కోలకతా: కోల్‌కతాలోని ప్రముఖ సత్యజిత్‌రే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్న కీచక ప్రొఫెసర్ నీరజ్ సహాయ్ ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రకరకాల ఫోన్ నెంబర్లు వాడుతూ పోలీసులకు చుక్కలు చూపించిన అతగాడిని మంగళవారం సాయంత్రం మహారాష్ట్రలోని థానే లో అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే... కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన నీరజ్ సహాయ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని గతనెలలో ఫిర్యాదు చేసింది. రీసెర్చ్ పేరుతో ఇంటికి పిలిచి లైంగికంగా వేధింపులకు పాల్పడే వాడని తెలిపింది. తనను రెగ్యులర్ గా తమ ఇంటి టెర్రస్ మీదకు తీసుకు వెళ్ళి మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించేవాడని, కోరిక తీర్చమని బలవంత పెట్టేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో2014 మేలో బలవంతంగా ఆమెను లొంగదీసుకున్న అతగాడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడని తెలిపింది.
దీనిపై విచారణ చేపట్టిన అనంతరం డిసెంబరు 24న అతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ప్రొఫెసర్ అజ్ఞాతంలో ఉన్నాడు. చివరికి థానేలో మంగళవారం అరెస్టుచేసిన బుధవారం రాత్రి కోల్‌కతాకు తీసుకొచ్చారు. అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత సదరు ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ ఇనిస్టిట్యూట్‌లోని మరికొందరు విద్యార్థినులు వెలుగులోకి వచ్చారు.
కాగా ప్రొఫెసర్ వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగానే నిందితుడిని పట్టుకున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
పోలీసుల అదుపులో కీచక ప్రొఫెసర్
Published Thu, Jan 21 2016 4:46 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement