Aadhaar Card Fraud
-
ఆధార్.. అప్‘లేట్’
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు అప్డేట్కు ‘తిరస్కరణ’తిప్పలు తప్పడం లేదు. ఒకటి రెండుసార్లు చేర్పులుమార్పులు చేసుకుంటే ఆ తర్వాత ఆప్డేషన్ ప్రక్రియ తిరస్కరణకు గురవుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి పరుగులు తీసి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆధార్‌కార్డులో అప్డేషన్ సమస్యగా తయారైంది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకోవడంతో ఆ తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా మారింది. మరోవైపు చిన్నచిన్న తప్పిదాలు సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నదానికి కూడా హైదరాబాద్‌కు తరలిరావడం పేదలకు భారంగా మారుతోంది. ఏదీ..ఎలా మార్చుకోవచ్చు అంటే... ఆధార్‌కార్డు అనేది గుర్తింపును చూపే ముఖ్యమైన సాధనంగా మారింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధా ర్కార్డులో చేర్పులు మార్పులపై కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డులో ఓ వ్యక్తి తన పేరు, జన్మదినం, జెండర్ వంటి వాటిని మార్చుకోవడం అప్డేట్ చేసుకునేందుకు పరిమితి విధించింది. ► యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ► ఆధార్ కార్డులో డేట్ఆఫ్బర్త్ కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ సమయంలో ఇచి్చన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలు సమరి్పంచాలి. ► ఆధార్ కార్డులో జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ► ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ నమోదు కేంద్రంలో ఫొటో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మార్చుకోవడం కుదరదు. ► అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాలి. ప్రాంతీయ కార్యాలయంలోనే ఆధార్‌కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చేందుకు వీల్లేదు. పరిమితి దాటిన తర్వాత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇందుకు ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యూఆర్ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా స్పష్టంగా వివరించాలి. జూన్ 14 వరకు ఉచిత అప్డేట్కు అవకాశం పదేళ్లు దాటిన ఆధార్‌కార్డుల అప్డేట్ తప్పనిసరి. ఆధార్ జారీ తర్వాత చాలామంది అప్డేట్ చేసుకోలేదు. వీరి కోసం యూఐడీఏఐ ఉచితంగానే..ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కలి్పంచింది. కొంతకాలంగా గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈసారి జూన్ 14 వరకూ ఆన్లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. చిరునామా, పేర్లలో అక్షర దోషాలు సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమరి్పంచి ఆప్డేట్ చేసుకోవాలి. అప్డేట్కు ప్రయత్నిస్తే తిరస్కరించి రద్దు చేశారు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాను. దరఖాస్తు నింపి ఇవ్వగా అప్లోడ్ చేశారు. కొద్ది రోజులకు రిజెక్ట్ అయ్యిందనే మెసేజ్ వచి్చంది. మళ్లీ దరఖాస్తు చేయగా ఆధార్ రద్దు అయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ చెక్ చేసి కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. – అక్షర, స్టూడెంట్, కామారెడ్డి జిల్లా నెలరోజుల నుంచి తిరుగుతున్నా... ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. సరిచేసుకునేందుకు రీజినల్ కార్యాలయం చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా. సరైన పత్రాలు సమర్పించి అప్లోడ్ చేయించినా కార్డు రాలేదు. – సాయికుమార్, వికారాబాద్ జిల్లా పేరు మారడం లేదు ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు రెండు నెలల నుంచి రీజినల్ కార్యాలయానికి తిరుగుతున్నాను. వచి్చన ప్రతిసారి కావాల్సిన పత్రాలు సమరి్పంచినా కార్డులో పేరు మాత్రం మారడం లేదు. – బాషా, కర్నూలు -
దాదాపు 81 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి
-
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక - ఈమెయిల్ & వాట్సాప్‌లో..
ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ షేర్ చేయమని ఏదైనా వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్‌లు వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) హెచ్చిరికలు జారీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ అప్డేట్ కోసం ఈ-మెయిల్ లేదా వాట్సాప్ మెజెజ్ రోపంలో సందేశాలు పంపదని, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని తెలియజేసింది. ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఆధార్ అప్డేట్లో భాగంగా ఎవరూ తమ వివరాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపకూడదు. ఇదీ చదవండి: ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే.. ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటితే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుమార్లు వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. దీనికి చివరి గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు గడువు లోపల చేసుకోవచ్చు. #BewareOfFraudsters UIDAI never asks you to share your POI/ POA documents to update your #Aadhaar over Email or Whatsapp. Update your Aadhaar either online through #myAadhaarPortal or visit Aadhaar centers near you. pic.twitter.com/QZlfOnBp54 — Aadhaar (@UIDAI) August 17, 2023 -
ఆధార్ సెంటర్‌కు పోటెత్తిన జనం..వలవలా ఏడ్చేసిన ఉద్యోగిని..!
కర్ణాటక: ఆధార్ కార్డులో సవరణల కోసం పెద్దసంఖ్యలో మహిళలు వచ్చి ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఒక ఉద్యోగిని వలవలా ఏడ్చింది. ఈ సంఘటన రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్ర సర్కార్ పలు గ్యారంటీ పథకాలను ప్రకటించగా వాటికి దరఖాస్తు చేయడానికి ఆధార్, ఇతర ధృవపత్రాల అవసరం పెరిగింది. ఈ సమయంలో ఆధార్‌లో ఉన్న తప్పులను, చిరునామాలను మార్పించుకోవడం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. శనివారం రాయచూరు తహసీల్దార్ ఆఫీసులో గృహలక్ష్మి, గృహ జ్యోతి పథకాల కోసం ఆధార్ కార్డులో సవరణలు చేయించుకోవడానికి మహిళలు తరలివచ్చారు. అయితే ఇంటర్నెట్ సమస్య వల్ల కంప్యూటర్ పని ఆలస్యమైంది. దీంతో మహిళలు ఏకంగా కంప్యూటర్ గదిలో చొరబడడానికి ప్రయత్నించి పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ గందరగోళం చూసి అక్కడి మహిళా ఉద్యోగి భయపడిపోయి విలపించింది. వరుసలో రావాలని కోరినందుకు కొందరు దూషించారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను పై అధికారులకు తెలిపినా మౌనం వహించారని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లోనూ కాగా ఇదే రీతిలో ఆర్టీసీ సిబ్బంది కూడా ఫిర్యాదు చేస్తున్నారు. సీట్ల కోసం మహిళలు తొక్కిసలాటకు పాల్పడడం, వారిస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని మహిళా కండక్లర్లు ఫిర్యాదు చేశారు. ప్రయాణం ఉచితం కావడంతో క్షణాల్లో సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి. పని ఒత్తిడితో నలిగిపోతున్నామని ఆర్టీసీ సిబ్బంది కూడా చెబుతున్నారు. -
డూప్లి 'కేటుగాళ్లు'
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని పాయకాపురంలో గీత అనే మహిళ పేరిట ఆస్తికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఉంది. దీనిని గుర్తించిన కేటుగాళ్లు అదే ప్రాంతంలో నివశిస్తున్న విజయలక్ష్మి పేరును ఆధార్ కార్డులో గీతగా మార్పించి.. రూ.12 లక్షల విలువైన ఇంటిస్థలాన్ని ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భవానీపురంలో మేర కోటేశ్వరరావు అనే వ్యక్తి రిజిస్ట్రార్ కార్యాలయంలో లభ్యం కాని డాక్యుమెంట్లను గుర్తించి.. వాటిని వేరే వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. సదరు ఆస్తులను తన కొడుకు శ్రీనివాసులు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. కొందరు లేఖరుల సాయంతో దర్జాగా సాగిపోతున్న దందాలు విశాఖపట్నంలో లాగిన తీగతో విజయవాడలో వెలుగులోకి వచ్చాయి. ఇలా బయటపడింది.. విశాఖపట్నానికి చెందిన ఎన్.వెంకటేశ్వరావు అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కోసం దరఖాస్తు చేయగా.. తన స్థలాన్ని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి రాజు చైతన్య అనే వ్యక్తికి విజయవాడలోని గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం డొంక కదిలింది. ఈ ఫిర్యాదుతో మేల్కొన్న సబ్ రిజిస్ట్రార్లు తెలివిగా వ్యవహరించి నిందితుడిని పిలిపించి, రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. తిరిగి అతనిపైనే గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నకిలీ డాక్యుమెంట్లను ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సహకరిస్తున్న వ్యక్తులెవరనేది కూపీ లాగుతున్నారు. కాగా, ప్రస్తుతం గుణదలకు చెందిన రాజుచైతన్య పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి ముగ్గురు వ్యక్తులతో కూడిన బృందం సహకరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. దొంగ రిజిస్ట్రేషన్లు ఇలా.. ప్రధానంగా ఆధార్ కార్డులో పేరు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆధార్ కార్డుల మార్పిడి ఇందిరాగాం«ధీ స్టేడియం సమీపంలో సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒరిజనల్ రికార్డుల మాదిరి డాక్యుమెంట్లు సృష్టించడంలో నిష్ణాతులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిణామాలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో కొందరు కేటుగాళ్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ కొన్ని ఆస్తులకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ లేకపోతే సంబంధిత సిబ్బంది ‘నాట్ ఫౌండ్’ అని సమాచారమిస్తారు. దీంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మేర కోటేశ్వరావు అనే వ్యక్తితో కూడిన బృందం ఆరితేరినట్టు గుర్తించారు. కోటేశ్వరరావు విజయవాడలోని దేవీపేటలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. ఈ తరహాలో ఇప్పటికే నున్న, గాంధీనగర్, మైలవరం, గుణదల, పటమట, మైలవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. నున్న ప్రాంతంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఫేక్ డాక్యుమెంట్ల తయారీకి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరికి ప్రధానంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది, దస్తావేజు లేఖరులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, కొందరు సబ్రిజిస్ట్రార్లు సైతం సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
Biometric Scan: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే!
ఈ రోజుల్లో మోసగాళ్ల చేతికి దొరికిన కొత్త ఆయుధం నకిలీ బయోమెట్రిక్. దీని ద్వారా వివిధ రకాలుగా మన వేలిముద్రలు, ముఖాలు, ఐరిస్, అరచేతి ముద్రలు.. వంటివి సేకరించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధార్‌లో రికార్డ్ చేసిన వేలిముద్రను నకిలీ పద్ధతుల్లో దొంగిలించి, వాటి ద్వారా స్కామ్‌లకు పాల్పడుతున్నారు. వీటిలో పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నకిలీ బయోమెట్రిక్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మన దేశంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో (మొబైల్ డేటా లేదా డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల) అందరికీ తమ గుర్తింపును కాపాడుకోవడం అతిపెద్ద సవాల్‌గా మారింది. వాటిలో బయోమెట్రిక్ ఒకటి. బయోమెట్రిక్ స్కాన్... స్కాన్ ఆధారంగా వ్యక్తుల అసలైన గుర్తింపును సూచిస్తుంది బయోమెట్రిక్. ప్రత్యేకమైన జీవ లక్షణాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయంగా, సమయానుకూలంగా వ్యక్తులను గుర్తించడానికి, ప్రామాణీకరించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఇది వ్యక్తిగత ‘ఐడీ’ కార్డ్‌లు, మాగ్నెటిక్ కార్డ్‌లు, కీ లేదా పాస్‌వర్డ్‌ల వంటి సంప్రదాయ ప్రామాణీకరణ పద్ధతులను రూపుదిద్దుతుంది. దీని ద్వారా దొంగతనం, కుట్ర లేదా నష్టం సులభంగా జరగదు. అయితే, సాధారణంగా దురాశ లేదా భయం కారణంగా ప్రజలు సులభంగా నేరగాళ్ల ఉచ్చులో పడటం వంటి సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాల కారణంగా బయోమెట్రిక్ యాక్సెస్ కోల్పోతుంది. నకిలీ బయోమెట్రిక్స్... ►ఆస్తి రిజిస్ట్రేషన్ వంటి ఆర్థికేతర లావాదేవీల కోసం మోసగాళ్లు బయోమెట్రిక్ ద్వారా ఇన్సైడర్లను ఉపయోగిస్తారు. వాటిలో నకిలీ వేలిముద్ర, అలాగే వ్యక్తి ఆధార్ కార్డ్ నంబర్‌ను తీసుకుంటారు ►ఎమ్–సీల్, ఫెవికాల్ ఉపయోగించి ప్రింట్ తీసుకుంటారు. ►వేలిముద్రను https://www.remove.bg/ అప్లోడ్ చేయడం, ఆపై సెల్లోఫేన్ టేప్‌పై ప్రింట్ చేయడం ద్వారా వేలిముద్ర కచ్చితమైన ప్రతిరూపాన్ని రూపొందించడానికి మోసగాళ్లు సులభమైన పద్ధతులను ఉపయోగిస్తారు ►అలా పొందిన వేలిముద్రలను పెద్ద సంఖ్యలో డార్క్ వెబ్‌లో అప్లోడ్ చేస్తారు ►వేలిముద్ర ప్రతిరూపాన్ని సృష్టించిన తర్వాత, మోసగాడు ఆధార్ కార్డ్ నంబర్ ఏదైనా బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందో లేదో చెక్ చేస్తాడు. ►ఏదైనా ఆర్థిక లావాదేవీ కోసం కార్డ్‌ని ఉపయోగించే క్రమంలో ఇది చాలా కీలకమవుతుంది. ►బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన అధార్ నెంబర్లతో తీసుకున్న నకిలీ బయోమెట్రిక్‌ను మోసగాడు మైక్రో ఎటీఎమ్ లేదా ఆధార్ ఆధారిత చెల్లింపు ప్రాసెసింగ్‌కు మద్దతు ఇచ్చే ఏ హ్యాండిల్డ్ పరికరంలోనైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇలా రక్షించుకోవాలి... ►వేలిముద్రలు ఎవరైనా దొంగిలించినట్లయితే వాటిని మార్చలేరు అనేది వాస్తవం. ►ఆధార్ వ్యవస్థలో సాంకేతిక లొసుగు లేనప్పటికీ, ఇటువంటి మోసాల వల్ల మొత్తం వ్యవస్థపై వినియోగదారు నమ్మకాన్ని తగ్గిస్తుంది. ►మొబైల్, ఇమెయిల్ (రిజిస్ట్రేషన్ / కరెక్షన్స్ సమయంలో) ఆధార్‌తో మీ వివరాలను తక్షణమే మార్చడాన్ని సులువు చేసింది. ►ఆధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ లేదా ఇ–మెయిల్ కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో ప్రక్రియ పూర్తవుతుంది. ►సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లకు గురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకున్నా మీ ఆధార్ కార్డ్‌ని వెంటనే అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. ►బయోమెట్రిక్స్ లాకింగ్ ఐక్యూఐ స్కాన్లు, వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు వంటివి ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉంటాయి. ►ఈ విషయంలో మోసం చేయడం అంత సులభం కాదు. అయినా నకిలీ బయోమెట్రిక్ కేసులు నమోదయ్యాయి. ►అందుకని, ఆధార్ ఇప్పుడు బయోమెట్రిక్ లాకింగ్ ఎంపికతో వచ్చింది. దీనిని UIDAI లేదా mAadhaar యాప్‌లో సెట్ చేసుకోవచ్చు. ►వర్చువల్ ‘ఐడీ’ అన్ని eKYC ధృవీకరణకు ఆధార్ నంబర్ స్థానంలో 16 అంకెల సంఖ్యను ఉపయోగించవచ్చు. ఇది అన్ని వర్చువల్ లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. ►మీరు https://myaadhaar.uidai.gov.in/ నుండి డౌన్లోడ్ చేసుకొని, మాస్క్డ్ విఐడీ ని ఎంపిక చేసుకోవచ్చు. ►మాస్క్డ్ ఆధార్ నంబర్ 12 అంకెల సంఖ్య లేకుండా షేర్ అవుతుంది (చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి). ►మాస్క్డ్ ఆధార్ ఎంపిక ప్రాథమికంగా మీ ఆధార్‌ను మాస్క్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ►UIDAI పోర్టల్‌కి లాగిన్ చేసి, మీ ప్రామాణీకరణను ధృవీకరించుకోవచ్చు. ►ఇళ్ల ముందుకు ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజల అమాయకత్వాన్ని, వారి ఆశను ఆసరా చేసుకొని పెన్షన్లు లేదా ప్రభుత్వ లబ్ధి పొందడానికి ఆధార్, వేలిముద్రలను మోసగాళ్లు సేకరిస్తుంటారు. ►అందుకని, ప్రజలు తమ వేలిముద్రలు–ఆధార్ నంబర్ ఇచ్చేముందు ప్రభుత్వ సిబ్బంది అవునో కాదో తప్పక నిజనిర్ధారణ చేసుకోవాలి. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అక్రమ వలసదారులకు ‘ఆధార్’ బంగ్లా ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఏటీఎంను దోచుకున్న దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు అనూహ్యంగా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్న బంగ్లా దేశీయుల ముఠా చిక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ అంగీకరించాడు. అకూన్ ఇంట్లో 31 ఆధార్‌కార్డులు, 13, పాన్‌కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు నిర్థారణయింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు. -
క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని ఫోన్.. ఆధార్ వివరాలు చెప్పినందుకు
ఉద్యోగి అయిన మహిజకు క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని, కార్డ్‌ని మళ్లీ పంపించేందుకు వివరాలు అవసరమని ఫోన్ కాలర్ చెప్పింది. ఫోన్లో ఆధార్ నెంబర్, ఇతర వివరాలనూ పంచుకున్న మహిజ మరుసటి రోజు తన క్రెడిట్‌కార్డ్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు గమనించింది. స్కామర్లు మీ ఆధార్‌ను యాక్సెస్ చేయకుండా అడ్డుకట్ట వేయాలంటే... మీకు అందుకు తగిన సమాచారమూ తెలిసి ఉండాలి. మోసగాళ్లు బ్యాంక్ ఖాతాదారుల డబ్బు స్వాహా చేసినందుకు వారి ఆధార్ నంబర్లను రాబట్టేందుకు మభ్యపెట్టడంలో ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టరు. మీ ఆధార్ నంబర్ లేదా OTP లేదా పాస్వర్డ్ కోసం బ్యాంక్ అధికారులమని చెప్పుకునే వ్యక్తులు మీకు ఎప్పుడైనా కాల్ చేసినట్లయితే, వారు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న స్కామ్‌స్టర్ అయ్యే అవకాశం ఉంది. 1) మొబైల్/ఇ–మెయిల్ నమోదు ఇటీవలి కాలంలో ఆధార్ వల్ల మీ వివరాలను మార్చడం సులభం అయ్యింది. ఆధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ లేదా ఇ–మెయిల్ ఐఈకి వన్ టైమ్ పాస్వర్డ్ (OTP )తో ప్రక్రియలో ఎలాంటి జాప్యం కూడా ఉండటం లేదు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకున్నా, ఇతరులు మీ వివరాలతో మిమ్మల్నే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మీ ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. 2) ఆధార్ బయోమెట్రిక్స్ లాకింగ్ ఐరిస్ స్కాన్లు, వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్‌లు వంటి బయోమెట్రిక్‌లు ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యాయి. ఈ అంశంలో మోసం చేయడం చాలా కష్టమైనప్పటికీ, వ్యక్తి బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి వేలిముద్రలను నకిలీ చేసిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బయోమెట్రిక్ లాకింగ్ ఆప్షన్‌తో ఆధార్ బయటకు వచ్చింది. UIDAI దాని కార్డ్ హోల్డర్లకు బయోమెట్రిక్‌ను లాక్ చేసి ఉంచాలని సలహా ఇస్తుంది. దీన్ని వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా చేయవచ్చు. 3) మాస్క్డ్ ఆధార్, వర్చువల్ ID (VID) eKYC సేవను నిర్వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆధార్ నంబర్ స్థానంలో 16 అంకెల సంఖ్యను వాడచ్చు. అప్పుడు వర్చువల్ ట్రాన్స్యాక్షన్స్కి మీ ఆధార్ నంబర్‌ను జత చేయాల్సిన అవసరం పడదు. 4) రెగ్యులర్‌గా తనిఖీ మీ ఆధార్ ధ్రువీకరణకు UIDAI పోర్టల్‌కి వెళ్లి, ప్రామాణీకరణను తనిఖీ చేయాలి. మీ భద్రత– సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి UIDAI ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో మరొక ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు. ఆన్లైన్లో ఇది సాధారణంగా మూడు దశల ప్రక్రియలో ఉంటుంది. మూడు దశల ప్రక్రియ దశ 1: అధికారిక UIDAI పోర్టల్‌కి వెళ్లి, వెబ్సైట్లో కుడివైపు ఎగువన, డ్రాప్‌డౌన్ మెనూ నుండి "My Aadhaar' ను ఎంచుకోవాలి. దశ 2: ఆధార్ నంబర్ని ధ్రువీకరించాలి. ఎంపికను ఎంచుకొని, మీరు దీన్ని ‘ఆధార్ సర్వీసెస్’ విభాగంలో కనుక్కోవాలి. దశ 3: ఇది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు క్యాప్చాతో పాటు 12అంకెల ఆధార్ నంబర్(UDI)ని నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని నమోదు చేసిన తర్వాత, దిగువన ఉన్న ‘ధ్రువీకరణకు’ బటన్‌ను క్లిక్ చేయాలి. ఇది మీకు మరో ఆధార్ కార్డ్ చెల్లుబాటు స్థితిని సూచించే పేజీని చూపుతుంది. ఈ కార్డును eKYcకే ఉపయోగిస్తారు. ఆధార్ స్కామ్‌ల బారిన పడకుండా... ►మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.. ఫోన్ ద్వారా ఆధార్ కార్డ్, ఇతర వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి. ►భారతదేశంలో ఆధార్ కార్డుకు సంబంధించిన మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అమాయకుల నుండి డబ్బును స్వాహా చేసేందుకు స్కామ్స్టర్లు కొత్త, వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఆధార్ స్కామ్‌ల కారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ►ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్స్ (AIBOC) మాజీ జనరల్ సెక్రటరీ డి థామస్ ఫ్రాంకో వాట్సాప్‌లోని బ్యాంకింగ్ గ్రూప్‌లో సంభాషణ రూపంలో ఈ హెచ్చరిక వచ్చింది, ఇందులో ఒక అమాయక ఆధార్ కార్డ్ హోల్డర్ తన మొత్తాన్ని వదులుకోవడానికి మోసగించిన సంఘటనలను వివరించాడు. బ్యాంకు అధికారిగా నటిస్తున్న స్కామ్స్టర్ల ద్వారా ఖాతాదారుల డబ్బు లావాదేవీలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు. ►కిందటేడాది డిసెంబర్ 21న జరిగిన ఒక సంఘటనలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌గా నటిస్తున్న వ్యక్తి నుండి డాక్టర్ లాల్మోహన్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అతని ఆధార్ నంబర్ కోసం డాక్టర్ లాల్మోహన్ను అడిగి, మొదట రూ. 5,000 ఆ పై రూ. 20,000 బదిలీ చేశాడు. అతని ఖాతా బ్లాక్ చేసిన తర్వాత కూడా నగదు బదిలీలు జరిగాయి. డాక్టర్ లాల్మోహన్ తన పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పనప్పటికీ, స్కామ్స్టర్లు అతని ఆధార్ నంబర్‌ను ఉపయోగించి పాస్వర్డ్ లేదా OTP అవసరం లేకుండా ►నేరుగా అతని బ్యాంక్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసినట్లు తేలింది. మీకు అనుమానంగా ఉంటే వెంటనే ఖాతాతో లింక్ చేయబడిన ఆధార్‌ను డీ లింక్ చేయమని వెంటనే బ్యాంక్‌ని అడగాలి. మీ ఆధార్ నంబర్, పాస్వర్డ్ లేదా ఏదైనా బ్యాంకింగ్ వివరాలను ఫోన్లో ఎవరితోనూ పంచుకోవద్దు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
‘ఆధార’పడదగ్గదేనా..?!
ఇవ్వడమా? మానడమా? ఇదీ ఇప్పుడు సగటు భారతీయుడి సమస్య. దాదాపు పదేళ్ళ క్రితం జీవితంలోకి కొత్తగా వచ్చిపడ్డ ఆధార్ అనే గుర్తింపు కార్డు, దానిలో నమోదయ్యే సమస్త వివరాలు, ఇచ్చే పన్నెండంకెల ప్రత్యేక నంబర్ – ఇప్పుడు పెను సమస్యయ్యాయి. బ్యాంకు ఖాతా తెరవడం, సెల్‌ఫోన్ సిమ్ కొనుగోలు మొదలు చివరకు హోటళ్ళు, సినిమా హాళ్ళలో బుకింగ్ దాకా దేనికీ ఆధార్ తప్పనిసరి కాకపోయినా, ఇతర గుర్తింపుకార్డులు అనేకమున్నా, అన్నిటికీ ఆధార్ కావాలని పట్టుబట్టడమూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అడిగిన ప్రతి సంస్థకూ ఆధార్ జిరాక్స్‌లు ఇవ్వద్దని శుక్రవారం ఒక ప్రకటన, సాధారణ ముందు జాగ్రత్తతో ఇవ్వచ్చని ఆదివారం మరో ప్రకటన – రెండే రోజుల తేడాలో ఇలా ద్వైధీభావంతో రెండు విరుద్ధ ప్రకటనలు కేంద్రం నుంచి రావడం విచిత్రం. పెరుగుతున్న సైబర్ మోసాల వేళ ఇది మరింత గందరగోళం రేపింది. వ్యక్తిగత వివరాల గోప్యత, భద్రతపై ఉన్న అనుమానాల్ని పోగొట్టాల్సిన బాధ్యత ఇక పాలకులదే! ఒకప్పుడు స్వచ్ఛందమైన ఆధార్ ఇప్పుడు దేశంలో అన్నిటికీ తప్పనిసరి కావడం విచిత్రమే. అధికారికంగా అనుమతి లేని సంస్థలు సైతం పౌరుల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, ఇ–కాపీలను తీసుకోవడం కచ్చితంగా ఆందోళనకరం. దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉన్నందున అలా ఆధార్ వివరాలను ఎవరికి పడితే వాళ్ళకు అందజేయరాదంటూ, ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఎఐ) బెంగళూరు కార్యాలయం గత వారం సరిగ్గానే అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్ వివరాలు సేకరించే లైసెన్స్ ఇచ్చామనీ, లైసెన్స్ లేని సంస్థలు ఆధార్ అడిగితే (ఆధార్ నంబర్లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) ‘మాస్క్డ్ ఆధార్’ను ఇవ్వాలనీ చెప్పింది. నాలుగేళ్ళ క్రితమే రూ. 500కి వంద కోట్ల ఆధార్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు లభ్యమైన దేశంలో ఆధార్‌పై ఉన్న అనుమానాలకు ఈ ప్రకటన బలమిచ్చింది. కేంద్ర ఐటీ శాఖ వెంటనే బరిలోకి దిగి, ‘తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉంద’ంటూ ఆ మార్గదర్శకాల్ని ఉపసంహరించడం విడ్డూరం. ‘ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వద్దు’ అని ఒకరు, ‘కాదు కాదు ఇవ్వచ్చ’ని మరొకరు – ఒకే వ్యవస్థ నుంచి చెప్పారంటే, ఆధార్‌పై గందరగోళం ప్రజల్లోనే కాదు... ప్రభుత్వంలోనూ ఉందని అర్థమవు తూనే ఉంది. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగి తూచ్ అన్నప్పటికీ, ప్రజలకు చేరాల్సిన సంకేతమైతే చేరిపోయింది. ఆధార్ వివరాల దుర్వినియోగంపై ఉన్న అనుమానం నిరాధారమైనదేమీ కాదని తేలిపోయింది. అసలు బయట ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసే వారెవరైనా సరే వ్యక్తుల ఆధార్ నంబర్లను కానీ, బయోమెట్రిక్ సమాచారాన్ని కానీ ‘సేకరణ, వినియోగం, నిల్వ’ చేయరాదు. ఆ మాటే 2016 నాటి ఆధార్ చట్టంలోని సెక్షన్ 8ఎ(4) స్పష్టంగా చెబుతోంది. అయినాసరే, అవసరం లేకున్నా ఆధార్ జిరాక్స్ అడగడం, ఇచ్చేది లేదంటే సేవలు నిరాకరించడం, తప్పక అమాయకంగా ఇచ్చేయడం – సగటు భారతీయులందరి అనుభవం. కోవిడ్ టెస్ట్‌లకు సైతం ఇదే చూశాం. అంతర్జాలంలో పుష్కలంగా సాగుతున్న డేటా లీకేజీల పుణ్యమా అని వ్యక్తిగత గోప్యత ఇప్పుడు హుళక్కి. ప్రైవేట్ ఏజెన్సీలు డిమాండ్ చేసి మరీ, ఆధార్ కాపీలు తీసుకొని ఆన్లైన్లో ఆథెంటికేషన్ చేస్తుండడం ఏ రకంగా చూసినా తప్పే. డిజిటల్ ఫోటో ఎడిటింగ్ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉండడంతో, ఆధార్ కాపీల మీద ఫోటోలు, సమాచారాన్ని యథేచ్ఛగా మార్చే ప్రమాదం ఉంది. ఆధార్ ప్రాధికార సంస్థలోని డేటా బ్యాంక్‌లో ఉన్న సమాచారాన్ని తారుమారు చేయలేరు కానీ, తమ దగ్గర చేసిన మార్పులతో మోసాలకు పాల్పడవచ్చు. ఉద్యోగ సంస్థలు, అప్పులిచ్చేవాళ్ళు సైతం వేలి ముద్రలు సేకరించడం చూస్తున్నాం. ప్రభుత్వ యూఐడీఏఐ దగ్గర గోప్యతకే దిక్కు లేదంటే, ఇక ఈ చిన్నాచితక సంస్థల వద్ద ఈ బయోమెట్రిక్ వివరాల భద్రత ఎంత సొబగుగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. వేలిముద్రల డేటాతో డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు అనేకం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అసలు లబ్ధిదారుల బదులు నకిలీలు కడుపు నింపుకొనే వీలూ కలిగింది. అందుకే జాగ్రత్త అవసరం. ఆ మాటకొస్తే, ఆధార్ నమోదు సైతం దోషరహితమేమీ కాదు. మొన్నటికి మొన్న మే నెలలోనే ఆధార్ జారీ సంస్థ పనితీరుపై మొదటిసారిగా ఆడిట్ జరిగింది. బయోమెట్రిక్స్‌లో తప్పులు, డూప్లికేషన్ల లాంటి అయిదు ప్రధాన లోపాలు ఆధార్‌లో చోటుచేసుకున్న తీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపింది. అయితే, అంతకంతకూ పెరుగుతున్న భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ఆధారచక్రంగా నిలిచింది ఆధార్ కార్డులే. వేర్వేరు బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ నగదు బదలీకి తోడ్పడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషనైన ‘యూపీఐ’ లాంటివి కూడా ఆధార్ వల్లే సాధ్యమయ్యాయి. కాబట్టి, ఆధార్ పద్ధతిని తప్పుబట్టే కన్నా దాని భద్రతపై దృష్టి పెట్టడం ముఖ్యం. వాణిజ్య సంస్థలేవీ ఆధార్‌ను అడగరాదని సుప్రీమ్ కోర్ట్ ఎప్పుడో చెప్పింది. అయినా అది అమలవుతున్న దాఖలా లేదు. పౌరులు సైతం ఆధార్‌లో రెండంచెల ధ్రువీకరణ, బయోమెట్రిక్స్ లాక్, పరిమిత కేవైసీకి అనుమతించే వర్చ్యువల్ ఐడెంటిటీ విధానాలను ఆశ్రయించాలి. ప్రభుత్వం సైతం బయోమెట్రిక్, ఆధార్ డేటాను ప్రైవేట్ సంస్థలు సేకరించకుండా అడ్డుకట్ట వేయాలి. మున్ముందుగా ‘మాస్క్డ్ ఆధార్’ను ప్రాచుర్యంలోకి తేవాలి. ఆ పైన ఆధార్ నంబర్ల జారీ, వినియోగాన్ని కట్టుదిట్టం చేయాలి. ఆధార్‌ను అంగట్లో సరుకుగా మార్చిన వెబ్సైట్ల భరతం పట్టాలి. అందుకే, దేశంలో పటిష్ఠమైన డేటా భద్రతకు త్వరితగతిన ఓ చట్టం చేయాలి. లేదంటే, ఎంతటి ఆధార్ అయినా వట్టి నిరాధారమే! -
డ్రగ్స్‌ను పట్టించిన ‘ఆధార్’
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/సత్తెనపల్లి: ఓ కొరియర్ సంస్థ ఉద్యోగి తెలియక చేసిన పొరపాటుతో డ్రగ్స్ గుట్టురట్టయ్యింది. విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి తెలివిగా అతని ఆధార్ కార్డుకు బదులు కొరియర్ సంస్థ ఉద్యోగి ఆధార్ కార్డు కాపీ జత చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విజయవాడ సెంట్రల్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 31న పచ్చళ్లు, దుస్తుల పార్శిళ్లను ఆస్ట్రేలియాకు పంపాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపి విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్టీ కొరియర్‌కు వచ్చాడు. నిబంధనల ప్రకారం కొరియర్ పార్శిల్ పంపే వ్యక్తి ఆధార్ కార్డు కాపీ జత చేయడం తప్పనిసరి. తన ఆధార్ కార్డు నంబరు ముద్రణ సరిగా లేదని, కొరియర్ సంస్థలో పనిచేస్తున్న గుత్తుల తేజ ఆధార్ కార్డు జత చేయమని సాయిగోపి కోరాడు. దీంతో తేజ తన ఆధార్ కార్డు కాపీని జత చేసి అస్ట్రేలియాకు పార్శిల్ పంపించాడు. ఈ పార్శిల్ ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్ లేకపోవడంతో దానిని బెంగళూరుకు తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా.. అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్’ అనే తెలుపు రంగు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిలిచిపోయిన ఈ పార్శిల్‌ను తీసుకురమ్మని గుత్తుల తేజను విజయవాడ డీఎస్టీ కొరియర్ నిర్వాహకులు ఏప్రిల్ 27న అక్కడకు పంపించారు. అక్కడ తేజను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి ఏప్రిల్ 30న అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తేజ విజయవాడ ప్రసాదంపాడులో ఉంటున్న తన బావ కరుణాకర్‌కు తెలియజేశాడు. దీనిపై విజయవాడ పటమట పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్‌రెడ్డితో కలిసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ ఖాదర్‌బాషా చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు కాగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపిని విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని విజయవాడ తీసుకెళ్లారు. సాయిగోపిని అదుపులోకి తీసుకునే విషయంలో విజయవాడ పోలీసులకు తాము సహకరించామని సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు. -
హైదరాబాద్ లో భారీగా ఫేక్ ఆధార్ కార్డు ముఠా గుట్టు రట్టు
-
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లున్నాయో తెలుసా?!
మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు తీసుకున్నామో గుర్తించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ 'TAF-COP' అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ పోర్టల్ సేవలపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆధార్ తప్పని సరి దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. అదే సమయంలో ఆధార్‌కు ఫోన్ నెంబర్ యాడ్ చేయడం తప్పని సరి చేశాయి. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులువు అవుతోంది. ఈ విధానం ఫోన్ వినియోగదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. మన పేరుమీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఉంటే వాటిలో ఏ నెంబర్ ను ఆధార్ కు యాడ్ చేశామనే విషయాన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది. చదవండి : అంబానీ తెలివి.. రెండూ లాభాలిచ్చేవే! వెబ్సైట్ ను ప్రారంభించిన టెలికాం సంస్థ సైబర్ నేరస్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఆ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అని పిలిచే ఈ పోర్టల్‌లో లాగిన్ అయితే మన ఆధార్ కార్డ్ మీద ఏ ఫోన్ నెంబర్ ను యాడ్ చేశాం. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు. ప్రశంసల వర్షం TAF-COP వెబ్ పోర్టల్ వినియోగంపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ @TRAI/ DOT ద్వారా చాలా ఉపయోగకరమైంది. ఈ సైట్ లో మీ ఫోనెంబర్ను ఎంట్రీ చేస్తే.. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే సిమ్ కార్డ్ వివరాలు వెలుగులోకి వస్తాయి. ఉపయోగంలో లేని సిమ్ కార్డ్ లను బ్లాక్ చేయవచ్చు. సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈ వెబ్ సైట్ ఐడియా బాగుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Very useful service launched by @TRAI / DOT ! Open the below site and type in your mobile number and you will know the mobile numbers of all the SIM cards purchased with your Aadhaar number as soon as you enter the OTP. You can ban any of them. https://t.co/EdomPmQlXf — Vijay Shekhar Sharma (@vijayshekhar) August 26, 2021 -
అడ్రస్ ప్రూఫ్ లేదా? ఆధార్ అప్డేట్ చేసుకోవాలా?
మీరు ఇల్లు మారారా? ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఛేంజ్ చేయాలా? అడ్రస్ ఛేంజ్ కోసం మీ దగ్గర ఫ్రూప్స్ ఏమీ లేవా? అయితేనేం తాజా అప్డేట్తో ఆ అడ్రస్ ఫ్రూప్ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. ఇకపై మీకుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్‌తో ఆధార్ అడ్రస్ మార్చుకునేలా యుఐడీఎఐ అవకాశం కల్పించింది. వాస్తవానికి ఆధార్ కార్డ్‌లో అడ్రస్ వివరాల్ని మార్చాలంటే తప్పని సరిగా యుఐడీఎఐ (Unique Identification Authority of India) వెబ్ సైట్ లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ల కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటి అవసరం లేకుండా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్, మీ బంధువుల ఆధార్డ్తో అడ్రస్ మార్చుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను ఇలా మార్చుకోండి ♦ ముందుగా ఈ https://uidai.gov.in/ లింకును ఓపెన్ చేయాలి. ♦ లింక్ ఓపెన్ చేసి మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్‌తో లాగిన్ అవ్వాలి ♦ లాగిన్ తర్వాత ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ♦ వెరిఫైలో మీ ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకునేలా అప్రూవల్ లింక్ వస్తుంది. ♦ ఇప్పుడు ఆ లింక్‌ను ఓపెన్ చేసి మీరు మార్చుకోవాలనుకున్న అడ్రస్ వివరాల్ని ఎంటర్ చేయాలి. ♦ రిక్వెస్ట్ సమయంలో మీ కాంటాక్ట్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి. ♦ అనంతరం మీ ఆధార్ అడ్రస్ మార్చుకునేందుకు 28 అంకెల సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (ఎస్ఆర్ఎన్) ఎంటర్ చేయాలి. ♦ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ తర్వాత మీ అడ్రస్ మార్చుకునేలా రిక్వెస్ట్‌ను పూర్తి చేయాలి. ♦ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తరువాత ఓ పిన్ నెంబర్ మీకు పోస్ట్ ద్వారా మీరు మార్చుకున్న అడ్రస్‌కు వస్తుంది. ♦ ఆ సీక్రెడ్ కోడ్ ను ఎంటర్ చేసి చివరిగా మీ ఆధార్ కొత్త ఇంటి అడ్రస్ రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ♦ గడువు పూర్తయిన తర్వాత మీరు కావాలనుకున్న అడ్రస్ పేరుమీద మీ ఆధార్ అప్ డేట్ అవుతుంది -
తప్పుడు ఆధార్‌తో ఖాతా తెరిచి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ. 1,96,88,136 కాజేసిన కేసులో సుప్రియ ఎలిజబెత్ హెడింగ్ కీలక నిందితురాలని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్‌లోని బ్రాంచ్‌లో ఖాతా తెరిచేందుకు ఆమె సమర్పించిన ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసినదిగా తేలింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న సుప్రియ కోసం గాలిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్‌ను ఆన్లైన్లో దోచే యడానికి స్కెచ్ వేసిన సైబర్ నేరగాళ్లు ఈ నెల 2న సుప్రియ ఎలిజబెత్ అనే మహిళతో సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఖాతా తెరిపించారు. అందులో పద్మారావునగర్ అడ్రస్ పొందుపరుస్తూ తన ఆధార్‌కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ఇచ్చింది. దీన్ని సరిగ్గా పరిశీలించ కుండానే బ్యాంకు అధికారులు ఆమోదించేశారు. కర్ణాటకకు చెందిన ఆధార్‌కార్డును స్కాన్ చేసి, అందులో ముందు వైపు సుప్రియ పేరు, వెనుక వైపు చిరునామా ఉండే చోట పద్మారావునగర్ను చేర్చి ప్రింటౌట్ తీసినట్లు పోలీసులు తేల్చారు. కాజేసిన డబ్బు పది బ్యాంకుల్లోకి తరలించి.. అపెక్స్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని 102 లావాదేవీల్లో కాజేశారు. కొన్ని రోజులపాటు ఈ బదిలీలు జరిగాయి. అయితే రోజూ బ్యాంక్ అధికారులు తీసే బ్యాలెన్స్ షీట్లో తేడాలు కనిపించకుండా హ్యాకర్‌గా వ్యవహరించిన నైజీరియన్ జాగ్రత్తలు తీసు కున్నారు. ఆ లావాదేవీలు బ్యాలెన్స్ షీట్లోకి రాకుండా డిలీట్ చేసేయడంతో బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. కాజేసిన మొత్తంలో రూ.1.94, 88,136 హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్సీ, కోటక్ బ్యాంకుల్లో ఉన్న 10 ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేసేశారు. వీటిలో బెంగళూరు, ఎర్నాకుళంలోని ఖాతాలు సుప్రియ పేరుతో, ఢిల్లీ లోని ఖాతా ఆమె తండ్రిగా ఆధార్‌కార్డులో పొందుపరిచి ఉన్న జార్జ్ హెడింగ్ పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరితోపాటు నగరంలో ఉండి వెళ్లిన నైజీరియన్ విల్సన్ కోసమూ ముమ్మరంగా గాలిస్తున్నారు. -
పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్..!
తిరుపతి రూరల్: మండలంలోని పుదిపట్లలో ఊహించినట్లే జరిగింది. ఊరు, పేరు, ఇంటి నంబర్లు లేని వందలాది దొంగ ఓట్లను తొలగించకుండానే ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లకు నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించారు. అందుకోసం ఏకంగా మీ–సేవ కేంద్రాన్నే స్థావరంగా మార్చుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మీ–సేవ కేంద్రంలో దొంగ ఆధార్‌కార్డులను తయారు చేస్తూ ఆదివారం పుదిపట్ల సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బడి సుధాయాదవ్ అనుచరులు పట్టుబడ్డారు. స్థానికులు ఫిర్యాదుతో ఎంఆర్‌పల్లె పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో బడి సుధా యాదవ్, వెంకటముని మునిచంద్రా, రవీంద్ర, మణికంఠ ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పుదిపట్లలో దాదాపు 1,262 దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణలో ద,త,మ,ప, ర, ఖ....ఇలా గుర్తు తెలియని పేర్లతో ఓటరు జాబితా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఒకే వ్యక్తి సెల్ నంబర్‌తో 470కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించినా చర్యలు లేవు. 0, 00, 000, 0000.... ఊర్లో లేని ఇలాంటివే ఇంటి నంబర్లుగా పెట్టి జాబితాను నింపేశారు. వాటిని ప్రక్షాళన చేయాలని మొ త్తుకున్నా పట్టించుకోలేదు. ఆదివారం పుదిపట్ల లో ఓటింగ్ జరిగింది. ఊహించినట్లుగానే దొంగ ఓట్లు వేసేందుకు బయట వ్యక్తులు వచ్చారు. వారిని ఊరు, పేరు లేని వారి ఓటరు కార్డును చూసి మరోక గుర్తింపు కార్డు చూపించాలని ఏజెంట్లు, పోలింగ్ అధికారులు అడిగారు. దీంతో ఆధార్‌కార్డులను చూపించారు. డూప్లికేట్ తరహాలో ఉన్న ఆధార్ అడ్రస్‌లపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీశారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని నిలదీయడంతో నకిలీ ఆధార్‌కార్డుల గుట్టు బయటపడింది. ఫొటో ఉంచి, అడ్రస్ మార్చి.... దొంగ ఆధార్ కార్డులతో.. దొంగ అడ్రస్‌లతో ఓటరుగా నమోదు అయిన వ్యక్తులు, ఓటరు కార్డుతో పాటు గుర్తింపు కార్డు కోసం అడ్డదారులు తొక్కారు. అందుకోసం పేరూరు స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న మణికంఠ అనే వ్యక్తి మీ– సేవ కేంద్రాన్ని అడ్డగా మార్చుకున్నారు. ఫొటో మా త్రం ఉంచుకుని, పుదిపట్ల అడ్రస్‌తో నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేసుకున్నారు. అక్కడ దాదాపు 500కు పైగా నకిలీ ఆధార్‌కార్డులు బయటపడ్డాయి. అక్కడే పుదిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడి సుధాయాదవ్ అనుచరులు ఉన్నారు. వాళ్లే తమకు నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేశారని చంద్రమౌళి అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో మీ– సేవ నిర్వాహకుడు మణికంఠతోపాటు ఐదుగురిపై ఎంఆర్‌పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనలో కీలకమైన బడి సుధాయాదవ్ పుదిపట్ల సర్పంచ్‌గా గెలిచాడు. అతనిపై కూడా కేసు న మోదు అయ్యింది. దీంతో అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చదవండి: నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ -
అక్రమార్జనకు ‘ఆధార్’
కర్నూలు: ఆధార్ సెంటర్ల నిర్వాహకులు బరి తెగించారు. దళారులను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా దందా సాగించారు. ఆధార్ కార్డుల్లో వివరాలను ఇష్టారాజ్యంగా మార్పు చేసి.. వేలాది రూపాయలు వెనకేసుకున్నారు. ఈ ముఠాల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. 30 మంది నిందితులను కటకటాలకు పంపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఫక్కీరప్ప.. ట్రైనీ ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. పత్తికొండ, ఆదోని, నందవరం, బనగానపల్లె, పెద్దకడబూరు ప్రాంతాల్లోని ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ముఠాలను ఏర్పాటు చేసుకుని.. ఆధార్ కార్డుల డేటా ఇష్టానుసారం మార్పు చేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. ►పత్తికొండ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కె.రామాంజనేయులు, ప్రసాద్, చంద్రశేఖర్, రామాంజనేయులు, బోయ వీరేష్, రవి, మల్లప్ప, హనుమంతరెడ్డి, హేమంత్ రెడ్డి, వెంకటేష్, అయ్యన్న, రమేష్, బాలప్ప, నగేష్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు కోసిగి, కౌతాళం, ఆదోని, పత్తికొండ, పెద్దతుంబళం ప్రాంతాలకు చెందిన వారు. వీరిలో ఎనిమిది మంది గతంలోనూ ఇదే వ్యవహారంలో అరెస్టయ్యారు. ►నందవరం పోలీసులు ఎమ్మిగనూరుకు చెందిన వీరేష్, పెద్దకడబూరుకు చెందిన విజయ్ మోహన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. పెద్దకడబూరు ఆధార్ సెంటర్లో తనిఖీలు నిర్వహించి..ల్యాప్‌టాప్, స్కానర్, ప్రింటర్, ఇతర పరికరాలు, పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. ఆధార్ సెంటర్‌ను సీజ్ చేశారు. ►ఆదోని త్రీటౌన్ పీఎస్ పరిధిలో సత్యనారాయణ, మహమ్మద్ అలీ, హుస్సేన్ (ఆదోని టౌన్), మాబాషా(ఇస్వీ గ్రామం), ఆదోని టూటౌన్ పీఎస్ పరిధిలో అరవింద్, రాజు, షేక్షావలి, ఐశ్వర్య (వీరంతా ఆదోనివాసులు)లను అరెస్టు చేశారు. ►బనగానపల్లె పోలీసు సర్కిల్ పరిధిలో ఉప్పరి మద్దిలేటి, చాకలి నాగరాజు, కావలి రామాంజనేయులు, అప్పల్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి, పోలూరు పుల్లయ్య, వర మహేంద్ర అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు అవుకు, బనగానపల్లె, తాడిపత్రి, పాణ్యం, గుంతకల్లు ప్రాంతాలకు చెందిన వారు. వీరి వద్ద నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 3 ఫింగర్ ప్రింట్ స్కానర్లు, 3 ఐరిస్ స్కానర్లు, 3 వెబ్ కెమెరాలు, 3 స్కానర్లు, ప్రింటర్లతో పాటు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వేల సంఖ్యలో కార్డుల మార్పిడి.. ఈ ముఠాల పరిధిలోని ఆధార్ సెంటర్లలో వేల సంఖ్యలో ఆధార్ కార్డుల డేటాను మార్పు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లభించేందుకు వీలుగా పుట్టిన తేదీ మార్చడం, పాన్‌కార్డు లేనివారికి నకిలీది సృష్టించి ఇవ్వడం, పాన్‌కార్డును ఆధారం చేసుకుని ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు చేయడం, ఫొటోషాప్, మైక్రోసాఫ్ట్ పెయింట్ అప్లికేషన్ల సాయంతో డేటాను ఎడిట్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేశారన్నారు. జిల్లాలోని పది సచివాలయాలలో ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ నిర్వహించగా.. 200 మందికి పైగా ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బయటపడిందన్నారు. ఈ వ్యవహారంలో ముఠా సభ్యులు కీలకంగా వ్యవహరించి దరఖాస్తులు చేయించారని, ఒక్కొక్కరు వందకు పైగా మార్పిడి చేయించినట్లు విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. మీడియా సమావేశంలో సీఐలు సురేష్ బాబు, శ్రీరాములు, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
‘సంక్షేమం’ కోసం.. అడ్డదారులు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నందిగాం మండలం దిమ్మడిజోలలో ఇటీవల తొమ్మిది మంది పింఛన్లను అధికారులు నిలిపేశారు. అధార్ కార్డులలో వయస్సు మార్పు చేశారని గుర్తించిన తరువాత ఈ చర్య తీసుకున్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో వైఎస్సార్ చేయూత పథకం కోసం నెల రోజుల వ్యవధిలో అధార్ కార్డులో వయస్సు మార్పులు చేసి కొత్త వాటితో దరఖాస్తులు చేశారు. దీన్ని గమనించిన సచివాలయం సిబ్బంది ఆరాతీసేసరికి అసలు విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళంలోని ఓ ఆధార్ సెంటర్లో పదిమంది వరకు ఇలా వయస్సు మార్పులు చేయించుకున్నారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు వయస్సు మార్పు కోసం రూ. 5 వేలు చొప్పున సమరి్పంచినట్టు కూడా తెలిపారు. ఫిర్యాదు చేయండని అడిగేసరికి ఎందుకొచ్చింది వాళ్లంతా మా వాళ్లేనని దాటవేస్తున్నారు. ఈ రెండు చోట్లేకాదు జిల్లాలో పలుచోట్ల పింఛన్లు, వైఎస్సార్ చేయూత, ఇతరత్రా సంక్షేమ పథకాల కోసం అధార్కార్డులలో వయస్సు మార్పులు చేస్తున్నారు. ఏటా రూ. 18,750 వచ్చే చేయూత పథకాన్ని, నెలకు 2,250 రూపాయలు వచ్చే సామాజిక పింఛన్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. పొరుగు జిల్లాలోని చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎల్‌ఎన్‌పేట, శ్రీకాకుళం, ఒడిశాలోని పర్లాకిమిడి, ఏడు మైళ్లరాయి, బరంపురం వద్ద ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆధార్ కార్డులలో మార్పులు చేయిస్తున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో ఈ ప్రాక్టీసు జరుగుతోంది. కాసులకు కక్కుర్తిపడిన నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టు వయస్సు వేసేసి కొత్త ఆధార్ కార్డులు వచ్చేలా చేస్తున్నారు. దీంతో 45 ఏళ్లు, 50 ఏళ్లు ఉన్న వారు కూడా 65 ఏళ్ల వయస్సు ఉన్నట్టుగా మార్చుకుని పింఛన్లకు అర్హత సాధిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం నడుస్తున్నది. ఒక్కొక్క కార్డులో వయస్సు మార్చేందుకు రూ. 5 వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేసి భారీగా లబ్ధిపొందుతున్నారు. సహకరిస్తున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇదే సమయంలో కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా అత్యాశకు పోయి వారికి సహకరిస్తున్నారు. కొన్ని ఆధార్ సెంటర్లలో ఇదేరకమైన మాల్ ప్రాక్టీసు జరుగుతోంది. వయస్సు మార్చి డబ్బులు సంపాదించడమే పనిగా వీరు పెట్టుకున్నారు. సాధారణంగా ఏదైనా ధ్రువీకరణ పత్రం చూసి ఆధార్ కార్డులో వయస్సు మార్చేందుకు ఆప్‌లోడ్ చేయాలి. కానీ పలు కేంద్రాల నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పులు చేసి అప్లోడ్ చేసేస్తున్నా రు. అప్లోడ్ అయ్యాక వయస్సు మార్పుతో కూడిన ఆధార్ కార్డులు జారీ అయిపోయాయి. వీటిని పట్టుకుని పింఛను, వైఎస్సార్ చేయూత పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కాకపోతేసచివాలయం సిబ్బంది కొన్నిచోట్ల క్షుణ్ణంగా పరిశీలించి నెలల వ్యవ«ధిలోనే వయస్సు ఎలా మారిపోయిందని నిలదీసేసరికి కొన్నిచోట్ల ఆధార్ అక్రమాలు బయటపడుతున్నాయి. పట్టుబడ్డ ముఠాతో వాస్తవాలు వెలుగులోకి.. పర్లాకిమిడిలో వయస్సు మార్పులు చేపడుతున్నారన్న సమాచారంతో సరుబుజ్జిలి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు ఒడిశా కేంద్రంగా పట్టుబడ్డ ముఠా తో అక్రమాలు మరింత రుజువయ్యాయి. ఎస్మాన్ మండల్ నాయక్, కిల్లారి చిన్నారావు, చింతా డ శ్రీనివాసరావు బృందంగా ఏర్పడి చేస్తున్న నకిలీ ఆధార్ కార్డుల గుట్టును రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు నకిలీ స్టడీ సరి్టఫికెట్లతో పాన్‌కార్డుల వయస్సును మార్చారు. ఆధార్ కార్డుల కో సం అప్లోడ్ చేశారు. 260 కార్డులను తారుమారు చేసి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా నౌగాడ వద్ద ఆధార్ కార్డుల కోసం ఎస్మాన్ మండల్ నాయక్ అనే వ్యక్తి ఒక సరీ్వ సు ప్రొవైడర్ ఏర్పాటు చేశారు. ఆయనతో ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన కిల్లారి శ్రీనివాసరావు, చింతాడ శ్రీనివాసరావులు జత కలిసి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేయడం మొదలు పెట్టారు. నేరుగా ఎల్‌ఎన్‌పేటకు వచ్చి నకిలీ ధ్రువపత్రాలు, పాన్‌కార్డులను మోసపూరితంగా ఉపయోగించి ఆధార్ కార్డుల కోసం అప్లోడ్ చేసిన వ్యవహారం బట్టబయలైంది. -
ఆధార్ సంస్థ నోటిసులపై న్యాయపోరాటం చేస్తాం
-
హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు
-
‘సొమ్ము’సిల్లే ఆలోచన!
అప్పటి వరకు యాభై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు అరవై ఐదేళ్ల వృద్ధుడు అయిపోయాడు. నలభై ఐదేళ్ల చలాకీ మనిషి ఆధారం లేని ముసలి వ్యక్తిగా మారిపోయాడు. ఒక్క రోజులోనే పది, పదిహేనేళ్ల వయసు పెంచేసుకున్నారు. పింఛన్ డబ్బులు పెరిగాక.. ఆ సొమ్ము అందుకోవాలన్న ఆశతో జిల్లాలో చాలా మంది ఇలా ముసలివాళ్లయిపోయారు. మీ సేవ కేంద్రాల సాయంతో తమ వయసు పెంచుకుని పింఛన్‌కు అర్హులైపోయారు. పింఛన్ అర్హుల జాబితా పెరగడంతో అధికారులు కాస్త నిశితంగా పరిశీలించగా విషయం వెలుగు చూసింది. నెలనెలా దాదాపు రూ.4కోట్లు అనర్హుల ఖాతాల్లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పింఛన్లు పెంచుతారన్న గోల. ఇంకేమంది కొంతమంది పక్కదారి పట్టారు. భారీగా పెంచే పింఛన్లు కొట్టేయడానికి అప్పటికప్పుడు వయసు పెంచేసుకున్నారు. వయ స్సు ధ్రువీకరణలో ట్యాంపరింగ్‌కు పాల్ప డ్డారు. ఇందుకు మీసేవ కేంద్రాలు సాయం చేశాయి. కాసులకు కక్కుర్తిపడిన నిర్వాహకులు ఇష్టారీతిన వయస్సు వేసేసి కొత్త ఆధార్ కార్డులు వచ్చేలా చేశారు. దీంతో 45 ఏళ్లు, 50 ఏళ్లు ఉన్న వారు కూడా 65 ఏళ్ల వయస్సు ఉన్నట్టుగా మార్చుకుని ఎన్నికల ముందు పింఛన్లకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తు న ముడుపుల బాగోతం నడిచింది. ఒక్కో కార్డులో వయస్సు మార్చేందుకు రూ. 8వేల వరకు కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేసి భారీగా లబ్ధిపొందారు. జిల్లాలో 20వేలకు పైగా ఈ రకంగా పింఛన్లు పొందినట్టు తెలిసింది. ప్రతి నెలా రూ. 4కోట్ల వరకు అనర్హులకు వెళ్తున్నట్టు సమాచారం. పింఛను కోసం వయస్సు మార్పు.. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పటికే పింఛను రూ. 2వేలకు పెంచుతానని ప్రకటించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాలుగున్నరేళ్లకు పైగా పింఛన్ల పెంపు జోలికెళ్లలేదు. ఈ లోగా ఎన్నికలొచ్చేశాయి. ఇంకేముంది ఓటర్లను ఆకట్టుకునేందుకు పింఛన్ల పెంపునకు అప్పటి సర్కారు సిద్ధమైంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పింఛన్ల పెంపుపై స్పష్టమైన ప్రకటనలు చేయడంతో కొందరికి ఆశ పెరిగింది. రూ. 2వేల పింఛన్‌ను ఎందుకు వ దులుకోవాలని అర్హత లేని వారు కూడా వాటి కోసం ఆరాటపడ్డారు. 45 ఏళ్లు, 50 ఏళ్ల వయస్సులో ఉన్న వారు కూడా పింఛనుపై దృష్టి పెట్టారు. ఒక్కసారి వస్తే జీవితాంతం వరకు ఉంటుందని, ఆర్థికంగా భరోసా ఉన్నట్టు అవుతుందని ఏకంగా వయస్సు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఉన్న ఆధార్ కార్డులలో ఉన్న వయస్సైతే పింఛన్ కోసం సరిపోదని, యుద్ధ ప్రాతిపదికన వయస్సు మార్పు చేసుకున్నారు. 65 ఏళ్ల వయస్సు పైబడినట్టుగా చాలా మంది ఆధార్ కార్డులో వయస్సు మార్పు చేయించుకున్నారు. ‘మీ సేవ’లో.. ఇదే సమయంలో కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా అత్యాశకు పోయిన వారికి సహకరించారు. చెప్పాలంటే వయస్సు మార్చి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు. సాధారణంగా ఏదైనా ధ్రువీకరణ పత్రం చూసి ఆధార్ కార్డులో వయస్సు మార్చేందుకు ఆప్‌లోడ్ చేయాలి. కానీ పలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పులు చేసి అప్లోడ్ చేసేశారు. అప్లోడ్ అయ్యాక వయస్సు మార్పుతో కూడిన ఆధార్ కార్డులు జారీ అయిపోయాయి. వీటిని పట్టుకుని డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్ద ఎత్తున కొత్త పింఛన్లు పొందారు. జిల్లాలో ఈ రకంగా పింఛన్లు పొందిన వారు 20వేల వరకు ఉన్నారు. రాజాం, చీపరుపల్లి, పర్లాకిమిడి కేంద్రంగా.. ఈ రకమైన అక్రమ బాగోతానికి రాజాం, చీపురుపల్లి, పర్లాకిమిడి, బరంపురం కేంద్రంగా ఆధార్ కార్డుల వయస్సు మార్పులు జరిగినట్టు తెలిసింది. జిల్లా నలుమూలల నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లి వయస్సు మార్పులు చేయించినట్టు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. వయస్సు మార్చేందుకు ఒక్కో కార్డుకు రూ. 8వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. నెలకి రూ. 2వేలు వచ్చే పింఛన్‌కు ఒకేసారి రూ. 8వేలు ఖర్చు పెడితే జీవితకాలం వస్తుందని, ఆ వచ్చినదాంట్లో ఇది ఏ మాత్రమని చాలా మంది అడిగినంత ఇచ్చి ఆధార్ కార్డులు మార్పులు చేసుకున్నారు. ఫిర్యాదులొస్తున్నాయి.. ఆధార్ కార్డులో వయస్సు మా ర్చుకుని కొత్త పింఛన్లు పొందినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మార్పులు జరిగినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. కొన్ని మీసేవ కేంద్రాల ద్వారా ఈ మార్పులు జరిగినట్టు సమాచారం. వాటిని పరిశీలిస్తున్నాం. తప్పుడు ధ్రువీకరణ వయస్సుతో పింఛన్లు పొందిన వారిని ఏరివేయనున్నాం. దానికి సంబంధించి టెక్నికల్ సపోర్టు తీసుకుంటున్నాం. అనర్హులై పింఛన్లు పొందినట్టు నిర్ధారణ అయిన వెంటనే రద్దు చేస్తాం. – కల్యాణచక్రవర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఎ -
అక్రమార్జనకు ఆధార్
సాక్షి , కడప : రూ.5 వేలు ఇస్తే ఆధార్ కార్డులో వయస్సు మార్చేస్తామంటూ కొన్ని మీసేవ కేంద్రాలు అక్రమ వ్యాపారానికి తెరలేపాయి. వృద్ధా్దప్య పెన్షన్ల ఆశ చూపి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొందరు అత్యాశకు పోయి వీరి వలలో చిక్కుకుని అడిగింది ముట్టజెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువ మీసేవ కేంద్రాలు ఆధార్‌లో వయస్సు మార్పిడి వ్యవహారానికి తెరలేపాయి. తక్కువ వయసును ఎక్కువగా చూపించి జన్మభూమి కమిటీలు పెన్షన్లు మంజూరు చేయించాయి. ప్రతిఫలంగా భారీ మొత్తం లబ్ధి పొందాయి. ఇందువల్ల అర్హత లేని వారికి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరయ్యాయి. అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డ కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తాజాగా ఇదే వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్‌లో వయసు మార్పిడి చేస్తూ అక్రమార్జనకు దిగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. బి.మఠం, గోపవరం, బద్వేలు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, కడపతోపాటు దాదాపు ఎక్కువ మండలాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎగబడుతున్న వైనం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ మొత్తాన్ని పెంచింది. పెన్షన్‌కు అర్హత వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిం చింది. పెద్ద మొత్తంలో నెలనెల కచ్చితంగా పెన్షన్ వస్తుండడంతో కొందరు మీసేవ నిర్వాహకులు గ్రామాల్లో జనా నికి పెన్షన్ వల విసురుతున్నారు. రెండు నెలల పెన్షన్ తమకు ఇస్తే జీవితకాలం పెన్షన్ పొందే అవకాశ మంటూ ఆఫర్లు చూపుతున్నారు. అక్రమమని తెలిసినా కొందరు ఆధార్‌లో వయస్సు మార్పుకు ఎగబడుతున్నారు. ఆధార్‌కార్డును అధికారులు ప్రామాణికంగా తీసుకోవడంతో కొన్ని మీసేవ కేంద్రాలవారు దీనిని అవకాశంగా భావిస్తున్నారు. దీంతో వయసు మార్పిడీ వ్యవహారం సాగిస్తున్నారు. కొందరు రూ.4 వేల నుంచి రూ. 5 వేలు చెల్లించి ఆధార్‌లో వయస్సు మార్పించుకొంటున్నారు. అర్బన్ పరిధిలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటిలలో ప్రభుత్వ భవనాలలో వేతన ప్రాతిపదికన 11 మీ సేవలు నడుస్తున్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగులకు కార్వే కంపెనీ జీతాలు చెల్లిస్తోంది. ఇవి కాకుండా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సెలెక్షన్స్ నిర్వహించి పలువురు నిరుద్యోగులకు ఇచ్చినవి 44 ఉన్నాయి.ఇవి అర్బన్ కేంద్రాల్లో కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఏపీ ఆన్లైన్ ఆధ్వర్యంలో 318 మీ సేవా కేంద్రాలున్నాయి. ఏపీ ఆన్లైన్ పరిధిలో కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్న మీ సేవలు మరో 700 వరకు ఉన్నాయి. మీసేవల్లో అక్రమాలు: కమీషన్ ఆధారంగా పనిచేస్తున్న వెయ్యికి పైగా మీ సేవల్లో ఆధార్‌కార్డు వయస్సు మార్పిడీ వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన విభాగాల్లోని కొన్ని చోట్ల కూడా ఈ అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు 3,01,691 ఉన్నాయి. 1, 35,788 మంది వృద్దాప్య పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు పొందుతున్నవారిలో 2,247 మంది ఒంటరి మహిళలు , అభయ హస్తం కింద 4,054 మంది , సీకేడీయూలో 343మంది, 1,645 మంది డప్పు కళాకారులు ,37,164 మంది దివ్యాంగులు , 492 మంది మత్స్యకారులు, 277 మంది కల్లుగీత కార్మికులు, 844 చర్మకళాకారులు, 12,511 మంది చేనేతలు..1,06,180 మంది వితంతువులు ఉన్నారు. కొత్తగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా, మరికొంతమంది దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుండగా, అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేయనుంది. ఈ వ్యవస్థలు ఏర్పడగానే అర్హులకు పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిని అవకాశంగా తీసుకుని మీసేవలు డబ్బులు దండు కొనేందుకు జనాలకు వల వేస్తు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి మీసేవ కేంద్రాలలో ఈ వ్యవహారంపై ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇప్పటికే మీ సేవ బాధ్యతలు చూస్తున్న పలువురితో సమావేశమైనట్లు సమాచారం.మీ సేవలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. -
‘ఆధార్’ మోసగాడి అరెస్ట్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్) : ఆధార్ కార్డుల్లోని పేర్లు మారుస్తామని, తాను కలెక్టరేట్ నుంచి వచ్చానని నమిలిగొండ గ్రామస్తులను మోసం చేసిన ఆలువాల వినయ్కుమార్ని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వరబాబు తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని బ్యాంక్ ఖాతాలలో వేస్తామని గ్రామస్తుల నుంచి ఆధార్‌కార్డు నంబర్లు, వేలిముద్రలు తీసుకుని దాదాపు రూ.2.60లక్షలు కాజేశాడని తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని నెక్కొండ మండలం సీతాపురం గ్రామానికి చెందిన అలువాల వినయ్‌కుమార్ ఈ ఏడాది బీటెక్ పూర్తి చేశాడు. తమ గ్రామానికి చెందిన సం«ధ్యారాణిని చిల్పూరు గుట్ట వద్ద కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఒక రూం అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైమ్ మినిష్టర్ గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్ఏ)లో గ్రామాల్లోని యువతకు కంప్యూటర్‌పై అవగాహన, శిక్షణ కల్పించేందుకు అందులో విలేజ్ లెవల్ ఎంట్రప్రీనియర్గా చేరాడు. రెండు నెలల క్రితం పీఎంజీడీఐఎస్ఏ ప్రోగ్రాంలో భాగంగా చిల్పూరు మండలం నష్కల్‌లో పనిచేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాధించాలని.. ఆ ప్రోగ్రాంను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సాధించాలనే ఆలోచనతో ఆన్‌లైన్‌ను ఉపయోగించి దగా చేయాలనే ఆలోచనతో నమిలిగొండ గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఆధార్ నంబర్లు, వేలిముద్రలతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను తన ఖాతాలోకి మార్చుకునే అవకాశం ఆన్లైన్లో ఉందని తెలుసుకుని ముందుగా గ్రామ సర్పంచ్‌ను కలిశాడు. తాను జనగామ కలెక్టరేట్ నుంచి వచ్చానని, ఆధార్ కార్డులలో జిల్లా పేరు మారుస్తామని, తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయం డబ్బులు మీ ఖాతాలలో పడుతాయని సర్పంచ్‌తో నమ్మబలికాడు. అది నమ్మిన సర్పంచ్ మరుసటి రోజు ఉదయం గ్రామంలో డప్పు చాటింపు వేయించాడు. ల్యాప్‌టాప్, ఫింగర్ ప్రింట్ డివైసర్తో గ్రామానికి వచ్చిన ఆ మోసగాడు ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు ల్యాప్‌టాప్‌లో బయోమెట్రిక్ ద్వారా వారి ఆధార్ కార్డుల వివరాలు, వేలిముద్రలు తీసుకుని ఆన్లైన్లో డిజీపే యాప్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.2,59,500 డ్రా చేశాడు. బాధితులైన గ్రామస్తుల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతా నుంచి రూ.600 నుంచి రూ.1000 వరకు అక్రమంగా కామన్ సర్వీస్ సెంటర్ నుంచి అతడి ఖాతాలోకి మార్చుకున్నాడు. ఖాతాల నుంచి డబ్బులు కట్ అయిన విషయం మెస్సేజ్‌ల ద్వారా తెలుసుకున్న బాధితులు సర్పంచ్‌ను సంప్రదించగా సర్పంచ్ ఆ హైటెక్ మోసగాడికి ఫోన్ చేశారు. అయితే అతను ఈ నెల 9న వస్తానని, అప్పటివరకు ఆగండని బుకాయించాడు. అది నమ్మిన వారు అతను రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల «ఫిర్యాదు మేరకు సీఐ రాజిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపెండ్యాలలో అదుపులోకి.. ఈ క్రమంలో అతడిని చిన్నపెండ్యాలలో స్థానిక ఎస్సై రవి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైటెక్ మోసగాడిని విచారించగా నేరం అంగీకరించాడని, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుడు మోసం చేసిన రూ.2,59,500లతో పాటు ల్యాప్‌టాప్, ఫింగర్ ప్రింట్ డివైసర్ను రికవరీ చేయడం జరిగింది. కోర్టులో విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరస్తుడు తన ఖాతాలోకి మార్చుకున్న డబ్బుల వివరాల ఆధారంగా బాధితులకు డబ్బులు తిరిగి అందేలా చూస్తామన్నారు. కేవలం వారం రోజుల లోపులోనే నిందితుడిని పట్టుకున్న సీఐ రాజిరెడ్డి, ఎస్సై శీలం రవియాదవ్‌ను, కానిస్టేబుళ్లు అనిల్, నవీన్, కుమార్‌లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా వారిని ఫోన్లో సీపీ, డీసీపీ అభినందించినట్లు తెలిపారు. -
నకిలీ ఆధార్‌తో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇరవై మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఆయన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిపిన వైనం తాజాగా బయటపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ చిరంజీవులు చొరవతో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పట్టణంలోని హరినాథపురానికి చెందిన కె.ప్రకాశ్‌రావు 1996, మేలో చనిపోయారు. ఆయన మరణించినట్టు అదే ఏడాది జూన్‌లో మరణ ధ్రువీకరణ పత్రం కూడా రిజిస్టర్ అయింది. కానీ ఆయన బతికే ఉన్నట్టు ఆధార్ కార్డు సృష్టించిన అక్రమార్కులు దాని సాయంతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్‌డీడ్ నంబర్: 1953/2019 ద్వారా హైదరనగర్‌లోని 300 చదరపు గజాల ఫ్లాట్‌ను ఈ ఏడాది మార్చిలో రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 45 రోజుల వ్యవధిలో అవే దస్తావేజులను మరో రెండు సార్లు రిజిస్టర్ చేశారు. విషయం ఐజీ చిరంజీవులు దృష్టికి తీసుకెళ్లడంతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ జహంగీర్ చేత కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేయించారు. విచారణకు సహకరించేందుకు వీలుగా సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శామీర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ శేషగిరిచంద్‌ను ఇన్చార్జిగా నియమించారు. పరిశీలించుకోండి: ఐజీ చిరంజీవులు ఈ ఘటన నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు సంబంధించి క్రయ విక్రయ లావాదేవీలు జరిపినప్పుడు, ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని ఐజీ చిరంజీవులు సూచించారు. అమ్మినవారు సరైన వారా కాదా అనే విషయాన్ని చూసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మూడో విడత..నిధులు మడత
సాక్షి కడప : పోలింగ్‌కు ముందు ఓట్ల కోసం ఎన్నో ఫీట్లు చేసిన టీడీపీ సర్కార్ తర్వాత దాని గురించి మరిచిపోయింది. మహిళలు పదేపదే తిరుగుతున్నా పట్టించుకునే వారు లేరు. సాంకేతిక కారణాలైనా...ఆధార్ సమస్య అయినా.. బ్యాంకుల్లో వడ్డీ కింద జమ చేసుకుంటున్నా అడిగేవారు లేకపోవడంతో వారి వేదన అరణ్య రోదనగా మారింది. పోలింగ్ ముగిసి నెల రోజులయినా మూడో విడత పసుపు–కుంకుమ నిధుల విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. మహిళలు నిలదీస్తున్నా స్పందించేవారు లేరు. పోలింగ్‌కు ముందు కూడా నగదు విషయమై మైదుకూరులో మహిళలు బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. పసుపు–కుంకుమ పేరుతో ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి రూ.10 వేలు ప్రకటించి మూడు విడతలుగా అందజేస్తున్న సొమ్ము కు సంబం ధించి మహిళలు సవాలక్ష ఆంక్షలు అధిగమించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముప్పతిప్పలు జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు మున్సి పాలిటీలలో పట్టణాభివృద్ధి్ద శాఖ ఆధ్వర్యంలో సుమారు 49 వేల స్వయం సహాయక గ్రూపులు ఉండగా, అందులో దాదాపు 4.90 లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం పసుపు–కుంకుమ కింద మూడు విడతల్లో రూ. 450 కోట్ల మేర నిధులను కేటాయించింది. అందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కేటాయించిన తేదీల్లో చెక్కులను అందించారు. అప్పటికప్పుడు చాలామందికి అందకపోవడం.... అందినా మొత్తాలు పడకపోవడం తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ పసుపు–కుంకుమ మూడవ విడతకు సంబంధించి స్థానిక వెలుగు కార్యాలయాలతోపాటు జిల్లా కేంద్రమైన కడపలోని డీఆర్డీఏ కార్యాలయానికి కూడా వచ్చి డబ్బుల విషయమై ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చి నిధుల విషయం అడుగుతున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. మూడవ విడతకు మహిళలకు సంబంధించి ముప్పుతిప్పలు తప్పడం లేదు. సాంకేతిక కారణాలు....ఆధార్ సమస్యలు మూడవ విడత పసుపు–కుంకుమకు సంబంధించి సాంకేతిక కారణాలతోపాటు ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిసింది. కొందరు మహిళలు గ్రూపుల నుంచి తప్పుకోగా, కొత్తవారు గ్రూపులో చేరుంటారు. అలాంటి గ్రూపుల్లో సమస్యలు ఏర్పడుతుండగా....మరికొందరు మహిళలకు రెండుచోట్ల ఆధార్‌కార్డుల సమస్య...కొన్నిచోట్ల అప్డేట్ కాకపోవడం...ఇతర అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పసుపు–కుంకుమ నిధుల కోసం నిరీక్షించే మహిళా సభ్యులు దాదాపు 400 నుంచి 500 మంది ఎదురుచూస్తున్నారు. సమస్యలను అధిగమించిన తర్వాత ఎప్పుడు సొమ్ములు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల వద్దకు మహిళలు మైదుకూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు సమస్యలు ఎదురు కావడంతో అధికారుల వద్దకు వచ్చి గట్టిగా నిలదీశారు. ఇటీవల చాపాడు మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు వచ్చి పసుపు–కుంకుమ సొమ్ములు ఎందుకు వేయలేదంటూ అధికారులను ప్రశ్నించారు. సుమారు ఎనిమిది గ్రూపులకు పడలేదంటూ వారు అధికారులతో వాదించారు. దీంతో అప్పటికప్పుడు చెక్కులను అధికారులు అందించారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కొంతమందికి ఇంకా మూడవ విడత సొమ్ములు అందలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల తంతు ముగిసినా...ముందస్తే అందాల్సిన సొమ్ములు ఇప్పటికీ పడకపోవడంతో ముప్పుతిప్పలు తప్పడం లేదు.