update
-
ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు, కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు రద్దవుతాయి. దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి రోజు. ఇప్పటికే.. పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం, మళ్ళీ గడువును పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఆధార్ అప్డేట్ అనేది అవసరమా?.. ఇది ఎందుకు పనికొస్తుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక నగరం నుంచి మరో నగరానికి మారితే? లేదా అడ్రస్ ఏమైనా మార్చుకుంటే.. అలాంటి వారు తమ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా.. పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు స్థాన చలనం జరగకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం గడువును పొడిగించిన ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అయితే ఇకపైన లేదా డిసెంబర్ 14 తరువాత గడువును పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?➠మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి➠లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.➠నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.➠రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➠అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.➠మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.➠అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
‘తప్పు జరిగింది..క్షమించండి’
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్డేట్ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్ సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్‌కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్‌కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. -
అయోధ్యలో మసీదు నిర్మాణం ఎంతవరకూ వచ్చింది?
అయోధ్య: యూపీలోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న మసీదుకు సంబంధించిన పనులు ఎంతవరకూ వచ్చాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆర్థిక కారణాలతో మసీదు పనులు నిలిచిపోయాయి. మసీదును నిర్మిస్తున్న ట్రస్ట్ ఐఐసీఎఫ్‌కు సంబంధించిన నాలుగు కమిటీలు రద్దు అయిన దరిమిలా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలుస్తోంది.2019, నవంబర్ 9న సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనితో పాటు మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మసీదు కోసం మరో ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. అయితే మసీదు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)తన నాలుగు కమిటీలను రద్దు చేసింది.ఐఐసీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. ఈ బోర్డు ఈ భూమిని పరిరక్షించేందుకు ఐఐసీఎఫ్ని ఏర్పాటు చేసింది. ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కమిటీలు మసీదు పేరుతో విరాళాలు సేకరించేందుకు పలు నకిలీ ఖాతాలు తెరిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అథర్ హుస్సేన్ తెలిపారు.మసీదు కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ మసీదు, లైబ్రరీ నిర్మించాలని ఐఐసీఎఫ్ ప్రతిపాదించింది. అయితే ట్రస్టుకు డబ్బు కొరత ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఐఐసీఎఫ్ విరాళంగా కోటి రూపాయలు అందుకుంది. అయితే నిర్మాణ పనులు చేపట్టేందుకు ట్రస్టుకు రూ.3 నుంచి 4 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది. కాగా మసీదు నిర్మాణ పనులను చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిధులు సేకరణ జరిగాక మసీదు నిర్మాణ పనులు ప్రారంభమవుయని ఐఐసీఎఫ్ తెలిపింది. ఇది కూడా చదవండి: రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకొనే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. శనివారంతో గతంలో ఇచి్చన గడువు ముగియడంతో ఉడాయ్ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఈ వివరాలను వెల్లడించింది. పదేళ్ల కిందటి ఆధార్ కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్డేట్లను ఉచితంగా చేసుకొనేందుకు గడువును మరో మూడునెలల పాటు.. డిసెంబర్ 14 వరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పొడగించింది. ఆన్లైన్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా మై ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయి మార్పులను ఉచితంగా చేసుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు వివరాలను అప్డేట్ చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ సూచించింది. ఒకవేళ డిసెంబర్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోలేని వారు... తర్వాత 50 రూపాయలు చెల్లించి ఆధార్ కేంద్రాల్లో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. -
ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ 'మై ఆధార్' (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంది. ఆన్లైన్ పోర్టల్ యూఐడీఏఐ వెబ్సైట్లో పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15 నుంచి పొడిగిస్తూ.. మార్చి 14, ఆ తరువాత జూన్ 14, సెప్టెంబర్ 14కు పొడిగిస్తూ.. ఇప్పుడు తాజాగా ఈ తేదీని డిసెంబర్ 14కు పొడిగించారు.ఇదీ చదవండి: ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే.. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్➤మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి➤క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.➤మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.➤మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.➤'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.➤మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి➤ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.➤'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.➤14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది.#UIDAI extends free online document upload facility till 14th December 2024; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/ThB14rWG0h— Aadhaar (@UIDAI) September 14, 2024 -
గుజరాత్లో వర్ష బీభత్సం
భారీ వర్షాలు గుజారాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్, అమ్రేలి, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, మహిసాగర్, భరూచ్, నర్మద, సూరత్, ఛోటా ఉదేపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 28న సౌరాష్ట్రలోని కచ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, దేవభూమి ద్వారక, జునాగఢ్ పోర్బందర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. Gujarat Rain: Sardar Sarovar Dam Water Level Rises, all the Gates Opened; Coastal Villages on High Alert…Whereas Vadodara city & district is on high alert because Ajwa Lake and Vishwamitri River crossed danger mark, causing widespread flooding in the city. pic.twitter.com/6zHM5T5428— ~ Mr_Perfect ~ (@HadkulaTiger1) August 26, 2024 -
చార్ధామ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. ఎన్‌హెచ్, బీఆర్ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనులు చేపడుతున్నాయి.చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్‌వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.నంద్‌ప్రయాగ్‌లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది. -
