్గాలకు పర్యటనల్లో మార్పులు. బంగారు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు: 10 జనవరి నుంచి 16 జనవరి, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతన విద్యలపై ఆసక్తి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహణి, మృగశిర 1,2 పా.) చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు. ఆరోగ్య విషయంలో చికాకులు తప్పకపోవచ్చు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. అరుదైన ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు. కళాకారులకు సన్మానాలు. గోధుమ, ఎరుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఉత్సాహవంతం. భూ వివాదాలు తీరతాయి. బాకీలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌చాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విరోధులు మిత్రులుగా మార తారు. పోటీపరీక్షల్లో విజయం. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకరం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనయోగం. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నేరేడు, లేత నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆర్థిక విషయాల్లో నిరాశ. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తుతి మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవే త్తలకు అంచనాలు నిజమవుతాయి. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు. నీలం, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులను దారికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన సమాచారం అందుతుంది. కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ధనలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు సన్మానాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక లావాదేవీలు ఆశాజన కం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వాహనాలు, భూముల కొనుగోలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, లేత పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణే శ్స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
జనవరి నుంచి హోండా కార్ల ధరలు అప్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా.. జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.16,000 వరకు పెంచనున్నది. ఉత్పత్తి వ్యయం అధికమవ్వడమే కార్ల ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ తె లిపింది. జనవరి నుంచి మోడల్‌ను బట్టి కారు ధరను రూ.10,000-రూ.16,000 వరకు పెంచుతామని హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా రూ.4.25-రూ.25.13 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ధరల శ్రేణిలో తన వాహనాలను విక్రయిస్తోంది. టాటా మోటార్స్, మారుతీ, జనరల్ మోటార్స్, హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కాగా నిస్సాన్, రెనో, స్కోడా కంపెనీలు కూడా కార్ల ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. -
సరికొత్త సంప్రదాయానికి తెరలేపుతున్న టీసర్కార్
-
జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్
* విద్యార్థులను సతాయించొద్దు * డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భీమారం: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందలేదని విద్యార్థులను సతాయించొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండ పరిధిలోని భీమారంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్ విద్యపై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అందలేదని కొన్ని కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. డబ్బులు చెల్లించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 2014-2015కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు త్వరలో అందజేస్తామని చెప్పారు. 2015-16కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జనవరి నెలాఖరు వరకు పూర్తిగా విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే కొన్ని కళాశాలలు అధ్యాపకులకు వేతనాలివ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం పాలసీ మేరకు ప్రైవేట్ కళాశాలలు మూతపడుతాయని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచిం చారు. ఇంటర్‌బోర్డును ఆన్లైన్ చేస్తున్నట్లు కడియం ప్రకటించారు. ఇప్పటికే విద్యార్థుల దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రైవేట్ కళాశాల అఫ్లియేషన్‌ను ఐదేళ్లకు పెంచే విషయాన్ని చర్చిస్తామని పేర్కొన్నారు. అవినీతి వాస్తవమే.. ప్రభుత్వశాఖల్లో అవినీతి జరుగుతున్న మాట వాప్తవమేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెం ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ బోర్డుకు వెళ్తే పైసా లేకుండా పని జరగడం లేదని..అక్కడి అధికారులు యాజమాన్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. స్పందిం చిన కడియం శ్రీహరి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన వారు ఆత్రుతతో పని కావాలని ఎంతో కొంత ముట్టుజెప్పి పనులు చేయించుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలు వారి అవినీతిని ప్రోత్సహించాయని చెప్పారు. టీప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహులులతో పాటు పది జిల్లాల నుంచి సుమారు 150 కళాశాలల ప్రతి నిధులు హాజరయ్యారు. 3నెలల్లో ప్రతి పేదవారి ఇంటికి గ్యాస్ కనెక్షన్ హన్మకొండ: తెలంగాణలో మూడు నెలల్లో ప్రతి పేద ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, బానోత్ శంకర్‌నాయక్‌తో కలసి కడియం శ్రీహరి దీపం పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించి వారికి రాయితీపై గ్యాస్ కనెక్షన్ అందించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో గుడుంబా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. గుడుంబా అమ్మితే ఎమ్మెల్యేలు, పోలీసు, ఎక్సైజ్ అధికారులకు చెప్పాలని గ్రామస్తులను కోరారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్ల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి కనెక్షన్ అవసరముంటుందని భావించామన్నారు. సీఎం ఆలోచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఈటల చెప్పారు. -
జనవరిలో డీఎస్సీ!
-
జనవరిలో డీఎస్సీ!
♦ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కారు నిర్ణయం ♦ 10 వేల వరకు పోస్టులు ఉండే అవకాశం! ♦ వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త టీచర్లు ♦ అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన ♦ వచ్చేనెల 10 నాటికి 7,983 మంది వీవీల నియామకం ♦ రూ. 8 వేల వేతనంతో మండలం యూనిట్‌గా భర్తీ ♦ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రక్రియను పూర్తిచేసి పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమించనుంది. దాదాపు 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా.. ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదారు నెలల సమయం పడుతుంది. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం దాదాపు పూర్తయి, వేసవి సెలవుల సమయం వస్తుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీచేస్తే మే నెలాఖరుకల్లా నియామకాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వచ్చే ఏడాది జూన్ 12న స్కూళ్లు ప్రారంభించే నాటికి కొత్త టీచర్లను పాఠశాలలకు పంపించాలన్న యోచనలో ఉంది. వారంలో విద్యా వలంటీర్లు.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నందున టీచర్లు లేని స్కూళ్లలో వెంటనే విద్యా వలంటీర్లను నియమించనున్నారు. ప్రస్తుతమున్న 7,983 ఖాళీల్లో సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఈ నియామకాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యా వలంటీర్లకు నెలకు రూ.8 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించే అవకాశముంది. ఎస్జీటీ ఖాళీల్లో నియమించే వారికి ఇంటర్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్హత ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ స్థానంలో నియమితులయ్యే వారికి డిగ్రీతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అర్హత ఉండాలి. మండలం యూనిట్‌గా జిల్లా యంత్రాంగం నేతృత్వంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. ఆ మండలానికి చెందిన వారినే విద్యా వలంటీర్లుగా నియమిస్తారు. వయోపరిమితి తదితర వివరాలు మార్గదర్శకాల్లో ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టెన్త్, ఇంటర్, డీఎడ్/బీఎడ్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి మెరిట్‌ను రూపొందించి నియామకాలు చేపడతారు. దీంతోపాటు రోస్టర్, రిజర్వేషన్లను పాటిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు రెండు మూడు రోజుల్లో జారీ కానున్నాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. ఖాళీలపై స్పష్టత వచ్చినందునే.. ‘‘ఉపాధ్యాయ ఖాళీలపై ప్రస్తుతం స్పష్టత వచ్చింది. గతంలో ఆ స్పష్టత లేనందునే కొత్త నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా వెంటనే నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల సమయం పడుతుంది. మొత్తానికి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లను నియమిస్తాం. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఎప్పుడన్నది త్వరలో నిర్ణయిస్తాం..’’ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. జిల్లాల వారీగా నియామకం కానున్న విద్యా వలంటీర్లు - మహబూబ్‌నగర్ 1,646 - రంగారెడ్డి 1,408 - ఆదిలాబాద్ 1,244 - మెదక్ 1,104 - ఖమ్మం 674 - నిజమాబాద్ 480 - హైదరాబాద్ 414 - నల్లగొండ 362 - కరీంనగర్ 337 - వరంగల్ 314. -
4జీ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షియోమీ టాప్
భారత్‌లో రెండో స్థానానికి ఆపిల్ న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ భారత 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానానికి చేరింది. శామ్సంగ్, ఆపిల్ కంపెనీల 4జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో షియోమీ 4జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సైబర్‌మీడియా రీసెర్చ్ సంస్థ తెలిపింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలలో ఆపిల్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. సైబర్‌మీడియా రీసెర్చ్ సంస్థ ప్రకారం... జనవరిలో భారత్ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ వాటా 30.8 శాతంగా ఉంది. అదే సమయంలో ఆపిల్ మార్కెట్ వాటా 23.8 శాతంగా, శామ్సంగ్ మార్కెట్ వాటా 12.1 శాతంగా, హెచ్‌టీసీ మార్కెట్ వాటా 10 శాతంగా, మైక్రోమ్యాక్స్ మార్కెట్ వాటా 8.3 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో మొత్తం మొబైల్ మార్కెట్లో (స్మార్ట్ఫోన్లు, 4జీ, 3జీ, ఫీచర్ ఫోన్లు) శామ్సంగ్ 17.3 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాలలో లావా (11.9 శాతం), మైక్రోసాఫ్ట్ (10.3 శాతం), మైక్రోమాక్స్ (9.7 శాతం), ఇంటెక్స్ (8.5 శాతం) ఉన్నాయి.భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కూడా శామ్సంగ్ 28.8 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాలలో మైక్రోమాక్స్ (12.1 శాతం), ఇంటెక్స్ (9.7 శాతం), లావా (9.4 శాతం), మైక్రోసాఫ్ట్ (4.5 శాతం) ఉన్నాయి. -
వంట గ్యాస్ నగదు బదిలీకి నో!
ఆధార్, బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి ముందుకురాని వినియోగదారులు సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్న వంట గ్యాస్ నగదు బది లీకి వినియోగదారులు నిరాసక్తత కనబరుస్తున్నా రు. నగదు బదిలీ కోసం ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలు ఇవ్వాల్సి ఉన్నా వినియోగదారులు పెద్ద గా ముందుకు రావడంలేదు. పెద్దమొత్తంలో సిలిండర్ ధరను చెల్లించాల్సి రావడం, రాయితీ, రాయితీయేతర సిలిండర్ ధరల మధ్య వ్యాట్ వ్యత్యాసం ఉండటం, సకాలంలో ఖాతాలో రాయి తీ జమకాకపోవడంవంటి కారణాలరీత్యా విని యోగదారులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న నగదు బదిలీ అమలు ఎలా సాధ్యమన్నది అంతుపట్టడం లేదు. నవంబర్ 15 నుంచే హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలయింది. మూడు జిల్లాల పరి ధిలో ఇప్పటికే 32.71లక్షల మంది వినియోగదారులు ఈ పథకం పరిధిలోకి రాగా, జనవరి నుంచి మొత్తంగా 61.99 లక్షల మంది రానున్నారు. ఎల్పీజీ కనెక్షన్‌కు బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలోనే జమ అవుతుంది. ఆధార్ లేకున్నా బ్యాంక్ ఖాతా నంబర్ డీలర్‌కు ఇస్తే ఆ ఖాతాలో రాయితీ జమ అవుతుంది. మొదటి మూడు నెలల్లో ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాతి మూడు నెలలపాటు రాయితీ ధరకు ఇవ్వరు కానీ ఈ రాయితీని బ్యాం కు ఖాతాను ఎప్పుడైతే అనుసంధానిస్తే అప్పుడు రాయితీ మొత్తాన్నంతా ఖాతాలో జమచేస్తారు. దీనిపై పౌర సరఫరాల శాఖ, చమురు కంపెనీలు, బ్యాంకులు విసృ్తత ప్రచారం జరిపినా ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి వినియోగదారుల నుంచి స్పందన రాలేదు. ప్రస్తుతం రూ.444 చెల్లించి సిలిండర్ పొందుతుండగా, నగదు బదిలీ కింద రూ.832 చెల్లించాలి. దీనికితోడు అదనంగా రూ.19 వరకు వ్యాట్ భారం పడి రావాల్సిన సబ్సిడీ కన్నా తక్కువ మొత్తం ఖాతాల్లో జమ అవుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం మౌనంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు నగదు బదిలీపై ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు బ్యాంకుల్లో సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా సిలిండర్ పొందిన 10 నుంచి 15 రోజులకు గానీ రాయితీ జమ కావడం లేదని గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆధార్ నమోదు 75.72 శాతం, బ్యాంకు సీడింగ్ కేవలం 57.12 శాతం మాత్రమే నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆధార్ సీడింగ్ 59.24 శాతం, బ్యాంక్ సీడింగ్ కేవలం 27.25 శాతం మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌లో మొత్తం 13,54,101 వినియోగదారులు ఉండగా 11,31,592 మంది ఆధార్ నమోదు చేయించుకున్నారు. -
జనవరిలో ‘ఆర్ట్ ప్రాజెక్టు’
న్యూఢిల్లీ : నగరవాసులకు శుభవార్త. వలస చరిత్ర ప్రారంభ దశను చూడనున్నారు. వలసవాదం-పరిణామాలను ప్రజలకు తెలియజేయడానికి ‘మెట్రో ఆర్ట్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీని ద్వారా అప్పట్లో మహిళల రక్షణ, పాలనలో పారదర్శకత తదితర అంశాలపై వినోదాత్మక పద్ధతిలో వివరించనున్నారు. మూణ్నెళ్లపాటు కొనసాగే ఈ ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో, హెబిటెట్ సెంటర్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా వలసవాదంపై ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.‘ జోర్‌బాగ్ మెట్రోస్టేషన్లో ‘ ఉదయ్‌పూర్ పురాతన చరిత్ర’ అనే అంశంపై ఎగ్జిబిషన్, మండీ హౌజ్ మెట్రో స్టేషన్ వద్ద నేరాలపై గ్రాఫిక్స్ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాజెక్టు సంబంధించిన మరిన్ని వివరాలను నిర్వాహకుడు ఆల్కాపాండే తెలిపారు. వలసవాదం కాలం నాటి లింగ వివక్ష, పౌర సమాజం, గుర్తింపు, పాలనలో పారదర్శకత, సమకాలినసమాజంపై ప్రజలకు ప్రాజెక్టు ద్వారా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉదయ్‌పూర్ చరిత్ర ప్రదర్శనలో 1850 నుంచి ఇప్పటి వరకు వలసలకు సంబంధించిన ఫొటోల ప్రదర్శన ఉంటుంది. ‘ఫొటో గ్రాఫ్‌లు కూడా చరిత్ర జ్ఞానాన్ని అందజేస్తాయి. ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం, శక్తి సామర్థ్యాలను ప్రదర్శనలు తెలియజేస్తాయని చెప్పారు. -
జనవరిలో అమిత్ షా తెలంగాణ పర్యటన!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ విస్తరణ లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జనవరి 15న రాత్రి హైదారబాద్ చేరుకుని, 16న వరంగల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. 17వ తేదీన విజయవాడలో పర్యటిస్తారు. అయితే సంక్రాంతి సందర్భంగా నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా సంబరాల్లో ఉండనున్న దృష్ట్యా తెలంగాణలో అమిత్ షా పర్యటన తేదీలను మారిస్తే బాగుంటుందనే ప్రతిపాదన చేయనున్నట్టు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. -
జనవరిలో కాకతీయ ఉత్సవాలు
వరంగల్‌లో మూడు రోజులు, ఇతర జిల్లాల్లో రెండు రోజులు నాటి కళావైభవం ఉట్టిపడేలా నిర్వహణ పర్యాటక భవన్లో సన్నాహక సమావేశం సాక్షి, హైదరాబాద్: కాకతీయ ఉత్సవాలను వచ్చే జనవరి రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో జనవరి 10, 11 తేదీల్లో జరపాలని నిర్ణయించగా, వరంగల్ జిల్లాలో మాత్రం ఒకరోజు ముందుగా 9వ తేదీన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారిలు సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, ఆ శాఖ సంచాలకులు హరికృష్ణ, వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్, సమాచార శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్‌లతో పర్యాటక భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యంలో అలరారిన కళాసంపదతో పాటు వారసత్వ కళలను, ప్రజాదరణ పొందిన గ్రామీణ కళారూపాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని వారు ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి ఏర్పాట్లు చేయాలని, ఇందుకు సాంస్కృతిక శాఖ సంచాలకులు, వరంగల్ జిల్లా కలెక్టర్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని, ఉత్సవాలను వీలైనంత ఎక్కువ మంది తిలకించేలా జిల్లా కేంద్రాల్లో వేదికను తీర్చిదిద్దాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లతో ఊరారా ప్రచారం చేయాలని, ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వృద్ధ కళాకారులకు ఇటీవల రూ.1,500కు పెంచిన పింఛన్‌ను ఈ సందర్భంగా పంపిణీ చేసేందుకు వీలుగా పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులే కాకుండా కొత్తగా అర్హులను కూడా గుర్తించాలని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేయాలని, ఉత్సవాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు, మేధావులు, కళాకారులతో వేదిక వరకు ర్యాలీ నిర్వహించాలని పర్యాటక శాఖ అడిషనల్ చీఫ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్టాక్ కన్వీనర్లు అనూరాధారెడ్డి, పాండురంగారావు, పురావస్తు శాఖ సంచాలకులు మనోహర్, శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా 58 కంటోన్మెంట్ల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 11న జరుగనున్నాయి. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ) తరఫున ఎస్ఆర్వో 09 (ఈ) ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం
హైదరాబాద్: తెలంగాణలో జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా సమ్మిళిత గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామ పౌర సేవాకేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాహకులుగా మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. వడ్డీలేని రుణాలు కొనసాగిస్తామని కేటీఆర్ చెప్పారు. -
జనవరిలో టెట్.. ఫిబ్రవరిలో డీఎస్సీ: పార్థసారథి
అనంతపురం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జనవరిలో నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా నార్పలలో విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలుగు పండిట్లు, పీఈటీల పదోన్నతి విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే జీఓ విడుదల చేస్తామన్నారు. -
రయ్.. రయ్..
=త్వరలో అందుబాటులోకి ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ =విజయవాడ-వరంగల్ హైవేల అనుసంధానం =శరవేగంగా పనులు =తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: వాహన చోదకులకు కొత్త సంవత్సర కానుకగా ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ (మెయిన్ క్యారేజ్)ను అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీని నిర్మాణాన్ని 2014 జనవరి నెలాఖరుకు పూర్తిచేసి ఫిబ్రవరి నుంచి వాహనాల రాకపోకలను ప్రారంభించాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. 31 కి.మీ. మేర ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్ హైవే.. విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఫలితంగా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్‌రోడ్డు మీదుగా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకొని వనస్థలిపురం, హయత్‌నగర్ మీదుగా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తే ఇకపై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. అలాగే వరంగల్ నుంచి విజ యవాడ, విజయవాడ నుంచి వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఔటర్‌పై ప్రయాణించడం వల్ల సుమారు 5-6 కి.మీ. మేర దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు అడ్డుకట్ట పడుతుంది. పనులు చకచకా.. ఈ రోడ్డు పనులను ఇటీవల కమిషనర్ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సందర్శించారు. సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు నిరీక్షించకుండా అందుబాటులోకి వచ్చిన మెయిన్ క్యారేజ్ (ప్రధాన రోడ్డు)ను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. వాయిదాల్లేకుండా మెయిన్ రోడ్లో మిగిలిన పనులను జనవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా జూన్, జూలై నాటికి పూర్తిచేయాలన్నారు. దీంతో ఆ దిశగా పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కండ్లకోయ జంక్షన్, ఘట్కేసర్ వద్ద ఆర్వోబీ నిర్మాణం, ఘట్కేసర్ జంక్షన్ల వద్ద నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులుండటంతో పనులు చేపట్టే అవకాశం లేదు. అయితే... ఘట్కేసర్ వద్ద ఆర్వోబీకి సంబంధించి రైల్వే శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో 2014 ఏప్రిల్ -మే నాటికల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తే.. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుకు గాను 15 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం షామీర్పేట-కీసర (11 కి.మీ.), కీసర-ఘట్కేసర్ (4 కి.మీ.) వరకు 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా 2014 మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. -
జనవరి నుంచి పింఛను ఇస్తాం
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని యాళ్లవాని గరువుకు చెందిన వికలాంగురాలు సంది రాజ్యంకు దాతల సహకారంతో జనవరి నుంచి రూ.200 పింఛను ఇవ్వనున్నట్టు ఎంపీడీవో ఆర్.విజయరామరాజు చెప్పారు. ‘మూడేళ్లు పింఛను ఇచ్చి.. ఆనక ఆపేశారు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ, ఎంపీడీవో రామరాజు స్పందించారు. రాజ్యంకు సంబంధించిన రికార్డులను ఎంపీడీవో పరిశీలించారు. ఆమెకు వైకల్యం శాతం తక్కువగా ఉండటంవల్ల సదరం క్యాంపులో ఆమె పింఛను నిలుపుదల చేశారని ఎంపీడీవో పేర్కొన్నారు. అరుుతే, ఆమెకు ముందువెనుకా ఎవరూ లేనందున మానవతా ధృక్ఫథంతో దాతల సహకారంతో వచ్చే నెలనుంచి పింఛను అందేలా ఏర్పాటు చేస్తామన్నారు. రాజ్యం భౌతిక పరిస్థితులు, శారీరక పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించి ప్రభుత్వ సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. -
జనవరి కల్లా ‘ఆకాశ్-4’
పడుతూ లేస్తూ సాగుతున్న దేశీయ టాబ్లెట్ ‘ఆకాశ్’ ప్రస్థానంలో నాలుగో వెర్షన్ రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా ఆకాశ్-4 టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే వివిధ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చలు జరిపామని, మొత్తం 11 కంపెనీలు ‘ఆకాశ్’ నాలుగో వెర్షన్ టాబ్లెట్‌ను రూపొందించడానికి సంసిద్ధత ప్రకటించాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆకాశ్ నాలుగో వెర్షన్ కొత్త సదుపాయాల విషయానికి వస్తే.. ఇందులో ఫోన్ కాలింగ్ సదుపాయం కూడా ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆకాశ్టాబ్లెట్ ఫాబ్లెట్‌గా మారుతుంది. నాలుగో వెర్షన్ నాలుగో తరం ఇంటర్నెట్(4జీ) ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. బ్లూటూత్ సదుపాయం కూడా ఉంటుంది. ధర రూ.2,276.