సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కంటే తక్కువ ధరకు ఎక్కువ సదుపాయాలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో పోలీసు విభాగం ఫోన్లు ఎయిర్‌టెల్‌కు మారనున్నాయని కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిందని, ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల వీటితో పాటు నెట్‌వర్క్ పరమైన ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (వీఏఎస్) అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఎయిర్‌టెల్ సంస్థతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా నగర పోలీసు విభాగం ప్రస్తుతం ఉన్న ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త నెంబర్లను ఆగస్టు 1 నుంచి విడతల వారీగా అమలులోకి తీసుకురానుందని పేర్కొన్నారు. 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో కొత్త నెంబర్లు ఉండనున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యేలా నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment