Phone numbers
-
బ్యాంకింగ్ కాల్స్‌కు ప్రత్యేక నంబర్ల సిరీస్: ఆర్బీఐ సూచన
ముంబై: ఆర్థిక మోసాలను నివారించే దిశగా బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కస్టమర్లకు చేసే కాల్స్‌కి సంబంధించి ’1600’ ఫోన్ నంబరింగ్ సిరీస్‌ను మాత్రమే ఉపయోగించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అలాగే, ప్రమోషనల్ అవసరాల కోసం బ్యాంకులు, ఇతరత్రా నియంత్రిత సంస్థలు (ఆర్ఈ) ’140’ నంబర్ల సిరీస్‌నే ఉపయోగించాలని పే ర్కొంది. బ్యాంకులు, ఆర్ఈలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల డేటాబేస్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణ సులభతరంగా మారినప్పటికీ, దీనితో మోసాల ఉదంతాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. నిర్దేశిత ఆదేశాలను మార్చి 31 కల్లా అమలు చేయాలని సూచించింది. -
తెలుగులోనూ కుంభమేళా సమాచారం
రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్‌లో 88878–47135 ఫోన్ నంబర్‌కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. భక్తుని ఫోన్ నంబర్ ‘కుంభ్ సహాయక్ యాప్’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. -
జియో.. నచ్చిన నంబర్ తీసుకోండి..
ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ నంబర్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక సారి నంబర్ ఎంచుకుంటే అది కొన్నేళ్ల పాటు ఉంటుంది. అంతటి కీలకమైన ఫోన్ నంబర్‌ను వినియోగదారులు తమకు నచ్చినట్లుగా ఎంచుకునే అద్భుతమైన ఫీచర్‌ను రిలయన్స్ జియో అందిస్తుందని మీకు తెలుసా..?“జియో చాయిస్ నంబర్” గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇది మీ అదృష్ట సంఖ్యలు, పుట్టిన తేదీ లేదా మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వాటిని ప్రతిబింబించేలా మీ ఫోన్ నంబర్‌ను ఎంచుకోవడానికి అనుమతించే ప్రత్యేకమైన ఆఫర్. జియో చాయిస్ నంబర్ ద్వారా “జియోప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్”కి సబ్స్క్రయిబ్ చేసినప్పుడు మీకు నచ్చిన మొబైల్ నంబర్ సిరీస్‌ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లు ఒక వ్యక్తికి రూ. 349 నుంచి, ఫ్యామిలీ ప్లాన్‌కు రూ. 449 నుంచి ప్రారంభమవుతాయి.మీ జియో ఛాయిస్ నంబర్ పొందండిలా..జియో ఛాయిస్ నంబర్‌ను పొందడం సులభమైన ప్రక్రియ. మీరు దీన్ని మై జియో యాప్ లేదా జియో వెబ్సైట్ ద్వారా ఎంచుకోవచ్చు.MyJio యాప్ ద్వారా..» MyJio యాప్‌ని తెరవండి. ఒకవేళ యాప్‌ని డౌన్లోడ్ చేసి ఉండకపోతే, యాప్ స్టోర్ నుంచి MyJio యాప్‌ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.» మెను విభాగంపై క్లిక్ చేసి నచ్చిన నంబర్‌ను ఎంచుకోండి.» ‘Let’s book now’పై నొక్కి మీ పేరు, పిన్ కోడ్, మీ నచ్చిన అంకెలను (4-5 అంకెల వరకు) నమోదు చేయండి.» మీ ప్రమాణాలకు సరిపోయే సంఖ్యల జాబితాను జియో మీకు చూపుతుంది. వీటిలో బాగా నచ్చినదాన్ని ఎంచుకోండి.» ప్లాన్ రుసుము రూ. 499 చెల్లించి బుకింగ్‌ను పూర్తి చేయండి. అదనపు ఖర్చు లేకుండానే నంబర్ మీకు డెలివరీ అవుతుంది.Jio.com వెబ్సైట్ ద్వారా.. » అధికారిక జియో వెబ్‌సైట్‌కి వెళ్లండి.» మీ ప్రస్తుత జియో నంబర్‌ను నమోదు చేసి దానిని ఓటీపీతో ధ్రువీకరించండి. » మీ పేరు, పిన్ కోడ్, ప్రాధాన్య అంకెలను జోడించి, ఆపై ‘Show available numbers’ పై క్లిక్ చేయండి.» అందుబాటులో ఉన్న నంబర్ల జాబితా నుంచి ఎంచుకుని, 'ప్రొసీడ్'పై క్లిక్ చేసి, చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి. -
ఆర్థిక సైబర్ నేరాలకు చెక్
సాక్షి, అమరావతి :‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెప్పిండి’ ఇటీవల కాలంలో మితిమీరి పెరుగుతున్న కాల్స్ ఇవీ. ఆ ఫోన్ కాల్ బ్యాంకు నుంచో లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచే వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే.. బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉపక్రమించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పేరుతో మితిమీరుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటీవల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్’ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక సిరీస్‌తో నంబర్ల కేటాయింపు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు కాల్ చేసే నంబర్లకు ప్రత్యేక సిరీస్ కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాధారణ టెలికాం సంస్థలు వినియోగదారులకు కేటాయిస్తున్న 10 అంకెల సిరీస్ నంబర్లనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. 2023లో అటువంటి మోసాలకు పాల్పడ్డ 1.40 లక్షల ఫోన్ నంబర్లను సైబర్ పోలీసులు గుర్తించి వాటిని బ్లాక్ చేశారు. అంటే ఈ తరహా మోసాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డ్ అప్డేట్ లేదా పాన్ నంబర్ లింక్ చేయాలనో.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలనో రకరకాల పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. అవగాహనలేకో పొరపాటులో ఓటీపీ నంబర్ చెబితే నగదు కాజేస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాధారణ టెలికాం వినియోగదారులకు కేటాయించే సెల్‌ఫోన్ నంబర్ సిరీస్ కేటాయించకూడదని హోం శాఖ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) గతంలోనే సూచించిన విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేకంగా నంబర్ సిరీస్ (140+...)తో ఫోన్ నంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఆ సిరీస్ నంబర్ల నుంచి కాల్ వస్తేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినట్టుగా భావించాలి. సాధారణ ఫోన్ నంబర్ల సిరీస్ నుంచి కాల్చేసి తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేస్తున్నామని చెబితే.. వినియోగదారులు వెంటనే అప్రమత్తమవుతారు. సైబర్ నేరాల ముఠాల పనేనని గుర్తించి ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్త పడతారు. మోసపోయిన సొమ్ము తిరిగి ఇప్పించేలా.. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాన్ని నిర్ణిత వ్యవధిలోనే తిరిగి ఇప్పించే ప్రక్రియను కూడా కేంద్ర హోం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. మోసానికి పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నుంచి బాధితుల సొమ్మును వారి ఖాతాలకు మళ్లించడం అనే ప్రక్రియకు నిర్ణిత గడువును నిర్దేశించాలన్నారు. బాధితులు పదేపదే పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నారు. బ్యాంకులు ని ర్ణిత ఫార్మాట్లో సైబర్ పోలీసులకు సమరి్పంచాల్సిన సమాచారం నమూనాను రూపొందించారు. -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్‌లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్‌గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి, స్పందించకండి!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌లో డేటా బ్రీచ్ యూజర్లకు భారీ షాకిస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్ సేల్ అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. యూఎస్, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతదేశంతో సహా 84 వేర్వేరు దేశాల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు విక్రయానికి సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న ఈ వ్యవహారంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్ల డేటాబేస్ ఆన్లైన్లో విక్రయానికి ఉంచారు. 2022 డేటాబేస్‌లో 487 మిలియన్ల యూజర్ల మొబైల్ నంబర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక థ్రెట్యాక్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. డేటా బ్రీచ్ ద్వారా సేకరించిన సమాచారంతో ఫిషింగ్ ఎటాక్స్ చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగ దారులు తెలియని నంబర్ల కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ డేటాసెట్ ఈ డేటా బ్రీచ్‌లో మనదేశంలో 61.62 లక్షల మంది, అమెరికాకు చెందిన 32 మిలియన్ మంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈజిప్ట్ నుంచి 45 మిలియన్లు, ఇటలీ నుంచి 35 మిలియన్లు సౌదీ నుంచి 29 మిలియన్లు, ఫ్రాన్స్‌నుంచి 20 మిలియన్, టర్కీ నుంచి 20 మిలియన్ల మంది డేటా ఉన్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన 10మిలియన్ల యూజర్లు, యూకే నుంచి 11మిలియన్ పౌరుల ఫోన్ నంబర్ల డేటా లీక్ అయినట్టు తెలిపింది. అమెరికా యూజర్ల డేటాను 7వేల డాలర్లు (సుమారు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు. ₹2,04,175) 2వేల డాలర్లు (సుమారుగా ₹1,63,340) అమ్మకానికిపెట్టినట్టు నివేదించింది. కాగా మెటా, తన ప్లాట్‌ఫారమ్స్‌లో డేటా బ్రీచ్ ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, 500 మిలియన్లకు పైగా ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్లైన్లో లీకయ్యాయి. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు లీకైన సంగతి తెలిసిందే. -
Hyderabad: పోలీసు ఫోన్ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వాటి స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. పాత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల నెట్వర్క్ పరమైన ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులు అధికారులు మరో సంస్థ సేవలు తీసుకోవాలని నిర్ణయించారు. 4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (వీఏఎస్) అందించడానికి ఎయిర్టెల్ సంస్థ ముందుకు వచ్చింది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తొలుత మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ప్రస్తుతం ఉన్న నెంబర్లనే కొనసాగించాలని భావించారు. అయితే దీనికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో నెంబర్లు మార్చాలని నిర్ణయించారు. దీంతో సోమవారం నుంచి 9490616––– సిరీస్‌కు బదులుగా 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో నెంబర్ల వినియోగం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంచుతున్నారు. చదవండి: వికారాబాద్‌లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం అమలులోకి రాబోయే కొత్త నెంబర్లు ఇలా... ► పోలీసు కమిషనర్– 8712660001 ► అదనపు సీపీ (శాంతిభద్రతలు)– 8712660002 ► అదనపు సీపీ (నేరాలు)– 8712660003 ► సంయుక్త సీపీ (సీసీఎస్)– 8712660004 ► సంయుక్త సీపీ (ఎస్బీ)– 8712660005 ► సంయుక్త సీపీ (పరిపాలన)– 8712660006 ► సంయుక్త సీపీ (ట్రాఫిక్)– 8712660007 ► మధ్య మండల డీసీపీ– 8712660101 ► ఉత్తర మండల డీసీపీ– 8712660201 ► దక్షిణ మండల డీసీపీ– 8712660301 ► పశ్చిమ మండల డీసీపీ– 8712660401 ► తూర్పు మండల డీసీపీ– 8712660501 ► టాస్క్‌ఫోర్స్ డీసీపీ– 8712660701 ► ప్రధాన కంట్రోల్ రూమ్: 871266000, 8712661000 -
హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. మారనున్న పోలీసుల ఫోన్ నెంబర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కంటే తక్కువ ధరకు ఎక్కువ సదుపాయాలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో పోలీసు విభాగం ఫోన్లు ఎయిర్‌టెల్‌కు మారనున్నాయని కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిందని, ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల వీటితో పాటు నెట్వర్క్ పరమైన ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (వీఏఎస్) అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఎయిర్టెల్ సంస్థతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా నగర పోలీసు విభాగం ప్రస్తుతం ఉన్న ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త నెంబర్లను ఆగస్టు 1 నుంచి విడతల వారీగా అమలులోకి తీసుకురానుందని పేర్కొన్నారు. 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో కొత్త నెంబర్లు ఉండనున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యేలా నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంటాయని వివరించారు. చదవండి: హైటెక్ దొంగతనం.. తెలివి మామూలుగా లేదుగా! -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఈ ఫోన్ నెంబర్స్‌తో జాగ్రత్త..లేకపోతే..!
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫిషింగ్ వెబ్సైట్లతో కేటుగాళ్లు ఆయా ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. ఈ నంబర్ల పట్ల జాగ్రత్త..! తాజాగా ఎస్బీఐ కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే పలు ఫోన్ నంబర్లను ట్విటర్లో పేర్కొంది. కేవైసీ అప్డేట్ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్, మెసేజ్స్ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించంది. ఈ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్స్ను ఒపెన్ చేయకూడదని విన్నవించింది. ఈ మెసేజ్స్తో ఖాతాదారులు అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తారని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ హ్యండిల్లో పేర్కొంది. అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని తెలియజేసింది. Do not engage with these numbers, & don't click on #phishing links for KYC updates as they aren't associated with SBI. #BeAlert & #SafeWithSBI https://t.co/47tG8l03aH — State Bank of India (@TheOfficialSBI) April 20, 2022 చదవండి: ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్ -
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లున్నాయో తెలుసా?!
మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు తీసుకున్నామో గుర్తించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ 'TAF-COP' అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ పోర్టల్ సేవలపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆధార్ తప్పని సరి దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. అదే సమయంలో ఆధార్‌కు ఫోన్ నెంబర్ యాడ్ చేయడం తప్పని సరి చేశాయి. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులువు అవుతోంది. ఈ విధానం ఫోన్ వినియోగదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. మన పేరుమీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఉంటే వాటిలో ఏ నెంబర్ ను ఆధార్ కు యాడ్ చేశామనే విషయాన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది. చదవండి : అంబానీ తెలివి.. రెండూ లాభాలిచ్చేవే! వెబ్సైట్ ను ప్రారంభించిన టెలికాం సంస్థ సైబర్ నేరస్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఆ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అని పిలిచే ఈ పోర్టల్‌లో లాగిన్ అయితే మన ఆధార్ కార్డ్ మీద ఏ ఫోన్ నెంబర్ ను యాడ్ చేశాం. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు. ప్రశంసల వర్షం TAF-COP వెబ్ పోర్టల్ వినియోగంపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ @TRAI/ DOT ద్వారా చాలా ఉపయోగకరమైంది. ఈ సైట్ లో మీ ఫోనెంబర్ను ఎంట్రీ చేస్తే.. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే సిమ్ కార్డ్ వివరాలు వెలుగులోకి వస్తాయి. ఉపయోగంలో లేని సిమ్ కార్డ్ లను బ్లాక్ చేయవచ్చు. సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈ వెబ్ సైట్ ఐడియా బాగుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Very useful service launched by @TRAI / DOT ! Open the below site and type in your mobile number and you will know the mobile numbers of all the SIM cards purchased with your Aadhaar number as soon as you enter the OTP. You can ban any of them. https://t.co/EdomPmQlXf — Vijay Shekhar Sharma (@vijayshekhar) August 26, 2021 -
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
ఫేస్బుక్ వాడితే ఫోన్ నంబర్ అమ్ముకున్నట్లే!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్లైన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాద సుడిగుండంలో ఇరుక్కుంటోంది. ఫేస్బుక్ వాడకందారుల ఫోన్ నంబర్లు టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెడుతున్నారని ఒక సెక్యూరిటీ అధ్యయనం వెల్లడించింది. ఫేస్బుక్ ఐడీలకు చెందిన ఫోన్ నంబర్లను టెలిగ్రామ్ ఆటోమేటెడ్ బోట్‌ను వినియోగించి ఒక సైబర్ క్రిమినల్ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని అధ్యయనం తెలిపింది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది వినియోగదారుల నంబర్లు ఇలా బయటపడి ఉంటాయని పేర్కొంది. ఈ డేటాబేస్‌లో 2019 వరకు వివరాలున్నాయని తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ రిసెర్చర్ అలాన్ గాల్ ఒక ట్వీట్లో వివరాలు వెల్లడించారు. చదవండి: (బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ) 2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్ గురించి తొలిసారి తెలిసిందని, వివరంగా పరిశీలిస్తే వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం తస్కరణకు గురైనట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. ఈ బోట్ 2021 జనవరి వరకు యాక్టివ్గానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇదే అంశాన్ని మదర్బోర్డ్ నివేదిక ధృవీకరిస్తూ, టెలిగ్రామ్ బోట్ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిపింది. ఒక్క యూజర్ వివరం కావాలంటే 20 డాలర్లు, పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఇప్పటికైనా ఫేస్బుక్ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని సూచించింది. అప్పుడే యూజర్లు హ్యాకింగ్ తదితర ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తెలిపింది. చదవండి: (వైట్‌హౌస్‌లో పెంపుడు జంతువుల సందడి!!) -
ఫోన్ నెంబర్ మీదే.. కానీ ఆపరేటింగ్ వాళ్ళది..
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ‘స్ఫూఫింగ్’(నకిలీల సృష్టి) టెక్నాలజీ ఇప్పుడు మోసగాళ్ల వద్దకూ చేరింది. కేవలం కాల్ స్ఫూఫింగ్ మాత్రమే కాకుండా మెయిల్ స్ఫూఫింగ్కూ పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. నిరుద్యోగుల్ని బురిడీ కొట్టించి అందినకాడికి దండుకుంటున్నారు. ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్ చేసే వారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్ కాల్స్ అన్నీ మీ నెంబర్ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఈ) నెంబర్ తెలిసి ఉండటం తప్పనిసరి. దీన్ని తెలుసుకోవడంఅందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్ చోటు చేసుకున్నాయి. ఈ విధానాన్ని తలదన్నేదిగా ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చిందే స్ఫూఫింగ్. గతంలో కేవలం ఫోన్ కాల్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ విధానం ఇప్పుడు ఈ–మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌నూ స్ఫూఫ్ చేయగలుగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు ఇతడికి సెల్ఫోన్లో ఎవరి నెంబర్ డిస్ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదే రకంగా ఈ–మెయిల్ ఐడీ స్ఫూఫింగ్ వెబ్సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ–మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా వినియోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ముందు ప్రకటనలు జారీ చేయడం ద్వారా నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి నుంచి బయోడేటా తదితరాలు సేకరించిన తరవాత ఫోన్ ఇంటర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్ నెంబర్‌కు స్ఫూఫింగ్ చేయడం ద్వారా వారే కాల్ చేసినట్లు సృష్టిస్తున్నారు. ఉద్యోగార్థి అనుమానం వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీకి చెందిన మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్ చేస్తున్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుంచి వచ్చినట్లే ఉంటుంది. దీంతో సదరు నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్ వివరాలతో ఓపెన్ చేసినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే మోసగాళ్లు వీరికి ముందే తామకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తారు. దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది. కనిపెట్టడం కష్టమే సంక్షిప్త సందేశాలను సైతం స్ఫూఫ్ చేయవచ్చు. ఈ తరహా స్ఫూఫ్డ్ కాల్స్, ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌ల మూలాలను కనిపెట్టడం కష్టమే. ఇలాంటి వాటిని వినియోగించి బెదిరింపులకు పాల్పడటం, వేధింపులకు దిగడం కూడా జరుగుతోంది. ఈ కాల్స్, మెయిల్స్ అందించే వెబ్‌సైట్స్ అన్నీ వివిధ మారుమూల దేశాల్లోని సర్వర్ల నుంచి హోస్ట్ అయి ఉంటాయి. ఆ సర్వర్ల నిర్వాహకులు, వెబ్‌సైట్స్ హోస్ట్ చేసిన వారి వివరాలు కోరుతూ ఆయా దేశాల్లో సంబంధిత విభాగాలకు లేఖలు రాయడం, వారి నుంచి జవాబు పొందడం ఓ పెద్ద ప్రహసనం. ఈ తంతు పూర్తి చేసినప్పటికీ వారు స్పందించి వివరాలు అందించడం దుర్లభం.– సైబర్ క్రైమ్ పోలీసులు -
హలో గురూ ఓటు కోసమే..!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు, అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. నేటి స్మార్ట్‌యుగంలో ప్రచారం కూడా స్మార్ట్‌గానే చేస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, వాయిస్ కాల్స్‌తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకటి, రెండు పార్టీలు మినహా ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయినా, టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నవారు అభ్యర్థుల పేర్లతో బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అంటూ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లోని ఓటర్లకు సందేశాలు పంపారు. 2014 ఎన్నికల్లోనే చాలామంది అభ్యర్థులు ఈ విధానంలో కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే, అభ్యర్థులు, ఆశావహుల చేతికి తమ ఫోన్ నంబర్లు ఎలా వెళుతున్నాయన్నది పౌరులకు అంతుచిక్కడంలేదు. వారికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా లేకున్నా టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ వెళుతుండటం గమనార్హం. ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీలు, కేబుల్ ఆపరేటర్లు, బ్యాంకులు, షాపింగ్‌మాల్స్, టౌన్షిప్, అపార్ట్మెంట్ ఆఫీసులు, ఓటరులిస్టుల ద్వారా ఫోన్ నంబర్లను కొందరు అక్రమంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీలు రేటు కట్టి ఫోన్ నంబర్ల జాబితాలను విక్రయిస్తున్నారు. అభ్యర్థులు వీటిని వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు అందజేసి ఆ నంబర్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, పోటీచేసే వ్యక్తి ఇంటింటికీ తిరిగినా ఓటర్లందరినీ కలిసే అవకాశాల్లేవు. అందుకే ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. బల్క్ మెసేజ్ ప్యాకేజీలు రోజుకు రూ.వెయ్యి నుంచి ఆపై వరకు ఉన్నాయి. ఇంటర్నెట్ సాయంతో రోజుకు వేలాది సందేశాలు పంపే వెసులు బాటు కూడా ఉంది. అయితే ఫోన్ కాల్కి మాత్రం రూపాయి నుంచి రూ.5 వరకు చార్జీ చేస్తున్నారు. ఆ లెక్కన రోజుకు 30 నుంచి 40 వేల ఫోన్లకు వాయిస్‌కాల్స్ పంపే వెసులుబాటు ఉంది. వీటి ప్యాకేజీలు రూ.50 వేల నుంచి ఉన్నాయి. ఈ లెక్కన 119 నియోజవర్గాల్లో అభ్యర్థులు, రెబెల్స్ అంతా కలుపుకుంటే ఈ లిస్టు చాంతాడంత అవుతుంది. అంతా ఇదే విధానాన్ని అనుసరిస్తే ఆ వ్యయం రూ.కోట్లల్లో ఉంటుంది. నామినేషన్ వేసే దాకా.. తాము పోటీలో ఉన్నామని వారి పార్టీల అధిష్టానాలకు, తమ ప్రత్యర్థులకు చాటుకోవాలన్న తాపత్రయంలో, గెలుపుపై ధీమాను చాటేందుకు ఆశావహులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏదో ఒక పార్టీపై బీ–ఫారం సంపాదించి నామినేషన్ వేసే వరకు అది అతని వ్యక్తిగత ప్రచారమే అవుతుంది. అయితే, ఈ ప్రచారానికి వీరు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపెడతారా? లేదా.. అన్నది సందేహమే. అనుమతి లేకుండా ఫోన్ చేయడం, మెసేజ్‌లు పంపడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పోలీసులు, న్యాయనిపుణులు అంటున్నారు. దీనిపై వినియోగదారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జనాభాలో 40 శాతం యువత ఉంది. సోషల్‌మీడియాలో ఒక్కొక్కరికి రెండు, మూడు ఖాతాలున్నాయి. అందుకే, వారిని చేరుకునేందుకు పార్టీలు, నేతలు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. -
ఆ మొత్తం హిస్టరీ ఇస్తేనే వీసా!
వాషింగ్టన్: వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీసాపై అంక్షలు విధిస్తూ వస్తున్న ట్రంప్ సర్కార్ మరోసారి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చేలా మరికొన్ని నిబంధనలను చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా అభ్యర్థులు గతంలో వాడిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ మొత్తం వివరాలను కోరుతోంది. అంతేకాదు గత అయిదు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఖాతాల హిస్టరీ కూడా కావాలని కోరుతోంది. ఈ నిబంధనలకు సంబంధించిన డాక్యుమెంట్‌ని శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేసింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరింది. ఇందుకు 60 రోజుల సమయం కేటాయించింది. వీసా జారీ పక్రియలో కొత్త నిబంధనలను చేర్చడం ప్రజల నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంది. ఈ నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఐదు సంవత్సారాల నుంచి వాడిన ఫోన్ నంబర్లు, ఈ మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు కల్గించే వారు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇంతకు ముందు ఏయో దేశాలకు ప్రయాణించారు, ప్రయాణిస్తే ఆ దేశం మీపై నిషేధం విధించటం కానీ, బహిష్కరించం గానీ జరిగిందా, దరఖాస్తులో పేర్కొన్న మీ కుటుంబ సభ్యుల ఏవరికైనా ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ప్రశ్నలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. నూతన విధానం అమల్లోకి వస్తే 7లక్షల పదివేలమంది ఇమిగ్రేంట్స్పై, కోటి 40 లక్షల నాన్ ఇమిగ్రెంట్స్పై ఇది ప్రభావం చూపే ఆవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పోలీసుల అదుపులో కీచక ప్రొఫెసర్
కోలకతా: కోల్‌కతాలోని ప్రముఖ సత్యజిత్‌రే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్న కీచక ప్రొఫెసర్ నీరజ్ సహాయ్ ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రకరకాల ఫోన్ నెంబర్లు వాడుతూ పోలీసులకు చుక్కలు చూపించిన అతగాడిని మంగళవారం సాయంత్రం మహారాష్ట్రలోని థానే లో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన నీరజ్ సహాయ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని గతనెలలో ఫిర్యాదు చేసింది. రీసెర్చ్ పేరుతో ఇంటికి పిలిచి లైంగికంగా వేధింపులకు పాల్పడే వాడని తెలిపింది. తనను రెగ్యులర్ గా తమ ఇంటి టెర్రస్ మీదకు తీసుకు వెళ్ళి మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించేవాడని, కోరిక తీర్చమని బలవంత పెట్టేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో2014 మేలో బలవంతంగా ఆమెను లొంగదీసుకున్న అతగాడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడని తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం డిసెంబరు 24న అతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ప్రొఫెసర్ అజ్ఞాతంలో ఉన్నాడు. చివరికి థానేలో మంగళవారం అరెస్టుచేసిన బుధవారం రాత్రి కోల్‌కతాకు తీసుకొచ్చారు. అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత సదరు ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ ఇనిస్టిట్యూట్‌లోని మరికొందరు విద్యార్థినులు వెలుగులోకి వచ్చారు. కాగా ప్రొఫెసర్ వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగానే నిందితుడిని పట్టుకున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
ఫోన్ నంబర్లు మార్చుకోండి
- అనుచరులు, నేతలకు సూచించిన లోకేష్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం పార్టీనేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణంలో ఏమౌతుందోనన్న ఆందోళనలో ఉన్న నేతలు ఇప్పటి వరకూ తాము ఉపయోగిస్తున్న ఫోన్లలో ఇతరులతో సంప్రదింపులు జరిపేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. అన్ని స్థాయిల నేతలకు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఫోన్ నంబర్లు మార్చి తాత్కాలికంగా ఉపశమనం పొందాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ కూడా ఈ మేరకు పార్టీ నేతలకు ఇదే రకమైన సూచన చేశారు. పార్టీలోని అన్ని స్థాయిల నేతల సాధ్య మైనంత వరకూ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను మార్చాల్సిందిగా ఆయన మౌఖికంగా సూచించారు. కొద్ది రోజుల పాటు కొత్త ఫోన్ నంబర్లు ఉపయోగించటం ద్వారా మనపై నిఘా పెట్టిన వారి దృష్టి మరల్చవచ్చని ఆయన చెప్పినట్లు సమాచారం. లోకేష్ ప్రస్తుతం ఏపీలోని పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్న నేపథ్యంలో లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ముఖ్య నేతలు కీలకపాత్ర పోషించారని తెలంగాణ ఏసీబీ నిర్ధారించటంతో పాటు కొన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. పార్టీ ముఖ్య నేతలు ఉపయోగించే ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం సేకరించిన ఏసీబీ వారు ఎవరెవరితో ఏం మాట్లాడారో కూడా కోర్టుకు సమర్పించారు. తనకు ప్రధాన అనుచరులుగా, సహాయకులుగా ఉన్న వారి ఫోన్ నంబర్లను కూడా లోకేష్ ఇప్పటికే మార్పించారు. తాను నిత్యం ఉపయోగించే తన సహధ్యాయి ఒకరి ఫోన్ నంబర్‌ను లోకేష్ ఇప్పటికే మార్పించినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ లోకేష్ ఫ్రధాన అనుచరులుగా ఉన్న ప్రదీప్ చౌదరి తదితరులను పిలిపించి విచారించింది. ఇక ముందు కూడా పలువురిని పిలిపించి విచారించే అవకాశం ఉండటంతో పాటు వారి కదలికలపై నిఘా పెట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉపయోగించే ఫోన్ నంబర్లలో ఎవ్వరికీ అందుబాటులో ఉండవద్దని వీరికి ఎన్టీఆర్ భవన్ ద్వారా లోకేష్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో పాత్ర ఉన్న వారిని గుర్తిస్తున్న ఏసీబీ విచారణకు విడతల వారీగా పిలుస్తున్న నేపథ్యంలో తన కదలికలపై కూడా దర్యాప్తు సంస్థ నిఘా ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఎక్కువ సమయం విజయవాడలోనే మకాం వేస్తానని లోకేష్ పార్టీ నేతలకు చెప్పారు. వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు విజయవాడలో , రెండు నుంచి మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజల క్రితం వరకూ తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన కొండల్ రెడ్డి స్థానంలో పవన్ అనే వ్యక్తిని లోకేష్ డ్రైవర్‌గా నియమించుకున్నట్లు సమాచారం. కొండల్‌రెడ్డిని ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. విచారణకు గైర్హాజరైనప్పటి నుంచి కొండల్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌లోని ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం కల్పించినట్లు ఎన్టీఆర్ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం
ఒంగోలు టౌన్: జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన జన్మభూమి - మాఊరు సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు సూక్ష్మ ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1030 పంచాయతీలు, 225 మునిసిపల్ వార్డుల్లో 1255 గ్రామసభలు నిర్వహించామన్నారు. మొత్తం 2 లక్షల 80 వేల అర్జీలు వచ్చాయన్నారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి లక్షా 2 వేల 38 అర్జీలు, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు 42,650 అర్జీలు, హౌసింగ్ 38,469 అర్జీలు, ఉపాధి హామీ పథకానికి 11,754 అర్జీలు, మునిసిపాలిటీలకు 5 వేల అర్జీలు వచ్చాయన్నారు. ఈ అర్జీల్లో వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ పరంగా ఎన్ని ఉన్నాయో గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా కొత్త వనరులు సమీకరించే దానిపై కూడా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అర్జీదారులందరి నుంచి ఆధార్ నంబర్ తీసుకోవడంతోపాటు వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. అర్జీల పురోగతిపై సంబంధిత సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్లు పంపించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్‌లో బోగస్‌ను నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో 2 లక్షల 56 వేల మందికి 41.75 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పథకం కింద పంపిణీ చేసినట్లు వివరించారు. లక్షా 16 వేల 817 మందికి వృద్ధాప్య పింఛన్లు, 83 వేల 25 మందికి వితంతు పింఛన్లు, 6,107 మందికి చేనేత పింఛన్లు, 18,101 మందికి అభయహస్తం పింఛన్లు, 31,673 మందికి వికలాంగ పింఛన్లు అందించినట్లు వివరించారు. 79 వేలు తొలగింపు.. 27 వేలు పునరుద్ధరణ: పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆ తరువాత వాటిని విచారించి 27 వేల పింఛన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన పింఛన్లు విచారణలో ఉన్నట్లు తెలిపారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి అందించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి కమిటీ వాటిని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపిస్తోందన్నారు. వాటన్నింటినీ విచారించిన తరువాత అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని విజయకుమార్ వివరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిలో ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చినవి అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఆధార్ అనుసంధానంలో ముందంజ: ఆధార్ అనుసంధానం విషయంలో జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉందని కలెక్టర్ వెల్లడించారు. రేషన్‌కార్డులు, స్కాలర్షిప్లు, విద్యార్థుల నమోదుకు సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో గతంలో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 82.15 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా చేరిందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. చీరాల మండలంలో 80 శాతం టాలీ కాని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్తగా వివరాలు తీసుకుంటూ పాత వాటిని పరిశీలిస్తూ అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ఇరువర్గాల వారిని పిలిచి చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నట్లు చెప్పారు. ప్లేట్లెట్ మిషన్‌ను అడుగుతూనే ఉన్నాం: ఒంగోలు రిమ్స్‌లో ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు విషయమై ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామని కలెక్టర్ తెలిపారు. రిమ్స్ డెరైక్టర్‌కు చెప్పి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించానన్నారు. తాను కూడా ఈ విషయాన్ని స్వయంగా సంబంధిత మేనేజింగ్ డెరైక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దృష్టికి కూడా ప్లేట్లెట్ మిషన్ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. జెడ్పీ చైర్మన్‌కు సంబంధించి అఫీషియల్ ఆర్డర్ చూస్తే చెబుతాను: జిల్లా పరిషత్ చైర్మన్‌కు సంబంధించి తాజాగా వచ్చిన అఫీషియల్ ఆర్డర్ చూస్తే దాని గురించి చెబుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈదర హరిబాబు తిరిగి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన పైవిధంగా స్పందించారు. కోర్టు ఏ డెరైక్షన్ ఇస్తే దానిని అమలు చేయాల్సి ఉందన్నారు. ఈదర హరిబాబు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎంఎస్లో ‘కరెంట్’ మెసేజ్
వినియోగదారులకు విద్యుత్ కోతల వివరాలు ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్న ట్రాన్స్‌కో నక్కపల్లి: విద్యుత్ కోతలు ఎప్పుడు అమలుచేస్తున్నారు, కరెంటు ఎప్పుడు పోతుంది.. ఎప్పుడు వస్తుంది..అనే వివరాలు నేరుగా వినియోగదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయడానికి ఏపీ ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈ విధానాన్ని ఇక నుంచి గ్రామీణప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు కూడా తెలియజేయడానికి నిర్ణయించింది. ఈ చర్యల్లో భాగంగా విద్యుత్ వినియోగదారుల నుంచి ఆధార్‌కార్డుల నంబర్లు, జెరాక్స్‌కాపీలు, ఫోన్ నంబర్లను సేకరిస్తోంది. మీటర్ రీడింగ్‌లు తీసే కాంట్రాక్టర్లు, ట్రాన్స్‌కో సిబ్బంది గురువారం నుంచి పలు గ్రామాల్లో వినియోగదారుల నుంచి ఈ వివరాలు సేకరిస్తున్నారు. ఉపమాక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు, వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటుపోతే సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్‌లో సంప్రదిస్తే ఈఎల్ఆర్అనో, బ్రేక్‌డౌన్ అనో ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం చెబుతున్నారు. గంటల తరబడి కరెంటు రాకపోతే ఎవరిని అడగాలో తెలియక వినియోగదారులు అవస్థలు పడేవారు. దీనికి తోడు గ్రామాల్లో ఉండే ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు ఈ విద్యుత్ కోతలను సాకుగా తీసుకుని ఇష్టానుసారం సరఫరా నిలిపివేసి తమ పనులు చక్కబెట్టుకునేవారు. ఇక నుంచి ఇటువంటి ఆటలకు చెక్ చెప్పనున్నారు. వినియోగదారుడి ఫోన్ నంబరుకు విద్యుత్‌కోతలు ఏ సమయంలో అమలు చేస్తున్నారు, ఏ కారణం చేత కరంటు సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందనే వివరాలను ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయడానికి ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టడంతో సిబ్బంది వినియోగదారుల ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అప్రకటిత విద్యుత్ కోతల సమాచారంతోపాటు, బిల్లు చెల్లింపుల వివరాలు, బిల్లు మొత్తం, ఎప్పటిలోగా బిల్లు చెల్లించాలనేవివరాలను కూడా తెలియజేసేందుకు వినియోగదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కూడా ఈ వివరాలు సేకరిస్తున్నట్టు ఏఈ సుధాకర్ తెలిపారు. -
వలస ఓటర్ల కోసం వల
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: హలో బావా... ఎలాగున్నావ్రా.. సెల్లీ,పిల్లలు బాగున్నారట్రా... ఏటీ లేదు కానీ... మన వార్డు ఎలచ్చన్లు ఈ నెల 30న జరుగుతున్నాయి బావా... ఈ సారి నేనే పోటీ చేస్తున్నాను... నువ్వు.. సెల్లి వచ్చి ఓటేసి వెల్లండి బావా..! హలో ... హలో... అన్నయ్య... బాగున్నావా... ఏంటి సంగతులు... పెద్దోడి పెళ్లి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి... మీకేటి అన్నయ్య మంచి కోడలనే పట్టేశారు... ఏం లేదుకానీ... ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మన వార్డులో నేను పోటీ చేస్తున్నా... నువ్వు, ఒదినా, పెళ్లి కొడుకు ఓటేయటానికి రావాలి... ఇదీ ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆత్రం. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తుండడంతో అభ్యర్థులు కూడా అందుకు తగినట్టుగా వలస ఓటర్లపై ప్రలోభాల వల విసురుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారికి ఫోన్ చేసి... ఊరొచ్చి ఓటేయమని వేడుకుంటున్నారు. వలస ఓటర్ల కరుణ కోసం అన్ని వైపులా ప్రయత్నాలు ప్రారంభించారు. మహిళలకు కానుకలు, మగవారికి మనీ, మందూ సమర్పించుకుంటూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. త్రిముఖ పోటీ అనివార్యమవడంతో ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్క ఓటును కూడా వదులుకోవడానికి సాహసించడంలేదు. తమకు వారి ముఖాలు తెలియకపోయినా అక్కా, బావా అంటూ వరసలు కలుపుతూ ఫోన్లు చేస్తున్నారు. లేని ప్రేమలను ఒలకబోస్తున్నారు. దారిఖర్చులు తామే భరిస్తామని, వచ్చి వెళ్లిన సమయంలో నష్టపోయిన కూలీ డబ్బులకు అదనంగా మరింత సొమ్ము ఇస్తామని, ఇక్కడ ఏ లోటూ లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తూ తమకు ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న.... దూరప్రాంతాకు వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా తమ అభ్యర్థనను విన్నవించుకుంటున్నారు. విజయనగరం మున్సిపాలిటీ లో 40 వార్డుల్లో లక్షా 76 వేల 931 మంది ఓటర్లు ఉండగా... ఆయా వార్డుల నుంచి 159 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 41 వేల మంది ఓటర్లు ఉండగా ఆయా వార్డుల నుంచి 117 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 32,500 ఓటర్లు ఉండగా 95 మంది అభ్యర్థులు, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 33,796 ఓటర్లుండగా... 153 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. అయితే నాలుగు మున్సిపాల్టీల పరిధిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉపాధి, ఉద్యోగావకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికలు రావటంతో బరిలో ఉన్న అభ్యర్థులు వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించి ఫోన్ చేయడంతో పాటు, నేరుగా అక్కడికి వెళ్లి మరీ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.