12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ పలు అంచనాలను వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో శనివారం (ఆగస్టు 24) ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, గోవా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వాతావరణశాఖ అందించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 269.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికం. ఆగస్టు 23 వరకు, ఢిల్లీలో 274 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది ఆగస్టు 2014 లో నమోదైన గరిష్ట వర్షపాతం కంటే అత్యధికం.ఆగస్టు 25న గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. -
ఢిల్లీలో కనిపించని భారత్ బంద్ ప్రభావం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో కనిపించలేదు.ఢిల్లీలోని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానుల సమన్వయ సంస్థ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాము కాష్మీరే గేట్, చాందినీ చౌక్, ఖరీ బావోలి, నయా బజార్, చావ్రీ బజార్, సదర్ బజార్, కరోల్ బాగ్, కమ్లా నగర్, కన్నాట్ ప్లేస్, లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా మార్కెట్ సంఘాలతో ఈ విషయమై చర్చించామన్నారు. ఈ దరిమిలా తాము బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 700 మార్కెట్లు పూర్తిగా తెరిచి ఉంటాయని, 56 పారిశ్రామిక ప్రాంతాలు కూడా పని చేస్తాయని తెలిపారు.మాయావతి మద్దతుభారత్ బంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగున్నదని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 1. बीएसपी का भारत बंद को समर्थन, क्योंकि भाजपा व कांग्रेस आदि पार्टियों के आरक्षण विरोधी षडयंत्र एवं इसे निष्प्रभावी बनाकर अन्ततः खत्म करने की मिलीभगत के कारण 1 अगस्त 2024 को SC/ST के उपवर्गीकरण व इनमें क्रीमीलेयर सम्बंधी मा. सुप्रीम कोर्ट के निर्णय के विरुद्ध इनमें रोष व आक्रोश।— Mayawati (@Mayawati) August 21, 2024 -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా దేవర పార్ట్-1కు సంబంధించిన ఎన్టీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చివరిదశ షూట్ జరుగుతోందని వెల్లడించారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని.. టీం అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు. సెప్టెంబర్ 27 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెట్లో డైరెక్టర్‌తో ఫోటో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB— Jr NTR (@tarak9999) August 13, 2024 -
ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త! మీ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు..వంటి కీలక వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే ఇకపై వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికోసం జాయింట్ డిక్లరేషన్‌ను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.ఏమిటీ జాయింట్ డిక్లరేషన్..ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల వివరాలు ఇందులో మార్చుకోవచ్చు. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, సంస్థ యజమాని ఇద్దరూ ఈ మార్పును ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్‌కి పంపించాలి. దాని అనుసరించి చందాదారుల వివరాలు అప్డేట్ అవుతాయి.సవరణ ఇలా..చందాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.inకు వెళ్లాలి.హోం పేజీ టాప్‌లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి.For Employees అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్లో Member UAN/ online Service(OCS/OTCP)పై క్లిక్ చేయాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి. సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.ఎంప్లాయర్ కూడా ఆయా వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్‌ను పీఎఫ్ కమిషనర్‌కు పంపించాలి. -
అల్లు అర్జున్ 'పుష్ప-2'.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. దాదాపు మరో నెల రోజుల పాటు షూటింగ్ పూర్తి కావాల్సి ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. డిసెంబర్ 6న తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తామంటూ మరోసారి రిలీజ్ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇటీవల పుష్ప-2 మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందువల్లే పుష్ప టీమ్ షూటింగ్ అప్డేట్ను ప్రేక్షకులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. Shoot Update :#Pushpa2TheRule is currently shooting a spectacular action episode for the climax🔥🔥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/X5haaasHAj— Pushpa (@PushpaMovie) August 5, 2024 -
సమీపిస్తున్న గడువు.. ఐటీ శాఖ బిగ్ అప్డేట్!
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి రోజు. పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. గడువు సమీపిస్తుండడంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో రిటర్న్స్ దాఖలయ్యాయి.ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. గతేడాదిలో దాఖలైన ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది.గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్న్స్ పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. కాగా గతేడాది మొత్తం 8.61 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. -
Weather Update: 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
రంగు మారనున్న వాట్సాప్! త్వరలో అప్డేట్
వాట్సాప్ (WhatsApp) ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్‌లు త్వరలో ఆండ్రాయిడ్‌లో రంగు మారనున్నాయి. వాట్సాప్ ఇటీవలి బీటా వెర్షన్లో దీనికి సంబంధించిన మార్పును ఓ ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ఇది యూజర్లందరికీ త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.వాట్సాప్ ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్‌లు మెటాకు చెందిన ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ యాప్‌లైన ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్బుక్ (Facebook)లో ఉండే చెక్ మార్క్‌లను పోలి ఉండనున్నాయి. ఫీచర్ ట్రాకర్ WABetaInfo పోస్ట్‌లో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా వెర్షన్‌ను డౌన్లోడ్ చేసిన టెస్టర్లకు ఇప్పటికే కొత్త బ్లూ చెక్‌మార్క్ అందుబాటులో ఉందని పేర్కొంది .వాట్సాప్‌లో రానున్న కొత్త కలర్ స్కీమ్ కంపెనీ యాప్‌లలో ఏకరూపతను మెరుగుపరుస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసిన యూజర్లకు వారు ఎంగేజ్ చేస్తున్న ఎంటిటీ ప్రామాణికమైనదో కాదో సులభంగా గుర్తించేలా చేస్తుంది.రీడిజైన్ చేసిన వెరిఫికేషన్ టిక్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో iOSలోని టెస్టర్లకు కూడా అందుబాటులోకి రావచ్చు. అంతిమంగా వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌తో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌ల కోసం స్థిరమైన అప్డేట్ ఛానెల్లోకి వస్తుంది. -
రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు
రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.రిషికేశ్‌లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు. -
‘ఎక్స్’ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ కొందరికే...???
బిలినీయర్, టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసినప్పటి నుంచి సంచలన మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవడంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాన్ని కంపెనీ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.రాబోయే రోజుల్లో ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే 'ఎక్స్'లో లైవ్ స్ట్రీమ్ (క్రియేట్ లైవ్ వీడియో స్ట్రీమ్) చేయగలరు. ఇందులో ఎక్స్ ఇంటిగ్రేషన్‌తో ఎన్కోడర్ నుంచి లైవ్ కూడా ఉంటుంది. ఈ లైవ్ కొనసాగించడానికి యూజర్లు ప్రీమియంకు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ దీనికి సంబంధించి ఓ ప్రకటన వెల్లడించినప్పటికీ.. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాని వెల్లడించలేదు. ఎక్స్ బేసిక్ ప్రీమియం చార్జీలు 215 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి.⏩Starting soon, only Premium subscribers will be able to livestream (create live video streams) on X. This includes going live from an encoder with X integration. Upgrade to Premium to continue going live. https://t.co/4uy4Ju0cmU— Live (@Live) June 21, 2024 -
రుతుపవనాలపై ‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువ వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8వ తేదీ దాకా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్ వర్షాలుగా పిలుస్తారు. ఇవి రైతులు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. ‘రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడింది. అవి కాస్త బలహీనమయ్యాయి. అయితే అవి ఎప్పుడు బలపడతాయో అప్పుడు కొద్ది సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తాయి’అని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. -
ఉచితంగా ఆధార్ అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14ను చివరి తేదీగా యూఐడీఏఐ వెబ్సైట్లో పేర్కొంది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ .50 రుసుము వసూలు చేస్తారు. ఆన్లైన్ పోర్టల్‌లో యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15గా నిర్ణయించారు. తరువాత మార్చి 14, ఆ తరువాత జూన్ 14 తాజాగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..» స్టెప్ 1: మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి» స్టెప్ 2: క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.» స్టెప్ 3: మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.» స్టెప్ 4: మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.» స్టెప్ 5: 'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.» స్టెప్ 6: మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి» స్టెప్ 7: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.» స్టెప్ 8: 'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.» స్టెప్ 9: 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను జూన్ 14న కన్నప్ప రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంచు విష్ణు కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో గుర్రం మీద విష్ణు కూర్చుని కనిపించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.After an overwhelming reception at Cannes, I am thrilled to share the teaser for this epic tale, 'Kannappa', with you on 14th June. This film holds a special place in my heart, and I can’t wait to welcome you all to the captivating world of #Kannappa🏹. #kannappateaser… pic.twitter.com/bhmCEi6K4s— Vishnu Manchu (@iVishnuManchu) June 7, 2024 -
12 రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో పంజాబ్, హర్యానాతో సహా వాయువ్య, మధ్య , తూర్పు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలోని కొన్ని చోట్ల నేడు (సోమవారం) కూడా వడగాలులు కొనసాగవచ్చని ఐఎండీ పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఈ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌లో కూడా తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.మరోవైపు వేసవి పరిస్థితులను, రుతుపవనాలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని ప్రధానికి అధికారులు ఈ సమావేశంలో వివరించారు.ఉత్తర భారతంలోని ప్రజలు వేడిగాలులకు చెమటలు కక్కుతుండగా, దక్షిణాదినగల కేరళ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే 11-20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.అసోంలో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. 10 జిల్లాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్సైట్లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్సైట్ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.NSDL e-Gov పోర్టల్‌లో.. స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్ చేయండిస్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.స్టెప్ 3: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండిస్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండిస్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండిఅప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్‌లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.UTIITSL పోర్టల్‌లో ఇలా..స్టెప్ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండిస్టెప్ 2: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్ టు అప్లయి’ మీద క్లిక్ చేయండిస్టెప్ 3: 'అప్లయి ఫర్ చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్' ట్యాబ్‌ను ఎంచుకోండిస్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండిస్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.స్టెప్ 11: నచ్చిన ఆన్లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.కావాల్సిన డాక్యుమెంట్లుపాన్ కార్డు డూప్లికేట్ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు. -
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక విషయాలు