తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ 'దేవేంద్ర సింగ్ చౌహాన్' ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రాబోయే రోజుల్లో రేషన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఈ-కేవైసీ తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు ఇంకా ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తూ మరో నెల రోజులు అవకాశం కల్పించారు.
రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గడువును 2024 జనవరి 31 పొడిగించారు. ఈ గడువు లోపల ఈ-కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గత రెండు నెలలుగా రేషన్ డీలర్లు ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీని కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తులు వంటివి తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే..
నిర్దిష్ట గడువు లోపల ఈ-కేవైసీ అప్డేట్ పొందని రేషన్ కార్డులను, నకిలీ రేషన్ కార్డులుగా గుర్తించి.. వాటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే ప్రజలు అప్పటి వరకు పొందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.
2023 డిసెంబర్ 30 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు 70.80 శాతం అని తెలుస్తోంది. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో (87.81 శాతం) ముందు వరుసలో ఉన్నట్లు.. అతి తక్కువ నమోదైన జిల్లాలో వనపర్తి (54.17 శాతం) ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment