మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు తీసుకున్నామో గుర్తించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ 'TAF-COP' అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ పోర్టల్ సేవలపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆధార్ తప్పని సరి
దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. అదే సమయంలో ఆధార్‌కు ఫోన్ నెంబర్ యాడ్ చేయడం తప్పని సరి చేశాయి. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులువు అవుతోంది. ఈ విధానం ఫోన్ వినియోగదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. మన పేరుమీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఉంటే వాటిలో ఏ నెంబర్ ను ఆధార్ కు యాడ్ చేశామనే విషయాన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది.
చదవండి : అంబానీ తెలివి.. రెండూ లాభాలిచ్చేవే!
వెబ్‌సైట్ ను ప్రారంభించిన టెలికాం సంస్థ
సైబర్ నేరస్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఆ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అని పిలిచే ఈ పోర్టల్‌లో లాగిన్ అయితే మన ఆధార్ కార్డ్ మీద ఏ ఫోన్ నెంబర్ ను యాడ్ చేశాం. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు.
ప్రశంసల వర్షం
TAF-COP వెబ్ పోర్టల్ వినియోగంపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ @TRAI/ DOT ద్వారా చాలా ఉపయోగకరమైంది. ఈ సైట్ లో మీ ఫోనెంబర్‌ను ఎంట్రీ చేస్తే.. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే సిమ్ కార్డ్ వివరాలు వెలుగులోకి వస్తాయి. ఉపయోగంలో లేని సిమ్ కార్డ్ లను బ్లాక్ చేయవచ్చు. సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈ వెబ్ సైట్ ఐడియా బాగుందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Very useful service launched by @TRAI / DOT !
— Vijay Shekhar Sharma (@vijayshekhar) August 26, 2021
Open the below site and type in your mobile number and you will know the mobile numbers of all the SIM cards purchased with your Aadhaar number as soon as you enter the OTP. You can ban any of them. https://t.co/EdomPmQlXf
Comments
Please login to add a commentAdd a comment