తప్పని తిరస్కరణ తిప్పలు
కార్డులో చేర్పులు మార్పులపై పరిమితి
ఇక హైదరాబాద్ రీజినల్ ఆఫీస్‌కు క్యూ కట్టాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు అప్‌డేట్‌కు ‘తిరస్కరణ’తిప్పలు తప్పడం లేదు. ఒకటి రెండుసార్లు చేర్పులుమార్పులు చేసుకుంటే ఆ తర్వాత ఆప్‌డేషన్ ప్రక్రియ తిరస్కరణకు గురవుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి పరుగులు తీసి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆధార్‌కార్డులో అప్‌డేషన్ సమస్యగా తయారైంది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకోవడంతో ఆ తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా మారింది. మరోవైపు చిన్నచిన్న తప్పిదాలు సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నదానికి కూడా హైదరాబాద్‌కు తరలిరావడం పేదలకు భారంగా మారుతోంది.
ఏదీ..ఎలా మార్చుకోవచ్చు అంటే...
ఆధార్‌కార్డు అనేది గుర్తింపును చూపే ముఖ్యమైన సాధనంగా మారింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధా ర్‌కార్డులో చేర్పులు మార్పులపై కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డులో ఓ వ్యక్తి తన పేరు, జన్మదినం, జెండర్ వంటి వాటిని మార్చుకోవడం అప్‌డేట్ చేసుకునేందుకు పరిమితి విధించింది.
► యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు.
► ఆధార్ కార్డులో డేట్‌ఆఫ్‌బర్త్ కేవలం ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకోవాలి. దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఇచి్చన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలు సమరి్పంచాలి.
► ఆధార్ కార్డులో జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు.
► ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ నమోదు కేంద్రంలో ఫొటో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మార్చుకోవడం కుదరదు.
► అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాలి.
ప్రాంతీయ కార్యాలయంలోనే
ఆధార్‌కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చేందుకు వీల్లేదు. పరిమితి దాటిన తర్వాత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇందుకు ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యూఆర్‌ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా స్పష్టంగా వివరించాలి.
జూన్ 14 వరకు ఉచిత అప్‌డేట్‌కు అవకాశం
పదేళ్లు దాటిన ఆధార్‌కార్డుల అప్‌డేట్ తప్పనిసరి. ఆధార్ జారీ తర్వాత చాలామంది అప్‌డేట్ చేసుకోలేదు. వీరి కోసం యూఐడీఏఐ ఉచితంగానే..ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అవకాశం కలి్పంచింది. కొంతకాలంగా గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈసారి జూన్ 14 వరకూ ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. చిరునామా, పేర్లలో అక్షర దోషాలు సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమరి్పంచి ఆప్‌డేట్ చేసుకోవాలి.
అప్‌డేట్‌కు ప్రయత్నిస్తే తిరస్కరించి రద్దు చేశారు
అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాను. దరఖాస్తు నింపి ఇవ్వగా అప్‌లోడ్ చేశారు. కొద్ది రోజులకు రిజెక్ట్ అయ్యిందనే మెసేజ్ వచి్చంది. మళ్లీ దరఖాస్తు చేయగా ఆధార్ రద్దు అయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ చెక్ చేసి కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. – అక్షర, స్టూడెంట్, కామారెడ్డి జిల్లా
నెలరోజుల నుంచి తిరుగుతున్నా...
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. సరిచేసుకునేందుకు రీజినల్ కార్యాలయం చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా. సరైన పత్రాలు సమర్పించి అప్‌లోడ్ చేయించినా కార్డు రాలేదు. – సాయికుమార్, వికారాబాద్ జిల్లా
పేరు మారడం లేదు
ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు రెండు నెలల నుంచి రీజినల్ కార్యాలయానికి తిరుగుతున్నాను. వచి్చన ప్రతిసారి కావాల్సిన పత్రాలు సమరి్పంచినా కార్డులో పేరు మాత్రం మారడం లేదు. – బాషా, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment